శాంతి మంత్రములు

Last updated: Jan 23rd 2016

ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

సమస్త వ్యక్తుల లోను, పరిసర వాతావరణం లోను ప్రతి రోజు కలిగే కాలుష్యాన్ని (మానసిక ఆందోళన, అశాంతి) నిర్మూలించి ప్రశాంతతను నెలకొల్పేటందుకు, ఆహ్లాద కరమైన మానసిక స్థితిని,శాంతిని పొందేటందుకు కూర్చిన పద సముదాయ మే శాంతి మంత్రాలు.

రోజంతా బాహ్య వ్యవహారములతో అల్లకల్లోలం అయిన మనసును కుదుట పఱచి అంతర్ముఖము గా ధ్యానానికి అనువు గా చేసికోవడానికి తోడ్పడే శబ్ద సముదాయమే శాంతిమంత్రాలు.

ఉపనిషదృషులు తమ సాధనా అనుభవాన్ని ఈ మంత్ర రూపాలలో పొందు పరచేరు.

ధ్యానానికే కాదు, భార్య, భర్త, తల్లి తండ్రులు, పిల్లల మధ్య సామరస్య వాతా వరణాన్ని కలగ చేయడానికి తోడ్పడతాయి ఈ మహిమాన్వితమైన వేద మంత్రాలు.

వీటిని తగినంత కంఠ ధ్వని తో పఠించాలి. శాంతి మంత్ర పఠనం వల్ల వాతావరణ శుద్ధి జరగడమే కాకుండా, వాయుమండలం లో చేరిన ఈ శాంతి మంత్ర శబ్ద సముదాయము వ్యక్తులలో ప్రవేశించి, వాళ్ళలో భావ ప్రచోదనము చేయడానికి సన్మార్గం లో(positive thinking) ఆలోచించడానికి దోహద పడతాయి.

వీటిని స్పష్ఠముగా, నిదానముగా, స్వచ్ఛముగా ఏకాగ్రత కలిగిన మనస్సుతో చదవాలి.

ఇక్కడ వివరించే శాంతి మంత్రాల కూర్పు, అర్ధము, వివరణ బ్రహ్మ విద్యా సాధకులకు సాధనాను క్రమం లో సాధన పరంగా ఉపయోగ పడేటట్లు ఇవ్వబడుతున్నాయి.

సాధకులు సాయం సంధ్యా సమయం లో యోగాభ్యాసం మొదలు పెట్టే ముందు స్ధిరాసనం లో కూర్చొని నిదానముగా శాంతి మంత్రాలు ఉచ్ఛరించినపుడు బహిర్ముఖంగా ఉండే మనసు అంతర్ముఖము గా అవ్వడానికి తోడ్పడతాయి. శాంతి మంత్ర పఠనం ప్రాణ శక్తి ని సక్రమమైన ఆయామం లోకి తెచ్చి యోగాభ్యాసానికి అనువు గా తయారు చేస్తాయి.

ఉదయం బ్రహ్మీముహూర్తం లో (అంటే 3.45a m) లేచి యోగాభ్యాసం 6.00 గం వరకూ చేసిన తర్వాత శాంతి మంత్ర పఠనం మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే యోగాభ్యాసం వల్ల సుద్ధి అయిన శరీరము, మనస్సుల తో పఠించిన మంత్రాలు పరిసరాలకు అక్కడ ఉండే వ్యక్తులకు చాలా మేలు చేస్తాయి.

4. ఓంశ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

శాంతిమంత్రాలు:

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

ఓంశ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః॥

మనలో అంతర్గతంగా ఈ విశ్వము ద్వారా ఉద్భవించే త్రివిధ తాపాలను నశింప జేసుకొని శాంతిని పొందేటందుకు ఆ పరాత్పరుని ప్రార్ధిస్తున్నాము.

తాపత్రయములు ఆధి భౌతిక, ఆధిదైవిక మరియు ఆధ్యాత్మికములు.

1.ఆధి భౌతిక తాపత్రయములు: మన కంటే ఇతరులైన దారాపుత్రాదులు, ఇరుగు పొరుగు వారు, దొంగలు, ఇతర ప్రాణులు- కుక్కలు, ఇతర జంతువుల వలన కలుగు తాపములు.

2.ఆధి దైవిక తాపత్రయములు: పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్-భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ల ద్వారా-ప్రకృతి శక్తులద్వారా వాటిల్లే క్లేశాలు.(భూకంపము, వర్షము, పిడుగుపాటు మొ॥)

3.ఆధ్యాత్మిక తాపత్రయములు: మనవలననే మనకు కలిగే తాపాలు- శారీరిక రుగ్మతలు, మానసిక సమస్యలు మొదలయినవి.

పైన చెప్పిన మూడు విధములైన తాపాలనుంచి ఉపశమనము పొందేటందుకు ఆ పరాత్పరుని వేడుకోవడమే ముమ్మారు శాంతి ప్రవచనము.
ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః:

ఆ పరశ్రేష్ఠుడు అంటే మూల చేతనము యొక్క స్పందన వల్లే రూపాన్ని పొందిన ఆది పురుషుడు ఈ విశ్వానికి ఆది దేవుడయ్యాడు. అట్టి చ్యుతి లేని అచ్యుతునకు మా నమస్కారములు.

సర్వమూ శాంతి మయమగు గాక॥

ఇక్కడ నుంచి పది సూత్రాలు- కొన్ని బ్రహ్మ సూత్రాలనుంచి, మిగిలినవి తనదైన శైలి లో కొన్ని సూత్రాలను బ్రహ్మ విద్యాభ్యాస క్రమాన్ననుసరించి పొందుపరచేరు.

5. ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

శాంతిమంత్రాలు:

మొదటి సూత్రం:

“ఓం తత్సత్ శాంతిః ఓం।”

భగవద్గీత లో శ్రద్ధాత్రయ విభాగయోగం లో 23వ శ్లోకం లో “ఓం తత్సత్ ఇతి నిర్దేశో” – పరమాత్మకు గల పేర్లలో ఓమ్, తత్, సత్ అను మూడు పేర్లు ప్రధానమైనవని వేదాలలో ఉంది.

“ఓం” అంటూ బ్రహ్మ వాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యము యజ్ఞ దాన తపః కర్మలు చేయబడతాయి.

“తత్” అంటూ మోక్షాన్ని కాంక్షించే వారు ఫలం ఆశించకుండా వివిధ తపస్సులూ చేస్తూంటారు.

“సత్”అనే పదాన్ని పరమ సత్యానికి మంచితనానికి ప్రయోగిస్తారు.-యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండటాన్ని సత్ అని చెప్పబడుతుంది.

సర్వమునకు మూలమైన పరశ్రేష్ఠుడు ఎల్లప్పుడు శాంతి యందు సంస్తితుడై ఉంటాడు. శాంతి యే అతని సహజ స్ధితి. కాబట్టి అటువంటి శాంతి స్థితి ని పొంది ఆ పరబ్రహ్మను దర్శించాలి. ఆ శాంతిని ప్రణవోపాసన మూలము గా మాత్రమే పొందగలము.

రెండవ సూత్రం:

“ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం।”-

ఆ ప్రణవోపాసనా క్రమాన్ని తెలుసుకొని అభ్యసించాలంటే అనుభవజ్ఞుడు అయిన గురువే శరణ్యము. ఆ గురువుకు నమస్కారము.  శాంతికి సోపానమైన ప్రణవోపాసన ప్రాణుని వల్లనే సాధ్యము.  అందువల్ల మనకు ప్రాణుడే గురువు.

మూడవ సూత్రం:

“ఓం హరిః ఓం।”

ఆ ప్రాణ శక్తి విశ్వ వ్యాపియై సర్వమునకు సూత్రము వలె ఉంది. “విశాల వ్యాప్తిః విష్ణుః”అ నే అర్ధం వల్ల విశ్వ వ్యాప్తి యైన ప్రాణ శక్తి యే హరి.  అట్టి ప్రాణ చేతనము ను ప్రణవము ద్వారానే చేరవలసి యున్నది  కనుక ప్రాణ శక్తికి హరి యే కేంద్రం అని చెప్ప బడుతుంది.

5.ఓంశ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః

       శాంతిమంత్రాలు:

మొదటి సూత్రం:

"ఓం తత్సత్ శాంతిః ఓం।"

భగవద్గీత లో శ్రద్ధాత్రయ విభాగయోగం లో 23వ శ్లోకం లో "ఓం తత్సత్ ఇతి నిర్దేశో" - పరమాత్మకు గల పేర్లలో ఓమ్, తత్, సత్ అను మూడు పేర్లు ప్రధానమైనవని వేదాలలో ఉంది. 

"ఓం" అంటూ బ్రహ్మ వాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యము యజ్ఞ దాన తపః కర్మలు చేయబడతాయి. 

"తత్" అంటూ మోక్షాన్ని కాంక్షించే వారు ఫలం ఆశించకుండా వివిధ తపస్సులూ చేస్తూంటారు.

"సత్"అనే పదాన్ని పరమ సత్యానికి మంచితనానికి ప్రయోగిస్తారు.-యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండటాన్ని సత్ అని చెప్పబడుతుంది.

సర్వమునకు మూలమైన పరశ్రేష్ఠుడు ఎల్లప్పుడు శాంతి యందు సంస్తితుడై ఉంటాడు. శాంతి యే అతని సహజ స్ధితి. కాబట్టి అటువంటి శాంతి స్థితి ని పొంది ఆ పరబ్రహ్మను దర్శించాలి. ఆ శాంతిని ప్రణవోపాసన మూలము గా మాత్రమే పొందగలము.

రెండవ సూత్రం:

"ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం।"-

ఆ ప్రణవోపాసనా క్రమాన్ని తెలుసుకొని అభ్యసించాలంటే అనుభవజ్ఞుడు అయిన గురువే శరణ్యము. ఆ గురువుకు నమస్కారము.   శాంతికి సోపానమైన ప్రణవోపాసన ప్రాణుని వల్లనే సాధ్యము.  అందువల్ల మనకు ప్రాణుడే గురువు. 

మూడవ సూత్రం:

"ఓం హరిః ఓం।"

ఆ ప్రాణ శక్తి విశ్వ వ్యాపియై సర్వమునకు సూత్రము వలె ఉంది. "విశాల వ్యాప్తిః విష్ణుః"అ నే అర్ధం వల్ల విశ్వ వ్యాప్తి యైన ప్రాణ శక్తి యే హరి.  అట్టి ప్రాణ చేతనము ను ప్రణవము ద్వారానే చేరవలసి యున్నది  కనుక ప్రాణ శక్తికి హరి యే కేంద్రం అని చెప్ప బడుతుంది.

6. ఓంశ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః
                  శాంతిమంత్రాలు:

నాల్గవ సూత్రం:

ఓం శివాయనమః ఓం।

సర్వ వ్యాపి అయిన ఆ  చేతనము (ప్రాణ శక్తి) ఎల్లప్పుడు శాంతి ధామము, మంగళకరము అయి మరొక రూపము లో  అంటే మనస్సు గా సర్వ భూతముల లోను  నెలకొని ఉంది.   ఆ మనస్సునకు అభిమాన దేవత అయిన శివునకు నమస్కారము.  

ఐదవ సూత్రం:

ఓం ఆత్మ సర్వోత్తమః ఓం।

ప్రాణము - మనస్సు అనే రెండు శక్తులద్వారా మన దేహము లో ఏ చేతనమైతే లీలామయము గా పని చేస్తోందో దానినే ఆత్మ గా గుర్తించారు. ఈ ఆత్మ ఆ పరమాత్ముని ప్రతినిధి గా లేక ప్రతిబింబం గా మనలో నెలకొని ఉంది. ఈ ఆత్మ సర్వ శ్రేష్ఠమైనది.  అటువంటి సర్వోత్తమమైన ఆత్మ నే శరణు పొందినచో సస్వరూప జ్ఞానము పొందుట సాధ్యము. ప్రాణ మనో మిలనము ను ప్రధమ యోగమని ( ప్రాణ ప్రతిష్ఠ జరిగినదని);  ప్రాణము ఆత్మల కలయికను యోగమని వ్యాఖ్యానించేరు.

ఉపనిషత్తులు, వేదములు ప్రాణుని "జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః" అని కొనియాడితే సృష్టి లో ప్రప్రధమంగా నెలకొని ఉండడం వల్ల ప్రాణుని జ్యేష్ఠుడన వచ్చు కాని శ్రేష్ఠత్వము మాత్రము ఆత్మకే అంటారు యోగి అచ్యుతులు. 

ముండకోపనిషత్ అంటుంది ఆత్మను 'సర్వజ్ఞః, సర్వ విద్యశ్యైష మహిమాభువిః, దివ్యే బ్రహ్మ పురే హేషవ్యోమ్న్యాత్మా ప్రతిష్ఠతః' అని.

ఈ కూటస్ధ ఆత్మ స్వయం ప్రకాశ ధర్మంకల సత్ పదార్ధము. ఇది నిత్యమైనది.    అయినా ఈ శరీరం లో ఉండగా ఆత్మాభాసం తో పని చేసే అంతఃకరణ భాగమైన 'అహంకారం'  గా ఆజన్మాంతం మారదు. నేను నేను గానే వ్యక్తమవుతుంది. నేను అనే భావనకు అవస్ధాభేదం ఉండదు. అంటే అది వయసుతో మారేది కాదు.

7.ఓంశ్రీ ఆది దేవాయ అచ్యుతాయనమః
                  శాంతిమంత్రాలు:
ఆరవ సూత్రం:

ఓం వాయు జీవోత్తమః ఓం।

ప్రాణమున్న సర్వ జీవులయొక్క , సర్వ మానవులయొక్క ఉత్తమ గతికి వాయువే ఆధారము.ప్రాణానికి కావలసిన పోషకాంశం(అశనము) వాయుమధనం ద్వారానే పొందాలి.  మనస్సు యొక్క చంచలత్వాన్ని తొలగించి అనంతముఖి గా ఉండే మనస్సును ఏకోన్ముఖంగా మార్చుకోవడానికి, అంతర్ముఖతను పొంది జ్ఞానోదయాన్ని, ఆనందానుభవా న్ని పొందాలంటే వాయుమధనము ద్వారానేసాధ్యము.  అందువల్ల మానవులకు వాయువే ఉత్తమమైనది.

"ఆత్మన ఏష ప్రాణో జాయతే।
ఆత్మ నుంచి ప్రాణము ఉద్భవిస్తే 

ప్రాణాద్వాయురజాయత।"
ఆ ప్రాణము నుండే పుట్టిందీ వాయువు.

సమసంబంధ సామ్యంలో ఉంటూ ఈ శరీరాన్ని సక్రమంగా పని చేసేట్లుగా చూసుకొంటున్నాయి ఇవి రెండూ.

అందుకే తైత్తిరీయోపనిషత్తు లో 

"నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి।।"

ఓ వాయుదేవా ఇవే మా నమస్కృతులు. మా జీవులకందరకూ నీవే ప్రత్యక్ష బ్రహ్మవి. ఈ మాటలు నిన్ను పొగడడానికి అన్న మాటలు కాదయ్యా. 

ఈ భూగ్రహం మీద మా మనుగడకు ఆధారమైన నిన్ను ప్రత్యక్ష బ్రహ్మ గా మనసా వాచా కర్మణా అంగీకరిస్తున్నాము.

శుభం స్వస్తి
ఉదయ భాస్కర్ దువ్వూరి

Japa Sadhana – Blog

%d bloggers like this: