Last updated: Jan 27th 2016
Shree Uday Bhaskar Duvvuri
7/26/2015
ప్రియమైన సాధకులారా,
ఈ రోజు ఆషాఢశుధ్ధ ఏకాదశి. వచ్చేది గురు పూర్ణిమ. అందుకని ఈరోజు నుంచి పూర్ణిమ వరకూ సుధ్ధ సాత్విక ఆహారాన్ని మితంగా ఒక పూటే తీసుకోండి. రాతి్రపూట పళ్ళు , టొమేటో, కీరా లాంటివి తినండి. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మంచి జపం చేయండి. రేపటినుంచి పౌర్ణమి వరకూ జపాన్ని ఎలాపెంచుకొంటూ వెళ్ళలో చెబుతాను. ఈరోజు నుంచి బహుళ పంచమి వరకూ మీకు రోజూ మెసేజ్ పంపుతూంటాను.
– ఉదయభాస్కర్
7/27/2015
ప్రియమైన సాధకులారా, ఈ రోజు ఆషాఢశుధ్ధ ఏకాదశి. వచ్చేది గురు పూర్ణిమ. అందుకని ఈరోజు నుంచి పూర్ణిమ వరకూ సుధ్ధ సాత్విక ఆహారాన్ని మితంగా ఒక పూటే తీసుకోండి. రాతి్రపూట పళ్ళు , టొమేటో, కీరా లాంటివి తినండి. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు మంచి జపం చేయండి. రేపటినుంచి పౌర్ణమి వరకూ జపాన్ని ఎలాపెంచుకొంటూ వెళ్ళలో చెబుతాను. ఈరోజు నుంచి బహుళ పంచమి వరకూ మీకు రోజూ మెసేజ్ పంపుతూంటాను.
– ఉదయభాస్కర్
7/27/2015
ప్రియమైన సాధకులారా, మనం ఈ తొలి ఏకాదశి నాడు చేసిన జపం ఎలాజరిగిందో అందరూ ఒక్కొక్క లైను లో చెప్పండి…….ఈ జపం గురుపౌర్ణమి కి తపోవిజయానికి మన గురువుకి మనం ఇచ్చే గురు దక్షిణ గా వెలుగొందాలి. ఈరోజంతా గురుస్తానం మీదే దృష్టి పెట్టండి. ఈ రోజు ఆహారంలో పులుపు ను పూర్తిగా మానేయండి. మిగిలిన రుచులుకూడా ఉండిఉండనట్లు ఉండాలి. మితాహారం తీసుకోండి. సాయంత్రం 2గంటలు తెల్లవారగట్ల 2గంటలు; రాతి్ర పడుకొనేముందు ఒక గంట జపం చేయండి. రాతి్ర రెండు గుప్పిళ్ళు మొలకలెత్తిన గింజలతో కొన్నిపళ్ళు మాత్రం తినండి. పాలు తాగండి. జపంలో హటం చేయొద్దు. ఆనందంతోనూ, ఆహ్లాదంతోనూ జపం పే్రమతోను చేయండి. జపం మీద స్వామిగారి మీద అచంచలమైన విశ్వాసం తో ముందుకి నడవండి. ఇన్ని సంవత్సరాల జపం ఒక ఎత్తు, ఈ పౌర్ణమికి చేసే జపం ఒక ఎత్తు. మీ అందరి జపం పౌర్ణమి నాటి కి సునాయాసంగా 8గంటలకు చేరాలని స్వామి గారిని పా్రర్ధిస్తున్నాను.
– ఉదయభాస్కర్
7/28/2015
ప్రియమైన సాధకులారా, ఏకాదశి, ద్వాదశి అయ్యాయి. త్రయాదశిలోకి ప్రవేశించేము. ఈరోజు మరొక్క గంట జపం పెంచ గలమా? ఎలా ఉంది మానసిక శారీరిక పరిస్తితి? మన ఆశ్రమంలో శీ్ర దేవేంద్రప్ప గారున్నారు కదా! ఆయన మూడురోజులు జపంలో ఉండిపోయారు ఒకసారి- మీకందరకూ తెలుసా! దాని గురించి ఆయన్ని అడిగేను- ఇదెలా సాధ్యమవుతుంది? అని. ఆయనేమంటారంటే- నేను ఇలా రెండు కాని అంతకన్న ఎక్కువ రోజులు జపం లో కూర్చోవాలనుకొన్నప్పుడు ముందుగా రెండు రోజులు ఈశరీరానికి పూర్తిగా ఆహారం పెట్టడం మానేస్తాను. ఆ తర్వాత ఒకరోజు సుధ్ధసాత్వికాహారం(ఏ రుచులు లేకుండా ఏకభుక్తం) చాలా మితం గా తీసుకొని జపానికి రెడీ అవుతాను. ఇంక, ఏరకమయిన కమ్యూనికేషన్ లేకుండా ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతాను. ప్రశాంత నిర్జన ప్రదేశంలో కూర్చుంటే జపం నిరాటంకంగా జరిగి పోతుంది – అని చెప్పేరు. ఆసారి అలా మూడు రోజులు తపస్సు లో కూర్చొని బయట కు రాగానే దూరంగా ఆంజనేయ స్వామి ఈయనకు వందన చేస్తూ నుంచొని ఉన్నారుట. చూడండి- ఈ కలియుగం లో ప్రత్యక్షంగా మారుతి దర్శనాన్ని మన తోటి సాధకుడే పొందినప్పుడు మనం జపం లో ఆయన చేతికి అందేంత దూరంలో ఉన్నాము. మీరందరూ వీలు దొరికినప్పుడు దేవేంద్రప్ప గారితో మాట్లాడి మరిన్ని సులువులు తెలుసుకోండి.తిరిగి మన జపందగ్గరకొస్తే ఈరోజు మనస్సుకి ఆహ్లాదకరంగా ఉండే సుద్ధసాత్వికాహారాన్ని తీసుకొని జపాన్ని కొంచెం స్తిరం చేయండి- పా్ణణశక్తి పే్రమ, ఆప్యాయతలు, సున్నితత్వం మరియు స్వచ్ఛతలకే ఆకర్షంపబడి ఏకికృతంగా ప్రయాణించి మనల్ని గమ్యానికి చేరుస్తుంది.ప్రయత్నమే సాధకుని పుణ్యం. శాంతియే సాధకుని దైవం. శుభం
– ఉదయభాస్కర్
7/29/2015
ప్రియమైన సాధకులారా, మనం అనుకొంటున్న రాతి్రగల పౌర్ణమి వచ్చేసింది – ఈరోజే.ఇదే గురుపూర్ణిమ. ఈ రోజు ఉదయం నుంచీ మనస్సుని గురుస్తానంమీదే ఉంచండి. నీరక్షణలో ఉన్న మాకు పా్రణుని అనుభూతిని కలిగించి ఆత్మతో అనుసంధానమయ్యేటట్లు చేసి జ్ఞానోదయాన్ని కలిగించండి-అని యోగి అచ్యుతులను మనసారా పా్రర్ధించండి.అన్ని రుచులు బాగా తగ్గించి, సాధ్యమైనంత సాత్విక ఆహారాన్ని మితంగా తినండి. మధ్యాన్నం నాలుగు గంటలు దాటిన తర్వాత ఏమీ తినొద్దు. రాతి్ర 7 గంటల సమయంలో బాగా తక్కువ చక్కెర వేసిన పాలు తాగండి. రాతి్ర పది గంటలకు జపంలో కూర్చోండి. 45 నిముషాల నుంచి గంట వరకూ దీర్ఘగతి చేయండి. దీర్ఘ గతి సాధ్యమైనంత పొడవుగా అంటే పై గతి/కి్రంద గతి 15సెకన్లు అంతకన్నా ఎక్కువ. పే్రమతో ఆప్యాయతతో, ఆనందంతో ఆహ్లాదకరంగా గతి చేయండి. నెమ్మదిగా మధ్యగతికి రండి. ఎక్కడా పె్రషర్ ఉండకూడదు. శరీరం టెన్షన్ ఫీ్రగా ఉండాలి. మధ్య గతి సమాన పొడవులతో చాలా మంచిగా సాగాలి. ఇక్కడ పుట్టిన ఉష్ణము వల్ల జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా భస్మ మయిపోతాయి.బృహదారణ్యకోపనిషత్తు లోహ్రస్వోదహతి పాపాని దీర్ఘ సంపద్ప్రదోవ్యయఃఅర్ధమాతా్ర సమాయుక్తః ప్రణవో మోక్షదాయకః!! హ్రస్వో: మధ్యగతి ఏరకమైన పె్రషరు, టెన్షను లేకుండా సమానమైన పోడవులతో బాగా ఉష్ణం వచ్చేట్లుగా చేస్తేదహతి పాపాని: పాపాలను భస్మం చేసేస్తుందిట.దీర్ఘ: దీర్ఘ గతి కనుక ఎంతో నిదానంగా పే్రమతో చేస్తే సంద్ప్రదోవ్యయః: ఆయురారోగ్య ఐశ్వర్యాలనూ చేకూర్చుతుంది.- ఆయుష్షు పెరుగుతుంది. శరీర రుగ్మతలన్నీ తగ్గి ఆరోగ్యం పెరుగుతుంది. అంతేనా? కాదు ఐశ్వర్యం దొరుకుతుంది. – అందుకనేకదా మిమ్మల్నందర్నీ దీర్ఘగతి ఎంతోపే్రమతో ఆప్యాయతతో చేయమనేది. ఇంక,అర్ధమాతా్ర సమాయుక్తః ప్రణవః: అర్ధమాతా్ర అంటే శబ్దం వచ్చీరాకుండా చేసే హిస్సింగ్ సౌండ్ తో కలిస్తే ఈమూడు గతులు ప్రణవమే కదామోక్షదాయకః: మోక్షాన్ని కలగచేస్తుంది అని ఛెబుతోంది. అందుకని ఈమధ్యగతి మంచి ఉష్ణం జనించేట్లుగా కనీసం 15 నుంచి 20 నిముషాలు చేయడి. క్రమంగా హిస్సింగ్ లోకి వచ్చి అప్పటికే ఉధు్రతంగా శక్తివంతమౌతున్న పా్రణశక్తిని మనస్సుతో కలిపి గురు స్తానాన్ని దాటి ఆత్మ ఉండే ప్రదేశానికి వెళ్ళే గమనాన్ని వీక్షించండి. హిస్సింగ్ నుంచే ధ్యానంమొదలవుతుంది. హిస్సింగ్ సాధ్యమైనంత పొడిగించండి. ఇప్పుడు అప్రమత్తేన వేద్ధవ్యం: అప్రమత్తతతో పా్రణుని గమనంమీద మనస్సు కేందీ్రకృతమవ్వాలి. ఆపాద మస్తకం మన శరీరంలో ఏమి జరుగుతోందో పరికించడమే ధ్యానం.మరి ఈ గురు పూర్ణిమ రోజు కొంచెం ఎరుకతో ధ్యానం చేసి మీ గురువుయొక్క కృప ను పొందండి. శుభం.
– ఉదయభాస్కర్
7/31/2015
Dear young friends,
నిన్నటి జపం గురించి ఈ గూ్రప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ, నిన్నటి పగలు మీ మీ మానసిక పరిస్తితి ఎలా ఉంది? నిన్నమీరు ఏమేమి తిన్నారు? ఎరెవరితో ఏమేమి మాట్లాడారు? జపం ఎంతసేపు జరిగింది? జపంలో స్తితి ఎలా ఉంది? ఫోన్చేసి మాట్లాడండి లేదా ఈ సైట్లోనే తెలుగు మాటలు ఇంగ్లీషు లో రాయండి. కానీ ప్రతి ఒక్కరూ తెలియచేయాలి. ఈరకమయిన ప్రయత్నం వల్ల మీరు తప్పక అభివృద్ధి చెందుతారు. మనం ఈ జపం ఉపదేశం తీసుకొన్నది స్వామిగారి మీద విశ్వాసంతోటి, మనని మనం ఉద్ధరించుకోవాలని కదా! మనం ఒకరికొకరు సాయం చేసుకొని అందరం కలిసి ముందుకు పోయి స్వామిగారి కృపను పొందుదాం. నా మాట విని కొంచెం నాతో చర్చించండి – మీ మితు్రడు మరియు మీ శే్రయోభిలాషి
– ఉదయభాస్కర్
From: +91 98480 94288: Sir ninna 1.30 hrs chesanu…Chala sunayasam gadichindhi.. Takkuna vulikki padilechanu…malli morning 1h chesanu… Sir…malli epudu kurchuntunnanu sir
From: +91 98480 94288: Sir ninna pagalu edly..thinnanu… Madyannam… Rice with tomato carry….7 ki fruit s thinnanu 10 ki Japam chesanu…..sir
From: Uday Bhaskar Duvvuri
ప్రిరయమైన రామకృష్ణా,
నాకు చాలాఆనందంగా ఉంది. నీ జపం తప్పక తొందరలోనే అభివృద్ధి చెందుతుంది. మీరందరూ జపం లో చాలా పరిశ్రమ చేసేరు. కొన్ని కొన్ని అనుభవాలు, ఙపంలో శాంతిని ఆనందాన్ని అనుభవించేరు. అప్పటి అనుభవం తిరిగి మళ్ళీ రాలేదని, కొత్త అనుభూతులు ఏమీలేకుండా జపం నడుస్తోందో లేదో, లేక ముందుకి వెళ్ళటల్లేదా అనే అనుమానాలు వస్తున్నాయికదూ! దీనికి నిన్ను సంతృప్తి పరచడానికి చెప్పడంకాదు. పదినిముషాలు నువు చేసిన పా్రణాయామము ఎఫెక్ట్ నీమీద ఉండదా? నీశరీరం ఆక్సిజనేట్ అవదా? అరే! మూడు నెలలు గట్టిగా ఒక ప ద్ధతిలో వ్యాయామం చేస్తే సిక్స్ పేక్ వస్తూంది కదా అలాంటప్పుడు నువు చేసే పా్రణాయామం నీ శరీరానికికాని మనస్సుకి కాని వీసమెత్తయినా మేలు చేసి ఉండదంటావా? చెప్పు. దీనిలో విచిత్రమేమంటే మనకి జపం నుంచి వచ్చిన శక్తిని తెలుసుకొనేందుకు, దానిని కొలిచేందుకు పద్ధతులు చెప్పేవాళ్ళు లేక పోవడం వల్ల మనం కొంచెం నిరుత్సాహంలో ఉన్నాము. ఇప్పుడు రామలింగప్ప గారు దేవేంద్రప్ప గారు, మంజునాధ్లాంటి సాధకులు తపస్వులు ప్రతి నిముషం జూనియర్స్ కి దారిచూపించాలి. మనం ఇటుపైన వాళ్ళనికూడాకలుపుకొని ముందుకు పోదాం. అందువల్ల నా ఉద్దేశ్యం ప్రకారం ను వు సరయినదారి లో జపం చేస్తున్నావు. ఈసారి తప్పక నీ శక్తిని నీకు తెలియచేయడానికి స్వామిగారిని పా్రర్ధి్తున్నాను శుభం
From: +91 98480 94288: Chala santhosam… Sir…mi asirvadhamtho thappaka Japam lo mundhuku velthanu….
From: Sunil Bonagiri: నేను గురు పౌర్ణమి రోజు సాధన చేయలేకపోయ్యను. ఆ రోజు నేను సరిగా ప్లాన్ చేసి కొలేక వేరే పనులతో అలసి పోయి సాధన చెయ్యలేదు. గురువు గారు నన్ను క్షమించాలని కోరుకోంటున్నాను- సునీల్ బోనగిరి.
From: Ravi Muppawaram: Sir ninna 45 min chesanu…Chala bhagundhi. malli morning 45 min chesanu… Sir ninna pagalu Dosa..thinnanu… Madyannam… Rice with birakaya curry….7 ki raagi java thinnanu 10 ki Japam chesanu…..sir All done with cold and fever . Still feeling fever.
From: Uday Bhaskar Duvvuri:
సునీల్ గారూ,
చాలా సంతోషం మీ నుంచి మెసేజ్ రావడం. వేరే పనులతో అలసిపోయి జపం చేయలేక పోయాను అన్నారు. మనం సంసారంలో వుండి ఒకపక్క ఉద్యోగం చేస్తూ ఈజపం చేసు కోవాలి కదా! ఇప్పుడు ఉయంనుంచి రకరకాల పనులతో సతమతమయి రాతి్ర 8 గంటల తర్వాత ఇంటికి చేరి అలసిపోయి ఉండటంతో జపం చేయలేక పోతాము. మనం జపం పేరుతో చేసేది పా్రణాయామ ప్రకి్రయ. దీనినుంచి శరీరానికి అసట తగ్గి విశా్రంతి దొరుకుతుంది. ఇలాంటప్పుడు బయటనుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని నెమ్మదిగా ఆసనంలో కూర్చొని చాలా పే్రమతో శరీరానికి ఆనందం కలిగేట్లుగా దీర్ఘగతి చేయడం మొదలుపెట్టాలి. దీర్ఘగతి తో వచ్చే వైబే్రషన్ వల్ల మన శరీరంలో బో్రంకటీస్ దగ్గర ఫీ్రగా వేళాడుతున్న వేగస్ నెర్వ్ బాగా వైబే్రట్ అవుతుంది. ఈ వేగస్ నెర్వ్ అంటే పేరాసింపతిటిక్ నెర్వస్ సిస్టం అంతని కలిపే నాడి అన్న మాట. దానితో పేరాసింపతిటిక్ నెర్వస్ సిస్టం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడయితే పేరాసింపతిటిక్ నెర్వస్ సిస్టం పనిచేయడం మొదలయ్యిందో, అప్పుడు సింపతిటిక్ నెర్వస్ సిస్టం విశా్రంతి తీసుకొంటుంది. ఇదే మన సేద తీరడం లేదా శరీరం నిద్రపోతుంది. ఇది మత్తు లేని నిద్ర అన్న మాట. అందువల్ల బాగా అలసిపోయినరోజు జపంలోకూర్చొని దీర్ఘగతి కొంచెం ఎక్కువ సేపు చేసి నిశ్శబ్ద స్తితిలో కూర్చోండి. ఆరోజు రెట్టించిన ఉత్సాహం వస్తుంది. అప్పుడు ఉదయం జపం బ్రహ్మాండంగా సాగుతుంది.
ఏమీ నిరుత్సాహ పడకండి. భార్యాపిల్లలను ఆనందంగా ఉంచుతూ మీరు జపంతో అందరకూ ఆనందాన్ని పంచండి.
రోజూ తప్పక డైరీ రాయండి…. శుభం
From: Uday Bhaskar Duvvuri:
రవి గారూ,
చాలా ఆనందం మీనుంచి మెసేజ్ రావడం. మీరు తీసుకున్న ఆహారం చాలా సరి అయినది. ఒకవైపు శరీరంలో అనారోగ్యం ఉండికూడా మీరు రెండుసార్లు 45 నిముషాలు చొప్పున జపం చేసేరు. మన శరీరంలో ఆలె్రడీ ఉష్ణం (జ్వరం)ఉంది కాబట్టి ముందుగా దానిని సర్కు్యలేషన్ లో పెట్టడానికి శాంతిగతి లోకూర్చోచ్చు. కానీ జ్వరం అంటే వైరస్ కాబట్టి దానిని తరమడానికి మధ్యగతి మంచిగాచేస్తే వైరస్ భస్మం అవుతుంది. అయినా శరీర ధారుడ్యం ఎక్కువగా లేనప్పుడు శాంతిగతే మంచిది. మంచంమీద వెల్లకిలా పడుక్కొని మధ్యగతి చేయండి జ్వరం బాగా ఎక్కుగా ఉన్నప్పుడు. తర్వాత శరీరంలో ఏరకమయిన టెన్షన్ లేకుండా విశ్రాంతి తీసుకోండి. మీకున్న శ్రద్ధకు మీకు జపం నుంచి మంచి జరుగుతుంది ఆరోగ్యం త్వరలో బాగవుతుంది, శుభం.
8/23/2015
From: Uday Bhaskar Duvvuri:
సోమవారం:ఒకసారి యోగి అచ్యుతులు విజయీందరులతో తపస్సు గురించి మనస్సు యొక్క స్థితులను వ్యాఖ్యానిస్తూ:తపస్సు ఫలించాలంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా నే ఉండాలి. మనస్సును ఎక్కడోజడంగా పడేస్తే కుదరదు. అది వికసించాలి. తపస్వులు నిరంతరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి యొక్క అణువణువులో నిండి నిబిడీకృతమై ప్రవహించే సమతా సౌందర్యాన్ని చూసి అర్ధం చేసుకోవాలి. దేనిని చూసినా మనస్సులో విసుక్కోకుండా, ఎక్కడా వెనుకకు తిరగకుండా ప్రగతిపధంలో ముందుకు సాగిపోతూండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనస్సు యొక్క ఉన్నత స్ధానం మీరు అర్ధం చేసుకోగలుగుతారు.ఈస్ధితిని అవగతం చేసుకోగలిగిన సాధకులకు మాత్రమే యోగవిద్యలో లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందిఅంతేకాని, వైరాగ్యం అనే శబ్దాన్ని దరిచేరనీయరాదు.
From: శ్రీ వేణుగోపాల్ గారు:
“yada panchana thistanthiGnanani manasa sahaBudhhista navi chestethaTamahuhu paramam gathim” This is KATHOPANISHATH mantra told to Nachiketha while teaching Atma gnana by Yamadharmaraja. This means, if you make the 5 sensors standstill, and control the mind with budhi, that is the highest state. This otherwise called “amanaska sthithy” means mind without any movement. This is fundamentals of yoga.
Jaya Achyuta.
8/24/2015
From: Uday Bhaskar Duvvuri:
మంగళవారం: శ్రీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు మన కాయకల్పం నిజంగా కల్పవృక్షమే. కాయకల్పంలో సుద్ధసాత్విక ఆహారం ఏమిటో చూద్దాం.యోగసాధకులకు బియ్యమే శే్రష్టము.మనం తినే ఆహార ధాన్యాలలో వరిబియ్యం, గోధుమలు అతి శే్రష్టమయినవి. వరి అన్నం తినే వాళ్ళకి కాయగూరలు ఎక్కువగా కావాలి. గోధుమలు తినేవారికి కాయగూరలతోబాటు పండ్లు వెన్న మొదలయినవికూడా కావాలి. అందుకే గోధుమలు బీద ప్రజల ఆహారం కాదు.గోధుమలు, పండ్లు వెన్న లేకుండా ఉపయోగిస్తే శరీరానికి విపరీతమైన వేడి చేసి మూత్రనాళాల ఇబ్బంది కలగొచ్చు.అందువల్ల యోగసాధకులకు బియ్యమే శే్రష్టము.జొన్నలు సాధారణంగా అంత ఉత్తమమైనవికావు.మొక్కజొన్నలు, ఎఱ్ఱజొన్నలు కొంతవరకూ నయం.పెసలు, ఉలవలు, కందులు, సెనగలు, అలసందలు, రాగులు మొదలయినవి మొలకెత్తించి కాయగూరలతో చేర్చి తినవచ్చు. మొలకెత్తినగింజలను అలాగేకూడా వాడొచ్చు.వర్షఋతువులో(శా్రవణ-భాద్రపద మాసాలు అంటే ఆగస్టు, సెప్టెబరు నెలలు) దుంపలు, పళ్ళు(దోస, గుమ్మడి, మామిడి, పనస), స్వాభావికగా తనంతట తాను పుట్టిన కూరలు, ఆకుకూరలు ఇంకా మొలకత్తిన గింజలుకూడా తప్పక ఉపయోగించాలి. కానీ మనకు వర్షఋతువేది? అస్సలు వర్షాలే లేవుకదా! అందుకని ఒక్క ఋతువు వెనక్కి వెడదాము. అంటే గీ్రష్మఋతువు(జ్యేష్ట ఆషాఢ మాసాలు- జూన్ జూలై నెలలు)లో తినేవి తినొచ్చు. కాయలు పండ్లు దుంపలు, మన ప్రమేయం లేకుండావాటంతటవే పుట్టిన ఆకుకూరలు(కొయ్యతోటకూర, పొన్నగంటికూర మొదయినవి) తినవచ్చు.ఏకాదశిరోజు ఒకపూట భోజనం చేయాలి. భోజనంలో నీటి శాతం అధికంగా ఉండకూడదు. అంటే చారు, మజ్జిగ లాంటివి తగ్గించాలి. ద్విదళ ధాన్యాలయిన పప్పులు ఉండకూడదు.ప్రతి ఆదివారం ఉప్పు, పులుపు, కారములను పూర్తిగా తగ్గించాలి. రాతి్ర భోజనంలో చేదు, ఉప్పు, పులుపు గల ఆహారం తినకూడదు.పళ్ళు తప్ప కృతి్రమంగా తయారు చేసిన తీపిపదార్ధములు తినడం తగ్గించాలి.తీపిపదార్ధాలు టిఫిన్ తో మాత్రమే తినాలికాని భోజనంతో జత చేయకూడదు.కట్వామ్లలవణత్యాగీ క్షీరపానరతస్సుఖీ!కారము, పులుపు, ఉప్పు వదలిపాలుతాగుచున్న సాధకుడు ఎల్లప్పుడూ సుఖవంతుడౌతాడు.గోధూమ ముద్గశాల్యన్నం యోగ వృద్ధికం విదుః!గోధుమలు, పెసలు మంచి వరి అన్నం తింటున్న యోగసాధకుడు తొందరగా యోగశిద్ధిని పొందుతాడు.అభ్యాసకాలే శస్తం క్షీరాజ్య భోజనమ్!యోగసాధన సమయంలో పాలు నేయిలతోకూడిన భోజనం ఉత్తమం. శుభం స్వస్తి
ఉదయభాస్కర్
8/24/2015
Question: Ravi Muppawaram:
Gurus, can you please provide sathvikaharam list?
Answered by Sri Venugopal Garu:
If you read kayakalpam book you need not ask anybody about the food tobe taken by the Sadhakas. Food which we take influences the mind and in turn on the japa. One who wants to do japa should invariably eat satvika aharam.
From: Uday Bhaskar Duvvuri:
Dear Sunil and Balkishore,
I have received your diary copy and happy to note. Better avoid Maggi like foodstuffs and any Upma by rice or Bombay rawwa will be good.However vet light seasoning and use salt also only to reduce watery tasteBut absolutely no salt tamarind. From Ekadasi to Poornima. Even lime also try to leave, but u have to eat sufficient to have strength in the bodyTomorrow I will give good notes for your use. Please encourage all other close Sadhakas to keep themselves active for Poornima Japa. Definite diet schedule I will give u all so that your mind and body synchronize and thought the day your mind will be pleasant.
8/25/2015
From: Uday Bhaskar Duvvuri:
బుధవారం: తపస్సు గురించి యోగి అచ్యుతులు మాట్లాడుతూ«ఆత్మ రతః ఆత్మ కీ్రడః కి్రయావాన్ హేష బ్రహ్మవిదాం వరిష్టః»కి్రయావాన్ అంటే స్ధూల సూక్ష్మాల్లో కి్రయాసంపన్నులు కావాలిట.ఉత్త తపస్సు చేస్తే చాలదు. సత్యాన్ని గ్రహించినంత మాత్రం అంతా అయిపోయినట్లేకాదు. ఆంతరంగికంగా చేతనా ప్రవాహం నిరంతరం కొనసాగాలి. తాము చేయవలసిన లోక కల్యాణం కోసం కి్రయాశీలురుగా మారాలి. దాన్ని స్ధూలంలో ప్రయోగాత్మకంగా వివరించి ఆచరణ యోగ్యంగా తీర్చి దిద్ది సమాజాన్నంతా కి్రయాశీలంగా మార్చాలి.ఆత్మ మరియు ఇంది్రయాల(మనస్సు) మధ్య నిరంతరం ప్రవహిస్తున్న ఆపా్రణ చైతన్యం నుంచే ఆత్మ యొక్క దైహిక వ్యవహారం మొదలవుతుంది. ఆత్మతో స్నేహం లభించకుండా అంతర్ముఖంగా కాని బహిర్ముఖంగా కాని జీవితం పరిపూర్ణం కాదు. మొత్తానికి తపస్సు అనేది యోగమార్గం.రేపు అంటే గురువారం « అగ్నిం ఈళే పురోహితం» అంటే యోగి అచ్యుతుల మాటలలో….. జపం పే్రమతో చేయండి. పా్రణశక్తిని ఆప్యాయతతో ఆయామంలో ఉంచండి. తప్పక స్వామిగారి పే్రమ మీకు దొరుకుతుంది.
స్వస్తి
8/26/2015
From: Uday Bhaskar Duvvuri:
గురువారం: వేదం అంటే ఏమిటి? తెలుసుకోదగినది. దేనిని వేద్యం చేసుకోవాలి? వేద్యం చేసుకొనే విధానం ఏమిటి? అది అనుభవానికి ఎలా వస్తుంది? అనేది తెలుసుకొందాం.« అగ్నిం ఈళే పురోహితం» ఋగ్వేదం ఈ మంత్రం తో మొదలవుతుంది. ఋగ్వేదం వేదాలలో తలమానికమైనది. ఋగ్వేదంలో మంతా్రలే మిగిలిన మూడు వేదాలలోనూ ఎక్కువ భాగం తిరిగి చెప్ప బడ్డాయి.అగ్నిం ఈళే పురోహితం» పురం అంటే ఏపురం?అగ్ని అంటే ఏ అగ్ని? హితం అంటే ఏమిటి? ఆహితం జరగాలంటే ఏమి చేయాలి?మన నివాసానికి స్ధలం అందించిన ఈ దేహం మొదట మన పురం. దానికి హితమైంది వేడి. దాన్ని అందించేది అగ్ని. వాడు సాహసి. అంటే పా్రణాపానాల సాహసం. ఇవి రెండూ మధించబడితే అగ్ని పుడుతుంది అని అర్ధం. కంఠం పైభాగంలోఉండే ఇంది్రయాలను దేవతలని పిలవడం వాడుక. కన్ను చెవి మొదలయిన జ్ఞానేంది్రయాల గతిని పా్రణాపానాల మధనంతోపుట్టిన అగ్ని, అంటే ప్రకాశం(కాంతి/జ్యోతి) ఏకం చేస్తుంది. ఇప్పుడు చూడండి- మీరు సాధనకి కూర్చున్నప్పుడు దృష్టి పెడతారుకదా! అప్పుడు కన్ను గతిలోకి వస్తుంది. ఆపా్రణం శబ్దంతో ఊర్ధ్వముఖంగా వెళ్ళేడప్పుడు చెవి(శ్రవణం)గతి లోకి వస్తుంది. నోరు మూసుకోవడంద్వారా నోరు గతిలోనే ఉంది. అప్పుడు అక్కడ ప్రకాశం కనిపిస్తుంది. అదే అక్కడ ఋషుల అగ్ని. వాడే ( ఆత్మ/కూటస్తుడు/పరమాత్మ/పురుషరూపి) గుర్రం. ఎందుకంటే ఆతని వెలుగులోనే పైన గుప్త లోకాలలో ప్రయాణం సాగించడం సాధ్యంఈశవాస్యోపనిషత్తులో హిరన్మయేన పాతే్రణ సత్యస్యాపి హితం ముఖమ్తత్ త్వం పూషాన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే!!ఓపూషా(మమ్ములను పోషించి రక్షించు ఓసూర్యభగవానుడా)ఓపరశే్రష్టుడా! నా చర్మ చక్షువులు తట్టుకోలేని నీయొక్క తీక్షణమైన ప్రకాశం నన్నుతిరస్కరిస్తూంటే సత్యం యొక్క ముఖాన్ని బంగారు మూకుడుతో కప్పబడి చుట్టూ నీ కిరణసముదాయంతో మిరిమిట్లుగొలుపుతూ ఉన్నావు. నన్ను కరణించు. నామీద దయచూపి ఆకిరణసముదాయాన్ని ఉపసంహరించుకొని సత్యం యొక్కనిజ స్వరూపాన్ని నాకు దర్శనమియ్యి. అని పా్రర్ధిస్తున్నాడు. రేపు తేజోబిందూపనిషత్తు లో చెప్పిన దృష్టిని జ్ఞానమయం చేయడంఎలా అనే విషయం గురించి తెలుసుకొందాం మీ జపం శా్రవణ పౌర్ణమి నాటికి నాలుగు గంటలు దాటి మంచి అనుభవాలతో అభివృద్ధి పధంలో పయనించాలని శీ్ర యోగి అచ్యుతులను పా్రర్ధిస్తున్నాను.
From: Uday Bhaskar Duvvuri:
ప్రిరయమైన సాధకులారా, ఏకాదశి, ద్వాదశి అయ్యాయి. త్రయాదశిలోకి ప్రవేశించేము. ఈరోజు మరొక్క గంట జపం పెంచ గలమా? ఎలా ఉంది మానసిక శారీరిక పరిస్తితి? మన ఆశ్రమంలో శీ్ర దేవేంద్రప్ప గారున్నారు కదా! ఆయన మూడురోజులు జపంలో ఉండిపోయారు ఒకసారి- మీకందరకూ తెలుసా! దాని గురించి ఆయన్ని అడిగేను- ఇదెలా సాధ్యమవుతుంది? అని. ఆయనేమంటారంటే- నేను ఇలా రెండు కాని అంతకన్న ఎక్కువ రోజులు జపం లో కూర్చోవాలనుకొన్నప్పుడు ముందుగా రెండు రోజులు ఈశరీరానికి పూర్తిగా ఆహారం పెట్టడం మానేస్తాను. ఆ తర్వాత ఒకరోజు సుధ్ధసాత్వికాహారం(ఏ రుచులు లేకుండా ఏకభుక్తం) చాలా మితం గా తీసుకొని జపానికి రెడీ అవుతాను. ఇంక, ఏరకమయిన కమ్యూనికేషన్ లేకుండా ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతాను. ప్రశాంత నిర్జన ప్రదేశంలో కూర్చుంటే జపం నిరాటంకంగా జరిగి పోతుంది – అని చెప్పేరు. ఆసారి అలా మూడు రోజులు తపస్సు లో కూర్చొని బయట కు రాగానే దూరంగా ఆంజనేయ స్వామి ఈయనకు వందన చేస్తూ నుంచొని ఉన్నారుట. చూడండి- ఈ కలియుగం లో ప్రత్యక్షంగా మారుతి దర్శనాన్ని మన తోటి సాధకుడే పొందినప్పుడు మనం జపం లో ఆయన చేతికి అందేంత దూరంలో ఉన్నాము. మీరందరూ వీలు దొరికినప్పుడు దేవేంద్రప్ప గారితో మాట్లాడి మరిన్ని సులువులు తెలుసుకోండి.తిరిగి మన జపందగ్గరకొస్తే ఈరోజు మనస్సుకి ఆహ్లాదకరంగా ఉండే సుద్ధసాత్వికాహారాన్ని తీసుకొని జపాన్ని కొంచెం స్తిరం చేయండి- పా్ణణశక్తి పే్రమ, ఆప్యాయతలు, సున్నితత్వం మరియు స్వచ్ఛతలకే ఆకర్షంపబడి ఏకికృతంగా ప్రయాణించి మనల్ని గమ్యానికి చేరుస్తుంది.ప్రయత్నమే సాధకుని పుణ్యం. శాంతియే సాధకుని దైవం. శుభం.
8/27/2015
From: Uday Bhaskar Duvvuri:
శుక్రవారం: నేను ఎన్నో సంవత్సరాలనుంచి రోజూ ఉదయం, సాయంత్రం దృష్టిని నాసాగ్రంమీదనే నిలిపి ధ్యానం చేస్తూ ఉన్నాను. స్వామీ! నాకు ఏ రకమైన అనభవమూ రావటల్లేదు. మరి నా సాధన సరయిన మార్గంలో సాగుతోందా లేదా అని సాధకుడు అనుమానం వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు తేజోబిందూపనిషత్ ఈరకంగా చెబుతోంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేద్బ్రహ్మ మయం జగత్సాదృష్టిః పరమోదారా ననాసాగా్రవలోకినీ!! దృష్టిని జ్ఞానమయం చేస్తే(చేయగలిగితే)ఈజగత్తంతా బ్రహ్మమయంగా కనబడుతుంది. జ్ఞాన దృష్టి వల్ల తన్నుతాను కన్నవాడు జగమంతా బ్రహ్మమయం గా చూస్తాడు. అంతేకాని దృష్టిని ఒక్కదాన్ని భూ్రమధ్యంలో(నాసాగ్రంలో)ఉంచి అవలోకించడం వల్ల కాదు. అల్లా అయితే మరి దృష్టిని జ్ఞానమయం చేయడం ఎలా? అంటే ఉపనిషత్తు ఏమంటోందంటే ద్రష్టు్ర దర్శన దృశ్యానాం విరామో యత్రవా భవేత్దృష్టి స్తతై్రవ కర్తవ్యా ననాసాగా్రవలోకినీ!! అంటే దృష్టిని నాసాగ్రములోకాని భూ్రమధ్యంలోకానినిలపడం ఒక్కటే చాలదు. చూచేవాడు (ద్రష్ట) అంటే ఎవరు? నేను చూస్తున్నాను అంటే నా ఇంది్రయాల మూలకంగా చూస్తున్నాను- అంటే నా మనస్సు చూస్తోంది. దర్శనం(చూపు) దేని ద్వారా అయితే చూస్తున్నావో ఆ దృష్టి; దృశ్యానాం(దృశ్యం) ఏమిటి? దృష్టి ద్వారా మనసును అక్కడకు చేర్చి చూచే దృశ్యం ఆ బ్రహ్మత్వం. ద్రష్టుదర్శన దృశ్యానాం విరామో యత్రవాభవేత్- అంటే చూచేవాడు, చూడబడేది, చూపు ఈవృత్తులన్నీ ఎక్కడ కలిసి విశ్రమిస్తాయో అక్కడ దృష్టిని నిలపాలి అని. ఈ మూడు వృత్తులు వాటివాటి వ్యాపారాలు పూర్తిగా ఆపేసి నప్పుడు దృష్టి జ్ఞానమయం అవుతుంది అని అర్ధం. అంటే పా్రణాయామ ప్రకి్రయ పూర్తయిన తరువాత తదేకంగా దృష్టిని మనస్సుతో కలిపి భూ్రమధ్యం ద్వారా పీనల్ గ్లాండ్ దగ్గరనే చూడాలి. మనస్సు తో కలిసి దృష్టి ఆత్మ యొక్క ప్రదేశాన్నివెతుకుతూ ఒక సమయంలో ఆత్మతో కలిసిన స్ధితిలో సమాధి ఏర్పడుతుంది. నానాకార దృష్టి నశించి ఏకాకార దృష్టి కలగాలి. అప్పుడే మీరు చేసే ధ్యానానికి ఫలిత దొరకుతుంది. ధ్యానము: మీరు చెప్పింది చాలా బాగానే ఉంది. కానీ మనస్సు మాట వినటం లేదే! అనంత ముఖమైన ఆలోచనలతో మనస్సు ఒక లిప్త కాలమైనా దృష్టి నిలిపిన చోట ఉండటం లేదుకదా! మరి నేను ఏమి చేయాలి? ధ్యానం : ధ్యానం అంటే బ్రహ్మ వాదులు ఏమంటున్నారంటే యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణస్తత్ర దర్శనాత్మనసా ధారణం చైవ ధారణాసా పరామతా!!నువ్వు మనసుని పట్టుకొని దృష్టితో కలిపి బ్రహ్మ స్ధానములో నిలపడం కష్టమౌతోంది అంటున్నావు కదా అలాంటప్పుడు ఈ చంచల స్ధితి లో ఉన్న మనస్సు (యత్ర యత్ర మనో యాతి) ఎక్కడెక్కడకు పరువెత్తుతోందో – బ్రహ్మణస్తత్ర దర్శనాత్ – మనస్సు వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని, ప్రతి ఆలోచనలోనూ ఆ బ్రహ్మ నే ఆపాదించుకొని బ్రహ్మత్వాన్నే దర్శంచు. ఈరకంగా మనసును బ్రహ్మము పై నిలపడాన్నే ధారణము అంటారు.మీకు అర్ధం అయ్యిందని తలుస్తాను. దీనినే ధ్యానం అంటారు అని ఈ తరువాతి మంత్రం లో చెబుతున్నారు. బ్రహ్మై వాస్మీతి సద్వృత్వా నిరాలంబ తయా స్ధితిఃధ్యాన శబ్దేన విఖ్యాతః పరమానంద దాయకః!! ముందరి మంత్రం లో మనసు ఎక్కడెక్కడికి పోతే అక్కడ బ్రహ్మ తప్ప మరొకటి కాదు అని ప్రతి ఆలోచన ప్రతి మానసిక దృశ్యం ఆబ్రహ్మమే అని మనస్సుని ధారణ చేయి అని చెప్పేరు. అంటే మన ఆలోచనలన్నీ బ్రహ్మము అయితే మనం బ్రహ్మము తో సమానమే కదా! అదే విషయాన్ని రెండవ మంత్రం లో చెప్పేరు.బ్రహ్మైవాస్మీతి సద్వృత్వా- నేనే బ్రహ్మను అనేటటువంటి సద్వృత్తి తో నిరాలంబముగా (ఆలోచనా రహితంగా -నిర్మూలింప బడిన ఆలోచనలు కలవాడిగా) ఇంకొక దృశ్యం లేకుండా(దృష్టి కూడానిరాకారంగా)మనసు ఉండటమే (ధ్యాన శబ్దేన విఖ్యాతః)- ధ్యానము అనే పేరుతో చెప్పబడింది. ఆస్ధితి యే మనకు పరమానందాన్ని ఇచ్చేటటువంటిది.
9/5/2015
From: Uday Bhaskar Duvvuri:
ఆరోజు స్వామి విజయీందు్రలు ధ్యానం ముగించి లేచేరు. వెంటనే ఎవరో మేల్కొల్పినట్లయ్యింది. యోగి అచ్యుతులు ధ్యాన స్ధితి నుంచి బయటకు వచ్చి లేచి గుహనుంచి బయటకు వెడుతున్నారు. ఇద్దరూ బయట బండమీద నిల్చొన్నారు. స్వచ్ఛమైన వెన్నెల. కి్రంద పచ్చని పైరులు. మొదట చిరు గజ్జల సవ్వడి వినిపించింది. ప్రక్కనే యోగి అచ్యుతులు ఉన్నా మళ్ళీ వినపడింది. ఈసారి ఆ గజ్జల స వ్వడితోపాటు మురళీనాదం కూడా వినిపించింది. నిజానికి అది అనిర్వచనీయం. హఠాత్తుగా యోగి అచ్యుతులు కనిపించ లేదు. అక్కడ బాలకృష్ణుడు మురళీ వాయిస్తూ నర్తించినట్లుగా కనపడింది. ఇలా చాలా సేపు జరిగింది. ఆతర్వాత నెమ్మదిగా ఆ శబ్దాలు శాంతించేయి. ఆ దృశ్యం నెమ్మదిగా మాయమవుతోంది. వెంటనే పక్కన యోగి అచ్యుతులు కనపడ్డారు.జై శ్రీ యోగి అచ్యుతా! జై శ్రీ కృష్ణా!
9/14/2015
From: వేణు గోపాల్ స్వామీ:
33 కోట్ల దేవతలలో వినాయకుని విఘ్ననాయకునిగా కొలుస్తాము కదా. కారణమేమి? వినాయకుడు ద్విజుడు. అనగా రెండవ జన్మ కలిగినవాడు ఆయన ఒక్కడే. భీకరాకారము కలిగిన వినాయకునికి వాహనము చిట్టెలుక . ఇది సమంజసముగా లేదు. ఎందుకిలా? మన పూర్వీకులు ఊరకే అలా చేయరు కదా. కారణము ఒకసారి పరిశీలన చేస్తాము. ఇది యోగసాధకులకు చాలా ముఖ్యమైన విషయము అంటే మీరు నమ్ముతారా? యోగసాధకులు జపములో ఉన్నతస్థాయి కలిగి నప్పుడు తన స్థూలశరీరము నుండి ప్రాణశక్తి బయటకు వచ్చును. తిరిగి కొంత సేపటికి శరిరములో ప్రవేశించును. ఇటువంటి వారిని ద్విజులందురు. అనగా రెండవ జన్మను పొందిన వారు. ద్విజోత్తముడనగా ఇలా చాలా సార్లు ప్రాణశక్తి బయటకు పోయి వచ్చినవారు. ఇటువంటి వారు మన ఆశ్రమములో ఉన్నారు. ఇక ఎలుక గురించి చెప్పుకుందాము. ఎలుక ఒక చోట నిలకడగా ఉండదు. అదియును గాక పట్టు చీరనైనా, రూపాయ నోటు ఐనా వాటి విలువ తెలియక కొరికి వేస్తుంది. ఎలుక మనమనస్సుతో సమానము. ఎలుకపై వినాయకుడు కూర్చున్నాడంటే ఊరేగడానికి కాదు. చంచల స్వభావి అయిన ఎలుక ను కదల నీయక దానిపై కూర్చొన్నాడు. దీని అంతరార్థము ఏమనగా చంచల మైనమనస్సు పై కదలక స్థిరముగా కూర్చున్నాడని అర్థము. సాధకుడు తన జప సాధనలో మనస్సును అమనస్క స్థితిలో ఉంచిన అతడు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు తెలుసుకోవాలి. కనుక వినాయకునికి, యోగ సాధకునికి అవినాభావ సంబంధమున్నది.జయ అచ్యుత.
9/15/2015
From: Uday Bhaskar Duvvuri:
నిన్న నేను సాధకులందర్నీ ట్రైనింగ్ లో టాపిక్స్ గురించి అడిగేను కదా! మొన్న మే నెలలో జరిగిన టై్రనింగ్ లో ఏమి చెప్పేమో చెబుతాను. నిజంగా మే నెల ట్రైనింగ్ ప్లానింగ్ అంతా శ్రీ గురురాజ్(టె్రజరర్) ఆయన స్నేహితుడు చెన్నబసవ కలిసి తయారు చేసేరు.
1. శాంతిమంత్రముల వివరణ- పఠనము ఎలా చేయాలి?
2. ఆదిత్యహృదయం వివరణ
3. పతాకావిష్కరణ- ఆరోహణ అవరోహణ పద్ధతులు వాటి ఆవశ్యకత గురించి
4. సాధక నియమావళి
5. అచ్యుత తత్వము- డాక్టరిన్ ఆఫ్ యోగి అచ్యుత
6. మనస్సు దాని స్తితిగతులు
7. స్వామి విజయీందర్ -జీవిత చరిత్ర
8. విజయిందరులు
9 ప్రోఫెసోర్ నాడగౌడు
10 ప్రాణ మనోమిలనము
11 ఆత్మ యొక్క వివరణ
12 ప్రాణ ప్రతిష్ట మొదలయినవి.
ప్రతి రోజు రాత్రి 9 గంటలకు – ఒక ప్రాచీన ఋషి కధ చెప్పు కోవాలనుకొన్నాము కాని కుదరలేదు. ఈ జరిగిన ట్రైనింగ్ పూర్తిగా డాక్యుమెంటేషన్ చేస్తున్నాము. అంటే వచ్చే మే నెల టై్రనింగ్ అవే టాపిక్స్ తో అదే మేటర్ తో నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఈటై్రనింగ్ లో 5 రోజులు ఏమి చెప్పుకోవాలి? ఈ ఆశ్రమం మనలను ఉద్ధరించుకోవడానికి, జపంలో ప్రగతిని సాధించుకోడానికి కదా! మీ అందరూ కార్యశీలకంగా పాల్గొనండి.
9/20/2015
From: Uday Bhaskar Duvvuri:
ఇంక ఏకాదశి దగ్గర పడుతోంది కదా! మనం ఈ పౌర్ణమి జపానికి సమాయుక్తమవుదాం. మరి కి్రతం పూర్ణిమ నుంచి ఈ రోజు వరకూ మీర చేసిన జపం దానిలోని ప్రగతి, సాధకబాధకాలు ప్రతిఒక్కరూ చెప్పాలి. మీరందరూ మీ మీ గురించి ఒక పవర్పోయింట్ ప్రజంటేషన్ తయారు చేసి పంపండి. దానిలో మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ మీ గురించి రాయండి. కొంచెం యాక్టివ్ అవ్వండి. మీరు ప్రయత్నించనిదే మీ ఉద్దారణ సాధ్యం కాదు. మీకు సాయం చేయడానికి మా కు సావకాశం ఇవ్వండి.
9/21/2015
From: Uday Bhaskar Duvvuri:
మనస్సును క్రోడీకరించుకొని పదిలపరచి జపంవైపు ముందుకు సాగేట్లుగా చేయడం మొదలు పెట్టేరా? ఈ రోజు మీ జపం ఏరకంగా సాగాలి అనుకొంటున్నారు? ఈరోజు శాంతిగతిలో మీ మనస్సు గురించి -ఇప్పటి వరకూ జరిగిన మీ జీవితం గురించి కూలంకషంగా ఆలోచించండి. మీరు కోరుకున్న గమ్యం ఏమిటి? మీరు ఏదిశగా పయనిస్తున్నారు? దానికి మన బాధ్యత ఎంత వరకూ ఉంది? ఇన్ని సంవత్సరాలలో జపంలో శారీరక మానసిక పరివర్తనలు ఎలా మారేయి? తర్వాత ఈ పౌర్ణమి కి జపం ఏ స్తాయికి వెళ్ళాలి? అనే విషయాలు మీద ధ్యాస ఉంచండి రేపు రాత్రికి ఏకాదశి వస్తుంది. అందుకని ఏకాదశి జపానికి ఆయుత్తం కండి. జపంలో ఒకనాటి నా అనుభవం మీతో పంచుకొంటాను రేపు. మీ రొటీన్ పనులు ఏవీ మానకుండా జపంమీద ధ్యాస ఉంచడం నేర్చుకోండి. స్వామి గారు మీకు మానశిక స్తైర్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
9/22/2015
From: వేణు గోపాల్ స్వామీ:
సాధక మిత్రులారా, ఇతరులకు వలే సాధకులకు కూడా ఎందులకు విఘ్నములు కలుగుతాయి? విఘ్నములు రెండు రకములు. 1. స్వభావసిధ్ధముగా వచ్చునది. అనగా మన గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల వలన మన చేతులారా మనము చేసుకొను చున్న కర్మ ఫలములు. 2. ప్రకృతి సిధ్ధముగా అనగా బంధు మిత్రులు, శతృమరియు సంఘము వలన కలుగునవి. ఙానాని దగ్ధ కర్మాిణ అనగా కర్మలన్నీ దగ్ధ మైపోయినదని అనుకొనుట తప్పు. ఈ జన్మలో మనము చేసిన ప్రారబ్ధ కర్మలను అనుభవించాల్సిందే. మనము చేయు యోగము వలన పూర్వజన్మ కర్మలను నశింపు చేసుకొన్నతర్వాతనే ఈజన్మ పాపములను పోగొట్టుకొనవచ్చును. ఇది అనుకున్నంత సులభము కాదు. సాధకులు ద్వందములను అధిగమించిన గాని జపములో మంచి స్థాయిని పొందలేము. మనసే జగత్తును చూపిస్తుంది. ఆమనసే ఆత్మతో కలిసిన వెంటనే ఈజగత్తును మూసేస్తుంది. అనగా మనస్సులో ఆలోచనలున్నపుడు అసత్యమైన జగత్తును చూపుతుంది. ఆమనసే స్థిరమై ఇంద్రియ విషయములను నిరోధించి నపుడు జగత్తునే అసత్యమని తెలుపుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు తన ఆత్మబోధ యందుదేనిని పొందిన ఇక పొంద దగినది ఏమియూఉండదో, ఏసుఖము కంటే మించిన సుఖము లేదో, ఏఙానముకంటే మించిన ఙానము లేదో దానిని బ్రహ్మ మన్నారు. ఆబ్రహ్మమును చేరుటకు అచ్యుతయోగమొక్కటే ఏకైక మార్గము. జయ అచ్యుత.
Question by: +91 99851 61327:
వేణు గోపాల్ స్వామీ గారు నిన్న మీరు చెప్పిన వాటిలో ద్వంద ములు అని చెప్పారు వాటి గురించి వివరణ ఇవ్వగలరని మా యొక్క మనవి.
Answered by: వేణు గోపాల్ స్వామీ:
విద్యా శ్రీ ఉదయ భాస్కర్ గారు ఈ వాట్సప్ ను ప్రారంభించిన ఉద్యేస్యము ఏమిటంటే, సమాన మనస్తత్వము గల సాధకులు ఒకే వేదికపై కలిసి సాధనలో ప్రగతిని సాధించుటకు గాను మరియు తెలియని విషయములను అందరూ తెలుసు కొనుటకు ప్రారంభించబడినది. ఇందులోని విషయములను ఎందరు చదుపు చున్నారో తెలియడము లేదు. విద్యాశ్రీలు నారాయణపేట జయంత్ మరియు లింగంపల్లి రవి నుండి మాత్రము స్పందన ఉన్నది. ఈసమూహములో ఉన్న ఇతర సాధకులు ఎందుకు స్పందించుట లేదూ? కారణమును తెలుప వలసినదిగా అందరిని కోరుతన్నాను. ఉన్నకొద్ది మందైనా ఈబ్రహ్మవిద్యలో మంచి స్థాయిలో కొనసాగిన మనము గురుగారిని సంతోషపెట్టిన వారమౌతాము. నాయొక్క బాధ మీకు కష్టమును కలిగించి ఉంటే క్షంతవ్ యుడను. జయంత్ గారూ, ద్వందములనగా, సుఖ దుఃఖములు, ఆశా వ్యామోహములు, అసూయా ద్వేషములు, కామ క్రోధములు మొదలుగు గుణములు. వాటిని వదులుకోవడము చాలా కష్టము. అది స్థిత ప్రఙతత్వము గలవారికి మాత్రమే సాధ్యము. అలాగని మన ప్రయత్నమును మానుకోకుండా అభ్యాసము చేస్తూఉంటే మనము విజయమును తప్పక సాధిస్తాము.
జయ అచ్యుత
9/23/2015
From: Uday Bhaskar Duvvuri:
Now we are heading for yekadasi. How to proceed and success? Please prepare from now. In my opinion, satwika food means we should solely reduce shadruchulu then cooked vegetables will have saltish taste. Cooked rice also will have saltish taste. Cooked pulses will have sweetish tinge. Milk without adding water Will be sweet. So we cannot avoid saltish and sweet tastes- even without adding any thing. Now try to understand to what extent these Ruchulu are to be eliminated from yekadasi to Poornima. We have to eat food without shadruchulu. So to gain proteins, add pesarapappu(moongdal) to rice before cooking. Then u will have strength during lunch sufficiently eat and dinner – a little less. At the same time you please regulate your thought process,reduce interactions with different types of people.
If u feel still hungry, eat keera as much as you can.
Don’t disclose these details to anybody. Your energy levels should not comedown – activity should be at its peak. Please start – at the sametime you please write diary. It is my earnest request for u all.
Jaya Achyutha!
A nice story of Adi Shankaracharya teaching his students how to empty and free their mind: “Adi Sankara was walking through the market place with his disciples. They saw a man dragging a cow by a rope. Sankara told the man to wait and asked his disciples to surround them. “I am going to teach you something” and continued… “Tell me who is bound to whom? Is the cow bound to this man or the man is bound to the cow?” The disciples said without hesitation “Of course the cow is bound to the man!. The man is the master. He is holding the rope. The cow has to follow him wherever he goes. The man is the master and the cow is the slave.” “Now watch this”, said Sankara and took a pair of scissors from his bag and cut the rope. The cow ran away from the master and the man ran after his cow. “Look, what is happening”, said Sankara “Do you see who the Master is? The cow is not at all interested in this man. The cow in fact, is trying to escape from this man. This is the case with our MIND. Like the cow, all the non-sense that we carry inside is not interested in us. WE ARE INTERESTED IN IT, we are keeping it together somehow or the other. We are going crazy trying to keep it all together under our control. The moment we lose interest in all the garbage filled in our head, and the moment we understand the futility of it, it will start to disappear. Like the cow, it will escape and disappear.
Don’t disclose these details to anybody! what I mean here is don’t tell anybody that u r under Deeksha and you are practicing yoga these days specially or in that sense.
9/23/2015
From: +91 94908 19523:
Udaya Bhaskar Garu,
For the convenience of Kannada sadhakas, I’m posting in English.
Japa in our asram under the able guidance of Swamy vijayeendra, Swamy jaya theertha, Nemakallu Ramanna touched its peak.In those days the sadhakas are sincere to our Lord without selfishness. Now a days our most of the sadhakas become tourists, visiting asrama once in a blue moon like AYARAM GAYARAM, without gaining anything from japa. I can’t speak more than this.
Regarding the topics tobe thought during the training program, I suggest the following.
1. Most of the sadhakas are having “avagàahana lopam ” regarding doing japa. Allot one are two classes for the preparation of their physical body before the japa. i.e., aasana, mudra, drusthi and their importance in japa.
2. Stages of gatha gathi and their prominence.
3. During santhi sthithy the role played by the mind.
4. Asanothpathy.
5. Prana mano budhi milinamu.
6. Activation of pranan.
7. Movement of pranan to merge with Atma.
Any fault in my suggestion, please excuse me.
Jaya Achyuta.
9/24/2015
From: వేణు గోపాల్ స్వామీ:
మనము తండ్రి గర్భము నుండి తల్లి గర్భము లోనికి ప్రవేశించినపుడుఅక్కడ ఉండినవి ఆత్మమరియు ప్రాణుడు మాత్రమే. ఆపిండము దినదినాభివృధ్ధి చెందుటకు తల్లి నుండి కొంత శక్తిని తీసుకొని రక్త మాంసములుగా మలుచు కొన్నది. అంతఃకరణము లైన మనస్సు బుద్ధి చిత్త అహంకారములు ఉన్నా కూడా అవి స్థభ్ద స్థితిలోనే. దీనికి కారణము ఏమిటంటే అక్కడ వాయుఉ పనిచేయుట లేదు. మనము ఎప్పుడైతే తల్లి గర్భము నుండి బయటకు వచ్చామో అప్పుడు బయట గాలితో సంపర్కము కలిగి అంతఃకరణములు పనిచేయుటకు ప్రారంభించును. ఆంజనేయునికి ఋషులశపమువలన తన శక్తిని మరచి నట్లు అంత వరకు తన స్వస్థానమున అనుభవిచిన ఆత్మానంద మును మరచి మనస్సు మరియు ఇంద్రియము లకు బానిస అగును. ఈజగత్తు నందున్న కోట్లాది జీఉలలో ఏ కొంత మందికి మాత్రమే బ్రహ్మ విద్య లభ్యమై ప్రాణుడు తన శక్తిని తెలుసు కొని తన నిజ స్థానమును చేరుటకు ప్రయత్నిచును. ఇదే మనము చేయు జపము. ప్రియ సాధక మిత్రులారా, మీరు అశాశ్వతమైన మాయ చే కల్పించబడిన సుఖముల నుండి బయటపడి జపమునకు కొంత సమయమను కేటాయించండి. నిజాయితీగా జపమును చేయండి. మంచి ఫలితమును అచ్యుతులవారు తప్పకుండా ఇస్తారు.
జయ అచ్యుత
11/6/2015
From: Uday Bhaskar Duvvuri:
నిజానికి తపస్సు ద్వారానే తెలుసుకోవచ్చు ఉపనిషత్తుల సారాన్ని.
అయినా మార్గదర్శకత్వానికి google map gps grs లో ఎలాగైతే direction తీసుకొంటూ మనం గమ్యం చేరుతున్నామో అదేవిధంగా మనం ఉపనిషత్తులు అర్ధం చేసుకొంటూ ఆవిధంగా మన జపస్ధాయి ని సరి చేసుకొంటూ పోతే గమ్యం ఎంత దూరంలో ఉంది-ఎంత సమయంలో చేరుకో గలుగుతాము అనే విషయాలు అవగతమవుతాయి. అందువల్ల Google maps మీద ఉన్నంత నమ్మకం ఉపనిషత్తుల మీద పెట్టమని నా ప్రార్ధన.
మన ఆశ్రమ సాహిత్యంలో దశోపనిషత్తులలో అతి ముఖ్యమైనవి ఈశ, కేన, కఠ, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఐదింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా విషయాలు వచ్చేస్తాయి.
In ground reality, the quintessence of Upanishads can be visualised through Japa and those people will be called drasta (ద్రష్ఠ).
However, for guidance of any unknown route, we solely believe in google maps- by keeping starting point and destination we follow the gps/grs and we are reaching.
5000 years back our ancient rishis have drawn the Google maps- Upanishads- a stright rode in different directions( depending on the seekers position, mental status, sanskaras,etc.,).
Please develop faith in Upanishads and be guided.
My earnest request to you all is please believe -how much Google maps are reliable and ensure you reaching your wanted destination- Upanishads are thousand times better in guiding you, making you to reach your desired destination.
Our Ashrama strongly believes in five Upanishads out of dasopanishads. -Eesa, kena, katha, mandookya, prasnopanishad
-majority of guidance for a sadhaka is available. …,,continue
ఉదయ భాస్కర్ దువ్వూరి
11/7/2015
From: Uday Bhaskar Duvvuri:
Bhaskaram mavayya…. in google maps we have two boxes… From…To…to find our desired destination. If we click Go we will get our route map. Do we have similar facilities in Upanishads also? If yes… in what form? How to understand that?
Here we know from and to places… In this context what is our desired destination first of all? What is our present location (starting point)? How to realize all these?
I mean… how to understand upanishads? What exactly they are explaining… pls explain elaborately.
Dear Ravi, a wonderful boy, I am with you.
The very word Upanishad sounds the meaning- the teacher and taught sit together closely- accessible to watch, word and vision, receiving training from guru online. It is a continuous process.
Now, when somebody approaches guru – the reason may be either to attain his pre determined goal or to fix up a goal.
Am I clear?
There is the starting point. When you fix up your goal, you will be in search of a suitable master.
On finding your guru you should have unperturbed faith, confidence, devotion, dedication and surrender to your guru to shape you up.
11/8/2015
From: Uday Bhaskar Duvvuri:
మరి ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయి అని అడిగేవు కదా!
ముందుగా ప్రస్తానత్రయం గురించి ఒక మాట చెప్పుకొందాం. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు – ఈ మూడింటిని ప్రస్తానత్రయం అంటారు బహుశా వానప్రస్థ ఆశ్రమానికి బయలు దేరే వాళ్ళకి ఇవి టెక్స్టుబుక్సేమో మరి.
ఇక్కడ విచిత్రంగా బ్రహ్మసూత్రాలు తెరవగానే మొట్టమొదటి మంత్రం అడుగుతుందీ ” ఏమిటయ్యా నీ క్వాలుఫికేషన్ ఈ బుక్కు తెరవడానికి? అని డైరెక్టుగా అడుగుతుంది.
“అథాతో బ్రహ్మ జిజ్ఞాస !”
అందువల్ల బ్రహ్మ జిజ్ఞాసకు నువ్వు వచ్చావన్నమాట.
Therefore you have entered here to learn about Brahman.
ఎందువల్ల? నువ్వు EMCET పాసయ్యావు కాబట్టి eng లో join అవ్వడానికి అర్హత వచ్చినట్టు.
చతుర్విధ పురుషార్ధాలు మనసా వాచా కర్మణా ఆకళింపు చేసుకొన్నావా? ఆచరణలో పెట్టేవా?
చతుర్విధ పురుషార్ధాలు ఏమిటంటే
1 నిత్యానిత్య వస్తు వివేకము
2 ఐహిక ఆముష్మిక ఫల భోగ విరాగము
3 శమ దమాది షడ్గుణ సంపత్తి మరియు
4 ముముక్షుత్వము.
ఈ నాలుగు పేపర్లు పాసయితే అప్పుడు బ్రహ్మ సూత్రాలు చదవడానికి, వాటిని అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టడానికి మనకు అధికారం వస్తుంది. బ్రహ్మ జిజ్ఞాస మొదలు పెడితే ఉపనిషత్తులు laboratory workbooks అన్న మాట.
అందుకని సాధనలో సాగే వారికి ఉపనిషత్తులు మార్గదర్శకాలవుతాయి.
11/19/2015
From: Uday Bhaskar Duvvuri
పౌర్ణమి జపానికి రెడీ అవ్వాలి. ఏకాదశి దగ్గరకొచ్చేస్తోంది.
ముందుగా జప డైరీ ని రెడీ చేయండి. అన్ని గీతలు గీసి రెండు పేజీలు కలిపి అన్ని గడులూ గీసి హెడ్డింగులు పెట్టి నాకు చెప్పండి
ఈసారి ఇంట్లో మన భోజనం గురించి ఏమీ స్పెషల్ గా చేయక్కర్లేదు అని చెప్పండి. చేయవలసినదల్లా ఆరోజు చేసిన పదార్ధాలలో ఉప్పు, పులుపు, కారం వేసే ముందు మనకు సరపడ పదార్ధం తీసేసి వేరే పెట్టి వాళ్ళకి కావలసినట్లు తయారు చేసుకోమనండి. మనం తగినంత మోతాదులో రుచులు కలుపుకొనితిందాం. సరేనా।
కానీ మనస్సు మాత్రం జపంమీదే ఉండేట్లుగా ప్రయత్నించండి. అప్పుడే ఆరు నెలలు దాటిపోతోంది మనం మొదలుపెట్టి. ఇంక దారిలోకి వచ్చేయాలి. ఒకే।
My dear young friends, we are approaching Ekadasi very speedily.
It is my earnest request to you all- please take a book and prepare Japa diary. Combining two pages, you please draw lines and write headings. Then pl call me.
This time, you don’t insist for preparation of special food in the house. What ever vegetables they are cooking, out of that separate a little amount sufficient for one person before adding salt, tamarind and chilly. That vegetables we eat by making sufficiently eatable.
But out of all, the very important thing is -always aim at Japa. Round the clock, keep your mind on Japa ( how to improve, how to go to higher planes- where we are unable to progress). You only can solve your hurdles- yogi Achyuta is always keep your thinking process in the right direction.
Please be on the job.
11/20/2015
From: Uday Bhaskar Duvvuri
ప్రాణాయామ ప్రక్రియ పూర్తయి ధ్యాన సమయం లో సాధకుడు ఏమి చేయాలి అనే దానికి:
తేజో బిందూపనిషత్తు ఏమంటోందంటే
దృష్టిం జ్ఞానమయీం కృత్వా
పశ్చేద్బ్రహ్మ మయం జగత్
సాదృష్టిః పరమోదారా
ననాసాగ్రావలోకిని।।
నాసాగ్రం లోదృష్టిని కేంద్రీకృతం చేస్తున్నప్పుడు, మరింత ముందుకు తీసుకొని పోయి దృష్ఠిని జ్ఞానమయం గా చేయ గలిగితే జగత్తంతనూ బ్రహ్మ మయంగా చూడ గలుగుతాము. అదే పరమోదారమైన గొప్పదైన దృష్ఠి గా చెబుతారు.
అది ఎలా జరగాలంటే
ద్రష్ట్రు దర్శన దృశ్యానాం
విరామో యత్రవా భవేత్
దృష్టిస్తత్రైవ కర్తవ్యా
న నాసాగ్రావలోకిని।।
మనం జపంలో రెండు కళ్ళని నాసాగ్రం లో ఉంచి ఏదో జరుగుతుందని, లేదా ఏమిజరుగుతుందోనని వేచి చూస్తూంటాము.
నాసాగ్రావలోకనం ఒకటీ చాలదు.
ద్రష్ట్రు- చూచేవాడు (మనస్సు)
దర్శన- చూపు ( చూసేది-దృష్టి)
దృశ్యానాం- చూడబడేది(బ్రహ్మము)
ఈ వృత్తులన్నీ ఎక్కడ కలుస్తాయో, కలిసి ఎక్కడ విశ్రమిస్తాయో, అంటే ఎక్కడ లయమయిపోతాయో వాటి ఉనికిని మఱచి పోతాయో అక్కడ నిలపాలి అని.
నానాకార దృష్టి పోయి ఏకాకార దృష్టి కలగాలి.
చూపును మనసు తో కలిపి సహస్రారములో బ్రహ్మ స్తానాన్ని గుర్తించడం లో లగ్నం చేయాలి. ఈ మూడు ఎప్పుడు లయమయిపోతాయో అప్పుడు మన ఉనికి నామ మాత్రంగా మారిపోతుంది.
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే।
After completing gatagati, during dhyana we concentrate in the middle of the eye brows and trying to understand what is happening in our body after the rigorous pranayama.
Tejobindoopanishad says like this:
Dristi jnanamayeem kritwa
Paschedbrahma may Jagat
Saa dristih paramodara
na nasagrava lokini !!
During Japa we keep our both eyes concentrated in bhrumadhya ( on the top of the nose). This is not sufficient. Take the Dristi further to make it jnanamayam. Then that Dristi will be highly enlightened. Through that purified vision the entire world will appear as brahma mayam .
How to do this:
Drastru darshana drusyanam
Viramo yatrava bhavet
Drististatraiva kartawya
Na nasagrava lokini!!
It is our practice to keep our both the eyes in Union point of the eye brows -bhrumadhya. And waiting there expecting some thing to happen or observing what is going to happen in course of time.
But this Upanishad says that it is not sufficient. We have to put efforts to amalgamate the three- drstru ( one who sees- the mind)
Darshana (through which we see- the eye sight) drusyanam (the one which we are trying to see-brahmatwa )
-where all the three above will merge and loose their identity- there we have to concentrate.
The sadhakas should develop unified vision and to avoid diversified thoughts.
When the Manas unites with the Dristi, the eye sight, these two will go in search of Brahman inside sahasrara. Finally these two entities loose their identity when they join the Brahman and become actionless as well as nirakara.
That is samadhi stiti.

11/21/2015
From: Uday Bhaskar Duvvuri
19. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః
ఆదిత్య హృదయం 23 వ శ్లోకం
ఏష సుప్తేషు జాగర్తి
భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రంచ
ఫలంచైవాగ్ని హోత్రిణాం।।
ఏషః=ఈ ఆదిత్యుడే
భూతేషు= ప్రాణులు
సుప్తేషు= నిదురించు చుండగా
జాగర్తి= మేలుకొని యుండును.
అగ్నిహోత్రంచ= త్రేతాగ్ని స్వరూపుడు
అగ్నిహోత్రం అంటే- దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము లకు త్రేతాగ్నులని పేరు. ఈ అగ్నులను నిత్యము ప్రాతఃకాలము, సాయంత్రము శ్రద్ధగా ఆరాధించడాన్నే అగ్నిహోత్రం అంటారు.
ఏషః= ఇతడే
అగ్నిహోత్రాణాం = అగ్ని హోత్రమును అనుష్ఠించువారైన దీక్షితులకు కలిగెడి
ఫలంచ= ఫలస్వరూపము గూడ
ఏష ఏవ= ఇతడే
సూర్యుడస్త మించేప్పుడు, సూర్యుని తేజస్సు అగ్నిలో ప్రవేశిస్తోంది. అందువల్ల రాత్రులు అగ్ని సాయంతో చూడగలుగు తున్నాము.
అల్లాగే సూర్య తేజస్సు తో అగ్ని యొక్క ఉష్ణం కలుయడం వల్ల పగటి ఎండలో తీక్షణత ఏర్పడుతోంది.
మనము నిద్ర పోతున్నప్పుడు కూడా ఈ సూర్యుడు మనలో అంతర్యామిగా (అహం వైశ్వానరో భూత్వా) సర్వకాల సర్వావస్తలలోనూ మనకు తోడుగా మేలుకొని ఉంటాడు.
దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడు అగ్నులకు త్రేతాగ్నులని పేరు. ఈ త్రేతాగ్నులను శ్రద్ధగాను నిష్కామం గాను ఆరాధించే వారికి సర్వ సంపదలు, స్వర్గ ఫలం, మోక్షం సిద్ధిస్తాయని వేదమాత చెబుతూంది.
అంటే సూర్యభగవానుని ప్రత్యక్ష రూపమైన త్రేతాగ్నులను ఆరాధించే వారికి సూర్యభగవానుడే (జ్యోతి స్వరూపంలో) ఫలస్వరూపము గా దొరుకుతాడు అని ఆదిత్య హృదయం ఘోషిస్తోంది.
ఇక్కడ త్రేతాగ్నులను వివరించేరు.
ఆహవనీయము అనే అగ్నిని గురువు అంటారు. మన శరీరంలో ఉండే వైశ్వానరాగ్నిని వృద్ధి చేసుకొని అశనోత్పత్తి చేసుకొనేటందుకు ఉపయోగపడుతుంది.
గార్హపత్యము (పిత) అంటే గృహస్తాశ్రమంలో ఉంటూ గృహస్త ధర్మాలను పాటిస్తూ ప్రతి దినము గృహస్తు అనుష్టింప వలసిన అగ్ని కార్యం-
ప్రతిదినము మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జనించిన ఉష్ణశక్తి (అశనము), దీనినే మరొక మాటలో చెప్పాలంటే గృహస్తు తన స్వధర్మం (ప్రాణాయామము)తో జనింప చేసుకొనే తేజోబలం. దీని నుంచి తేజస్సు ద్విగుణీకృతమవుతుంది.
దక్షిణాగ్ని (మాత) యజ్ఞహవిస్సులను పితృదేవతలకు, ఇతర దేవతలకు (ఇంద్రియాలకు) అంద చేసే అగ్ని అన్నమాట. చితి మంటగా దేహాల్ని దహించి వేసే చరమ అగ్ని.
నిత్యాగ్నిహోత్రులైన వాళ్ళు ఈ అగ్నిని అరణుల (అగ్నిని రాపాడించే కర్రలు) రాపిడి ద్వారా ప్రజ్వలింప జేస్తారు.
మనం చేసే ప్రాణ యజ్ఞం లో
ఆత్మానమరణిం కృత్వా
ప్రణవంచోత్తరారణిం
జ్ఞాన నిర్మధ నాభ్యాసా
త్వాశం దహతి పండితః।।
ఆత్మను (ఇక్కడ మనస్సు)అధరారణి గాను, ప్రణవాన్ని ఉత్తరారణి గాను చేసుకొని విచారణ అనే మథనం చేస్తే జ్ఞానమనే అగ్ని పుడుతుంది. దాని వల్ల తాను వేరు వస్తువు వేరు అనే అజ్ఞాన పాశం దహింప బడి తను తాను గా మిగులుతాడు. అదే ముక్తి అదే మోక్షం.
వచ్చే శ్లోకం తో ఆదిత్య హృదయం పూర్తి అవుతుంది. మిగిలిన ఆరు శ్లోకాలు ఫల శృతి మొదలైన విషయాలను చెబుతాయి
ఈ చివరి మహిమా మంత్రం లో వేదాలు, క్రతువులు, ప్రాణ యజ్ఞాలు మొదలయిన సమస్త కృత్యాల కు ఫలము ఈ ఆదిత్యుడే అని చెబుతున్నారు.
శుభం
ఉదయ భాస్కర్ దువ్వూరి
11/22/2015
From: Uday Bhaskar Duvvuri
“యద్ధి మనసా ధ్యాయతి, తద్వాచా వదతి, తత్కర్మణా కరోతి”
అనేది శృతి వాక్యం.
మనస్సు లో దేన్ని ఆలోచిస్తున్నామో దానినే వాక్కు తో పలకాలని, ఆ వాక్కు తో పలికిన దానినే పనులలో చేయాలని దాని అర్ధం.
మానసికంగా తపించమని, వాక్కుతో ప్రణవోపాసన చేయమని, శరీరముతో ప్రాణమనో మిలనము చేసి ఆత్మను దర్శించమని ఆదేశిస్తోంది.
11/23/2015
From: Uday Bhaskar Duvvuri
శ్రీ యోగి అచ్యుతులు ఈశావాస్య మిదం శ్లోకానికి – ఈ శ్లోకం అనుభవం లోకి ఎలా వస్తుంది అనే విషయాన్ని ఎంతో సునిశితంగా వివరించేరు.
ఈశావాస్య మిదం సర్వం
యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుజ్ఞీధా
మాగృధః కస్యస్విద్ధనమ్ ।।
ఏ వైపు విన్నా రాత్రంబవళ్ళు నిరంతరం గా ప్రశాంత ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని “ఈశ్” అని వినిపిస్తుంది. ఆరకంగా ప్రయోగాత్మక మైన శుద్ధ వైజ్ఞానిక మంత్రమిది.
తపస్సులో ఉన్నప్పుడు కేవలం ప్రాణ ధనమైన గాలినే సేవిస్తూ ఉండు. వేరే ఇంద్రియ లోలత్వం వైపు దృష్టి ని మళ్ళించ వద్దు. అవన్నీ పరధనం. అంటే మనకు అక్కర లేనివి. స్వస్వరూపానికి ఆధారమైన ఆ స్వధనాన్నే (ప్రాణాయామాన్నే) అవలంభించు అంటాడు ఋషి. అలాంటి తపస్సు చేయి. దైహిక కర్మ చేయి. అలాంటి కర్మ చేస్తూ సమజీవనం సాగించు. ఇలా చేస్తే నీకు కర్మ అంటుకోదు. ఇలా ముందు ముందుకు పోగా హిరణ్మయేన పాత్రేణ అనుభవం లోకి వస్తుంది.
Srimath yogi Achyuta gave a very deep eye sight into the meaning of the Eesavasya midam sloka:
Eesavasya midam Sarvam
Yatkincha jagatyam jagat
Tena tyaktena bhunjeedha
Ma gridhah kasya swidhanam!!
The primordial sound “eesh ” is being heard day and night round the clock continuously. This this is a practical scientific manthra.
While in deep meditation, in the tapas, always depend on the purified air (asana)which is the root cause of our life(swadhana). Don’t allow your mind to dwell on petty worldly desires which divert your mind and distract you from your goal(paradhana).
The great Upanishadic rishis advise the mankind to adopt swadhana (pranayama) and to depend on it to know thy self.
Do tapas. Do serve the humanity through enlightening, encouraging and helping them in resolving their grievances and to lead their life peacefully. Do physical service (dihika karma).
Inculcate equanimity among all the human beings, lead your life along with them in the society.
If you go on doing Like this( night tapas and day time service to humanity) you will be relieved of dainandika karma and liberated.
If you continue like this, you will be in the path of receiving ” hirnmayena patrena satyasyapi hitam mukham- that is the Jyoti darshana and Jnana samuparjana.
11/24/15
From: Uday Bhaskar Duvvuri:
ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః
జగన్మోహనరెడ్డి గారూ। శ్రద్ధగా జపం చేయండి. స్వామిగారి కరుణ మీమీద ఉంటుంది.
సమాధి ఫొటో చూడగానే ఆనందం వచ్చింది
11/25/15
From: Janaki Ramarao
All sadhakas imbibe the spirit of Nirvanastakam of Adishankaracharya when doing Japam & also in regular daily life with a spirit that we are not body but spirit.
From: జగన్మోహనరెడ్డి గారు
From: Uday Bhaskar Duvvuri
ఈరోజు అందరూ తప్పక జపంలో కూర్చోండి. వచ్చే నెల నుంచి తప్పనిసరి. Internet లో monitor చేస్తాను. Ok?
సీతారామస్వామీ। మమ్ము కరుణించవయా। మీకివే మా నమస్కారములు.
12/10/15
From: Uday Bhaskar Duvvuri
6.45ని. సాయంత్ర సమయం, ఋష్యమూకాశ్రమం:
ఆ రోజు ఎవరూ ఆశ్రమంలో లేరు. సమయానికి కుటీరానికి వచ్చి శాంతి మంత్రాలు ప్రారంభించడం కుదర లేదు.
ప్రతి రోజు లాగే యోగి అచ్యుతులు తుంగ భద్రా నది లోకి దిగి కాళ్లు చేతులు కడుక్కొన్నారు.
అప్పుడు ఆ శేషి రెడ్డి అనుకొన్నాడుట. “ప్రతి రోజూ ఈ సమయానికి శాంతి మంత్రాలు సాగుతూ ఉండేవి. ఇప్పుడు ఎవరూ లేరు ఏం చేస్తారో చూడాలి.” అని.
కుటీరంలో ఓ అవ్వ పని చేస్తూంది. 6-8 సంవత్సరాల పిల్లలిద్దరు కుటీరం ముందు ఆడుకొంటున్నారు. ఆ అవ్వ అలవాటు కొద్దీ సమయానికి నిప్పు అంటించి ధూపం మాత్రం వేసి ఉంచింది.
ఆ సమయానికి సరిగ్గా ఋష్యమూక పర్వత గుహలలోంచి శాంతి మంత్రాలు 15 నిముషాలు పాటు మంచి స్వరం తో వినపడుతోంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్య పోయారు.
యోగి అచ్యుతులు మౌనంగా నే కూర్చొన్నారు.
ఒక్కొక్కరే సాధకులందరూ వచ్చి చేరేరు. అందరూ ఓ రకమయిన సంతోషం, భక్తి అనురాగాలతో నమస్కరించారు.
కొంత సేపయిన తర్వాత యోగి అచ్యుతులు బహిర్ముఖు లైనట్లు కని పించారు.
రోజూ లాగే ఆయనను ఫలహారానికి పిలిచారు.
చిరునవ్వు నవ్వుతూ ‘నాయనా అక్కడ ప్రసాదం అయ్యింది. ఆనందం గా ఉంది.వారి నిర్వాజ్యమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రసాదం అన్నింటినీ పొందే వచ్చా.
లేవండి. మీరు కానివ్వండి అని అనుమతి ఇచ్చారు.
యోగి అచ్యుతుల దర్శనార్థం అదృశ్య రూపంలోవచ్చి ఋష్యమూక గుహలలో వేచి వున్న ఋషులు మునులు చదివిన శాంతి మంత్రాలు ఇవి.
కొన్ని బ్రహ్మ సూత్రాలు, ఉపనిషద్మంత్రాలు కలిపి కూర్చ బడ్డాయి. శ్రీ యోగి అచ్యుతులు, శ్రీ విజయీంద్రు లు (యోగి అచ్యుతుల ప్రధమ శిష్యులు) వారివైన కొన్ని సూత్రాలను జత చేసి ఈ శాంతిమంత్ర పాఠాన్ని తయారు చేసేరు.
ఆదివారం నుంచి శాంతి మంత్రాలు మొదలు పెడదాము.
From: BalaSouri
Good morning Udayabhaskar sir. Your effort is so superb. Welcoming all the Sadhakas on to the same dais is really a wonderful job & nice thought. Here all the Sadhakas find a great opportunity to learn new lessons & share their experiences. Lessons explanation method is so nice. On behalf of all the shadakas(LORD ACHYUTA’s disciples)I convey my special greetings & thanks to your wonderful effort.I strongly believe that OUR LORD always be with you & present u a great VICTORY.
***Balasouri(Balu)** from Jaggayyapet.
12/12/2015
From: Uday Bhaskar Duvvuri
My Dear sadhakas, all of you, one by one, express the way your upadeshakas trained you- like ramanna garu, kasani goud, Sri Nadagoud etc., so that everybody will get encouragement and do good Japa. Don’t go into praising individuals, but highlight the way in which they have encouraged and helped to develop your Japa. Please be active.
Udaybhaskar
12/14/2015
From: Uday Bhaskar Duvvuri
సాధకులందరకూ, ప్రతి రోజూ డైరీ రాస్తున్నారా? జపం చేసినా, చేయక పోయినా, డైరీ- ఏమేమి తిన్నారో, ఎవరెవరిని కలిసి ఏమేమి మాట్లాడేరో, మీమానశిక పరిస్ధతి ఎలా ఉందో. రాయండి
Dear Sadhakas, all of you, please write dairy daily – whether you do Japa or not on that day. The food you have consumed, the people you met, and your mental status – please record daily and post me a copy of it in WhatsApp.
If you do Japa – pl explain the quality of Japa- if you didn’t do Japa, reason for not doing Japa- after a period of time, say a month or so, if you go back and review – you will be knowing who is the actual culprit- your mind or real circumstances? – you will be knowing.
12/25/2015
From: Raju Garu
What is this 45 angle ?
Reply from Ramarao Garu:
Bhrumadhyam venuka gurustanam lo pineal position
Reply from Uday Bhaskar Garu:
When you concentrate in bhrumadhya- the two eyes mingle at one point in the brain – that is on pineal gland. If you draw a tangent at bhrumadhya the angle made by both the eye sites at that point is 45 degrees. Thus the eye sight will go unitedly into brain to activate the Jnana Netra
దృష్టి జ్ఞానమయిం కృ త్వా
పశ్చేద్బ్రహ్మ మయీం జగత్
By making the Dristi jnanamayam by concentrating both the eyes on bhrumadhya. Then the eye sight will directly fall on pineal gland and make it active.
1/2/2016
From: Uday Bhaskar Duvvuri
ఈ రకంగా వివరణ రాస్తూంటే యోగి అచ్యుతులు అనేవారుట- రెండు మూడు పుస్తకాలు చదివి వివరణలు ఇస్తున్నా లేక రాస్తున్నా you Indian pig అని తిట్టేవారుట. అర్ధం ఏమిటంటే ఎవరో మృష్ఠాన్నం తిని మల విసర్జన చేస్తే దాన్ని ఎంతో ఇష్టంగా తింటాయిట Indian pigs. (వివరణ లో లోపించే సహజత్వం).
మీరు ప్రాణాయామ ప్రక్రియ చేసి ధ్యానంలో, తపస్సులో పొందిన సొంత అనుభవాలను చెప్పండి. ఆ ద్రష్టత్వం వల్ల ఆ ఆత్మానుభవం వల్ల వచ్చిన వాక్కు విన్న వాళ్ళ లో మానసిక పరివర్తన, ఆత్మ ప్రచోదనం జరిగి ఆత్మ సందర్శన దిశ లోకి మారుతారు.’ అని.
నాకు వున్న అతి తక్కువ సాధన అనుభవాన్ని సమయానుకూలంగా మీతో పంచుకొంటూ భావచౌర్యాన్ని కొన సాగిస్తాను.
ఉదయ భాస్కర్ దువ్వూరి
1/3/2016
From: Venkatesh garu:
ప్రభో!
ఈబొమ్మలాట అర్ధమైనట్టే ఉంది
నా చిన్నిపాత్ర నిండినట్టే ఉంది
ఇంకా ఎంతో మిగిలిఉన్నట్టే ఉంది
ఐనా సంతృప్తిగానే ఉంది.
కొంగల వెంకటేష్,
(గంపలగూడెం)
Reply from: Uday Bhaskar Duvvuri:
వెంకటేష్ గారూ। మీరు విజయేంద్ర స్వామి గురించి రాస్తూండండి(నా దైవము ఆధారంగా)
Replay from Venkatesh garu:
స్వామీ!
నేను చిన్నబాలుడనే.అంత గొప్ప మహాయోగి గురించి నేనేమి రాయగలను.నా గురుదేవుల (శ్రీవీరభూపాలక వారి) కృప వలనే మీవంటి పున్యాత్ముల సాంగత్యలభించింది.మీ అందరి పోషణలో కొనసాగాలని నేను మసారా కోరుకొంటూ మీ నిండైన ఆశీసుల కొరకు ప్రార్ధిస్తున్నాను.
1/8/2016
From: Uday Bhaskar Duvvuri:
20సంవత్సరాల నుంచి చేస్తున్న జపం లోపల regular గానే ఉంటుంది. a bcd ల తర్వాత పదాలు సెంటెన్సులు గ్రామరు నేర్చుకొన్నట్లే జపం లో ముందుకు పోవడం నేర్చుకోవాలి. అర్ధం చేసుకొంటూ వస్తున్న అనుభవాలను బేరీజు వేసుకొంటూ ప్రగతి లోకి సాగటం అనేదాన్నే సాధన అంటారు. మీరు అధైర్య పడకుండా మనసును మంచి చేసుకొంటూ ముందుకు సాగండి
1/9/2016
From: Uday Bhaskar Duvvuri:
ఈ రోజు వాతావరణం బాగుంది. కొంచెం స్తిరంగా జపం లో కూర్చోండి. కుదిరితే రాత్రి భోజనం బదులు పాలు తాగి జపం లో కూర్చోండి. రేపు డైరీ రాసి పంపండి
Dear sadhaka friends, today the newmoonday’s atmosphere is looking very congenial for Japa – so, you people to skip dinner (if possible- it is already late)and have a cup of milk – sit for Japa firmly- write diary and post it to me tomorrow – good luck
1/11/2016
From: Uday Bhaskar Duvvuri:
సాధక మిత్రలందరకూ।స్వామి గారి జయంతి శరవేగంతో వచ్చేస్తూంది. మనం ఈ రోజు నుంచి స్వామిగారి గురించి, తత్వం గురించి 40 రోజులు మాట్లాడుకొందాం. శ్రీ గౌడు స్వామి గారి ఢిల్లీ లెక్చర్స్ నుంచి, అచ్యుత సాహిత్యం నుంచి తీసుకొన్న విషయాలు మాట్లాడు కొందాం.నా చిన్న విన్నపం ఏమిటంటే ఈ 40 రోజులు జపం కనీసం 90 నిముషాలు చేసి డైరీ రాసి తేవాలి ఆశ్రమానికి. Ok?
My dear sadhaka friends,
Sri yogi Achyuta’s Jayanti is approaching very speedily. From today onwards, In the next 40 days we discuss the life story and tatwa of Srimath Swamiji. I will take the material from Sri Nadagowd swamiji’s Delhi lectures and Achyuta Literature
My dear young friends, as a tribute to Swamiji we do a small Japa for 90 minutes every day till Jayanti and write diary and submit.ok?
Replay from Bala Kishore: Sure Sir. I myself never thought such tribute. At least under your supervision we will be able to accomplish this.
1/12/2016
From: Uday Bhaskar Duvvuri:
1. ఓంశ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః
శ్రీ యోగి అచ్యుతులు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమాధి ని పొందేరు. ఆ రోజును ఆశ్రమ సాధకులు జయంతి పేరు తో రెండు రోజులు స్మరించు కొంటారు. మొదట్లో అయితే ఈ స్మరణ ఎలా ఉండేదిట అంటే శిష్యులందరూ ఉద్వేగ భరితంగా వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి గారితో వారి అనుభూతులను నెమరు వేసుకొంటూ తిరిగి సోక సముద్రంలో ములిగి పోతూండే వారుట. ఇంక భోజనాలు టిఫెన్లు కాఫీ టీలు గురించి ఆలోచించేంత మనసు ఉండేది కాదుట. స్వామి గారి ముఖ్య శిష్యలైతే సరేసరి- మా స్వామి తిరిగి రావలసిందే -మేమేం తక్కువ వాళ్ళమా అని హఠం తో ఆసనం వేసి ధ్యానంలో కి వెళ్ళి పోయే వారుట. అల్లాంటి జయంతి రూపాంతరాలు చెందుతూ 21వ శతాబ్దపు శిష్యుల చేతిలో పడి ప్రస్తుతం నామ మాత్రంగా జయంతి నడుస్తోంది. ఆ జయంతి సందర్భంగా స్వామి గారిని తత్వాన్ని ఒక సారి తిరిగి తెలుసుకుందాం. 1.యద్యదా చరతి శ్రేష్టః, తత్త దేవేతరో జనఃసయత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే।। శ్రేష్టుడైన వాడు సద్గుణములు సదాచారములు కలిగి ధర్మాత్ముడై ఉంటాడు. అందు వల్ల అతనిని చాలామంది ఆరాధిస్తారు, అనుసరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలను పాటిస్తారు. లోకములో ఉండే జనులందరి చేతా పాటించేట్లా చేస్తారు. అటువంటి పరమ పూజ్యులు మన గురు దేవులు శ్రీ యోగి అచ్యుతులు. మన ఆశ్రమానికి మూల పురుషులు. యోగి అనే స్తితి మహర్షుల కన్నా ఉన్నతమైన స్తితి. మహర్షి అంటే బ్రహ్మ విదులు. బ్రహ్మను సాక్షాత్కరించు కొన్న వ్యక్తులు. ముండకోపనిషత్తు ఋషులను ” ఆత్మ రతః ఆత్మ క్రీడః క్రియావాన్ బ్రహ్మ విదాం వరిష్ఠం” అని చెబుతుంది. యోగులు అనే వాళ్ళు యుగానికి ఒకరు రావచ్చు. సిద్ధులు, మునులు, మహర్షులు, యతులు, అవధూతలు, తపస్వులు, స్వాములు మరియు జగద్గురువులు అనేకులు ప్రతి శతాబ్దం లోనూ ఉంటారు. కాని యోగులు మాత్రం కనపడరు. నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణుని తర్వాత ఇంకొక యోగి ఇప్పటి వరకూ తారస పడలేదు. యోగి అచ్యుతులు ఒక సనాతనమైన యోగి. పరిపూర్ణమైన జ్ఞానం విజ్ఞానాలతో ఎల్లప్పుడూ బ్రహ్మీస్తితి లోనే ఉండేవారు. ఆయన ఒక జ్ఞాని. తత్వ దర్శినః, సమత్వం ఉట్టిపడే వ్యక్తి, స్తితప్రజ్ఞుడు, సమదర్శి, సర్వభూతస్తితేరతః, ఎల్లప్పుడూ కర్మలనాచరించి శాంతిస్తితి లో ఉండే మహాత్ముడు. నిజంగా యోగి అచ్యుతులు సమాధి తీసుకొన్న తర్వాతే వారి జీవిత విశేషాలు తెలుసుకో గలిగేరు స్వామి గారి ముఖ్య శిష్యులు. సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.
ఈ రోజు నుంచి జయంతి వరకూ స్వామి గారిని తత్వాన్ని గుర్తు చేసుకొంటూ జపం చేసుకుందాం
2. ఓంశ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః
ప్రకృతి సౌందర్యానికి నిలయం. సెలయేళ్ళతో పక్షుల కిలకిలారావాలతో రమణీయమైన సుప్ర సిద్ధమైన ప్రదేశం కర్నాటక లోని కూర్గు జిల్లా భాగమండలం. ఈ భాగమండలం లోని “బెంగూరు” అనే గ్రామం యోగి అచ్యుతుల జన్మ స్తలం. వీరి తండ్రి పేరు భూప వర్మ. తల్లి పొన్నమ్మ. ముండనుడు అను అన్న గారు, నంజుండ, కరుబయ్య, అప్పచ్చ అను ముగ్గురు తమ్ముళ్ళు. తుంగమ్మ, మాయ అను ఇద్దరు సోదరీమణులు. ‘బళ్ళార పొండ’ అనేది వీరి క్షత్రియ కుటుంబపు పేరు. స్వామి గారి పూర్తి పేరు ‘బళ్ళార పొండ బెంగూరు అచ్యుత వర్మ’. ముద్దుగా అచ్చయ్య అని పిలిచేవారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అచ్యుతులు కరుణామయి తల్లి ఆశ్రయంలో క్రమశిక్షణ తో పెరిగేరు. పిల్లల జీవనం నియమబద్ధం గా రూపొందించడం లో తల్లి పాత్ర ఎంతైనా ఉంది. శ్రీ యోగి అచ్యుతులు సుమారు 1904 లో జన్మించినట్లు వారి కుటుంబీకులు చెప్పేరు. వారు చిన్నప్పటి నుంచి ఎక్కువ ధైర్యశాలి. సూక్ష్మగ్రాహి. పట్టుదల కల వ్యక్తి. క్రియాశీలి. శరీరదారుఢ్యము తో పాటు క్రీడానైపుణ్యం కలవాడు. సంగీతము, చిత్రలేఖనము లతో పాటు నాటకములు కూడా వేసేవారు. సందర్భానుసారం కవిత్వం కూడా రాస్తూండేవారు. అచ్యుత వర్మ విద్యార్ధి దశ లో ఉపాధ్యాయులందరకూ ప్రీతిపాత్రమైన విద్యార్ధి. ఆటలలో హాకీ క్రికెట్, గుఱ్ఱపు స్వారీలో చాలా నైపుణ్యం కలిగి ఉండేవారుట. చదువు ముగిసిన వెంటనే కాఫీ ఎస్టేట్ లో ఉద్యోగం. యూరోపియన్ల తో స్నేహం. తీరిక సమయాలలో వైద్య వృత్తి. ఆయుర్వేదం, ఎలోపతి, బయోకెమికల్స్ హోమియోపతి మందులతో బీదలకు ఉచిత వైద్యం.
3. ఓంశ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః
ఆ చిన్నతనం లోనే సత్యాన్వేషణ మరియు ఆత్మదర్శనాభిలాషి యై నిజ యోగ విద్య కోసం సాధు సన్యాసులను, బైరాగులను ఫకీరులను, పండితులను, గుహలలో ఉండే సిద్ధపురుషులను దర్శించి వాళ్ళలో బ్రహ్మ విద్య కానక నిరంతరం అన్వేషిస్తూ ఉండేవారుట. ఒక రోజు మధ్యాహ్న సమయంలో వేటకుక్కలను తీసుకొని వేటాడే నెపంతో గుర్రం మీద అడవిలోకి వెళ్ళేరుట. అప్పుడు ఆ అడవిలో ఒక దివ్య పురుషుడు బంగారువర్ణ ఛాయ తో శోభాయమానంగా దర్శనమిచ్చి తాను విద్యాపతినని చెప్పి శ్రీ అచ్యుతుల వారికి బ్రహ్మోపదేశము అనుగ్రహించేరు. అప్పడు స్వామి గారి వయస్సు దాదాపు 28 సంవత్సరములు. అప్పటినుండి వారి సాధన కఠిన నియమాలతో ఒక క్రమ పద్ధతి లో సాగింది. అతి రహస్యంగా అందరూ నిద్రించిన తర్వాత తన సాధన చేస్తూండేవారు. కాలక్రమము లో అచ్యుతులు వారు నీలగిరి అడవులలో కొంత కాలము సాధన చేసేరు. ఒకరిద్దరికి ఉపదేశమిచ్చి అక్కడ నుండి బెళగాం వెళ్ళేరు. బెళగాం లో కొంత కాలం ఉన్నారు. బెళగాం నుంచి దేశ సంచారం చేస్తూ రాయదుర్గం లోని మొలకాళ్మూర్ వచ్చి కొంత కాలం వైద్య వృత్తి తో ప్రజలకు చేరువయ్యారు. అక్కడే విజయీంద్రులకు స్వామి గారితో పరిచయం అయింది. విజయీంద్రులు స్వామి గారి ప్రధమ శిష్యుని గా మారేరు. సుమారు అదే సమయంలో జయతీర్ధులు కూడా స్వామి గారి శిష్యులు గా చేరేరు. 1938 లో ప్రభువులు హంపీ చేరి రెండు సంవత్సరములు రత్నకూట గుహ లో తపస్సు చేసేరు. ఆ సమయం లో స్వామి గారిని కంటికి రెప్ప లా చూచుకొన్నారు శ్రీ విజయీంద్రులు. గుహావాసం అయిన తర్వాత వారు హంపి లో వైద్య వృత్తి లో అనేకులకు రోగాలు నయం చేసి మళయాళ వైద్యులు గా పేరు తెచ్చుకొన్నారు.(ఇంక ఋష్యమూక ఆశ్రమ స్థాపన ఆశ్రమ స్ధాపన ఉద్దేశ్యాలలోకి వెడదాము.ఇంకా స్వామి గారి విశేషాలు కొంచెం వివరంగా చెప్ప దలచు కొన్న వారు ఈ రోజు ఇక్కడ వివరించండి)
4. ఓంశ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః
స్వామి గారి ప్రధమ శిష్యులైన శ్రీ విజయీంద్రుల ప్రార్ధనను మన్నించి 1949 లో ఋష్యమూక ఆశ్రమమును స్తాపించారు. హంపీ విరూపాక్ష మందిరానికి ప్రక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది.దానికి ఉత్తరము గా ఉన్న పర్వతాలను ఋష్యమూక పర్వతాలు అంటారు. అప్పట్లో ఆ ప్రదేశమంతా కారడవి లా ఉండేది. ఆ ప్రదేశమే ఇప్పటి విరుపాపుర గడ్డ. అంత దట్టమైన అడవి లో చెట్లను నరికి కొంత భూమిని ఆశ్రమము కోసం, మరి కొంత భూమిని వ్యవసాయ యోగ్యము గాను ఉండేట్లుగా తయారు చేసుకొన్నారు. ఇదంతా స్వామి గారు ఇతర శిష్యులు స్వయంకృషి తో నమకూర్చుకొన్నదే. మహర్షులు ఆదర్శ జీవనమైన కృషి జీవనమే ఉత్తమము గా ఎన్నుకొని తాను కృషీవలుడై ఆదర్శ ఋషి మార్గాన్నే అనుసరించారు. ఎల్లప్పుడూ చిరుమందహాసము తో ముగ్ధ మనోహరమైన వారి మూర్తి ని చూడగానే అందరూ చేతులెత్తి నమస్కరించేవారు. ఋష్యమూకాశ్రమం స్థాపన సందర్భంగా శ్రీ యోగి అచ్యుతులు చెప్పిన ఉపదేశ వాక్యాలు: ఈ ఋష్యమూకాశ్రమం స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ మీరందరూ విశ్వాసంతో తత్వ బంధువులు కావాలి. అన్నింటికన్నా ముందుగా మీకు జగత్తులో స్నేహమయ జీవితం గడపడం రావాలి.మీలో మీరు సోధించి మీ ఆలోచనలను స్థిరం చేసుకోవాలి. సత్యద్వేషులెవరయినా ఉంటే వాళ్ళకు సత్యం అవగతమయ్యేట్లా చెప్పేందుకు, వాళ్ళు అర్ధం చేసుకొనే దారిలో ఆలోచించేందుకు సాయం చేయాలి. మీ అందరి శక్తి కార్యగతం కావాలి. అప్పుడే మీరు ఈ జీవితాన్ని పొందడం సార్ధకమవుతుంది. అటువంటి జీవితాన్ని మీరు రూపొందించుకోవాలంటే మొదట మీరు తపస్సంపన్నులు కావాలి. కార్య దక్షులు కావాలి. ధైర్యవంతులు కావాలి. సహిష్ణులు గా జీవించడం నేర్చుకోవాలి.శాంతి నే ఎల్లప్పుడు పూజించాలి. ద్వేషాన్ని, దర్పాన్ని ప్రక్కకు పెట్టి ప్రేమ ఆప్యాయతలనే అంతటా నింపాలి. పరిమితంగా ఉండే మీ ప్రేమను విశాలంగా వ్యాపింప చేయాలి. అన్ని రకాలయిన అవసరాలు, కోరికలు తీరి శ్రీమంతులు కావాలంటే మొదట మీరు తపస్వులు కావాలి. అర్పణ బుద్ధితో తపస్సంపనుడిగా అయితే మీకు అభివృద్ధి తనంతట తనే వస్తుంది. ఈ విద్య సాధనతో మానవ కళ్యాణం జరిగి సాధకులు శాంతిని పొందాలి. ఉత్తమ జీవన ప్రమాణాలను పాటించి మంచి పౌరులుగా, నిండు ఆరోగ్య వంతులుగా జీవించాలి. తనను తాను తెలుసుకొని జ్ఞానోత్తర కర్మలను ఆచరించాలి. ఇచ్ఛామరణి గా మారాలి. చాలా ఉపయోగ కరమైన జీవితం, పరిపుష్టితో నిండిన జీవితం, సర్వ సమృద్ధమైన జీవితం విశ్వం లో వ్యాప్తి కావాలి. దానికి నాంది తపో జీవన స్ధాపనం. అదే ఋష్యమూకాశ్రమం(అచ్యుతాశ్రమం) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1/12/2016
From: Venkatesh garu:
ప్రభూ! మన్ను మన్నంటుతానందిమిన్ను మిన్నంటుతానందిగాలి వీచిపోతానందిజలము ప్రళయమై లేస్తుందిదీపం కొండెక్కిపోతుందిమోహం వేయి చేతులు చాచివెర్రిగా ఏడ్చిందినాకెవరు బందువు? నాకు నేనెవరిని?? ప్రభూ..!పరుసవేది తగిలి ఇత్తడి పుత్తడైనట్లుమీ చేతి స్పర్శతో నేను చైతన్యమొందానువిశ్వమంతా నేనే విస్తరించానునాలోన మీరైతిరా!మీలోన నేనైతినా!ద్వైతమంతా పోయిఅద్వైతమయిందిఎంతెంత చిత్రమోఈ బ్రహ్మత్వము.!
1/15/2016
From: Uday Bhaskar Duvvuri:
Shree Achyutaashrama is a spiritual institution. KNOW THY SELF is the motif. Yogi Achyuta is the Divine power behind the present spiritual movement of Yoga-Vidyaa. The movement has two components: tattva and sadhana. By tattva is meant the right philosophical perception to be experienced directly. By saadhanaa is meant the practical method which takes one to the realisation of tattva. Thus tattva implies a knowing and a seeing aspect, andsaadhanaa implies a doing aspect. What one has to know, see and experience are praanan(the vital force) and aatman (the soul). It is the yoga-vidyaa that is to be done and practised so that we know, see and experience praanan and aatman. Praanan and aatman are co-reals and co-eternals. Yet,Praanan is jyestha (senior), while aatman is sreshta (the superior). Self realisation implies the actualisation of both praananand aatman. After this event and the next brahma saakshaatkaara (brahma-realisation), body becomes divine, life eternal. Paramapadavi (highest attainable state) and brahmatva (perpetually living in the divine and eternal state) shall be the ultimate goal. Man must go from here to eternity. Shree Achyutashrama is ready to render this divine service to mankind. (This is our web site’s first page- pl bear with me- I promise you that without translating into English I don’t post any Telugu version-ok?)
1/16/2016
From: Uday Bhaskar Duvvuri:
5. ఓంశ్రీఆదిదేవాయ అచ్యుతాయనమః
అచ్యుత యోగ విద్య అనేది కఠోపనిషత్తు లో ఆధ్యాత్మ విద్య పేరు తో చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీనినే శ్వేతాశ్వతరోపనిషత్తు లో ధ్యాన యోగము పేరుతో చెప్ప బడింది. నిజానికి ఈ యోగ విద్య పద్ధతి ఒకే ఒకటి. మనుష్యుని జీవితంతో పుట్టి నిశ్శబ్దంగా మనలో నడిచే క్రియ. మనుష్యుల ప్రవర్తన ఒకరి నుండి మరొకరికి తేడా ఉండొచ్చు. కాని అందరి మానవులలో ఉండే జీవ శక్తి ( life force) దాని యొక్క పరివర్తనా క్రమము ఒకేలా ఉంటాయి. యోగము అనేది ప్రతి ఒక్కరి ఆంతరంగిక ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. మన గురుదేవులు శ్రీ యోగి అచ్యుతులు ఒక అతి సామాన్యమైన పదం “జపం” అనే మాటను యోగ విద్య అనడానికి వాడారు. జపం అంటే జనో లోకము నుండి పృథివి వరకూ జరిగే వాయువు యొక్క గతి అని అర్ధం. అలాగే జపం అంటే వాయు మధనము లో ప్రాణ శక్తి యొక్క శబ్దము అని అర్ధం. ప్రాణాపాన గతులలో వాయువు పైన కింద గతులలో కదిలేప్పుడు వచ్చే శబ్దం. జపం అంటే యోగ విద్య లేదా ప్రాణ విద్య అని మాత్రమే యోగి అచ్యుతుల భావం. ఇది మంత్రజపం కాదు. ఇది యోగాభ్యాసం లో ప్రాథమిక దశ. అంటే వాయుమధనంతో మొదలయిన జపం నెమ్మదిగా తపస్సు గా మారుతుంది. చాందోగ్యోపనిషత్తులో ఘోర అంగీరసుడు దేవకీపుతృడైన శ్రీకృష్ణునకు ఈ విధంగా చెబుతాడు. “అక్షితమసి అచ్యుతమసి ప్రాణ సంస్ధిత మసి”. అని. క్రమశిక్షణ తో ప్రతిదినము త్రికాల సంధ్యలలోను యోగవిద్యను అభ్యసిస్తూ ఉండే ప్రతి వ్యక్తి అక్షయః, అచ్యుతః మరియు ప్రాణసంస్ధితులు గా మారుతారు. దీనికి గుర్తుగా పరమ పూజ్య శ్రీ యోగి అచ్యుతుల ప్రధమ శిష్యులు స్వామి విజయీంద్రులు ఈ విద్యకు ” అచ్యుత యోగవిద్య” అని పేరు పెట్టేరు. అచ్యుత అంటే చ్యుతి లేనిది; అక్షయ అంటే క్షయము లేనిది; ప్రాణ సంస్థితము అంటే బలవర్ధకమైన తేజోవంతమైన ప్రాణ శక్తి అని అర్ధం. (మనం చేసే జపానికి అచ్యుత యోగవిద్య అనే పేరు విజయేంద్రుల వల్ల వచ్చింది) (ఇక్కడ రాసిన ప్రతి అక్షరం అచ్యుతాశ్రమ సాహిత్యము, నాడగౌడు స్వామి గారి ఢిల్లీ లెక్చర్సు నుంచి తీసుకొన్నవే)
5. Om Sri Adidevaya Achyutayanamah
Achyut YogaVidya is almost nearer to the Adhyatma Vidya explained in Kathopanishad. Not only the above, the Dhyanayoga advocated in Swetaswataropanishad resembles our Achyuta yogavidya. In reality, the YogaVidya is one and only one. It starts from our birth and leads us silently throughout our life. The behaviour of individuals may be different from one to the other.But the life force and its activity will be same in all human beings. Yoga is entirely depends on the internal mechanism of individual behaviour of us. Our Lord yogi Achyuta used a very ordinary word “Japam “to denote Achyuta YogaVidya. Japa means the movement of Vayu from Janoloka to pridhvi.( that is from sahasraara to nabhi point). In the same way Japa denotes the sound of Pranan in the vayu madhana (in the churning of vayu). In other words the sound evolved when the vayu moves rythmatically up and down in the annavahika. The word Japa implies Yogavidya or pranavidya but it is in not manthra Japa- it is not repeated chanting of holy syllables.
Japa is the initial stage of yoga. The activity started with vayumadhana slowly turns into tapas. Ghora Angeerasa tells Devaki putra Sri Krishna in Chandogyopanishad”Akshitamasi, achyutamasi, prana sansthithamasi”. Everyday if the yoga is practised for three times with discipline every body will become akshayah, achyutah, prana sanstitah Achyutah means imperishable; akshayah means in-exhausting; prana sanstitah means full of prana Shakti – highly energising power In view of the above srimath swami Vijayendra, the first disciple of yogi Achyuta named our yoga Vidya as “Achyuta Yoga Vidya”.
1/17/2016
From: Uday Bhaskar Duvvuri:
ఈ రోజు సాయంత్రం అష్టమి వెళ్ళి నవమి వస్తూంది. అంటే బుధవారం ఏకాదశి. మరి మనం జపానికి ప్రిపరేషన్ మొదలు పెట్టాలికదా। అయినా already మనం జయంతి వరకూ రోజూ 90ని జపం చేయడానికి మొదలు పెట్టేము. దానిని continue చేయండి. సాధ్యమైనంత సాత్విక ఆహారం మితంగా తీసు కోండి. ఒక sittingలో 90ని కూర్చోలేని వాళ్ళు కనీసం రెండు జపాలు కలిపి 90ని అయ్యేట్లుగా చేయండి. జప డైరీ ఒక ఐదారుగురు కొన్ని రోజులు పంపేరు. మళ్ళీ ఈ మధ్య ఎవరినుంచీ డైరీ కాపీ రావటం లేదు. కొంచెం వీలు చేసుకొని డైరీ రాసి పంపండి. ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఆహార నియమాలు, జపం సరి చూచుకోండి.ప్రతి ఆదివారం అందరూ ఒకే టైము కి జపం మొదలు పెట్టాలి(ఎక్కడి వాళ్ళు అక్కడ చిన్న చిన్న గ్రూపులు గా). Strict గా 90 ని జపం గతాగతి సమయాలతో సహా synchronise చేద్దాం. ప్రయత్నం మనది. పైన స్వామి గారి దయ. ఏకాదశి నుంచి పౌర్ణమికి జపం స్థాయి పెంచడానికి సమయాన్ని ఉపయోగించండి
1/18/2016
From: Uday Bhaskar Duvvuri:
ప్రణవధ్వజ ఆరోహణం ఎందుకు చేస్తారు? దాని విశిష్టత ఏమిటి? అందరూ ప్రయత్నించి చెప్పండి. మీకు తెలియదని కాదు. ఒక సారి మళ్ళీ జ్ఞాపకం చేసుకొందాం. ప్రతి function కి, ట్రైనింగ్ క్లాసుల ముందర కూడా ప్రణవధ్వజం ఎగర వేస్తాము కదా? వెంకటేష్ టీచరు గారు, జయంత్, గోవర్ధనాచారి గారూ ప్లీజ్ చెప్పండి.
Replay from Venkatesh garu:
ఓం శ్రీ ప్రభు యోగి అచ్యుతాయనమ:ప్రణవద్వజారోహణ విశిష్టత గూర్చి నాకు నిజంగా (శాస్త్రీయంగ) తెలీదు.తెలుసుకోవలని చాలాసార్లు అనిపించినది కానీ, పెద్దల్ని అడగలేకపోయాను.ఇప్పుదు పెద్దలే నన్ను పేరు పెట్టి మరీ అడిగేసరికి నాకు చాలా విచిత్రమైన అనుభవంగా ఉంది. నా అభిప్రాయం మాత్రమే తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నను.పొరపాట్లను సరిచేసి వివరించగలరని ప్రార్ధిస్తున్నాను. భౌతికమైన ప్రతిక్రియ కూడా ఆంతరాంగిక భావనల ప్రతీకలయొక్క వ్యక్తీకరణలే. ద్వజమును చూస్తేఅది నాదేహమే అని నాకు అనిపిస్తుంది. ద్వజపు దిమ్మే మూలాధారంగాను పోలు వెన్నెముకగాను, త్రాడు వెన్నుపాముగాను పతాకం శ్వేచ్చగా వికసితమైన సహస్రార చక్రంగాను నాకు అనిపిస్తుంది.సత్యం ప్రకటించబడాలీ అంటె దేహంలోని మూలాధారంలోని నిద్రాణమైన మూలశక్తి కదిలి నెన్నుపాము ద్వారా పయనించి సహస్రాన్ని చేరి స్వేచ్చగా ప్రకటితమవుతుంది. మన ఆశ్రమం లో జరిగే కార్యక్రమాల్లో ప్రతిసారి ముందుగ ఈ ద్వజరొహణను ఇక్కడ సత్యాన్నిప్రకటించుట ప్రారంభిస్తున్నము ఈ ద్వజము ఇక్కడ ఎత్తిఉంచినంతవరకు సత్యం ప్రకటించబడుతుంది.అందరూ వచ్చి స్వీకరించండి అని తెలుపుటకే (నిన్ను నీవు తెలుసుకోవడానికే) నిర్వహిస్తున్నామని నేను భావిస్తున్నను.సత్యమును తెలుసుకొనుటకు ప్రణవమే మార్గమని సూచిస్తూ ప్రణవ నాదముతో కూడిన శాంతి మంత్రాలు పఠిస్తూ ఈ కార్యక్రమమును ముందుకు సాగిస్తాము.సత్యం ప్రకటించబడటం పూర్తి అయిన తర్వాత సహస్రారములోని మూలశక్తి నెమ్మదిగా తిరిగి మూలాధారమును చేరుటకు ప్రతీకగా ద్వజమును నెమ్మదిగా అవనతము చేస్తాము. దీనితో మన కార్యక్రమమును ముగిస్తాము.
ఓం శాంతి: శాంతి: శాంతి:
కొంగల.వెంకటేష్
గంపలగూడెం.
1/19/2016
From: Uday Bhaskar Duvvuri:
వెంకటేష్ గారూ । మీరు ధన్యులండి. ఇంతటి ఉన్నతమైన భావనలతో వాతావరణాన్నే పవిత్రంగా మార్చేసేరు. మీరు ఇచ్చిన వివరణ చాలా సహజంగా నూతనంగా ఉంది. ప్రణవ ధ్వజారోహణ అవరోహణ: ఈ రోజు నుంచి యోగి అచ్యుతుల శిష్యులు ఇక్కడకు జయంతి కార్యక్రమాన్ని జరుపుకుందామని చేరేరు, చేరుతున్నారు. దేశం లో నలు మూలలనుంచి స్త్రీ బాలవృద్ధులు సాధకులు, శిష్యులు భక్తులు దూరభారాలకు ఓర్చుకొని భక్తితో, ప్రేమతో జయంతి కార్యక్రమాల్లో పాల్గొని మానసిక సంతృప్తిని, జపం లో అభివృద్ధిని పొందాలని చేరుతున్నారు. పంచ భూతాలకు, వేల సంవత్స రాలనుంచి ఈ భూమిని, ఋష్యమూక పర్వతాలను నమ్ముకొని ఉన్న అనేక శక్తులకు, భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకిణీ శక్తులకు, యక్ష కిన్నెర గంధర్వ చారుణులకు ఈ ప్రణవ ధ్వజం ఒక సంకేతం. ఒక చేతావని. ఒక హెచ్చరిక. ఈ ఆశ్రమ ప్రదేశం లో ఈ ధ్వజం ఎప్పటి వరకూ ఎగురుతూ ఉంటుందో అప్పటి వరకూ యోగి అచ్యుతుల శిష్యులకు ఏరకమైన అసౌకర్యం, ఆపద కలగ కుండా ప్రశాంతమైన చక్కని వాతావరణాన్ని కలిగించండి అనే విన్నపం. వీరిని కంటికి రెప్పగా కాపాడుతూ ఆహ్లాదకరంగా తిరిగి వీరందరూ వారి వారి ఇళ్ళకు బయలు దేరే వరకూ మీదే భాద్యత. సాధకులకందరకూ ఆశ్రమంలో ఉన్నంత వరకూ ఇది శ్రీ అచ్యుతుల రక్షణ కవచం. అందుకే జయంతి సమయం లోను, ట్రైనింగ్ సమయం లోనూ సాధకులు ఆశ్రమ ఎల్లలు దాటి బయటకు పోరాదని నియమం. ప్రణవ ధ్వజ ఆరోహణం తో మనం అందరం అక్కడ దీక్ష లో ఉన్నట్లు లెక్క. దీక్ష లో ఉన్న వాళ్ళు మానసిక, శారీరక పవిత్రత తో ఉంటూ శుచిని శుభ్రతను, క్రమ శిక్షణను పాటించడం వారి కర్తవ్యం.
1/19/2016
From: Ramakrishna
మనస్సు కు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వకండి. మనస్సు అంత దౌర్భాగ్యమైన మరియు ప్రధాన్యత లేని వ్యర్తమైన వస్తువు కానీ భావన కానీ ఎప్పుడు నీ జ్ఞానము నాకు అడ్డు కానివ్వకు. మనస్సు నీతో పుట్టినది కాదు ఇది వక పరాన్నజీవి . ఈ విషయం ఎప్పుడు మరవవద్దు అచ్యుత సాదకులార. మనస్సు జ్ఞాన సముపార్జనకు అవరోధ వస్తువు . మనస్సుకు రంగు రుచి వాసనా స్వయంగాలేవు కాని జ్ఞాన ము సంపాదించిన రంగు, రుచి వాసనలను జ్ఞానము ప్రకటించే లోపే నేను అని వచ్చే మాయ మనస్సు. ని మనస్సు నీకు ఎప్పుడు శత్రువే .అచ్యుత సాధకుడు ఎప్పుడు మనస్సు బ్రాన్తిలో పడదు. సాధనలో మనస్సుని చిదిమివేసి జ్ఞాన ద్రుష్టి తో అక్కడ ఆసనము అంటే గురు స్తానమందు ఆసనం వేయటం అని తెలుసుకోండి.అచ్యుత స్వామి నిగుదమఎన బ్రహ్మ విద్యనూ అందరికి సులభ మార్గములో ప్రాక్టికల్ గ ప్రసాదించిన దానికి సర్వత్ర బ్రహ్మ చర్యంతో అనగా నిరంతరం గురు స్తానంలో బ్రాహ్మి జ్ఞాన ము తో నిరంతరం రామించేది ఈ అచ్యుత్ విద్య.
జ్ఞాన సంపద కు కొలమానం లేదు . మీకు నిజమనిపించినది వేరే వారు ఒప్పుకోకపోవత్చు అల అని అది తప్పు అని అనరాదు. పక్వత అపరి పరిపక్వత అనే దాన్ని మాత్రమే కొలమనం గ తీసుకోవాలి . యోగి అచ్యుతులవరి తత్వాన్ని చులకన గ చూడ లేము ఈ తత్వమూ మాటలతో వివరించ లేనిది భావనలతో చెప్పలేనిది అందుకే నెను చాలాసార్లు చెపుతుంటాను దర్శనం కలిగినద అని దర్శించినవారు అచ్యుతల వారి కృప పా త్రులయే వుంటారు . దర్శనానికి మూలహేతువు అచ్యుతులవారి మనో చూపు వాయు మిలనము జరిగిన దని రుజువు నీవు సరి ఐన దారిలో వున్నవనే తానికి ఋజువు. అచ్యుట స్వమి వో గొప్ప యోగి. యీజన్మలో ఆ స్వామీ మార్గంలో వున్నాము అని చెప్పు కునే దాని కంటే అదృష్టం ఈ జన్మకు చాలు.వోపిక ledu15 రోజుల క్రితం ఫుడ్ పాయిసన్ ఐనది వేళ్ళు టైపు చేయటానికి కూడా సహకరించ టం లెదు.అచ్యుతులవారే ప్రేరణ. సరి ఇన దరి చేర్చేవాడే అచ్యుతులవారు గ్రహించండి .ఇగో వద్దు వాస్తవాలతో మక్కి కి మక్కి అచ్యుత తత్వన్ని సాధకులకు చేరుద్దాము
రామకృష్ణ వడ్డేపల్లి,
హైదరబాద్.