Sadhana Tips(1) – by R.B. Satyanarayana

Last updated: May 10th 2016

Shree R.B. Satyanarayana, Chairman Annadhara

3/6/2016

1) కైలాసము పెద్దది కాదు దేహము పెద్దది.
2) ధర్మము పెద్దది కాదు దయ పెద్దది.
3) శిక్షణ పెద్దది కాదు ఆచారము పెద్దది.
4) అధికారము పెద్దదికాదు  అభిమానము పెద్దది.
5) ఆస్తి పెద్దదికాదు  ఆరోగ్యము పెద్దది.
6) సన్మానం పెద్దదికాదు సంస్కారము పెద్దది.
7) డబ్బులు పెద్దదికాదు గుణము పెద్దది.
8) ఇల్లు పెద్దది కాదు మనస్సు పెద్దది.
9) విద్య పెద్దదికాదు.అనుభము పెద్దది.

సాధకులకు మనవి. ఈ యూనిట్ ద్వార అందరమూ రోజు ఒక కొత్త విషయాలు తత్వానికి సంబందించినవి నేర్చుకుందా ము తెలిసినవారిద్వారా.మీకు ఇష్టమైతే  చెప్పండి.మనము ఉదయ భాస్కర్ లాంటి మహానుభావులు మన గ్రూపులో చాలా మంది వున్నారు.ప్రాక్టికల్ గ జపము చేస్తున్న అనుభవాలు పొందుతున్నవారు.వున్నారు వారి అనుభవాలను మనము తత్వభద్ధంగా నిర్ధారణ చేసుకొని ముందుకు పొతే మంచిదేమో అని నాకు అని పిస్తున్నది మీ అభిప్రాయాలను తెలుపుతారని మనసారా కోరుకుంటున్నాను .పెద్దలు తగు సలహాలు ఇస్తూ ఈ గ్రూపును తత్వ బద్దంగా నడుపుతారని ఈర్షా ద్వేషులకు పోకుండా  అందరమూ నేర్చుకునే సాదకులుగా.విజ్ఞాన వంతమైన గ్రూపుగా తీర్చిదిద్దుకుందా ము దీనిపై అందరు స్పందించాలని కోరుకుంటున్నాను .కొత్తవారికి నేర్చుకునే అవకాశము కలిపించాలని వికల్పము రాకుండా చూడాలని మనసారకోరుకుంటున్నాను.ఒక వేల తప్పుగా వ్రాస్తే పెద్ద హృదయముతో క్చేమించుతారని వేడుకుంటున్నాను.

నా ప్రశ్న

సాధకుడు జపములో వెనుకపడటాని కారణము ఏమి?

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

Reply by: Sunil Bonagiri

నా ఉద్దేశములో జప సాధనలో వెనుకబడటానికి ముఖ్య కారణాలు 1. మిగతా విషయాలకు ఎక్కవ ప్రాధాన్యమిస్తూ  జపానికి తక్కువ సమయము కేటాయించడం (giving lower priority to Japa). 2. జపము చేస్తున్నప్పుడు మనస్సు విముకత చెంది జప త్రుప్తి లభించక చిన్నగా సాధనలో వెనుకబడుట  3. పూర్తిగా జపములో లీనమవ్వలేకేపోవడం, మొక్కుబడిగా చెయ్యడం.

3/7/2016

From: Venkateshamu

అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మీరు అడిగిన ప్రశ్నకు చాలామంది జవాబులుగా వారివారి అభిపాయాల్ని  తెలియజేసినారు.

నన్నూ అడిగినారు కనుక  నా అభిప్రాయము కూడా తెలియజేస్తున్నాను.ఇది కేవలం నా అభిప్రాయం  మాత్రమే. ప్రామాణికమును పెద్దలే చెప్పండి.

ఆకాశంలో కనిపించే మేఘమంతా వర్షించదు, చెట్టుకు పూసిన పూత అంతా ఫలించదు.ఇది సహజమే కదా! అలాగే ఉపదేశమును పొందినవారందరూ ఉన్నతిని పొందలేకపోవచ్చును.  బ్రహ్మవిద్యను పొందేవారు లోకంలో చాలా అరుదని, వారిలో ఏ ఒక్కరో అరుదుగా ఉన్నతిని సాధించగలుగుతారని గీతలోనే చెప్పబడినది కదా! అందుకేనేమో మనలో అనేకమందిమి  సాధనలో గొప్పస్థితిని పొందలేకపోతున్నమేమో.

అయినా మన తండ్రి (ప్రభు యోగి అచ్యుతులు) గొప్ప వ్యవసాయకుడు కదా! వారు విత్తిన ప్రతి విత్తనం అంకురించి, పెరిగి పెద్దదై ఫలించాలనే కోరుకొంటారు.అందుకు అవసరమైన పోషణ, రక్షణ వారే స్వయంగాచూస్తుంటారు.

*మనము కూడా  బుద్దిమంతులమైన వారి పిల్లలుగా భక్తి శ్రద్దలతో విద్యపట్ల దీక్షా పట్టుదలలతో ముందుకు సాగాలి.

*ఆశ్రమపెద్దలతో సత్సాంగత్యమును ఎడతెగక కొనసాగించాలి.

*సాధనాభివృద్ధికి ఉపదేశకులు, పెద్దలు వెళ్ళవేళలా సాధకుల్ని ప్రొత్సహిస్తూ ముందుకు నడపాలి.

*  పట్టు పట్టరాదు పట్టి విడువరాదు

పట్టెనేని బిగియ పట్టవలెను

పట్టి విడుచుటకన్న పరగజచ్చుట మేలు

విశ్వధాభిరామ వినుర వేమ.

***  తత్వదిగ్విజయ ప్రప్తిరస్తు***

ఓం శాంతి: శాంతి: శాతి:

– వెంకటేష్ కొంగల.

3/19/2016

From: R.B Satyanarayana

సాధకులకు మనవి …….ముఖ్య గమనిక …….  ఎవరు ఏమీ వ్రాసిన మీరు respond కావాలి మీలోని ఆలోచనలను పంచుకోవాలి .కనీసము తత్వానికి సంబందిచిన .జపముకు సంబందించిన విషయాలపై కూడా మీరు స్పందించినది తక్కువ ఈవేదిక ద్వార మనము తెలుసుకోవాలి .ఇతరులకు తెలుపాలి మీరు అందరు గొప్ప వారు అన్ని విషయాలు మీకు తెలుసు .తెలిసి కూడా మీరు చెప్పకపోవడము ధర్మము కాదు .ఎవరో వ్రాస్తారు అది చూసి ప్రక్కకు పెట్టుతారు మనకెందుకులే అనుకోకూడదు .ఆల్ ఆల్ ఈక్వల్ .మీ లాంటి పెద్దలు స్పందించడము వల్లా మా లాంటి చిన్నవారికి ఉపయోగపడుతుంది .అని మరవకూడదు .మీలోని అభిప్తాయలను అందరితో పంచుకుంటారని మనవి చేస్తున్నాను అనేక జపముకు సంబంచిన విషయాలు తెలుపుతారని పెద్దలయిన ఉపదేశకులనూ కోరుతున్నాను .దానిపై మీరు స్పందించాలని సాధకులను కోరుతున్నాను .ఈవేధికలో అందరు సాధకులు వున్నారు ఒకరి అభిప్రాయాలను ఒకరూపంచుకుందాము విమర్శనాత్మకంగా కాకుండా ఎడ్యుకేటు అయ్యేవిధంగా జప పురోగతికి తోడ్పడే విధంగా మనము మాట్లాడుకుందాము అని నా అభిప్రాయము .ఈ చిన్నవాని కోర్కె తీరుస్తారని .దీనిపై స్పందించి మీ అభిప్రాయాలను తెలుపుతారని మనసారా కోరుకుంటున్నాను .నమస్తే

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

3/21/2016

From: R.B Satyanarayana

తొందరగా దొరికేది ఏదైనా

ఎక్కువకాలం మన్నికరాదు

ఎక్కువకాలం మన్నిక

వచ్చేది అంతతొందరగా

దొరకదు

3/24/2016

From: రామారావు గారు

భూషయ్య సార్ నమస్కారాలు🔔కొండ నాలుక అని చెప్పియుంటిరి కాని వివరణ ఇవ్వగలరు

Reply by: Bushaiah

ఆగమార్తంతు దేవానాం

గమనార్తంతు రాక్షసాం

కురు గంటారవం

తత్ర దేవతాహ్వాన లాంచనం.

ఎవరైతే ఈ గంటానాధము దేవాలయము లోకి వెళ్ళి చేస్తారో,ఆ గంటానాధము ద్వారా దేవతలను ఆహ్వానిస్తున్నట్లు,రాక్షసులు వెళ్ళి పోతారని ఆ మంత్రార్థాన్ని పురోహితులు మనకు ప్రభోధిస్తారు ” అది స్థూలము”

అదే దేవాలయము మనలోనే ఉన్నదని తెలిపే సింబాలికే, ఈ దేవాలయం. Shastralalo చెప్పబడిన ” దివ్యే బ్రహ్మపురే! హ్యేష వ్యోమ్నాత్మా ప్రతిష్ఠిత:”  అనేదానిని మన పూర్వీకులు తెలిపిన ప్రకారముగా  గోచరమౌతుంది.దాని భాగంగానే ఈ స్థూల దేవాలయములో కూడా ఆత్మ అనే లింగాన్ని ప్రతిష్ఠించ బడింది. ఆ లింగానికి ఎదురుగా ఉండబడిన నందీశ్వరుడే మనలో ఉన్న ప్రాణశక్తి . లింగానికి నందికి మధ్యన ఉండబడే ఆ స్థూలగంటయే మనలో కిరు నాలుక (కో్ండనాలుక) ప్రాంతమే గంటాకరములో ఉండబడిన ఆ గంట

స్థూలస్థితిలో  దేవతలను ఆహ్వానించడం కోసమే ఆ గంటానాదము చేస్తారు ఆ నాదము ద్వారా రాక్షసులు వెళ్ళిపోతారని ప్రబల విశ్వాసము. అదే మాదిరిగా మన దేహములో సూక్ష్మస్థితిలో ఉన్న గంటను ప్రణవనాదము ద్వారా  కో్ట్టడంవల్ల మనలో ఉన్న రాక్షసత్వము,అజ్ఞానము,తమెాగుణము మెుదలగు లక్షణాలన్ని పోయి దైవత్వ లక్షణాలు మనకు గోచరిస్తాయి.ఆ గోచరించడం దానినే దైవదర్శనం అయ్యిందని స్థూలములో కాని సూక్ష్మములో కాని అంటారు

ఈ దేవాలయములో గంటకు ఎంత ప్రాధాన్యత ఉందో!  ప్రతి భక్తుడు దేవాలయములోకి అడుగు పెట్టగానే మెుదటగా చేసేపని ఆ గంటానాదమే

అలాగే ఈ దేవాలయములో

దేహో దేవాలయ: ప్రోక్తోజీవోదేవస్సనాతన:

త్యజేదాజ్ఞాన నిర్మాలయం సోహం భావేన పూజయేత్.

అను ఆర్మోక్తి ప్రకారముగా ఈ దేవాలయములో సోహం అనే దానితో గంటానాదము ప్రప్రధమంగా చేయాలి

అందుకే స్థూలములో కాని సూక్ష్మములో కాని ఈ గంటకు అంత ప్రాధాన్యత ఉన్నది ఇది బ్రహ్మవిద్యలో కో్నసాగు సాధకులకు త్వరగా అవగతమౌతుంది.

3/25/2016

From: Prasad Guntur

కౌపీనము మరియు బ్రహ్మ ముడి వీటి యొక్క విశిష్టత తెలుపగలరు

From: Bushaiah

జపము చేయునప్పుడు మనము ఆచరించవలసిన ఉత్తమ మైన మార్గమేమనగా, మూడు సూక్ష్మాలను కలిపి నాల్గవ సూక్ష్మమైన ఆత్మను చేరుకోవటం ఉత్తమమైనది

From: Prasad Guntur

మూడు సూక్ష్మలను  వివరించగలరు

3/26/2016

From: R.B Satyanarayana

దైవ స్వరూపులయిన .తత్వ జ్ఞానసముపార్జున  కోసము ప్రయత్నమూ చేస్తూ బ్రహ్మ విద్యలో కొనసాగుతున్న సాధకులకు ఒక విజ్ఞాపన ……….మీరు అందరు ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించి సాధకులకు ఆదర్శ ముగా నిలిచిన మీకు నా నమో వాక్కులు ……….1) ఈ వేదిక సత్యవంత మైనది,ఆనాదిగా , ఆదివిద్య యై సనాతన మై,ఆది దేవుని ద్వారా విద్య లభించిన సంగతి మీ అందరికి తెలిసు ,2)  సూక్మ స్థితిలో వున్న ఆ achuyuta స్వామి గారు మనము వ్రాయు వాటిని చూస్తుంటారు ,అనునది మరవకూడదు ,సత్యవంతమయిన  ఈవిద్యను స్థూలము తో పాటు సూక్మ స్థితిలోవున్న మహానుభాహులు ఎందరో పరిశీలిస్తుంటారు ,కావున మనము సత్య దూరమయినవి వ్రాయకూడదు .అచ్యుత తత్వాన్ని కి విరుద్దంగా వ్రాయకూడదు ,3)సమాజములో ఎన్నోరకాల విభిన్న దుక్పధాలతో సాహిత్యము ఉన్నాది అది మనకు ప్రామాణికం కాదు .మనము విద్యలో కొనసాగుతున్న అనుభవము వేరు అది విద్యకు దగ్గరగా ఉంటుంది ,మన ఆశ్రమ సాహిత్యము కూడా చదివితే ఒక అర్ధము గోచరము అవుతుంది అదే సరియైన విధానములో జపము చేసి చదివితే ఒక అర్ధము వచ్చి సత్యానికి బ్రహ్మ విద్యకు దగ్గరగావుంటుంది ,4) కావున ఈ విద్యకు వున్నా విలువలు తగ్గకుండా ఈ ప్రపంచానకిి, దేశానికి, దశ దిశా చూపించాల్సిన భాధ్యత మన మీద ఉందనేది, సాధకుని కర్తవంగా భావించి , అడిగేవారు ఏది అడిగిన జవాబు చెప్పేవారు జాగ్రత్తగా పరిశీలించి సత్య దూరము కానిది చెప్పాలి .తత్వ విరుద్ధంగా చెప్పకూడదు .మనము చెప్పేవి చాలా మంది మనతో పాటు ఇతర ఆధ్యాత్మిక సంస్థలు లే కాకుండా

అచ్యుత స్వామిగారి దృష్టికి పోతుంది అని మరవకూడదు .5) అందుగూర్చి పెద్దలను నేను వేడుకుంటున్నాను స్థూల ప్రపంచములోని సాహిత్యము స్థూల అర్ధాలు కల్పిస్తుందని , దాని విశ్లేషణ సూక్మ దృష్టితో ,జపదృష్టితో, చూడాలని కోరుంటున్నాను .నేను ఇలావ్రాశాను అని కోపము తెచ్చు కోకుండా మనమందరం అచ్యుత తత్వ విలువలు

బ్రహ్మ విద్య గొప్పతనం కాపాడుకోవాలి అని నా మనవి.

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

3/27/2016

From: R.B Satyanarayana

ఇది సత్యనారాయణ గారు వ్రాయబడినది నల్గొండ

ఆచ్యుతాశ్రమము అంటే ఏమి ….?శ్రీ అచ్యుతాశ్రమము అది ఒక దివ్య ధామము………………..1)ప్రియమైన తత్వబంధువులా రా    ఆశ్రమము అనగా కేవలము భారత దేశ పరిధికి మాత్రమే సంబందించి నది  కాదు .ఈ విశాల జగత్తుకు సంబదించినది అనే భావన కలగాలి .రాబోయే సత్యయుగానికి ఫౌండేషన్ వేసే రీతిలో constructed గా ఉండాలి .స్వయానా ఆధిదేవుడే వచ్చి ఆశ్రమము నెలకొల్పడము  అంటే దీని పరది ఎంత?………….2) అంతు చిక్కని ,అంతము లేని ,అనంతమైన  ఈ విశ్వవ్యాప్తికి సంబంధించినది అని అర్ధము అవుతుంది కదా! ఇది మన పరిధి కాదు కదా ! అంతటి బృహత్తర మైన సత్యాన్వేషణ కోసము ఏర్పాటు చేయబడిన ఈ ఆశ్రమము కేవలము మన భారత దేశానికి సంబందించింది కాదు .సృష్టిలోని అనంత జీవులకు ఆశ్రయమయి నెలకొనుచున్న ఈ సువిశాలమైన ఆశ్రమము మన మేధోపరిధికి  దాటినది …………..3) సాక్షాత్తు స్వయంభువే  వెలసి నడిపిస్తున్న ఈ ఆశ్రమము “అగణితమైన దన్న” సత్యాన్ని మరువ కూడదు .దానికి అనుగుణంగానే మనము ఉండాలి .భిన్నంగా ఉండకూడదు .అఖండమయి వెలగాలి. ఈ భూలోకానికి సంబంధించినది కాక సమస్త లోకాలకు నిలయమయి ఉన్నదన్న వాస్తవాన్ని గమనించాలి .ఒక మహత్తర మైన దైవశక్తి మన పూర్వజన్మ సుకృతానుసారము ఇక్కడ వెలిసి మనకు ఈ విద్యను అందించి మనలని విముక్తులను చేయుటకు  ఎంతో శ్రమించారన్న సత్యాన్ని మనము విస్మరించకూడదు .ఇలాంటి ఉన్నతమైన విద్యను సూక్ష్మ తి సూక్మ భావనతో చూడాలి కాని స్థూల భావనతో చూడకూడదు …4) ఈ ఆశ్రమ విద్య మనకు దొరకడం తేలికగా తీసుకోగూడదు .పరిపూర్ణమైన విిశ్వాసముతో నిండుకుండా లాంటి మనస్సుతో పరిపూర్ణమైన పౌర్ణమి లాంటి మానసిక వెలుగులో అంతర్ముఖంగా దర్శించండి .అప్పుడు ఈ ఆశ్రమము  మననేమి ? స్వామి అననేమి ? ఈ విద్య అననేమి ? గోచర మవుతుంది .పరిపూర్ణమైన విశ్వాసముతో జ్ఙాన చక్షువులతో దర్శించండి …5) ఈ నాడు అనేక మైన ఆశ్రమాలు సమాజములో వున్నాయి వాటికీ ఈ ఆశ్రమానికి తేడా ఏమిటి ? అంటే ! సత్యాన్వేషణము సంబంధినా ఆశ్రమము ఇదే .సత్యము కోసము ప్రయత్నమము చేసే టటువంటి కళాశాలలో మనము అడుగు పెట్టాము .6) ఈ కళాశాలలో అడుగుపెట్టి సంవ్సత్సరాలు గడుస్తున్నాయి కాని మనకు స్లిప్ టెస్ట్ పెట్టేవారు ఎవరు ?.యూనిట్ టెస్ట్ పెట్టేవారేవారు ఎవరు .?త్రైమాసిక ,అర్ధవార్షిక ,వార్షిక పరీక్షలు పెట్టేవారు ఎవరు ? ఎవరు పెట్టక పొతే ఎలాగా ? నీకు నీవుగా నైనా పెట్టుకోవాలా? మాస్టర్సు అయినా పెట్టాలా ? అలా కాకుండా గత 20,30,40,సంవత్సరాలుగా  ఓకే క్లాసులో ఉండి పోతున్నాము కారణము ? మనము సరియైన శిక్షణ పొందలేక పోతున్నమా ? సత్యమైన వస్తువును విడమరచి చూపించలేక పోతున్నమా ? ఎందుకు తను అక్కడే ఆగి పోయాడు ?సాధనలో ఫలితాలు రాకపోవడానికి కారణమేమి?

– R.B.Satyanarayana, Nalgonda. Cell: 09494420240.

3/28/2016

From: R.B Satyanarayana

“శుక్లాంబర ధరం విష్ణుం “..

“శశి వర్ణం చతుర్భుజం”.         ప్రసన్న వధనమ్ ధ్యాయేత్”  .”సర్వ  విఘ్నోప శాంతయే ”

————––—————————–1) “శుక్లా “…అతిశక్తి వంతమైన ….అతి గొప్పదైన .2)”అంబర”…అంటే …”ఆకాశము” ..మానవునికి ..అంబరము ..తల పైభాగము …………………………….”ధరమ్”……ధరించినవాడా………..”విష్ణుమ్”….. విశాల వ్యాప్తి హి విష్షువు …….విశాల వ్యాప్తంగా విస్తరించినది “ఆత్మ” తత్వము ………..

..”శశి “వర్ణమ్”……చంద్రుని కళ…..తెల్లని వర్ణము గల “చతుర్భుజం ” ….ఆత్మకు నాలుగు భుజాలు ..1మనస్సు….2.బుద్ది…..3. చిత్ శక్తి .4.అహంకారం……………………

..”ప్రసన్న …వధనం”…..అహ్లాద కరమైన ….

చిన్న పిల్లల ముఖములో తొణికసలాడు .ఆనందము ……….”ధ్యాయే” …………ధ్యానముతో ……..”సర్వ ” మొత్తము …”.విఘ్నోప ” విఘ్నాలు…….”శాంతయే ” శాంతించును …………….సాధనలో కొనసాగుతున్న సాధకులకు ఇది జపములో అవగత మవును ……..

———————————————-మానవుడి తలలో అతిశక్తి వంతమైన “.దివ్వేబ్రహ్మ పురే “ఆత్మా”ప్రతిష్టిత” అను శ్లోకంలో మనకు గోచరము అవుతుంది .అలాంటి దైవీ సంపత్తు యైన ఆత్మను ధరించివున్నా వాడా…..అది తెల్లని వర్ణము కలదయి నాలుగు భుజాలు కల్గి ఉన్నవాడా.ప్రసన్న  వదనముతో ధ్యాన్నము జపము లో చేస్తే .మొత్తము నీ విఘ్నాలన్ని తొలగిపోతాయి .నీదుఖఃము తొలిగిపోతుంది అని మనకు వేదము ఘోషించుచున్నది .

– R B సత్యనారాయణ, నల్లగో్ండ.  సెల్ నెం.9494420240

3/29/2016

From: R.B Satyanarayana

ప్రియమైన సాధక బందువులకు  నమస్కారాలు మీరు పంపు నటువంటి సమాచారము అంత చదువుతున్నారని అనుకుంట ఎందుకనగా జపము తీసుకొని చాలా కాలము అయినాది .మీరు చాలామంది ఆశ్రమముతో , తత్వముతో,జపాలతో సంబంధాలు లేక తత్వ బద్ధంగా ఇబ్బందులు పడుతున్నారు కావున మీరు మీ తీరుబడి సమయాలలో ఆపీసుకు పోయి వచ్చి నంక , వంటలు వండిన తరువాత హయిగా మీ పోన్ లలో చదువుకోండి .చదివిన తరువాత మీఅభిప్రాయాలను తెలుపండి. అందరము నేర్చుకునే వాళ్ళమే  ఒకరు ఎక్కువ తక్కువ అనే అభిప్రాయము కలగకండి .ఎ పుట్టలో ఎ పామువున్నదో మీలోన ఎ తపస్వి ఉన్నాడో తెలువదు ,తెలుసుకునే ప్రయత్నము చేయండి .ఆశ్రమముతో సంబంధాలు పెట్టుకొని మీరు విజ్ఞాన వంతులై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని మనసార కోరుకుంటున్నాను.

– ఆర్ . బి . సత్యనారాయణ . చైర్మెన్ అన్నదార . అచ్యుతాశ్రమము . 09494420240

3/30/2016

From: Ravikumar

పెద్దలు సాధక బంధువులందరికి నమస్సుమంజలులు.                     నేను జపము చేయునపుడు కుడి వైపుకు బెండ్ అవుతున్నాను, దానికి కారణం నాకు కుడి కలుకి సయాటికా ప్రాబ్లం ఉన్నది,     మనం జపము చేయునపుడు straight గ ఆసనం వేసుకొని కూర్చోవాలి కదా.  దాని వలన ఏమి ఐనా నష్టం ఉంటుందా తెలుపగలరు….

3/31/2016

From: R.B Satyanarayana

గౌరవ సాధకులు కాలు సయాటీకా ప్రాబులము వుండీ సాధనకు  అటంకము కలుగు తూన్నట్టూ బావన వ్యక్థ పరిచారు . అలాంటీ వారికి నాకు తెలిసినన్థ వరకు చెప్తాను.ఆలోంచండి  మూడు బాగాలుగా చెప్తాను……. 1) సయాటీకా ఎలాంటి వారికీ ఎందుకు వస్తుంది ?…………………………………………… 2) సయాటికా నివారణ………………………………………………………………………………………….  3). సాయాటికా వారు జపము ఎలా చేయాలి ……………………………………………………….

సయాటికా ఎవరికీ వస్తున్నదంటే ఎప్పుడు నడుమును ముందుకు వంచి కూర్చొవడమువల్లా మెడను మున్దుకువంచి ఏదో ఒక పనిని చేసుకోవడమువల్ల  వెన్ను పూసలు బాగా ముదుకు నొక్కుకొని వాటి మద్యన ఉన్న డిస్కులు ఒత్తిడికి గురి అవుతాయి డిస్కుల మీదపడ్డ ఒత్తిడివెళ్లి నరాలమీద పడుతుంది . వెన్ను మూదు బాగాలుగా చూ స్తే ఎ బాగాములో ఈ మార్పులు వస్తే దానికి సంబంధముగా  మనకు  ఇబ్బందులు  కలుగుతాయి.వెన్ను మొదటి బాగాములో ఇలాంటి మార్పులు వస్తే  మనకు మెడ నొప్పులు ,చేయిజాలు ,చేతి తిమ్మిర్లు ,చేయి నరాలు లాగడము ,తల నొప్పులు ,మొదలగు ఇబ్బందులన్నీ వస్తాయి . నడుము బాగాములో మరియు నడుము క్రిందిబాగాములో ఈ మార్పులు వస్తే   డిస్క్ ప్రోలాప్స్ , సైయాటీకా నొప్పి(,కాలుజాలు ) స్లిప్ద్ డిస్క్ ,కాలు చచ్చుబడి పోవడము ,ఇలా రక రకాలుగా బాధలు వస్తాయి .వీటన్నికి కారణము వెన్నుపూసలు బాగా ముందుకు నొక్కుకొని పోవడము. 2) దీనికి నివారణ ఉష్త్రాసనము ,మరియు వజ్రాసనము రోజుకు రెండు పూటలా చేస్తే వెన్ను పూసలు వెనక్కి వంచబడి వాటి మధ్య ఉండవలసినంత ఖాలీ ఏర్పడుతుంది .దానితో పూసల మధ్య ఉండే డిస్కులపై ఒత్తిడి తగ్గుతుంది .ఆ కారణము చేత ఉష్ట్రాసనము రోజు చేయడము వలన  1,2,నెలలలో చాలా వరకు పైన చెప్పిన ఇబ్బందులు తగ్గుతాయి .మెడ నొప్పి ఇంకా తక్కువ సమయములోనే పూర్తిగా తగ్గుతుంది ,….3) నడుము క్రింది బాగాన్ని బాగా వెనక్కి వంచి ఉంచడము వలన ఆ బాగాముపై ఒత్తిదిపడి అక్కడ క్రొవ్వు కరుగుతుంది .4) ప్రక్కటెముకలు ,కండరాలు ,చాతి బాగాలు ఊపిరి తిత్తులుపై కలిగించే ఒత్తిడిని పోగొట్టి ఊపిరు తిత్తులు బాగా విశాల మై దీర్ఘ శ్వాసలు రోజంతా తీసుకునే అవకాశము ఉష్త్రసనము కల్పిస్తుంది .దీర్ఘగతి చాలా చక్కగా రాగలదు .4) తైరాద్ గ్రంధికి ,జీర్ణక్రియకు ,ప్రాంక్రియాస్ గ్రంధికి,చక్కటి కదలికలను కలిగించి ఎక్కువ రక్త ప్రసరణ ఆ బాగాలకు అందేటట్లు చేసి ఆరోగ్యంగా వాటిని మార్చగలదు  .5) ఈ ఆసనాన్ని రొజూ.జపముతో పాట్టు  చేయడము వలన నడుము నొప్పులు ,మెదనోప్పులు ,నడుము పట్టుకోవదము ,నడుము లాగడము మొదలగు ఇబ్బందులు జీవితములో దరిచేరవు .”నోట్ “ఉష్త్రాసనము నుండి తీసేటప్పుడు వెంటనే కళ్ళు తెరిస్తే కళ్ళు తిరుగుతాయి ,తలలో నరాలు కదిలినట్లు ఇబ్బందిగా వుంటుంది కాబట్టి కళ్ళు వెంటనే తెరువరాదు ….6) సాధనలో కూర్చొవదము ఇబ్బందిగా వుంటే మనస్సు ,ద్రుస్టి ,కుదరక ఎప్పుడు  ఈ నొప్పిమీదనే ఆలోచనవుంధదముతొ సూక్ష్మ స్థితి కి మనస్సును తీసుకవేల్లలేదు .ఎప్పుడు బయటి ఆలోచనయే వుంటుంది .కావున సాధకులు తమ ఆరోగ్య రిత్యా కుర్చీలో కూర్చొని జపము చేయవచ్చు ఎంతో మందిని ఇలా చేయిసున్నాము .ఇంకా ఇబ్బందిగా వుంటే డాక్టర్ గారిని సంప్రదించ గలరు ….

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

From: Rama Rao Nandi

సత్యనారాయణ గారు ఎక్కడో చదివినట్టు గుర్తు పూర్వం గురుకులలో యోగ సాధన చేసే శిష్యులకు  యోగాసనాలు వేయించేచేవారట   యోగ సాథనలో శారీరక  భాధల నివారణకై   తధ్వార బాధలు ఉపశమించేవట తమరు కూడ రవికూమార్ గారికి యోగ ఆసనాలు వేయమని సూచించినారు యోగ-ఆసనాలు=యూగాసనాలు  .మహ పురుషులు యోగ ఆసనాలు   ప్రక్రియ ఎర్పరించింది యోగసాధనలో వచ్చే శారీరక భాధలు ఉపశమించేందుకేనా తేలుపగలరు

Reply by: Bushaiah

సాధక బంధువులకు నమస్కారం

ఈరోజు సయాటికా ప్రాబ్లమ్ పై పెట్టిన మెసేజ్ యంతోఉపయోగకరకంగా వుంది ఈనాడు సాధకులేగాక ప్రజలలో అ నేకమంది సయాటికా ప్రాబ్లంతో బాధపడుతున్నారు కావున దీనినే సూచనగా భావించి తమ తమ ఆరోగ్యాలను కుదుటపరచుకొని సాధనలో ఉత్సాహంగా కొనసాగుతారని కోరుకొంటూ ఈవిషయాన్ని అందించిన విజ్ఞులు R B Satyanarayana గారికి ధన్యవాదములు

3/31/2016

From: R.B Satyanarayana

రామరావు గారు మీరు పెట్టిన messageni చూశాను

స్థూలము స్థూలమే — సూక్ష్మము సూక్ష్మమే.

పూర్వజన్మ సుక్రుతానుసారముగా వచ్చు ప్రారభ్ధ కర్మఫలమును స్థూలంగా మావవజన్మలో అనుభవించాలి ,కాబట్టి స్థూలానికి స్థూలంగానే మన పూర్వీకులు ఆశ్రమాలలో ఆచరింప జేసేవారు. ఆసనాలే కాకుండ దేహధారుడ్యానికి మానసిక పరిపక్వతకు కావలసిన యెన్నో కఠినమైన విద్యలు అవలంభింప జేసేవారు. రోగబాధలనివారణకు ప్రక్రుతి సంపదను వినియోగించు కునేవారు మన పూర్వాశ్రమ పూజ్యులు.

దానితోపాటు సూక్ష్మానికి సూక్ష్మస్థితిలో వున్న విద్య ద్వారా మానవజీవిత కర్తవ్యాన్ని, అందుకోవలసిన గమ్యాన్ని జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇహపర సాధనలు అవసరం . ఇది జపము  చేసే సాధకులకు అవగతమౌతుంది

– ఆర్. బి . సత్యనారాయణ ,నల్లగోిండ . సెల్ నెం. 9494420240

4/1/2016

From: R.B Satyanarayana

సాధక బంధువులకు నమస్కారము .

1)విశ్వాసం అనేది విత్తనం లాంటిది దానిని పెంచటానికి అంటే మొలకెత్తటానికి మనము వనరులు కల్గించాలి .అప్పుడే అది మనకు ప్రతిఫలం అందించ గలదు.

2)శ్వాస ఏ లాంటిదో విశ్వాసము కూడ అలాంటిదే .అందుకే ఎల్లవేళలా “నేనెంతో విశ్వాసంగా ఉన్నాను .ఈ విశ్వాసము రోజురోజుకీ పెరుగుతుంది అని అనుకోవటం ప్రారంబించండి.

3)నేను అనుకున్నది సాధించ గలుగుతాను .సాదింఛి తీరుతాను. అనే విశ్వాసముతో అనుక్షణము అనుకుంటూ ఉండాలి .మధ్యలో అవంతారాలు వచ్చిన అవి తాత్కాలిక మేనని నమ్మాలి.

4)మీరు అనుభవిస్తున్న స్థితికి మీరే కారణము  అని మనస్పూర్తిగా  విశ్వసించాలి.మీరు పైకి వెళ్ళినా, కిందకు దిగినా మీలోని వైఖరి మాత్రమే మూలము.

5)మీ ప్రగతికి అడ్డుపడే మీ లోని “నెగెటివ్ “ఆలోచనలను గుర్తించండి .వాటిల్లో కనీసము ఒక్కటైనా ఈ రోజు ఈ క్షణమే నుండే  “పాజిటివ్ “గా మార్చుకోండి.

6)మీ లక్షము వైపు సాగుతున్న సమయములోచిన్న ,చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఇతరులు నిరుత్సాహ పరచవచ్చు అటువంటి సమయములోనే ఆత్మా విశ్వసమూ అనే ఆస్త్రాన్ని వాడాలి.

7)నిరంతరము శ్వాస తీసుకున్నట్లుగా గెలుపుగురించే ఆలోచించాలి .గెలుపు సాధించాలంటే కొంత అలుపు తప్పదు .ఆ అలుపే ,గొప్పమలుపు  తిప్పుతుంది.

8)ఆత్మ విశ్వాసము అంటే మీలో ఉన్న శక్తిని సకారాత్మగా జ్వలించే జ్వాల లాగ చేయడమే.

9)మన అందరిలో అటువంటి దే దీప్య మానంగా నిరంతరమూ వెలిగే  జ్వాల ఒకటి వున్నదని మారువకూడదు .ఆజ్వాల ను ధర్శించాలి .ఆ ఆత్మను దర్శించాలి అనే ప్రయత్నమూ చేసేవారు కొందరే వుంటారు.చాలామంది భయముతో,అనుమానంతో ,ఆవిశ్వసాముతో, ఆజ్వాల పై నీళ్ళు జల్లి ఆర్పి వేస్తుంటారు. ఇదే ఆత్మ విశ్వాసానికి ,ఆ విశ్వసానికి ఉన్న ఉన్న తేడా.

10) ఆత్మ విశ్వాసము లేని వారికి పెద్ద కోరికలు వుండవు .పెద్ద ఆలోచనలు ఉండవు ,అద్భుతాలు సాదించలేమని అనుకుంటారు .పైగా అలా ఆలోచించటం తప్పు అంటారు.అది అహంకారానికి, అతివిశ్వాసానికి పరాకాష్ట అని సమర్ధించు కుంటారు.

11) మీరు ఇప్పుడున్న స్థితికంటే ఇంకా ఉన్నత స్థితికి చేరాలనుకుంటున్నారా?

a) మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.

b) మీ మనస్సు మీరు చెప్పినట్లు వినేలా చేయవచ్చు.

c) మీలో ఉన్న పిరికివాడిని పారద్రోలవచ్చు.

d) ప్రవర్తనా ధోరణి సరి దిద్దుకో వచ్చు.

e)మీరు పెరుగుతూనే ఉంటారు.

f) ఎందరికో మీరు స్ఫూర్తి నివ్వగలరు.

g) మీ ప్రేరణ శాశ్వతంగా ఉంటుంది

h)అసాద్యాలను సుసాధ్యము చేయ గలరు

i) నవ్వినా నాపచేనే పండెల చేయగలరు.

j)మిమ్ములను చూసి మీరే ఆశ్యర్య పొగలరు.

ఇదంతా నమ్మాలనిపించటం లేదుకదా. ప్రయత్నము చేయండి .తరువాత మాట్లాడుకుందము

– R.B.Satyanarayana, cell: 09494420240.

From: Prasad Guntur

💐 జయ అచ్యుత 💐

ఈ కలియుగంలో ఎన్నో యోగ సాధనలు ఉన్నాయి .అందులో అసలు విద్య ( ఆది విద్య ) లభించడం మన  అదృష్టం .లభించిన విద్యను  మన ప్రయత్నం ( మానవ ప్రయత్నం ) ద్వారా సాధించుకోవడం ఇంకా అదృష్టం.అటువంటి ప్రయత్నంలో  (సాధనలో) ఎన్నో అనుభవాలు, అనుభూతులు  వస్తుంటాయి. (త్రికరణ శుద్ధిగా చేయు వారికి ) అలా వచ్చే అనుభవాలను పంచుకునే పెద్దలు ( సాధకులు )  దొరకడం ఇంకా అదృష్టం . అటువంటి అదృష్టం ఈ వేదిక ద్వార లభించడం మరో అదృష్టం.

ఈ అదృష్టం , ఎప్పుడూ మనకి ఉండలంటే  దీనిని  పెద్దలు

సత్య నారాయణ  గారు చెప్పినట్లు.ప్రతి అక్షరం ప్రతి మాట అచ్యుత యోగానికి మాత్రమే సంబందించినదై ఉండాలని మనసారా కోరుకుంటూ.

– ప్రసాద్. గుంటూరు.

💐 జయ అచ్యుత 💐

4/2/2016

From: Bushaiah

విద్యాశ్రీ సత్యం రాపోలు గారు తేది .01.04 16 న సాధకులు సాధనాపరంగా ఎదగడానికి పదకొండు  పాయింటులతో అమోఘమైన సందేశాన్ని తన సాధననుభవముతో ఇచ్చినట్లున్నది

 1. విశ్వాసం వృద్ది చేసుకోవడం
 2. శ్వాసతో విశ్వాసాన్ని పోల్చడం
 3. దృఢ సంకల్పం కలిగివుండడం
 4. మన స్థితికి మన వైఖరి యే కారణమనడం
 5. నెగేటివ్ ఆలోచనలను passitive గా మార్చుకోవడం
 6. ఇతరులు నిరుత్సాహపరిచిన ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగడం
 7. విజయపథంతో అలుపే గెలుపుకు మలుపు అని
 8. ఆత్మ విశ్వాసం అంటే మనలోని శక్తిని జ్వాల లాగచేయడం
 9. ఆత్మవిశ్వసానికి అవిశ్వసానికి వున్న తేడా
 10. ఆత్మవిశ్వాసం లేనివారి మనోభావం alavuntundo
 11. ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకోడానికి ఆచరించాల్సిన సూచనలు a to j వరుకు
 12. పైనచెప్పిన అంశాలలోని విషయాలు

సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా మరియు

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని మాన్యులు ఒక్కాణించిన వాక్యాలను సాకారం చేసుకోవడానికి ఉత్తేజితుల్ని చేస్తున్నాయి

4/3/2016

From: R.B Satyanarayana

సాధకులకు నమస్కారాలు……………………..~1)~~మీలో ఇద్దరు వున్నారు అని తెలుసా  ?~~~~~

అందులో( 1) ఒకరు.మిమ్ములను ముందుకు తోస్తూవుంటే ……

2) రెండో మనిషి మిమ్ములను వెనక్కి లాగుతున్నా డు ……….

విజయము సాధించామని ఒకరు ప్రోత్సహిస్తూవుంటే ,రెండవవాడు అది నిన్నించి కాదు ,”అది అసాధ్యాము “అని అంటాడు ….

2) ఈ ఇద్దరు లో ఎవరి మాట వినాలో తెలియక కన్ ఫ్యూజన్ లో మీరు ఫ్రేక్షక పాత్ర వహిస్తున్నారు .మీరు ప్రేక్షకూడయితే వాళ్ళిద్దరూ ఎవరు? 3)అందరికి,చిన్నపిల్లలకూడా అర్ధము అయ్యే విధంగా  వారికి ఒక పేరు నిత్యం వాడుకలో వున్నది పెట్టుకుందము .ఒకరుహిరో,అయితే రెడవవాడు విలన్ గా. పెట్టుకుందాము .ఓకే .

4) హీరో పాజిటివ్ సలహాలు ఇచ్చే

మనిషి ….విలన్ నెగెటివ్ సజెషన్ ఇస్తూంటాడు . హీరోకు ధైర్యము ,తెగింపు ,విశ్వాసము ఉంటాయి .అనుకున్న దెదయినా చేయగలడు .

5) విలన్ ,పేరుకి విలన్ అయినా చాల భయస్థుడు,చొరవ లేదు ,అన్నింటికీ భయపడుతాడు

ఏ సినిమా అయినా హిట్టవ్వాలంటే హీరో చేసిన అద్భుతాలే కారణము .

6) విజయవంతమైన ఏ సినిమా లోను విలన్ మంచి పనులు చేయలేదు .అంటే మీ జీవితములో హీరో,ఎవరు,విలన్ ఎవరో మీకు ఈ పాటికే అర్ధమయినది అనుకుంటా .1)స్థూల మనసు , కాన్షస్ మైండ్ ( conscious mind ) అంటే ఇతనే మీలోని విలన్ .

2)సబ్ కాంషెస్ మైండ్ ( sub conscious mind) అంటే సూక్ష్మ మనసు అనుకోవచ్చు .ఇతనే మీ లోని హీరో.

కాన్షస్ మైండ్ (స్థూల మనసు ) అనుకున్నవన్నీ కావాలనుకుంటుంది ,కొన్ని మూర్ఖంగా చేసుకుపోతుంది ,కానీ లోపల ఉన్న సబ్ కాన్స్ స్ మైండ్ (సూక్ష్మ మనసు )హీరోలాగా ఏది ఒప్పు ,ఏది తప్పు అని విశ్లేషించి చెప్తుంది .అదికూడా తన వద్ద సిద్ధంగా ఉన్న సమాచారాన్ని బట్టి ఆలోంచించి చెపుతుంది .ఒక వేల అక్కడ సమాచారము తప్పుగా ఉంటే తప్పుడు సమాధానమే ఇస్తుంది ……

7) మన సబ్ కాన్స్ స్ కి సమాచారాన్ని అందించే సంస్థలు కొన్ని వున్నాయి .అవి కుటుంబము, పాఠశాల, సంఘము ,ఆర్దిక, సాంఘీక ,మొదలగునవి .వున్నాయి ….

8) మీ లో ఇద్దరు వున్నారు కదా,ఒకడు మంచివాడు ,రెండవ వ్యక్తీ చెడ్డవాడని ,మీరు మీ లోని వాళ్ళిద్దరిలో ఎవరిని దగ్గరగా తీసుకొని పోషిస్తారో  అతడే మీ వైఖరిని నిర్ణయిస్తాడు .అతని అడుగుజాడాలలో పయ నిస్తారు .

9) నీగురించి తెలుసుకోవాలంటే ,నీ గురించి కొంచము ఆలోంచించు ,నీతో నీవు మాట్లాడుకో .

11)మన శరీరము ఒక అవయం కాని మనస్సుకు ఎంత ప్రాధాన్యత నిస్తున్నామో ,ఎంతనమ్ముతున్నామో,ఆమనస్సుకు అంతా అద్భుతాలు చేసే శక్తి వున్నది అని కుడా నమ్మాలి ……

12) మీతో మీరు మాట్లాడు తూ , వుండండి .మీగురించి మీరు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయటము ,మీ బలాలను, శక్తి ,యుక్తులు ,ఆలోచనలు,ఆచరణ గురించి విశ్లేషించుకొని ముందుకు సాగాలి . ఎట్టి విత్తనాలోఅట్టి కాయలు.

మనలోవున్న సూక్ష్మ మనసు.హీరో. జపము చేద్దాము అంటే ,మనలోవున్న విలన్ స్థూల మనసు తరువాత చెదువులే అని వాయిదాలు వేస్తుంధి .విలన్ కు విలువ ఇస్తున్నామా జపము ఆగి పోతుంది .హీరోకు విలువ ఇస్తున్నమా జపము నడుస్తుంది .ఎవరికీ విలువ ఇయ్యాలో తెలుసుకోండి

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

4/3/2016

From: Jayanthu

చాల  చక్కని విషయాలు చెప్పారు  సుక్ష్మ  స్తూల  కారణ  మహా కారణ  ఆంటారు కదా వాటి  వివరణ చెప్పండి.

4/4/2016

From: R.B Satyanarayana

What is Achyutaashrama? Shree Achyutaashrama is a divine wreath! (Divyadamamu)

1)      Dear philosophical companions, the range of Ashrama is not only limited to the boundaries of Indian sub-continent. Think of it as it belongs to the vast majority of the globe.  It got to be constructively built for the foundation for coming Satyayuga.  When this Ashrama directly established by Aadideva, How big scope of the Ashrama can be?

2)      Perhaps it belongs to puzzling, never ending and infinite universe! It just does not fit with in our range! Ashrama was founded to institute “Truth Seeking” (Satyaneveshana) not just for Indian sub-continent. The immense Ashrama goes beyond our intellectual capacity, it provides shelter to infinite species in this creation.

3)      We should not be forgotten this Ashrama was built for “Truth Seeking” which was literally established and run by Aadideva himself. We go accordingly in that direction.  We should not be different to it. Be in eternal bliss. Observer the fact this is just not related to earth but to the entire universe (samastha lokas). Let’s not ignore the fact about Diva Shakti (the most striking God’s energy) appeared here because of our past life karma (purva janma) to give us Brmahavidya for our liberation. One should see this abundant Vidya in Sukshma sthiti (state) but not in Sthula sthiti.

4)      Obtaining Ashrama vidya should not be taken lightly by ourselves. Practice vidya with complete faithfulness, mindfulness, see it internally with in you (antharmuka darshana). Then you will get answers to questions like what is this Ashrama about? What is this vidya? See it with complete faithfulness and gnana drusti.

5)      Today in our society we have many different Ashramas. What are the differences between Achyutaashrama and other Ashrama’s? Achyuraashrama is about seeking truth (Satyānvēṣaṇa). We entered into a college that puts effort to find truth.

6)      We entered into this college over few years ago. Who conducts slip tests for us? Who is taking unit tests? What about quarterly, half yearly and annual tests? Who is overseeing those exams? How to look after if no one taking those tests? Can you take those tests all by yourself? A master should enforce those tests? Without such tests we are sitting in same one class for last 20, 30, 40 years. Why? Are we not getting good training? Are we not able to show true nature of the object? Why did you stop there in one class? Why are you not getting good results out of your Sadhana?

Please excuse me for any typos, grammatical and other mistakes.

– By R.B.Satyanarayana. Nalgonda Ph: 09494420240.

From: Janaki Ramarao

Satyanarayana garu!Excellant perception about establishment of Achyutashram .99% of our sadhakas are not able  to strike the balance between daily life & spiritual life.Daily life has become a great priority  over the the Achyuta vidya.Sadhakas  have to remember that one should diligently tide over the great sansara  maya.when doing japa think that it is the last  japa.Remember that you will be blessed by Achyuta swamy when you are doing japa because most of us also seek his help/blessings in our daily life.Hence I appeal to all of them to be sincere in their japa and there  are many Upadesakas like Satyanarayana garu of Nalgonda , Mallesham garu of Hyd &  Udayabhaskaram garu of Hyderabad are guiding us with their fervent zeal to march ahead in our goal.Jai Achyuta.

 

4/6/2016

From: Rama Rao Nandi

గౌ” సత్య నారాయణ గారు సాధకులకు ఉద్దీపణ కలగ చేసేందకై  positive  negitive  ల గురించి చెప్పియున్నారు  యధ్భావం తధ్భవతి  సాధకులు మనస్సు లో ఏది స్థిరపరుచుకుంటే  ఆదే లభ్యమవుతుంది  అవును మనలోనే ఇద్దరు ఉన్నారు  ఒకరు సాధన రెండోది వాయుదా(మనభాషలో) దీనిని సమన్వయము చేయడమే ప్రజ్ఞత POSITIVE  NEGITIVE  ఈశక్తులను సమన్వయము చేయడమే స్ధితి ప్రజ్ఞత  ఈ బ్రహ్మ విధ్య ఎవరికి లభిస్తుంది శ్రధ్ధ గలవాడికి మాత్రమే నని గీతలో కృష్ణభగవానుడు చెప్పింది ఇదే కావడం గా చెప్పుకోవచ్చు శ్రధ్ద అంటే (సంస్కృతం  లో శ్రత్  అంటే సత్యం ధీయతే  సత్యం కోసం  బుద్ది చేసే ప్రయత్నం)శ్ర ధ్ధ గలవాడికి మాత్రమే బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది  శ్రధ్ధ గల వాడే మానవుడు మానవ అంటేఅర్దం మా  అనగా మాత్సర్యం అంటే అజ్ఞానం లేకండా వ అంటే వర్తించడం అజ్ఞానంలేకుండా వర్తించు వాడే మానవుడు పై భావనలో ఒక విషయం పై శ్రధ్ధ ను  కోనసాగించినట్టయితే negitive నాకారత్మత నుండి సాకారత్మత లభిస్తుందని గౌ”సత్యనారాయణ గారు ఈవిషయంపై లోతు గా చెప్పియున్నారు  వీరి భావనలో ఆజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముహంతి జంతవః ఆజ్ఞానము చే  జ్ఞానం కప్పబడి యుండటం వలన  జీవులు మోహితు లై భ్రమ కు గురై నకారాత్మన(negitivity) భావనకు లోనవుతున్నారని చెప్పెందుకు వారు  అనేక ఉదాహరణలు ఇచ్చినారు  నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగః

అంటే నిద్రించే సింహం నోటి లోకి లేడి కూన ఆహరంగా వచ్చి పడదు  విజయం శ్రమిస్తేనే  లభించును  సాధన కూడ అలాంటిదే అని వీరి భావనగా నాకు అర్థం అయ్యింది మనస్సు లోపాజిటివ్ ఆలోచనలను నింపుకుని   సాధన చేస్తే మనం ఇంద్రులం అవుతాం  ఇంద్రుడు అంటే సంస్కతంలో ఇంధ్ర అంటే మనస్సని అర్ధం ఇంద్రుడు అంటే మనస్సుని జయించిన వాడని అర్థం అంటే మనస్సుకు అధిపతులు కావాలని భావన

whatever the mind can conceive and believe that can be achieve

ఎదైతే మనస్సు గాఢంగా విశ్వశిస్తే అది సాధింపబడుతుంది. చివరగా న రత్నం అన్వేష్యతి మృగ్య తేహి హితత్ అర్థం రత్నం వెతుక్కుంటు వెళ్ళదు అన్వేషింపబడుతుంది.

సత్యనారాయణ గారు వ్రాసినది చదివిన తర్వాత  కృతజ్ఞతతో ఇది వ్రాయలని అనిపించింది ఇందులో పెద్దలు చాలమంది యున్నా రు తప్పులు ఎవన్న వ్రాస్తే పెద్ద మనస్సు తో మన్నించగలరు

4/6/2016

From: R.B Satyanarayana

“మనసు”2వ భాగం.

మీలోన గొప్ప నిధి ఉందని తెలుసా?

1. అంతులేని,అనంతమైన సంపదలు మీలోనే వున్నాయి. వాటిని పొందడానికి మీరు చేయవలసినది ఏమిటంటే, మీ మనోనేత్రాలను తెరిచి మీలోన ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి మీలో ఒక బాండాగారమే వున్నది.మీరు మీ జీవితానికి కావలసినంత ఆనందదాయకంగా ఉండడానికి, సుఖసంతోషాలతో ఉండడానికి, సమృద్ధిగా జీవించడానికి, కావాలిసినంత ప్రతి అంశాన్ని మీరు అందులోనుంచి తొడుకోవచ్చు.

 1. చాలామంది తమలో వున్న అనంతమైన తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆ బాండాగారాన్ని తెలుసుకోలేక ఎలా తీయాలో తెలియక తికమక పడుతూ బయట వెతుకుతున్నారు.
 2. యుగయుగలనాటి అతిపెద్ద రహస్యం ఇదే. ఆ రహస్యములు ఏమిటి అని ఎవరైనా మిమ్ములను అడిగారనుకోండి అప్పుడు మీరు ఏమని సమాధానం చెబుతారు?
 3. సృష్ఠిలోని రహస్యము అణుశక్తి అంటారా? గ్రహాంతరపు ప్రయాణం అంటారా? బ్లాకహొల్స్ అంటారా?ఇవేవి కావు మరి ఆ రహస్య మేమిటి ? అది ఎక్కడ లభిస్తుంది ?అది ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి?
 1. దీనికి సమాధానం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇది ఏంతో సులువైనది ఆ రహస్యము–మీలోని మానసిక చేతానావస్ఠ(సబ్ కాన్సియస్) (హీరో)
 2. అది అద్భుతమైన, అపురూపమైన, అనంతమైన దైవీశక్తి . ఈచోట దానికోసము వెతకాలని చాలామంది అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది ఈ సూక్ష్మ చేతనా శక్తిని కనుగోగలుగుతారు.
 3. ఈ సూక్ష్మ చేతనాశక్తికి (సబ్ కాన్సియస్)వున్న అద్భుతశక్తిని ఒకసారి తెలుసుకుంటే ఇక మీ జీవితములో అధికశక్తి, అధికసంపద, అధిక ఆరోగ్యము,అధిక సుఖసంతోషాలు, సంతానము, మొదలగునవి పొందవచ్చు.

8.మీరు ఈశక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకే మీవద్ద నిక్షిప్తమై (Reserve)వున్నది.కాని మీరు దానిని ఎలా ఉపయోగించాలో ఆ .బాండాగారము యొక్క తాళము చెవి ఎక్కడ వుందో జపములో తెలుసుకోవాలి. జపములో సూక్ష్మస్థితిలో ఆ సూక్ష్మచేతనాశక్తిని తెలుసుకొని ఆ నిధిని వాడుకోవాలి.

 1. అప్పుడు మీరు కొత్తశక్తిని ఉత్పాదన చేయగలుగుతారు.అది మీ ఆశలు ఫలించడానికి మీ కలలను సాకారము చేసుకోవడానికి దోహదపడుతుంది.మీ జీవితాన్ని ఇదివరటికంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా,మలుచు కోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకొండి.
 2. మీ సూక్ష్మచె్తనాశక్తి లోతుల్లో అంతులేని తెలివితేటలు, అనంతమైన శక్తియుక్తులు, అవసరమైనంత ముడిసరుకు అనంతంగా వున్నాయి.
 3. మీరు వికసింపబడి వస్తారని ఆ బాండాగారము ఎదురుచూస్తున్నది. మీ సూక్ష్మచేతనా శక్తి లోతుల్లోని అంతర్గత శక్తులను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఈ లోకములో తన ఆకృతిని తీర్చి దిద్దుకుంటాయి. ఆ సందర్భంగా మీరు నిష్పాక్ష బుద్ధితో స్వీకరణకు సిద్దంగా వున్నట్లయితే మీ సూక్ష్మ చేతనావస్థలోని అనంతమైన తెలివితేటలు ఏ సమయములోనైన ఎక్కడ ఏమి తెలుసుకోవాలన్న వాటిని వెల్లడి చేస్తాయి.
 4. మీరు కొత్త ఆలోచనలను, యోచనలను, నూతన కల్పనలను, కొత్త పరిశోధనలను, నూతన కళా ప్రక్రియలను ఆవిష్కరించ గలుగుతారు.లేదా సృష్టించగలుగు తారు.
 5. మీ సూక్ష్మచేతనవస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞానసంపదను అందుబాటులోకి తీసుకరాగలుగుతుంది. అది తనంతతానుగా వ్యక్తమై మీరు నిజమైన స్థానానిికి మార్గము ఏర్పాటు చేస్తుంది.
 6. ఈ అనంతమైన శక్తులు వెలికి తీయడమన్నది మీరు ఒకసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు పొగలుగుతారు.
 7. సూక్ష్మచె్తనాశక్తి లోని శక్తి –కుంగిపోయిన స్థితిలోవున్న వ్యక్తులని పైకి లేవనెత్తడం వారిని మళ్ళీ సంపూర్ణంగా, శక్తివంతంగా ,ధృఢచిత్తునిగా చేస్తుంది. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వెల్లగలిగేలా చేస్తుంది.-సూక్ష్మచేతనా శక్తిలో అద్భుతమైన అన్నిరకాల నయం చేసే శక్తి వుంది. అది చిక్కుల్లోవున్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది. మీ మనోద్వారాన్ని తెరచి మీకు స్వేచ్ఛ ను ప్రసాదిస్తుంది. అది మిమ్ముల్నీ అన్ని రకాల భౌతికపరమైన శారీరక పరమైన బంధనాలనుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది.
 8. మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్ని జరుగుతాయని నమ్మకముతో నమ్మిన వ్యక్తి ఒక పర్వతమును దారినుండి తొలగిపో అంటే తొలుగుతుంది ఇది ఒక పరిపూర్ణమయిన విశ్వాసము . మీ మనసును నమ్మింది మీ మనసులోని భావనయే అంతకు మించి మరేమీ లేదు.
 9. మీ అనుభవాలు, జరుగుతున్న సంఘటనలు, పరిస్థితులు, చర్యలు, ప్రతిచర్యలు అన్ని మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్త చేతన వస్తాయే తీర్చి దిద్దినదని గుర్తుంచుకోండి– అది ఒక నమ్మకం కాదు మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీస్తుంది.
 10. కృత్రిమమైన నమ్మకాలు అభిప్రాయాలు , మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పట్టి పీడిస్తున్నాయి. వాటిని విశ్వసించకండి.అంగీకరించకండి–ఎప్పటికి మారని శాశ్వత సత్యాలను,జీవిత సత్యాలను నమ్మండి.అప్పుడే మునుముందు ప్రగతిపథం వైపుగా ఆత్మ దర్శనం వైపుగా పయనిస్తారు.

“సశేశం ” వచ్చే సంచికలో

– R B Satyanarayana,  Chairman Annadhara, Cell no.9494420240.

4/6/2016

From: Prabhakar Guptha

VIdyasri R B Sathyanarayana gariki, Vupadeshak Sri  B Bushaiah gariki Mariyu ithara sadhaka bandhuvulaku  Vupadeshakulaku nayokka namascaramulu nayokka manavi yemanaga manamu practice chesthunna brahma vidyaku mariyu sthulamulo manamu chesthunna panulaku sambhandham vuntunda?

– G Prabhakargupta.

4/7/2016

From: R.B Satyanarayana

Shivaya vishnurupaya

Shivarupaya vishnave

Shivashye hrudayam Vishnu

Vishnushye hrudayam shivaye

The meaning of this shloka is

Shiva is none other than Vishnu, Vishnu is none other than Shiva, Shiva resides in the heart of Vishnu, Vishnu resides in the heart of what Shiva….

From: R.B Satyanarayana

పై ఫొటో , శ్లోకము , రవి hyd గారు పంపుతూ దీని అర్ధము తెలుపమని అన్నారు నాకు అర్ధమయినంత వరకు తెలుపుతాను గమనించ గలరు

ఫొటోను గమనించండి అందులో ఓకే మొఖం లో   ఇద్దరు వ్యక్తులు కనబడతారు అంటే శ్రీ మహా విష్ణువు మరియు శివుడు వారి వేష  ధారణలు తేడా గమనించండి .

సనాతనుడైన (శాశ్వతుడైన) సర్వములకు మూలమైన ఆ పరశ్రేష్టుని సహజమైన చేతనా స్పందన పలితంగా రూపము బడిసిన ఆది పురుషుడే ఆది దేవుడు అతనినుండి పరశ్రేష్టుని చేతనము వలన ఉత్పత్తి యైన ప్రాణశక్తి, విశ్వ వ్యాప్తియై సర్వ భూతములకు సర్వాంతర్యామియై జీవుల కల్యాణానికి ప్రముఖ పాత్ర పోసించు శక్తి యే ,”శివశక్తి ” అందుకే శివశక్తికి కళ్యాణకారకుడు అని శివుని ఆజ్గాలేనిదీ చీమైనా కదలదు అని పూర్వీకులు ప్రభోందిన్చినారు , ఈ ప్రాణుడికి కేంద్రము ఆ హరియే . హరియనగా ఆ మూల చేతనమైన ఆ ఆత్మయే ,ఈ రెండు కూడా ఒకే హృదయలో ఉండటాన్ని అవినాబావా సంబంధము వున్నట్లు ఆ పోటో లో చూపిస్థున్నాధి .ఆ రెండు శక్తులను మనము ఈ మానవ జీవితములో దర్శించు కొవాలని ఆ మూలశక్తులను అనగా  “ఆత్మకు ,శ్రీ మహావిష్ణుగా ”  ” ప్రాణుడికి శివస్వరూపంగ ” మనము స్థూలంగా కొలుస్తున్తాము .—– స్థూలంగ ఎ కథలు చెప్పినాగాని ,సూక్షములొ మన ఋషీ సంప్రాదాయములోఇది చెప్ప బడినది. అందుకే సాధకులారా ఈ మనుష్య జీవితములో ఆ హరిని ,శివున్ని దర్శించుకోవాలి .  నీలోనవున్న “శివున్ని ,విష్ణువుని ” దర్శించు కోకుండా బయట వెతుకు తుంటాము ఆ దర్శనము కోసము పరిత పిస్థూ ఉంటాము  .నానా అగచాట్లు పడుతుంటాము , అనాదిగా స్థూలములొ వెతుకు తున్నాము అయిన పలితము కనబడుత లేదు . ఇక్కడ ఒక పద్యము గుర్తు చేస్తాను ,మన చిన్నతనములో చదవు కున్నది , ” అక్కరకు రాని చుట్టము – మ్రొక్కితే వరమీని వేల్పు ” అనునది మీకు గుర్తుకు వచ్చినాది అనుకుంటా సాధకులారా   –  ” ఇల్లు ఉండగానే చక్క పెట్టుకోండి” అనే సూక్తిని మరచి పోకండి , మనదెహమును  నివాసాము చేసుకొని ఉన్నటువంటి ” ఆత్మా అంటే విష్ణువును – ప్రాణ అంటే శివున్ని ” మీ జపము ద్వారా మీ అంతరంగములోని దైవీ శక్తులను దర్శించు కొని ఆ పర్మాతుముని కృపకు పాత్రులు కావాలని ,” పునరపి మరణము . పునరపి జననము ” అనే ఆ సంసార చక్రము నుండి బయటపడాలని  ” అచ్యుతస్వామీ”  కృపతో మనకు ఈ విద్యను అందించారు . ఆ విద్యనూ వినియోగించుకొని మనము మానవ జన్మ కర్తవ్యాన్ని , స్వధర్మాన్ని పాటించాలని ,మిమ్ముల మనసార కోరుకుంటున్నాను .R.B.Satyanarayana. pone 09494420240. note – పెద్దలు ఎ మైన తప్పులువుంటే క్షమించు తారని ,తప్పులను పెద్ద మనసు తో నాకు తెలియ చేస్తారని మనసార కోరుకుంటున్నాను

– R B సత్యనారాయణ, అన్నధార చైర్మెన్.

 

4/7/2016

From: R.B Satyanarayana

సాధకబంధువులరా  !  మనము చేయు జపములో నాభి నుండి బ్రహ్మరంధ్రము వరకు జరుగు గతాగతి మాత్రమే వుండును. దీనినే భగవద్గీతలో ప్రాణాపానగతీ  అని చెప్ప బడినది.

 1. నాభి నుండి పైకి ప్రాకుట (ప్రాణశక్తి) ప్రాణగతి అని,అక్కడి నుండి క్రిందికి ప్రాకి నాభిని చేరుటను అపాన గతి అనిరి.
 2. ఈ జపములో వాయువును పట్టుకొని గతాగతిలో సాగునప్పుడు ప్రాణాన్ని గుర్తెరుగడం జరుగుతుంది.
 3. ప్రాణాన్ని పట్టుకొని కొన సాగినప్పుడు ప్రాణాయామము (ప్రాణ+అయామము) జరిగి జీవున్ని(ఆత్మ) అనగా తనని తాను ఎరుగవచ్చును.
 4. తనను తాను ఎరిగిన అనంతరము తీవ్రమైన తపనచే (సదామానసిక తపస్సుచే) తపస్సుగామారి ఆ తపస్సులో ఉన్నత శిఖరాన్ని చేరుకొని తపోధ నుడయి శాశ్వితుడైన(ever existing) ఆ పరమేష్టుని

అంశమైన జీవ(ఆత్మ),ప్రాణులకు మూలమైన జనకుడైన పరాత్పరున్ని తెలుసుకోవచ్చును.

కాని ఈ దారి కాదని కేవలం ఊహాతీతమయిన ఆలోచనలతో ఏ వేవో కుచేష్టలు చేసి మానసిక భ్రమలకు లోనై అవాస్తవమయిన ఆలోచనలతో పాటు తాత్కాలిక మానసిక తృప్తితో కాని హఠప్రయేగాలతో కాని  సాహిత్య విశ్లేషణలతో గాని సాధ్యముకాదని ప్రభు  శ్రీ యోగి అచ్యుతులు తెలిపియున్నారు.

దీనినే భగవధ్గీతలో 2–53 శ్లోకంలో స్పష్ఠంగా తెలిపినారు.

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా, సమాధావచలా బుద్ధిస్తదా యోగమవప్స్యసి.

శ్రుతి విప్రతి పన్నా=నానావిధ శ్రవణాలచే కలత చెంది ఉన్న

తే= నీయెక్క

బుద్ధి=  బుద్ధి

యదా = ఎప్పుడు

నిశ్ఛలా =  చలించనిదై

సమాధా= పరమాత్మ జ్ఞానమందు

అచలా =  స్థిరముగా

స్థాస్యత =  నిలిచియుండునో

స్తదా       =  అప్పుడు

యోగం =  యోగమును

(ఆత్మసాక్షాత్కారమును)

అవాప్స్యసి = పో్ందగలరు

అనగా !

నానావిధ శ్రవణాదులచే కలత చెంది ఉన్న , నీయెక్క బుద్ది ఎప్పుడు చలించనిదై పరమాత్మ జ్ఞానమందు స్థిరముగా నిలిచి యుండునో. అప్పుడు యోగమును(ఆత్మ సాక్షాత్కారమును) పొందగలవు.

సాధన అనుభవము లేకుండా ప్రాణ ప్రతిష్ట జరుగకుండ, ప్రాణమనోమిలినము కాకుండ ఆత్మదర్శనము కాజాలదు.

ఆత్మదర్శనము కావలన్న తద్వార పరమాత్మ దర్శనము పొందలన్నా యోగసాధన ఒక్కటే ఏకైక మార్గము. దానికి తప్ప మరొక మార్గము లేదు.  దీనిని ఏ స్థూల చేష్టల ద్వార నైనా పొం దాల అనుకోవటం వట్టి భ్రమయే.

– R B  Satyanarayana, Annadhara chairman, Cell no. 9494420240.

From: Rama Rao Nandi

ధన్య వాధములు గతగతులను భగవధ్గీత తో అను సంధానం చేసి చెప్పిన మీతత్వ వివరణ అద్బుతం మాలాంటి సాధకులకు యోగ సాదనలో ఉపకరించగలదు ధన్య వాధాలు గతగతులు  చేయుటలో  గల తత్వ రహస్యం చెప్పినారు. అలాగే గతగతులను సాధకులు చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి చెప్పగలరు

4/8/2016

From: Prabhakargupta

VIdyasri R B Sathyanarayana gariki, Vupadeshak Sri  B Bushaiah gariki Mariyu ithara sadhaka bandhuvulaku  Vupadeshakulaku nayokka namascaramulu nayokka manavi yemanaga manamu practice chesthunna brahma vidyaku mariyu sthulamulo manamu chesthunna panulaku sambhandham vuntunda?

– G Prabhakargupta.

Reply by: R.B Satyanarayana

విద్యాశ్రీ ప్రభాకర్ గుప్తా గారికి నమస్కారములు.

మీరు వ్రాసిన ప్రశ్న ఆస్పష్టముగా ఉన్నప్పటికీ దానికి వివరణ :

ఈ స్థూలజగత్తులో చేయు పనులు స్థూల మనసు ద్వార చేయ  బడుతాయి. ఈ స్థూలమనసు (కాన్సియస్ మైండ్) తన ఆధీనంలో వున్నా  దశేంద్రియముల లోని బ్రహ్మేంద్రయాలను భ్రమింప జేసి వశపరుచుకొని తన ఇష్టారీతిగా వ్యవహారం చేస్తుంది దాని యొక్క పర్యవసానమే మనకు అనేక రకములైన కర్మలతో పాటు అనేక జన్మలను ఎత్తాల్సి వస్తుంది. ఈ జనన మరణ చక్రములో తిరగడానికి కారణం ఈ స్థూల జగత్తులోని స్థూల మనసే.

ఈ స్థూలమనసు యొక్క మూలాలు (వేర్లు) సూక్ష్మమనసు లొనే ఉంటాయి అనునది మరువ కూడదు. అంటే స్థూలమనసు చేయించు నానా హంగామా చంచలమైన మనసు ద్వారా ప్రాపంచిక విషయములందు విశృంఖలంగా పరిభ్రమించుచుండును. అట్టి మనసును ఆయా విషయములనుండి మరల్చి వివేకముతో నిగ్రహించి తన వశమయ్యేటట్లు చేసుకొనవలెను.

మనసు చంచలమైనది నిగ్రహించుటకు కష్టమనునది నిజమే. కాని దానిని జపములో అభ్యాసము చేత, వైరాగ్యము చేత  సాధించవచ్చును.

మనసును నిగ్రహించలేని వారికి యోగము దుస్సాధ్యమనేదే మా అభిప్రాయము అందుగూర్చి జపము చేస్తూ ప్రాణునికి ఆహారము (ఆశనము) అందించినచో ప్రాణ బలిష్టుడై చంచలమై పరుగిడుతున్న స్థూల మనసును అదుపులోకి తీసుకోగలడు తీసుకున్న తరువాత  ప్రాణమనో మిలినమై తన మూలాన్ని వెతుక్కుంటూ ఆత్మ  దగ్గరకు పయనించును. తద్వారా తనమూలమైన ఆత్మను చేరుకునే వరకు శాంతి దొరకదు.

ఆత్మను దర్శించిన ఈ మనసే సూక్ష్మస్థితిగా మారి జ్ఞాన సముపార్జన చేయగలదు. తద్వారా స్తూలనికి , సూక్ష్మానికి శాంతి  చేకూరును.

ప్రయత్నశీలుడైన వాడు వివేకముతో ఉపాయముతో సాధించగలడు.

సాధించలేని వారు ఇహపరములు రెండింటియందు దుర్గతి కలుగును.మనసును తన ఆధీనములో పెట్టుకొని ఆత్మోద్దారణకై కర్తవ్యకర్మను ఆచరించు వారెవ్వరును దుర్గతి పాలు కారు ప్రయత్నముతో మనసును నిగ్రహించుకొని జపత్పాదులు చేసి అత్మోద్దారణ చేసుకున్న సాధకుడు సర్వపాపములనుండి ముక్తుడగును.స్థూల, సూక్ష్మ దోషములనుండి కాక అనేక జన్మల కర్మలను వదల్చుకొని (పోగొట్టుకొని) యోగియై పరమగతిని పొందును.

– R B  Satyanarayana, Chairman,  Annadhara. Cell no.94944020240

4/8/2016

From: Rangaiah Thota

బుద్ధి కర్మూను సారినే అంటే ఏమిటీ? వివరించగలరు.

From: Prabhakar Guptha

Vidyasri R B Satyanarayana gariki Mariyu Vupadeshak Sri B Bhushaiah gariki Namascaramulu  Meetho Eee Vidhamuga matladuthunnanduku naaku chala santhosham ga nunnadi.naayokka prashnaku meeru iddaru spandincharu.naaku vachina sandehamu mee mundu vunchinanu.spastamuga prashna artham kaledu ani snnaru.ippudu spastamuga konni exmaples isthunnanu.chudandi  1.jeeva himsa cheyaradu ani antaru kada mari manamu sthula bhojanamunaku yenno vruksha sambhandamu ayina jeevamunna chetlanu mokkalanu nariki champi mana potta nimpukontunnamu.yennenno vidhala vatini mana swantha manugada kosam vati meeda pethanamu chesthunnamu.mari aa vrukshalu manameeda yemaina pethanamu cheshi nattu charithra unnada?

2 manishi janma uthamamainadi ante idena?

3 eevidhamuga ye jeevini himsincha kunda manugada leda? Nakenduko ee vidhamuga anipisthunnadi

4 Mana puranalalo unna charithranu batti sapta rushulu mariyu yendaro adyatmikanga jeevinchina varu unnaru.vallu sthula jeevanamu yela chesharu

5 Kontha mandi sadhakulu galini mathrame bhujinche varani vinnanu.Idi kontha varaku  bagane vunnattundi

Reply by: R.B Satyanarayana

Vidyasri Guntha Prabhakar gariki namaskaram.

మీరు పెట్టిన మెసేజ్ ని చూసినాము.

సాధకులకు విజ్ఞప్తి:

మన వేదిక సూక్ష్మమైన బ్రహ్మవిద్యకు , అచ్యుతతత్వమునకు,సనాతనమైన ధర్మమునకు, సంబంధించిన సూక్ష్మానిది అని మీ అందరికి తెలుసిన విషయమే మనము చేయు జపము సూక్ష్మమైనదే .సూక్ష్మస్థితిలో వచ్చు సమస్యలను సాధకులు అడిగితె బాగుంటుంది జవాబు చెప్పబడుతుంది. కాని స్థూలమనసుతో జపానికి,జప పురోగతికి, సాధకుని అభివృద్దికి, సంభంధించినవి కాకుండా, స్థూల ప్రశ్నలతో సమయము వెచ్చించకుండ. ఎందుకనగా మనమందరం ఒకేరకమైన సాధకులం. సంసార రంగములోవుండి మనమన పనులలో పాల్గొంటూ ఈ వ్యవస్థను నడపాల్సి ఉంటుంది. దీనికి అదనపు సిబ్బంది మరియు కంప్యూటర్ వ్యవస్థ మనము ఏర్పాటు చేసుకోలేదు. గాన గమనించగలరు.

ప్రభాకర్ గారు,

నిన్న మీరు పెట్టిన ప్రశ్నకు దినమంతా కష్టపడి సమధానమిస్తే కనీసము మీరు దానిపై స్పందించకుండ సాధనకు అవసరము లేని మళ్ళీ ఐదు ప్రశ్నలు గుప్పించారు—-పరిస్థితిని అర్థం చేసుకోవాలని మనవి.ఈ ప్రశ్నలన్నింటికి మీరు జపములో కొనసాగుతున్నప్పుడు గమనము లోకి రాగలవు.

అయినా మీ మొదటి ప్రశ్న

1. జీవహింస అని అడిగారు ? = మీదృష్టిలో  జీవహింస అనగా నేమి?

ఈ సృష్టి లోని జీవులు నాలుగు రకములు. వీటినే స్థావర జంగములు అంటారు.

 1. జరాయుజాములు=మావి వలన పుట్టిన మనుష్యుడు,పశ్యాదులు.

2.అండజములు = గ్రుడ్డు వలన పుట్టబడిన పక్షులు కీటకాదులు.

3.స్వేదజములు= చెమట వలన పుట్టినవి (తేమ) మొదలగునవి.

 1. ఉద్భిజములు= భూమిని చేధించుకొని పుట్టిన తర్మగుల్మాదులు.

అనేవి నానా విధములయిన స్థావర జంగమాది భూత సమూహములు . ఇందులో భూమిలనుండి వచ్చువాటిని ప్రాణులు అంటారు.వీటిని జీవులుగా పరిగణించబడవు. జీవులు అనగా పునరుత్పతికి సంభందిచినవి. ఆ పై మూడు ఆ కోవకు చెందినవే.

ప్రభు శ్రీ యోగి అచ్యుతులు కృషీవలురయి సస్యవర్గాన్ని పెంచి పోషించిన సంగతి మీకు తెలిసిందే  వారు జీవహింస చేసినట్టేనా ? అనాదిగా రుషి సంప్రదాయంలో వున్న మునులు ,ఋషులు, తపస్సులు, ఉపనిషత్కారులు, యోగులు వీరందరూ సస్యవర్గముపై ఆధారపడి జీవించినారు అన్న సంగతి మీకు తెలియదా ? వారందరూ జీవహింస చేసినట్టేనా ?

జీవహింస అనగా ఆత్మను, ప్రాణాన్ని , మనసును వియోగములో వుంచి జీవితములో కలపకుండా చేయడమే పెద్ద జీవహింస.

2వ ప్రశ్న,: మనిషి జన్మ ఉత్తమమైనది అంటే ఇదేనా?అని అడిగినారు.

మీ ప్రశ్నకు సమాధానం.

84 లక్షల జీవరాశులలో నిద్ర, క్షుద్, పిపాస, మైధునం, భయం.అనునవే ఉంటాయి,కాని విజ్ఞానవంతమైన మానవున్ని దైవీశక్తులైన ఆత్మ, ప్రాణ, మనసులను పో్ందుపరచి(ఏకోహం బహుదా యంతి..) అనే సూత్రముతో చేయబడిన ఈ మానవుడు తన తపస్సులో జ్ఞానాన్ని (చిత్ శక్తిని) ఇచ్చి సృష్టి అనగా నేమి ? దైవమనగా నేమి ? నేనగా నేమి? అని తెలుసుకొని తిరిగి ఆ దైవములో విలీనమయ్యే విజ్ఞానాన్ని  ఇవ్వడం వల్లనే మానవజన్మ ఉత్తమమైనది.

3వ ప్రశ్న: జీవిని హింసించకుండా మనుగడ లేదా ? అని అడిగారు.

ఈ విషయంపై సరియైన సమాధానమంటే మీరు జపము చేస్తే తెలుస్తుంది .మనము సంసారికరంగములో ఉండి జపము చేయువారలము . ఈ స్థూల జగత్తులో దేహానికి అన్న పానీయాలు ఎంత ముఖ్యమో సూక్ష్మ ప్రాణానికి ఆశనము ఎంత అవసరమో విజ్ఞులయిన మీకు తెలియనిది కాదు.

ఈ స్థూల వ్యవహారంలో   స్తూలభోజనం, సూక్ష్మ దేహానికి సూక్ష్మ భోజనము, అత్యావశ్యకమైనది. ఇది దేని ద్వారా అందును.

4వ ప్రశ్న: సప్తఋషులు, మునులు, తపస్సులు వారి స్తూలజీవనం ఎలా చేశారు ? అని అడిగినారు.

అగ్నిగోళాల లాంటి  తపోధనులను గూర్చి వారి స్తూల జీవనాన్ని గూర్చి చర్చించక పోవడమే మంచిది ఈనాటికి వారందరు జీవించివున్నారని ప్రాజ్ఞులు తెలుపుతున్నారు.అయినా నీవడి గిన ప్రశ్న ఏ సంవత్సరానిదో ? వివరించగలరు.

5వ ప్రశ్న:  కొంతమంది సాధకులు గాలిని మాత్రమే భుజించేవారని విన్నాను? అని అడిగినారు.

ఈ విషయాన్ని మా పరిధి దాటి నందున జపములో అచ్యుత స్వామిగారి ద్వారా gజవాబు పొందగలరని మనవి.

– R B Satyanarayana, Chairman, Annadhara. Cell no. 9494420240.

4/10/2016

From: R.B Satyanarayana

” BUDHI  PAI  VIVARANA”

రంగయ్య గారు నమస్కారములు.

“బుద్ది”  పై మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. సాధకులకు ఎంతో ఉపయుక్తమైనvది. తనకు తానే చూసుకునే అద్దము (mirror) లాంటి ప్రశ్న ఇది.

దానికి వివరణ :

 1. బుద్ధి = బుద్ధికి రెండు ముఖములు.
 2. స్థూల బుద్ధి B.సూక్ష్మ బుద్ది
 3. స్థూల బుద్ధి చేయు కర్మలు వేరు.
 4. సూక్ష్మ బుద్ధి చేయు కర్మలు వేరు.
 5. పరమాత్ముని అంశమైనటువంటి “ఆత్మ” , “దివ్యే బ్రహ్మపురే”…అను స్థానములో ప్రతిష్టించ బడినది అని మీకు తెలుసు.
 6. దైవము నుంచి రాబడిన ఆత్మకు నాలుగు భుజములు .
 7. మనసు. B.బుద్ధి.  C.  చిత్
 8. అహంకారం.

అను ఈ నాలుగు భుజములతో మనలో విరాజిల్లుతున్నది. స్థూలంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోను తిలకించినప్పుడు ఈ నాలుగు భుజములే గోచరించును. అనగా  “విశాల వ్యాప్తీహి విష్ణువు” అని విజ్ఞులు ఆత్మకు పోల్చినారు.

 1. ఆత్మకు సూక్ష్మ అంగమైన బుద్ధిని సూక్ష్మబుద్ది గా పిలుస్తారు .
 2. ఈ బుద్ధి గుణాల మీద ఆధార పడి పనిచేస్తుంది.
 3. గుణములు అనగా సత్వ, తమో, రజో, గుణములు. ఆ గుణాలలో బుద్ది ఇరుక్కొని గుణ ప్రభావము చేత తన ఒరిజినల్ ఉనికిని కోల్పోయి గుణాలను బట్టి తన పనిని వ్యక్తపరుస్తుంది. (స్తూల  జీరాక్స్ లాగా) అనగా ఒకే నీరును వివిధ కలర్స్  గల బాటిల్స్ లలో పోస్తే  బ్లూ కలర్ బాటిల్ లో  నింపితే , బ్లూ కలర్ గా ,పింక్ కలర్ బాటిల్ లో నింపితే పింక్ కలర్ గా, గ్రీన్ కలర్ బాటిల్ లో నింపితే గ్రీన్ కలర్ గా ఓకే నీరు ఇన్ని కలర్ లుగా మారినట్లు మనకు కనబడుతుంది. అంటే , నీరు మారినట్టా? లేదా బాటిల్ కలర్ వల్ల మారినట్టా ?
 4. అదే విధముగా సత్వ, రజో, తమో, గుణాలతో జంఝాటమాడే ఈ స్థూలమనసు బుద్ధి యొక్క సంకేతాలను  పట్టించుకోకుండా అజ్ఞానంతో కర్మలయొక్క ఫలితాన్ని సూక్ష్మ స్థితిపై ఎగజిమ్ముతుంది.
 5. ఈ మానవుడు ధర్మాధర్మము లను ఆకళింపు చేసుకొని , న్యాయ అన్యాయాలను తెలుసుకొని, సత్య అసత్యాలను గమనించి ,స్తూల మరియు సూక్ష్మ అనే విచారణ చేయవలసిన మానవుడు తన స్వధర్మాన్ని పాటించకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరిగి వచ్చిన మార్గము తప్పి, పోయే మార్గము వెతకక , చేయాల్సిన కర్తవ్యము చేయక , వియోగ స్థితిని   యోగస్థితితిగా మార్చక   అనేక జన్మలకు కారణభూతమవుతుంది .
 6. ఉదాహరణకు తమోగుణ ప్రవృతిలో దోపిడీ దొంగలుగా మారిన కుటుంబము లో నుంచి వచ్చిన తనయుడు కూడా అదే దొంగ   ప్రవృత్తి లో కొనసాగినప్పుడు ప్రజలందరు వాడికి తల్లితండ్రుల దొంగ బుద్దులే వచ్చాయని అనడము పరిపాటియే కదా ! అందుకే తమోగుణ ప్రవృత్తి వల్ల వచ్చినదేకదా ఆ మాట. దీనిని బట్టి ఏ కర్మలు చేసినచో ఆ కర్మకు సంబంధించిన  బుద్ధియే వచ్చును.
 7. సత్వగుణము యొక్క సాత్విక బుద్ధి   గూర్చి .:————

ప్రవృతించా నివృతించా కార్యే కార్యే బయా బయో.

బన్దం మోక్షంచయా వేత్తి బుద్దిస్సా పార్థ సాత్త్వికి.

పార్థా =  ఓ అర్జునా ,

య: బుద్ది= ఏ బుద్ధి ,

ప్రవృతించా= ధర్మమందు, (ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గమగు కర్మమార్గమును)

నివృతించా = అధర్మము నుండి నివృత్తిని , (లేకా నివృత్తి మార్గమగు సన్యాసమార్గమును)

కార్యా   కార్యే = చేయదగు దానిని, చేయదగనిదానిని,

భయా భయే = భయమును  అభయమును, (నిర్భయత్వము) బన్దం  =  బంధము ,

మోక్షంచ = మోక్షమునకు,

నేత్తి  =  తెలుసుకో్నుచున్నచో ,

స్సా   =  అట్టిబుద్ది

సాత్వికీ = సాత్వికమైనది అగును.

భావము ; సాత్విక బుద్ధి మంచి చెడ్డలను రెండింటిని గూర్చి తెలుసుకొని మంచిని గ్రహించి చెడ్దను వదిలివేయుచుండును. అట్లే బంధము మోక్షము రెండింటిని, తెలుసుకొని బంధమును పరిత్యజించి  మోక్షమును గూర్చి ప్రయత్నించును.ఆదేవిధముగా భయారూపకమగు దృశ్య సంసార స్థితిని జూసి దానియెడల విరక్తి కలిగి, అభయ రూపమగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించును. అట్టి సాత్విక బుద్ధియే ఉత్తమోత్తమమైనది. కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదాయని ప్రతి సాధకుడు యోచించుకొని భగవదృష్టి లో బుద్ధిమంతుడై వర్తించుటకు ప్రయత్నించవలెను ఇట్టి లక్షణములు గల బుద్ధిలేనిచో ఎంతటి పాండిత్యము, లౌకిక ప్రజ్ఞ , ఉన్నప్పటికి జనులు బుద్ధి కొరవడిన వారే అగుదురు.

 1. రజోగుణము యొక్క రజోగుణ సంబంధమైన బుద్ధి:——–

యయా ధర్మమధర్మం చ కార్యం చకార్యా మేవచ

ఆయథావత్ ప్రజానాతి బుద్ధి:  సా

పార్థా రాజసీ.

పార్థా  =  ఓ అర్జునా,

యయా   = ఏ బుద్ధి చేత,

ధర్మము   =  ధర్మమును,

అధర్మంచ =  అధర్మమును,

కార్యంచ. =   చేయదగినదానిని,

ఆకార్యం ఏవచ  = చేయారనిదానిని,

ఆయధావత్  = వున్నది ఉన్నట్లు గాక (మఱియొకవిధముగా, పొరపాటుగా)

ప్రజానాతి = తెలుసుకొనుచున్నాడో,

సా బుద్ధి =  ఆ బుద్ధి,

రాజసి   =   రాజసమైనది:

భావము :  కొందరి బుద్ధి ధర్మా ధర్మములను, కర్తవ్యా కర్తవ్యములను, శాస్త్రములందు బోధించబడిన రీతిన గాక, అనుభవజ్ఞులైన పెద్దలు, గురువులు తెలిపిన రీతి గాక తమకు తామే మరియొక విధముగా పొరపాటుగా అర్థము చేసుకొనునట్టి బుద్ధి రాజస బుద్ధి:

 1. తమోగుణము యొక్క తమోగుణ సంబంధమైన బుద్ధి:—-

అధర్మం ధర్మమితి యా మవ్యతే తమసావృతా

సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ది: సా పార్థా‌ తామసీ.

పార్థా =  ఓ  అర్జునా,

యా    =  ఏ ఏ బుద్ధి,

తమసా  = అవివేకము చేత,

పవృత   =  కప్ప బడినదై,

అధర్మం  =  అధర్మమును,

ధర్మం ఇతి =  ధర్మమనియు,

సర్వార్థాన్  =  సమస్త పదార్థాలను,

విపరీతాంచ =  విరుధ్ధములుగాను,

సా బుద్ధి.   =   అట్టి బుద్ధి,

తామసి.  = తమోగుణ సంభందమైనది, అగును.

భావము:  తామస బుద్ధి గలవానికి

అంతయు తలక్రిందులు గానే కనపడును. వికారమయిన అద్దములో ముఖము వికృతముగా కనబడునట్లు, నీటిలోని ప్రతిబింబము తలక్రిందులుగా కనపడునట్లు తామసబుద్ధి కలిగినవానికి అంతయు విపరీతముగా తోచును. అట్టి బుద్ధి కలవాడు నిత్య జీవితములో ప్రతి విషయము అతనికి విరుధ్ధముగా కనపడును . దీనికంతటికీ కారణ   మేమి ? తమోగుణ అవివేకము చే కప్పబడుటయే కారణము. కల్లు తాగిన వానికి లోక మంతయు  తిరుగుతున్నట్లు గోచరించును. మత్తుచే జగత్తంతయు అవాస్తవముగా గోచరించును.

15.A.  స్థూలదేహము , స్థూలజగత్తు వారికీ ఉన్నట్లు కనబడును.—సూక్ష్మఆత్మ  (దైవము) లేనట్లు కనపడును.

 1. దుఖ భూఇష్టములయిన ఈ స్థూల విషయ భోగములు వారికీ చాలా సంతోషకరము గా తోచును. పరమానందమైన సత్యవంతమైన ఆత్మ  (దైవము) వారికీ రుచించ బడదు.
 2. రక్తమాంసమయమగు క్షణికమైన దేహమునందు వారు సౌందర్యబుద్ది కలిగి ఉందురు.

సచ్చిదానందమూర్తి  శాంతి స్వరూపుడైన ఆ శాశ్వత పరమాత్నునియందు హేయబుద్ది కలిగి వుందురు.

 1. సనాతన ధర్మమును—-అధర్మముగా చూచుదురు

అధర్మమును–  ధర్మముగా భావించుదురు.

దీనికంతటికి కారణము, అతని తమోగుణ అవివేకమే అట్టి తమోగుణ బుద్ధి ఎవరి యందు కాపురము వుండునో ఆ బుద్ధి మహా నికృష్ట మైనదే యగును. అతడెంతటి  భౌతిక బలవంతుడయినను, విజ్ఞాన సంపన్నుడయినను, తనని తను తెలుసుకునే,   వివేకమును ఆశ్రయించనిచో తనను తానే మోసపుచ్చుకొనును. కావున అట్టి తమో బుద్ధిని పారద్రోలి

సత్యమును సత్యముగాను,

అసత్యమును అసత్యముగాను, జప తపాదులలో గ్రహించి ఆ శక్తిని పొంది కృతార్థులు కావలయునని అచ్యుతాశ్రమము కోరుచున్నది.

కావున సాధకులరా మీ ముందర పెట్టిన సత్వ, తమో, రజో గుణముల  అద్దములు (mirrors) మీ ముందు ఉంచబడినవి అందులో మీ ప్రతి  బింబము ఏ అద్దములో (mirror)  ఉన్నదో చూసుకొని ప్రవర్తించుతారని ఆశిస్తాము.

NOTE. : నాకు అందినంతవరకు తెలిపితిని ఇందులో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో తెలుపుతారని కోరుతున్నాను.

– R B Satyanarayana, Chairman Annadhara, Cell no. 9494420240.

4/11/2016

From: R.B Satyanarayana

Dear Sadhaka’s,

 1. Do you know you have two personalities (characters) inside you? Apparently (1) First personality pushing you forward (2) Second personality pulling you backwards.

One character inspiring you to win but second one says NO that’s impossible to do.

 1. You could in a confused state since you do not know who you should listen to thus become a spectator to yourself. If you are the spectator who are those two personalities within you?
 1. For the sake of simplicity, Let’s pretend first character is a Hero and second character is a Villain. Ok?
 1. Hero give us positive advices while villain give us negative suggestions. Hero is courageous, fearless and faithful. He can do anything he wanted to achieve.
 1. What about Villain? He is just villain for sake of that name! Nevertheless he has fear, can’t take an initiative and he is terrible about everything.
 1. In any hit film villain did not accomplish any good deeds. Probably by now you might understand who is hero and villain in your life?

(1)     Conscious mind (sthuala manasu) is the villain in you

(2)     Subconscious mind (Sukshma manasu) is the hero inside you.

Conscious mind (villain) wants everything it desires. Some things are done forwardly (stubborn). But the subconscious mind like a hero analyzes situation or fact, advice you what is right and wrong. It does that by checking the information that was already obtained through some thought process. In case the information that it has incorrect it give you wrong answer….

 1. Subconscious mind gets information from what so called corporations! Those corporations are nothing but family, school, society, financials, social connections etc.,
 1. So now there are two personalities in you right! One is a like a good guy another is a bad guy! So within you who do you console and nurture more decides your behavior. You walk in his footsteps!
 1. If you want to know yourself, think about you, talk to yourself!
 1. We give lot of importance to mind which is not an organ in our body, we believe it completely, also believe that mind has power to do miracles… Believe in that.
 1. Talk to yourself, Try to know yourself, Understand your strength, energy, develop tricks & ideas to analyze and proceed forward. You harvest what you seed.
 1. Sukshma mind is our hero. When you intend to practice Japa, Sthula villain type mind is going to tell you “it’s all right you can do it later!” and you keep try to postpone it. If you start giving importance to villain our Japa is going to halt. You give importance to hero Japa advances further. Please understand who should you give importance to?

–  R.B.Satyanarayana   Ph: 09494420240

4/12/2016

From: R.B Satyanarayana

విద్యాశ్రీ  ప్రసాద్ , గుంటూరు గారికి నమస్కారం.

మీరు కౌపీనము మరియు బ్రహ్మముడి పై అడిగిన ప్రశ్నకు వివరణ :

కౌపీనము   ——   ప్రాశస్థ్యం KOWPEENAMU___PRASHASTYAM.

____________________________

“కౌపీనధారీ  ఖలు  భాగ్యవంతా’ .

____________________________

కౌపీనధారులు  అనగా యుగయుగాలలో  అనాదిగా ఋషి సంప్రదాయంలో వస్తున్న సదాచారము. యోగులు , మునులు,  ఋషులు, తపస్సులు, యతులు, ఉపద్రష్టులు, లాంటి మహానుభావులంతా ఈ కౌపీనము యొక్క విశిష్టత తెలుసుకొని. జపతపాదులు ఆచరించేవారు.

ఆ ఋషి సంప్రదాయంలో  వస్తున్న మనం ఆ కౌపీనము యెక్క విలువను తెలుసుకొని నడుచుకోవాలి.

ఈ కౌపీనాదారుల యొక్క భావము సదా వేదాంత విషయములనే స్మరించుచు , బిక్షాటనతో వచ్చినదానితో తృప్తి చెంది , శోకము లేని అంతకరణచే , చెట్టు నీడనే ఆశ్రయించుకొని ,  రెండు చేతులనే భోజనపాత్ర గా చేసుకొని, ధనధాన్యాదుల యెడల విముఖత చూపిస్తు, జితేంద్రియులై  ఆత్మానందమును పొంది, అహర్నిశములు బ్రహ్మానందమును పొందుతూ,  ఈ స్థూల దేహాత్మ  భావమును తొలగించుకొని బయట లోపల, సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరున్ని వీక్షించుచూ, పవిత్రమైన ఓంకారమును సదా స్మరించుచు,  (ఓం క్రతో స్మర కృతం  స్మర క్రతో స్మర కృతం ..) సదా గతాగతిలో  వుండి, అహం బ్రహ్మాస్మీ యై ఆ సదాశివుణ్ణి స్మరించుచు నలుదిశలు  తిరిగి , ఆ పరాత్పరునియొక్క లీలలు చవిచూస్తూ  లోక కళ్యాణార్థమయి కృషిచేసేవారు.

అలాంటి విలువైన  కౌపీనధారులు మీరు , జప తపాదులలో సరియైన పద్దతులలో జపాలు చేస్తూ కౌపీనమునకు వున్న విలువను కాపాడాలని కోరుకుంటున్నాము.

ఇది తన ఆకారానికి సరిపడు గుడ్డను తీసుకొని నీకు ఉపదేశం ఇచ్చు సందర్భములో చెప్పబడిన తీరుగా ధరించి జపమాచరించాలి.అంతేకాకుండా, scientifical  గా జపసంధర్భము గా  ఉష్ణము అధికముగా ఉత్పత్తి అయ్యి, ఆ ఊష్ణమే విధ్యుత్తు గా మారి   మన శరీరములోని వీర్యకణాలను భస్మముచేసి ఓజస్సు గాను, ఆ  ఓజస్సును   తేజస్సుగాను మార్చడానికి ఉపయోగ పడుతుంది. ఈ మహాత్తరమైన  ప్రక్రియ కౌపీన ధారణ ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది .

కౌపీనము నడుముకు చుట్టి ఎడమ తొడసంధి (mid ingunal point) వద్ధ  ”  బ్రహ్మముడి  ” వెయ్యాలి. ఈ ముడి సరిగ్గా టెస్టిస్( testis) లో నుంచి వీర్యము పెన్నీసుకు వెళ్ళే నాళము మీద వచ్చేటట్టుగా వెయ్యాలి . జపములో పుట్టిన ఉష్ణము వల్ల వీర్యము బొట్టు బొట్టు గా  నాళ్ళము ద్వారా వెల్లుచు అది భస్మము చేయబడుతుంది. ఈ విధముగా కట్టడములో  హెర్నియా  వ్యాధిని కూడా అరికట్టవచ్చు. రెండవ గుడ్డను బిగుతుగా వెనుకకు తీసుకొనవలెను. దీనినే కౌపీనము , బ్రహ్మముడి అందురు.

 1. వేదాన్త వాక్యేషు సదా రమన్తో

బిక్షాన్న మాత్రేన చ తుష్ఠిమన్త :

అశోక మన్త: కరణే చరన్త :

కౌపీన వన్త ఖలు  భాగ్యవన్త :

భావము  :  సదా  వేదాంత వాక్యములను స్మరించుచు , బిక్షాటన వలన లభించినదానితో. తృప్తి చెందేవారు,  శోకము లేని అంత: కరణముతో చరించే కోపీనాధారులు (అదృష్టవంతులు) చాలా భాగ్యవంతులు.

 1. మూలం తరో కేవల మాశ్రయన్త:

ఫాణిద్వయం భోక్తు                    మమన్త్ర యన్త:

కన్థామినా  శ్రీ మపి కుత్సయన్త:

కౌపీనవన్త ఖలు భాగ్యవన్త:

భావము  :  చెట్టునీడయే ఆశ్రయంగా చేసుకో్ని,   రెండు చేతులను  భోజన పాత్రగా చేసుకో్ని ఐశ్వర్యమనిన విముఖతతో ఉండే కౌపీనధారులు చాలా భాగ్యవంతులు.

 1. స్వానన్ధ భావే పరితుష్ఠమన్త:

సుశాన్త సర్వేన్ధ్రియ  వ్రుత్తిమన్త:

అహర్నిశం బ్రహ్మసుఖే రమన్త:

కౌపీనవన్త  ఖలు  భాగ్యవన్త :

భావము :  ఆత్మానందం పొందిన పరితృప్తులు, జితేంద్రియులు, అహర్నిశము బ్రహ్మానందమున క్రీడించే కౌపీనధారులు చాల భాగ్యవంతులు.

 1. దే హాది భావం పరివర్తయన్త :

స్వాత్మాన మాత్మ న్యవలోకయన్త:

నాన్తం న మద్యం న బహి: స్మరన్త :

కౌపీనవన్త ఖలు  భాగ్యవన్త:

భావము :  దేహాత్మ భావము తొలగించువారు,  ఆత్మను వీక్షించు వారు, బయట, లోపల, మధ్య గల  వస్తువుల ధ్యాస లేని కౌపీనాదారులు చాలా భాగ్యవంతులు.

 1. బ్రహ్మక్షరం పావన ముచ్చరన్తో

బ్రహా హం స్మీతి  విభావ యన్త:

(పంచాక్షరం పావన ముచ్చరన్తో పతిం పశూనాం వ్రుది భావయన్త:)

భీక్షాశినో దిక్షు పరిభ్ర మన్త:

కౌపీన వన్త ఖలు  భాగ్యవన్త:

భావము:  పవిత్రమైన ఒంకార శబ్దమును ఉచ్చరించేవారు , అహం బ్రహ్మాస్మీ , అని భోదించువారు, పశుపతి నాధుణ్ణి సదా శివుణ్ణి ధ్యాన్నించేవారు, బిక్షాన్నము తినుచు నలు దిశలు  చరించే కౌపీనాధరులు అగు యతులే చాలా      భాగ్యవంతులు.

ఇప్పుడు మీరు కౌపీనము విలువలు ఎంతో  ఉత్త మమైనవని తెలిసి ఉంటుంది ఇది జప తీవ్రతతో అంతర్ముఖుడైనప్పుడు  బ్రహ్మ ముడిని విప్పినప్పుడు అతని మనసు స్థూలనికి రాగలదని మన ఆశ్రమ గురువులు తెలిపినారు.

NOTE:  ఈ విషయములన్ని ఆశ్రమ సాహిత్యములోను , మీ అనుభవాలలో మీ అందరికి  తెలుసు . మాకు తెలిసినంత వరకు తెలుపుతున్నాము.  ఇందులో        ఏమైన పొరపాట్లు వున్నచో తెలుపుతారని మనవి చేయుచున్నాము.

– R B Satyanarayana,  Annadhara Chairman.

4/12/2016

From: Venkateshamu Kongala

కోపీన ధారణలో బ్రహ్మముడి పురుషులకు ఎడమ ప్రక్కనే , మహిళలకు కుడి ప్రక్కనే ఎందుకు  ఏర్పాటు చేయడం జరుగుతుంది?    పెద్దలు  దయతో వివరించండి.

– వెంకటేష్ కొంగల.  గంపలగూడెం.

Reply by: Bushaiah

కొంగల వెంకటేశ్వర్లు గారికి నమస్కారములు.

శ్రీ అచ్యుతాశ్రమ గురు వర్గము తెలిపిన  ప్రకారము కౌపీనధారణ విషయములో

స్త్రీ,  పురుషులకు ఎలాంటి తేడా ఉండదు.  ఆసనము  మరియు ముద్ర విషయములో స్త్రీ, పురుషులకు తేడా  ఉంటుంది. ఆశ్రమ సాహిత్యములో చూడగలరు.

4/13/2016

From: R.B Satyanarayana

My Dear Sadhaka’s,

 1. Faith is alike a seed. To sprout up (grow) the seed we need to provide certain resources. Then we can expect to reap some returns.
 2. Vvishvaasamu (faith) is alike Shvaasa (breathe). For this reason try to imagine yourself “I have faith, Day by day it is growing inside me”
 3. I can achieve what I want. I can certainly achieve what I want. Try to imagine such faithfulness every second. Although if you encounter some disturbances in due course believe it’s just temporary.
 4. Have a firm belief that you are the true cause of whatever the state (sthiti) you are in now. Although you go up or down the source of it is your attitude.
 5. Identify the negative thoughts that are blocking your growth. Try to convert any one of those negative thoughts as positive thought starting from today right this second.
 6. While you reach towards your goal some small problems could show up and people may try to discourage you. In such periods use your self-confidence like a weapon.
 7. Just like you breathe every moment think about winning always. While you are trying to win you also get exhausted (tired). But that exhaustiveness can turn the things around.
 8. Self-confidence means lightening up your energy like Sakarathma, blaze that flame.
 9. Do not forget all of us has flame that glows eternally inside us. You should see that flame. Very few try to see the Soul. Many try to put that flame off either with fear, doubtfulness or by not keeping faith. This is the difference between having self-confidence and not having confidence.
 10. Those who do not have self-confidence typically do not set big achievements for themselves. They don’t have big thoughts, do not believe in themselves making miracles. In addition to that they say having such thought process is wrong. They defend themselves by putting it up as being overly proud and overly confident.
 11. Do you intend to be in a better state (unnata sthiti) than current state (sthiti)?
 12. Change the why you think
 13. You can make your mind to listen to you
 14. You can make the coward inside you run away from you
 15. You can change the way you behave
 16. You continue to grow
 17. You can inspire so many people
 18. Your inspiration stays forever
 19. You can make impossible things possible
 20. You will be surprised to see your accomplishments

It’s hard to believe right! Give it a try. We will talk about it later!

R.B.Satyanarayana,
Annadhara Chairman,
Cell No: 09494420240.

4/14/2016

From: R.B Satyanarayana

🌹 ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయనమః 🌹

తత్వబంధువులరా , సృష్టిలో అన్ని జీవులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సింహము గర్జిస్తే పది మైళ్ళ దూరము అవలీలగా. వినపడు తుంది , ఏనుగు 5 టన్నుల బరువు ఉంటే , తిమింగలం 100-150 టన్నుల బరువు ఉంటుంది మిణుగురు పురుగు కటిక చీకట్లో స్వయము ప్రకాశముతో చూడగలదు , కుక్కలు వాసన చూసి దొంగలను పట్టగలవు – చీమలు తమకంటే 52 రెట్లు బరువును అధికంగా మోసుక పోగలవు ,చిరుత గంటకు 100  మైళ్ల కు మించిన వేగముతో పరిగెత గలవు , గ్రద్దలు ఆకాశములో ఎంతో ఎత్తున ఎగురుతూ నేల మీద ఉన్న. నలుసంత కోడి పిల్లను చూడగ లదు, భూమిపై ఉన్న పశు , పక్షి, క్రిమి ,కీటకాలలో ఎన్నో ప్రత్యే కతలు గలవి ఎన్నో జీవులు కలవు .

మరీ మనషి పత్యేకత ఏమిటి..? ఈ చరాచర సృష్టిలో అతని స్థానము ఏమిటి ? జీవ జాతులలో అతని గొప్పతనం ఏమిటి ? నేడు భూమిమీద నివసిస్తున్న జంతువులలో 20 లక్షల రకాల కన్నా కీటకాలలోని 15 లక్షల జాతుల కన్నా , పక్షులలోని 8,650 జాతుల కన్నా నిశ్చయంగా ఉన్న మానవుడే మహనీయుడు .

ఇన్ని కోట్ల జీవాలలో ఇన్ని లక్షల జాతులలో ఒక మానవ జాతే సమస్త భూమండలాన్ని , భూమండలంలోని కోటాను కోట్ల జాతుల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగాదంటే దానికి కారణం ? మానవుని మేధాసులో ఉన్న  జ్ఞానం – ఆలోచన – అన్వేషణ కలిగిన మానవుడు ప్రపంచం ఫై ఆధీపత్యము వహిస్తున్నాడు .

సమస్త జీవ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు ? అసలు సృష్టికర్త ఎవరు ? అతను అపారాశక్తి సంపన్నుడు ఆది అంతము లేనివాడు , సృష్టి , స్థితి , లయాలకు మూలకారకూడయిన ఆ శక్తి సంపన్నున్ని – ఎలా దర్శించాలి ? ఎలా ప్రసన్నం చేసుకోవాలి ? అతనిలో ఎలా లీనం కావాలి ? ఎలా ధ్యానించాలి ? ఎలా పూజించాలి ? అసలు అతడు ఒక్కడా! అనేకులా ?

మరి మానవుడు ఎక్కడ నుండి వచ్చినాడు. అన్ని రంగాలలో  ఆలోచన చేయగలిగిన మానవుడు తను ఎందుకు వచ్చాడో, తన ప్రత్యేకత ఏమిటి ? అని తనకు తానూ తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఈ నాడు అనంతమైన విజ్ఞానాన్ని పొందుతూ  ఖగోళంలో  ఏముందో చూడగలిగిన మానవుడు,  భూగర్భములో ఏముందో చెప్పగలిగిన మానవుడు, గర్భస్థ శిశువు ఆడ, మగ అని చెప్పగలిగిన మానవుడు, దేహ రచన శాస్త్రములో కానీ అన్ని రంగాలలో ఎంతో ముందుకు పోతున్నాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో మాత్రం తనని  తాను తెలుసుకునే దానిలో ముందుకు పోలేకపోతున్నాడు కారణం ? జ్ఞ్యానం లేకనా ? ఆలోచన లేకనా ? అశ్రద్ధ వలననా ? తనలో ఉన్న జ్ఞానం, ఆలోచన, అన్వేషణ అనునవి సూక్ష్మ స్థితిలో తనలోనే ఉన్నా-విటీకి మూలము ఏమిటి అని అన్వేషించలేక పోతున్నాడు కారణం ? మార్గం తెలవకనా, ఈ విశాల సృష్టికి మూలం ఎవరో ఒకరు ఉంటారు కదా? అతనిని వెతకటం ఎందుకు ప్రయత్నము చేయడం లేదు.

తనను సృష్టించింది ఎవరు? తన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని    సృష్టించింది ఎవరు? ఈ ప్రకృతిని , ఈ అనంత ఆకాశాన్ని , సువిశాల భూమండలాన్ని, మహాపర్వత శ్రేణులను, సరస్సులు, సాగరములు ఇలా ఆనంతసృష్టిని సృష్టించిందేవరు. ఆ సృష్టికర్త ఎవరు ? అతడు అపారాశక్తి సంపన్నుడై ఉండాలి-సృష్టి స్థితి లయకు కారణమై ఉండాలి. అన్ని తెలుసుకునే మానవుడు నిన్న నీవు ప్రథమంగా తెలుసుకో. తరువాత అన్ని నీకే తెలుస్తాయి అని ప్రభు శ్రీ యోగి అచ్యుతుల వారు తెలుసుకునే మార్గాన్ని చూపించినప్పటికీ దానిని దర్శించలేకవడం మన ఆశ్రధకు తార్కాణమే గదా? ఈ మానవుడికి పరిపూర్ణమైన మేధస్సు ఇచ్చి జ్ఞనము ఆలోచన, అన్వేషణ అన్నింటిని కలిపింది సృష్టిలోని సమస్త జీవుల యెడ దయార్ధ హృదయంతో చూడాలని, వచ్చిన మార్గాన్ని వేతకడమే నీ బాధ్యత. ప్రయత్నం చేయండి.

1)  నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.

2)  నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ వేతకకు, అది నీ అంతరాత్మలోనే ఉంటుంది.

3)   సంతోషానిచ్చేది , సంపదలు , అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వ్రుత్తి మాత్రమె.

4)  నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.

5)  మన సమస్యలకు , మన దుఃఖాలకు , మన బాధలకు పరిస్కారాలు మన దగ్గరే ఉంటాయి , కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.

6)  సంతోషం అనేది ఎంతో మధురమినది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.

7)  విజయం సాధించడములో ఎవరు నిన్ను మోసము చేయలేరు-నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్పా.

8)  నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిచుకో.

9)  నిన్ను నీవు విమర్శించించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.

10)  నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.

11)   నిన్ను నీవు మోసాగించు కున్నంతగా , ఇంకొక రేవరూ నిన్ను మోసాగించారు.

12)  దేని నైనా ఆశించబోయే ముందు అందుకు కావలిసిన అర్హతను సంపాదించుకో – తనను తానూ జయించు కోగల వ్యక్తీ అన్నింటిని జయించ గలడు.

13)   దీపము తానూ వెలుగుతూ ఉండకపోతే మరో దీపాన్ని వెలిగించలేదు.

14)  నీమీద నీకు నమ్మకం పేరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పేరుగతుంది.

15)  అనుభవం నుంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

R.B.Sathyanarayana,
Chairman, Aannadhara
Cell No: 09494420240

4/14/2016

From: R.B Satyanarayana

DEVUDU ELAA  VUNNADU?  EKKADA VUNNADU?

దేవుడు ఎలా వున్నాడు?

ఎక్కడ వున్నాడు?

సాధక బంధువులారా ! ఈ సకల చరాచర  జగత్తుకు  ఆధారభూత మైన , స్వయంభూవు అయిన ఆ పరాత్పరున్ని ,  దర్షించాలని అనాదిగా అతని దర్శనము కోసం ఎందరో మహానుభావులు, పడరాని పాట్లు పడుతున్నారు.  అయినా కొంతమంది ప్రజ్ఞావంతులయిన వారికి తప్ప మిగతా వారికి ఈనాటికి దర్శనభాగ్యం లభించలేదు. కారణం?  ఎలా దర్షించుకోవాలని తెలియక పోవడం, తెలిసినప్పటికీ గూడా  మాయ ఆవరించి ముందుకు వెళ్ళలేక పోతున్నారు.

1).  అసలు ఈ దేవుడు ఎలాగున్నాడు?  ఎక్కడ వున్నాడు?  దీనిపై మనం మాట్లాడుకుందాం. ఇది  అనాదిగా ఒక చిక్కు ప్రశ్నగా వుంది.

2,). భగవంతుని వాక్యంగా మనకు పూర్వీకులు రెండు మాటలు ప్రభోధించారు.

 1. నేను సర్వంతర్యామిని అని
 2. నామరూప రహితుడనని

దైవ వాక్కుగా మనకు వినికిడిగా వున్నది. సర్వంతర్యామి నని , నామరూప రహితుడనని,  పట్టుకుంటే దొరికేవాడిని  కానని, కాలిస్తే  కాలేవాడిని కానని, చావు పుట్టుకలు లేని వానినని,  నేనెక్కడో ఒక స్థలములో ఉండేవాడిని కానని, నేనుండు స్తలమునకు, సూర్య చంద్రాదులు గాని, గాలి గాని చొరబడదని , నాకు ఆవరణ ( లిమిట్) అంటూ లేదని,  నేను ఎప్పుడు ఉండే వాన్నని, నేను అక్షరమును గాని —-క్షరమును కాను, నాశరహితుడను, అన్ని వేళ్ళలలో అలుపెరుగకుండ అంతట వ్యాపించి వుంటాను. నాకు నామము గాని  రూపము గాని లేదు.

3).  వీటన్నింటికి   అతీతుడైన  ఆ    దైవాన్ని  ఎలా దర్శించుకోవాలో మనము ఆలోచించినప్పుడు మీకు తెలిసినదే   అయినా ఐదు పాయింట్లలో వివరించాలనుకుంటున్నాను.

4.).  నేనడుగు ప్రశ్నలకు దయచేసి జవాబులు చెప్పండి.

దేవుడు అంతటా వున్నాను అంటున్నాడు కదా? అయితే అంతటా ఉన్న  యెడల  మన  వూరిలో / మన  పట్టణం లో లేడా?

మన ఊరిలో ఉన్నప్పుడు మన ఇంటిలో లేడా?

మన ఇంటిలోన ఉంటే  మనలోన  లేడా?

మనలోన ఉంటే ఎలా వున్నాడు? ఏ రూపములో వున్నాడు?

బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి?

5.)  అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకొని ఆధ్యాత్మిక  జీననము  సాగించండి.

STEP:1.  ఈ సకల చరాచార జగత్తులో  జీవులన్ని  దేనిని ఆధారము చేసుకొని బ్రతుకుతు న్నాయో ఆలోచించండి?

ఈ జీవులన్నింటికి ఆధారము ప్రాణయే గదా? అవునా —-? కాదా — ?

చిన్న చీమ మొదలుకొని    పిపీలికాది,  బ్రహ్మాండమంత వరకు అంతటా వ్యాపించి,   అన్ని జీవులలో వున్నది ఈ ప్రాణుడే ఆధారము కదా?

అవునా —- ?  కాదా—-?

అంటే ఈ ప్రపంచము అంతా ప్రాణుడు మీద ఆధారపడినట్లే కదా?

నడుస్తున్న చిన్న చీమను త్రొక్కినచో ,  పరుగెత్తుతున్న కుక్కను కొట్టినచో, మీ  పెరట్లో పూలు, కాయలు, ఇస్తున్న చెట్టును నరికినచో,  చెట్టు  త్వరలో వాడిపోవును, ఎందుకు  వాడి పోయినది? చీమ,  కుక్క కదలక పోవడం ఏమిటి కారణం అంటారు?

ప్రాణ పోయినట్టే కదా  అంటే ఈ ప్రాణుడు మీదనే  సృష్టి యావత్తు ఆధార పడినది అని తెలుస్తుంది గదా?

 

STEP: 2.  ఒక మనిషి మరణిస్తే  ప్రప్రధమముగా డాక్టర్ గారు వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి, గాలి అడడము లేదు–మరణించినాడని  దృవీకరించుచున్నాడు, అవునా —-? కాదా —?.

ఇక్కడ డాక్టరు గారు చెప్పినట్లుగా గాలి అడడము లేదు అంటే —సైకిలు పంపు తీసుకొని గాలి కొట్టిన జీవించగలడా ! అంటే పోయినది గాలినా? ప్రాణామా?

ప్రాణ + వాయువు  కలిసి ప్రాణవాయువుగా మారును.—ఈవాయువు అంతటా వ్యాపించి వుండును.—కాని ప్రాణ మన దేహములో  (ఇంటర్నల్ గా) వుండును. ఇప్పుడు మన దేహము నుండి పోయినది ప్రాణనా—-? గాలినా—-?

పొయ్యేది ప్రాణనే ! గాలి కాదు.

గాలి పోయినట్లయితే టన్నుల కొద్ది గాలి చనిపోయిన ఈ మానవులకు ఎక్కించి బ్రతికించేవారు గదా —!

STEP: 3.  సృష్ఠి   లోని యావత్ జీవులకు ముఖ్యమైనది ఈ ప్రాణయే కదా!—-అయితే ఈ ప్రాణ ఎక్కడి నుండి వచ్చినది —?ఏ గూటి  నుండి వచ్చినది___?-ఏ కంపెనీ నుండి వచ్చినది  —–?

భారత్ గ్యాస్ నుండా—-?

HP గ్యాస్ నుండా—-?

ఇండియన్ గ్యాస్ నుండా—-?

Oxygen నుండా—-?

హైడ్రోజన్ నుండా—?

రిలయన్స్ నుండా—-?

ఎక్కడి నుండి వచ్చినది ___? ఈ ప్రాణునికి  మూలస్థానం  ఏది__?

దీని తల్లిదండ్రులు ఎవరు___ ?

ప్రాణ పోయినది అంటే —-

ఎక్కడి  నుండియో వచ్చినట్టే కదా !

ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచించి చెప్పండి ___?

దీని పూర్వీకులు  ఎవరో చెప్పండి—?

దీని పుట్టినిల్లు ఎక్కడో చెప్పండి ___ ?

పై ప్రశ్నలకు జవాబు దొరికుందనుకుంటా —-! అంటే ఈ మానవ ప్రయత్నం వల్ల ప్రాణ రాలేదని తేలిపోయింది కదా !

ఇక మిగిలింది  “దేవునిశక్తి” నుండియే కదా ఈ ప్రాణ వచ్చింది !

STEP : 4.  ఇప్పుడు  దేవుడి నుండి వచ్చిన శక్తి  నీ లోన ఏ రూపంలో వున్నది — అనగా ప్రాణుని రూపమే గదా —?

ఔనా — ? కాదా — ?

(ఆత్మ , ప్రాణ , రెండు శక్తులు వచ్చినప్పటికి  జన బాహుళ్యములో ఆత్మ అనునది  వాడుక బాషలో లేనందున—-ప్రాణుడు అనినచో అందరు గుర్తెరుగుదురు అని ప్రభు శ్రీ యోగి అచ్యుతుల  వారు  మనము ప్రాణభక్తులమని  అన్నారు)

దేవుడి నుండి వచ్చిన ప్రాణ నీ లోన ఉన్నప్పుడు,  నీవు ఇప్పుడు ఎవరి బిడ్డవో చెప్పండి –?

నీవు దేవుని బిడ్డవేనా ___? కాదా___?  ఔనూ .

STEP : 5. ఇప్పుడు దేవుడు నీ లోన ఎలవున్నాడు—ప్రాణరూ పమే కదా—నీ లోననే దేవుడి శక్తి  ఉంటే నీవు సూటుకేసు తీసుకొని పోయి  ఏ  దేవుడి  కోసం వెతుకుతున్నావ్ —?

దేవుడు నీలోన ఈ రూపములో ఉంటే నీవు బయట వెతకడం వల్ల దొరికినాడా ? దొరుకుతున్నాడా ? ముందు ముందు దొరుకుతాడా ?

ఒక వేళ నీవు తిరుపతికో —–శ్రీశైలమో—–శ్రీరంగమో—-అన్నవరమో —-శ్రీకాళహస్తికో —- యాదగిరి గుట్టలాంటి-దేవాలయాలకు వెళ్ళినప్పుడు, దేవతావిగ్రహాలను దర్శిస్తున్నప్పుడు, —- మీరు కళ్లు తెరిచి నమస్కరిస్తారా— లేదా కళ్ళు మూసుకొని నమస్కరిస్తారా? మీరు దేవుణ్ణి చూద్దామని అంతదూరం పోయి కళ్ళు  ఎందుకు మూసుకొని నమస్కరించారు. ?  అంటే  మీకు తెలువకుండానే మీలోన ఉండే దేవుని యొక్క ఆంశము  మీ కళ్లు మూతపడేటట్లు చేసి నేను బయట లేను— నీలోనే వున్నాను అని అంతర్ముఖస్థితికి పో అని హెచ్చరించినట్లు కాదా __? అంటే దీనిని  బట్టి మనకు అర్థంమయ్యేదేమిటి ? ఆ దేవుడి యొక్క ఆంశము మనని అంటి పెట్టుకున్నట్లు రుజువు అయినది కదా !

6.)  మీ దేహములోకి దేవుడి యొక్క బిడ్డ వచ్చి వున్నదని నీవు ఎప్పుడైనా  గమనించినావా ?

దాని అవసరాలు ఏమైనా చూశావా  ?  నీదేహములోకి 60 నుండి వంద సంవత్సరాల క్రితము వచ్చిన ఆ భగవంతుని బిడ్డకు ఏనాడయిన ఒక “టీ ” గాని —-

టిఫిన్ గాని—భోజనముగాని—ఎప్పుడైనా  పెట్టినావా  ?

సాక్షాత్తు భగవంతుని బిడ్డ ఐన ప్రాణునికి నీవు ఆహారము అందివ్వక పొతే—-ఇప్పుడే మీ ఇంటికి వచ్చిన   బంధువులకు

టీ— టిఫిన్ — భోజనాలు, ఏర్పాటు కాని—తండ్రి గర్భములో మూడు మాసాలు,    తల్లి గర్భములో తొమ్మిది మాసాలు ఉండి, ఈ  దేహాన్ని    నిర్మించుకొని తల్లిగర్భమునుండి—–భూగర్భమునకు వచ్చిన తర్వాత —నిన్ను కాపాడుకుంటు ఉన్నటువంటి   ఆప్రాణునికి ఆహారము అందివ్వక పోవడము ధర్మమేనా  ?

7) మీరు అన్నం పెట్టకపోతే తన తండ్రి అయిన భగవంతునికి ఈ ప్రాణ నాన్న నాకు అన్నం పెట్టలేదని -నాన్న నాకు అన్నం పెట్టలేదని , అఘోరిస్తూ తన తండ్రి కి మొర పెట్టుకోదా—-? ఆ మొర విన్న భగవంతుడు తన బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించి, జరుగుతున్న పరిస్థితిని గమనించి మనకు పుణ్యము ఇస్తాడా—? ఏమి ఇస్తాడు ? మీరే చెప్పండి.

8.)  ప్రాణునికి ఆహారము అందించే విధానం కోటానుకోట్ల మందికి తెలియదు. ప్రభు శ్రీ యోగి అచ్యుతుల వారు ——తప్పి పోయిన “ఆది విద్యను” , “సనాతనవిద్యను” ,”బ్రహ్మవిద్యను” తీసుకువచ్చి అందరికి అందివ్వాలన్న దృఢ సంకల్పంతో “ప్రాణ ధర్మాన్ని”    ,”స్వధర్మాన్ని” , నిలబెట్టాలన్న కృత నిశ్ఛయంతో వచ్చి ఆశ్రమము ఏర్పాటు చేసి మనలాంటి వారికి —– ఆ విద్యను అందించినారు.—–అదే   “బ్రహ్మవిద్య” , అదే “ప్రాణవిద్య’,  అదే ‘యోగవిద్య” .

9.). అలాంటి ప్రాణవిద్య అనగా ప్రాణునికి ఆహారాన్ని అందించే విద్య. ఆహారము ఉత్పత్తి చేయు విధానమగు గతాగతి యందు  ఉష్ణము బాగా హెచ్చు అయ్యి మనలో వుండబడిన  5  లీటర్ల రక్తము చలచల మరిగి, వేడి చేసిన నీటిలో క్రిములు చనిపోవు విధముగా —-మన బ్లడ్ లోని రోగ లక్షణాలు మరిగి ఎవాబ్రేట్ అయిపోయి—– చెమట రూపములో బయటికి వచ్చును.—–గతాగతి తరువాత నిశ్శబ్దస్థితిలో బ్లడ్ యధావిధిగా ఏర్పడిన అనంతరం  బ్లడ్ లో ఒక వాయు రూపకము just like ozone  లాంటి ఆశనమును ఉత్పత్తి చేసుకొనును ——అనగా పాలను కాచినచో పలుచని మీగడ పేర్కొనునట్లుగా , ఆ విధంగా “ప్రాణునికి” కావలసిన “అన్నము”  ఉత్పత్తి అగును.  ఆ ఆహారము  సుషుమ్న ద్వారా ప్రాణుని దగ్గరకు చేర్చబడును—– ప్రాణ అశన స్వీకారము చేసిన తదుపరి మనసును కలుపుకొని—- ఆత్మ స్థానమునకు బయలుదేరును . తదనంతరం తన తండ్రి అయిన పరమాత్ముని దగ్గరకు బయలుదేరును—- ఇది మానవ జీవితములో చేయవలసిన ప్రక్రియ—-సృష్టి లో ఏది వచ్చిన ప్రాసెస్ చేయకుండా   ఒరిజినాలిటీ బయట పడదు.

Ex:___సజ్జ,—-జొన్న,—-వరి,—–లాంటి ఏ గింజ గాని  ప్రాసెస్ చేయకుండా గింజ బయట పడదు. అలాగానే మానవుడు కుడా ప్రయత్నపూర్వకముగా ప్రాసెస్ చేసినచో ఆ  దైవీశక్తులు గోచరమై  దైవకృపకు  అర్హత సాధించగలము —- దైవ దారి ఇలా ఉండగా “దేహమే దేవాలయంబని, —-  ఆత్మే  పరమాత్మ యని” ఎందరో పెద్దలు ప్రభోధించినారు ,—- ఆ ప్రభోధనను పెడచెవిన పెట్టిన నేటి మానవుడు అష్టకష్టాల పాలౌతు దుఃఖపూరితమైన  జీవనము కొనసాగిస్తున్నాడు . ఇందుకు

10.).  Ex__దైవీశక్తులు,

ప్రాణ +  ఆత్మ + మనసు ఈ మూడింటిని వియోగములో  పంపడమే మహా పాపము.

11.).  ఈ   దైవీశక్తులను భగవంతునిలో  లీనము చేయడమే మహా పుణ్యమని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ   ఆ  మూడు శక్తులను   క లుపడమే యోగమని  18  ఆధ్యాయములలో

యోగము యోగము అని ప్రవచించినారు.

12.)వీటి అర్థాలు—- పెడార్థాలై ఉచ్ఛస్థితిలో పోవాలిసిన మానవుడు,   నీచస్థితిలో  పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు.—-అందుకే యోగమే శరణ్యము,  మానవుడు ఆచరించవలసిన  కర్తవ్యము.

దేవుడు ఎలా ఉన్నాడో , మీకు అర్ధం  అయ్యిందనుకుంటాను.  ఇది చదివిన తర్వాత మీరే జవాబు వ్రాసుకోండి.

Note:  పై విషయమంత మీ అందరికి  తెలుసు, కాని నాకు తెలిసినంత నేను చెప్పాను. ఏమైనా పొరపాట్లు వున్నచో తెలుపాలని కోరుచున్నాను.

R B Satyanarayana.
Chairman, Annadhara.
Cell No: 09494420240

4/16/2016

From: R.B Satyanarayana

💐  ఓం శ్రీ  ఆదిదేవాయ అచ్యుతాయనమ: 💐

———————————————-
దైవాంశ  అయిన    ఆత్మ,    ప్రాణ, మనసు మన దేహములో వున్నా ! మానవునికి ఎందుకీ దుఃఖం?
———————————————-

పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ,  ప్రాణ, మనసు మనదేహములో ఉన్నప్పటికీ కూడా మానవులు దుఃఖానికి గురికావడం ఏమిటి—? అని మనం చర్చించు కుందాం.

1.)    ఆత్మ అనునది బ్రహ్మపురిలో సుప్తావస్థలో ఉంటుంది.  అంటే మన  మెదడులో థర్డ్ వెంట్రికల్ లో నిక్షిప్తమై వుండి ఈ దేహ సామ్రాజ్యాన్ని  ఏలడం కోసం ‘ప్రాణ,”   “మనసు” ని కిందికి దింపి తను యధాస్థానములో కూర్చొని స్వయంప్రకాశమై ఉంటు అన్నింటికి  ద్రష్ట అయి కూర్చున్నది. రాబడినటువంటి

2 ) ” ప్రాణ” (PRANA):—    ప్రాణకు అనుచరగణమైన పంచ ప్రాణాలు  1. ప్రాణ, 2.అపాన, 3.వ్యాన, 4.ఉదాన, 5. సమాన వాయువులు , వీటితో పాటు ఉపవాయువులు 1.నాగదత్త,  2.కూర్మ, 3. కృకర,  4.దేవదత్త,  5. ధనంజయల తో కలసి ఈ దేహసంరక్షణలో  ఇవి తోడ్పడుతూ తమ తమ విధులను నిర్వహిస్తాయి. దేహములో  వుండబడిన కోటానుకోట్ల జీవకణాలకు కావలసిన  గాలి,  నీరు,   ఆహారాన్ని  రక్తం ద్వారా అందిస్తుంది.———

*  ప్రాణ బ్రెయిన్  రీజన్ లో  “ఫోర్త్ వెంట్రికల్” లో   వుండి రెస్పరేటరీ systam   ద్వారా అన్నింటిని ఆక్టివ్ చేస్తూ తమలో ఉష్ణం తగ్గకుండా  98 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ గా ఉంచుతూ తన విధి నిర్వహణలో   ఎలాంటి అలసట  ఎరుగక     జాగ్రత్, సుషుప్తా అవస్ఠలల్లో కూడా పని చేస్తూ సజీవంగా వుండునట్లు తన విధిని నిర్వహిస్తుంది. దేహము ఈ రకముగా నిలవడానికి కారణం  ఈ ప్రాణయే ! దీనినే   “క్రియాశక్తి” అంటారు.

3.)  మూడవ శక్తి అయినటువంటి మనసు (ఇచ్ఛాశక్తి)  ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తూ తన  ఇష్టారాజ్యంగా అజ్ఞానముతో తమోగుణ స్థితిలో చేయరాని  కర్మలు చేస్తూ,దాని ఫలితాలను , జీవాత్మకు అంటగడుతూ  అనేక జన్మలకు నెలవవుతుంది.  బంధానికి మోక్షానికి కారణభూత మవుతుంది (మన ఏవ మనుష్యానామ్…)

4.)  అన్ని జన్మలలోను మానవ జన్మయే ఉత్తమోత్తమమైనది. జన్మలు తన కర్మానుసారాన్ని బట్టి మారుతుంటాయి. అసలు జన్మలు మూడు రకములు.

 1. దేవ జన్మ, 2. మానవ జన్మ 3.జంతు జన్మ.

ఇందులో కర్మల ఫలితాలను బట్టి జన్మ లెత్తుతుంటారు. కర్మలు ఆ జీవునితోపాటుగా కలిసి ప్రయాణిస్తాయి. అదే శరీరమనే బంధనము. ఈ బంధనము తోనే మనిషి ఈ లోకములోకి వస్తున్నాడు.

5.)  ఈ దుఃఖానికి   నిలయ మైనటువంటి  శరీరాన్ని ధరించడం వల్ల ఈ దుఃఖబాధలు అనుభవించాల్సివస్తుంది.

6.)  జన్మ జన్మాన్తరాలలో మనము చేసుకున్న కర్మలవల్ల, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం జన్మ అనేది     ఎత్తవలసి  వస్తుంది. అంటే   శరీరాన్ని ధరించాల్సి వస్తుంది.

7.)   మనం చేసే కర్మలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉంటాయి. ఈ జన్మలోనే కాకుండా వెనుకటి జన్మలలో కూడా కర్మలు చేసి వుంటాము. ఆ కర్మలే శరీరానికి బంధనాలు అవుతాయి. అంటే మనము చేసే శుభాశుభ కర్మల యొక్క సంస్కారముతో బంధింపబడి ఉన్నదన్నమాట.

8.)  పూర్వ   కర్మల ఫలితానుసారంగా  వచ్చిన ఈ శరీరముతో మళ్ళీ మళ్ళీ చేయకూడని కర్మలు చేస్తూ ఈ శరీరాన్ని ఇంకా బంధించు కుంటున్నాము. మనలో ఉన్న స్థూల మనసుతో బాహ్యవిషయాల యందు ప్రలోభపడి , స్థాయికి మించిన కోరికలతో అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని అనుభవించ టానికి అనేక జన్మలు పొందుతూ—చస్తూ    జనన    మరణాలనే చక్రములో  తిరుగుతుంది.

9.)  అందుకే జన్మ అనేది ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నకు మనము చేయు కర్మల ఫలితాలే.  ఈ జన్మలో  కూడా ఇంకా ఇంకా కర్మలు చేస్తూ మనను మనమే బంధించు కుంటున్నాము. ఈ కర్మ శృంఖలాలా నుండి విముక్తి పొందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ   శరీరమనేది   కర్మఫల స్వరూపమే.

10.)  మనసు ఈలాంటి కర్మ చేయడానికి కారణం మనసులో పుట్టు తృష్ణ (కోరిక)  వల్లనే . తృష్ణ చేత  ప్రేరేపించబడి ఏ వస్తువు అయిన నాది,  అధికారము నాదే అని, ఇది నాకోసమే అని,  ఉన్నాదల్లా నాకే అని,  అంతా నేనే నని, అంతా నాకోసమేనని, అహంకారము పుడుతుంది. దీనికి కారణం అవివేకమే, విచారణాశక్తి లేకపోవడమే.ఈ వివేకశక్తి లేని వారికి “అంతర్ దృష్టి ” ఉండదు.

11.)  అవివేకము అనేది అజ్ఞానము వల్ల కలుగుతుంది, అజ్ఞానము వల్ల దుఃఖము కలుగుతుంది.    ఒకదానికొకటి సంభంధం కలిగివున్నాయి. ఎలాగంటే,  చెట్టు బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది —- ఆ బీజమే మళ్ళీ చెట్టును ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే అజ్ఞానము దుఃఖానికి కారణమైతే —- ఆ దుఃఖమే అజ్ఞానానికి కారణమౌతుంది. ఆ విధంగానే ఈనాడు మనము చేస్తున్న కర్మలన్ని పూర్వజన్మ సంస్కారం యొక్క  ఫలితాలే  గదా !

12.)  ఈ విధమైన  కార్యాకారణ ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. దీనికి మూలమేమిటి అవిద్యాత్మక మైన (బ్రహ్మవిద్య లేక)  అజ్ఞానము.  ఈ అజ్ఞాన స్థితిలో దుఃఖము కలగటం అనేది తప్పనిసరి. కాబట్టి దుఃఖము అజ్ఞానము అనే రెండు ఒకదానినొకటి కారణాలుగా వున్నాయి. అజ్ఞానము వున్న చోట దుఃఖము తప్పదు.

13.)  అజ్ఞానమనగా ఆ పరాత్పరుని నుంచి వచ్చిన ఆ మూడు శక్తులను ఏకము చేయక పోవడమే ప్రథమ అజ్ఞానము. విడదీసి పంపడమే దుఃఖానికి కారణం. దానివల్ల కర్మఫలితాలు  అనుభవిస్తు జీవితములో గందరగోళ   పరిస్థితులు   ఏర్పడి. అస్తవ్యస్త మైన జీవనముతో  సుడిగుండములో చిక్కుకున్న నావ లాగా పరిస్థితి ఏర్పడింది.

14.) నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నము చేయక గత జన్మల లాగానే ఈ జన్మలో అశ్రద్ధ చేస్తే ఇంకా ఈ శరీర బంధనము లో ఇరుక్కోని ,” పునరఫి జననం,” “పునరఫి  మరణం” పొందుతున్నాము.

15.)   వచ్చినవి దైవీశక్తులు అయినప్పటికి  , వాటిని  దైవీ శక్తులుగా గమనించక, తేలిక భావముతో, తృణప్రాయముగ ఎంచి , వాటి బాగోగులు చూడక, సరయిన విధానములో జీవనము గడపక , తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం  కూడా ఈ దుఃఖానికి ఒక కారణం.

ఉదా:- పది లక్షలు వెచ్చించి ఒక కారును తీసుకొని దానిని సరి అయిన విధానములో నడుపక మందు మత్తులకు బానిసయై ఆ  వాహనాన్ని లోయలో పడేసినచో కంపెనీ వారిది తప్పగునా—? లేక డ్రైవరు నిర్లక్షమా –?  మనము బట్టల కొట్టులో తెల్లటి వస్త్రము తెచ్చుకొని ధరించి దానిపై పడు మురికిని తొలగించుకోకపోవడం మన పొరపాటా–? లేదా కంపనీ పొర పాటా–?   దీని బాధ్యత ఎవరిది—?

16.)  అదేవిధంగా పవిత్రమైన దైవీ  శక్తులను అపవిత్రంగా తయారు చేసుకొని చిందర వందర జీవితము గడుపుతున్న  ఈ మానవుని నిర్లక్ష్యమే కాదా ! దాని వల్ల జీవితాలు వ్యర్ధమై పోతున్నాయనేది నిర్వివాదాంశము కాదా !

17.)  జీవాత్మ , పరమాత్మలో ఐఖ్యము చెందితే తప్ప దుఃఖ నివృత్తి   అనేది   అసంభవము జీవాత్మ పరమాత్మ ఐక్యతకు మూలము ఈ   సాధనయే.(బ్రహ్మవిద్యయే)

18.) భగవంతునిలో ఈ జీవాత్మని ఐక్యము చేసి మోక్షము ఇప్పించ గలిగే ఈ సాధనకు ఎంతో ప్రాముఖ్యత వున్నది. దానిని విజ్ఞులయిన మీరు తేలిక భావముతో చూడగూడదు . దాని యెడల నిర్లక్ష్యము వహించ కూడదు. నీ కర్మలు నీవు ఇక్కడే కాల్చుకోవచ్చని  భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ  నొక్కి ఒక్కాణించారు “ప్రయత్నా ద్యత మానస్తు, యోగి సంశుద్ధ కిల్భష:” అనే శ్లోకం ద్వారా ప్రజానికానికి ఒక  గొప్ప సందేశాన్ని అందించారు. అది గమనించగలరని మనవి. మీ దుఃఖాలకు కారణం మీరే— ? ఔనా___?  కాదా____?

NOTE: ఈ విషయాలన్ని మీ అందరికి తెలిసినవే, ఈ చిన్నవాడు చెప్పిన దానిలో ఏమైన పొరపాట్లు ఉంటే పెద్దలయిన మీరు పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R B Satyanarayana,
Chairman, Annadhaara,
Cell No: 09494420240

4/19/2016

From: R.B Satyanarayana

గౌరవ    సాధకులు ,    విద్యాశ్రీ  జయంత్,  నారాయణపేట గారికి నమస్కారం.  మీరు అడిగిన ప్రశ్న స్తూల,  సూక్ష్మ,  కారణ,  మహాకారణ శరీరాలను గూర్చి వివరించమని   కోరినారు . దానికి  వివరణ

💐 ఓం  శ్రీ  ఆదిదేవాయ  అచ్యుతాయనమః 💐

1)  స్థూలదేహము    అనగా  పంచభూతముల   ద్వారా  ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహమే ఈ  స్థూలదేహము  (పంచభూతములు అనగా,.ఆకాశము,  వాయువు,  అగ్ని,   జలము,  పృథ్వి. )

2)   ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్క శక్తి  వచ్చినది. పరబ్రహ్మము నుండి అన్ని మహత్తు లు పుట్టి వాటినుండి ఆకాశము,  ఆకాశము నుండి  వాయువు,  వాయువు నుండి అగ్ని,  అగ్ని నుండి  జలము, జలము నుండి పృథ్వి.  వీటి  చేరిక  వల్లనే మానవ  దేహము ఏర్పడుతుంది.

3)    మొదటి దైన ఆకాశ తత్వము నుండి  ఐదు పంచకములు ఏర్పడినవి అవి 1. జ్ఞాత 2.మనసు 3.బుద్ధి 4. చిత్తము 5. అహంకారం. వీటి సమ్మేళనమే శరీరము నందు వుండును.—-వీటిని అతీంద్రియములు   అని పిలుచుదురు.

4)   వాయు తత్వము నుండి

 1. ప్రాణవాయువు,
 2. సమానవాయువు,
 3. వ్యానవాయువు,
 4. ఉదానవాయువు,
 5. అపానవాయువు, వచ్చినవి.  వీటినే పంచప్రాణాలు అందురు. అవి తమ తమ విధులను నిర్వర్తించును.

5)  అగ్ని   తత్వము  నుండి

 1. శ్రోత్రము 2.త్వక్ 3.చక్షువు  4.జిహ్వ  5. ఘ్రాణము వచ్చినవి.

వీటినే  జ్ఞానేంద్రియములు అందురు.(అగ్ని పంచకములు)

6)  జల తత్వము నుండి

1.శబ్ద  2. స్పర్శ 3. రూప 4.రస 5. గంధ ములు వచ్చినవి. వీటిని పంచతన్మాత్రలు  అందురు.

7)  పృథ్వి తత్వము నుండి

1.వాక్కు 2. ఫాణి 3. పాదము 4. గుహ్యము 5.పాయువు వచ్చినవి.  వీటిని కర్మేంద్రియములు అందురు.

8)  వీటన్నిటి కలయికయే స్థూలదేహము . (దీనిని జాగ్రతావస్థ అందురు)

9)  కొంతమంది   అనేక శరీరములున్నవి అంటారు. అనగా

 1. స్థూల 2.సూక్ష్మ 3. కారణ దేహములు అంటారు. మరికొందరు మహాకారణ దేహము అని కుడా అంటారు.

పైన చెప్పిన 25 తత్వములతో కూడిన దేహమునే  స్థూలదేహము అంటారు.

10)  సూక్ష్మదేహము  అనగా జ్ఞానేంద్రియములు   ఐదు, శబ్దాదులు ఐదు (కర్మేఇంద్రియాలు)

ప్రాణాదులు ఐదు, మనసు,  బుధ్ధి, రెండు   అనగా    మొత్తం    17 తత్వములు  కలిసిన దానిని సూక్ష్మదేహము అందురు.  దీనినే లింగశరీరము అని కూడా అంటారు. (ఇది స్వప్నావస్థలో జరుగు  ప్రక్రియ.)

11)  స్థూలదేహములో వున్నా దశేన్ద్రియములు సూక్ష్మదేహము లోకి ఏరూపములో పోయినవి —?

అనేది మీకు ప్రశ్నగా మారవచ్చు—- అందుకే ఆయా ఇంద్రియాలకు సరి అయిన నిర్వచనము— పైకి కనిపించే చెవులు కాకుండా (పైకి కనిపించే డొప్పలు కావు) వాటికి భిన్న మైనట్టి ఆ చెవుల రంద్రాలలో వ్యాప్తమై వున్న శూన్యాన్ని ఆశ్రయించు కొని శబ్దాన్ని గ్రహించే శక్తి కలిగినట్టి  సూక్ష్మ ఇంద్రియాన్నే  శ్రోత్రేన్ద్రియం  అంటారు. ఇలాగే మిగతా ఇంద్రియాలు కూడాను.

12)  మనకు   పైకి  కనిపించే చర్మానికి భిన్నమైనది, అపాదమస్తకం వ్యాప్తమై, శీతోష్ణాది  స్పర్శానుభూతిని కలిగించే  సూక్ష్మేంద్రియాన్ని  త్వగ్గీన్ద్రియం అంటారు.

13)  కండ్లకు భిన్న మైనట్టి కండ్లను అశ్రయించి వున్నట్టి , కనుగుడ్డుకు అగ్ర భాగములో ఉంటు రూపాన్ని గ్రహించే శక్తిగల సూక్ష్మేన్ద్రియాన్ని చక్షురీన్ద్రియం అంటారు.

14 )  కేవలం నాలుక కాకుండా ఆ నాలుకను ఆశ్రయించి నాలుక యొక్క అగ్ర భాగములో ఉంటూ తీపి, పులుపు మొదలైన రసాలని, రుచులని గ్రహించ గలిగే సూక్ష్మేన్ద్రియాన్ని   జిహ్వేంద్రియం అంటారు.

15)  అట్లాగే పైకి కనిపించే ముక్కుకు భిన్నమైనదై ఆ ముక్కును ఆశ్రయించి ముక్కుకు అగ్రభాగములో గందాదుల్ని (వాసనలను) గ్రహించే శక్తి గల  సూక్ష్మేంద్రియాన్ని ఘ్రాణేంద్రియం అంటారు.

16)  కర్మేన్ద్రియాలంటే, మాట్లాడే ఇంద్రియమైన  నాలుక,  పనిచేసే చేతులు, నడిచే పాదాలు, మలమూత్ర విసర్జన చేయు గుదము, జననేంద్రియములు బయటికి కనిపించే పనులు చేసేందుకు కారణ మైనట్టి ఇంద్రియాలు.  వాగేన్ద్రియము అంటే వాక్ కు  భిన్న మైనట్టి వాక్ కు ఆశ్రయ మైనట్టి ఎనిమిది స్థానాలలో ఉంటూ శబ్దోచ్చారణకు సమర్ధ మైనట్టి ఇంద్రియం , శబ్దోచ్చారణకు వినియోగించే ఎనిమిది స్థానాలు  1.హృదయం   2. ఖంఠము  3. శిరస్సు (మూర్ధ్వం) 4. తాలువు 5. నాలుక      6.దంతములు      7. పెదవులు      8. ముక్కు  అంటారు. ఇలాగే ఒక్కొక్క దానికి స్థూలానికి, సూక్ష్మానికి వున్న  తేడాను గమనించండి.(ఇది స్వప్నావస్థ)

17)  కారణశరీరము అంటే స్థూల, సూక్ష్మ(లింగ) రెండు దేహాలకు హేతుభూత మైనది. అనాది ఐనట్టి,  అనిర్వచనీయమైనట్టి , ప్రకాశస్వరూపుడైనట్టి, బ్రహ్మ, ఆత్మలు రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మరలిస్తుండేటువంటి అజ్ఞానాన్నే కారణశరీరము అంటారు. ఆత్మ, పరమాత్మల     అభిన్నత్వాన్ని, అధ్యైతభావాన్ని, అనుభవములలోనికి రానీయకుండా నివారిస్తుంటుంది.  ఈ కారణశరీరము — అనాది ఐనట్టి , అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటారు —- ఇటువంటి ఉపాధికి భిన్నమయినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. —- శరీరము అనే పదము దీనికి వాడుతున్నారు. కారణశరీరము ఎట్లా క్షయమౌతుంది— ? బ్రహ్మ, ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానము వల్ల ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడం తోనే ఈ కారణ శరీరము క్షయమైపోతుంది.

18)  సర్వ వ్యాపాకుడైన ఆత్మయే విశ్వానికి  జీవశక్తి అయినాడు. అంటే మూలతత్వము. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మలోనే లయమైపోతాయి. కాబట్టి ఆత్మ, పరమాత్మలు  ఒకటే అనే జ్ఞానము కలగడంవల్ల శరీరం అనేది     మిధ్య    అనేది తెలిపోవటంతో ఈ కారణశరీరము పోతుందని భావము. మిగిలేది చిత్తము, జ్ఞాతతో(ఆత్మతో) కూడుకున్నది.దీనినే ప్రాజ్ఞుడు అని అందురు. ఇది నిద్రావస్థ లేదా సుషుప్తావస్థ.

19)  మహాకారణ అనగా ఏ తత్వము లేక స్వయం జ్యోతి యై, సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యము నే మహాకారణము అందురు. దీనినే అనుభవజ్ఞులు హిరణ్యగర్భుడు అని అక్షర పురుషుడని ఇంకా అనేక పేర్లతో కొనియాడారు.

NOTE:  ఈ విషయములన్ని పెద్దలైన మీ అందరికి తెలుసు. పిన్నవాడిని తెలిసినంత వరకు చెప్పాను. పెద్దలయిన మీరు పెద్ద మనసుతో ఏమైనా తప్పులు ఉంటే తెలుపుతారని మనవి.

R B Satyanarayana,
Chairman, Annadhara.
Cell No: 9494420240.

4/21/2016

From: R.B Satyanarayana

గౌరవ సాధకులు విద్యాశ్రీ ఆదిత్య గారికి నమస్కారం. పైన మీరు అడిగిన ప్రశ్నలకు వివరణ.

💐 ఓం శ్రీ  అచ్యుతాయనమః 💐

1 వ ప్రశ్న : “KNOW THY SELF” అనగా  నేమి ?

నిన్ను నీవు తెలుసుకో అనగా నేమి ?

1.)  నిన్ను నీవు తెలుసుకో అనగా—? నేను అనగానేమి—?

ఈ సృష్టి అనగా  నేమి —-?

నేను ఎక్కడి నుండి వచ్చాను—?

నేను ఎక్కడికి వెళతాను —?

నేను అను రెండు అక్షరాల అర్ధమేమి —? అను తెలుసుకొను విషయమే “KNOW THY SELF”.

2.)   తనను తాను ఎరుంగ వలెనను  సహజ కాంక్ష మనలో వచ్చినప్పుడు దానిని తెలుసుకొను దాకా తనకు తృప్తి లభించదు. తెలుసుకొను నంత వరకు మనము బ్రతుకుటయూ అగత్యమే కదా ! ఆ రీతి బ్రతికి ఉండుట చావుకు గురికాక ఇచ్చామరణుడు ఎలా అవుతాడని ఆ సమస్య మనలని వేదించును. అందుగూర్చి ఈ దేహము లొనే తానొచ్చిన మార్గము వెతికి  స్వస్వరూపజ్ఞానము పొంది, ఆత్మదర్శనము చేసుకొని, పరమాత్మ దర్శనము చేసుకోను వరుకు వెళ్లి మూలచేతన మైన , సర్వాత్ముడయిన ఆ “స్వరాట్”, “విరాట్”, లను జపములో దర్శించి తన స్థాన మేదో అవగాహన చేసుకొని వెళ్ళ వలెను. అదే తనను తాను తెలుసుకొనుట.

3.)  యావత్ సృష్ఠికి మూలమైన ఆ శక్తిని ఎరుగుటయే తనని తాను తెలుసుకొను విధానము. దీనికోసమే యుగ యుగాల నుండి పూర్వీకులు నేను ఎవరను ప్రశ్నతో యోగులు, ఋషులు,  మునులు,  తపస్వులు, ఉపనిషత్కారులు, మొదలగు ఋషి సాంప్రదాయ మంతా తమ తమ తపస్సులలో అహర్నిషలు ప్రయత్నము చేస్తూనే వున్నారు.

4.)   ఇది ప్రతి మానవుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యము. ఇది ఎవరి మీదనో  గొప్పవారము,  అధికులము కావాలనేది  కాకుండా తమకు తామే స్వరూపజ్ఞానము పొందాలి. అలాంటిదే “నిన్ను నీవు తెలుసుకో”.

5.)  “నిన్ను”,  “నేను” అనగా స్థూలములో  చెప్పు సమాధానములు కావు. ఇవి సూక్ష్మ స్థితికి చెందిన భావనలు.

6.)   నేనెవడను—?

సప్తధాతువులచే   ఏర్పడిన స్థూలదేహమును  “నేను “కాను —

శబ్ద, స్పర్శ, రూప, రస గంధము లను పంచవిషయములను “నేను” కాను —శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణము    లను  జ్ఞానేంద్రియములైదు “నేను” కాను.

వచన,  గమన,  ఆదాన,  మలవిసర్జన, ఆనందము   లను ఐదు కార్యములను చేయునట్టి  వాక్, పాద,  ఫాణి,  పాయువు, ఉపస్థ,  లను కర్మేంద్రియములైదు “నేను” కాను.

శ్వాసాది పంచ వ్యాపారములను చేయు ప్రాణాది వాయు పంచకము “నేను” కాను.

తలంపుల యొక్క మనసును నేను కాను.

విషయ వాసనలతో  కూడి, సర్వ విషయము లందు ఇరుక్కోని, సర్వ వ్యాపారములను చేయు అజ్ఞానమును  “నేను” కాను.

7.)   పైన చెప్పినవన్ని నేను కాననినచో అప్పుడు నేనెవడను _? వీటన్నింటికి “నేను” కాదని ప్రత్యేకంగా నిలిచి ప్రశ్నించు,(విచారణాశక్తి) ఎఱుకయే  “నేను”

8.)  “ఎఱుక ” స్వరూపమెట్టిది–?

ఎఱుక     స్వరూపమే చైతన్యవంతమైన, నిత్యానంద మైన,  ఆ పరబ్రహ్మ స్వరూపమే,                సచ్చితానందము,  (సత్ + చిత్ + ఆనందము,) అదే  “నేను” అయి వున్నాను. ఈ సచ్చితానందాన్ని జప సాధనలో తీవ్రత హెచ్చి తన యొక్క తపనయే  తపస్సు గా మారినప్పుడే ఆ సచ్చితానంద మూర్తి   దర్శనమగును.  దృశ్యముగా వున్న ఈ జగత్తు కనపడక     పోయినప్పుడు    ఆ స్వరూపము     యొక్క దర్శనమగును.

9.) దృశ్య మైన ఈ  జగత్తు ఎప్పుడు  కనపడక పోవునో —?

సర్వవిషయ జ్ఞానములను, సర్వ స్థూల వ్యాపారములకు కారణమగుతున్న మనస్సు తన చేష్టలు అణిగినప్పుడు ఈ స్థూల జగత్తు అంతయు అంతర్ధాన మగును. మనసు నుండియే అన్ని తలంపులు   (ఆలోచనలు) తోచుచున్నవి, తలంపులు త్రోసివేసినప్పుడు అక్కడ   మనస్సనేది లేదు. కనుక తలంపులే మనసు యొక్క స్వరూపము.

10.)  ఈ మనసు యొక్క తలంపులు   పోవాలంటే “నేనుఎవడను” అను సదా విచారణ చేత  ఇతరము లైన తలంపులన్ని నాశనము చెంది ఆ తరువాత స్వరూప దర్శనమగును. దానినే “KNOW THY SELF” నిన్ను నీవు తెలుసుకున్నట్లు అగును. అప్పుడు “నెనుఎవడను” అను దానికి సమాధానము లభించును.

11.)  ” నేను” అనగా ఈ కనపడు దేహమును  కాను .ఈ విశ్వములో కనపడే సమస్త పదార్థములు ఏవియు  “నేను” కాను. ఇవి అన్నియు అనాత్మ స్థితివి అత్మవి కావు. వీటన్నిటిని చూసిన వాడే ఆత్మ. అంటే పరబ్రహ్మ స్వరూప మైన పరమ పురుషుడే ద్రష్ఠ. అతడే   నిత్యుడు .

12.) ఆత్మ, అనాత్మ అనగా  — ?

ఈ కంటికి కనపడే ప్రతిది అనాత్మ స్థితిదే . ఈ కనపడనిది ఏదో ఆత్మ అయి వున్నది.  ఆత్మ చిన్మయ మైనది.  చిన్మయ స్వరూపమే, అవ్యక్తమే , శాశ్వతమైన ఆత్మయే “నేను”   అనునది.

2 వ ప్రశ్న:   దేవతలకైనా  రాక్షసులకైనా  ఇచ్చినది ఒకేవిద్య , ఎందుకు అలా మారారు—?

1.)   ఓకే  బ్రహ్మవిద్య ఐనప్పటికీ సాధనలో వచ్చు మార్పులను విచక్షణా బుద్ది తో అవగాహన  చేసుకోక పోవడం  వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతాయి.    సాధనలో  సాధకులు గమనించవలసిన  ఒక విషయము. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సాధన చేయు సాధకులు బహు ప్రీతితో, తెలుసుకోవాలన్న   తపనతో,  సాధించాలన్న   లక్ష్యముతో, జపము చేస్తూ ఆ గతాగతి తీవ్రంగా చేసినవారికి   ఆశనోత్పత్తి  జరుగును. ప్రతి దినము ఆలా సాధన చేయడం వల్ల ఆశనోత్పత్తి జరిగి ఆ ఆశనాన్ని  ప్రాణ స్వీకారము చేస్తూ బలిష్ఠు డై, దిన దినాభివృద్ధి చెంది,  నూతన ఉత్సాహం తో “హూ” అను ఝంకారముతో అహంకారము హెచ్చి  “యుగోఇజం” పెరుగును.

2.)   తదుపరి ప్రాణ, మనసు స్నేహం తో ముందుకు   వెళ్ళు సందర్భముగా ఒక వింతైన సంఘటన ప్రతి సాధకునికి సూక్ష్మస్థితిలో  గోచరమగును . ఆ స్థితికి వెళ్లిన తర్వాత జపములో అక్కడ రెండు మార్గములు కనిపించును. దీనినే బైబిల్ లో ఒక వాక్యము చెప్పబడినది. “Wide is the gate and broad is the way that leadth to destruction”. దీనినే నాశనమునకు గొంపోవు ద్వారము విశాలము గాను వెడల్పు గాను వున్నది అన్నారు.

3.)  ఇక రెండవది శాశ్వత జీవనము, జీవిత సాఫల్యము, మానవకర్తవ్యము,  సాధ్యపడునని “sraight is the way and narrow is  the gate that leadth unto life.  అని చెప్ప బడినది. ఆ మార్గములు మనలోనే వున్నాయి.వీటినే ప్రవృత్తి, నివృత్తి మార్గములు అంటారు.

4.)  ఈ స్థానములో సాధకులు ఎంత తీవ్ర మైన తపస్సు చేసినప్పటికీ ఆ తపస్సు జ్ఞానానికి ఉపయోగ పడక అహంకారానికి హేతువై పోవును.  ఓకే విధమైన జపము ఓకే విధ మైన ఫలితాలు రాకుండా తమ తమ ప్రవృతులను బట్టి  రాక్షసత్వంగా, దైవత్వముగా విభజింప బడుతుంది. ఓకే విధమైన విద్యలో ఇలా ఫలితాలు రావడానికి కారణం తమ తమ సంచిత,  అగామి, ప్రారబ్దకర్మలే కాకుండా ఆ కర్మలను ఈ మానవ దేహములో కాల్చుకోవచ్చని భగవధ్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు”ప్రయత్నా ద్యతమానస్తూ” అని చెప్పినప్పటికీ అజ్ఞానముతో కాల్చుకోక పోవడం ఇది మానవ తప్పిదమే కదా !

5.)   అజ్ఞానస్థితిలో మైమరచి  విర్రవీగుతూ అహంకారపూరిత భావాలతో వెళ్ళినచో ఆ విశాల మైన రోడ్డు (నరకమునకు తీసుకపోవునది) మార్గములో వెళుతుంటారు. ఇక్కడ విచక్షణ కలిగిన సాధకుడు ఇరుకైన స్వర్గ  మార్గమును ఎంచుకుంటాడు. ఆ  మార్గములో ప్రతి సాధకుడు వెళ్ళ వలసిన అగత్యము వున్నది.

6.)   కాని అంతరాత్మ ప్రభోధమునకు విలువ నీయక ఆ విశాల మైన మార్గముననే పయనించెదరు. ఈ మార్గమున పయనించినవారు రజో, తమో, గుణ ప్రవృత్తి కలిగి అజ్ఞానాంధకారములో కొట్టుకు పోతూ అహంకార బుద్ధి తో రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు.

7.)   ఆ కోవకు చెందిన వారే  రావణాసురుని లాంటి వారు. అతని అఘోరమైన తపస్సు హఠ యోగముతో చేసి దేవతలను మెప్పించి వరాలు పొందుతారు. ఆ కోవ లొనే శంకరుని యొక్క మెప్పు పొందారు. అక్కడ  హఠయోగ ప్రవృతితో సాధన చేసి తమ తమ ఇష్ట దేవతలను కొలిచి సిద్ధులు, వరాలు  మొదలగునవి పొందవచ్చును. ఐనా హఠయోగ ప్రయోగముతో స్తూలమునకు వినియోగింపబడును. కాని సూక్ష్మ స్థితి లో జ్ఞానాన్ని పొంది ” నేను ఎవడను”  అని విచక్షణ చేసుకోక ముందుకు సాగిపోతుంటారు.మూల పురుషు డైన , ఆనంద స్వరూపు డైన, ఆ మూర్తిని దర్శించలేరు. చిత్ శక్తికి హఠయోగ  ప్రయోగము పనికిరాదు. తపస్సు ,జ్ఞాన కాంక్షి కాలేక అజ్ఞాన ప్రవృత్తిలో చేయకూడని కర్మలు చేస్తూ ప్రజాహిత మైనవి కాకుండా, లోకాకళ్యాణంకోసం కాకుండా, స్వలాభాపేక్షతో, స్వార్థపర బుద్ధితో, అధర్మ ప్రవర్తనతో, నేనె అనే అహంతో  ఈ దారిలో  వెళ్ళినవారు ప్రవర్తిస్తారు.  దీనినే  రాక్షస ప్రవృత్తి అంటారు.

3 వ ప్రశ్న: మామిడి  చెట్టు  పండ్ల గూర్చి–?

1.)    ఒక  స్థలములో పెట్టబడిన మామిడి చెట్టు వాటి యొక్క ఫలాలు చాలా మధురాతి మధురముగా ఉండగలదు. వాటి యొక్క విత్తనాలె వేరే స్థలాలలో నల్లభూములు, రేగడి భూములు, ఎర్రనేలలు, చవిటి నేలలు,  లో విత్తి నప్పుడు ఆ స్థల గుణ ప్రభావముల చేత వేరు వేరు ఫలితాలు రాగలవు. రుచులు కూడా మారిపోవును. కారణం—? స్థల మార్పిడినల్ల దాని తియ్యటి దనము  యొక్క గుణము మారిపోవును.

2.)   అదే విధముగా ఒకే తల్లి తండ్రులకు పుట్టిన సంతానం నలుగురు కుమారులు నాలుగు రకాల గుణములతో ప్రవర్తించెదరు. కారణం వారు వచ్చునప్పుడు తెచ్చుకున్న   కర్మానుసారముగా  వారి బుద్దులు ప్రవర్తించును. అది వారి పూర్వజన్మ సుకృతము పై ఆధారపడి వుండును.

3.)  మన ఇంటి ఆవరణలో ఒకే స్థలములో మనము మొక్కలు నాటినచో కొన్ని పూవులు ఇచ్చును, కొన్ని కాయలు ఇచ్చును, కొన్ని తీపి గల పండ్లు ఇచ్చును,కొన్ని చేదుతో(వేప)కూడుకున్నవి ఇచ్చును. అనగా  వీటన్నిటికి స్థలము ఒక్కటే  కదా ! అంతే  కాకుండా, ఒక పుష్పాన్నిచ్చే  చెట్టులో  ఒకే కలర్  పుష్పము  కాకుండా వివిధ  రకాల కలర్ల పుష్పాలు ఎందుకు వస్తాయి. వీటన్నిటి మూలం ఒకటే భూమి కదా!  అంటే  తమ తమ స్వభావ గుణ విశేషాలను  బట్టి ఉంటాయి.

4.)   అదే విధముగా ఒకే  దైవ,  ఓకే విద్య ఐనప్పటికీ  వారి వారి కర్మానుసారముగా  తమ  తమ  గుణాలను  మేళ్ళవింపు  చేసుకొని నడుచుకొందురు.

5.)   ఆ పరాత్పరుడు ఆత్మనిచ్చి,  ప్రాణానిచ్చి,  మనసునిచ్చి  సద్భుద్దితో  స్వధర్మాని పాటించి  తిరిగి చేరుకొమ్మని  అదేశిస్తూ వారి వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిపించితే                ఆ  స్వేచ్చా స్వాతంత్ర్యాలను  మిస్ యూజ్ చేసుకొని అజ్ఞానాందాకారములో  పోవువారు,  జన్మ జన్మాన్తరాలుగా “పునరఫి మరణం–పునరఫి జననం” అనే  సంసారచక్రములో  తిరుగాడు  చున్నారు. దీని నుండి  సాధకులు బయట పడాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

6.)   దై వీశక్తులతో  సూక్ష్మబుద్ది యొక్క. ప్రేరణతో  తనను తాను తెలుసుకొని బంధ విముక్తులు  అవుతున్నారు.  వారికైనా  వీరికై నా ఒకే  అంశమునుండి  వచ్చి నప్పటికీ వారి  కర్మాను సారముగా అజ్ఞానాందకారములో  మునిగి పోవడం వల్ల ఓకే రకమైన  ఫలాలు అందుకోక పోవడం,  రుచులు చవి చూడక పోవడం జరుగుతుంది.

4 వ ప్రశ్న: “ఏకోవశీ సర్వ భూతంతరాత్మ”  అనగా  నేమి—?

1.)   ఏకోవశీ  సర్వ భూతాంతరాత్మ  అనగా ! ఈ సృష్టిలోని సమస్త జీవులలో అంతర్యామిగా  నెలవయి ఉన్న  శక్తియే దైవీశక్తి. ఆ శక్తి లేని  ఏ జీవి గూడా కళ్యాణకారకముగా  ఉండ జాలదు. అన్ని భూతములు అనగా  అన్ని  జీవులు సత్య జ్ఞాన ఆనంతరూపుడైన. పరమేశ్వరుడు ఒకడున్నాడు.  ఈ చరాచర  జగత్తు అంతా ఆయనచే  సృష్ఠించబడిందే .

2)  పాలలో వెన్న వ్యాపించి వున్నట్లుగా ప్రపంచ మంతట పరమాత్మ నిండి వున్నాడు. అగ్ని నుంచి నిప్పురవ్వలు పుట్టినట్లుగా ఆ పరమాత్ముని నుండి జీవులు  ఉద్భవిస్తున్నాయి. అనగా జీవాత్మ పరమాత్మకు ప్రతిభింబము .  పరబ్రహ్మము సర్వము వ్యాపించి వున్నది. ఇది ఉన్నచోట మరొక వస్తువు ఉండుటకు సాధ్యము కాదు.  అనగా విభిన్న నామ రూపాత్మకమగు ఈ జగత్తు పరబ్రహ్మ నుండి   ఉత్పన్నమగుచున్నది.

3.)   విభిన్న నామములతోను, ఆకారములతోను,  అంతర్యామి అయి భాసిల్లుచున్న  సర్వేశ్వరుడగు ఆ పరమాత్మచే  సృష్టించబడుచున్నది. ఈ నామరూపాత్మకమగు సృష్టి అంతయు ఆత్మ  కంటే  వేరుగాదు.

4.)    ఆ పరమాత్మ సర్వవ్యాపి, జ్యోతిస్వరూపి,  శరీరములేనివాడు, చిధ్రములేనివాడు, నాడులు లేనివాడు, నిర్మలుడు, ధర్మాధర్మాది పాపములు లేనివాడు,  సర్వసాక్షి, మనుషులకు ప్రభువు, అన్నిటికన్నా స్వయంభువు, ఆత్మ ఆకాశము వలె  సర్వవ్యాపాకు డై స్వయం ప్రకాశమౌ చైతన్య స్వరూపుడగు ఆ పరమాత్మ యందే  ఈ జీవులన్ని అతని వశము నందే ఉండడం వల్ల “ఏకోవశీ  సర్వ భూతాంతరాత్మా”  అని పిలువబడు చున్నది.

NOTE:  ఈ  విషయములన్ని   పెద్దలైన  మీ అందరికి  తెలుసు.   పిన్నవాడిని  తెలిసినంత వరకు చెప్పాను.  పెద్దలైన  మీరు పెద్ద మనసుతో ఏమైనా  తప్పులు ఉంటే తెలుపుతారని  మనవి.

R B Satyanarayana,
Chairman, Annadhara.
Cell No: 9494420240

4/23/2016

From: R.B Satyanarayana

ఓం  శ్రీ ఆది దేవాయ అఛ్యుతాయనమ:

* ఎవరీ నేటి మానవుడు –? *

(1) ” ఎకమేవా  ద్వితియ బ్రహ్మ ”  అయిన నామ, రూప , గుణ  విశేష రహిత పరమాత్మ ” ఎకోహం బహుస్యాం ” ఏకము అయివున్న తాను అనేకము కావాలని సంకల్పించి భగవంతునిగా వెలసి తన మాయా శక్తిని ప్రయోగించి , పిపీలికాది బ్రహ్మ పర్యంతము  సకల చరాచర జగత్తు అయిన ఈ విశ్వాన్ని సృజించి వినోదిస్తున్నాడు, అతని అవతార లీల గాధలు అనేకము.

(2)  ” Gad has mode man in his own image ” దేవుడు తన ఆకారముతోనే మానవుణ్ణి  సృష్టించెను .అందుకే దేవుని ఎరుక మానవ జన్మలకే సాద్యము ,కావున సర్వజీవులందు మానవ జన్మయే ఉత్తమము .

(3) జీవితమనగా యింద్రియాల చాపల్యము నంటుకొని ఊగిసలాడు బ్రతుకు కాక ,దుర్బర మైన జీవితము కాక , దుఖ: పూరిత వ్యవస్థ కాక , మానవుని జన్మ ఎత్తినది , జన్మ సార్ధకత ఏర్పరచుకొను దిశగా , భవ్యతను కనుగొను మహా యజ్ఞంగా , సాధనా బద్ధమైన జీవనము సాగించి జన్మ వచ్చినందులకు పరి పూర్ణ్తత కల్పించ వలెనన్నదే ప్రభువుల తత్వ ప్రణాళిక –

(4) వచ్చిన దారిని వెతుక్కునే మహా సూత్రమును బ్రహ్మ విద్యనూ అందించి ఈ మహా యజ్ఞము ఆచరించి తిర్గి దైవను  చేరుకునే సులభమైన మార్గము కరుణతో ప్రసాదించినారు.

(5) ఆ విద్య ద్వారా నీవు తరించు కొనుచు మానవతను ఉద్ధరించుకునే సాధన ద్వారానే తప్ప ఇతర పద్ధతుల ద్వారా కాదని వారికి వివరించుతూ ఆ మహా క్రతువులో నీ వంతు పాత్ర పొశించుతూ , ” జగచ్చేవనము చేయుట ”  “మానవసేవయే మాధవసేవ  ముఖ్య మని ” సర్వాంతర్యామి అయిన ఆ దైవ అందరిలో ఉన్నందున అందరిలోను ధర్శిస్థూ , సేవకంటే హెచ్చయినధీ ఏమిలేదన్న సేవాబావముతో అంకిత భావముతో కృషి సల్పడమే  (ఇదే మనకు స్తూలంగ దేవాలయాలలో కూడా దైవ సేవా పేరుతొ ఎన్నో అర్చనలు చేస్తున్నారు ) నేటి మానవుని కర్తవ్యము.

(6) దైవ మార్గములో పయనిన్చాలన్నా దానితో చాలా మంది ఏకీభవిస్తూ సాధనలో కొంత దూరము వెళ్లేసరికి  ఆడంభారాలు కనపడక తక్కువ శ్రమతో దైవాన్ని చేరుకోవచ్చు అన్న మానసిక భ్రమకులోనై ఏకైక దైవ మార్గమును వదిలి స్థూల విధానాల ద్వారా సూక్ష్మాతి సూక్ష్మామైన , సూర్య చంద్రులు , గాలి వీచని నా స్వస్తలమన్న దైవ వాక్కును పెడ చెవిని పెట్టి ఆర్భాటాలతో  అజ్గ్యాన అంధ కారాలలో పడి జీవిత పరమార్ధమును కనుగొనక పునరపి మరణము ,పునరపి జననము గా కొనసాగిస్తున్నారు.

(7) ఇంకా కొంతమంది స్థూలము కాకుండా సూక్ష్మ స్థితి లో మార్గాలున్నాయన్నా పిడివాధముతొ అనేక మార్గాలలో వెళ్లి తను చేడటమే కాకుండా ఇతరులను చెడుపుతూ  మానవ జన్మ పురోగతికి ఆటంకంగా మారుతున్నారు ,అనేక కుచేష్టల ద్వారా అందుకోవచ్చన్నా  భ్రమకు లోనుచేస్తున్నారు.

(8) అందుకోవలసిన  గమ్యము దాని లక్ష్యము వచ్చిన దారిని మరచి వచ్చిన విధంగా వెతకతము మాని భావ్యా ఆచరణల ద్వారా గమ్యము చేరవచన్న మంద బుద్ధితో అధోగతి పాలవుతున్నారు.

(9) నేటి కలియుగ మానవులలో ఒక అంటూ జాడ్యము అలుముకోనివుంది ,ఒకరి కంటే ఒకరు గొప్ప వారు అనిపించు కోవాలని  ఒకరిని చూసి ఒకరు అధోగతిలో అనగా దైవ మార్గము కాకుండా క్రింది స్తాయిలో ( – ) మైనస్ లో పరుగెడుతున్నారు తప్పా   దైవ మార్గమైన ఊర్ద్వగతిలొ  ( + ) ప్లస్ లో నేను ఆ దైవాన్ని దర్శించాలి అని ఎవరు పరుగెత్తడము లేదు , ఈ నాటి మానవుడు ( – ) మైనస్ లో వాడికంటే ముందుకు పరుగేత్తాలన్న దాని తో ఎటు పరుగేత్తుతున్నాడో తెలియక , వచ్చిన దారిని మరచి , పోవాల్సిన  ఇంటికి పోలేక కోటాను కోట్లా సంవత్సరాలుగా జన్మలమీద జన్మలు ఎత్తుతూ ఖర్మలు మూట కట్టుకొని నానా రకాలుగా భాధలు అనుభవిస్తున్నాడు కాని ఈ భాధలకు కారణ మేమి అని ఆలోచించక ఇంకా వాడికంటే ముందర ( – ) మైనస్ లో పరుగెత్తుతున్న ఓ మానవుడా ,నిలిచి ఆలోచించు?   నీవు పరుగెత్తి పరుగెత్తి సంపాదించిన ఆస్తి నీ వెంటరాదూ ,   అని నీకు తెలుసు , ఏది నీ వెంట వస్తాదో దానివలన ఏమి పలితమో ,అది కూడా నీకు తెలుసు – తెలిసివుండి రాని దానికి ఎందుకు పరుగేడుతున్నావో అది నీకు తెలువదా ?.  తెలిసుండి వారికంటే నేను ముందర ఉండాలన్న తలంపుతో పరుగెడుతున్న ఓ మానవుడా | అది కాదు నీ దారి ఇక ( + ) ప్లస్ లో దైవ మార్గములో పయనించి నిన్ను నీవు తెలుసుకొని ,మానజన్మ కర్తవ్యాన్ని ,పూర్తీ చేసి గమ్యము చేరుకో , జ్గ్యాన  సంపాద సమకూర్చుకో , జ్గ్యానోత్తర ఖర్మలు చెస్తూ లోక కల్యానికి సమాజ శ్రేయస్సుకు , విని యోగాపడాలని అచ్యుతాశ్రమము కోరుచున్నాది . సాధకులు తమ తమ అనుభవాలతో తక్కిన వారిని ఆ మార్గములో పయనిన్చేటట్టు సహాయము చేయాలని కోరుతున్నాము

R.B Satyanarayana.
Cell: 09494420240

4/25/2016

From: R.B Satyanarayana

🌺 * శ్రీ ఆధిదేవయా అచ్యుతాయ నమః *🌺

” నీ కోసం —- నీవు తెలుసుకో “

ఈ ప్రపంచము ఏమిటి ? దీని తత్వం ఏమిటి ? దీన్ని పనికట్టుకొని సృష్టించారా ? లేక తనంతట తానె సృష్టి అయిందా ? అసలు మనకు ఇంద్రియగోచరం అవుతున్న  ఈ ప్రపంచం నిజంగా ఉందా ? లేక అది మనకు ఇంద్రియాలు , మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా ?

మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి ? అర్ధం ఏమిటి ? అసలు మానవ జీవితానికి ఒక లక్ష్యము , అర్ధము ఉన్నాయా ? నేనెవరిని ? ఎక్కడినుంచి ఈ లోకానికి వచ్చాను ? ఇక్కడి నుంచి ఎక్కడికి  పోతాను ? జననానికి ముందు నేను ఉన్నానా ? మరణాంతరం నేను ఉంటానా ? ఇంతకి నాలోని ఈ “నేను” ఎవరు ? మానవుడు స్వతంత్రుడా ? అస్వతంత్రుడా . అతని నిర్ణయ స్వేచ్చా – free will – ఉందా ?

మన పూర్వులు ఎవరు , ఏం చేశారు . ఎలా జీవించారు , ఏ విజయాలు సాధించారు , ఏ అపజయాలు పొందారు , మనకు ఏ వారసత్వం మిగిల్చి వెళ్లారు అనేది తెలుసుకోవాలి . * మానవుడు స్వభావ సిద్ధంగా వివేచనాశీలి . రేశియోసినేషణ్ (ratiocination ) – వివేచన – అనే లక్షణము అతడిని జంతువుల నుంచి విడదీస్తుంది జంతువులు తమ సహజ సంవేదనల సహాయముతో పనులు చేస్తాయి . మానవుడు మాత్రమే బుద్దిని ఉపయోగించి వివేచిస్తాడు . జంతువులు ప్రశ్నలు వేయవు . మానవుడు ప్రశ్నలు వేస్తాడు .కొన్ని విశ్వాసాలు ఎరుపర్చుకుంటాడు .

ఈ ప్రపంచానికి ఆది ,అంతము ఉన్నాయా ? ప్రాణం అంటే ఏమిటి ? పాపం అంటే ఏమిటి ? పుణ్యము అంటే ఏమిటి ? ఏది తప్పు ? ఏది ఒప్పు ? నా జననానికి ముందు నేను ఉన్నానా ? మరణం తరువాత ఉంటానా ? స్వర్గము , నరకము , పూర్వజన్మ , పునర్జన్మ అంటూ ఉన్నాయా ? లోకములో ఎందుకింత క్రౌర్యము ఉంది ? ఎందుకింత స్వార్ధము , ఇంత నైచ్యం ,ఇంత హైన్యం , ఇంత దైన్యం ? వీటిని పరిహరించి లోకాన్ని ఇంతకంటే మేలైనదిగా తీర్చిదిద్దడానికి వీలున్నదా ?

ఈ మహా సృష్టికి కారణం ఏమిటి ? ఎక్కడనుంచి ఎందుకు మనం జన్మించినాము ? దేని వల్ల మనం జీవిస్తున్నాము? తుదకు మనకు విశ్రాంతి స్తలము ఎక్కడ ? మన సుఖ దుఖాలన్ని ఎవరివల్ల ,దేనివల్ల నిర్ణయం అవుతున్నాయి ? ఏ శాసనాలు మనల్ని నడుపుతున్నాయి ? “పరబ్రహ్మ”  అంటే ఏమిటి? భాహ్య ప్రపంచాన్ని జయిస్తున్న మానవుడు తన అంతః ప్రపంచాన్ని జయించలేకపోతున్నాడు. తనను తానూ జయించుకోలేకపోతున్నాడు . అదే మానవ జీవిత పరమార్ధము కాదు , మానవుడు తనను తనలో నుంచి తెలుసుకోవాలి , భాహ్యంగా ఎంత తెలుసుకున్నా అది నాణేనికి ఒక వైపు అవుతుంది .రెండవ వైపున ఉన్నదే నీలోని తత్వ వివేచన .

1)   మన భారత దేశము పుణ్యభూమి అని ఎందుకు అంటారు ? 2) (4)  నాలుగు వేదాలు అందించిన సందేశం ఏమి ? 3) ఉపనిషత్హుకారులు చూపిన మార్గము ఏమి ? 4) పురాణాలు , శాస్త్రాలు కథ రూపకంగా సూక్ష్మములో చెప్పిన సాంకేతిక విషయమేమి ? 5) భగవంతుని ముఖారవిందం నుండి జాలు వారిన భగవద్గీత ప్రభోదించిన కర్తవ్యం ఏమి ? 6) నేటి కలియుగ మానవుని దైన్య స్థితికి కారణం ఏమి ? ఈ స్థితి పోవు  మార్గం ఏమి? 7) వీటిని అన్వేషించి అర్ధం చేసుకున్నది ఎంత ? 8) భగవంతుడు అంటే ఏమిటి ? 9) భగవంతుని కృప పొందాలంటే ఎం చేయాలి ? 10) భగవంతుని సేవ అనగానేమి ? 11) నీలోన ఉన్న దైవ శక్తులు ఏమి ? 12) ఆ శక్తులు ఎవరి సొత్తు ? 13) ఎవరివి వారికి సమర్పిస్తున్నమ ? 14) సమర్పించక పోవడం వల్ల నష్టం ఏమి ? 15) మనసు అశాంతికి కారణం ఏమి ? 16)మనసు శాంతి  , ఆనంద స్తితి, మానవుడు ఎలా పొందగలడు ?17) ఆనందం కోసం పూర్వీకులు చూపిన మార్ఘం ఏమి ? ఆ విద్య ఏమి ? ఆ విద్యను ఎం అంటారు ? భగవద్గీతలో చెప్పిన బ్రహ్మ విద్య అనగానేమి ? 18) బ్రహ్మ విద్య ద్వారా ఆ దైవాన్ని దర్శించ వచ్చని అనాదిగా మన పూర్వీకులు , యోగులు , ఋషులు , మునులు , తపస్సులు ఉపనిశాత్హుకారులు మొదలగు వారు ఆచరించి , తరించి ఆనందించి మానవ జన్మ కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని మల్లి మల్లి జన్మలు పొందకుండా చేసుకున్న విషయాన్ని అర్ధం చేసుకొని ఆచరించండి . ఈ విషయాలు అన్ని మీ అందరికి తెలిసినవే . ఈ పిన్నవాడు చెప్పిన దానిలో ఏమైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలపగలరని కోరుతున్నాను .

R B Sathyanarayana,
Cell: 09494420240

4/26/2016

From: R.B Satyanarayana

🌹 ఓం శ్రీ ఆదిదేవాయ అచ్యుతాయ నమః 🌹

కర్మ ——– ప్రారబ్ధము

మన పుట్టుక మనకు తెలుసు కాని – మనవెంట వచ్చే కర్మలు తెలువవు, తెలువక నా బ్రతుకు ఇలా అయింది అని దుఖిస్తాము – కారణం, సంచిత, ప్రారబ్ద కర్మలే | – మానవుడు జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటిని కర్మ ఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మ ఫలాలు ఆ జీవుడితో పాటు కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి.

అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమె పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ ఎత్తుతాడు. ఆ దేవజన్మలో కేవలం మనో బుద్దులు ఉంటాయి కాని కర్మ చేయుటకు సాధనమైన స్తూలశరీరం ఉండదు కనుక దేవజన్మ భగవంతున్ని దర్శించే అవకాశం లేని జన్మ.

ఇక అన్ని పాప కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన  జంతువులుగా నీచ యోనులందు జన్మిస్తాడు. ఆ  జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక భాదలు దుఖాలు అనుభవిస్తాడు.

ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మ ఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాప కర్మ ఫలాల కారణంగా దుఖాలు, భాదలు, అవమానాలు అనుభవిస్తాడు. కర్మ ఫలాలను అనుభవించడం మాత్రమేగాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. కర్మలు చేసే అధికారం, జ్ఞ్యానాన్ని పొందే అవకాశము ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి, గిట్టిన తరువాత లభించే అపురూప జన్మగనుకనే ఈ మానవ జన్మను పొందిన ప్రతి వక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ జన్మలోనే అనేక జన్మల కర్మలు పోగొట్టుకోవోచ్చని చెప్పినట్టుగా మనం ప్రయత్నం చేయాలి.

ఖర్మ ఫలితాలు :- జీవన భ్రుతి కోసం మానవుడు పనికోసం రోడ్డు పైకి వచ్చి నిలిచుంటే, యజమాని వచ్చి పనిలోకి ఇద్దరినీ తీసుకువెళ్ళాడు.ఒక అతనిని బావి త్రోవ్వడానికి, ఇంకో అతనిని మేడ కట్టడానికి పురమాయించాడు, బావి త్రవ్వేవాడు కిందికి పోతున్నాడు – మేడ కట్టేవాడు పైకి పోతున్నాడు – ఇవన్ని పనులే ఒకే రకమైన కూలి లభిస్తుంది కాని వీటితో ప్రారబ్దాలు కూడా ముడి పడి ఉన్నాయి.

చేసేవి పనులు, చూసేవి ప్రారబ్దాలు – కదిలించేవి పనులు, కనిపించేవి ప్రారబ్దాలు – మేడ కట్టేవాడికి వచ్చినట్లే, బావి త్రవ్వేవాడికి ఒకే రకమైన కూలి రావచ్చు – ఇది పనికి ప్రతి ఫలము – కాని మేడ కడుతూ పైకి పోయే వాడికి లభించినంతగా, బావి త్రోవ్వుతూ కిందికి పోయే వాడికి ప్రాణ వాయువు లభించక పోవచ్చు ఇది ప్రారబ్ద విశేషము.

మనం పుట్టినట్లు మనకు తెలుసు, మనతో పాటు ప్రారబ్ధం కూడా కలిసి పుట్టింది అనేదే మనకు అర్ధం కావాలి – అందుకనే చేయాలనుకున్న కొన్ని చేయలేము, ఆపాలనుకున్నా కొనింటిని ఆపలేము, ఉండమన్న కొన్ని ఉండవు, పొమ్మన్నా మరికొన్ని పోవు – ఏదేమైనా కదిపేవి కొన్ని, కుదిపేవి కొన్ని, అదుపు లేకుండా – పొదుపు కాకుండా, ఏది ఎటు పోతుందో తెలియకుండ, ఎవరు ఎలా ఉంటారో అర్ధం కాకుండా – అనంతమైన రహదారిలో పరగులెత్తే, కాలగమనములో తప్పటడుగులు వేసే, మన జీవన పయానానికి ఉన్న సమయం ఎంత ? ఊడిన కాలమెంత ? ఇంకెంత కాలం ఈ ఊరేగింపు ? మరెంత దూరములో ఉంది ముప్పు ? ఎవరికి తెలుసు ఆ మర్మం ? బ్రతుకే ఒక భయంకర సమరము – కట్టేలలో పడి కాలిపోవడమా?ఈ కట్టెను (దేహమును) పడేసి కడతేరిపోవడమా ? మనసు ఉండి వింటే, మహిమను వింటూ ఉంటె – చెట్టు లోనే చిదంబరం మట్టి లోనే దిగంబరం ,ప్రయత్నిస్తే పరమార్ధం, విరమిస్తె అనర్ధం – అందరు కోరుకుంటారు, కొందరే చేరుకుంటారు, మరికొందరిని చేదుకుంటారు, ఎవరి బ్రతుకైనా ఏదో ఓనాడు పూర్ణకలశము కావలి – ఆనాడేదో అది నేడే అయితే బ్రతుకు ఈ క్షణం నిండుతుంది, ఇక్కడే పండుతుంది.

వర్షముతోనే నదులు పొంగుతాయి –

జ్ఞ్యానముతోనే బ్రతుకులు నిండుతాయి –

జ్ఞ్యానంతో కదులుతూ ఉంటేనే జ్ఞ్యానం కలుగుతుంది –

జ్ఞ్యానంలో కరుగుతూ ఉంటేనే జ్ఞ్యానం పెరుగుతుంది –

జ్ఞ్యానం పెరుగుతూ ఉంటె అజ్ఞ్యానము తరుగుతూ ఉంటుంది –

నిత్యము నదిలో జలము ప్రవహించినట్లు, నిత్యము సాధకునిలో జ్ఞ్యానం ప్రసరిస్తూ ఉండాలి – సాధన సదా సాగుతూ ఉండాలి – నిత్యమూ,   జీవితము సాధనలో చైతన్య వంతంగా శోభించాలి. అందుకు తీవ్రమైన తపనతో కృషి చేయాలి.

Note: ఈ విషయాలన్ని పెద్దలైన మీకు తెలుసు. ఈ చిన్నవాడు చెప్పినా దానిలో పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో చెప్తారని మనవి

R B Satyanarayana,
Cell: 09404420240

4/28/2016

From: R.B Satyanarayana

🌹శ్రీ అచ్యుతార్పనమస్తు 🌹

“మాత్రుదేవోభవ”

నడయాడే దేవుడు

” అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ – సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో – నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ-  కృపాబ్ధి యిచ్చుత మహాత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ “.                                                                                             * భాగవతములో పోతన మాత్యుడు చెప్పినట్టుగా ఈ సృష్టి అంతటికి మూలమైనటువంటి జ్యేష్ట, శ్రేష్ట ప్రజాపతి అయినా ముఖ్య ప్రానుడే ఈ ముగ్గురమ్మలె కాకుండా సృష్టి యావత్తుకు ప్రకృతిలోని సమస్త జీవులకు తల్లియై బాసిల్లుచున్నది – ఆ సృష్టి క్రమములోనే ఈ జగత్ లోని అనేక జన్మల సృష్టికి తల్లులై వెలసిల్లుతున్న మాతృ మూర్తులకు ఎంతో విలువ కల్పించబడింది – యావత్తు ప్రపంచము శక్తి పైననే ఆధార పడినది ఆ శక్తే ప్రక్రుతిమాతగా, భూమాతగా, గోమాతగా అనేక మాతా స్వరూపములుగా విరాజిల్లుతున్నది. దానిలో భాగంగానే ఈ మానవ జన్మల కర్మల విముక్తి కోసము మోక్ష ప్రాప్తి చేయించడంకోసం ఆ దైవ మూడు శక్తులను కలిపి తల్లి రూపములో పంపి సృష్టి చేయమని పంపించారు. ఆ తల్లియే ఈ మాతృ మూర్తి.

అమ్మ – నూరుగురు ఉపాధ్యాయులకంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యులకంటే ఒక తండ్రి- వంద మంది తండ్రులకంటే ఒక తల్లి పరమ శ్రేష్టురాలు,- దీనిని బట్టి తల్లి ఎంత గొప్పదో అర్ధం చేసుకొని తల్లిని పూజించాలి జన్మ సార్ధకత చేసుకోవాలి.

జన్మనిచ్చిన తల్లి పర బ్ర హ్మ స్వరూపిణి, నడిచి తిరుగాడే దైవ స్వరూపిణి – మాంస, నేత్రాలతో దర్శించే స్తితిని సృష్టి కర్తయైన ఆ బ్రంహా కల్పించారు – ఎ శాస్త్రము చదవకపోయిన, ఏమీ తెలవకపోయిన నవ మాసాలు గర్భములో పెంచి పోషించినా తల్లినే ” మాత్రుదేవోభవ ” అన్నారు.

తల్లి సృష్టి కర్త, స్తితి కర్త, ప్రళయ కర్తగా, మూడు శక్తులతో కలిసి ఒక ముద్దయై కనబడుతున్న దేవతా మూర్తిగా పరబ్రహ్మ గ  గుర్తిస్తారు. హరి, హరా, బ్రమ్హ కలిసి ఒక ముద్దగా మాంస నేత్ర మునకు కనపడు నదియె అమ్మ. అందుకే తల్లికి మొదటి నమస్కారము చేయిస్తుంది వేదము – సృష్టి జరగాలంటే అమ్మ ఉండాలి – స్త్రీ యందు మాత్రమె ఆ నిర్మాణం కలిపించాడు ఆ సృష్టి కర్త – అమ్మ యందు భగవానుడు ప్రకాశిస్తాడు – సమస్త భువనములందు సృష్టి జరగాలంటే స్త్రీయే ప్రధాన కారణము అని వేదము గౌరవించింది. బ్రమ్హ గారికి సంభందించిన సృష్టి క్రియ అమ్మ చేసి పెడుతుంది – శుక్ల, శోనితము కలిసి గర్భములో పిండముగా ఏర్పడి (7) సప్త ధాతువులు, (9)నవ రంద్రాలు, (10) పది వాయువులు కలిసి అమ్మ యొక్క గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని వీటికి హేతు వైనట్టిది అమ్మ కడుపే. ఎ జీవికైనా అమ్మ కడుపే నిలయము – తండ్రిలో మూడు మాసాలు భీజము ఉండి తల్లి గర్భము ఒకానొక సమయము లో చేరి తొమ్మిది మాసాలు గర్భములో ఉంచుకొని ఇంత సుందరమైన మానవ     దేహాన్ని తయారు చేయునప్పుడు అమ్మ ” సృష్టి కర్తగా మారును ”

కటిక చీకటిలో కదలడానికి వీలు లేని లోపట గర్బాస్త నరకము అనుభవించి తొమ్మిది నెలల తరువాత పసూతి వాయు రూపములో బయటకి వస్తాడు లోపట గర్బములో ఉన్నప్పడు పూర్వ జన్మ జ్ఞానముతో ఉన్న శిశువు బయటకు రాగానే షట్మన్న వాయువు పట్టుకుంటుంది అప్పుడు పూర్వ జన్మల స్మృతులు మరిచి పోతుంటాడు. చీకటి నుండి బయటకు రాగానే బయటి వాతావరణమువళ్ళ పెద్ద పెద్ద ఆకారాలు మనవి కనపడి భయం వేస్తుంది. ఈ జీవుడు పరమ భయముతో ఉనప్పుడు – పరమాత్మ స్వరూపమైన అమ్మ చేయి స్పర్శతో ముట్టుకోగానే శాంతి పొందుతాడు. ఆ స్పర్శ యొక్క జ్ఞ్యాపకము ఉంచుకుంటాడు, ఎంత ఏడుస్తూ ఉన్నప్పటికీ అమ్మ చేయి తగలగానే సంతోషం వెల్ల బుచ్చుతాడు. అమ్మ లాంటి దయామూర్తి ఆ బ్రమ్హ అంశమే – అమ్మ యందు బ్రమ్హ త్వత్వం ఉంది.

2) స్థితి కర్త అనగా రక్షకుడు, విష్ణువు రక్షణ కారకుడై ఉంటారు. అమ్మలో పిల్ల వానిని ఎ ప్రామాదాలకు గురి కాకుండా, ఆరోగ్య విషయములో కాని ఆహార విషయములోగాని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడాకుండ తగు జాగ్రత్తలు తన వడిలో పెట్టుకొని రక్షిస్తుంది – గ్రద్ద, కుక్క వచ్చినప్పుడు కోడి తన పిల్లలను తన రెక్కల కింద పెట్టుకొని పిల్లలను శ్రీ మహా విష్ణువై రక్షిస్తుంది – తల్లి నిర్లక్షము వళ్ళ పిల్లకు ప్రమాదము జరిగితే చచ్చి పోయానమ్మ – నా ప్రాణం పాయిందమ్మా తల్లి విలపిస్తూ ఉంటుంది – అమ్మ యందు విష్ణు తత్వము (రక్షణ తత్వము) ఉంది.

3) ప్రళయ కర్త – రుద్రుడు కేవలం చంపెవాడుకాడు అతనిపై మానవులకు దురాభి ప్రాయము ఏర్పడింది – చంపే వాడు అయితే ఆ పరమేశ్వరునికి నిత్య పూజలు ఎందుకు చేస్తారు. ప్రలయాలు మూడు రకాలు – 1) రోజు చేసేది నిత్య  ప్రళయము.  2) ఆత్యంత  ప్రళయము.  3) మహాప్రలయము -మహాప్రలయములో తనని ఈ జన్మలలో పొందనివారిని తనలో చేర్చుకుంటాడు.

1) అమ్మ పడుకోమని పడుకోననిచో వేడి చేస్తుందని, కళ్ళు పులుసులు కడుతాయాని బలవంతంగానైన నిద్రపుచ్చుతుంది – దీనిని నిత్య ప్రళయము అంటారు.

2) తల్లి పిల్లవాడికి అన్నము తినిపించి జోల పాడుతూ కథలు చెప్పుతూ నిద్రపుచ్చుతుంది, జోలపాటలో లో లో లో లో లో అంటూ ఓరి పిచ్చి వాడ ఈ జగత్తు శాశ్వత మైనదికాదు ఎందుకు ఈ  “పునరపి జననం ”  “పునరపి మరణం ” అలవాటు అయింది నీకు అని ఇది శాశ్వతము కాదు అని కథలో చివరగా కథకంచికి, మనము ఇంటికి అని చెప్పే సత్యమే – ఆత్యన్తిక ప్రళయము –

అమ్మ జ్ఞానాన్ని అందించే జ్ఞ్యానదాత – అమ్మే బ్రహ్మ ఆంశ – విష్ణు ఆంశ – శివుని ఆంశ – అమ్మకు పాదాబివందనం చేసి అమ్మ చుట్టూ ప్రదక్షణము చేసినచో (6) ఆరు సార్లు భూప్రదక్షణము చేసిన ఫలితము – 10 వేల సార్లు కాశి యాత్ర పోయిన ఫలితము  – 100 సార్లు రామేశ్వర సముద్ర స్నాన ఫలితము అని అమ్మకు నమస్కరించితే ఫై ఫలితాలు వస్తాయని శాస్త్రము చెప్తుంది. అందుకే పూర్వికులు, ఈనాటి తరము వారు కూడా అమ్మని నమ్ముకొని అన్ని రంగాలలో చాల చాల గొప్పవారు అయ్యరు. అమ్మ ఆగ్రహించే స్తితికి పోకూడదు అమ్మ దొరికే వస్తువు కాదు – అమ్మ పై పొరపాటున కూడా నింద వెయ కూడదు – తల్లి తండ్రులు నీ భాగు కోసము ఆర్తితో కోపడుతారు – నిజమైన కోపము కాదు – అందుకే నడిచే దేవుడైన అమ్మకు సదా నమస్కారము చేయాలి.

ఈ నాటి పరిస్తితులు ఎలా ఉన్నాయో విజ్ఞులైన మీ అందరికి తెలుసు – జపములో కోన సాగుతున్న సాధకులు ఈ విష యముపై ఆలోచిస్తారని మనసార కోరుకుంటున్నాను.

4/29/2016

From: R.B Satyanarayana

🌹 ఓం శ్రీ అచ్యుతాయ నమః 🌹

“మనసు” – 3వ భాగము

మీ సుప్తచేతన (sub conscious) కున్న అధ్బుతమైన శక్తి

1) మీ సుప్తచేతన (sub conscious) కున్న శక్తి అంతు లేనిది. మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అది మీ జ్ఞ్యాపకాల గోదామునుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికిదీయగలదు. మీ గుండె చప్పుడును, రక్తప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది ఒంట బట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్నినియంత్రిస్తుంది. మీరో రొట్టెముక్క తినప్పుడు, మీ సుప్తచేతనాత్మక మనసు దానిని – కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం  రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతి పెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు. మీ సుప్త చేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీరధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు.

మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, విశ్రమించదు. అది అన్ని వేళల పనిచేస్తూనే వుంటుంది. దానికున్న అధ్బుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. నిద్రపోయేముందు దానితో స్పష్టంగా మీరొక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితానికి దారితీయటం కోసం మీలోనే వున్న ఎన్నో శక్తులను వెలువడడం చూస్తె మీరే  ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తిసంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, గ్రహాలన్నీ వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది, సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది.

2) మీ సుప్తచేతనమే మీ జీవిత గ్రంధం —

మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్దాంతాలు, మతవిశ్వాసాలను రాసిన, చెక్కినా, గాడముద్రవేసిన అవన్నీ అనుభవాలు, పరిస్తితులు, సంగటనల రూపాల్లో,భాహ్య లక్షణాలుగానే ప్రకటించబడుతాయి. మీరు లోపలి పక్క రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు. మీ జీవితానికి రెండు పారాశ్వలున్నాయి, వస్తుగతమైనది ఒకటైతే – వ్యక్తిగతమైనది రెండోది, ఒకటి కనిపిస్తుంది, మరోటి కనిపించదు, ఒకటి ఆలోచన అయితే రెండోది దాని  వ్యక్తీకరణ.

మీ ఆలోచన మీ మెదడులోని వెలుపలిభాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది, అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం. ఒకసారి మీ చేతనాత్మక, వస్తుగత మనసు ఆ ఆలోచన పూరిగా స్వీకరించక,అది మెదడు యొక్క ఇతరభాగాలకు ప్రసారం చేసింది. ఇది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీ వ్యక్తీకరణమవుతుంది.

ఇంతకూ ముందు చెప్పినట్లు, మీ సుప్తచేతనా మీతో వాదించలేదు. దానిపైన మీరు రాసినదాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును, అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది. అందుకే మీరు జీవితగ్రంధాన్ని ఎప్పుడూ రాస్తూనేపోతుంటారు. – ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక, ” రోజంతా తను ఎలా ఆలోచిస్తూ ఉంటాడో. ఆ విధంగానే మనుషుడు తయారవుతాడు”. చేతనాత్మక మనుసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని, అందులో అనంతమైన జ్ఞ్యానము, అంతులేని తెలివి తేటలు ఉన్నాయి.

ఈ ప్రపంచములో ఇంత గందరగోళము దుఖము ఉండటానికి కారణం ఏంటో మంది ప్రజలు చేతనాత్మక (స్తూల) మనసుకు – సుప్త చేతనాత్మక (సూక్ష్మ) మనసుకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్ధం చేసుకోక పోవడమే ఇది సాధనలో కొనసాగు సాధకులకు త్వరలో అవగతమవుతుంది మీ నిస్పృహ, నిరాశలు అన్నింటికీ కారణం మీ కోరిక తీరకపోవడమే – వ్యతిరేఖమైన ఆలోచనలు చేయడము ద్వార మనకు మనమే గాయం చేసుకుంటాం – కోపంతో, భయంతో, అసూయతో, పగతో మీరేన్ని సార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు ? ఇవన్ని విషయాలు మీ సుప్తచేతనాలోకి ప్రవేశిస్తాయి

3) శరీరము చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది ? -మీరు మేల్కొని ఉన్నా, నిద్ర పోతువున్న, అలసట ఎరుగని మీ సుప్తచేతనత్మకా మనస్సు మీ శరీరము నిర్వర్తించే కర్తవ్యా లన్నింటిని నియంత్రిస్తుంది. ఇందులో మీ చేతనాత్మక(స్థూల) మనసుకు మధ్యలో కలిపించుకునే అవసరమురాదు. మీరు నిదుర పొతున్నపుడు మీ గుండె  లయబద్దంగా కొట్టుకుంటుంది. మీ చాతి, గుండె విభాజక కండరాలు, ఊపిరి తిత్తులను గాలితో నింపటం, బయటకు పంపటం చేస్తుంటాయి. మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యము మూలన బయటకు వదిలే carbondioxide ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పని చేస్తూ పోతుండాలి. మీ సుప్తచేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను, గ్రంధిజనిత స్రావాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మీరు మేల్కున్న, నిద్రలో వున్నా యిదంతా నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.

మీరు మీ శరీరము చేసే పనులన్నీ మీ చేతనాత్మక(స్థూల) మనసు ద్వారా చేయాల్సివస్తే, మీరు నిశ్చయంగా అపజయము పాలవుతారు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎల్లా వేళలా పనిచేస్తూ ఉందన్నది మీరు మొట్టమొదట గ్రహించవలసిన విషయము. మీరు దానికి పని చెప్పినా ,చెప్పకపోయినా అది పగలు రాత్రి పనిచెస్థూనె ఉంటుంది. మీ సుప్తచేతనే మీ శరీరం యొక్క నిర్మాత, కాని అంతర్గతంగా, మౌనంగా ఉన్నదాన్ని ప్రక్రియలను మీరు స్థూల మనసుతో గమనించలేరు, వినలేరు. ” ఇది భగవంతుని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత అధ్బుతమైన మేకానిజము ఉందో అర్ధం చేసుకోవాలి.

1) మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్య మైన పనులన్నిటిని నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు.

2) నిద్ర పోయేముందు, మీ మీ సప్తచేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి, దానికున్న అద్బుతమైన శక్తిని మీకు మీరు నిరుపించుకోండి.

3) మీరు మీ సుప్త చేతనాత్మక మనసు పై ఏ ముద్రలువేసిన, అవి – పరిస్తితులు, అనుభవాలు, సంగటనల రూపంలో వ్యక్తీకరించబడుతాయి. అందువలన మీ సుప్తచేతనాత్మక మనసులోని అన్ని భావనలనూ, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి.

4) క్రియ – ప్రతిక్రియ -అనే నియమం విశ్వవ్యప్తమైనది. మీ ఆలోచన – క్రియ దాని ప్రతిక్రియ – మీ సుప్తచేతనాత్మక మనసు తనంతటతానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం.

5) నిరాశకు మూలకారణం తీరనికోరికలు.అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, మీ సుప్తచేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకుంటారు.

6) జీవనసిద్దాంతం మీలో లయబద్దంగా సామరస్యంగా ప్రవహిస్తుంటుంది. మీరు బుడ్డి పూర్వకంగా, ” నాకీ కోరికను కలిగించిన సుప్తచేతన యొక్క శక్తి, నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుంది,”అని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలను అది రూ పుమాపుతుంది.

7) మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్యకార్యాలలో – ఆందోళన, అతురత, భయం ద్వారా – జోక్యం చేసుకోగలరు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనాలతో మీ సుప్తచేతనను నింపండి, అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి.

8) మీ చేతనాత్మక మనసులో ఎప్పుడూ సర్వశ్రేష్టమైన  కోరికలను మాత్రమె కలిగి ఉండండి, మీ సుప్త చేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది.

9) మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభింఛినట్లు ఊహించుకొండి. ఏదో సాధించినట్లు పులకరించిపొండి. మీరు ఊహించినదాన్ని, అనుభూతి చెందిన దాని మీ సుప్తచేతనాత్మక మనసు స్వీకరిస్తుంది, కార్యచరణకు ఉపక్రమిస్తుంది.

Note :- పెద్దలైన మీకు నాకంటే ఎక్కువ తెలుసు. ఈ పిన్నవాడు చెప్పినదానిలో పొరపాట్లు వుంటే పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R B Satyanarayana.
9494420240.

4/30/2016

From: R.B Satyanarayana

Mind – Part II

Do you know you have many great treasures inside you?

1)            You have endless, boundless treasures with in you. To get it, what you need to do is, open your intellect eyes (manonetra) and see the infinite treasure deposits within yourself. From that treasure you can draw up enjoyment which is enough to stay pleasant in your life.  You can also draw up happiness & welfare, get to live in abundance, draw up every aspect of it for you.

2)            Regardless of infinite intelligence many people had not drawn up from that treasure, they dwell (live) in confusion, they are unware of how to draw up from it thus that start searching for it outside.

3)            For thousands of centuries (yugas) this has become a biggest mystery. Let’s pretend somebody asked you what are those secretes (mysteries)? What would be your answer?

4)            What is the secret of creation (Srusti)? Can it be nuclear power or extra-terrestrial plant travelling? Or Black holes? You know, none of these are true. Then what is that secret? Where is it available? How do you understand it and keep it in practice?

5)            To get that answer you do need to go through many mystery hassles. This is very simple. The secret is your sub conscious state (Hero).

6)            It is a wonderful, invaluable, infinite divine power (daivisakti). Vast majority of people do not do not intend to search for it. Rarely very few people could find subtle energy awareness (sukshma chethana shakthi)

7)            Once you knew wonderful power of sub consciousness later in your life you can possess more power, more wealth, more health, more pleasure, children and so forth can be obtained.

8)            You do not need to earn this power. It has already deposited (reserved) in you. However, you need to understand how to use it and find key for that treasure in Japa Sadhana. During Sadhana in subtle awareness state (sukshma stithilo) find sub consciousness power (sukshma chethanashakthi) and understand how to make use of that treasure.

9)            Then you produce new energy. It helps you accomplish your hopes and dreams. Make your life better than before, by taking that finest decision now to make your life great, rich and optimal.

10)          In the depths of your subconscious power there is endless wisdom, infinite power and wizards, enough material is available endlessly.

11)          The treasure is looking forward for your enlightened arrival. When you start recognizing powers that are in depth of your sub consciousness it forms a shape. While that happens if you are truly willful and ready for it, the infinite intelligence in your sub consciousness state will be releveled to you when you want it at the right place and right time.

12)          You will be able to innovate or discover new ideas, new innovations, new research and new genre of art.

13)          The skillfulness in sub consciousness state makes it possible to attain wonderful new wisdom like treasure (kotta Jnanasampada) that was never attained before. It reveals by itself and set correct path for your destination.

14)          Once you learn how to reveal those infinite powers of wisdom, you’d get that energy & wisdom, start feeling safe, happy and move forward in life like a king.

15)          The power in sub consciousness power (Sukshma Chethanashakthi) –

16)          Raise up people from sagging state, again in its entirety, make you powerful and willful. It renders happiness, health, recreational life and amazing experience to have a glowing life in this world. Sub consciousness power has wonderful healing capabilities. It rescues troubled mind and damaged heart. It opens up your intellect door (mano dwaramu) thus freedom has been given to you. It relieves you from all sorts of physical related bonding’s.

17)          A person who is a great believer in himself, who keeps no doubt in his mind, could ask a mountain to give him way and it conforms by giving way. Which means it’s a perfect faith. What your mind believed in is in sub conscious mind and nothing beyond that.

18)          Your experiences, events that are happening, your conditions, actions, reactions are crafted by your sub conscious mind in response to all your ideas and thoughts. Remember that! It’s not a conviction. The belief that was formed in your mind will lead to reliable results.

19)          Artificial beliefs, opinions, superstitions, fears are holding up humanity like obsessed disorders. Do not trust them and accept them. Believe in permanent eternal truth and the truth of life. Then you progress towards the vision of the soul (aatma darshana).

We continue in the next issue. Please excuse any mistakes.

R B Satyanarayana,
Chairman Annadhara
Cell No: 9494420240.

5/2/2016

From: R.B Satyanarayana

🌹 శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

జపము 1వ భాగము

సాధకులు జపము ఎందుకు విడిచి పెడుతున్నారు?

జపము విజ్ఞానముతో చేయాలి —– అజ్ఞానముతో చేయకూడదు.

విజ్ఞానముతో > జపము విజ్ఞానముతో చేస్తే మనిషిలో వికాసముపొంది, మానసిక ఆనందముతో, అత్యంత ఉత్సాహముతో – వచ్చిన మార్గము వెతుకుతూ ప్రాణ అనగా నేమి ? ఆత్మా అనగా నేమి ? దైవ అనగా నేమి ? మానవ జన్మ అనగా నేమి ? సృష్టి అనగా నేమి ?   సర్వము తేలుసుకునే జ్ఞానము కలుగును – “సర్వవిద్య స్పైష మహిమాభువి ”  అను సూక్తి ప్రకారంగా జపములో మంచి పురోగతి సాధించును.

అజ్ఞానముతో > జపము చేయడము అనగా గతాగతులు  ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ? చేయకపోతే  ఏమి నష్టము ? ఎంత వరకు గతి చేయాలి ? గతాగతులు సరియైన పద్ధతులలో చేస్తే దాని పలితము ఏమి ? అనేది తెలుసు కోకుండా రొటీన్ గ గతాగతులు సరియైన పద్దతులలో చేయక పోవడం వలన అశనోత్పత్తి  జరగక, జరిగిన ప్రాణ అశన స్వీకారము చేయు వరకు తను జపములో కూర్చొనక, తద్వారా ప్రాణకు కావలిసిన ఆహారము అందక ప్రాణ చిర్రు బుర్రులేత్తుతూ మనో వికల్పం చెంది యుగోఇజం వచ్చి జపము చేయక విడిచి పెడుతున్నారు. ఇలాంటి వారికి గురువులు గాని అనుభవజ్ఞ్యులు గాని అందుబాటులో ఉండి తర్పీదు ఇవ్వవలసిన అవసరం ఉంది. సాధకులు కూడా అందుబాటులో ఉండి నేర్చుకోవాలి > యోగ సాధనకు మూడు స్తానములలో గతాగతులు చేయవలెను. 1) గురుస్థానము  2) గుప్తస్థానము  3) గమ్యస్థానము. ఈ మూడు స్థానములలోనే గతాగతులు సరియైన పద్దతులలో వినసొంపైన శబ్దముతో గానం చేయాలి.

1) గురుస్థానము > దీర్గగతి నాభి నుండి మొదలుకొని కంట ప్రదేశమునందు ఉండు ఉపజిహ్వా యొక్క పై భాగమునే గురుస్థానం అంటారు. అంత వరకు దీర్గగతి పది నిమిషాలు గతాగతులు చేయాలి. దీనినే “గురుస్థానము” అంటారు.

2) గుప్తస్తానము >  గతాగతులలో ప్రాప్తమయ్యె కొన్ని శక్తి వర్ధక మైన రసముల సేవనం త్రాగుట చేత ప్రాణ పుష్టినిపొంది గుప్తస్తానము ప్రవేశించును – పైకి సాగును – మూత్రకోశము నుండి వెన్నుపూస చివర వరకు గలస్థానము “మేరుదండ” వరకు మనసు + ప్రాణ శక్తులు మూత్ర కోశము ప్రవేశించి ప్రయాణించును దీనినే “గుప్తస్తానము” అంటారు. ఇది రెండవ గతిలో జరగవలసిన ప్రక్రియ, ఈ ప్రక్రియలో మేరుదండము వరకు ప్రయాణము కొనసాగాలి, అప్పుడు వెన్నుపూసలో నొప్పి వచ్చినట్టుగా అనిపించును. ఉదాహరణకు : డాక్టర్ గారి దగ్గర బిపి చెక్ చేయు పరికరములో ఆ బిపి యొక్క లెవెల్స్ పైకి పెరిగే విదానము మీరు చూసి ఉంటారు. అదే విధముగా మన వెన్నుపూసలో నుండి పైకి పోతునట్టు మనకు అవగాహన కాగలదు. ఇది అంతర్గతంగా జరుగు క్రియ కాబట్టి దీనిని గుప్తస్తానము అంటారు.

3) గమ్యస్థానము > అన్ని గతాగతులలో దొరుకు అశనము ప్రాణ స్వీకరించి బలిష్టుడై తన ప్రయాణము సాగిస్తూ మెదడు యొక్క పై భాగము నందు విశ్రమించు స్తానమె గమ్య స్తానము అంటారు. దీనినే పెద్దలు ఆత్మ యొక్క స్థానము అంటారు. దీనికి మరొక పేరు బ్రహ్మ, బ్రహ్మస్థానము, బ్రహ్మపురి, బ్రహ్మలోక మనియు విజ్ఞులు అంటారు.

3) గతాగతులు చేయునపుడు ఊపిరి తిత్తులు సాధ్యమైనంత విచ్చుకునేటట్టు (dayapram ) చేయాలి. >పైకి ఎంత  పోవాలో క్రిందికి గతి అంతే రావాలీ. > దేహములో మూడు అగ్నులు ఉత్పతి కావాలి.1)ఎలక్ట్రికల్ హీట్  2) మాగ్నెటిక్ హీట్  3) అగ్ని హీట్ ,ఈ మూడు కలిసి ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ బాడిగా మారుతుంది. అప్పుడు కిడ్నిస్ ద్వార పోవడానికి సిద్దమై శుశుమ్న నాడి యాక్టివ్ అయి ప్రాణ మూలా స్థానము వర కు అశనాన్ని చేర్చాలి. > సప్త పదికి అశనము చేర్చాక పోవడం వలన ప్రాణకు ఆశన స్వీకారము జరగదు. > దాని వలన ప్రాణ ప్రతిష్ట జరగదు > ప్రాణ ప్రతిష్ట జరగకపోవడం వలన మూలమునకు పోవు మార్గములో మనస్సు కలసి రాకపోతుంది > ప్రాణ + మనో మిలనము నిత్యము జరగకపోవడం తన మూల స్థానమైన ఆత్మను చేరడంలో విపలం జరుగుతుంది.

4) జపములో ప్రాధమికంగా మూడూ సూక్ష్మాలను కలుపుతూ నాలుగోవ సూక్ష్మాన్ని తరువాత ఐదోవ సూక్ష్మాన్ని దర్శించాలి. > మొదట భ్రూమధ్యములొ రెండు కన్నులతో బైపోకల్ కాకుండా మొనోపోకల్గా దృష్టి పెట్టవలెను – ఈ దృష్టి అనగా రెండు విధములు. ఒకటి  స్థూల – రెండు సూక్ష్మ దృష్టి. > ఈ ప్రపంచ వ్యవహారాన్ని స్థూల దృష్టి తో చూడాగలము > దైవా అంశాములైన “ఆత్మ + ప్రాణ + మనస్సు సూక్ష్మములైన – ఇవి స్థూల దృష్టికి కనపడవు.

5) 1) దృష్టి, 2) దృష్టిలో మనస్సు , 3) ప్రాణ గతాగతిలో గురు స్థానముపై మనస్సు + దృష్టి (మనో దృష్టి) పెట్టి ఈ మూడు కలిపి అనగా ఈ మూడూ సూక్ష్మలపై దృష్టి నిలిపి గతాగతులలోగాని , ధ్యాన స్థితిలో గాని మీరు జపములో కూర్చున్న అంత సేపు మీరు మీ లోపటనే, ఈ మూడూ సూక్ష్మ లపైనే ఉండాలి. > కానీ చాలామంది కూర్చునేది లోపట, వారి మనస్సు ఉండేది బయట, అలా ఉంటే జపము చేసినట్టా ? ఇలాంటి జపము చేస్తే సమత్సరములు గడిచిన ఫలితాలు రాగలవా ? ఈ మూడు సూక్ష్మాలను కలిపి కొన్నాళ్ళు గతాగతి జరిపినచో ఆహార దోషాలు – దేహంలోని కల్మషాలు క్రమంగా తగ్గుతూ లాలా జలము అధికముగా వచ్చును > మరి కొంత కాలం ఈ మూడు సూక్ష్మాల పైననే దృష్టి నిలుపుతూ జపం సాగించాలి. కాని ఆ మూడు సూక్ష్మాలను వదిలి జపం చేసినచో అది బ్రీతింగ్ exercise గానే పరిగనించ బడుతుంది. > అది జపముగా గుర్తించబడదు > మీరు గంటనో, రొండు గంటలో జపము చేస్తే ఆ టైములో మీరు లోపట ఉన్నారా ? బయట ఎంత టైము ఉన్నారు ? మీపపెర్ మీరే దిద్దుకొంది, మీరే మార్కులు వేసుకోండి ఇప్పుడు మీరు చేసిన రెండు గంటల జపములో మీ మనసు మీ దృష్టి మీ గురుస్తానం ఈ మూడు కలిసే ఉన్నాయంటారా ? మీ మనసు బయట మార్కెట్టులోనో, వ్యాపారములలోనో, బస్స్టాండ్ లోనో ఉందా, లేదా కూర్చున్నంతసేపు మీలోన మీరే ఉన్నారా ? ఇలా లేనిచో జపముపై వికల్పం వచ్చి జపములోని మాధుర్యాన్ని ఆత్యంతిక సత్యాన్ని తెలుసుకోలేక జపము వదిలి వేయడం, వితండ వాదము చేయడం జరుగుతుంది.

——- సశేశము ——–

పై vishayalanni meeku telisinave. ఏ మైన porapaatlu ఉంటే pedda manasuto teluputaarani manavi

R.B.Satyanarayana
09494420240

5/4/2016

From: R.B Satyanarayana

🌺   శ్రీ అచ్యుతార్పణమస్తు  🌺

” వ్యక్తిత్వ వికాసము “

1వ భాగము

1) వ్యక్తిత్వ అనగా నేమి ? > ఒక వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న సూక్ష్మ శరీరమే ” వ్యక్తిత్వం ” అవుతుంది – ఇదే అతని యొక్క జీవితాన్ని – జీవన విదానాన్ని నిర్దేశిస్తుంది – ప్రస్తుతం మానవులంతా యాంత్రిక యుగము   లో ఉన్నారు. సుఖ సౌఖర్యాల ముసుగులో, భౌతిక వాదం మత్తులో ఉండి – వనరుల కొరకు – మనుగడ కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో నీతి నియమాలు ఉల్లంగించి ధనార్జన పరమావధిగా భావించి స్వార్ధ చింతన తప్ప దానికోసం ఎంతటి అఘాయిత్యానికైనా వెనుకాడడం లేదు. మరొకరకంగా చెప్పాలంటే మానవజాతి అంతా సంక్లిష్ట పరిస్తితుల్లో ఉంది. > వనరులు తరిగి పోవడం వల్ల కుటుంబ పోషణ పెను భారంగా తయారైంది. > వయసు రాకముందే శక్తికి మించిన బాధ్యతలను చేపట్టడం వల్ల – వయసు మీరీనా బాధ్యతలను వదిలి వేయడం కుదరకపోయినా – మనసుపై అదనపు భారం పడటం వల్ల వ్యక్తిత్వం బలహీనమై – మానసిక ఒత్తిళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నాయి. > ఎ వ్యక్తి అయినా – ఎ స్థాయిలో ఉన్న మానసిక ఒత్తిళ్ళు నుండి తప్పించుకునే అవకాశమే లేదు – అందుకే అంతుచిక్కని రుగ్మతలతో నిరంతరం వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు – లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. > శక్తికి మించి ఖర్చు చేస్తునప్పటికి ఫలితము నామమాత్రం గానే ఉంది. > మనము చేపట్టిన కార్య క్రమము ఎక్కువగా ఉండి – మన వ్యక్తిత్వం తక్కువగా ఉన్నట్లయితే – జీవితమూ నిరంతరం పోరాటము అవుతుంది. > చేప్పట్టిన కార్యక్రమము తక్కువగా ఉండి – వ్యక్తిత్వము ఉన్నతంగా ఉన్నట్లయితే జీవితమూ ఒక ఆట అవుతుంది. > మనకు సమస్యలు ఉండాలి – కష్టాలు – నష్టాలు – అవమానాలు – అపజయాలు – ఆర్ధిక భాదలు – విమర్శలు – పోటివంటివి తప్పనిసరిగా ఉండాలి – వాని నుండి మనం తప్పించుకునే అవకాశమే లేదు. > అయితే మనం వాటిని అధిగ మించే వ్యక్తిత్వం  అభివృద్ధి చేసుకోవాలి. > జీవితమూ ఆట వలే ఉన్నప్పుడే – మనకు ఆనందము – ఆరోగ్యము – ఆయువు సమకూరుతాయి – అప్పుడు దానిని మనము వదలలేము. > జీవితమూ పోరాటం అయ్యేటట్లయితే మనం ఎక్కువ కాలం కొనసాగించలేం కదా – ఇదే మానవ జీవితములోని విజయ రహస్యము.

సమాజాన్ని – దాని పనితీరును – మార్చడం అసాధ్యము – ఎందుకంటే అది వ్యవస్థాపరమైనది – ముందు మనం మారాలి – మన ఆలోచన విదానము మారాలి – మన ప్రణాళిక మారాలి – మన ఆచరణలో మార్పు రావాలి – మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి – లేకుంటే జీవితమూ సమస్యల విషవలయమవుతుంది. > కాబట్టి జీవితమూ ప్రశాంతంగా కోన సాగాలంటే ఉన్నతమైన ఆలోచన విధానముతో – సత్యాఅన్వేషణ కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలు ఎటువంటి వ్యక్తిత్వము ఉండాలో – దానికి అవసరమైన లక్షణాలేమిటో – ఎలాంటి ఆచరణ చేయాలో ముందుగానే తెలుసుకోవాలి – వాని వలన కలిగే ప్రయోజనము ఏమిటో – వివరంగా తెలుసుకోవాలి.                                                                                                                           2) ఎన్నో జన్మల తరువాత మానవ జన్మ రావడం ఒక వరమైతే దానిని సద్వినియోగము పరుచుకోవడం విజ్ఞత అవుతుంది – లేని యెడల అది భారమై మనకు మన కుటుంబానికి, సమాజానికి సైతం సమస్యగా మారుతుంది.

3) మన జీవన విదానములో తప్పక ఔన్నత్యము ఉండాలి భాష, భావన, ఆలోచన, జీవన విదానము ముఖ కవళికలు, ప్రజా సంబందాలు అందరికంటే ఆదర్శ ప్రాయంగా ఉండాలి. అప్పుడే సమాజము మనల్ని గౌరవిస్తుంది. సమాజాన్ని మనము ఆకట్టుకునప్పుడు అదే మనకు ఆస్తి  అవుతుంది. మన ప్రతీ కదలిక సమాజాన్ని ప్రభావితము చేయాలి, ప్రతి అణువులోనూ ప్రవిత్రత, స్వచ్చత ఉండాలి. నైతిక విలువలు ప్రధానంగా ఉండి అది మనకు రక్షణ కవచములగా ఉపయోగ పడాలి. డబ్బు సంచులకు అలవాటు పడ్డ మానవ జాతి నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్ల – ప్రపంచం యావత్తు పతనం అంచుకు చేరుకుంది. అటువంటి ప్రపంచాన్ని ఉద్ధరించాలన్నా, దానిలో మనం ప్రశాంతంగా జీవించాలన్నా నైతికత చాలా అవసరం. అందుకే డబ్బు పోయినా ఫర్వాలేదు, ఆరోగ్యం పోయినా ఫర్వాలేదు కానీ, జీవితంలో పొరపాటున మచ్చ ఏర్పడిందా దానిని తొలగించడం అసాధ్యం – మరొక జన్మ కావాల్సిందే. కాబట్టి మనం ప్రతి అంశములోను ఆచితూచి వ్యవహరిస్తూ అందరి హృదయాలను ఆకట్టుకోవాలి. ప్రవర్తన సరిగ్గా లేక నైతికంగా దిగజారిన వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లే – ఎందుకంటే సమాజం అతనిని చులకనగా చూస్తుంది. > అతని మాటలకు విలువనివ్వదు. అటువంటి వ్యక్తులు కుటుంబానికి భారమవుతారు. నైతికంగా దిగజారిన తరువాత అడుగడుగునా వ్యతిరేకత – అవమానాలు ఎదురౌతుంటాయి. అంతరాత్మను చంపుకొని జీవించవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.

4) సత్ ప్రవర్తనతో జీవించే వ్యక్తి భౌతికంగా మన మధ్యన లేకపోయినా అతని ప్రభావం మాత్రం కొన్ని శతాబ్దాల వరకు కొనసాగుతుంది. వాళ్లు చనిపోయిన చిరంజీవిగా సమాజంలో కొనసాగుతూనే ఉంటారు. నైతికంగా బలంగా ఉన్న వ్యక్తి సమాజాన్ని శాసించగలుగుతాడు – నాయకత్వం చేపట్టిన అందరిని కలుపుకొనగలిగి సమిష్టిగా ముందుకుసాగుతాడు – కాబట్టి జీవించడం ప్రధానం కాదు – ఎలా జీవించావన్నదే ప్రధానం.

5) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందరూ భౌతికవాధపు మాయజాలంలో సుఖంగా, విలాసవంతంగా జీవితాన్ని కొనసాగించడం కొరకు పథకాలు తయారు చేసుకుంటున్నారు. > వనరులు తరిగి పోతుండడం వల్ల తీవ్రమైన పోటీ నెలకొని ఉంది – రోజులు గడుస్తున్న కొద్ది పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది తప్ప మెరుగుపడటం లేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న అన్నిరకాల అస్తవ్యస్త పరిస్థితులకు అసలు మూలకారణం ఏమిటి ? > వస్తుసంఫద ద్వారా , ఆస్తుల ద్వారా , అంతస్తుల ద్వారా ఆనందం లభిస్తుందన్న ఆరాటంలో వాని సమీకరణలో హెచ్చుశాతం ప్రజలు నిమగ్నమైనారు – అన్ని కుటుంబాలలో దాదాపు ఇదే పరిస్థితి – ఎవరికీ మనశ్శాంతి లేదు -నైతిక విలువలు దిగజారి పోతున్నాయి – డబ్బు సంచులు ప్రధానమనే భావన వ్యాపించింది – ఇటువంటి దారుణమైన పరిస్థితులలో  సమర్ధవంతంగా ఎదురు కొనాలి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో సమస్యలను అధిగామించాలన్నా, నాయకత్వం చేపట్టాలన్న – కుటుంబాలను, సంస్థలను, పరిశ్రమలను నిర్వహించాలన్న సమర్ధత చాల అవసరం. ఎందుకు సంస్థలు మూతపడూతున్నయంటే సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణం..> కుటుంభాలు అస్త వ్యస్తంగా తయారవడానికి మూలం  నాయకత్వములో ఉన్న పొరపాటే -సమర్ధత అనేది -సత్వగుణానికి ప్రతి రూపము.

5) సమర్ధత లేదంటే -సత్వ గుణము  భాహ్యంగా మాత్రమే ఉన్నట్లు అవుతుంది .ఒక వ్యక్తి ఉన్నత స్తాయికి ఎదగాలంటే సమస్యలు -ఇబ్బందులు -కష్ట ,నష్టాలు  –  ఆర్ధిక బాధలు ,విమర్శలు వంటివి తప్పని సరిగా ఎదురవుతాయి .కాని వానిని అధిగమించే సమర్ధత అతి ముఖ్యము.

“సశేషము”

R B Satyanarayana,
Cell no : 9494420240.

5/5/2016

From: R.B Satyanarayana

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹

” మెదడు ”  (brain) ” 1వ భాగము “

” ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ” అయిన నామ, రూప, గుణ,విశేష రహిత పరమాత్మ, ” ఏ కోహం, బహుస్యాం ” ఏకము అయియున్న తాను, అనేకం కావాలని సంకల్పించి, భగవంతునిగా వెలసి, తన మాయ శక్తిని ప్రయోగించి పిపీలికాది బ్రహ్మ పర్యంతము సకలచరాచర విశ్వాన్ని సృజించి వినోదిస్తున్నాడు. అన్ని జీవులతో పాటు తనలాంటి మానవున్ని తయారుచేసి సృష్టిలోని జీవరాసులలో అత్యున్నత స్థానం మానవునికి కల్పించి, యుక్తా యుక్త విచక్షణా జ్ఞ్యానం, బుద్ధి కుశలత కల్పించినాడు. > భగవంతుడే స్వయంగా మానవాకారమైన దేహాన్ని తయారుచేసి అతనిలో ఆత్మ, ప్రాణ, మనస్సు మొదలగు అంతకరణములు ఏర్పాటు చేసినాడు.

1) పై సూత్రము ప్రకారము భగవంతునిలాంటి మానవున్ని తయారు చేయడం అందులో ఆత్మ, ప్రాణ, మనస్సు లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన వాటి యొక్క నివాస స్థలము ఎలా ఉందొ ఒక సారి అవగాహన చేసుకుందాం. > ఒక దేశ రాష్ట్రపతి, దేశ ప్రదాని, ఒక దేశ సుప్రీమ్ కోర్ట్ నాయముర్తి లాంటి గొప్ప వారు వచ్చి ఒకే ఇంటిలో వసతి ఏర్పాటు చేయాలంటే ఆ ఇంటిలో ఆ ఇల్లు ఎంత విశాలంగా ఉండాలో, ఎన్ని వసతులు కలిగి ఉండాలో, ఎంత మంది పరిచారకులు ఉండాలో, ఎంత రక్షణ దళము ఉండాలో వారి భోజన వసతులు ఎలా ఉండాలో అన్నింటిని కలిపి ఒక ఆలోచన చేయండి. > అలాంటిది ఈ స్తూల జగత్తులో ఇంత హంగామా ఉంటె, సూక్ష్మస్తితిలో ఉన్న ఆ దైవ అంశాలైన ఆత్మా, ప్రాణ, మనసు లాంటివి ఉండాలంటే ఆ ఇల్లు ఎంత పెద్దదో, ఎన్ని వసతులో, ఎంత హంగామా ఉండాలో ఆలోచించండి. > దానికి సంబందించిన కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు నివేదిస్తాను.

2) మెదడు (BRAIN) అను ఈ ఇంటిలో 1) ఆత్మా, 2) ప్రాణ, 3) మనసు మొదలగు ముఖ్యులు ఇందులోనే ఉంటారు. ఈ ఇంటిని పద్మమనే పేరుతొ సహస్ర కమళ మనే పేరుతొ పిలుస్తారు, పద్మమని, వెన్నుముఖ లోని నాడీ సముదాయమును ఆ పద్మము యొక్క కాడ అని తలంచ వచ్చును. > మెదడును సహాస్ర దళ కమళముతొ యోగ శాస్త్రము పోల్చుచున్నది.  మూలా దారములో శక్తిని మేల్కొల్పి శుశుమ్న నాడీ ద్వారా పైపైకి ప్రాణుడికి కావలసిన అశనాన్ని చేరవేసి ప్రాణ ప్రతిష్ట జరిగాక సహస్రములో ఉండు ఆత్మతో ప్రాణ ఐక్యము గావించినచొ ఆత్మ సాక్షాత్కారము, మోక్ష లక్ష్మి సిద్ధించునని యోగ శాస్త్రము తెలుపుచున్నది. > అంటే ఈ ఇంటిలోనే ఆత్మ సాక్షాత్కారము, దైవ సాక్షాత్కారము మోక్ష ప్రాప్తి కలుగ గలదని మనకు తెలియబడుచున్నది. > అంటే ఈ ఇల్లు ఎంత పవిత్రమైనదొ ఆలోచించండి. > ఈ పవిత్రమైన స్తలములోనే దైవ శక్తి ఉన్నదని దర్శించిన పూర్వికులు సింబాలికుగా ఈ దేవాలయాలు నిర్మించి మనకు చూపినారు. (“దేవో దేవాలయం ప్రోక్తో”) ఈ ఇల్లే, ఆ దేవాలయమని ” (దివ్యే బ్రహ్మపురే) ” ఇందులో ఆత్మ ఉన్నదని  అని విజ్ఞులు పిలుస్తారు.

3) మానవుడి మెదడు యొక్క సగటు బరువు 3 పౌనులు (పెద్దలలో సుమారుగా 1280-1380 గ్రాములు ఉంటుంది) పసిబిద్దలలో 370-400 గ్రాములు ఉంటుంది ). అందులి క్రొవ్వు పదార్ధపు బరువు 2 పౌనులు. తెల్లగా కనిపించు ఈ క్రొవ్వు మెదడులో 40% ఉండును. > కావున మెదడులోని న్యూరాన్ల బరువు 1 పౌను మాత్రమే – న్యూరానులు (neurons) – మెదడుకు సంభందించిన నరములు (nerves) – మానవుని మెదడులోని న్యూరానులను లెక్కించుట చాల కష్టము – > అయినను మెదడులోని న్యూరానుల సంఖ్యా 10,అనగా పది వేల కోట్లని శాస్త్రజ్ఞుల అంచనా – అనగా న్యూరానుల  సంఖ్యా మన పాలపుంతలో నున్న నక్షత్రముల సంఖ్యకు  సమానము. (ఇటివలి పరిశోధకులు ఈ సంఖ్యా ఇరువది వేల కోట్లనుచున్నారు.) మెదడులోని న్యూరానులు విశ్రాంతి లేకుండా నిరంతరము పనిచేయుచుండును – > అవి విశ్రాంతి తిసుకున్నచో మానవుడు మరణించును – ప్రతి న్యూరానుకు చేట్టుకోమ్మలా వాలే (dendrites) అను అనేక శాఖలు ఉండును – > dendrontree ఈ dendrites టెలివిజన్  యాంటెన్నాల వలె వార్తలను ఇతర న్యూరానుల నుండి గ్రహించును – ఒక న్యూరాను దాని dendrites సహాయముతో ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని 10,000 ఇతర న్యూరానుకు ఒకే ఒక యాక్షాన్ (axon) ఉండును – ఆ యాక్షాను పొడవు కొన్ని మిల్లి మీటర్ల నుండి ఒక మీటరు వరకు ఉండును – యాక్షనులు వార్తలను ఇతర న్యూరానులకు  పంపును – కొన్ని న్యూరానుల యాక్షానులు అనేక శాఖలుగా చీలిపోవును – అందలి ప్రతి శాఖ మరియొక న్యూరానుతొ సంబంధమును కల్గి ఉండును.

4) న్యూరాను స్వల్ప విద్యుతును జనింప జేయును – ఈ విధ్యుతు దాని యొక్క యాక్షానుల గుండా ప్రసరించును – ప్రతి యాక్షానును ఆవరించి మైయిలిన్ (myelin) అను తెల్లని తొడుగు ఉండును – యాక్షానులలో విద్యుత్తు ప్రవహిన్చుటకు ఈ తొడుగు తోడ్పడును – యాక్షానులలో ప్రసరించు విద్యుత్తు ఒక వోల్టులో 80,000 వంతు మాత్రమె – ఈ విద్యుత్తు సెకనుకు 100 మీటర్ల చొప్పున ప్రసరించును – > ప్రతి న్యూరానులు తానూ సేకరించిన సమాచారము అంతయు రాసినచో రెండు కోట్ల గ్రంధములు అవును – > అనగా రెండు కోట్ల గ్రంధములలో నుండు సమాచారము ఇముడ్చుకొను సామర్ధ్యము ప్రతి మనిషి మస్తిస్కములో ఉండును – > చాలా తక్కువ ఆవరణములొ నున్న చాలా పెద్ద యంత్రము ఈ మెదడు – > మెదడు యొక్క ఈ సామర్ధ్యములో అధిక భాగము మెదడు యొక్క పై పొర యందు ఉండును – > పండును అంటుకొని ఉండు తోక్కవలె ఉండుట వలన ఈ పొరకు కార్టేక్సు (cortex – అనగా తొక్క) అను పేరు కలిగెను – > ఇది 1.5 నుండి 4.5 మిల్లిమీటర్లు మందము కలిగి ఉండును – > ఈ కార్టెక్స్ నందు 300 కోట్ల న్యూరాన్లు ఉండును – > ఈ 300 కోట్ల న్యూరాన్లు ఇతర న్యూరాన్లతొ 60,000 కోట్ల సంబంధములను కలిగి ఉండును. > మొత్తము మెదడులోని సంభందము సంఖ్యా లక్ష కోట్లు ఉండును – > ప్రతి న్యూరానుకు ఆదారముగా పది జీవకణములు ఉండును – > ఈ జీవ కణములను గ్లియా (glia – glue – జిగురు) అని అందురు – > కాలి పై ఈగ వాలినప్పుడు ఆ సందేశము మెదడుకు చేరును – > వెన్నుముఖలోని న్యూరాన్లు, మెదడులోని న్యూరాన్లు ఆ సందేశమును గంటకు 150 మైళ్ళ వేగముతో గోనిపోవును – > కాలును కదపమని మెదడు ఆదేశించును – > కాలును కదలింప చేయు మోటారు న్యూరాన్లు ఆ ఆదేశమును గంటకు 200 మైళ్ళ వేగముతో గోనిపోవును – > మెదడులోని అధిక భాగము నీరు – > శరీరములో తగినంత నీరులేనిచో మెదడు విద్యుత్తు సంకెతములను పంపుటకు పెనుగులాడును – > అప్పుడు రోగి మనసు సరిగా పనిచేయదు –  ఆ సమయములో లవణ ద్రావకము (saline) ను రక్త నాళము ద్వారా శరీరము లోనికి పంపిన స్థిమిత పడును – > మెదడు సరిగా పనిచేయుట ప్రారంబించును – సోడియం, మేగ్నిషియము మొదలగు లవణములు మెదడు పనిచేయుటకు అవసరము – > ఈ లవణములు రక్తములొ లేనిచో మెదడులో విద్యుత్తు ప్రసరించదు – > నీటిలో ఈ లవణములు కరిగియుండును – > కావున ఈ లవణములు మెదడుకు అందుబాటులో నుండుటకు నీరు అత్య అవసరము. > మనము మన శరీరం లోని రెండు శాతము నీరు కోల్పోయిన  మెదడుకు ఈ లవణములు లభించక విలవిలలాడును – > పొటాషియం, సొడియముల లవణములు అయానులు (ions) న్యూరానులలొ విద్యుత్తు ప్రసరించుటకు తోడ్పడును – > మన ఉనికి, మన ఆలోచనలు, ఆశలు, భావములు మొదలగు వన్నియు అయానుల మార్పిడి పై ఆధారా పడి ఉన్నవి – > అంతే గాక మెదడుకు ప్రాణ వాయువు ఆత్య అవసరము – > కొలది సెకనుల కాలము ప్రాణ వాయువు లభించనిచొ న్యూరాన్లు మరణించును.

5) రక్తము అందించు ప్రాణ వాయువులో 25% ప్రాణ వాయువును మెదడు వినియోగించుకోనును – > శరీరం బరువులో మెదడు బరువు 2% మాత్రమె – > గుండె నుండి ప్రసరించు రక్తములొ 20% రక్తము మెదడుకు చేరును – > మెదడుకు సరఫరా చేయబడు రక్తము 15 సెకనుల కాలము ఆగిన మనము స్మారకము కొల్పొయెదము – > 4 నిమిషాల కాలము మెదడుకు రక్తము సరఫరా ఆగుట ఆగిపోయినచో మెదడులోని జీవకణములు మరణించును – > 1 సెకనుల కాలములో 1,10,000 సమాచార సంకేతములను మెదడు గ్రహించ గలదని ఒక అంచనా – > ఈ లెక్కను అనుసరించి జీవిత కాలములో గ్రహించు సమాచారము ఎంతయో అంచనా వేయజాలము > మానవుని మెదడులో నిల్వయుండు సమాచారము నంతయు ఎంత పెద్ద కంప్యూటర్ లోనైనా నిలవ చేయ జాలము – > మనము ఒక దృశ్య మును గాంచినప్పుడు అందలి అనేక విషయములు పూర్వపు జన్మ జ్ఞాపకములతో మిలితమగును > కావున మానవుని మస్తిష్కములో మన ఉహ కందనంత శక్తి దాగి ఉన్నది > మెదడు లోని ఉపరి భాగము చదువుట, వ్రాయుట, మాట్లాడుట, ఆలోచించుట మొదలగు పనులు చేయును. > ఒక్కొక్క పనిచేయుటకు అందు ఒక్కొక్క విభాగము ఉండును. > అనేక భావములను మేళవించుట, పోల్చుట, విశ్లేషించుట, వస్తు రహిత భావములను జనింప చేయుట మొదలగు పనులన్నీయు కార్టెక్స్ (పై పొర) చేయును. > కార్టేక్సుకు క్రింద ఉన్న భాగములన్నియు మనపూర్వికుల మనుగడకు సంబందించిన భావోద్వేగములకు సంబందించినవి. > మెదడు శక్తి ఒక సూపర్ కంప్యూటర్ శక్తిని మించి యుండును – > మెదడు సామర్ధ్యము అనంతము అందుకే (బ్రుహూత్) అన్నారు – > సగటు జీవన కాలములో మానవుడు తన మేధాశక్తిలో పదివేల వంతును మాత్రమె ఉపయోగించుకోనునని కొందరు శాస్త్రజ్ఞుల అంచనా. > ఇది మేధావికి, సామాన్యునకు తేడ ఏమి లేదు అందరికి ఒకే రకముగా ఉండును – > ఎంతటి మేధావి అయినను  తన పూర్తి మేధాశక్తిని ఉపయోగించుకోలేదని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. > మేధాశక్తిని ఉపయోగించితేగాని అది అభిరుద్ది చెందదు – > ఆ శక్తిని ఉపయో గించక పొతే వ్యర్ధమై పోవును – > మేధాశక్తిని పెంచి పోషించు భాద్యత సమాజముపై, ముఖ్యముగా తల్లిదండ్రుల పైన, ఉపాధ్యాయుల పైన, బందుమిత్రుల పైన, గురువుల పైన ఉన్నది.

పై విషయాలన్నీ అనుభవజ్ఞులైన మీకు చాలా తెలుసు. ఈ పిన్నవాడు చెప్పినదానిలో ఏ మైన తప్పిదములు ఉన్నచో పెద్ద మనసుతో తెలుపుతారని సవినయముగా మనవి చేసుకుంటున్నాను.

R.B Satyanarayana,
Cell No: 09494420240

5/7/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹

” జపము ” 2వ భాగము

సాధనలో self development ఆత్మ సాక్షాత్కారముకై – దైవ సాక్షాత్కారముకై విధ్య (దారిలొ) కొనసాగుతున్న ఆత్మ బంధువులకు నా నమస్సుమాంజలి.
1) ఆసనము – తెల్లటి గుడ్డతో (కలర్ సేద్దర్లు కాకుండా) సుఖాసనమునకు అనుకూలమైన పద్దతులలో సరిపడు ఎత్తులో చుట్ట ఉండినచో జపము – నిరాటాంకముగా కొనసాగును ఏమవు తదిలే అని అశ్రద్దతో ఏదో ఒక విదమైన బట్టలు వినియోగించి జపము చెయకూదదు.
2) ద్రుష్టి :- ద్రుష్టి అనగా ఏమోలే అనుకోని ఒక్కొకరు ఒక్కొక రకంగా పెడుతుంటారు – ద్రుష్టి అత్యంత విలువైనది – అత్యంత ఇంపార్టెంట్ అయినది – అంతర్ ముఖములో ఉన్న దైవసామ్రాజాన్ని చూసునది నీ ద్రుష్టి లోని సూక్ష్మ ద్రుష్టియే – ఆ ద్రుష్టి ఏ లోక లోకాలలోని దృశ్యాలను ” గగనాంతర భావన భవ్య దృశ్యం ” చూడగలదు – అది సూక్ష్మ ద్రుష్టికి ఉన్న పవర్ (power) > ఆత్మ సాక్షాత్కారాన్ని వీక్షించేది – స్వస్వరూపాన్ని దర్శించేది – ఆ సూక్ష్మ ద్రుష్టియే -భగవంతుని లీలలు అన్ని తిలకిన్చునది – ఆ ద్రుష్టియే – గత జన్మలో – వాటి కర్మలు – రాబోవు జన్మలు – వాటి పని తీరు వీక్షిచునది ఈ ద్రుష్టియే – అందుకు ద్రుష్టి బైపోకల్ (baipocal) కాకుండా మొనోపోకల్ చేసి జపము చేసిన్నపుడే అది సాధ్య పడును – సాధకులు ద్రుష్టికి అంత విలువ ఇవ్వక తన ఇస్టాను సారముగా ద్రుష్టి పెట్టడం వల్ల పురోగతికి అటంకము ఏర్పడుతుంది – ద్రుష్టి పై కేంద్రికరించవలెను > అంతే కాకుండా సాధనాపరులకు ఒక అటంకము ఏర్పడును – ధ్యాన స్థితిలో కాల్పనిక మనో ద్రుష్టికి వివిధ రకములైన ఆకారములు కనబడినట్లు – ఏమేమియో వినబడినట్లు తోచి, క్షణిక త్రుప్తి – సంతోశాతిరేకముల వలన సాధన కుంటు పడుటయు జరుగును – కావున ఏ విదమైన మానసిక కల్పనలు ఉండకూడదు – (“యదృశ్యం తన్నష్టం “) ” కనపడునవెల్ల నశించి పోవునవే ” అనుట అనుభవజ్ఞ్యుల హితవచనము. > సాధనలో సాగువారికి పూర్వ జన్మ జ్ఞ్యానము కలుగుటయో ఉన్నది – తత్పరినామముగా ఆ జన్మ యందలి సంబందికుల, మిత్రుల మోహము ఆవరించి – ఇతరులకు అది పిచ్చిపిచ్చిగా తోచుటయు సహజము – అందుకే దృష్టిలో మనస్సు పెట్టి, గురుస్థానముపై మనస్సు, ద్రుష్టి నిలిపినచో కొంత కాలం తరువాత నీలోనే ఉన్న ఆ తేజో పుంజం వికసించినప్పుడు ఆ స్థితిలో సాధకుడు గమనించాల్సిన అంశం మబ్బుల్లో చంద్రుడి లాంటి ప్రకాశం నీలో ఉద్భవించి నీ ద్రుష్టి ఆ మనస్సుని లాక్కొని ఆ దృశ్యమును తిలకిన్చుచు ఎన్ని గంటలైన, ఏన్ని రోజులైన జపమునుండి లేవాలని అనిపించదు. > అప్పుడు సాధకుడి శరీరము ఈ మూడు సూక్ష్మాలకలయికతో సాధకుడి దేహము దూది పింజము వలే తేలికై ఒక ప్రక్కన వేలుతురు ఒక ప్రక్కన బాడి తేలికై ఇంకో పక్కన ద్రుష్టి లోకలోకాలకు పోతున్న సన్నివేశం లో సాధకుడు తన్మయత్వముతో ఆ అనుభూతితో తడిసి ముద్దవుతాడు – ఏ నాడు తెలువని ఆనందానుభూతికి, తనలో ప్రకాశించు వెలుతురులో విహారిస్తూ ఆనంద డోలికలలో తలతూగుతుంటాడు – ఆ సందర్భములో కాళ్ళ నొప్పులు గాని నడుమునోప్పులుగాని ఎలాంటి శారీరక భాధలుండవు – ఉదాహరణకు మోటారు యొక్క ఎక్షిలెటర్ బాగా ఒత్తినచో వాహనము ఎలా స్పీడు వేల్లునో అలాగే మీ ద్రుష్టి స్పీడుగా వెళ్తుంది దానిని disturb చేయకూడదు. దానినే మనో ద్రుష్టి అంటారు ద్రుష్టి యొక్క ప్రాముఖ్యతను అనుభవజ్ఞ్యులతో తెలుసుకొని చేయండి
3) మనసు :- ” మనయేవ మనుష్యాణాం ” మోక్షానికి – భందనానికి కారణం ఈ మనసే. మనసు రెండు రకములు – 1) స్తూలమనసు, 2) సూక్ష్మ మనసు. > భాహ్య ప్రపంచమును తిలకిన్చునది స్తూలమనసు – అంతరంగమును తిలకిన్చునది సూక్ష్మమనసు – జపము చేయు విధానములో – ఫలితాలు రాబట్టే క్రమములో – మనసుకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది – ఒకే స్థలములో ద్రుష్టి పెట్టినప్పుడు – పెట్టినామా ? లేదా ? అని చెప్పునది ఎవరు ? ద్రుష్టి సరిగా ఉన్నది – లేనిది అని తెలుపునది మనస్సే కదా – ఆ ద్రుష్టిలో మనసు పెట్టి గతాగతి చేయవలెను – అప్పుడు గతాగతి అద్బుతంగా సాగును – సాధకులు దృష్టితో పాటు మనసుకు కూడా అత్యంత విలవ ఇవ్వక – జపములో కూర్చోగానే ఒకటి , రెండు, మూడు గతుల వరకు మనసును ఉంచి – తదుపరి ద్రుష్టి మీది నుండి మనసును మరల్చి – ఏ లోకాభి రామాయణమో – ఏ కుటుంబ సమస్యో – ఏ రాజకీయ మరియు ఆర్ధిక లావాదేవీలలో తలమునకలవుతూ – కూర్చున్న పది నిమిషాలు కూడా ద్రుష్టి పై మనసు నిలపక పోవడం వల్ల – ఒక పక్కన ద్రుష్టి పోయి – రెండో పక్కన మనసు పోయి జపములో పురోగతి చెందడంలేదు. > దర్శించాల్సిన అంతరంగ శక్తులను దర్శించ లేక స్తూల మనసుతో – తన asistents అయిన 10 ఇంద్రియాల విషయ వాంచనకు లోనై – ద్వంద రీతిలో మనిషిని చిన్నాబిన్నము చేస్తూ – జన్మజన్మాంతరాలకు కారణ మవుచున్నది – అరిషడ్ వర్గాలకు లోనవుతూ ద్వంద ప్రమాణాలతో పరిగెడుతూ – పోవలసిన మార్ఘము వదిలి – పక్క దారిలో తన అసిస్టెంట్ల ద్వారా – విభిన్న కార్యక్రమాలు నిర్వహించుతూ ఉత్తమోత్తమమైన మానవుణ్ణి – అగాదములొ పడదోస్తున్నది – కారణం ? స్తూల భోగములకు విలువనిస్తూ అందులో తేలి యాడుతున్నది – వచ్చిన మార్ఘమును వదిలి బందానికి – మోక్షానికి – కారణ మైన మనస్సు – ప్రలోభ పెట్టి ఉన్నత శిఖరాలకు పోవలసిన మానవుణ్ణి – స్తూల భోగా విలాసాలలో తేలి ఆడుతూ పరమాత్మ స్వరూపాన్ని మరచి అనేక జన్మలకు కారణ భూతమయ్యే ఈ మనసును. > జప స్తితిలో ఆశన స్వీకారము జరిగినాకా ప్రాణ ప్రతిష్ట జరిగి > ప్రాణుడే ఈ మనసును అదుపులో పెట్ట గలడు > అందుకు గాను జపములో కూర్చో గానే ఈ మనసు జపస్తితికి పోకుండా అనేక ప్రలోభాలకు గురిచేసి – జపస్తితినుండీ లేపుతుంది – తికమక పెడుతుంది – ఆ మనసుని సాధకుడు అనుసరించి పోవడం వల్ల సాధనలో ఫలితాలు రావడం లేదు – ఈ స్థితి నుండి బయట పడాలంటే – దృష్టిలో మనస్సు పెట్టి – గతగతి సాగినచో అద్భుతమైన ఫలితాలురాగాలవు. > ఊర్ధ్వ గమనములో పోయినప్పుడు – తనమూల స్థానము చేరుకోగలరు.
4) ప్రాణ గతాగతి (వాయు మదనము) :- సరి అయిన విధానముతో గతాగతులు చేయడము వలన వాయుమదనము జరిగి దేహములో అధిక ఉష్ణము ఉత్పతి అగును > దీర్గ పైకిపోవుగతి :- తద్వారా మనము చేయు దీర్గ గతిలో దీర్గంగా పైకి -క్రిందికి చేసినచో మన దేహములో ఉన్న – కపదోశాలను – కల్మషాలను – మనము తిను ఆహారములో వచ్చు మాలిన్యములను పైకి వెళ్ళు గతి చేదించుకుంటూ (కరిగించుకుంటూ) మనలో ఉండబడిన 62 వేల మైళ్ళ నర – నాడులలో ఉన్న కొలెస్ట్రాల్ని – కపదోశాలను తన ఉష్ణ శక్తితో వాయువు ప్రెషర్ తో చొచ్చుకు పోతుంది – > ex:- 1) భూమిలో వేయు బోరు ఎయిర్ ప్రెషర్ ద్వార – రాయిని కూడా తొలుచుకుంటూ పోతుంది ex:- 2) గడ్డ గట్టిన నెయ్యిని ఎలా వేడి చేస్తే కరుగునో – గడ్డ గట్టిన నెయ్యి డబ్బాలో ఒక వేడి రాడును ఉంచినచో ఎలా కరుగునో – అలాగే మనదెహములొ నరనాడులలో ఉన్న కపమును – శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
5) దీర్గ గతిలో క్రిందికి వచ్చు గతి :- పైకి పోవు గతిలో జరిగిన పరిణామాలన్నింటిని (o2 లేని వెస్ట్ మెటీరిఅల్స్) వీనస్ నర్వ్ ద్వార ఈడ్చుకొచ్చి లాలాజలము ద్వార జీర్ణాశయము లోకి చేర్చును (air ను, (carbondioxide) బయటకు పంపిస్తుంది) – > ఇలాగ పోవలిసినంత పైకి – రావలిసినంత వరకు క్రిందికి గతాగతి జరగాలి > ex:- > కబడ్డీ ఆడి నప్పుడు సెల్ఫ్ బెరను టచ్ చేయడం ఎలా నియమమో – టచ్ చేయని యెడల ఎలా అవుట్ అయి పోతారో అలానే ఈ గతాగతిలో సాధ్యమైనంత వరకు దీర్గంగా చేయాలి – ఎందుకనగా 62 వేల మైళ్ళ దూరములొ ఉన్న కపదోశాలను బయటకు లాగడములొ ఉపకరిస్తుంది – > ex:- బాత్రూం నీరు పోయే పైపులో చెత్తా – చెదారము ఇరికి నీరు సరిగా వేల్లన్నప్పుడు వేరే ఒక పరికరంతో క్లీన్ ఎలా చేస్తామో – చేయని యెడల నీరు సరిగా వెళ్ళాక బాత్రూం ఎలా డామేజ్ అవుతుందో – అలాగే నర – నాడులలో ఉన్న కపదోశాలను ఈ గతాగతి ద్వార క్లీన్ చేయాలి – క్లీన్ చేయని యెడల బాత్రూం డామేజ్ ఎలా అయిందో మన బాడీ డామేజ్ అవుతుంది > చాలామంది సాధకులు గతాగతుల విషయములో సరి అయిన నియమములు పాటించక పోవడము వల్ల దీర్ఘ గతిని షార్ట్గా చేయడం వల్ల పై కపదోశాలు క్లీన్ కాక పోవడం – శారీరక – మానసిక – వికాసాలు పొందక – ఫలితాలు అందుకొక వికల్పానికి గురి అవుతూ జపమును విడుచుచున్నారు. > ఈ గతగాతులలో ఏర్పడిన ఉష్ణం ద్వార మన దేహములో ఉన్న 5 లీటర్ల రక్తము చలచల కాగి రక్తములో ఉన్న మాలిన్యాలు కాలిపోతూ – చమట ద్వారా బయటకు వచ్చి దేహములో ఉన్న రోగ లక్షణాలు శాంతించును క్రమక్రమంగా జపస్తితిని బట్టి పూర్తిగా నయమగును – ఇది సరి అయిన విధంగా చేయవలెను – > ex:- అన్నం వండేటప్పుడు వంటపాత్రను బట్టి ఉష్ణము పెంచినచో అన్నము ఉడకగలదు కాని – పెద్ద గిన్నె పెట్టి – చిన్న మంట పెట్టినచో అన్నం ఏలా ఉడకదొ – అలాగే రోగ లక్షణాలను కాలుచు వేడిని ఉష్ణమును – గతాగతి ద్వారా మీ దేహములో పుట్టించ లేని యెడల అక్కడ అన్నము ఎలా ఉడకదొ – ఇక్కడ రోగాలు నయముకావు.
6) మధ్య గతి :- గతాగతులలో ఉష్ణము ద్వారా చలచల కాగిన 5 లీటర్ల రక్తములోనుండి ప్రాణుడికి కావలిసిన సూక్ష్మ ఆహారము o3 అశనము ఉత్పత్తి కాబడును – కాబడిన ” ఆశనమును ” మనలో ఉన్న ” ప్రాణ ” స్వీకరించును > ఉదయము – రాత్రి చెయు జపములలొ ఉత్పత్తి అయిన ఆశనమును మూత్ర పిండముల ద్వారా (kidneys) వెన్ను పూసలో (spinal cord) ఉన్న శుశుమ్న నాడీ ద్వార భ్రుకుటికి (సప్త పదము) చేర్చబడును > చేర్చబడిన ఆహారమును (ఆశనమును) భ్రుకుటికి వెనక భాగములో బ్రెయిన్ రీజియన్ లో (brain region) 4th వెంట్రికల్లొ (4th ventrical) ఉండబడిన ముఖ్య ప్రాణ స్వీకరించును దీనినే ” ప్రత్యహారము ” అందురు > చాల మంది సాధకులు ఇక్కడనే చాల పొరపాటు చేస్తారు – గతాగతులలో ఉత్పతి అవుతున్న ఆశనమును భ్రుకుటి వరకు చేర్చలేక – వెన్నుపూస మధ్య లోనే వదిలేస్తారు – మధ్య గతిలో జరుగు 1-2-3-నిమిషాల కాలము గతి ఎంతో విలువైనది > అక్కడ ఆశనమును పైకి తీసుకపోవడంలో ఆ గతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది – దీని ఇంపార్టెన్స్ గమనించక సాదా సీదాగా చేయడము వల్ల అశనము పైకి పోలేక – ప్రాణుడికి ఆశనమును అందించలేకపొతున్నారు. > ex:- ఒక ఎత్తయిన గట్టు పైకి పెట్రోల్ లేని బండిని పైకి భిగపట్టి నెట్టుకుపోతూ – చివరంటూ చేర్చాక ఇంకా కొద్ది దూరములొ ఉన్న గమ్యము చెరక – ఆ బండిని వదిలినచో – ఆ బండి ఏక్కడికి చేరును – మల్లి డౌనుకు వచ్చి పడుతుంది. > అలా పలుమార్లు చేర్చడం పూర్తిగా పైకి వెల్లలేక కింద పడటం ఎలా ఉందొ – అలాగే ఈ ఆశనమును భ్రుకుటి యందు చేర్చలేక – ప్రాణుడికి అందించలేక గతా కొన్ని సమత్సరాలు నుండి ప్రయత్నిస్తున్నారు – కాని ఫలితం అందడం లేదు – కారణం ? ఆ గతికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం – ఇది ” చాల విలువైన గతి ” అని సాధకుడు గుర్తించక పోవడం – సాధకుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు – కాని విజ్ఞ్యానముతో ప్రయత్నించడం లేదు – అల చేయడం అజ్న్యానమా – ? విజ్ఞ్యానమా – ? > తద్వారా ఎలాంటి ఫలితాలు అనుభవించక విముఖుడై జపము వదిలి వేయుచున్నారు.
7) మూడోవ గతి :- ఈ గతి భ్రూమధ్యము నుండి ఆత్మ ఉండు స్థానము వరకు నడవవలెను – ఈ గతాగతులలో ప్రాణుడికి కావలసిన ఆహారమును తయారుచేసి దైవాఅంశం అయిన ” ప్రాణుడికి నైవేద్యము పెట్టడమే ” మానవుని కర్తవ్యము కాని – నేటి మానవుడు ఆహారము అందించక పోవడం వల్ల అనేక అనర్ధాలకు గురి అవుతూ దైవ దూషనకు బలి అవుతున్నాడు. > స్థూలంగా దేవుడికి పెట్టె నైవిధ్యమే ఇది – ? గతాగతులు చేయునదే – ” ప్రాణగ్ని పూజ “. > సాధకుడు ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నాడు. > గతాగాతులలో తయారైన ఆశనమును – అందించక పోవడం ఒకటి – అందించినా ప్రాణ స్వీకారము జరిగేవరకు జపములో కూర్చొలెక పోవడం – గతాగతులు పూర్తి అవగానే కొద్ది సేపట్లో లేవడం వల్ల ప్రాణ చికాకు పొంది మనస్సు ఆందోళనకు గురై (cells o2) కణాలకు కావలసిన ఆహారము అంధక దేహ సామ్రాజ్యము అస్త వ్యస్థమై ఇగొయిజమ్ పెరిగి సూక్ష్మ స్థితి – సూక్ష్మ ద్రుష్టి – సూక్ష్మ గమ్యం చేరుకోలేక వికల్పము చెంది జపము విడిచి పెడుతున్నారు. > అంతర్ముఖంగా ఉన్న దైవీ సంపత్తును కాంచలేక – దరిదాపులకు వెళ్ళలేక నేటి మానవుడు ఎండ మావుల వెంబడి పరిగెత్తుతూ, త్రాగు నీరు అంధక – దప్పికగొన్న వాడిలాగా – సముద్ర సుడిగుండములో చిక్కుకున్న నావలాగ – ధరణి చేరుకోలేక సత్యాన్ని గమనించలేక – అందాను కరణ చేస్తూ – అరణ్య రోదనగా సాగుతున్నారు. > ఈ మూడు స్తితిలలో చేయు గతా గతులనే ” గాయత్రి ” అంటారు.
ఈ విషయాలన్నీ మీ అందరికి నా కంటే బాగా తెలుసు – ఈ పిన్నవాడిని పెద్దమనసుతో దీవించి తప్పులు ఉంటె తెలుపుతారని మనవి – దయచేసి మీ స్పందన తెలుపుతారని కోరుకుంటున్నాను.

R.B Satyanarayana
Cell No: 09494420240

5/9/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹

నీ భాద్యత నీవు నిర్వహిస్తున్నావా?

ఆత్మ బందువులైన మీకు నమస్కారము :- సృష్టి లోని ప్రతిది తన భాధ్యతను, తను నిర్వహించుక పోతుంది. కాని విజ్ఞ్యాన వంతుడైన మానవుడు మాత్రం తన కర్తవ్యం ఏమి అని గుర్తేరగాక అనాదిగా, జన్మ జన్మాతరాలుగా ఈ ప్రపంచానికి వస్తు పోతు ఉన్నాడు. తను మేల్కొనేది ఎన్నడో ? > ముఖ్యంగా సాధకులైన మీరు గమనించండి, ఆచరించండి.

1) మంచి పనులు మన్ననలు పొందుతాయి – > వ్యక్తమైన్నపుడే వాటికి గుర్తింపు ఉంటుంది – > కాని మంచి మనిషి సదా మాననియుడు గానే ఉంటారు – > చిర స్మర ణీయుడిగా మనస్సులలో నిలిచి పోతాడు.
2) ఉగినప్పుడే మొక్కల్లో అందము – వీచినప్పుడే గాల్లో ఆహ్లాదము – > ఉన్న చోటును విడవకుండా సూర్యుడూ వెలుగు ప్రసాదిస్తాడు – > జీవనాన్ని అనుగ్రహిస్తున్నాడు – చంద్ర – తారకలు స్థాన భ్రంశము చెందకుండా, మన స్థానాన్ని పదిలం చేస్తున్నాయి.
3) మొగ్గ – పువ్వుగా మారితేనే సౌందర్యము – సౌరభము – మొగ్గను నలిపి పువ్వును పుట్టించలేము – > తనకు తానుగా మొగ్గ – పువ్వు కావాలి – వాతము చేయుత నివ్వగలదు – అంటే ఎవ్వరైనా – ఎప్పుడైనా – ఎక్కడైనా తమకు తాముగా వికాసము పొందాలి – > కాకపోతే విరబూశే పుష్పానికి గాలి సహకరించినట్లు – వికసించే బుద్దికి, మరొక విమల బుద్ది సహకరించవచ్చు – ఆమాత్రము జరిగితే, ఆ తరువాత ఏదైనా జరగవచ్చు – అదే గత వైభవమంతా – విశ్వములో జరిగిన విజ్ఞాన వితరణమన్తా – > పలుకు లేకుండా ప్రకృతి పరవశింపచేస్తుంది – వాగ్దానాలు లేకుండా వానలు ముద్దా ముద్దగా తడుపుతాయి – అడగకపోయినా పువ్వులు పరిమళాలు వేదజల్లుతాయి – ఏ సంబంధము లేకుండా యతులు బంధాలను తొలగిస్తారు – వానలు పడితే వార్తలు వుండవు – పిడుగు పడినప్పుడే ప్రశ్నలు పుడతాయి – జోరుగా వానలు కురుస్తాయి – అక్కడక్కడ పిడుగులు పడతాయి అనివార్యాలు అలాగే వుంటాయి – అర్ధమైతే ఏవి బాధించవు –
4) మెల్లగా – చల్లగా సాగిపోయే నదులు హృదయాన్ని స్పందింప చేస్తాయి – ధూసుకుంటూ వచ్చి శిలలను డీ కొన్నప్పుడే చలింప చేస్తాయి – దేని అందము దానిదే – దేని సొగసు దానిదే . జీవితము ఒక నది ప్రవాహము లాంటిది – ఎప్పుడూ ఒకే లాగ సాగదు – ఎక్కడ ఏ మలుపు వుందో – ఏ పలుపు వుందో – ఏ సుడిగుండాల పిలుపు వుందో – ఎదురైనప్పుడు గాని అర్ధము కాదు – అర్ధమైన, కాక పోయినా అవి కూడా అన్ని నదిలోనే – అంతా నదీ వైభవమే – విశ్వములో అన్ని పరమేశ్వరుని లోనే – అంతా ఆ ఈశ్వర వైభవమే – ఈ సత్యము అర్ధమైన వ్యక్తులలో – లేదా – సంస్థలలో – విరబూసె అందాలు కూడా ఈశ్వర చైతన్యాలే – అనివార్యాలను అవరోధాలుగా బావించక పోతే – మతులన్నీ మాధవ చైతన్యములోనే మైమరచి వుంటాయి.
5) ఈ లాంటి సత్యాన్ని తెలుపునవే ఆశ్రమాలు – ఆశ్రమాలు అనగా సత్య శోధనా కళాశాలలు – సాధకులు అనగా సత్య శోధకులు – అలాంటి ఋషి పుంగవులకు, యోగులకు నిలయమైన ఆశ్ర మాలు ప్రేమ, జ్ఞానాలకు నిలువెత్తు టద్ధములై నిలబడాలి, స్వార్ధాన్ని ప్రక్కన పెట్టి, త్యాగాలకు పట్టము గట్టి వాత్సల్య పూరితమైన వాతావరణాన్ని కల్పిస్తూ, ఎవరి భాద్యతలు వారు నిర్వహిస్తూ సమిష్టి కృషితో దుఖ: సాగరములో మునిగి తేలుతున్న జనాలకు మార్గ దర్శకులు కావాలి.
6) విశ్వ మానవ కల్యాణానికి, జగత్ కల్యాణానికి – అట్టడుగుణ ఉన్న మానవాళిని పునీతులను చేయు సంకల్పం చేయాలి. > జీరో నుండి (0) మోక్షము వరకు తీసుకు పోయే విద్య – భవ బందనాలను త్రెంచి – మానవ కర్త్యాన్ని తెలిపే విద్య ఇది – అలాంటి విద్యకు ప్రపంచ మానవాళికి మార్ఘ దర్శకంగా ఉండవలసిన ఆశ్రమం – అందుకు తగ్గట్టుగా ఉండాలి – అలాంటి కార్యక్రమాలు చేపట్టాలి.
7) ఆధ్యాత్మిక రంగములో మానవాళి అనేక యుగ యుగాలుగ తన బంద విముక్తి కోసం – దైవ దర్శనం కోసం అనేక వొడిదుడుకులకు లోనవుతూ – మానవుని జీవిత కర్తవ్యము గూర్చి ఆచరించ వలసిన నియమముల గూర్చి – సృష్టి లోని జీవుల యెడ మన భాద్యత గూర్చి – అనాదిగా శ్రమిస్తూ, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కోట్లల్లో ఒకరు గమ్యము చేరుకొని ఆనందించి – ముందు తరాలకు ఆ జ్ఞ్యాపికాలను అందించిన, ఆ యోగులకు, ఋషులకు, మునులకు – మనము తలవంచి నమస్కరించాలి సనాతన విద్యను ప్రభు శ్రీ యోగి అచ్యుతులు మనకు అందించి, ముందు తరాలకు అన్దించండని – మానవాళికి మార్గ దర్శకులుకావాలని సెలవిచ్చినారు.
8) ఈ నాటి కలియుగ మానవులు సూక్ష్మానికి విలువనీయక – స్థూలానికి విలువనిస్తూ తన గమ్యం ఏమో తెలుసుకోలేక – తమ జీవితాలనే తామే నరక ప్రాయము చేసుకుంటున్నారు. > స్వామీ గారి మాటల్లో చెప్పాలంటే ఈ బ్రహ్మ విద్యను ప్రజలకు అందించి జగత్ కల్యాణానికి తోడ్పడండి. > మీరు ప్రతి విషయాన్ని పరిశోధించి – పరిశీలించి – ఆలోచించి – మీ ఒక్కరికే సొంతము కాకుండా ఏ నిర్ణయం తీసుకున్న ఈ భూగొళములొని సమస్థ ప్రజానికానికి, కళ్యాణ కారణం కావాలి – అది కాక సత్యాన్ని, వాళ్లకు సాధ్యమైనంత సత్య జ్ఞ్యానము కలిగేటట్లు ప్రయత్నం చేయాలి – మీరందరూ కార్య దక్షులు కావాలి – ధైర్య వంతులు కావాలి – తపసంపన్నులు కావాలి – శాంతిని ఎల్ల కాలము పూజించాలి – ద్వేషాన్ని, దర్పాన్ని, స్వార్ధాన్ని పక్కకు పెట్టాలి. > ప్రతి సాధకుడి పైన ఎంతో గురు తరమైన బాధ్యత ఉంది – జపము తీసుకొని తనే అనుభవిస్తుంటే ఎలా ? > నీ కర్తవ్యం ఏమిటి ? > దుఃఖ పూరితమైన జనాలకు చేదోడు వాదోడు ఎలా ఇస్తారు ? > ఇది ఏ ఒక్కరో నిర్వహించవలసిన కార్యక్రమమా ? > గురువులు, సాధకులు, నిర్వాహకులు ఎంత సునిశితంగా తయారు కావాలి ? > సుశిక్షితులైన సైనికులలాగా ఎప్పుడూ తయారు కావాలి ? > ఇందులో మన పాత్ర ఎంత ? అని అందరు ఆలోచించాలి ? > కృషి చేయాలి – నాకెందుకులే అంటే వచ్చే తరాలకు మార్గ దర్శకులు ఎలా అవుతారు ? > వచ్చినా కర్తవ్యాన్ని విస్మరించి – బాధ్యతలను తప్పించు కోవడం సరియైనదేనా – ? > కళ్ళు తెరవండి – స్వామీ గారు అప్పగించిన బాధ్యతలను పూర్థి చేసి కృపకు పాత్రులు కాండి. ఇదే నావిన్నపం.
9) కలియుగ మానవునిలో ఏదో ఒక లోపము ఉంటుంది – అది ఎలాంటిదైనా కావచ్చు – అలాంటి వారిని సరిచేసుకొని – సత్యాన్ని గుర్తేరిగేటట్లు చేసుకొని వేలకొలది మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉన్నది – రాబోయే తరాలకు ఒక మంచి మార్గాని నిర్మించ వలసిన అవసరం మనపైన లేదా ? > ఈ విశ్వ మానవ కల్యాణానికి అంతో మంది, ఎన్నో రకాల కృషి అవసరము – అందుకనుగునంగా ఎవరిలో ఏ నిద్రాణమైన శక్తి ఉందొ – ఏ ఋషి పుంగవులు ఎవరిలో ఉన్నారో వారిని లేపి – వారిలో ఉండే టాలెంట్ను వినియోగించుకోవాలన్నదే నా తలంపు. > ఈ నాడు సాధకులే కాకుండా – అభిమానులు ఉంటారు – శ్రేయోభిలాషులు ఉంటారు – ఉపదేషకులు ఉంటారు – గురువలు ఉంటారు – అనేక రంగాలలో ఉన్నపటికీ – సత్యం వైపు వారిని మరల్చాల్లి – > అందరిని తీసుకొని నూతన ఆలోచనలతో – నూతన వరవడిలో ఎన్నో అంశాలు తీసుకోవలసి ఉన్నాయి – ఎవరి బాధ్యత వారికి అప్పగించుకుంటూ – బాధ్యత నిర్వాహణలో మెలుకువలు తెలుపుకుంటూ – అనేక విషయాలలో ప్రజల మమ్మేకముతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని – ఆ బాధ్యత మన భుజ స్కంధాలపై ఉందనేది ప్రతి సాధకుడు మరవరాదు.
10) ఈ నాటికి చాలా మంది సాధకులు మొక్కుబడి కార్య క్రమాలే తప్ప – ” మమ ” అనిపించుకునే విధానము తప్ప – చేయాల్సింది చాలా ఉంది – కావాల్సింది ఎంతో ఉంది – దైవ పురుషుని అండ ఉంది – వనరులు ఎన్నో ఉన్నాయి – నిధి చాలా ఉన్న విని యోగించుకోలేక పోతున్నాము. – > బస్సులో ఉన్న ప్యాసింజర్ నిద్ర పోవచ్చు కాని – డ్రైవర్ నిద్ర పొకూడదు – బాధ్యులు – గురువులు – సాధకులు మెలుకువతో వ్యవహారించ వలసి ఉన్నది – విశాల బుద్ది పెరగాలి – సమస్తితిలో కొనసాగాలి – కాని బయటి వ్యవహారాలలోని బుద్దియే ఇక్కడ ప్రకటిత మౌతున్నది. > బ్రహ్మ విద్యకు ఉన్న ప్రాధాన్యతను – ఆది దేవుడని పిలిచే మన అచ్యుత గురువు గారులను – మనము అర్థం చేసుకోలేదన్న అనుమానం కలుగుతుంది – అర్థం చేసుకుంటే ఈ నాడు పరస్తితులు ఇలా ఉండ వనెదె నా ఉద్దేశము. > సృష్టి లోని ప్రతిది ఎవరు చెప్పకున్న తమ తమ భాద్యతలను నిర్వహిస్తున్నాయి – అనంత విజ్ఞాన వంతుడివైన ఓ సాధకుడా ! లే కళ్ళు తెరువు, నిద్దుర మత్తు వదులు – నీ తోటి వారిని నీతో తీసుకెళ్ళు.
పై విషయాలన్నీ మీకు తెలిసినవే – ఆలోచించి ఆచనలో పెతుతారని నా మనవి – ఏ మైన పొరపాటుగా అనిపిస్తే క్షమిస్తారని కోరుకుంటున్నాను.

R.B Satyanarayana,
Chairman Annadhara

Japa Sadhana – Blog

%d bloggers like this: