Sadhana Tips(2) – by R.B. Satyanarayana

Last updated: Aug 25th 2016

Shree R.B. Satyanarayana, Chairman Annadhara

5/11/2016

🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺

“వ్యక్తిత్వ వికాసము ” 2వ భాగము

వ్యక్తిత్వ వికాసము మొదటి భాగం తరువాయి:

1) “ సమర్ధత ” :- కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారవడానికి మూలం నాయకత్వంలో ఉన్న పొరపాటే, సమర్ధత అనేది సత్య గుణానికి ప్రతి రూపం. సమర్ధత లేదంటే సత్య గుణం బాహ్యంగా మాత్రమె ఉన్నట్లవుతుంది > ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగాలంటే సమస్యలు – ఇబ్బందులు – కష్ట నష్టాలు – ఆర్ధిక బాధలు – విమర్శలు ఎదురౌతాయి > కాని వానిని అధిగమించే సమర్ధతే అతి ముఖ్యం > సమర్ధత లేని వ్యక్తులు ఆ పరి స్థితులకు భయపడి క్రుంగి పోతారు > అదే సమర్ధత ఉన్న వ్యక్తులైతే వానిని అధిగమించి శభాష్ అనిపించుకుంటారు > అంతర్జాతీయంగా ఎదిగిన వ్యక్తుల చరిత్రలను పరిశీలించండి > అందరి లాగ వారికి ప్రారంభంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతాయి > వానిని అధిగమించే సమర్ధత ఉన్నందువల్లే రాణించా గలిగారు కదా ? కొన్ని సందర్భాలలో మనం కటినంగా వ్యవహరించక పొతే అనుకున్న ఫలితం రాకపోవచ్చు > అందుకు సమర్ధత రామ బాణం లాగ పని చేస్తుంది > పరి పూర్ణమైన వ్యక్థిత్వానికి మరొక మహోన్నత లక్షణం “ భాద్యత ”.

2) “ భాద్యత ” :- భాద్యత అనేది మానవ జీవన మహోన్నతికి వజ్రాయుధం వంటిది – దీని నుండే జీవితం ప్రారంభమవుతుంది > మాత్రు సంరక్షనతో మొదలైన బాధ్యత ప్రజా సంభంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నది > బాధ్యత అనేది ఆధ్యాత్మికతకు పునాది > “ Responsibility is the basis for spirituality without responsibility there is no spirituality ” భాద్యత అనే ఈ ఒక్క అంశమే ప్రపంచ చరిత్రను మార్చి వేస్తుంది > అది ఆ ధర్మ ప్రపంచ నిర్మాణానికి నాంది అవుతుంది > అయితే ఇప్పుడు జరిగిన పొరపాటు ఏమిటంటే అందరు పరిమితమైన భాధ్యతలను నెరవేరుస్తూ అదే నిజమైన భాద్యత అని భ్రమ పడుతున్నారు > కుటుంబము – వృతి – వ్యాపారము – కులము – మతము వంటివన్ని పరిమిత తత్వాన్ని సూచిస్తాయి > అందరు వానిలో బంధింపబడి వానిని నెరవేర్చుట కొరకు ప్రయత్నిస్తున్నారు కాని వాటి కోరకు అమితంగా ఆరాట పడుతున్నారు. > Limited responsibility and over responsibility – both are Irresponsibilities – total responsibilities is the right kind of responsibility. > పరిమిత మైన బాధ్యతా – మితి మీరిన బాధ్యతలు రెండు బాధ్యత రాహిత్యముతో సమానమే – సంపూర్ణ బాధ్యతే సరియిన భాద్యత > ఈ నాడు ప్రపంచము పతనపు అంచుకు చేరడానికి – సమాజములో అస్త వ్యస్తమైన పరిస్తితులు నెలకొని ఉండడానికి ప్రధానకారణం – అదిక శాతము ప్రజలు కుటుంబ పోషణ పరమావధిగా భావించి సమాజాన్ని – దాని శ్రేయస్సును విస్మరించడమే – భాద్యతగా జీవించే వ్యక్తిలో సత్వగుణము ఉంటుంది – సమాజ శ్రేయస్సుకై నిరంతరము పరితపిస్తూ ఉంటాడు – చేపట్టిన కార్యక్రమము నెరవేర్చడానికి నిరంతరము కృషి చేస్తాడు.

3) మేధావి వర్గం అంత సుఖ సౌకర్యాల ముసుగులో విలాసము, వినోదము, శృంగారము వంటి ఇంద్రియాల చైతన్యములో భౌతిక వాదపు కృత్రిమ కౌగిలిలో చిక్కుకొని ప్రకృతిని ప్రపంచాన్ని పతనం చేస్తారు. > పరిమితమైన భాద్యత వాళ్ళ శక్తిని కోల్పోయి ఎన్నో వింత భయానక వ్యాధులకు గురి అవుతున్నారు – భాద్యతగా జీవించే వారిలో నైతిక విలువలు ఉంటాయి – వారు ప్రాణ త్యాగా నికైన సిద్దపడుతారు కాని తప్పు మాత్రం చేయరు > ఈ నాడు మేధావి వర్గము ఉత్పన్నమైయ్యే విద్యాలయాలలో డబ్బులు సంపాదించుకొని సుఖంగా జీవించే మార్గాలను గురించి తర్పీదు ఇస్తున్నారు తప్ప భాద్యత (responsibility) గురించి తెలియజేయడం లేదు – అందుకే వారు సంస్థలనుండి బయటికి వచ్చిన తరువాత పరిమిత తత్వాన్ని పెంచుకొని నైతికంగా దిగజారి ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తున్నారు – ఇవే పరిస్థితులు మరి కొన్నాళ్ళు కొనసాగితే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది > భాద్యతగా జీవించే వ్యక్తులలో బుద్ది మట్టముకన్న – హృదయ మట్టము బలంగా ఉంటుంది – త్యాగము, వైరాగ్యములతో సమాజములో జరిగే ప్రతి అంశము పట్ల వారి సానుకూల స్పందన ఉంటుంది > అందరు నా వాళ్ళు – అంత నాది – అన్నింటికీ నాదే భాద్యత అనే మనో స్థితి ఉంటుంది – బలమైన ద్రుక్పదముతో సమర్పణ భావనతో జీవిస్తూ గొప్ప వ్యక్తులుగా మారుతారు – వారి చుట్టూ ప్రపంచము అంతా తిరుగుతుంది – భాధ్యతా అనేది శక్తికి ప్రతి రూపము విస్తరించే కొలది శక్తి పెరుగుతుంటుంది – కుంచించుకునే కొలది శక్తి హరించుకుపోతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి.

4) సేవా భావము :- భాధ్యతగా జీవించే వ్యక్తిలో ప్రస్పుటంగా కనిపించే లక్షణం సేవా భావము – ఎవరి కైతే హృదయ మట్టము వికసిస్తుందో వారిలో త్యాగము వైరాగ్యములతో పాటు, సమాజము పట్ల బాధ్యతా ఏర్పడి – ఏదో చేయాలనే తపన ఏర్పడుతుంది > ఎవరైతే స్తూల బుద్ది మట్టానికి – మానసిక మట్టానికి – పరిమితమవుతారో అటువంటి వారిలో స్వార్ధం సంకుచిత తత్వము – స్పష్టంగా ఉండి సమాజము నుండి ఏమి పొందాలని ఎప్పుడు పతకాలు వేస్తూ ఉంటారు – వాస్తవానికి సేవా భావముతో జీవించడమే కర్మ యోగం – స్వార్దాముతో – సంకుచిత తత్వముతో జీవించడమే కర్మ బందం > సేవాభావముతో ఉన్నప్పుడు మనం ఏ కొద్ది కార్యక్రమం చేపట్టిన అద్బుతమైన ఫలితాలు వస్తాయి సేవా భావము లేకుండా మనం ఎంత పెద్ద కార్యక్రమం చేపట్టిన అది బందమే అవుతుంది – ఆశించి చేస్తే బందము అవుతుంది – ఆశించ కుండ చేస్తే యోగమవుతుంది > ఆశించినా ఆశించక పోయినా మనము చేసిన ప్రతి పనికి ఫలితము ఉంటుంది మనము సేవా భావముతో ఉన్నప్పుడు మనము ప్రతి ఫలము ఆశించము కాబట్టి సమస్కారములు ఏర్పడవు > పైగా చేయడం మన ధర్మం – ఫలితాలు ఎవరు ఆపే ప్రసక్తే లేదు – కర్మ అంటూ జరిగితే ఫలము తప్పదు > సత్కర్మల ద్వారా ఉత్తమ కర్మ ఫలము – చెడు కర్మల ద్వారా చెడు కర్మ ఫలము సంప్రాత్పిస్తాయి >ఉత్తమ కర్మ ఫలము మనకు మన కుటుంబానికి – వారసులకు సైతము వరమవుతుంది – చెడు కర్మ ఫలము అందరికి శాపమవుతుంది > “ ప్రపంచానికి సేవ చేయడం అంటే పరమాత్మకు చేసినట్లే, ప్రపంచానికి అపకారము చేస్తే పరమాత్మకు చేసినట్లే ”.

5) భగవంతుడు ప్రపంచానికి భిన్నంగా లేడు చాలమంది ప్రపంచానికి నష్టం కలిగించినా పరవాలేదు – భగవంతుని అండవుంటే చాలు అనుకోని డబ్బుతో కొంటామని అనుకుంటారు – ఆ భావన కారణంగానే సమాజము తీవ్రంగా నష్ట పోతుంది > ఇంకా సూక్ష్మగా చెప్పాలంటే ప్రపంచానికి సేవ చేయడం అంటే నీకు నీవు సేవ చేసుకోవడమే > ప్రపంచానికి నష్టం కలిగించే పనులు చేస్తే దుష్ ఫలితము వస్తుంది – భారత దేశములో అధిక శాతము ప్రజలు భగవంతుని గురించి ఎక్కువగా ఆలొచిస్తూ సమాజాన్ని పూర్తిగా బాలహీన పరిచారు అందుకు అందరు శిక్ష అనుభవిస్తున్నారు – సేవ చేయడము ద్వారా ప్రపంచము నుండి లభించే సంపదనే మనకు సంజీవిని అవుతుంది > భాధ్యతకు పునాది సేవా భావమైతే – సేవా భావానికి ప్రతిరూపం “ క్రమశిక్షణ ”.

6) క్రమశిక్షణ :- క్రమశిక్షణ ఇది సత్వ గుణము ద్వార ఏర్పడుతుంది – క్రమశిక్షణగా జీవించే వ్యక్తి జీవితము అన్ని దశలలోనూ విజయవంత మౌతుంది – క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితము ఏ దేశలోలైన పతనమౌతుంది. > అంతర్ జాతీయంగా ఎదిగిన ఏ వ్యక్తి నైనా గమనించండి – అతనిలో ఈ లక్షణమే ఉంటుంది – పడిపోయి నైతికంగా దిగజారిన వ్యక్తిని గమనించండి క్రమశిక్షణ లోపించి ఉంటుంది – పుష్పానికి సుగంధం ఎంత అవసరమో, ఒక స్త్రీకి ఆభరణాలు ఎంత అందాన్నిస్తాయో – అలాగే క్రమశిక్షణ కూడా మానవ జీవితాన్ని అధ్బుతంగా తీర్చి దిద్దుతుంది – ఈ నాడు మనం ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు – తప్పనిసరిగా ఎదో ఒక పని చేయవలసిందే – కబురులతో కాపురాలు నడవవు కదా > కుటుంబంలో కాని, వృత్తి వ్యాపారాలలో కాని, క్రమశిక్షణగ ఉంటేనే మనం రాణించగలము. > క్రమశిక్షణగా జీవించు వ్యక్తి నియమాలకు ప్రాధాన్యత ఇస్తాడు – నైతికంగా ఎదుగుతాడు – అందరికి క్రమశిక్షణ నేర్పుతాడు. > ఈ నాడు ప్రపంచంలో అన్ని రంగాలలో పతన మవడానికి ముఖ్య కారణాలు క్రమశిక్షణ లోపించడం – క్రమశిక్షణ రాహిత్యాన్ని మనము క్షమించ కూడదు – బాద్యత ముఖ్యం అనుకున్న చోట క్రమశిక్షణ అమలు జరుగుతుంది – తాత్కాలి లాభాలు ముఖ్యము కాదు – శాశ్వత పరిష్కారం ముఖ్యము – పరిగ ముఖ్యం కాదు – పంట ముఖ్యం > క్రమశిక్షణగా జీవించే వ్యక్తులను – క్రమశిక్షణతో నడిచే సంస్థలనే అందరు ఎంపిక చేసుకొని పుష్కలంగా వనరులను అందిస్తారు – > ఎక్కువ మందిలో వ్యక్తిత్వం వికసించక పోవడానికి కారణం – వారు సమాజానికి దూరంగా ఉండడమే. > అది వారు గమనించాలి.

7) జడత్వములో – స్తబ్ధతగా – బండ రాళ్ళ మాదిరిగా – బావిలో కప్పులాగ జీవించడమే – ఎవరైతే పరిమితంగా – అహంకారంగా – మంచుగడ్డల మాదిరిగా ఉంటారో వారి వ్యక్తిత్వం బలహీనంగా ఉంటుంది > తమో గుణస్తులు :- ఈ భావనతో ఉంటారు – సమాజంలోనికి ప్రవేశించడానికి వారు ఇష్టపడరు – ఒకవేల ప్రవేశించిన విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. > రజోగుణస్తులు సమాజంలోకి ప్రవేశించినప్పటికి – వైపల్యం చెందుతారు ఎందుకంటే ఆలోచన తక్కువ – తొందరపాటు – ఆవేశం ఎక్కువ > సత్వ గుణస్తులు సమాజం లోకి ప్రవేశించడమే కాక దాని పై నూరు శాతం పట్టు సాధించ గలుగుతారు – సమాజంలోకి ప్రవేశించడానికి – ఇష్ట పడనీ వారిని గమనించండి – వారు తమలో ఉన్న లోపాలను ఆలోచిస్తారు తప్ప ఔనత్యాన్ని గురించి ఆలోచించారు – భయము పిరికితనము ఎక్కువగా తప్పించుకునే భావన ఉంటుంది తప్ప – సమాజంలోకి ప్రవేశిద్దామనే భావన ఉండదు – మనము ఏ పని చేయాలన్న – ప్రజల మద్దతు – ప్రజా సంభందాలు అవసరమే కదా!. > ప్రపంచము పతనమౌతున్నప్పుడు – సమాజం అస్త వ్యస్తముగా ఉన్నపుడు – ప్రమాదము జరగా పోతుందని తెలిసినప్పుడు అందుకు సరియైన పరిష్కార మార్గాన్ని ఎంచుకొని – సమాజంలోనికి దూసుకొని పోయి దానినే మంచి దిశగా మళ్ళించ వలసిన అవసరం ఎంతయినా ఉంది – లేకుంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది. > తమో గుణస్తులు ప్రమాదం జరుగుతుందని తెలుసుకున్నపటికి – తమలో ఉన్న లోపల వల్ల వాళ్ళు చొరవ తీసుకోరు. > రజో గుణస్తులు ప్రమాదాలు సంభవించే సమయమున తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. > సత్వ గుణస్తులు మాత్రం దూర ద్రుష్టితో వ్యవహరించి – రాబోయే ప్రమాదాన్ని అరికట్టి సమాజాన్నికి న్యాయం చేస్తారు > తమో గుణస్తుడు మంచు గడ్డలాగ ఉంటె – రజో గుణస్తుడు > నీరు మాదిరిగా వాలు ప్రవాహంలో ఉంటె – > సత్వ గుణస్తుడు ఆవిరిగా మారి అంతట వ్యాపిస్తాడు.

8) సృజనాత్మకత (creativity) :- వ్యక్తిత్వం పెంపొందాలంటే మనం ఏర్పరచుకోవలసిన మరొక లక్షణం సృజనాత్మకత > మానవ మేధస్సుకు పరిధి గాని – పరిమితి కాని ఉండదు. “ There is no boundary for the power of the human mind ”. > అది ఒక విశ్వ గ్రందాలయము – బయట నిండి ఎటువంటి సమాచారను పొందవలసిన అవసరం లేదు – అంత లోపలే ఉంది > “ It is the infinite library of the universe, no knowledge comes from outside, everything is within it ” > అయితే ఎవరైతే తమో – రజో గుణాలతో – చెడు సంస్కారాలతో – సుఖ – సౌకర్యాల ముసుగులో – భౌతిక వాదము మత్తులో – భద్రత కోసం వెంపార్లాడుతారు – వారిలో ఉన్న గుప్త శక్తులన్నీ హరించుకుపోతాయి >ఈ నాడు ఎక్కువ మంది – భద్రత కవచములో ఉన్నవారిలో లేనిది సృజనాత్మకతే > జీవితాన్ని యాంత్రికంగా కొనసాగిస్తునారే తప్ప – ఎటువంటి చైతన్యం ఉండటం లేదు. > నా ద్వారా ఈ ప్రపంచానికి ఎదో ఒక అద్బుతం జరగాలి – ఎవరు సాధించలేనిది సాధించి శబాష్ అనిపించుకోవాలి అనే భావనా ఉనప్పుడే – మనసులో ఆరాటం – అన్వేషణ – తపన – కృషి – పట్టుదల వంటి లక్షణాలు ఏర్పడుతాయి. > సృష్టిని బట్టి స్తితి – స్తితిని బట్టి – లయ ఉంటాయి – ముందు మనలను మనం ఉన్నతంగా ఊహించుకోవాలి – అక్కడనుండే మహోనతమైన దృక్పదం మోదలవుతుంది అదే తరువాతా అమలు జరుగుతుంది. “ nothing is impossible for the human mind it can acheve anything ” మానవ మేధస్సుకు అసాధ్యమనేదే ఏది లేదు అది ఏదైనా సాధించ గలుగుతుంది – విద్యలలో గాని – వ్యాపారములో గాని – పారిశ్రామిక ఉత్పత్తులలో కాని – కంప్యూటర్ పరిజ్ఞ్యానములోగాని – ఆధ్యాత్మిక రంగములో గాని సృజనాత్మకత ఉన్నప్పుడే – వ్యక్తులు గాని – సమస్థలు గాని అభిరుద్ది చెందుతాయి. > ఇక పొతే పరిపూర్ణ వ్యక్తిత్వం సిద్దించాలంటే – మనకు ఉండవలసిన మరొక విశిష్టమైన – మహోన్నతమైన అంశము.

9)“గమనము”. > ఒక విషయాన్ని గురించి సంపూర్ణంగా విశ్లేషించడమే గమనం > ఇంగ్లీష్ లో గమనాన్ని అవేర్నెస్ అంటారు > ఒక కార్యక్రమాన్ని చేపట్ట పోయే ముందు – అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే గమనము > ఒక విషయాన్ని గురించి – అన్ని కోనాలనుండి- సమూలంగా అధ్యయనం చేయడమే గమనం. > ప్రతి వ్యవహారంలో తొందర పడకుండా ఆచి – తూచి వ్యవహరించడమే గమనం. > ఉద్రేకపరిచే సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు – సమన్వయం పాటించడమే గమనం. > తప్పు చేయ డానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడి నప్పటికీ తప్పు జరగ కుండా – నిగ్రహాన్ని పాటించడమే గమనము. > జీవితాన్ని గురించి – జీవన విధానాన్ని గురించి ప్రపంచము దాని పనితీరును గమనించి – అన్ని కోనాలనుండి సమూలంగా పరిశోదన చేయడమే గమనము > కష్టాలు – నష్టాలు – అపజయాలు – అవమానాలు – ఆర్ధిక ఇబ్బందులు వంటివి ఆకస్మికంగా రావు – గమనాన్ని కోల్పోవడం ద్వారానే వస్తాయి. > సకాలములో పనులు పూర్తి చేయడమే గమనం
ఇవన్ని మీ అందరికి తెలిసిన విషయాలు అయినప్పటికీ, ఈ పిన్నవాడు చెప్పిన దాంట్లో ఏ మైన పొరపాట్లు ఉంటె సరిచేసి తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/13/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ప్రాణ” 1,వ భాగము

1. అనంత శక్తి వంతుడైన ఆ పరాత్పరుడు నుండి ప్రప్రధమముగా ఏర్పడిన జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి అయినా “ప్రాణుడు” సృష్టి నిర్మాణానికి మూల కారఖుడై యావత్తు సకల చరాచరా జగత్తు సృష్టించుకొని, సర్వ జీవుల అంతర్యామియై, వాటి ఉనికికి మూలాధారమైనా ఆ శక్తియే మన దేహములో ఉన్న ముఖ్య “ప్రాణ”. > తన అనుంగు శిష్యులైన, పంచ ప్రాణులతో, ఈ దేహ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తుంది – తను లేని యెడల యావత్తు సృష్టి, నిర్జీవ స్తితికి పోయేటటువంటి స్తితిలో ఉన్న ఈ ప్రాణ, ఎంత ముఖ్యమో – ఎంత విలువైనదో – ఎంత ఇంపార్టెంట్ అయినదో – ఆ ఒక్కటి తెలుసుకోకుండా – అన్ని తెలుసుకొని ఏం లాభము ? ఆ ఒక్కటి చిక్కితే అన్ని చిక్కుతాయి – అన్నింటి వళ్ళ ఆ ఒక్కటి చిక్కదు – ఆ ఒక్క దాన్ని గురించి – ప్రత్యక్ష జ్ఞ్యానము లేనివాడికి ఏమి తెలియనట్టు లెక్క. > ఇది చెట్టు, అది ఆవు, అది చీమ, ఇది ఏనుగు, ఇది పాము, ఇతను మొగవాడు, ఆమె ఆడది అంటూ వేరు వేరు రూపాలు చూస్తున్నారు – వేరు వేరు రూపాలలో, అంతర్యామిగా ఉన్న సూక్ష్మ రూపమే ఈ ప్రాణ. > అది అంతట ప్రకా శిస్తున్నది – ఎముకలు, మాంసము, చేతులు , కాళ్ళు , ముక్కు ,చెవి ,నాలిక ,చర్మము ,సూటు , బూటు ,మొదలగునవి అన్ని ఉన్నాయి – కాని ఆ ఒక్కటి ప్రాణము లేకపోవదమువల్ల , ఏది, ఏమి చేయలేరు – కాబట్టి ఆ ప్రాణుడి కోసము మనము ఏమి చేస్తున్నాము ? కనీసము ప్రాణుడికి ఆహారము పెడుతున్నామా ? లేనియడల ఆ ప్రాణ ఎలా జీవిస్తుంది ? ఆలోచించండి ? > మీరు అనుకుంటారు మేము రోజుకు మూడు తడవలు తింటున్నాము కదా ఇంకా ఏముంది పెట్టడానికి అనేది మీ ఆలోచన కదా ? మీరు పెడుతున్నది , మీకు కనపడే అహారము కదా ? అయితే మీకు మీ ప్రాణ కనపడుతున్నాదా , లేదు కదా , లేనియడల కనపడని ప్రాణకు కనపడు ఆహారము ఇస్తే ఎలా భుజిస్తుంది – కనపడు ఆహారము కనపడు దేహానికి కాని నీలోన అంతర్వానిగా , సూక్ష రూపములొవున్న ప్రాణుడుకి సూక్ష అన్నము పెట్టాలిగదా ? మీరు దేవాలములోగాని , మన ఇంటిలోచేయు పూజ విదానములోగాని నైవేద్యము పెడుతుంటాము కదా అప్పుడు మీరు చదివే మంత్రము ఏమో తెలుసా ? “ సూక్ష్మాన్నము సమర్పయామి ” అంటే సూక్ష్మా + అన్నము = సూ క్ష్మాన్నాము పెట్టాలనేదే కదా ? దాని అర్ధము > మన పూర్వీకులు అలా జీవనము కొనసాగించినారు – అన్ని రకాలగా ఆరోగ్యవంతులై వందల ఏండ్లు జీవించారు – పిల్లా , పాపలతో, ముని మనుమరాళ్ళతో ముచ్చట గోల్పేవారు – కాని ఈ నాటి పరస్థితులు ఎలా వన్నాయో మనందరికీ తెలుసు –మేల్కోండి దైవమునుండి వచ్చిన ఆ ప్రాణుడికి ఆహారము ఇచ్చిన , అదియే దైవ సేవ – దైవము వేరే లేదు – ఏ రోజు మనము అన్నము పెడుతామో ఆ రోజు ఆ ప్రాణ తన తండ్రి అయిన ఆ పరమేశ్వరునికి ఈ రోజు ఇతను అన్నము పెట్టాడు నాన్న అని తెలుపు కుంటున్నాది – అప్పుడు ఆ దైవము నా బిడ్డకు చాలా రోజుల తరువాత అన్నము పెట్టావు అంటా నా బిడ్డ చాలా సంతోష పడినాది అని ఆ దైవ – ఆన్న దాత సుఖీభవ అని ఆశ్వీరదిన్చుతుంది – ఈ వాఖ్యము ఇక్కడ పుట్టినాది ,కాని అది మనము ఎక్కడ వియోగిస్తున్నమో చూడండి -> అదే పెట్టని రోజు ఈ రోజు కూడా అన్నము పెట్టలేదు నాన్న అంటే ఏమంటాడో పరమేశ్వరుడు ఆలోచించండి – మనము గారాబంగా కూతురిని పెంచి పోషించి పెళ్లి చేసి అత్త్తారింటికి పంపిస్తే అత్తింటివారు బిడ్డకు అన్నము పెట్టడములేదని ఆ బిడ్డ మీకు పోను చేసి ఏడుస్తూ – అమ్మా ఈ రోజు కూడా నాకు అన్నము పెట్టలేదని చేప్పితే మీరు ఎలా ఉంటారో –ఎంత ఆవేదన చెందుతారో అలానే ఆ దైవ కూడా నా బిడ్డకు జర్గుతున్న అన్యానికి భాదపడి నా మొర వినేధీ ఎవరు ? అని అనుకోదా – అంతే కాకుండా రోజు తన తల్లి ,తండ్రికి ఇక్కడ ఉండలేను నన్నువచ్చితీసుక వెళ్ళమని నేను ఇక్కడ వుంటే ఆకలికి చచ్చి పోతున్నాను అని చెప్పి చెప్పి విసుగు ఎత్తిన ఆ బిడ్డ ఏదో ఒక రోజు తనకు తానే మూట , ముల్లె సర్దుకొని ఎలాగో అలాగా మన ఇల్లు చేరినట్లు , ఆ ప్రాణ కూడా మూట ,ముల్లె సర్దుకొని తన పుట్టిన ఇంటికి పోదంటారా ? ఆలా పోతే ఆ దేవుడు చల్లగాఉండా పిల్లల ,పెండ్లిలు అయ్యేవరకు వుంచ డాయే అని నన్ను నిందిస్తారు , దానికి కారణము ఎవరంటారు ?. > మీ బిడ్డకు అన్నము పెట్టి అన్ని రకాలుగా చూసుకుంటే ఆ బిడ్డ అత్తవారి ఇంటిని వదిలి వచ్చేదా చెప్పండి -?

2. ఒక ప్రక్కన నా బిడ్డకు అన్నం పెట్టక – రెండో ప్రక్కన నేను ఎక్కడో ఉన్నానని నా దర్శనం కోసం తిరగ రాని దగ్గర తిరుగుతూ చేయ రాని పనులన్నీ చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు – మీరు చదివే మంత్రాల సూక్ష్మ అర్ధాలను తెలుసుకోకుండా స్తూలమైన జ్ఞ్యానంతో నేను స్తూలంగా ఉన్నానని – సూక్ష్మంగా నీలోనే ఉన్న నన్ను చూడక బయటా చూస్తుంటావు ఇది నీకు తగునా ?కోట్ల కొలది జన్మలనుంది ఇలానే చేస్తున్నావు ,కర్మలు అనుభవిస్తూనే వున్నావు , > మీరు ప్రతి రోజు పూజా విధానములో మంత్రాల యొక్క – పూజ విధానం యొక్క ఇన్నర్ మీనింగ్స్ అర్ధం చేసుకొని నడచుకోండి – >ఇక నుండైన నా బిడ్డకు ఆహారాన్ని అందించి తృప్తి పరిచినచో – నన్ను తృప్తి పరిచినట్లే అప్పుడు నా సహకారము ఏళ్ల వేళల మీకు ఉంటుంది ఇది మీరు చేయు స్తూల విధానములో నేను దర్శనం ఇవ్వలేను – నేను స్తూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను – మీరు సూక్ష్మ స్తితిలో వెతికితే దొరక గలను – ఇది నేను అన్ని జీవుల్లో ఉన్నప్పటికీ మానవులకు ప్రతేకమైన జ్ఞ్యానము ఇచ్చాను తద్వారా అందుకోండి.

3. ప్రపంచములో జరుగుతున్నదంతా ఒక్క దానివల్లే జరుగుతుంది – ఆ ఒక్క ప్రాణాన్నే తెలుసుకోవలసి ఉంటుంది – ఇది సాధన చెయడం వలనే సాధ్య పడుతుంది – నేను లేకుండా నీ పెదవులు కదలగలవా ? చెవి వినగలదా? ఇంద్రియాలు తమ పనులు నిర్వహించ గలవా ? నీవు నడవగలవా, తినగలవా, నిద్రించగాలవా, > ఏలాంటి పనులు కుడా నేను లేకుండా నీవు చేసుకోగలవా అలాంటి దాని నైన నాకు అన్నం పెట్టడములో ఎందుకు ఈ అశ్రద్ధ ? నాకు అన్నం పెట్టినచో ఏ పనైనా సాధించగలను > మీరు మీ ఇంటిలోని పాలేరుకు అన్నం పెట్టినచో శక్తి వచ్చి ఏ పనైనా చేయ గలదు – అతను ఆకలిపై ఉన్నప్పుడు మీరు ఏ పని చెప్పిన చేస్తాడా ? అన్నం తిన్న తరువాత, బియ్యము బస్తానైనా మోయగలడు అలానే చంటి పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు – మీరు పాడే జోల పాట వింటుందా ? లేకా మారాం చేస్తుందా – మీరు అప్పుడు ఏం చేస్తారు – అలానే నా పరిస్థితి కుడా అర్ధం చేసుకోండి.

4. మీరు అన్నము పెట్టనిచో నేను క్రుంగి, కృషించి, నాతోపాటు మీ దేహాన్ని కుడా కృశింప జేస్తాను – నిండా నూరేళ్ళు బ్రతకాల్సిన మిమ్ముల ఆయుశ్షు ప్రమాణం తగ్గిస్తాను – నేను కృశించి నేను బలహీన పడినచో రాఘాది రోగములు వచ్చి దుర్బరమైన జీవితము గడుపు తారు – జనన – మరణ చక్రములో చిక్కుకొని పోతారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమని చెప్తారు – డాక్టర్ గారు, డాక్టర్ గారు అని నా ప్రాణం బాగులేదు అంటారు అవునా, కాదా ? నేను మా పుట్టింటి నుండి వచ్చేటప్పుడు సగం ప్రాణం తెచ్చుకున్నానా ? లేదా నీ ఇంటికి వచ్చినంకా సగమయ్యానా ? కారణం ఏమి ? ఆలోచించు మిత్రమా !

5. ఇక నైన నన్ను చూసుకుంటావో – గాలికోదిలేస్తావో అది నీ ఇష్టం.

—————- సశేషం ———————

పై విషయాలన్నీ మీకు తెలుసు ఏ మైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలు పుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/14/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹

“ మెదడు ” 2వ భాగము

1. మానవుని అవయవాలల్లో మెదడే ముఖ్య మైనది – మెదడు లేనిదే మానవ మనుగడ లేదు – మెదడు ఆజ్ఞ లేనిదే దేహములోని ఏ అవయం కూడా కదలదు – పిచ్చి కుక్క వెంట పడిందనుకోండి – పరుగు ఎత్తండి అని మెదడు చెప్పితేనే మీరు పరుగు ఎత్తుతారు లేక పోతే మీరు అక్కడే ఉండి పోతారు – స్వీట్, భోజనం, టిఫిన్ తినాలన్న మీరు మాట్లాడాలన్న, మీరు పాడాలన్న, చూడాలన్న, నడవాలన్న, చేతులతో పని చేయాలన్న అన్నింటికీ మెదడే కారణము – దాన్ని “ఆజ్ఞ” మానవ దేహములోని అన్ని అవయవాలు నడుచుకుంటాయి – > చీమ కుడితే చటక్కున మీరు చెయ్యి లాగేసుకోవాలన్న కాలుకు ముల్లు కుచ్చుకున్న తేలవాలన్న – చల్ల గాలి, వేడి గాలి తగులుతుందన్న జ్ఞ్యానము మెదడు ద్వారా తెలుస్తుంది – మానవుల అనుభూతులన్నింటికి కేంద్రం మెదడే – > మానవుని చేతనాచేతన స్థితి గతులకు మూలము – ఆలోచనలకి – ఆవేదనలకి, జ్ఞాపకాలకి, జ్ఞాన నిధికి, ఆవేశాలకి, ఆవేదనలకి, కోపాలకు – తాపాలకు, భ్రమలకి – బ్రాంతులకి మెదడే కేంద్రము > న్యాయ – అన్యాయాలకు నిర్ణయాలు చేసేది – కండరాల్ల కదలికలు చేసేది మెదడే – మెదడు పని చేయక పోతే శ్వాస క్రియలు జరగవు – గుండె కొట్టుకోదు ప్రాణి మనగడే లేదు – మెదడు చల్లగా ఉంటేనే మానవ మనుగడ చల్లగా ఉంటుంది – అందుకనే మెదడు గురుంచి నాలుగు ముక్కలు తెలుసుకుంటే మంచిది.

2. మెదడు యొక్క నిర్మాణము :- > కొబ్బరికాయలోని లేత కొబ్బరి ఉన్నట్లే – వెలగ పండు చిప్పలోపల మెత్తని గుజ్జు ఉన్నట్లే – మానవ కపాలములో మెదడు ఉంటుంది – > పుర్రె (skull) తలలోని యముకల గూడును పుర్రె అంటారు – ఇందులో మొత్తము 22 ఎముకలు ఉంటాయి – పుర్రె లోని ఎముకలను 2 రకాలుగా విభజించవచ్చును – > అవి 1.కపాలపు ఎముకలు (Cranial Bones) 2. ముఖ ఎముకలు (Facial Bones) – > 1. పెరైటర్ ఎముక .– 2. ఫ్రాoటల్ ఎముక – ౩. స్పినాయిడ్ ఎముక – 4.ఎతమాయిడ్ ఎముక – 5. లాక్రిమల్ ఎముక – 6. నాసల్ ఎముక – 7. జైగోమేటిక్ ఎముక – 8. లంబిక – 9. మాండిబుల్ – 10. ఆక్సిపిటల్ ఎముక – 11. మాస్టాయిడ్ కీలితము – 12. స్టైలాయిడ్ ఎముక – 13. మహా వివరము .-వీటి మద్యలో మెదడు వుంటుంది.

3. కపాలము ఎముకలు (Cranial Bones) :- > కపాలము కదలని ఎముకలతో నిర్మించబడి ఉంటుంది – ఇది మెదడు చుట్టూ ఒక పెట్టవలె ఏర్పడి ఉంటుంది – ఇందులో మొత్తము 8 ఎముకలు ఉంటాయి – అందులో 1. నుదుటి ఎముక (Frontal Bone – 1) చదునుగా ఉండి నుదుటి భాగాన్ని కప్పుతూ నాశిక కుహారాలు, నేత్ర కూటరముల (Orbits) వరకు వ్యాపించి వుంటుంది – పుర్రె పై భాగాన్ని పార్శ్వాలను కప్పుతూ కుడి ఎడమ వైపు ఒక జత పరైటల్ ఎముకలు (Parietal Bones – 2) ఉంటాయి – పుర్రె వెనుక భాగములో ఒక ఆక్సిపిటల్ ఎముక ( Occipital Bone – 1) ఉంటుంది – దీని క్రింది గల మహావివరము ( Formen Megnum) ద్వారా మజ్జా ముఖము (Medulla oblongata) వెన్ను ముకలోని మొదటి వెన్ను పుస అయిన అట్లాస్ (Atlas) తో కలుస్తుంది > పుర్రె కుడి ఎడమ పీట భాగములో ఒక జత టెంపరల్ ఎముకలు (temporal bones – 2) ఉంటాయి – ఒక స్పినాయిడ్ ఎముక (Spheniod Bone) గుబ్బిలం ఆకారములో ఉండి పుర్రె ముందు భాగాన పీటభాగాములో ఉంటుంది – ఒక ఎత్నాయిడ్ మృదులాస్థి ఎముక (Ethnoid Bone) నేత్ర కూటరముల మధ్య భాగాన్ని, నాశిక కుహారాన్ని కప్పుతూ ఉంటుంది.

4. ముఖపు ఎముకలు (Facial Bones) :- పుర్రె ముందు భాగాన్ని “ముఖము” అంటారు. > ఇందులోని క్రింది దవడ ఎముక (Mandible) మాత్రమె కపాలముతో కలుపబడి ఉండి కదలడానికి వీలుగా ఉంటుంది – ఇందులో మొత్తము 14 ఎముకలు ఉంటాయి – ఒక జత నాసల్స్ (Nasal Bones) నుదిటి ఎముక తో కలసి నాసిక సేతువు (Bridge of nose) అనే భాగాన్ని ఏర్పడుస్తుంది – ఒక ఓమర్ ఎముక (Vomer Bones) నాసిక కుహర మధ్య భాగాన్ని ఏర్పడుస్తుంది. > ఒక జత ఇన్ సీరియల్ టర్బినేటేడ్ ఎముక (Inferior turbinayed bones) స్ప్రింగ్ ఆకారములో ఉండి ఒక్కొకటి, ఒక్కొక నాసికా కుడ్యములో ఉండును – ఒక జత లాక్రిమల్స్ (lachrymal bones) ఎముకలు నేత్ర కూటరములో ఉంటాయి – ఒక జత జైగో మాటిక్ (zygomatic bones) ఎముకలు నేత్ర కూటరముల క్రింద ప్రక్కగా ఉంటాయి – ఒక జత పాలటల్ (palatal bones) ఎముకలు నాలుక వెనుక భాగములో ఉంటాయి – రెండు మాక్సిల్లరీ (Superior Maxillary) ఎముకలు ముఖ భాగములో కుడి ఎడమ నుంచి కలయడం వాళ్ళ పైదవడ (upper jaw) ఏర్పడుతుంది – ఒక మాందడిబుల్ ( mandible )ఎముక గుర్రపు నాడా ఆకారములో క్షితిజ సమాంతరముగా వొంగి క్రింది ధవడను ( lower jaw ) ను ఏర్పరుస్తుంది . ఇది ముఖము లోని అన్ని ఎముకల కంటే దృడమైన పెద్ద ఎముక .

5. >మెదడుకు సంభందించిన ప్రధాన భాగాలు ఎక్కడ ఉండేది తెలుసుకుంటే – కపాలము ఎంత గట్టిగా ఉంటుందో గమనించ వచ్చు – అంత గట్టి కపాలము లోపల పట్టుకుంటే కంది పోతాన అన్నంత మృదువుగా మెదడు ఉంటుంది > తల్లి తన వడిలో పసి కూనని ఎంత భద్రంగా దాచుకుంటుందో- కపాలము మెదడుకు అంత రక్షణ ఇస్తంది – కపాలము అధిరితే మెధడు గిలగిల లాడి పోతుంది – మెదడు మొత్తము బరువు ౧౩౫౦ నుండి ౧౪౦౦ గ్రాములు కలిగి కోటానుకోట్ల నాడీ కణాల సముదాయముతో కూడిన మెత్తని ముద్ద – ముద్ద అంటే ముద్ద కాదు మన శరీరములోని ప్రతి అవయవాల నాడీ కేంద్రాలన్నీ ఆ మెదడులోనే ఉంటాయి – వాటిను౦డే వచ్చేఆదేశాలే మన కదలికలు.

6. మెదడు లోని పొరలు :- మెదడులో “గ్రే మాటర్” అని – “వైట్ మాటర్” అని 2 రకాల టిస్యూలు ఉంటాయని శాస్త్రజ్ఞులు అంటారు. > గ్రే మాటర్ లో నాడీ కణాలకి సంభందించిన ప్రధానా భాగాలు ఉంటాయి – ఈ ప్రధాన భాగాలే నాడీ కణాలకి > మెదడు పై పొరల్లో గ్రే మాటర్ ఒక మందపాటి పొరగా ఉంటుంది. > మెదడు ఉపరితల భాగము ముడతలుగా కనబడుతుంది. > కొన్ని చోట్ల ఎత్తుగాను – మరి కొన్ని చోట్ల లోయలు లాగా లోతుగాను ఉంటుంది. > ఎత్తు పల్లాలు రెండింటిలోను గ్రే మాటర్ గోధుమ రంగులో ఉంటుంది. > గ్రే మాటర్ నర్వ్ సెల్ల్స్ తో నిండి ఉంటుంది. > వైట్ మాటర్ తెల్లగా కనబడుతుంది – ఇందులో నాడీ కణాలకి సంభందించిన దారాలు వంటివి ఉంటాయి – ఇవి మెదడుకి సంభందించిన తక్కిన భాగాలనుంచి ప్రయాణిస్తాయి.

7. > 1) గ్రే మాటర్. 2) వైట్ మాటర్. ౩) కార్పస్ కల్లోజం. 4) వెంట్రీకల్. 5) థలామస్. > వైట్ మాటర్ లో నాడీ కణాలకి సంభందించిన తక్కిన భాగం ఉంటుంది. > మెదడు ఉపరి భాగము బూడిద రంగుగాను – లోపలి భాగము తెల్ల గాను ఉంటుంది. > బూడిద రంగు భాగములో నాడీ కణాలకి సంభందించిన ముఖ్య భాగాలు ఉంటాయి. > తెల్లని భాగములో నాడీ కణాల పోగులు ఉంటాయి – అడ్డ కోత – నిలువు కోత కొస్తే మధ్యలో ఖాళి స్థలము – ఉపరి భాగములో బూడిద రంగు, లోపలి భాగములో తెల్ల రంగు గాను కనబడుతుంటాయి. > ఉపరి తలము బూడిద వర్ణముతో కనబడటమే కాకుండా ఎగుడు దిగుడులుగా ముడతలతో ఉంటుంది.

8. కోటాను కోట్ల నాడీ కణాలు ఉంటాయని తెలుసుకదా. > నాడీ కణము రూపము ఒక గాలి పటంగా ఉంటుంది – నాడీ కణము తలని గాలి పటము అనుకుంటే – దానికి సంభందించిన పొడుగాటి నరాన్ని గాలి పటాన్ని ఎగరేసిన దారము అనుకోవచ్చు. > నాడీ కణము తలలు గ్రే మాటర్ లో ఉంటె దానికి సంభందించిన పొడుగాటి నరాన్ని వైట్ మాటర్ లో ఉంటాయి – ఈ నరాలే మెదడు నుంచి సంకేతాలని శరీరానికంతటికి తీసుకొని వెళ్తాయి. > గ్రే మాటర్ ఉన్న భాగాన్ని కార్టికల్ ఏరియా అంటారు. > మెదడులో గుండు సూది బోడేపెలాంటి న్యూరాన్లు ఒకదానితో ఒకటి సన్నటి దారపు పోగులాంటి నరాలతో కనెక్ట్ కాబడి ఉంటాయి > మెదడులో ఇలాంటి న్యూరాన్లు 10.000 మిలియన్లకు పైగా ఉంటాయంటే దాన్నిబట్టి ఇవి ఎంత సూక్ష్మ ముగా ఉంటాయో ఉహించుకోవచ్చు > మనిషికి జ్ఞానము అయిదు మార్గాల ద్వారా మెదడుకు చేరుతుంది . 1) చెవి 2) చర్మము ౩) ముక్కు 4) కన్ను 5) నాలుక .వీటినే జ్ఞానేద్రియములు అంటారు . > ( కెనేటిక్ సెన్స్ అని ఆరవది ఒకటుంది .లిఫ్ట్లో వెళుతున్నప్పుడు అదోల అవటము దీనికి ఉధాహరణ) ఏదైనా ఒక విషయము పై ఇంద్రియాల ద్వారా మెదడుకు చేరినప్పుడు ,అక్కడ ఒక ఎలాక్ట్రో మాగ్నెటిక్ పాథావే ( Electromagnetic Pathway ) ఏర్పడుతుంది. > ఉదాహరణ : . ఒక కుర్రాడు పుస్తకము చదువు తున్నప్పుడు అతని కంటి నుంచి మెదడుకు ఒక Electromagnetic Pathway ఏర్పడుతుంది -> అలా ఏర్పడిన మెరుపు తీగ ఒక న్యూరాను దగ్గరకు వెళ్లి స్థిరపడుతుంది – ఆ స్థిరపడిన దానినే జ్ఞాపకము అంటారు -> ఆ విధంగా మనిషి మెదడు లోని ఒక్కొక న్యూరాను ఒక్కొక విషయాన్ని గుర్తు పెట్టుకుంటుంది. >మెదడులో ఆలాంటి న్యూరాన్లు వెయ్యి కోట్ల పైగా ఉన్నాయి – కాబట్టి మనిషి అన్ని విషయాలను గుర్తు పెట్టుకోగలడన్నమాట > ఒక మనిషికి జ్ఞానము వచ్చిన వయసు నుండి మరణించే వరకు నిమిషానికి 10 కొత్త విషయాల్ల చొప్పున అతని మెదడులోకి ఎక్కించిన – ఇంకా సగం మెదడు కాలిగా ఉంటుందని శాస్త్రజ్ఞులు దృవీకరించారు – మెదడుకు అంత గొప్ప కెపాసిటి ఉంది. – అంత పవర్ ఉంది.

9. అయిన కూడా మనిషికి ఎందుకు మతిమరుపు ? వెయ్యి కోట్ల విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకో గలిగే మెదడు ఉన్న మనిషి – పరీక్ష హాల్లో ప్రశ్న పత్రానికి సరిఅయిన సమాధానం గుర్తు రాక ఎందుకు తల బాడుకుంటున్నాడు ? తన ఇంటి టెలిఫోన్ నంబర్ మర్చిపోయి ఎందుకు విసుకుంటున్నాడు ? > దీనికి 2 కారణాలు :- 1) ఆ విషయానికి అతడు ప్రాముఖ్యత ఇవ్వక మెదడులోని న్యూరాన్లు ఆ విషయాన్ని మర్చిపోవటం వళ్ళ. > 2) మెదడులోని RNA సెరోటేనిన్ అన్న పదార్ధాలు చురుగ్గా లేకపోవడం వల్ల !! – ఒక విద్యార్ధి కానీ ఎవరైనా కాని తన న్యూరాన్లని – సేరోటేనిన్ చురుగ్గా ఉంచుకోగలిగితే – అతడి జ్ఞాపక శక్తి అమోగంగా ఉంటుంది.

10. మనిషి పుట్టినప్పడి నుండి మరణించే వరకు మొత్తం జీవిత కాలములో పదికోట్ల (10,00,00,000,00,00,000) విషయాలన్నీ గుర్తు పెట్టుకు౦టాడని అంచన – తల్లిని చూసి గుర్తు పట్టడం, అమ్మ అనటం, ముద్దు పేరు పెట్టి పిలవగానే వెనక్కి తిరిగి చూడడం > ఇవన్ని ప్రారంభములో మెదడు చేసే పనులే – ఈ విధంగా ఒక వ్యక్తి తన జీవిత కాలములో గుర్తుపెట్టుకున్న పదాలు వరస క్రమములో వ్రాయటం ప్రారంబిస్తే – వాటి పొడుగు పది కోట్ల యాభై లక్షల (10,50,00,000) కిలో మీటర్లు ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేసారు > కిలో బరువువండే చిన్న మెదడు ఇన్ని కోట్ల విషయాలు గుర్తు పెట్టుకోవడానికి కారణము” న్యూరాన్స్ “ అని . దైవ నిర్మిత మైన ఈ మెదడులోనే తను నివాసము ఏర్పరచుకొని అనంతమైన విజ్ఞానాన్ని మానవులకు అందించు తున్న విషయాన్నినేటి మానవులు మరచి పోతున్నారు -> ఇవి మెదడులో అనుక్షణము తమ పని తాము చెసుక పోతుంటాయి .> ఒక కంప్యూటర్ గదిలో లక్షల మంది సైంటిస్టులు తల ఎత్తకుండా పని చేయడాన్ని ఉహించండి -> న్యూరాన్లు అదేవిధంగా పనిచేస్తువుంటాయి- అయినా ఒక్కోసారి మనిషి పెయిల్ అవుతాడు – అసలు మనిషికి మతి మరపు ఎందుకు కలగుతుంది -? కొన్ని విషయాలలో ఏకాగ్రత ఎందుకు కుదరదు ? దీనికి సమాధానము తెలుసుకోవాలంటే న్యూరాన్స్ గురించి మరికొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. – సశేషం –
పై విషయాలన్నీ విజ్ఞులైన మీ అందరికి తేలసినవే – ఏ మైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసు చేసుకొని తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/15/2016

🌹 Om Shree Achyutaya Namaha 🌹

Mind – Part III

The wonderful power of your subconscious mind:

1) The power of subconscious (suptha chethana manasu) is endless. It guides you and motivates you. It can show you visual scenes from your memory as well as from your past life. It can control your heart beat and blood flow. It digests the food that you eat, sends it out and controls whole digestion system. When you eat piece of bread your sub conscious forms it into tissue, muscles, bones and blood. Even the most intelligent person on earth may not know about these processes. Your subconscious mind keeps physiological, important body processes under control. It knows answers to all the problems.
Your sub conscious mind never sleeps, never takes rest. It works round the clock. If you want to know its wonderful power, check this out. Before you sleep, convey a clear message to your subconscious that you would like to execute an important task. You will be surprised to see the forces that were emerged from you to achieve that task. You are going to enjoy it. The power and intelligence of sub conscious lets you have a direct interaction with God the almighty. That energy keeps the world moving, it directs plants to move in a certain order and keeps the Sun illuminated.

2) Your subconscious is the book of your life –
On your sub conscious mind if you write or carve any beliefs, opinions, theories, religious beliefs those are expelled outwards in the form of experiences, conditions and incidents. What you write inside also experienced outside. Your life has two sides. One is material side of it, second is private to self. One is visible, another is not. First one is thought latter its expression.
Your thoughts (ideas) reach your brain in the form of external vibrations of the nerves, it is the organ of your conscious mind. Your conscious materialistic mind does not fully understand thoughts, send it to different parts of brain. Such thoughts were created there and its expressed through your experiences.
As stated previously, your subconscious does not argue with you. It goes by what you write on it. It takes the judgement and opinion given by conscious mind as final. So you forever keep writing the book of your life. – Because your thoughts are your experiences so, “you become what you think you are”. Conscious mind has potential to move this world, it has endless knowledge and intelligence.
The reason for chaos in the world, people does not understand the correlation between conscious and subconscious mind. A sadhaka can understand this in Sadhana pretty quickly. Your depression, disappointment happens as your desires are not fulfilled. – By engaging ourselves with negative thoughts we hurt our self. – How many times did you hurt yourself with Anger, fear, jealousy, revenge on yourself? All of these things enter into your subconscious mind.

3) How does the subconscious mind controls all the activities performed by the body? Without fatigue it controls all activities of your body when you are awake or sleeping. Your conscious mind does not need to engage in these activities. When you are asleep your heart beats rhythmically. Your chest, septal heart muscles fill lungs with air and sends it out. This activity performed by living tissue in your body, to exhale carbon dioxide out and breathe in oxygen, this activity need to be worked out always. Sub conscious mind regulates your digestion, unconscious processes, generating gland fluids, and other complicated functions of the body. This process always continues constantly although you are awake or sleeping.
If your conscious mind required to regulate all activities (tasks) carried by your body, certainly you will be unsuccessful. The first thing you need to observer is your subconscious mind is working round the clock. It keeps working day and night although you do not assign any tasks to it. Producer of your body is your sub conscious, but you cannot observe it’s internal, silent processes with your conscious mind. It is the miracle of God’s creation, you would need to understand how wonderful and strange that mechanism is!

1) Your subconscious mind regulates all important duties carried by your body, it knows the answers to all the problems.
2) Before you sleep, ask your subconscious mind for a special desire (korika or you need). You will come to realize its wonderful power by yourself.
3) Any seal you imprint on you subconscious mind, expressed out in the form of conditions, experiences and incidents. Therefore, all of the ideas (thoughts) and concepts in sub conscious mind should be considered carefully by you.
4) Action & Reaction – is a universally applicable rule. Your thoughts — Action and Reaction – Your subconscious mind counter (reaction) to your thoughts by itself.
5) The main source of frustration is undying desires. If you keep thinking about delays, difficulties, your subconscious mind responds to it accordingly. You block your goodness by yourself.
6) Theory of your life flows rhythmically with harmony. Try to get advice of your intellect (buddi purvakamuga) “The desire generated in me by the power of sub conscious, will have my desire fulfilled by myself” confirm that by yourself. It eradicates all conflicts.
7) You interfere in common activities performed by your heart, lungs, and other organs with anxiety, worry and fear. Fill in your subconscious mind with harmony, health and peace then all activities performed by your body becomes simple.
8) Always keep the elite desires (sarwa shrestamina korikalu) in your conscious mind, your subconscious mind can make your habitually thoughts true.
9) Think your problem is resolved, imagine you got the correct answer. Get thrilled as if you accomplished something. What you had expected, experienced received by your subconscious mind. It then proceeds to initiate that functionality.
Note: You are knowledgeable and well matured, you know more than me. If there were any mistakes, please convey back to me with open mind.
R.B.Satyanarayana
Chairman, Annadhara

5/16/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ జపము ” ౩వ భాగము

L.K.G లో ఎన్నాల్లు ఉంటారు – > సాధక బందువులకు నమస్కారం – మీరు ఒకటి, రెండు జపము మెస్సేజ్ లలో చూపిన విధముగా మూడు సూక్ష్మ శక్తులపై ద్రుష్టి పెట్టి గతాగతి జరిపినచొ – అద్భుతమైన ఫలితాలు మీకు వస్తున్నాయని అనుకుంటాను – అంతే కాకుండా ఆ గతాగతులు మూడు స్థానాలలో నిర్వహిస్తున్నారని అనుకుంటా – అలా చేసినచో ఫలితాలు రాగలవు – అలా కాకుండా నేను రాసినటువంటి దానిని స్థూల మనసుతో, స్థూల ద్రుష్టితో, స్థూల నోరుతో చదవడం వల్ల – సూక్ష్మ మనస్సు లోకి వెల్లక – న్యూరాన్సులొ కూర్చోలేక వాటి ఫలితాలు కనబడవు – అలా కాకుండా ఈ నాడు పేపర్ మాదిరిగా చదివి అక్కడ వేస్తే – ఎన్ని చదివినప్పటికి విజ్ఞానము వికసించక – పాత పద్దతిలోనే రొటీన్ గ గతాగతులు చేస్తే – ఎలా ఫలితాలు వస్తాయో – మీకు మీరు అంచనా వేసుకుంటూ విజ్ఞ్యానముతో జపం చేయాలి.

1) ప్రాణ వుండే గురు స్థానం పై మనస్సును మరియు దృష్టిని కలిపి అలా చూస్తూ కూర్చుచుండినచో మీరు – బాహ్య ముఖము నుండి – అంతర్ముఖ స్థితి కలుగుతుంది – అప్పుడు మీ మనస్సును ఎక్కడో పెట్టినచో ఆ అనుభూతి రాదు – ఇంకో విషయం మీకు స్పైనల్ కార్డ్ నుండి – వాయు మధనం తరువత రావలసిన ఒక రకమైన వాయువు రాక పోవడం వళ్ళ – “ అశోనోత్పత్తి ” జరగదు – జపములో ప్రాణ + మనసు మిలనమై పైన ఆత్మలో కలిసినప్పుడే జపము చేస్తున్నారని సర్టిపికెట్ ఇయ్యవచ్చు – అప్పుడు సాధకుడు L.K.G. నుండి U.K.G. కి వచ్చినట్టుగా భావించ వచ్చు – అప్పడి వరకు జరుగు స్థూల గతాగతులని “వాయు మథనము” గా అంటారు – ఆ స్థితిలో దేహము తేలిక అవుతుంది – ఆ స్థితి లోనే జపము స్టార్ట్ అవుతుంది – అంతర్ ముఖ స్థితిలో కి మనసును తీసుక పోతే మానసిక వైరాగ్యము కలుగుతుంది – చెట్టుకు ఆకులు రాలిపోయినట్టు – ప్రాణ బలిస్ట మయినప్పుడు మనన్సు దానితో సహా వాసము చేసినప్పుడు – ఇంద్రియాలా మూలకంగా ఉన్న మనసు – అదోగతి ముఖము నుండి – ఊర్ధ్వ ముఖముగా ప్రయాణించినప్పుడు మానసిక దౌర్బల్యము పోతుంది – “ సదా ” ఉపాసనా జరుగుతున్నా దానిని ఆ మనసు గమనించి – ఎప్పుడూ ఆ అంతర్ముఖ స్థితిని – ఆనంద స్తితిని కోరుకుంటుంది – అలాంటి ఆనందం మనసుకు కావాలి – ప్రాణునికి ఆశనము రోజు త్రికాలములలో దొరకాలి – కనీసం రెండు తడవలైన పెట్టాలి – అలా అలా కొంత దూరం ప్రయాణిస్తుంటే – అతనిలో పెను మార్పులు జరుగును – అప్పుడు అతని కుడి కన్నులో సూర్య భింభము ప్రకాశించును.

2) సాధకుడు తీవ్ర మైన జపములో కొనసాగుతునప్పుడు ప్రాణ + మనసు కలసి ప్రయానిస్తు నప్పుడు దేహములోని అనేక మార్పులే కాకా – మానసిక మార్పులు ఎన్నో కలుగుతు ఇంకా ముందుకు కోన సాగినచో సాధకుని ఎడమ కన్నులో చంద్ర భింభము వచ్చి సాధకునిని ఉత్సాహ పరుచును – సూర్య ప్రకాశము – జ్ఞానానికి హేతువని – చంద్ర ప్రకాశం మనస్సు యొక్క స్థితికి కారణమని – అనుభవ పూర్వకమైన జ్ఞానులు చెప్తారు – అలాగే కొనసాగినచో అనేకమైన పరిణామాలు గోచరించును – మీరు దేహమనే దేవాలయములోకి వెళ్ళండి – దేవాలయములోకి వెల్లకుండా (అంతర్ముఖ స్థితి) దేవుడి దర్శనం జరుగుతుందా ? దైవ సామ్రాజ్యము నీలోనే ఉందని పవిత్రమైన బైబిల్ లో చెప్పబడింది > అవ్యక్తములోవున్న దేవున్ని దర్శించాలంటే ఎలా ? > దూది ద్వారా దారము – దారము ద్వారా బట్ట కనబడుతుంది – దూది అవ్యక్తములో ఉండటం వల్ల – దూది లేనట్టా – ? ఉన్నట్టా ? > బట్టలో దూది కనబడదు – అప్పుడు దూది లేనట్టా – రూపాన్తరము చెందింది – పాలలో మీగడ ఉంటుందా – ? లేదా – దానిని ప్రాసెస్స్ చేస్తే కనబడుతుంది – అలాగే పరమాత్మ తత్వము మనకు అలానే కనబడుతుంది.

౩) ప్రాణ ఆశన స్వీకారముతో జాగ్రతుమై మనస్సును పిలిస్తే – ప్రాణ భయముతో మనసు వెళ్లి కలిసి పోతుంది – ప్రాణ = సూపర్ డిక్టేటర్ – అతని స్వరాజ్యము కంట్రోల్ చేస్తుంది – మన దేహాన్ని ఏవో కొన్ని శక్తులు పరిపాలిన్చుచున్నవి – ప్రాణ జపములో గతాగాతిలో అశనము ఉత్పతి అవుతుందో ఆ సౌండ్ చాల బాగా అనిపిస్తుంది – సౌండ్ ను బట్టి గతాగతి నీ ప్రయత్నం లేకున్నా గతాగతి బాగా జరుగుతుంది – ఒకసారి ఆశన ఉత్పతి అయి ప్రాణ స్వీకారము అయిన తరువాత తను ఇన్వాల్మేంట్ అవుతుంది – ప్రాణ మనస్సును మాగ్నెటిక్ సిస్టం ద్వారా లాక్కుంటుంది – నీలా జాలంగా ప్రాణ ఎఫర్ట్ ద్వారా గతాగతి జరిగిందో అది చాల ఉత్సాహ బరితంగా ఉంటుంది – ఎంతో హాయిగా ఉంటుంది – ఒకసారి అశనము అయిన తరువాత వేడిగా ఉంటుంది – ప్రాణుడు మనస్సును లాక్కుంటే అప్పుడు కాన్సెంట్రేషెన్ కుదుర్తుంది – ప్రాణ భయానికి మనస్సు ఇంద్రియ సంసారం వదిలి అంతర్ముఖ స్థితికి పోతుంది – ప్రాణకు తల్లి స్థానం ఇచ్చారు – జీవకనాలే సంతానము – అన్ని జీవకణాలకు ఆహారము అందుతుందా అని చూసుకుంటుంది.

4) 2వ స్టేజి జపము స్థూలములొ జరిగేది – ౩వ స్టేజిలో తపస్సు సూక్శ్మములొ జరుగుతుంది – అప్పుడు బాడిలో అనేక మార్పులు జరుగుతాయి – ఉత్సాహముతో పైన మనస్సు వచ్చినప్పుడు – టైం, స్పేస్ రెండు పోతాయి – మనస్సు ప్రాణుని చూస్తూ టైం కాని – ఎక్కడ ఉన్నానో అనే (space) తెలవకుండా పోతుంది – రేపు జరిగే విషయాలు మీకు తెలుస్తాయి – మనస్సుకు ముందు చూపు ఉంటుంది మనస్సు మబ్బులో ఉంటె నిద్ర కూడా వస్తుది – మనస్సు + ప్రాణ కలిస్తే కాన్సేన్ట్రేషెన్ జరుగుతుంది – జపములో అనేక పరిణామాలు, అనుభవములు వస్తాయి – ఏవరో వచ్చినట్లు అనిపిస్తుంది – అప్పుడు ఎవరైనా రావచ్చును దైవ పురుషులు కాని సిద్ధ పురుషులు కాని భూత ప్రేత పిశాచాలు కూడా రావచ్చును – అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక సాధన జరుగుతుంది – క్రింద ఇప్పటి వరకు జరిగినది స్థూల జపమే – ఆ తరువాత మనో + ప్రాణ మిలనము అయి ఒకే దారిలో తన సహజ గతి నందు పైకి ఆత్మ దగ్గరకు పోవడం జరుగుతుంది – మూడవ స్టేజ్లో మధు సోమ రసములు వచ్చును – ఎక్కడ నుండి వచ్చినామో – అక్కడీకే పోవాలనే తపన పెరుగుతుంది – జపము సరిగా జరిగినప్పుడు సాధకులకు క్రింది బాడి కనెక్షన్ పోతుంది – ఆ టైములో ఎన్ని గంటలైన కూర్చోవచ్చు – సోమ, మధు, లిక్విడ్ ఉత్తత్తి అయితే దాని స్వీకారము వళ్ళ మబ్బు వస్తుంది ఇక్కడ సాధకులు అప్రమత్తంగా ఉండాలి.

5) సాధనా ఆరంభమున పుష్కలంగ ఉత్త్పత్తి అవుచుండిన లాలాజలం తగ్గి పోయి – కొంత కాలమైన మీదట తీపితో కూడినా చిక్కనైన ఒక రసము ఉత్పన్నమై ఆకలి తగ్గిపోవును – ఈ రసము సమృద్దిగా ఉత్త్పత్తి అయినకొలది సాధనలో చాలా సేపు కూర్చుండు శక్తియు – చాంచల్య రహిత మనస్తితియు చేకూరును ఈ రసమునే “మధు వనియు” దీని ఉత్పత్తి కారకమైన ఈ ప్రాణా యామమును “ మధు విద్య ” అని పేరు కొన్నారు – కాయ సంశుద్దికి సహాయమకై మొదట ఉత్త్పత్తి అయిన లాలా రసమును “ ప్రధమ తీర్ధ ” మనియు – ధర్మ సాధనకు అనగా మనోధారణ శక్తికి సహాయక మగుచున్న ఈ మధు రసమును “ ద్వితీయ తీర్ధ ” మనియు – కడపటి సమాధి స్తితిలో ఉత్పన్నమై – అజ్ఞ్యాన నివారకమై – మోక్ష సాధన ఉపకరించు అమృత రసమును “ తృతీయ తీర్ధ ” మనియు దార్శ నికులు వర్ణించి యున్నారు – ఇదే దేవాలయాలలోకాని – ఎక్కడైనా పూజా కార్యక్రమాలలోగాని – పూజారులు మనని ఆశ్వీర దించుతూ ఈ మంత్రము చదివి మనకు తీర్ధ ప్రసాదములు ఇచ్చెదరు – “ ప్రధమం కాయ శుద్ధ్యుర్ధం – ద్వితీయం ధర్మ సాధనం – తృతీయం మోక్ష మాప్నోతి – ఏవం తీర్ధం త్రిధా పిబేత్ ”

6) ఈ విధముగా సాధకుడు విజ్ఞ్యానముతో, వాయు మథనము నుండి జపముకు – జపమునుండి తపస్సుకు మారుతూ అచ్యంత భక్తి శ్రద్ధతో – సబ్ మిషన్ యై తను వచ్చిన మార్గాన్ని వెత్తుకుంటూ మానవ కర్తవ్యాన్ని పూర్తి చేయాలనీ కోరుకుంటూ – ప్రజా సేవలో పాల్గొనాలని మనవి…………..సశేషం……………

పై విషయాలన్నీ మీకు బాగా తెలుసు ఏ మైన తప్పులు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/17/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

సాధక మిత్రులకు నమస్కారములు – మన భారత దేశము ఎంతో పవిత్రమైన పుణ్య భూమి అని – ఆధ్యాత్మిక జీవనానికి పుట్టినిల్లని – వేదములకు – ఉపనిషత్తులకు – పురాణా, ఇతిహాసాలకు మరియు భగవద్గిత – భాగవత, రామాయణ, భారతములు వెలసిన పవిత్ర భూమి ఇది – సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి గీతోపదేశం చేసిన పవిత్ర గడ్డ ఇది – యోగులు, ఋషులు, మునులు, తపస్సులు, ఉపనిషత్కారులు, సాఖ్యులు మొదలగు ఋషి సాంప్రదాయ సంతతి అంతా వెలసి – ఆధ్యాత్మిక జీవనానికి – దైవ దర్శనాలకు నిలయమై ఎంతో కృషి చేసి తమ తమ తపస్సులలో – సృష్టి క్రమాన్ని, దైవ నిర్మాణాన్ని, దైవాన్ని దర్శించుకొని – ఫౌండేషన్ (pillars) వేసినందునే భారత దేశము అంత పవిత్రత కలిగింది – ప్రపంచములోని అన్ని దేశాలు – భారత దేశం వైపు చూస్తుంటాయి – అందుకే పాచ్యాతులు (foreigners) పవిత్ర గడ్డ అయిన భారత దేశ – పుణ్య భూమి పై కనీసం మూడు రాత్రులు నిద్రించాలన్న తలంపుతో మన భారత దేశానికి వస్తుంటారు – అలాంటి పవిత్ర మైన దేశములో పుట్టిన మనం ఈ దేశ ఔనత్యాన్ని, పవిత్రతను గుర్తెరిగి – ఆధ్యాత్మిక దేశవిలువలు తెలుసుకొని నడుచుకోవాలి – ఎదో ఒక రోజు బయట దేశం వెల్లినా – ఈ దేశములోని వారైనా ఏమిటి ? – నీ భారత దేశ ఔనత్యము అని అడిగితే సమాధానం ఇచ్చే రీతిలో – సాధకులు తయారు కావాలి – అనతి కాలములో ప్రభు శ్రీ యోగి అచ్యుతుల వారు వచ్చినప్పుడు – ఎన్నో దేశాల వారు – మన దేశము వచ్చి – మన ఆశ్రమానికి వచ్చినప్పుడు – ఏమిటి ఈ దేశ పవిత్రత అని మన సాధకులను అడిగినప్పుడు సరియిన – అవగాహనతో – దేశ సంస్కృతిని, ఆధ్యాత్మిక సంపదను అదే విధంగా బ్రహ్మ విద్య గొప్పతనాన్ని వివరించాల్సిన అవసరం మన సాధకులపై ఎంతయినా ఉంది – అందు గూర్చి ప్రతి సాధకుడు జపము – విజ్ఞానముతో శోధకుడై తపస్సులో ఆరితేరాలి – దానితో పాటు అన్ని ఆధ్యాత్మిక రంగాలలో విషయ అవగాహన కలిగి ఉండాలి – సాధకులు ఇది గమనములో పెట్టుకోవాలి – దాని భాగాములోనే సాధకులకు విషయ అవగాహన కోసం – ఒక క్రమంలో వేదాలను – ఉపనిషత్తులను – పురాణ ఇతిహాసాలను – భగవద్గిత లాంటి – ఆధ్యాత్మిక గ్రంధాలను సూక్ష్మంగా పరిచయం (introduction) మీ అవగాహన కోసం చేయాలని నా సంకల్పం ఉంది – అందు గూర్చి సాధకులు లోతయిన విశ్లేషనతో ముందుకు పోవాలని మనసార కోరుకుంటున్నాను – దీనిపై మీ అభిప్రాయము తెలిపినచో ఈ సిరియల్ ప్రవేశ పెడుతాను.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/19/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ బుద్ది ” (buddhi) 2వ భాగము

1) ఆత్మ బందువులైన మీకు నమస్కారం > దైవ దత్తమైన ఆత్మ యొక్క అంతకరణములే ఈ అంతకరణ చేతుష్టయము – 1) మనస్సు – 2) బుద్ది – ౩) చిత్ శక్తి – 4) అహంకారం – > ఈ నాలుగు సూక్ష్మ స్థితిలో ఉండునవి – ఒక రకంగా “బుద్దిని” హంసతో పోల్చవచ్చును – హంస పాలను – నీల్లను వేరు చేయును – అదే విధంగా ఉచిత , అనుచిత – న్యాయ , అన్యాయ – ధర్మ , అధర్మ – నీతి , అవినీతి – స్వార్ధ , నిస్వార్ధ – శ్రేయస్సు – ప్రేయస్సు మొదలగు వాటిని నిక్కచ్చితంగా – నిగ్గు తేల్చే జడ్జి లాంటిది ఈ బుద్ది – దైవాంశమైన ఈ బుద్దికి – ఈ నాటి మానవుడు బుద్ది యొక్క జడ్జి మెంట్ పెడచెవిన పెడుతూ – దశేంద్రియాలతో సహవాసము చేస్తున్న స్థూల మనస్సు యొక్క వ్యవహారములో పడి చేయరాని కర్మలు చేస్తూ – కర్మ యొక్క ఫలితాలను గుణముల ద్వారా వాటికి అంటగడుతూ – జన్మ జన్మంతరాలుగా ఆ బుద్దిని మాలిన్యం చేస్తూ అనంత జన్మలకు కారణ భూతమవుతున్నడు – > బుద్ది యొక్క చాతుర్యము – దయా – ఔదార్యము – వినయము , నిస్వార్ధత – విశాలమైన , వైజ్ఞ్యానికమైన , ద్రుక్పదముతో – తృప్తి కర జీవనం – సదా జాగురుకత మొదలైన గుణములు కలిగి ఉండాల్సిన బుద్దిని – తన స్తూల మనసు యొక్క అహంకార ప్రవర్తన వళ్ళ – స్వచ్చమైనా బుద్దిని చిన్నా బిన్నము చేస్తూన్నాడు – దాని వళ్ళ కోపము – పక్షపాతము – అసూయా – సంకుచిత బుద్ది – ఆలస్యము మొదలగు ఆవ గుణములన్ని కల్పిస్తున్నాడు ఈ – భూమిపై జన్మించిన మీరు అత్యంత శ్రేష్ట వంతులై – ధైర్య వంతులై , బలశాలురులై , ఈ సుందరమైన మీ జీవితాన్ని మానవ సేవకు – మిమ్ములను మీరు తీర్చి దిద్దుకోండి – ఉత్తుత్తి మాటలు కాకా – చేతలలో చూపించండి – మీరు అందరు ఆధ్యాత్మిక పరులు కాండి – మొదట మీరు ఆ అను భూతి పొందండి – > భేస్త వాని వలలో పడిన చేప పొడి నేలపైన గంతు లేస్తూ నిస్సహాయంగా – నిస్పృహతో తన నిజ స్థానానికి నీటిలోనికి చేరడానికి పోరాటం సాగిస్తుంది – > అదేవిదంగా మానవుని నిజగృహము దైవము – తన నిజతత్వమైన దైవత్వాన్ని మరచినంత కాలం అతను దుఖి:తుడై అశాంతితో భాధపడుతుంటాడు.

2) సూక్ష్మములో ఉన్న ఆ నాలుగు అంతకరణములే – స్థూలములో కుడా ఉంది ఎలా చేస్తుదో గమనించడి – ఉదాహరణకు ఒక మిత్రుని ఇంటికి – పెళ్లి సంధర్బమో – ఇంకేదైనా ఫంక్షన్ సందర్భమో – డిన్నర్ ఆర్ లంచ్ కు వెళ్ళినప్పుడో , అక్కడ ఉండునటువంటి విలువైన వస్తువులను చూచి నప్పుడు – ఈ కొంటె మనసు వాటిని దొంగిలించాలని ప్రయత్నిస్తునప్పుడు – ఈ మనసు ఏ పనిచేయాలన్న ఒక కాపీ బుద్దికి పంపాలి – మనసు పంపిన అప్లికేషన్ను , విచారించి , ఆలోచించి – ఈ పని తగదు అని – దొంగిలించడం వళ్ళ పెద్ద అనర్ధకాలు ఏర్పడుతాయని బుద్ది మనసును హెచ్చ రిస్తూ – ఆ అప్లికేషన్ని రిటెన్ కొడుతుంది – బుద్ది వాపసు పంపిన అప్లికేషన్ను – ఈ స్థూల మనసు చూసుకొని – ఆ బుద్దికి ఏమి తెలుసులే – అది కొనాలంటే వేల రుపాయలవుతుంది – ఎక్కడ నుండి తెచ్చి కొంటామో డానికి తెలువదు అన్న ధీమాతో తన శిష్యులైనా దశేన్ద్రియాలను పురమాయించి – కాళ్ళను వెళ్ళమని – కన్నులను అటు ఇటు చూడామని – చెవులను ఏదైనా , ఎవరిదైనా చప్పుడు వస్తుందా అని వినమని – చేతులను ఆవస్తువును తీసుకురా అని పురమాయిస్తుంది – అప్పడికి ఆ విలువైన వస్తువు తన జేబులో పడుతుంది – ఈ విషయాలన్నింటిని గమనిస్తున్న సిసి కెమేరాలుగాని – ఆ ఫంక్షన్ నిర్వహకుడు కాని చూసినచో అతని పరిస్థితి ఏమిటి ? – బుద్ది చేప్పిన మాట వినకుండా దొంగతనము చేయడంతో ఆ ఇంటి యజమానులు మూకుమ్మడిగా దాడి చేసి దెబ్బలు కొడితే – ఒళ్ళు వాచీ పోయి కుర్రో , మొర్రో అనుకుంటూ ఇంటికి చేరుతాడు – చేరిన తరువాత దేహ బాధలతో మూలుగుతూ, మూలుగుతూ నిద్ర పోతాడు – దెబ్బల బాధతో సరిగా నిదుర రానప్పుడు – ఎవరో తనలోపటి నుండి వచ్చి తగిలి దెబ్బలకు జండు బాం రాస్తూ – నేను వద్దన్నానుగదా – ? ఎందుకు దొంగిలించావు – ? అని అడుగుతూ ఒళ్లంతా నొక్కుతూ మర్దన చేస్తుంది – అప్పుడు నేను ఒద్దనుకున్నాను గాని – ఈ మనస్సు తీసుకో , తేసుకో అని నన్ను ప్రేరేపించింది అని ఆ మనసు యొక్క తీరును అర్ధము చేసుకున్న వాడిలా మాట్లాడుతాడు – అప్పటికే ఇతనితో ఈ పని చేయించి – తను జారుకొని ఏ మూలనో , ఏ వంట గదిలోనూ పోపు డబ్బాలలో కూర్చొని – అప్పుడు ఆ మనస్సు ఒక సవాలు విసురుతుంది – నిన్ను తీసు కొమ్మంటే – ? తీసుకుంటావా – ? నీకు బుద్ది ఉండక్కర్లేదా – నేను ఇలాంటి కొంటె పనులే చేస్తుంటాను – నీకు బుద్ది ఏమయింది – ? నీ బుద్ది చెప్పినట్టు వినాలా – నా కోతి చేష్టలు కలిగినా మనస్సు మాటలు వినాలా – ? నీ విచక్షణ జ్ఞ్యానము ఏ మయింది – దైవం నుండి వచ్చిన బుద్దిని అనుసరించాలా వద్దా – ? భగవంతుడు నీకు జ్ఞ్యానమిచ్చింది ఎందుకు – ? అని – ఈ చిలిపి మనసు అడుగుతుంది – విజ్ఞ్యాన వంతుడవైన ఓ మానవుడా ఏ మిటి నీ సమాధానము – ?

౩) అంతే కాకుండా ఈ నాటి మానవులు తనకు తానుగ ఎలా పతనము అవుతుంటాడో పరిశీలించండి – స్థూల మనస్సుతో కూడుకున్న ఈ బుద్ది – ఏమంటుందో గమనించండి – నాకు తినాలన్న బుద్ది పుడుతుంది – తాగాలన్న బుద్ది పుడుతుంది – దోయాలన్న బుద్ది పుడుతుంది – పోవాలన్న బుద్ది పుడుతుంది – మర్డర్ చేయాలన్న బుద్ది పుడుతుంది – వ్యభిచారించాలన్నా బుద్ది పుడుతుంది – తల్లిదండ్రులను గెన్టేయాలన్న బుద్ది పుడుతుంది – కట్నం తేవాలని వేదించే బుద్ది పుడుతుంది – తేకపోతే గ్యాస్ నూనే పోసి చంపాలన్న బుద్ది పుడుతుంది – ఏంఎల్ఏ కావాలని బుద్ది పుడుతుంది – ముఖ్య మంత్రి కావాలని బుద్ది పుడుతుంది – ప్రధాన మంత్రి కావాలని బుద్ది పుడుతుంది – బ్యాంకులు దోయాలన్న బుద్ది పుడుతుంది – ఆడ పిల్లలను ఏడ్పించాలని బుద్ది పుడుతుంది – స్థూల మనస్సు దిగాజారినప్పుడు – దానితో సహవాసం చేయు బుద్ది కూడా మాలిన్యంగా తయారై పడరాని పాట్లు పడుతూ కర్మాను బందములో చిక్కుకొని గిలగిలలాడుతున్నాడు – ఇంకా ఒక అడుగు ముందుకేసి – త్వరగా కోటిశ్వరున్ని కావాలన్న – తలంపుతో చేయరాని పనులు చేస్తూ లాభాలు వస్తాయన్న దానితో కోటాను కోట్ల రూపాయలు – మంది దగ్గర తెచ్చిపెట్టి రాత్రికి రాత్రే మిలీనియర్ కావాలన్న బుద్దితో – అవి అనుకున్న ఫలితాలు రాకపోను తను దివాలా తీస్తూ – పెట్టుబడి పెట్టిన వారిని కూడా దివాలా తీయించి తను జండా ఎత్తివేసి – దొరికితే కారాగారాలలో జీవనం వెల్ల పుచ్చాల్సి వస్తుంది – ఇదంతటికి కారణం ఈ స్థూల బుద్దియే – దాని ఫలితం ఆ జీవుడు ఆ ఖర్మ ఫలితాలలో ఇరుక్కొని ఈ జనన మరణ చక్రములో ఇరుక్కపోతున్నాడు.

4) సమత్వ బుద్ది గలవాడు పుణ్యా పాపముల రెండింటిని ఈ జన్మ యందే నిష్కామ కర్మ వల్ల తోలిగించుకోవచ్చును – సమత్వ బుద్దితో గూడి అనాసక్తముగా – నిష్కామముగా కర్మల ఆచరిన్చువారు – అట్టి వానికి పుణ్యము గాని పాపము గాని అంటదు – ఏల అనిన ఆసక్తితో – పలాభిలాశతో కర్మలను చేయువారికే పుణ్య పాపముల సంభందం ఉండును – ఎలాంటి ఆసక్తి లేని – పలాభి లెశరహితముగా చేయువారికి ఆ పుణ్య పాపముల సంభందమేమియు ఉండదు – నిష్కామ బుద్దితో యోగామాచరించిన – వారు బంధ విముక్తులవుదురు – సమత్వ బుద్దితో గూడిన వివేక వంతులు కర్మములు చేయుచున్నను వాని ఫలమును త్వజించి జనన మరణ రూపమను బంధమునుండి విడుదల పొందిన వారై దుఖ: రహితమగు మోక్ష పదవిని పొందుచున్నరు – యోగములో నిష్కామ కర్మ ద్వారా చిత్తము శుద్దము కాగ – అట్టి నిర్మల చిత్తమున – ఆత్మ జ్ఞాన ముదయిన్చుటచే వారు జన్మ బంధ రహితులగుచున్నారు – దీనిని బట్టి కర్మ మార్గము మోక్షమున కెట్లు ఉపకరించుచున్నదో ఇచ్చట స్పష్టీకరించబడినది – ఈ ప్రపంచమున ప్రతి వారును బంధన ఎట్లు తోలుగుతాయని విచారించుచున్నారు – అట్టి బంధ విముక్తికి – ఓ మానవులార మీరు బంధ విముక్తులై – నిరామయమగు మోక్ష పదవిని బొంద గలరని కర్మలను నిష్కామముగా , ఈశ్వరార్పాన బుద్దితో ఆచరింపుడు – దాని వలన చిత్త శుద్ది గలిగి, ఆత్మా జ్ఞ్యానము ఉదయించి మీరు తప్పక మోక్ష దామము నలకరించగలరని భగవాన్ శ్రీ కృష్ణ మూర్తి భక్తులకు అభయమిస్తున్నాడు – ఈ నాడు ప్రపంచమున అనేక గొప్ప పదవులు కలవు – అన్ని పదవులకంటే గొప్పదైన బంధరహిత మైనట్టి ఆత్మ పదవే గొప్పది – దానిని పొందుటయే ప్రతి జీవి యొక్క లక్ష్యము – ఆ స్థితిని అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ విషయాలన్నీ మీ అందరికి తెలుసు ఏ మైన పొరపాట్లు ఉంటె తెలుపు తారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/21/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ వ్యక్తిత్వ వికాసము ” ౩ వ భాగము

అనుకున్నది సాధించాలంటే – అద్భుతాలు జరగాలని కొందరు కోరుకుంటూ ఉంటారు – ఇది చాలా తప్పు అవగాహన – ఎందుకంటే విజయాలు సాధించిన వారి దగ్గర అద్భుత శక్తులున్న – మంత్రదండం ఏది ఉండదు – ఎటొచ్చీ విజయానికి దోహదం చేసే తారక మంత్రం ఏమిటో వారు తెలుసుకోగలగడం వల్లనే విజయాన్ని పొందగలిగారు – “ విశ్వంలో ఉన్నవన్ని నాలో ఉన్నాయి – ఆ శక్తులకు పదును పెడితే అనుకున్నది సాధించ వచ్చు ” అనేది ఆ తారక మంత్రం – అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరాలని తీవ్రంగా తపించే వాళ్ళందరూ ఈ రహస్యాన్ని తేలుసుకు తీరాలి – > అధ్బుత విజయాలకి అడ్డ దార్లు అంటూ ఏమి ఉండవు – లక్ష్య సాధనకు శ్రమించి తీరాల్సిందే ! దురద్రుష్టవశాత్తూ మనలో చాలా మంది అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సీరియస్ గా ప్రయత్నించడం లేదు – ఇంకొందరు ప్రయత్నించిన సక్సెస్స్ కావడం లేదు – కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మెదడు పొరల్లోకి తొంగి చూడాలి – అనుకున్నది సాధించగలమా ? లేదా ? అనేది “ అనుకున్నప్పుడే ” యాభై శాతం నిర్ణయం అయిపోతుంది – “ శుభారంభం సగం విజయం ” అని ఊరికే అనలేదు – అందుకే “ అనుకోవడం లోనే అంత ఉంది” అంటోంది భగవద్గీత – అందువల్ల ఒక లక్ష్యాన్ని అనుకునే ముందు అదేదో అల్లాటప్ప వ్యవహారంగా తీసుకోకూడదు – ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే దానికి ముందుగానే కొంత మూల్యాన్ని చేల్లించుకోవాలి – అది కృషి కావచ్చు, కాలం కావచ్చు, ధనం కావచ్చు – లేక మూడు కావచ్చు – అందువల్ల మనం చెల్లించ గలిగే మూల్యాన్ని బట్టి లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి – అనుకున్నది సాధించాలనుకునే వాళ్ళు లక్ష్య నిర్ధారణలో కొన్ని కఠోర వాస్తవాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి – లక్ష్య సాధన అనేది టిఫిన్ తిన్నాక బిల్ పే చేసే హోటల్ లాంటిది కాదు – విజయాన్ని ఆస్వాదించాలనుకుంటే డానికి ముందుగానే మొత్తం మూల్యం చెల్లించేయాలి – కాయలు కోసుకోవాలంటే ముందుగా విత్తనాలు నాటాలి కదా ! లక్ష్య నిర్ధారణలు వ్యక్తిగతలక్షణాలు, బాహ్య ఒత్తిడులు ముఖ్య పాత్ర వహిస్తాయి – దీర్గ కాలం వేచి చూడగల ఓపిక, స్తోమత లేనివాళ్ళు స్వల్పకాలిక లక్ష్యాలను ఏర్పరుచుకుంటేనే మేలు – ఆశించింది సొంతం చేసుకోవడానికి దీర్ఘ కాలం వేచి ఉండగల స్తోమత, సహనం ఉన్నవాళ్ళు అల్ప లక్ష్యాలను ఏర్పరుచుకుంటే విలువైన సామర్ధ్యం వృధా అవుతుంది – > ఇలాంటి వారికి చిన్న చిన్న విజయాలు ఎంత మాత్రం థ్రిల్ ఇవ్వవు – అందువల్ల ఒక లక్ష్యాన్ని అనుకునే ముందు పైన చెప్పిన వాస్తవాల్ని గురించి ఒక క్షణం ఆలోచించి నిర్ధారించుకున్న తరువాత విజయాన్ని ప్రభావితం చేయగల అంశాలు కొన్ని ఉన్నాయన్న సంగతిని అందరు గుర్తించాలి – > ఏ లక్ష్య సాధనకైనా ఇవి అత్యంత మౌలిక మైనవి, ప్రతి ఒక్కరు అలవర్చుకోదగినవీను ! స్వీయ క్రమ శిక్షణ – సమయ పాలన – ప్లానింగ్ – స్వయం ప్రేరణ – వాస్తవిక ద్రుష్టి – సృజనాత్మకత – అనే అయిదు అంశాలు ఏ విజయానికైన మూల స్తంభాల వంటివి.

1) స్వీయ క్రమశిక్షణ ( self discipline ) :- > లక్ష్య సాధకులకు ఉండాల్సిన అతి ప్రాధమిక లక్షణం ఇది – ఇది ఉంటే మిగిలిన ఉత్తమ లక్షణాలన్ని వాటంతటవే వస్తాయి – స్వేయక్రమశిక్షణ అనేది పూర్తిగా మానసికమైనది – ఏదైనా ఒక లక్ష్యాన్ని అనుగుణంగా ఆలోచనలను, ఆచరణను తీర్చిదిద్దుకుంటే దానిని సెల్ఫ్ డిసిప్లింగా పరిగణించవచ్చు – స్వర్వశక్తుల్ని లక్షం పైకి కేంద్రికరించాలంటే ఇది అత్యవసరము –సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ప్రయత్నం బలహీన పడుతుంది – అనవసరం విషయాలు లక్ష్యాన్ని డామినేట్ చేస్తాయి – వ్యక్తిని శక్తిగా మార్చే సామర్ధ్యం సెల్ఫ్ డిసిప్లింకు మాత్రమె ఉంది – అందరి మెదడులోనూ 9 బిలియన్ల కణాలే ఉంటాయి – కాని కొందరిలో మాత్రమె అవి క్రియా శీలకంగా పని చేస్తాయి – మరి కొందరిలో అవి నిద్రా వస్థలో ఉంటాయి – కారణం వాటికి పదును పెట్టి యుద్దానికి సన్నద్ధంగా ఉంచకపోవడమే ! లక్ష్య సాద్ధన అనే యుద్ధ రంగంలో 9 బిలియన్లా సైనికుల్ని వ్యూహాత్మకంగా మొహరించడంలోనే ఉంది విజయ రహస్యం – > చెల్లా చెదురుగా, నిరుప యోగంగా పడి ఉన్న అంతర్గత శక్తులకు కఠోర శిక్షణ ఇవ్వాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ మేకానిజాన్ని బలో పేతం చేయక తప్పదు – లక్ష్యానికి సంభంధం లేని, లక్ష్యాన్ని నీరు గార్చే ఆలోచనల్ని, భావాల్ని బహిష్కరించడం, ఆశయ సాధనకు దోహదం చేసే ఆలోచనల్ని ఆహ్వానించడం ; > హాఫ్ హార్టెడ్ గా కాకునా హోల్ హార్టెడ్ గా లక్ష్యానికి అంకితం కావడం – ఇవన్ని సెల్ఫ్ డిసిప్లిన్ లో భాగాలే – నిరంతరం అప్రమత్తత కూడా దీని పరిధిలోకి వస్తుంది – లక్ష్యం పట్ల అప్రమతంగా ఉంటె అపజయం తప్పదు – నూతన ఆలోచనల్ని ఆహ్వానించాలన్న, నిన్నటి కంటే నేడు, నేటికంటే రేపు మెరుగ్గా ఉండాలన్నా డైనమిక్ గా ఉండటం అనివార్యం – అప్పుడే అనుకున్నది సాధించగలం.

2) సమయ పాలన – ప్రణాళిక :- > ఈ రెండు ఇంచు మించు ఒకటే – పరిమిత సమయాన్ని ఫలవంతంగా వాడుకునేందుకు ఉద్దేశించిందే ప్రణాళిక – లక్ష్య సాధన ప్రక్రియ స్పష్టంగా, సూటిగ ఉండాలంటే కాల ప్రణాళిక తప్పనిసరి – ప్రణాళిక ఎప్పుడు ఆచరణాత్మకంగా, లక్ష్యాన్ని చేరువ చేసేదిగా ఉండాలి – లక్ష్యం అనేది ఒకే రోజులో సాదించేది కాదు – దీనికోసం కనీసం కొన్ని నెలలైనా శ్రమించాలి – లక్ష్యం తాలూకు సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మార్చడం సాధ్యం కాదు – నిర్దేశిత సమయానికి లక్ష్యాన్ని అందుకోలేక పోతే అపజయం పాలు కాక తప్పాదు – కాబట్టి సమయ పాలన పట్ల ఎంత కటినంగా ఉంటె అంత మంచిది – కాల ప్రణాలికలో ఒకటి – తొలుత చేయాల్సింది సమయాన్ని హరించే అలవాట్లను గుర్తించి వాటికి స్థానం లేకుండా చేయడం – రెండు – నిత్య జీవితంలో చేసే పనుల్ని, ఆలోచనల్ని కూడా లక్ష్యానికి అనుగుణంగా మార్చుకోవడం – మూడు – ప్రాధమ్యాలను గుర్తించడం – నాలుగు – డేడ్ లైన్లు పెట్టుకోవడం – ఈ నాలుగు అంశాలలో చివరి రెండు చాల ప్రధానమైనవి – చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో అమర్చడం వల్ల సమయం వృధా కాదు – ముఖ్యమైన పనుల్ని ముందుగానే చేసేయడం వల్ల, సమయాభావం వల్ల అప్రధానమైన పనుల్ని వదిలి పెట్టిన పెద్దగ నష్టం ఉండదు.

3) స్వయం ప్రేరణ :- > లక్ష్యసాధనపట్ల ప్రారంభంలో ఉన్న ఉత్సుకతను చివరి దాక కొనసాగించాలంటే ఇది అవసరం – ఫలానా పని “చెయ్యి చెయ్యి” అంటూ మన ఆలోచనలు మనల్ని వెంటబడి తరమడాన్నే ప్రేరణగా భావించ వచ్చు – అయితే ఇవే ఆలోచనలు ఒక్కసారి రివర్స్ లో పనిచేసి ఉత్సాహాన్ని నీరు గారుస్తాయి – లక్ష్యం తాలూకు శ్రమను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా లేకపోవడం, లక్ష్య సాధనకు ఎక్కువ సమయం పట్టడం, తరుచు ఎదురయ్యే పరాజయాలు – అడ్డంకులు మన ఆలోచనలపై ప్రతికూల పభావం చూపి ప్రయత్నాన్ని నీరు గారుస్తాయి – వీటిని ఎదుర్కోవాలంటే సెల్ఫ్ మోటివేషన్ తప్పని సరి – ఇది నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చి వేసే క్రియా శీలక శక్తి – ప్రతి లక్ష్యం వెనుకా ఏదో ప్రేరణ దాగి ఉంటుంది – ఆ ప్రేరణే మనల్ని లక్ష్యం వైపు ఆకర్షిస్తుంది – ఒక వ్యక్తి బిజినెస్ లో రాణించాలనుకుంటూన్నాడంటే “ధనార్జన” అతనికి ప్రేరణ నిస్తోందన్నమాట – ఒక అభ్యర్ధి ఐఏఎస్ కావాలనుకుంటున్నడంటే “అధికారం, గుర్తింపు” అతని ప్రేరణ శక్తులుగా వ్యవహరిస్తున్నాయని గుర్తించాలి – అయితే లక్ష్యం తాలూకు కష్టం అనుభవం అయ్యేటప్పటికి ఈ ప్రేరణలు తమ ప్రభావాన్ని క్రమంగా కోల్పోతాయి – వాటి స్థానంలో అడ్డంకులు, సమస్యలు ప్రభావం చూపడం మొదలు పెడుతాయి – లక్ష్య సాధనలో సగటు అభ్యర్ధికి సాధారణంగా ఎదురయ్యే అనుభవాలే ఇవి – అయితే వీటికి లొంగి పోకుండా ప్రస్థానం కొనసాగిస్తే లక్ష్యాన్ని చేరగలం – ఇందుకోసం నిద్రాణంగా ఉన్న ఆశయ జ్వాలను రగిలించక తప్పదు – నిర్వేదం అలముకున్నప్పుడు చేస్తున్న పనిని తాత్కాలికంగా పక్కన పెట్టి విజయం సాధిస్తే అనుభవించే థ్రిల్లింగును తలుచుకోవడం, పది మందిలో లభించే గుర్తింపు, సంతృప్తి, అనుభవించబోయే సుఖ సంతోషాలను గుర్తు చేసుకొని ప్రస్తుతం పడుతున్న శ్రమ తాత్కాలికమే – కాని భవిషత్తులో అనుభవించబోయే ఆనందం శాశ్వతం, అనంతం అన్న వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి.

4) వాస్తవిక ద్రుష్టి :- > అనుకున్నది సాధించాలంటే అన్ని సందర్భాలలోనూ వాస్థవిక దృష్టినే ప్రదర్శించాలి – ఎవరి జీవితానికి వారే భాద్యులు కాబట్టి లక్ష్య సాధన ప్రక్రియను కష్టమైన అంశంగా భావించ కూడదు – లక్ష్యము పెద్దదయ్యేకోద్ది – శ్రమ కుడా పెరుగుతుంది. పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలని అనుకోవడం – తీరా శ్రమించలేక వెనుదిరగడం లక్ష్యము పట్ల అభ్యర్ధికి గల అవాస్తావిక దృష్టిని సూచిస్తుంది – లక్ష్య సాధనలో రెండు, మూడు వైపల్యాలు ఎదురైనా తరువాత “ క్రేజ్ ” వదిలి పోయి క్రమంగా వాస్తవిక ద్రుష్టి అలవడుతుంది – మన గ్రామాలు పొటి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉండటం వల్ల నిజమైన కాంపిటిటివ్ నెస్ అనేది గ్రామీణ అభ్యర్ధుల అనుభావములోకి రావడం లేదు – ఫలితంగా లక్ష్య నిర్ధారణ లోను – సాధనలోను వాస్థవిక అంశాలకంటే ఉహా జనిత అంశాలే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి – తీరా సువిశాలా పోటి ప్రపంచములోకి అడుగిడిన తరువాతా కొన్ని కటిన వాస్తవాలతో రాజీపడలేక వేనుదిరగడమో – లక్ష్యముతో రాజిపడటమో చేయాల్సి వస్తుంది – ఈ పరిస్తితిని అధిగమించాలంటే “ లక్ష్యము – సాధన ” అనే అంశం పట్ల వాస్తవికంగా వ్యవహరించాలి.

5) సృజనాత్మకత :- > లక్ష్యము తాలూకు శ్రమను ఎంజాయ్ చేయాలన్న అదే రంగములో ఉన్న ఇతర అభ్యర్ధుల్ని అధిగమించి మన ప్రతేకతను నిరుపించుకోవాలన్న సృజనాత్మకతకు పదును పెట్టక తప్పదు – సృజనాత్మకత బాగా ఉంటే తక్కువ సమయములో – అతితక్కువ శ్రమతో గుర్తింపు పొందవచ్చును – వినూత్నంగా ఆలోచించడం – విలక్షణంగా పనిచేయడం – అంతవరకున్న పద్దతులని కాదని – అంతకటే మెరుగైన పద్ధతుల్ని అనుసరించడం – ఇవన్ని సృజనాత్మకత పరిధిలోకి వస్తాయి – > సృజనాత్మకత పెరగాలంటే లక్ష్యము స్పందింప చేసేదిగా ఉండాలి – లేకుంటే ప్రయత్నం అంతా యాంత్రికంగా మారిపోయి అంతకుమించి – ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది – సృజనాత్మకత అనేది రెండు విధాలుగా ఉండవచ్చు – సహజంగా మన ఆలోచనలోనే కొన్ని కోత్హ ఐడియాలు మొదలవచ్చు – > వాటికి వాస్తవ రూపము ఇస్తే సూపర్ సక్సెస్ కావచ్చు – పోటి పరీక్షల రంగమునుండి – వాణిజ్య రంగము వరకు అన్ని రంగాలను “ creativity ” అన్న ఒక్క అంశమే ఇప్పుడు విశేషంగా ప్రభావితం చేస్తుంది – కేవలం శ్రమను నమ్మిన వాల్లు కోటీశ్వరులు కావడానికి దశాబ్దాలు పడుతుంటే – సృజనాత్మకతను నమ్మిన వాల్లు కేవలం కొద్ది నెలల్లో అంతకుమించి విజయాలు సాధిస్తున్నారు – పోటి పెరిగే కొద్ది సృజనాత్మకత ప్రాముఖ్యము వృద్ది చెందుతూనే ఉంటుని – కాబట్టి దీనిని చిన్న చూపు చూడడం విజయాన్ని కాలదన్నుకోవడమే అవుతుంది.
> అనుకున్న లక్ష్యాన్ని అనుకునట్లుగా సాధించాలంటే పైన తెల్పిన పంచ లక్షణాలను అలవరచు కోవాలి – ఏ రంగంలో ఉన్నవారైనా సక్సెస్ సాధించడానికి ఉపకరించే తారక మంత్రాలివి – వీటిని జాగ్రత్తగా అనుసరిస్తే ఆలోచన నాసరళిలో , కృషిలో తద్వారా జీవితంలో ఏకంగా విప్లవమే వస్తుంది.
పై విషయాలన్నీ మీ అందరికి తెలుసును – ఏ మైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/23/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ మెదడు ” ౩ వ భాగము

1. 2 వ భాగము తరువాయి > అసలు మనిషికి మతి మరుపు ఎందుకు కలుగుతుంది – ? కొన్ని విషయాలలో ఏకాగ్రతా ఎందుకు కుదరదు ? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే న్యూరాన్స్ గురించి మరి కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది – > ఒక మనిషికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం! అతడికి టెండూల్కర్ ఎన్ని సెంచరీలు కొట్టాడు – గంగూలి ఎలా ఫెయిలయ్యాడో – మొదలైన విషయాలన్నీ గుర్తుంటాయి – అలాగే సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి టైటానిక్ సినిమాలో హీరో , హీరోయిన్లు ఎలా విడిపోయారన్నది బాగా గుర్తుంటుంది – ఇలా ఎందుకు జరుగుతుంది ?

2. ఒక స్టూడెంట్ , న్యుటన్ మూడవ చలన సూత్రం చదువుతున్నాడనుకుందాం – అప్పుడు అతని కంటి ద్వారా ప్రవేశించిన electromagnetic pathway మెదడు దగ్గరికి చేరుకొని, ఒక న్యూరాను దగ్గర స్థిరపడటానికి ప్రయత్నిస్తుంది – కాని ఆ న్యూరాను అప్పటికే టైటానిక్ సినిమా తాలూకు విషయాల్ని గుర్తు పెట్టుకొని వుండటం వల్ల … “సారీ – నేను బిజి” అంటుంది – అప్పుడా electromagnetic pathway ప్రక్కనున్న మరో న్యూరాను దగ్గరికి వెళ్లి “నేనిక్కడ స్థిర పడవచ్చునా” ? అని అడుగుతుంది – ఆ న్యూరాను వేలంటైన్స్ డే గుర్తుంచుకోవటానికి ప్రాముఖ్యతనిస్తుంది తప్ప-, న్యూటన్ సూత్రానికి ఇవ్వదు అనుకుందాం – అప్పుడా pathway మూడో న్యూరాన్ ని ఆశ్రయించటానికి వెళ్తుంది – ఈ విధంగా రెండు మూడు న్యూరాన్ల దగ్గరికి వెల్లిన తరువాత ఆ మెరుపు (pathway) క్రమంగా క్షీణించి పోతుంది – > అంటే ఎంత సేపు చదివిన ఏ ఒక్క “న్యూరాను” కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవడానికి సిద్దంగా లేదన్న మాట – ఖాళీగా ఉండటానికి ఇష్ట పడుతున్నాయి తప్ప – అటువంటి (ఇష్టం లేని)విషయాల్ని గుర్తు పెట్టుకోవడానికి న్యూరాన్లు ఉత్సాహం చూపించటం లేదన్న మాట – ఏకాగ్రత లేకపోవటం అంటే అదే – అందుకే మన పెద్దలు “మనస్సు పెట్టి చదవరా” అని అంటూ ఉంటారు – అలా మనస్సు పెట్టకుండా చదివినప్పుడు, ప్రతి న్యూరాను పనిచేయటానికి నిరాకరిస్తుంది – “అమ్మో – కష్టం” అని మారం చేస్తుంది – ఇక్కడే ఒక విషయం గుర్తు పెట్టు కోవాలి – ఏదైనా ఇష్టముతో నేర్చుకోవాలన్న తలంపుతో, పట్టుదలతో శ్రద్ధ పెడితే ఏ విషయ మైన న్యూరాన్లు గుర్తు పెట్టుకోగలవు – ఈ ప్రపంచంలో కష్టం అయిన పని అంటూ ఏది లేదు – మనకి అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుందంతే ! అందువల్ల న్యూరాన్సులొ సేవ్ చేయక పోవడం వల్ల జ్ఞాపకం ఉండదు – ఇది ఎక్కడ తప్పిందో ఆలోచించండి

3. సేరేటోనిన్ :- > మనిషి మెదడు చురుకుతనాన్ని కోల్పోవటానికి, జ్ఞాపక శక్తికి తక్కువ అవటానికి మరోకారణం “సేరేటోనిస్” – ఈ సేరేటోనిస్ అనేది మెదడులోని న్యూరాన్సుని చరుగ్గా ఉంచుతుంది – గంజాయి, తాగుడు మొదలైనవి ఈ సేరేటోనిన్ కి హాని చేస్తాయి – అందుకే పూర్తిగా తాగిన వాడు తన పేరు, తన ఇంటికి దారి కూడా మరిచిపోతూ ఉంటాడు – తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు. > విద్యార్ధుల్లో తెలివి తగ్గిపోవడానికి కూడా ఈ సేరేటోనిన్ లోపం కారణం – విద్యార్ధుల్లో సేరేటోనిన్ చురుకు తనాన్ని కోల్పోవటానికి ఇవి కారణాలు :
1) ఆల్కాహాల్ సేరేటోనిన్ కి ప్రధమ శత్రువు – అయితే విద్యార్ధి దశలో ఈ అలవాటు వుండదు కాబట్టి అంతగా సమస్య లేదు.
2) టెన్షన్, కోపం, ఎంగ్జయిటి – స్ట్రెస్ మొదలైనవి ఆల్కాహాల్ కన్నా ఎక్కువగా సేరేటోనిన్ ని పాడు చేస్తాయి – పరీక్షల ముందు వచ్చే టెన్షన్, మెదడు చురుకుదనాన్ని జ్ఞాపక శక్తిని ౩౦ శాతం తగ్గిస్తుంది – న్యూరాన్లు తమ ప్రభావాన్ని కోల్పోతాయి – మీరు గమనించారా ? కోపం వచ్చిన వ్యక్తి చేతులో వస్తువులు విసిరేస్తాడు – భయపడి నప్పుడు చేతి వేళ్ళు వనుకుతాయి – విషాదంలో కళ్ళు ఎర్ర బడుతాయి – టెన్షన్ లో వెంట్రుకలు నిక్క బోడుస్తాయి – ఇవన్నీ సేరేటోనిన్ ప్రభావమే – ఆ వత్తిడిని తగ్గించ టానికి శరీరం వెంటనే ఇన్సులిన్ – గ్లూకాగాన్ – అడ్రీనలిన్ లాటి ఆమ్లాన్ని – హార్మోన్లని – ఎన్జీమ్స్ నీ తయారు చేసి, వేగంగా మెదడు దగ్గరికి పంపుతుంది – అలాగ్గానీ పంపక పోతే భయంతో శరీరం ఇంకా వనుకుతూనే వుంటుంది – మామూలు మనిషి అవడు – కోపంతో చేతిలో వస్తువులు విసిరేస్తూనే వుంటాడు – దుఃఖంతో గంటల తరబడి ఏడుస్తూనే ఉంటాడు – అతడిని మామూలు మనిషిని చేయటానికి ప్రకృతి ఇచ్చిన వరం అది – అయితే ఈ విధంగా ఈ చర్య వల్ల తాత్కాలిక లాభం మాత్రమే జరుగుతుంది ! కానీ “శాశ్వత” నష్టం జరుగుతుంది !! చురుకుదనము, తెలివి తగ్గుతాయి – పేద్ద వయస్సు వచ్చాక బి.పి, షుగర్, అంగ్జైటి న్యూరోసిస్, కిడ్నీ సమస్యలకి ఇది దారి తీస్తుంది – అందుకే ప్రతి విద్యార్ధి కానీ ప్రతి వ్యక్తి కానీ తన ఎమోషన్స్ ని కంట్రోల్ లో వుంచుకోవాలి – దాన్నే EMOTIONAL INTELLIGENCE అంటారు – దీని గురించి తరువాత చదువుదాం.
3) కుటుంబం సభ్యుల మధ్య సరియిన సంభందాలు లేకపోయినా – ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ వల్ల – ప్రేమ చింతన వల్ల సేరేటోనిన్ ప్రభావం తగ్గుతుంది – సెక్స్ ఆలోచనలు, ఆర్ధిక పరమైన ఇబ్బందుల వల్ల వచ్చే ఆలోచనలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, సేరేటోనిన్ ని క్షీణపరుస్తాయి.
4) చిన్న పిల్లలు తమ కోరిక నేరవేరేల చేసుకోవటం కోసం బాల్యం నుంచి ఏడుపుని ఆయుధంగా ఉపయోగిస్తారు – తల్లులు దాన్ని ఖండించరు – పెద్దయ్యాకా పోతుందిలే అని అనుకుంటారు – కాని కొందరు పిల్లల్లో అది శాశ్వతంగా కొనసాగుతుంది – వయసొచ్చాక కూడా అలుగుతూ, ఏడుస్తూ ఉంటారు – ఎడ్పుతో సహచర్యం చేస్తారు – టి.వి.సీరియల్ చూస్తూ కూడా ఏడుస్తారు – పైగా దానికి “సెంటిమెంట్” అని పేరు పెట్టు కుంటారు ( సెంటిమెంట్ అంటే దయా గుణం – ఏడవటం కాదు.) విద్యార్ధుల్లో ఏడ్చే గుణం పోగొట్టు కోవటం చాలా ముఖ్యం – తల్లి దండ్రులు కూడా ఇక్కడ మానసిక శాస్త్ర వేత్తలుగా చిన్నప్పటినుంచే వ్యవహరించాలి – చిన్న పిల్లల్లో ఈ క్రింది గుణాలు కనబడితే వెంటనే కఠీనంగా సరి దిద్దాలి. > a) చిన్న విషయాలకే అలగటం. b) కోపం వచ్చినప్పుడు కాళ్ళు కొట్టుకోవటం. c) కోపంలో విపరీత ప్రవర్తన. d) దుఃఖంలో గట్టిగా, అవతలి వారిని ఆకర్షించేలా ఏడుపు. e) ఎక్కువ ఓదార్పు ఆశించటం. f) బాల్యం లోనే కాంప్లెక్సులు, ఈర్ష్య అసూయలు. g) ఏక్కువ నిశబ్దంగా, ఒంటరిగా ఉండటం.
5) ఆలోచన విధానానికి, సేరేటోనిన్ కి దగ్గిర సంబందంవుంది – మాటిమాటికి “ నాకు తెలివిలేదు – ఏకాగ్రత లేదు, జ్ఞ్యాపకశక్తి లేదు ” అనుకుంటూ వుంటే ఆ విద్యార్ధి మెదడు నిజంగానే చురుకుదనం కోల్పోతుంది.
6) టి.వి., ఆటలు, ఫాషన్లు, బ్రేక్ డాన్సులపై మితిమీరిన వుత్సాహం,చదువు మీద కుతూహలాన్ని తగ్గిస్తాయి – చదువు మీద కుతుహాలాన్ని తగ్గిస్తాయి – చదువు హార్లిక్స్ లాంటిదైతే, అవి స్వీటు, కాఫీ లాంటివి – రెండో దానికి ఆకర్షణ శక్తి బలంగా వుండటం సహజమే కదా ! > ఇప్పటి వరకు ఈ పుస్తకంలో చాలాసార్లు “ చదువు మీద ఉత్సాహం పెంచుకోవాలి ! మిగితా విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి ” అని చెప్పటం జరిగింది – ఇది ఎలా సాధ్యం అని చాలా మంది విద్యార్ధులకి సదేహం వచ్చి ఉంటుంది – నిజమే – అది అంతా సులభం కాదు – దీనికి ఒకే ఒక మార్గం ఉంది – అదే “ ట్యూనింగ్ ” – > ట్యూనింగ్ :- > మనిషి ఆలోచనల్ని – ప్రవర్తనని – మూడ్స్ ని నిర్ణ ఇంచేది మెదడు – > అయితే దాన్ని మనము ఏ విధంగా ట్యూనింగ్ చేసుకుంటే అది ఆవిధంగా ప్రవర్తిస్తుంది – ఉదాహరణకు ఎవరైనా చనిపోయినప్పుడు మొగవాల్లు గంబీరంగా ఉంటారు – ఆడవాళ్ళు బిగ్గరగా ఏడుస్తారు – దీనికి కారణం కేవలం ట్యూనింగే – తాము గుండెలు బాదుకుంటూ ఏడిస్తే బాగోదు అని మొగవాడు తన మెదడును ట్యూనింగ్ చేసుకున్నాడన్నమాట – > “ ట్యూనింగ్ ” అన్నది మనసి ప్రవర్తన మీద – ఆలోచన మీద – మనస్తత్వం మీద – చాలా ప్రభావము చూపిస్తుంది – ముఖ్యంగా విద్యార్ధులు తమకు కావసిన విధంగా మెదడుని చిన్నప్పుడే ట్యూన్ చేసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి – ఇవి మూడు రకములు.
7) 1) శాశ్వత ట్యూనింగ్ :- మన ధర్మాలు – నైతిక విలువలు – సంస్కృతి – సాంఘిక నియమాలు – నమ్మకాలు మన మెదడుని శాశ్వతంగా ట్యూన్ చేస్తాయి – ఉదాహరణకి – మన హిందూ ధర్మము ప్రకారము – పిన్ని కూతురు చెల్లెలు అన్న అభిప్రాయమే చిన్నప్పటి నుంచి కలుగుతుంది – అదేవిధంగా మన నైతిక విలువలు విదేశియుల్ల కాకుండా వృద్దులైన తల్లి తండ్రుల్ని మనతోనే ఉంచుకునేలా చేస్తాయి – చేతులెత్తి నమస్కరించటం మనసంస్కృతి – ఆడవాళ్ళు తనకన్నా వయసులో పెద్ద వ్యక్తిని వివాహము చేసుకోవటం మన సాంఘిక నియమము – పిల్లి ఎదురొస్తే ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోవటం కొందరి నమ్మకం – > ఇందులో కొన్ని మంచివి – కొన్ని అర్ధం లేనివి – ట్యూన్ కాబడిన మెదడు logic (తర్కాన్ని) ఆలోచించదు – “ గుడ్డెద్దు చేలో బడటం ” అన్న సామెత అలావచ్చిందే – అర్ధం లేని వాటిని తార్కికంగా ఆలోచించి ఆ అలవాట్ల నుంచి బయటపడాలి – > “ నాకీ జీవితంలో లెక్కలు రావు ” అనుకోవటం శాశ్యత ట్యూనింగ్ – ఎందుకు రావో ఆలోచించడం తర్కం (logic) అలా ఆలోచించకపోతే అదీ ఇక ఒక అలవాటుగా మారుతుంది – అదే శాశ్యత ట్యూనింగ్ అవుతుంది.
2) టెంపరరీ ట్యూనింగ్ :- > ఒక టెర్రరిస్ట్ ని తీసుకోండి – బ్రెయిన్ వాష్ చేస్తే అతడు, తాను నమ్మిన దాని కోసం ఆ మూడు లో ప్రాణాలకు కూడా తెగిస్తాడు – దీని ప్రభావము టెంపరరీ గ ఉండవచ్చు – సెల్ఫ్ ఇప్నాసిస్ వల్ల ఇలా జరుగుతుంది – పరీక్ష పోయినట్టు తెలియగానే ఆత్మ హత్య కూడా ఇలాంటి తాత్కాలిక ట్యూనింగే – ఒక గంట ఆగ గలిగితే, దాని ప్రభావము ఉండదు – పరీక్షల ముందు క్రికెట్ మ్యాచ్ టివిలో చూడకుండా ఉండటానికి – ఒంట్లో బాగా లేనప్పుడు చిరు తిండ్లు మానేయ్యగలగటానికి ఇటువంటి టెంపరరీ ట్యూనింగు అవసరము.
౩) స్వీయ ట్యూనింగ్ :- ఒక గెలిచే వ్యక్తికి – ఓడే వ్యక్తికి మధ్య తేడా ఈ మూడవదే ! – > గెలిచే వ్యక్తి తన మెదడుని లాజికల్ గా ట్యూన్ చేసుకుంటాడు – అతడు తన మనస్సుతో కాకుండా – మెదడుతో కంట్రోల్ చేయబడుతాడు – అతడు కేవలం గమ్యాన్నే (డాక్టర్ – ఇంజనీర్ అవటం) కాకుండా – దారిని కూడా (ఏం సెట్ పరీక్షలకి చదవటం) ప్రేమిస్తాడు – తనకేం కావాలో అతడికి కరెక్ట్ గా తెలుసు – > తన అయిదు జ్ఞానేంద్రియాల్ని కంట్రోల్ లో పెట్టుకుంటాడు – స్వీయ ట్యూనింగ్ గురించి ఒక్క మంచి ఉదాహరణ చెప్పాలంటే “ఆరోగ్య రిత్యా నీకు కాకర కాయ కూర మంచిది” అని డాక్టరు చెప్పగానే దాన్ని మైసూర్పాక్ అంత ఇష్టంగా తినగలగటం – ఏదైనా అసాధ్యము అని మొదట్లో అనిపించ వచ్చు – కాని కాస్త ప్రాక్టీస్ మీద అలవాటైపోతుంది – > దేనినైనా జ్ఞానేంద్రియముల ద్వారా అలవాటు చేసుకోవచ్చు – దీని బట్టి అర్ధమైనది ఏమిటి ? ఎపనులైన, ఏ వ్యసనాలైన అన్ని కూడా ఒకే ఆనందం ఇస్తాయి – మంచి వ్యసనాలు మనస్సుకి శరీరానికిఆనందంతోపాటు ఆరోగ్యం కుడా ఇస్తాయి – అది తెలుసుకో గలగటమే సెల్ఫ్ ట్యూనింగ్ – > కొంత మంది వ్యక్తులు సమస్య రాగానే ఎందుకు కృశించి పోతారు ? కొంత మంది చిన్న చిన్న విషయాలకే ఎందుకు బయపడుతారు ? కొంతమందికి టెన్షన్ వల్ల అరచేతుల్లో ఎందుకు చెమట్లు పడుతాయి ? – వారికి తమ మెదడు మీద కంట్రోల్ లేకపోవడం వల్ల – ఈ మెదడు అనేది చాలా గమ్మతయినది – దాని శక్తి మనకు తెలువదు – అన్ని అవయవాల మీద అధికారం చలాయిస్తు ఉంటుంది – ఒక గ్లాసులో నీరు నిండా పోషి చేతో పట్టు కొండి – ఇంత తేలిక అనిపిస్తుంది – ఆరగంట తరువాత అది క్రమంగా బరువెక్కుతుంది – గంట సేపు అలాగే పట్టుకొని నిలబడితే – భరించ లేనంత బరువు అనిపిస్తుంది – ఎందుకు అలా జరుగుతుంది – ? – > గ్లాసు నీటి బరువు ఎప్పుడూ ఒక్కటే కదా ! మెదడుని ఆ విధంగా ట్యూన్ చేసుకోబట్టి – గ్లాసు నీటి విషయములో ఆ తాదాత్మ్యతలేదు – అందుకే చిరాకు కలిగింది – మెదడుని కంట్రోలు ల్లో పెట్టుకుంటే ఇలాంటి చిరాకు కలగదు. గమనించండి.

———————- సశేషం ———————

పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలపగలరని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/26/2016

🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺

“ప్రాణ” 2 వ భాగము

ప్రాణ నాకు అన్నం పెట్టండి నన్ను గాలికి వదిలి వేయకండి – అన్నం పెట్టడం వల్ల నాతో పాటు మిమ్ముల కంటికి రెప్పల కాపాడుకుంటాను అని ఒకటవ భాగములో రిక్వెస్ట్ చేసింది అని మీకు తెలుసు – ఇప్పుడు ప్రాణుడికి ఆహారము ఎలా పెడుతున్నారో – ? ఎలా పెట్టాలో ? ఏమి అన్నం పెట్టాలో – ? అది ఎక్కడ దొరుకు తుందో ? అనే విషయాలను తెలుసుకుందాం – ఈ శరీరంలో ప్రాణ అంటే మనకు గుర్తుకు వచ్చేది “ శ్వాస ” ఈ శ్వాస ఉన్నత సేపు ప్రాణము ఉందని – శ్వాస ఆగినప్పుడు ప్రాణం పోయిందని అంటారు – అంటే ఒక విధముగా చెప్పాలంటే ప్రాణ మంటే శ్వాస అనునది మనకు విదిత మవుతుంది – దీని బట్టి శ్వాసలు ఎలా ఉండాలి – ప్రాణుడి కావలసిన ఆహారము ఎలా ఉత్పత్తి చేయాలి అనునది తెలుసుకోవాలి – రెండు శ్వాసల మధ్యనున్న సమయము జీవిత కాలాన్ని నిర్దేశిస్తుందని మనకు శాస్త్రము చెపుతుంది – అలాంటి ప్రాణమైన – ప్రాణ వాయువును ఎవరైతే సక్రమంగా తీసుకుంటారో వారు దీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడంతో పాటు – ప్రాణుడికి ఉచ్చ్వాస నిశ్వాసల (గతా గతుల ద్వార) ఆహారాన్ని తయారు చేయడము వల్ల – ఆశనోత్పత్తి (ఆహారము) జరిగి ప్రాణ స్వీకారము చేసి బలిస్టుడై తను – తనతో పాటు మనస్సును కలుపుకొని మూల స్థానానికి చేరుకొనును – > ఎవరైతే సరియిన ఆహారాన్ని తగుపాలులో అందిచక పోతే – వారు నిండా నూరేళ్ళ జీవితమును సగము కాలముతో సరిపుచ్చుకుంటారు – మన విలువైన ప్రాణమునకు – ప్రాణ వాయువును సరిగా అందించనిచో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటాం.

1) మన శరీరానికి, ఆహారము, నీరు తినకుండా త్రాగకుండా, కొన్ని రోజులు బ్రతక గలం కాని గాలి పీల్చకుండా మనము బ్రతకలేము – > ప్రకృతిలో గాలి ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందొ – ప్రకృతిలో భాగమైన మనలో కూడా ఆ గాలి ప్రధాన అవసరంగా మారినది – ప్రకృతిలోని ప్రతి జీవికి – ప్రకృతి లోని అయిదు తత్వాలను ఉపయోగించుకునే లాగా శరీర నిర్మాణము ఏర్పడుతుంది – అలాగే మనలో కూడా ప్రాణానికి ప్రధాన మైనది గాలి కాబట్టి మన శరీరంలో గాలి ప్రవేశించడం అనేది మన ప్రమేయం లేకుండా లోనికి వెళ్ళే లాగా అధ్బుతంగా శరీరం నిర్మించ బడింది – > మనిషి పుట్టాక కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రకృతినే సర్వ స్వంగా చేసుకొని – ప్రకృతి పైన పూర్తిగా ఆధార పడి బ్రతికాడు – నదులలో నీటిని త్రాగుతూ – కాలుష్యం లేని గాలిని గుండెల నిండా పీల్చుకుంటూ – పళ్ళు, కాయలు కడుపార తింటూ మనస్సులో ఏ సమస్య లేకుండా నిచ్చింతగా నిద్ర పోతు ఆరోగ్యంగా – బలంగా ఉండేవాడు – క్రమంగా మనుష్య సంతతి పెరిగే కొద్ది శరీర అవసరాల కోసం పోటీ తత్వము పెరగడముతో – ప్రకృతిలో దొరికేదానికి సంతృప్తి పడక కొత్త దారులు వెతకడం మొదలు పెట్టాడు – > వండడం నేర్చుకున్నాడు – పంటలు పండించడం నేర్చుకున్నాడు – సమాజం ఏర్పడిన దగ్గరి నుండి సమస్యలు ఎదుర్కోవడం మొదలు పెట్టాడు – ఇలా మనిషి ఎదిగే కొద్ది ప్రకృతికి దూరమవుతూ వచ్చాడు – అయినప్పటికీ వ్యవసాయము పైన ఆధార పడి బ్రతికినంత కాలం శారీరక శ్రమ చేస్తూ – ప్రకృతినే అంటి పెట్టుకుని ఉండబట్టి మంచి ఆహారాన్ని తీసుకుంటూ – ఆరు బయట గాలిని పీలుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉన్నాడు – > పల్లెటూర్ల నుండి పట్టణాలు అభిరుద్ది చెందే కొద్ది ప్రపంచ మంతా కాలుష్యం పెరగడం ప్రారంభం అయ్యింది – జనాభా విపరీతంగా పెరగడంతో క్రమంగా ప్రకృతి వాతావరణమే మారిపోయి ఒక క్రొత్త వికృతి ప్రపంచము ఏర్పడసాగింది – అలా పెరిగిన సమాజములో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం – > కొన్ని వందల సంవత్సరాలుగా ప్రకృతికి నెమ్మదిగా దూరం అవుతూ వచ్చాం – ఇప్పుడు మన కళ్ళకు పచ్చని చెట్లు – ప్రవహించే నీరు – పంట పొలాలు కనబడడం అధ్బుత దృశ్యంగా మారి పోయింది – మనం ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా హడావుడిగా జీవితాలు కొనసాగిస్తున్నాం – ఈ హడావుడి యొక్క ప్రభావము మన శరీరాల పైన పూర్తిగా కనిపిస్తున్నది – టైముకు అన్నము తినము – టైముకి నిద్ర పోము – గాలి తీసుకోనవసరం లేదు కాబట్టి ఎదో బ్రతక డానికి సరిపడగ అది మనలోకి వెళ్తూనే ఉంది – కాని ఆరోగ్యంగా బ్రతక డానికి సరిపడినంత గాలి మన శరీరంలోకి వెల్లడము లేదు.

2) శరీరానికి అతి ముఖ్యమైన ప్రాణ వాయువు చాలినంత అందితేనే శరీరము లోపల పనులన్నీ సక్రమంగా జరుగుతాయి – ప్రాణ వాయువును సరిగా తీసుకోలేక పోవడం వలనే – ఒకప్పుడు 200-300 సంవత్సరాలు బ్రతికిన మనిషి – ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా బ్రతక లేక పోతున్నాడు – మన శరీరానికి గాలి, నీరు, ఆహారము అవసరమని అందరికి తెలుసు – మూడు పూటల తిన్నామా లేదా అని ఆలోచిస్తున్నాం – కాని తిండి కంటే అత్యవసరమైన ప్రాణ వాయువును తగినంత పీల్చుకుంటున్నామా – ? లేదా ? అన్న ప్రశ్న ఎవ్వరికి రాదు – ఎందుకంటే అది మనకు తేరగా అందేది – మన చేతులతో తీసుకోవలసిన అవసరం లేనిది కాబట్టి – మన ఊపిరి తిత్తులు ఎంత గాలిని నింపుకోవడానికి ఆ సృష్టి కర్త తయారు చేసినాడో అంత గాలిని మనము తీసుకోవడము లేదు – > ఊపిరి తిత్తులు గాలిని ప్రతి క్షణం తీసుకుంటూ – వదులుతూ ఉంటేనే శరీరం ఎక్కువ కాలం మన్నుతుంది – ఎందుచేతనంటే మనం పీల్చే ప్రాణ వాయువు – రక్తం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు సరిపడినంత అందితేనే ఆ అవయవాలు సక్రమంగా పని చేయ గలుగుతాయి – > ప్రాణ శక్తి తగ్గితే పనితనం తగ్గుతుంది – మనకు తెలియ కుండానే అనారోగ్యం లోపల తయారవుతుంది – అనారోగ్యం పెరిగినప్పుడు ఆయుర్దాయం – తగ్గుతుంది – > మనము శ్వాసలు అంత దీర్గంగా తీసుకుంటే అంతా ప్రాణ వాయువు లోపలకు వెళ్తుంది – కాని నేటి సమాజములో మనిషి యొక్క శ్వాసల తీరు గమనిస్తే పై పైనే వేగంగా నడుస్తూ ఉంటాయి – శ్వాసల తీరు అలా ఉండడం వల్ల మనము ఊపిరితిత్తులను పూర్తిగా ఉపయోగించు కోవడం లేదు – వేగంగా పై పైన నడిచే శ్వాసలు ఎక్కువ ప్రాణ వాయువును లోపలికి తీసుకొని వెళ్ళలేవు – > తిరుగు ప్రయాణములో శరీరము వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా లోపల ఉండి పోయినప్పుడు దానిని విసర్జించడానికి ఎక్కువ ప్రాణ వాయువు అవసరం కాబట్టి శరీరం ఎక్కువ గాలిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది – > దానితో శ్వాసలు సంఖ్య పెర్గుతుంది – ? శ్వాసల సంఖ్య 16 – 18 కంటే ఎక్కువ ఉందంటే శరీరానికి ప్రాణ వాయువు చాలడం లేదని గుర్తు – > ఇలా ప్రాణ వాయువు చాలనప్పుడు మనము తీసుకునే శ్వాసలు పై పైనే ఉంటాయి – ఇది ఎవరికి వారు గమనించుకుంటే స్పష్టంగా తెలుస్తుంది – > అదే మనం గాలిని నిండా పీల్చు కున్నట్లయితే శ్వాసలు దీర్గంగా, నేమ్మదిగా ఉంటాయి – గాలి పీల్చినప్పుడు – వదిలినపుడు ఛాతి ముందుకు వెనకకు కదలదు – ఇదే సరియైన శ్వాస – శ్వాసలు ఈ విధముగా ఉంటె ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేసినట్లు లెక్క – ఇలాంటి శ్వాసలు మనలో నడిస్తే మనం ఆప్పటి కంటే మూడూ, నాలుగు రెట్లు పని అలుపు – ఆయాసం లేకుండా చేయగలం.

3) సృష్టి లోని అన్ని జీవులు పూర్తిగా ప్రాణ వాయువును పీల్చుకోగాలిగి – హాయిగా, శక్తిగా జీవించ గలుగుతున్నాయి – ఏ జీవికి కూడా పూర్తిగా గాలిని పీల్చుకోవాలని గాని – ఇన్ని సార్లు పీల్చుకుంటే మంచిదని గాని చెప్ప వలసిన పని లేదు – > ఎందు చేత నంటే ఆ జీవులన్ని ప్రకృతి పై బార వేసి – ప్రకృతికి అనుకూలంగా నడుస్తూ ఉంటాయి – కాబట్టి వాటి మంచి, చెడ్డలు ప్రకృతే చూసుకొని కాపాడుతూ ఉంటుంది – > మన విషయానికొస్తే ప్రకృతి సిద్దమైన ఆహారము తినడం లేదు – ప్రకృతి సిద్దంగా తినవలసినన్ని సార్లు – తినవలసిన సమయములో తినడము లేదు – > ఆహారాన్ని సంపాదించుకోవడానికి శారీరక శ్రమ చేయడం లేదు – సరి పడినంతా నీటిని త్రాగడం లేదు – సరియైన ఆలోచనలు చేయడం లేదు – శరీరానికి విరుద్దమైన వ్యసనాలు మొదలైనవి కలిసి శరీరముపై వాటి ప్రభావాన్ని చూపుతున్నాయి – > ప్రకృతి విరుద్ద మైన చెడ్డ ప్రభావాలన్నీ ముందుగా అతి ముఖ్య మైన ప్రాణ వాయువును శరీరము సరిగా గ్రహించ కుండా అడ్డు పడుతూ ఉన్నాయి – వాటి ప్రభావము, ప్రాణ వాయువు లోపము రెండు కలిసి – రెండు – మూడు వందల సంవత్సరాలు శక్తిగా జీవించే అవకాశమున్న మానవ శరీరం నేడు – 55 – 60 సమత్సరాలు కుడా సరిగా జీవించలేక పోవుతున్నది – > అటు ఆయుష్షుని – ఇటు శక్తిని రెడు విదాల నేడు మనం కోల్పోవడానికి కారణం ప్రాణ వాయువు లోపమే – > పూర్వము రోజులలో ఎక్కువ మంది శారీరక శ్రమ చేసేవారు – వారు శ్రమ ద్వారా ఎక్కువ ప్రాణ వాయువును గ్రహించగలిగే వారు – శ్రమ చేయని పండితులు – ఋషులు – మునులు – తపస్సులు మొదలగు వారు – ప్రాణాయామము ద్వారా ఎక్కువ ప్రాణ శక్తిని గ్రహించ గలిగే వారు – ప్రతి ఒక్కరు ప్రాణ వాయువు లోపం రాకుండా జీవించ గలిగే వారు – > పూర్వము రోజులలో 180 – 200 సంవత్సరాలు మనిషి జీవించినా చనిపోయే వరకూ శక్తిగా, ఆరోగ్యంగా జీవించ గలిగాడు – అంటే అది ప్రాణ శక్తి యొక్క ప్రభావము – వారి ఆరోగ్య రహాస్యాలను పరిశీలిస్తే మూడు పూటల ప్రాణా యామము ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా తమ జప తపాదులలో పొందే వారు – ప్రకృతి సిద్దమైన ఆహారాన్ని తీసుకోవడం అనేది ముఖ్యం – > నేటి మానవుడు శారీరక శ్రమ చేయనందు వల్ల – ప్రాణా యామము చేయనందువల్ల మనలో ప్రాణ వాయువు ప్రమాణము ఎలా తగ్గుతుందో – ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం.

4) నేడు మనము ఊపిరితిత్తుల నిండుగా ప్రాణ వాయువును పీల్చుకోలేక పోతున్నాము – ఊపిరితిత్తులలో సగభాగమే మనము ప్రాణ వాయువును నింపుకుంటూ – మిగితా సగభాగమును నిరుప యోగంగా ఉంచుకుంటున్నాము – మనము కావాలని ఈ పని చేయడం లేదు – > మనము చేసే మిగితా లోపాలు వల్ల ఊపిరితిత్తులకు అంత వరకే గాలిని పీల్చుకునేటట్లు చేస్తున్నాయి – అంతకు మించి మన శరీరము దీర్గ శ్వాసలకు సహకరించడం లేదు – ప్రాణ వాయువు పూర్తిగా ఊపిరితిత్తుల చివర భాగము వరకు వెల్ల కుండా అడ్డుపడే కారణాలను ఆలోచిస్తే – > అవి పొట్ట నిండుగా తినడం – తినేటప్పుడు నీరు త్రాగడం – ఎప్పుడూ ఎదో ఒకటి పొట్ట కాలి అవ్వ కుండ తినడం – పొట్ట ఎత్తు పెరగడం – బరువు పెరగడం – ముక్కులో రొంప పట్టడం – ఊపిరితిత్తులలో కపాలు పెరగడం – సిగిరెట్లు త్రాగడం – రక్తం తక్కువగా ఉండడం – శ్వాసకు సహకరించే కండరాలు బలహీన మవడం – కాలుష్యమైన గాలిని పీల్చుకోవడం – మానసిక ఆందోళనలు ఉండడం – ఎక్కువగా మాట్లాడడం – ఎక్కువగా కూర్చొనే ఉండటం – శరీరములో ఎప్పుడూ ఎదో ఒక అనారోగ్యం ఉండడం మొదలగునవి కారణాలుగా ఉంటున్నాయి – ఈ కారణాలన్నీ ఊపిరితిత్తులను పూర్తిగా సాగ నివ్వడం లేదు – పూర్తిగా సాగని ఊపిరిత్తితులు కొంత మంచి గాలీ మాత్రమె నింపుకోగాలుగుతాయి – అలాగే కొంత చెడ్డ గాలిని మాత్రమే వదులుతాయి – > మనం పీల్చుకొనే కొద్ది గాలి మన శరీర అవసరాలకు 5 – 6 గంటలు తేలిక పాటి పనులు చేసుకోవడానికి సరిపోతున్నదే తప్ప – శరీరాన్ని పూర్తిగా శక్తిగా – ఆరోగ్య వంతంగా ఉంచడానికి చాలడం లేదు – > అందుచేతనే కొద్ది పనికే ఎక్కువ అలసట – నీరసము – శరీరము సహకరించక పోవడం మొదలగునవి రావడానికి ప్రాణ వాయువు యొక్క లోపము చాలా ఉంది – మనము రెండు సంవత్సరములు కొద్ది ఆహారము తినడానికి – అలవాటు పడితే మన పొట్ట కుడా దానికే అలవాటుపడి – ఒక్కోసారి ఎప్పుడన్న ఎక్కు తిన్నామన్న అలవాటులేక తినలేము – కొద్దిగా తినేసరికి పొట్ట నిండిపోయినట్లుగా ఉంటుంది అలాగే మన ఊపితిత్తులు కూడా కొద్ది ప్రాణ వాయువును పీల్చు కోవడానికే అలవాటు పడి ఉన్నందునా – ఇప్పుడు ఎక్కువా పీల్చుకుందామంటే వెంటనే అవి సహకరించవు – క్రమేపి సాధనా చేయగా దారిలోకి వస్తాయి – > మనం మళ్ళి దీర్గ శ్వాసలు తీసుకోవాలన్న – ఊపిరి తిత్తుల నిండుగా ప్రాణ వాయువును నింపుకొవాలన్న – రెక్కలు బాగా వెనక్కి ముందుకూ సాగే శారీరక శ్రమ చేయాలి – > భస్తీలలో ఉన్న వారికి ఇలాంటి శ్రమ చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి మిగితా వ్యాయామాలు మనకు చేసే మేలు కంటే – దీర్గ ప్రాణాయామం చేసే మేలు ఎక్కువగా ఉంటుంది – > కదలకుండా కూర్చొని మనకు జరిగిన నస్టానంతటిని పూర్తిగా నివారించుకొని శ్వాసలు – నిమిషానికి 15 కంటే లోపుగా 7 వరకు ఉండేటట్లు తయారు కావచ్చు – మనం మాములుగా శ్వాసలు తీసుకునేటప్పుడు – ఎంత ప్రాణ వాయువును లోపలికి తీసుకుంటామో – శ్వాసలు దీర్గంగా తీసుకునప్పుడు ఎంత ప్రాణ వాయువును తీసుకోగాలుగుతామో – దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో – వివరంగా మున్ముందు తెలుసుకుందాం.

——- సశేషం ——-

పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా తప్పులు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/28/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ కర్మ “ ప్రారబ్ధం 2వ భాగము

మానవుడు మాయా ప్రభావానికి లోనై గుణములలో ఇరుకొన్ని అజ్ఞానందా కారములో – మానవ జీవితములో చేయవలసిన నిష్కామ కర్మలు చేయకుండా – మాయా మోహములో పడి స్వార్ధము కోసం – తన తరతరాల సంపాదన కోసం – చేయరానటువంటి కర్మలు చేస్తూ – ఆ కర్మ ఫలాలను ఈ జన్మలో తీర్చుకోవడం కాకుండా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ – ఉన్న కర్మలు కడుక్కోవడం పూర్తి చేసుకోకుండా – మళ్ళి కొత్త కర్మలు సృష్టించుకొని – పాత కర్మలకు +(add) చేసుకొని అనేక జన్మలకు కారణ భూతుడవుతున్నాడు – కర్మలలో – కర్మ ఫలా పరంపరలో భౌతిక జీవితము చిక్కుకొని ఉంటుంది – ఇది కర్మల – కర్మ ఫలాల సుదీర్గ పరంపరల ప్రవాహము – ? ఒక శిశువు జన్మించగానే అతడి నిర్దిష్ట శరీరము – ఒక నిర్దిష్ట కర్మ ఫల కార్య కలాపాలకు ప్రారంభ సూచన అని – ఒక వృద్ధుడు మరణించ గానే ఈ జన్మ నిర్దిష్ట కర్మ ఫల – కార్య కలాపాలు ముగిసినవని తెలుసుకోవాలి.

1)జీవుడు మొట్ట మొదట ఆధ్యాత్మికత వ్యక్తే – కాని ఆ ఆధ్యాత్మికత వ్యక్తి భౌతిక ప్రపంచములో సుఖాలు అనుభావించాలనే కోరిక కలగటము వల్ల – భౌతిక ప్రపంచానికి దిగి వస్తాడు – జీవుడు మొదట మానవ శరీరాన్ని గ్రహిస్తాడని – తరువాత తన నీచ కర్మల వల్ల – నీచ జన్మ పొందుతాడని – అంటే పశు, పక్షి, వృక్ష, జల, జంతు రూపాలు ధరిస్తాడని తెలుసుకోవచ్చు – కర్మ ఫలాలు వల్ల దు:ఖాలు – హింసలు – బాదలు బడుతాడు – జంతు జన్మలలో కర్మలు ప్రకృతి ప్రేరణలతో పర తంత్రంగా చేస్తాయి – కారణం ఈ జన్మలలో శరీరము మనస్సు ఉన్నాయి గాని బుద్ది మాత్రం లేదు – కనుక ఈ జన్మలలో కేవలం కర్మ ఫలాలు – అనుభవించుటయే కానీ పరమాత్మను అందుకునే జ్ఞానము – పొందే అవకాశం లేదు – కర్మ ఫలాలు క్షీణించి మల్లి పరిణామ క్రమములో జీవుడు మల్లి మానవ శరీరం ధరిస్తాడు – > అప్పుడు జనన మరణ పరం పర నుంచి విముక్తి పొందడానికి మరొక అవకాశము లభిస్తుంది – > ఈ మానవ దేహములో ఉండి కూడా తన స్థితిని గ్రహించడానికి కలిగిన ఈ అవకాశాన్ని మల్లి కొల్ల్పోయినట్లైతే – వివిధ జాతుల జనన మరణ చక్రములో మల్లి బంది అవుతాడు – > ఈ పునర్జన్మ విజ్ఞానము ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞ్యులకు ఏ మాత్రము తెలవదు – విజ్ఞాన శాస్త్రజ్ఞులన బడేవారు ఈ విషయాల్ని పట్టించుకోరు – ఎందుకంటే, వాల్లు ఈ సూక్ష్మ విషయాలను గురించి – జీవిత సమస్యల్ని గురించి ఆలోచిస్తే తమ – తమ భవిషత్తు కటిక చీకటిగా ఉంటుందని అనుకుంటారు – పునర్జన్మను గురించిన అజ్ఞానము ప్రమాద కరమే.

2) ఆధునిక నాగరికత కుటుంబ సౌకర్యాలపైన – ఆ సౌకర్యాల ఉన్నత ప్రమాణాల పైన ఆధారపడి ఉంది – అందువల్ల ప్రతివారు డబ్బు సంపాదించిన అనంతరం కానీ – ఉద్యోగ విరమణ తరువాత కానీ – ఆకర్షణీయమైన ఆధునిక సామాగ్రితో అలంకరించిన సుందర భవనంలో – ఆరోగ్యంగా – అందంగా ఉండే భార్య బిడ్డలతో సుఖమయమైన జీవితమూ గడపాలని కోరుకుంటారు – అంత సౌఖ్య ప్రదమైన ఆ ఇంటిని విడిచి పెట్టి పోవాలని ఎవరు అనుకోరు – ఉన్నత ప్రభుత్వ అధికారులు – మంత్రులు తమ ఉన్నత పదవుల్ని మరణించే వరకు అంటి పెట్టుకొని ఉంటారు – తమ ఇల్లల్లో ఉన్న సౌఖ్యాల్ని కలలో కూడా ఒదులుకోరు – ఒదులుకో తలచరు – భౌతిక వాదులైన మానవులు అటువంటి భ్రమలతో – అంత కంటే సుఖ ప్రదమైన జీవితం కోసం ఎన్నో పథకాలని సిద్దము చేసుకుంటారు – కానీ హటాత్తుగా, నిర్దాక్షిణ్యంగా క్రూర మృత్యువు వస్తుంది – > అంత గొప్పగా ప్రణాళిక సిద్దము చేసుకున్నా ఆ వ్యక్తిని అతడి వాంచలకు విరుద్దంగా – బలవంతంగా ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరించే టట్లు చేస్తుంది – అటువంటి ప్రణాళిక రచయితా తన కర్మ పలాను సారంగా బలవంతంగా 84 లక్షల జీవరాసులలో ఎదో ఒక శరీరాన్ని ధరింప వలసి ఉంటుంది – > కుటుంబ సౌఖ్యాలకు ఎక్కువగా అంటి పెట్టుకొని ఉండే వ్యక్తులు – సాధారణంగా తరువాత జన్మలో వారి జీవిత కాలం అంతా చేసిన పాప కర్మలను బట్టి నీచ జన్మలను పొందుతారు – ఆ విధంగా మానవ జీవితములోని శక్తి వృధా అయిపోతుంది – మానవ శరీరము వ్యర్ధము కాకుండా – అవాస్తవిక విషయాల పట్ల వ్యామోహం కలగా కుండా ఉండటానికి మును ముందుగానే గ్రహించాలి – మృత్యువు రాకముందే హెచ్చరిక జీవితముతో ఏ దశలోనైన మృత్యువు కాటేస్తుందని గమనములో ఉండాలి.

3) మనము మరణించగానే పృద్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచ భూతాలతో ఏర్పడినా ఈ భౌతిక శరీరము శిధిలమై ఆయా స్థూలా పదార్ధాలు మూల భూతములలో చేరిపోతాయి – “ నీవు మట్టివి – మరల మట్టిలో చేరిపోతావు ” – మనము ఎంతో శ్రద్దగా సుగంధ ద్రవ్యాల తోను – సబ్బుల తోను – శుబ్రము చేసే ఈ అందమైన శరీరము చివరికి మట్టి గానో – మలం గానో – దూలి గానో – బూడిద గానో మారుతుంది – > తరువాత మరొక శరీరాన్ని ధరిస్తుంది – పూర్వ జన్మ కర్మ ఫలితంగా ప్రస్తుత శరీరాన్ని ధరించిన జీవుడు – ప్రస్తుత కాలంలోనే పూర్వ జన్మల కర్మ ఫలాన్ని సమాప్తి చేయవచ్చు – > కానీ అంత మాత్రం చేత భౌతిక దేహ బంధాల నుంచి విముక్తు డవుతాడని కాడు – జీవుడు ఒక రకమైన శరీరాన్ని ధరించి – ఆ జన్మలో కొన్ని కర్మలు చేయటం వల్ల మరొక రూపములో ఉన్న శరీరాన్ని ధరించి జన్మిస్తాడు – ఈ విధంగా అతడు తన అజ్ఞ్యానము వల్ల జనన, మరణ పరంపర ద్వారా ఒక శరీరము నుంచి మరొక శరీరానికి పయనిస్తూ ఉంటాడు – వేదాలు భోదించిన పునర్ జన్మ సిద్దాంతం ప్రకారం – వాస్తవమైన పునర్జన్మ పద్ధతి ఏమిటంటే – మరణ సమయములో ఆత్మ, భౌతిక దేహాన్ని వదిలిన తరువాత తన కర్మలను బట్టి – భౌతిక ప్రకృతి నియమాను ప్రకారం – ఈ విశ్వములో లేదా మరొక విశ్వములో ఏదో ఒక జీవరాశిలోని ఒక గర్భములో ప్రవేశిస్తుంది – మరణ సమయములో దేహాన్ని వదిలిన జీవాత్మ భౌతిక శరీరపు అవరోదు లేకుండా – మనో వేగముతో ప్రయాణం చేయగలదు – కనుక ఆత్మ – ఒక శరీరాన్ని వదలి మరొక శరీరములో ప్రవేశించటానికి అతి స్వల్పమైన కాల వ్యవది మాత్రమె ఉంటుంది – ఏది ఏమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన జీవులు మాత్రమే జనన, మరణ చక్రానికి – అవతల ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోగలరు – భౌతిక ప్రపంచము లోని జీవితానికి కట్టు బడిన సామాన్య జీవుడికి ఇది సాధ్యము కాదు.

4) ఆత్మ సాక్షాత్కారము పొందిన జీవులు – నా పుట్టుక నా లీలలు దివ్యము లైనా వని ఎరింగిన వాడే శరీరము వదిలిన (మరాణా నంతరము) ఈ భౌతిక లోకమున జన్మించక – నా సన్నిధికే చేరును – భక్తి యోగులైనా మహాత్ములు అత్యునతమైన సిద్ధిని పొందిన వారగుట చేత – దుఃఖనిలయమైన ఈ అనిత్య ప్రపంచమునకు ఎన్నడును తిరిగిరారు అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించినారు – > కర్మ సూత్రాలు – పునర్జన్మ సూత్రాలు ఎంత క్రమ భద్ద మైన వంటే – భౌతిక శరీరము వదిలిన జీవుడి సంచిత కర్మ ఫలంగా తదనుగుణమైనా – మరొక శరీరాన్ని ప్రకృతి – జీవుడు సులభంగా ప్రవేశించి మల్లి జన్మించాటానికి వీలుగా సృష్టిస్తుంది. – > దేహము విడుచు నప్పుడు మానవుడే స్థితిని స్మరించునో – ఆ స్థితిని తప్పక పొందును – ఆత్మ సాక్షాత్కారము పొంది – శాశ్వత ఆధ్యాత్మిక ప్రపంచములో ప్రవేశించిన జీవుడికి జన్మ, మృత్యు, జరా వ్యాధులతో కూడిన – ఈ తాత్కాలిక భౌతిక ప్రపంచములో జన్మించే వాంచ ఉండదు – అవసరమూ లేదూ – > ఒక సారి మానవుడైతే – ఎప్పుడూ మానవుడేనా ? జీవుడు ఒక సారి మానవ శరీరము ధరిస్తే – తరువాత జన్మలలో ఎప్పుడూ మానవుడుగానే జన్మిస్తాడు గాని – నీచ జాతులలో ఎన్నటికి జన్మించడు అని పునర్ జన్మను గురించి మరొక భ్రమ ప్రజలలో వ్యాపించి ఉంది మనము మానవులుగా జన్మించవచ్చు – కుక్కలుగా, పిల్లులుగా, పందులుగా, జంతువులుగా లేదా అంత కంటే నీచ జంతువులుగా పుట్ట వచ్చు అని – పునర్ జన్మపై అత్యంత ప్రామానికమైన మూల గ్రంధము భగవద్గీతలో ఇలా ఉన్నది – తమో గుణమునందు మరణించువారు జంతు రాజ్యమునా జన్మింతురు – > రజో – తమో గుణములో ఉన్న వారు దృశ్య విషయములపై ప్రీతిని కలగ జేసుకొని – కోరికలను పెంచుకొని – విషయా సక్తి చేతనో – కర్మ సంభందము చేతనో జీవున్ని లెస్సగా భందించు చున్నది – > అనేక బాహ్య ఆడంబర కర్మల చేతను – విషయా ఆసక్తి చేతను – ఖ్యాతి ఆర్జించ వలెనను ప్రయత్నముల చేతను – దృశ్య సంభందములైన క్రియా కలాపముల చేతను రజోగుణము జీవున్ని భందించి వేయుచున్నది – తమో గుణము అజ్ఞ్యాన జనితమైనది – అది జీవున్ని మోహ పెట్టి – అతనికి అవివేకమును కలగచేసి సంసారమున బడవేసి బంధించుచున్నది – దట్టమగు మేఘము సూర్యున్ని గప్పిన చందమునను – తమో గుణము – రజో గుణము జీవున్ని కప్పి వేయుచున్నది – > ఎప్పుడైతే జీవుడు సత్వ గుణ అభిరుద్ది పొంది మరణించినచో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము గలవారి యొక్క పరిశుద్దములైన లోకములలోనే పొందును – అయితే రజో గుణము అభిరుద్ది నొంది యుండగా మరణించువాడు – కర్మాసక్తులగు వారి యందు జన్మించుచున్నాడు – > అట్లే తమో గుణాబివృద్ది నొంది యుండగా మరణించువాడు – పామర్ల గర్బములందు – లేక పశు పక్షాది హీన జాతులందు పుట్టుచున్నాడు – అట్టివారెన్ని దుర్బర దారుణ దుఖములననుభవించవలెనో – కావున అట్టి భయంకర పరిణామములు – భీషణదు:ఖజనక పరస్తితులు తనకు కలుగకుండా జీవుడు – అతి జాగా రూపుడై జీవిత కాలమున – మరణము దగ్గరికి రానప్పుడే ప్రయత్న పూర్వకముగ – ఆ రజో గుణ – తమో గుణ రూప ఘోర పిసాచములను – తన హృదయ దేహమునుంది తరిమి వేసి – భగవత్ భక్తి – వైరాగ్యము – ఆత్మ జ్ఞానము – ఆత్మా సాక్షాత్ కారము – మొదలగు సద్గుణ రాశిని అలవర్చుకొని ముక్తుడై జన్మ సార్ధ కథ పొందవలయును.

5) జనన మరణాలు అనేవి చిత్ర విచిత్ర హింసాకరమైన – జుగుప్సాకరమైన – అనుభవాలనే విషయము కఠోర సత్యము – మహార్షులు వివరించిన మరణ అనుభవము యొక్క స్థితి – “ మరణావస్తలో మనిషి కళ్ళు శరీరంలోని గాలి ఒత్తిడికి ఉబ్బుతాయి – రస గ్రంధులు కపముతో బిగుసుకు పోతాయి – ఊపిరి తీసుకోవటం – వదలటం కష్టం అవుతుంది – గొంతులో గురక పుడుతుంది – అతి దయనీయమైన స్థితిలో – విపరీతమైన బాధతో స్పృహ లేకుండా మరణిస్తాడు ” – > ఆత్మ దేహములో నివసించటానికి అలవాటు పడినందు వల్ల – మరణ ఆసన్న కాల ప్రకృతి శాసనాలు దానిని వెళ్ళగొట్ట వలసి ఉంటుంది – > తమ ఇంటినుంచి బలవంతంగా వెల్ల గొట్ట బడటానికి ఎవరు ఇష్ట పడనట్లే – జీవుడు భౌతిక దేహము నుంచి వెళ్ళిపోవటానికి ప్రతిఘటించటం సహజము – చిన్న చిన్న క్రిమి, కీటకాలు కూడా – వాటికి ప్రాణ అపాయం వచ్చినప్పుడు – మరణాన్ని తప్పించుకోవటానికి అశ్చర్యకరమైన శక్తి సామర్ధ్యాల్ని ప్రదర్శిస్తాయి – అన్ని ప్రాణులకు మరణము అనివార్య మైనట్లే – దానికి సంభందించిన భయము భాదా కూడా అని వార్య మైనవే.

6) ఆత్మ సాక్షాత్కారము పొందిన ముక్త జీవులకు మాత్రమె వేదన – ఆరాటము లేకుండా మరణాన్ని అనుభవించే శక్తి ఉంటుందని వేద గ్రంధముల ద్వారా తెలుస్తున్నది – > జీవి భౌతిక ప్రపంచములో విహారా యాత్ర ఏమి కాదు – తల్లి కడుపులోని పిండము చీకటిగా ఇరుకుగా ఉన్న గర్భాశయములో – తల్లి ఉదరాగ్ని జ్వాలకు తీవ్రంగా భాద పడుతూ ఇటు అటు ఏడ తెగని కదలికలకు తట్టుకుంటూ – మన దేహము చుట్టూ ముసురుకున్న – మావి పోరా ఒత్తిడికి ఎప్పుడూ కుములుతూ నెలల తరబడి గడపవలసి ఉంటుంది – బిగువుగా – ఇరుకుగా ఉండే ఈ సంచి ( గర్బాశయము ) శిశువు వెన్ను ఎప్పుడూ విల్లువలె వంగి ఉండేటట్లు చేస్తుంది – అంతేకాకుండా ఆకలి దప్పులతోను – తల్లి పొత్తి కడుపులోని ఆకలి పురుగులు దేహమంతట కొరుకుతూ ఉండడం వళ్ళ జీవి బాధ పడుతాడు – జీవుడు నిలుపుకున్న గత జీవిత స్మ్రుతుల్ని పోగొట్టే ప్రక్రియే మరణము అని వేదాలు చెప్పుతున్నాయి – > మానవ జన్మ చాల అరుధైనదని వేద గ్రంధాలు వివరిస్తున్నాయి – జీవాత్మ మానవ జీవిత లక్ష్యాల్ని వదిలి పాశవిక వాంచలలో చిక్కుకున్నపుడు ఇది సంభవిస్తుంది – అప్పుడు జీవాత్మ తరువాత జన్మలో వారు చేసుకున్న కర్మల అనుసారంగా – పశు, పక్షిగానో – అంతకంటే అధమ జీవిగానో పుట్టవలసి ఉంటుంది – > అందుకే “ పునరపి ” జననం – పురరపి మరణం “ అనే జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందాలని – ఇదే మానవ జీవితానికి వాస్తవమైన గమ్యము – > మల్లి మల్లి పుడుతూ – మల్లి మల్లి చస్తూ – మల్లి మల్లి తల్లి గర్భములో ప్రవేశించాలి – ఇలా అయితే ముక్తి ఎప్పుడూ ? మోక్షం ఎప్పుడూ ? శాశ్వతానందం ఎప్పుడూ ? జనన మరణాల నుండి విముక్తి పొందినప్పుడే – మల్లి పుట్టుక లేకుండా పోయినప్పుడే – మల్లి పుట్టుక లేకుండా ఏమి చేయాలి – అను గూర్చి విజ్ఞులైన మీరు తెలుసు కోవాలి – > మానవుడు జీవించి ఉన్నంత వరకు ఒక్క క్షణము కూడా కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు – అదే విధంగా “ కుర్వన్నే వేహ కర్మాణి జిజీ విషెచ్చతగం సమా ” – ఈ లోకములో కర్మలు చేస్తూనే నూరేళ్ళు జీవించాలి – పాప కర్మలు – చెడ్డ కర్మలు చేయకుండా నిష్కామా కర్మలు చేస్తూ – కర్మ పలా పేక్ష లేకుండా చేయాలి – లోక కల్యాణం కొరకు – భగవత్ ప్రీతీ కొరకు కర్మలు చేయాలి – ఈశ్వర అర్పితంగా కర్మలు చేయాలి – నిష్కామ పలాసక్తి లేకుండా కర్మలు చేయుట మంటే – ఫలితము మీద ఆసక్తితో కర్మలు చేస్తే పలితము మనకు బందం అవుతుంది – మనము పుణ్య కర్మలు చేస్తాం – పూజ పునస్కారాలు చేస్తాం – దానా ధర్మాలు చేస్తాం – ఇలా చేసేటప్పుడు మనకు పుణ్యం రావాలనే కోరిక – పుణ్యము వస్తుందనే భరోసా – నమ్మకం ఉంటుంది – ఇది పలా ఆసక్తితోని చేసినదా – ? నిష్కామంగా పలాసక్తి లేకుండా కర్మలు చేసినట్టా ఆలోచించండి – మనం చేసే కర్మలే మనకు బందనాలవుతున్నాయి – జన్మలు కారణమవుతున్నాయి అని ఆలోచించండి.

———సశేషం———

పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినయే – ఏమైనా ఈ పిన్నవాడు చెప్పినదాంట్లో పోరాప్పట్లు ఉంటె తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/29/2016

🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺

అంత రంగం పిలుస్తుంది , రా !

“ సోదరులారా ! మాతృ గర్భము నుండి మనము ఒక్కరమే స్వచ్ఛము (దిగంబరము) గా వచ్చాము – మన మంతా దీని గురించి ఆలోచిద్దాము – అందరమూ ఒంటరిగా దిగంబరముగా వచ్చాము – మరల ఈ ప్రపంచమును వదిలి ఎదో ఒకరోజు ఒంటరిగా వెళ్ళతాము – ఈ ప్రపంచము నుండి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరు రారు – మనం జన్మించినప్పుడు కుటుంబ సభ్యులంతా ఆనందిస్తారు – అలాగే మరణించినప్పుడు వారందరూ దు:ఖిస్తారు – మనం కూడా శోకిస్తాము ” – > “ మనం మరణించేటప్పుడు మన ముఖము నుండి అలౌకిక ఆనందం ప్రకాశించే విధంగా మనం ప్రవర్తించాలి – ఇతరులు విలపిస్తే విలపించనీయి – మనం మాత్రం చిరు నవ్వుతో ఈ ప్రపంచమును వదిలి వెళ్ళాలి – ఈ విధంగా ఎవరు చేయగలరు ? ఈ శరీరం తాను కాదని తాను చైతన్య విగ్రహుడని గ్రహించినవారు మాత్రమె ఈ విధంగా చేయగలరు – ఈ శరీరము నశించే స్వభావము కలది – తప్పక మరణిస్తుంది – కాని మనలో సనాతనమైన – వినాశ రహిత జనన మరణ రహితమైనది ఒకటి వుంది – ఈ పరమ సత్యమును తెలుసుకొన్న పురుషుడు గాని స్త్రీ గాని ఈ జన్మలో ముక్తిని పొందగలడు.

1)సృష్టిలోని ఇతర జీవులు పూర్వజన్మలోని కర్మ ఫలాన్ని అనుభవించటం తప్ప – ఈ జన్మలో ధర్మా ధర్మముల నాచారించుటకు అవకాశం లేని విధంగా పుడుతున్నాయి – ఇక దేవతల విషయం చూస్తే – వారు కేవలం తాము వెనుకటి జన్మలో చేసుకొన్నా పుణ్య కర్మల ఫలాన్ని మాత్రమె అనుభవించగలరు – మళ్ళీ పుణ్య సంపాదన మనేది వారికి సాధ్యం కాదు – > మానవులకు తాము చేసుకొన్నా పుణ్య పాప ఫలాలు రెండూ అనుభవించే అవకాశం ఉంది – ఈ జన్మలో సైతం, పాప పుణ్య కర్మలు చేయగలరు – తమ పాపాల్ని ప్రాయశ్చిత్తాదుల ద్వారా పోగొట్టుకోగలరు – సత్కర్మలు చేసి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోగలరు – కాబట్టి పశు పక్ష్యా దులకంటే, దేవజాతికంటే, మానవ జన్మ ఉత్తమ మైనదని అన్నారు – > ఇట్లా దుర్లభమైన మానవ జన్మ ఏ పుణ్య విశేషం చేతనో – భగవత్ కృప వల్లనో ఎదో విధంగా పొంది – శ్రుతి సిద్దాంత జ్ఞానం కలిగి నట్టి పురుష జన్మను పొంది కూడా తన ఆత్మ యొక్క మోక్షం కోసం ప్రయత్నించనట్టి మూడుడు – నిజంగానే ఆత్మ హంతకుడు అవుతాడు – ఎందుచేత ? అసత్ పదార్ధమందు – అనాత్మ పదార్ధాలలో – అపేక్ష కలిగి వున్నందు వల్ల – > ఇటువంటి దుర్లభమైన మనుష్య దేహాన్ని – పురుషత్వాన్ని పొంది కూడా కేవలం స్వార్ధ సాధనలో మైమరచి సంచరించేవానికంటే మూడుడు ఎవరుంటారు ? – > అనేక శాస్త్రాలు చదివి వాటిని వాఖ్యాన్నిస్తే – వ్యాఖ్యా నించవచ్చుగాక – అనేక మంది దేవతలకు సంబందించిన యాగాలు చేయవచ్చునుగాక – అనేక శుభ కర్మలను చేస్తే చేయవచ్చుగాక – అనేకమంది దేవతలకు పూజించ వచ్చును గాక – ఎన్ని చేసినప్పటికీ – జీవాత్మ పరమాత్మగా ఏకత్వాన్ని గూర్చిన జ్ఞ్యానము – కలిగి తేనే తప్ప – ఎన్ని బ్రహ్మ కల్పాలు గడిచి నప్పటికీ మోక్షము లభించదు – “ జీవో బ్రహ్మేవ నాపరః ” అనే అద్వైత భావన మిక్కిలి అవసరమన్నమాట – > “ ధనం వల్ల మనకు మోక్షం లభించదు ” అనే విషయం “ కర్మ అనేది ముక్తికి కారణం కాదు ” అనే నానుడి వల్లనే సృష్టిమౌతుంది – ఉపనిషత్తులన్నీ కర్మల వల్ల మోక్షం రాదని ఘోషిస్తూ ఉన్నాయి – కాబట్టి ఆ కర్మల వల్ల మనం సంపాదించే ధనం వల్ల మోక్షం రాదనేది స్పష్టంగా తెలుస్తున్న విషయమే ! – > అందు చేత విద్వాంసుడై – బాహ్య భోగాల మీద ఉండే కోరికల్ని వదిలివేసి – మహాత్ముడైన సద్గురువు శరణు జొచ్చి – శ్రద్దగా ఆయన ఉపదేశించే విషయాలను వింటూ – ఆయన చెప్పిన విధంగా నడచు కుంటూ మోక్షం కోసం ప్రయత్నించాలి – > “ఉద్దరేదాత్మ నాత్మానం మగ్నం సంసారవారిధౌ – యోగారూడత్వ మాసాద్య సమ్యగ్ధర్శన నిష్టయా ” – > ఎల్లప్పుడూ సద్వస్తువైన ఆత్మను దర్శించటంలో నిమగ్నుడై ____ యోగారూడుడై ____సంసార సాగరంలో నిమగ్నమై కొట్టు మిట్టాడుతున్న తన ఆత్మను ఉద్దరించు కోవాలి.

2) పూచిన పూలు మాలీ కోసే నేడు – నేటి మొగ్గలము రేపు పూలుకాగా – పూలకు నేడు చేటు రేపు మనకు మాటు – తలపోసినవి మొగ్గలు తీగనంటి – > భావము :- సమీపిస్తున్న తోటమాలిని చూసి మొగ్గలు విలపించాయి – విరబూసిన పూలు ఈ రోజు కోయబడ్డాయి – మనవంతు రేపు వస్తుంది – మృత్యువును ఆలింగనం చేసుకోకతప్పదు – అని చెట్టులోని మొగ్గలు విపిస్తున్నట్లు చింతించాడు కబీర్ దాస్ – > మానవ జీవితం నీతి బుడుగు లాంటిది – ఒక కాలంలో కనుపించి మరొక కాలంలో అదృశ్యమవుతుంది – జీవించే మూడు ఘడియలు శోభాయమానంగా కన్పిస్తుంది – మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకోలేక క్షణికమైన ఈ జీవితమే శాశ్వతమని మానవుడు భావిస్తుంటాడు – అశాశ్వతమైన తన బ్రతుకు బొమ్మను సింగారించుకోనుటకు చేయారాని పనులు చేస్థాడు – అవినీతికి ప్రతి రూపంగా చరిస్తాడు – అధర్మానికి వారసుడై బ్రతుకుతాడు – స్వార్ధానికి స్థూల రూపంగా నిలుస్తాడు – > రాబోయే విపత్తును ఊహించలేక జన్మను వృధా చేసుకుంటూన్నాడు – ఏ క్షణమైన తనను కబళించేందుకు సిద్దంగావున్న మృత్యువును గూర్చి ఒక క్షణం కూడా ఆలోచించలేక పోతున్నాడు – తన ముందున్న పురుగులను మ్రింగాలనే కప్ప ప్రయత్నిస్తూ ఉంటుంది – గాని తనను కబళించేందుకు సిద్దంగా ఉన్న సర్పాన్ని గూర్చి యోచించదు – తన ముందు ప్రదర్శించబడిన అజ్ఞాన మనోహర దృశ్యాల్ని తిలకించడములో – ఇంద్రియ భోగలాల సత్వమునందు చరించడములో మానవుడు తన కాలాన్న౦తా వృధా చేసుకుంటూన్నాడే గాని తనను వెంబడిస్తున్న భయంకర మృత్యువును గూర్చి ఆలోచించలేక పోతున్నాడు – > తోట మాలిని చూసి మొగ్గలు విలపించాయంటున్నాడు – భక్త కబీర్ దాస్ – తోటమాలిని విరబూసిన పూలను కోస్తాడే గాని మొగ్గలను కోయడు – అలాంటప్పుడు పూలు విలపించాలి గాని మొగ్గలు దు:ఖించడమెందుకు ? అక్కడే వివేకం చోటు చేసుకొని యున్నది – నిన్నటి మొగ్గాలే ఈనాడు పూలుగా మారాయి – మాలీచేత కోయబడ్డాయి – మరి నేటి మొగ్గలు రేపు పూలు అవుతాయి -ఈనాడు పూలకి ప్రాప్తించిన గతే రేపు ఈనాటి మొగ్గలకు కూడా కల్గుతుంది – కనుక రాబోయే అపాయాన్ని ఊహించి ముందు చూపుతో మొగ్గలు చింతిస్తున్నాయి – > ముందు చూపు గలవారు ధన్య జీవులు – బ్రతుకు బాటను తీర్చి దిద్దుకొనే అవకాశానికి నోచుకున్న ఉత్తములు – ప్రతి వ్యక్తి కూడా రాబోయే మృత్యువును దృష్టిలో నుంచుకొని ధర్మ జీవనం గడపాలి – సత్య పంధాలో నడక సాగించాలి – చచ్చే లోపల బ్రతికేదేలాగో ఊహించాలి – జీవన్ముక్తుడై మనుగడను సాగించాలి – కాలంలో కను పించి – లయించే దేదైనా అనిత్యమైనదే – కాలాతీతమైనది – కాలాధీనమైన దేహా మనో బుద్దులు శాశ్వత మైనవి కావు – దేహ ధ్యాసతో – అభిమాన, అహంకారాలకు వారసులై జీవితాన్ని వృధా చేసుకోకూడదు – సత్య పదార్ధాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి – మరణం ఆసన్నం కాకముందే ముక్త పురుషులై తరించాలి.

3) అనివార్యమైనది రోజొకటి ఉన్నది – విరుపయోగము నీవు దాని చెంత -గృహ కళత్రము దేహ పటుత్వము – వాస్తవముగ నిన్ను వదిలి చనును > భావము : – నీవు ఎవరికీ ఉపయోగపడని రోజంటూ ఒకటి వస్తుంది – గృహంలో నారి అనగా భార్యయే గాక నీ శరీరంలో నారి అనగా నరము కూడా నిన్ను వదిలిపెట్టి నిష్క్రమిస్తుంది – > పరోపకారం జీవనమే భగవంతుని సృష్టి ఔనత్యానికి ప్రతిబింబము వంటిది – భగవంతుని సృష్టిలో గోచరించే శోభ అంతయు పరోపకార సిద్దాంతము పైననే ఆధారపడి ఉన్నది – > సూర్యుడు వేడిని – వెలుతురుని ప్రసాదిస్తున్నాడు – మేఘము వర్షానందిస్తున్నది – భూమి ఆహారాన్నందిస్తుంది – అరణ్యము ఫల, ఓషధులను అందిస్తుంది – జడప్రాయమైన ఈ ప్రకృతి అంతయూ ఇతరులకు ఉపయోగపడుటయందె తమ మనుగడను సాగిస్తున్నది – ప్రకృతి అందించడానికి అలవాటు పడి ఉన్నదే కాని – అందుకోవడానికి అర్రులు చాచడము లేదు – > చైతన్యవంతమైన ప్రాణులన్నీ ప్రకృతిలాగే పరోపకార బుద్దితో జీవిస్తున్నాయి – ఒక్క మానవుడు తప్ప – గుఱ్ఱము బండిని లాగుతున్నది – ఎద్దు భూమిని దున్నుతున్నది – ఆవు పాలిస్తుంది – సూకరము మలినాన్ని శుబ్రపడుస్తున్నది – మరి మానవుడేం చేస్తున్నాడు ? అందుకొని ఆరగిస్తున్నాడు – తాను ఎవరికీ ఉపకరించడు – అందరూ తనకు ఉపయోగపడాలని ఆరాటపడుతుంటాడు – దీపమున్నప్పుడే ఇల్లు చక్కబరచుకోవాలి – శక్తి ఉన్నప్పుడే కర్మ లాచారించాలి – శక్తి హీనమైన నిస్సారమైనప్పుడు మనము వాంచలు పెంచు కున్నా – ఆంక్షలు విధించుకున్నా చేయగలిగిన దంటూ ఏమీ ఉండదు – > అందువలనే నీవు ఎవ్వరికీ ఉపయోగపడని రోజంటూ ఒకటి వస్తుందని మరచి పోవద్దు – ఈ లోగానే మంచికి వారసుడుగా నిలిచి తోటి మనిషికి ఉపయోగపడేలా జీవించాలి – జడమైన ప్రకృతి – బుద్ది హీనమైన పశుపక్ష్యాదులే పరోపకార బుద్దితో జీవించుచుండ – విజ్ఞానియైన మానవుడు అలా ప్రవర్తించడానికి కారణమేమి ? దేహ భ్రాంతి యనెడి అహంకారము – సంసార భ్రాంతి యనెడి మమకారమే అలా ప్రవర్తించుటకు కారణము – అందువలనే నీ గృహంలోని నారి – నీ శరీరము లోని నరము రెండూ నిన్ను నిష్క్రమించే రోజు వస్తుందని – ఆ నాడు నీవు ఎవ్వరికి ఉపయోగపడలేవు – > దేహ సౌందర్యము నిత్యమని భావించడం అవివేకము – ఈనాడు అంద చందాలకు నిలయమైన సుందర దేహము ఒకనాడు శ్మశానానికి ఆహుతికాక తప్పదు – ఈనాడు శక్తివంతమై తిరిగే శరీరము ఒకనాడు నిస్సారమై – కదలలేని కోయ్యమోద్దులా పడి యుండే పరిస్థితి ఆసన్నం కావచ్చు – అలాగే ఏ భార్య వ్యామోహంలో పిచ్చావాడులా మానవుడు ప్రవర్తిస్తూ స్వార్ధంతో నడక సాగిస్తున్నాడో ఆ భార్య కూడా తనను విడిచి పెట్టి పోతుంది – > పరోపకారార్ధము శిబి చక్రవర్తి తన శరీరాన్నే త్యాగం చేశాడు – కర్ణుడు తనకంటూ ఏది మిగుల్చుకోక పదుగురి అవసరాలు తీర్చి దాన కర్ణుడిగా శాశ్వత కీర్తి నార్జించాడు – తనయావాదా స్తిని పేదలకు దానం చేసి పురందరదాసు పాండురంగ సేవకు అంకితమై తరించాడు – > అంత త్యాగము మనము చేయనవసరము లేదు – మనకొర కెలా జీవిస్తున్నామో అలాగే మరొక్కరి కొరకు జీవించగలిగితే చాలు – >అశాశ్వతమైన శరీరము మంటగలిపే లోపల ధర్మజీవనాన్ని గడపడానికి యత్నించాలి – “ ధర్మో రక్షతి రక్షితః ” ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మం రక్షిస్తుందని ఉపనిషత్ ప్రభోధము – అట్టి ధర్మ ప్రవృత్తి కల్గి జీవించువాడే మానవుడు – అందుకు వ్యతిరేక జీవనము కొనసాగించువాడు భగవానుని దివ్యమయ సృష్టికి దిష్టి బొమ్మలాంటి వాడు.

4) “ మేము ఉపదేశము తీసుకొన్నాము కాని ఆధ్యాత్మిక పథంలో అభివృద్ధి యేమి సాదించినట్లు అనిపించడం లేదు – కారణం ఏమిటి ?” అని వారు అంటువుంటారు – ఈ ప్రశ్నకు సమాధానంగా “ లక్ష్య ” సాధనకు సరియైన “ మనో తీవ్రత ” కావాలన్నదే ప్రప్రథమంగా చెప్పవలసి వుంటుంది – మనలో చాలా మంది లౌకికమైన కోరికలు తీర్చుకోవటమే ఆ లక్ష్యం అవుతుంది – చాలా మంది డాక్టర్లు – ఇంజనీర్లు – పరిపాలనాధికారులు – గొప్ప వర్తకులు కావాలని అనుకుంటారు – కానీ మన “ పరమ గమ్యము ” – యీ జీవితంలోనే పరిపూర్ణత్వాన్ని పొందుట లేక ఆత్మ సాక్షాత్కారం లేక భగవత్సాక్షాత్కారం పొందుట – భగవంతుని పొందినప్పుడు మాత్రమె మన నిజతత్వమైన – సచ్చిదానంద తత్వాన్ని గ్రహించగలుగుతాము – మానవ జీవిత పరమగమ్యం యిదే – అయినప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొంది – సద్గురువు ద్వారా ఆ గమ్య సాధనకు తగు మార్గాన్ని తెలుసుకోగలిగిన అదృష్టం లభిస్తే – “ లక్ష్యం ” – సులభంగా సాదించవచ్చు – > ఈ “ పరమ గమ్యాన్ని ” పొందాలని ఎవరు ప్రయత్నిస్తారు ? ఎవరి కైతే “ అంత రంగపు పిలుపు ” వినిపిస్తుందో వారే ప్రయతిస్తారు.

——– సశేషం ——–

R.B.Satyanarayana
Chairman, Annadhara

5/30/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ వ్యక్తిత్వ వికాసం ” 4వ భాగము

1)మానవుల విజయానికి మూలసూత్రాలలో ఒకటి… చేస్తున్న పనికి సంభందించింది – 1) విజయం సాధించాలంటే ఎం చేస్తున్నామో తెలియాలి – 2) చేస్తున్న పనిని ఇస్టపడాలి – 3) ముఖ్యంగా ఆ పనిని విశ్వసించాలి – ఈ మూడు కలిసినప్పుడు విజయ సాధనకు మార్గం సుగుమమవుతుంది – > చాలా మంది తాము ఏమి చేస్తున్నామో వారికే తెలియదు – ఎండుటాకు గాలిలో ఎటు పడితే అటు ఎగురుతున్నట్లు అపటికప్పుడు ఎదో తోస్తే అది చేసేస్తుంటారు – ఒక గమ్యం అంటూ ఉండదు – ఇలాంటి వారికి తామేం చేస్తున్నామో వారికే తెలియదు – > అలాగే చేస్తున్న పనిని ఇష్టపడటం చాలా మందిలో ఉండదు – పొద్దున లేచిన దగ్గర నుంచి చేస్తున్న పనిని తిట్టుకుంటూ గడుపుతుంటారు – తమకు తగని పని – తమకు సరిపోని పని చేస్తున్నామన్న భావన వీరిలో ప్రతిక్షణం కన్పిస్తుంటుంది – > ఇక చేస్తున్న పనిని విశ్వసించని వారే మనలో ఎక్కువ – ఒక లక్ష్యాన్ని – ఫలితాన్ని ఆశించి పనిచేస్తుంటారు – కాని అది సాధించగలమన్న విశ్వాసం మాత్రం ఏ కోశానా ఉండదు – అదే నిర్వేదం వారిలో ఎప్పుడూ కన్పిస్తుంటుంది – ఎదో తప్పక చెస్తునాము గాని అది జరుగుతుందా అన్న అపనమ్మకం మాత్రం నిలువెల్లా వ్యక్తం చేస్తుంటారు – విజయ సాధనకు ఈ మూడు అంశాలు అవసరమే – చేస్తున్న పని పట్ల అవగాహన – దానిని ఇష్టపూర్వకంగా చేయడం – అలాగే అనుకున్న ఫలితం సాధించగలమని నమ్మడం – > విజయ శిఖరాలను అధిరోహించిన వారు ఈ మూడింటిని పాటించినవారే – ఒక విశ్వనాధన్ ఆనంద్ ను తీసుకున్న – ఒక కారణం మల్లీశ్వరిని తీసుకున్న వారికే ఎం కావాలో వారికి తెలుసు – వారు చేస్తున్న పనిని – కృషిని ప్రాణ ప్రదంగా చేస్తారు – లక్ష్యాన్ని చేరగలమని చివరి వరకూ విశ్వసిస్తారు – > అందుకే వారు కోరుకున్న రంగంలో విజేత లయ్యారు – ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారెవరైనా కోరు కున్న విజయాలు సాధించగలరు.

2) సమాజంలోని అనేకమందిలో కొందరే ఎందుకు విజేతలుగా వెలిగిపోతున్నారు ? మిగితావారెందుకు ముందుకు వెళ్ళలేకపొతున్నారు ? ఇది సామాన్యులందరినీ వేధిస్తున్న ప్రశ్నే – ఈ ప్రశ్నకు జవాబు కనుక్కునేందుకు వేలాది అధ్యయనాలు జరిగాయి – ప్రపంచ ప్రసిద్ధ శోధకులు – వ్యక్తిత్వ వికాస నిపుణులు ఈ కోణంలో ఎంతగానో అన్వేషించారు – కొంతమంది ఎందువల్ల సక్సెస్స్ ఫుల్ జీవితాన్ని గడుపుతుంటారు ? వారి చెంతకు అపజయం ఎందుకు రాదు ? ఇందుకు కారణం ఏమిటి ? ఇది వారసత్వంగా సంక్రమిస్తుందా ? బాల్యం నుంచే వర ప్రసాదంగా సిద్దిస్తుందా ?గత జన్మ కర్మ ఫలమా ? ఈ జన్మ అదృష్ట జాతకమా ? సక్సెస్ ఫుల్ వ్యక్తులను చూడగానే తోలి చూపులో ఇలాంటి భ్రమ కలగవచ్చు – కాని వారి పూర్వాపరాలు పరిశీలిస్తే అవేవి నిజం కాదని తెలుస్తుంది – మనకు ఏ తరహా తల్లి దండ్రులు కావాలో పుట్టుకకు ముందే మనం నిర్ణయించుకోగలమా ? అలాగే ఎటువంటి కుటుంబంలో జన్మించాలి ? ఎంత మంది తూబుట్టువులు ఉండాలి ? వంటి అంశాలను మనం నిర్దేశించలేం – జన్మతః ఏవి సంక్రమిస్తే వాటిని శిరసావహించాల్సిందే – ఆమోదించాల్సిందే ! మరింకేమిటి ? ఏ కారాణాలు సక్సెస్ కూ దారి తీస్తాయి ?ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే – సక్సెస్ ఫుల్ వ్యక్తులందరూ ఒకే రంగుతోనో – ఒకే శరీర ఆక్రుతితోనో – ఒకే దృక్పథంతోనో – ఒకే రకమైన మేదాసంపత్తితోనో ఉండరు – అలాగే జీవితంలో ఒక దశ వరకు ఎలాంటి విజయాలు సాధించలేక పోయిన వారు చరమదశ వరకూ అలాగే ఉండిపోవడం లేదు – ఒక సమయంలో విజయం వైపు పయనిస్తున్న వారున్నారు – మరి పెరిగిన వాతావరణం వల్ల విజేతలుగా ఆవిర్భవించవచ్చా ? అలాగని రూలెం లేదు – అత్యుత్తమ విజేతల పిల్లలు మళ్ళి విజేతలు కావడంలేదు – అలాగే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి విభిన్న రంగాలలో విజయాలు సాధిస్తున్న వారున్నారు – మరి విజయానికి దారి తీసే లక్షణం ఏమిటి ? – > ఈ కారణాలన్నింటిని తోసి రాజని సూక్ష్మంగా ఒకే ఒక రహస్యాన్ని చెప్పవచ్చు ? “ నీ ఆలోచనలను మార్చుకో …… ప్రపంచమే మారిపోతుంది ” – కచ్చింతంగా ఆలోచనలే విజయం వైపు నడిపిస్తాయి – లేదా అపజయ అధఃపాతాళానికి తోసేస్తాయి – అనుకూల ఆలోచనలు పుష్కల విజయాలు తెచ్చిపెడతాయి – ప్రతి కూల ఆలోచనలు జీవితకాలం వెనక్కి నేడతాయి – కదా … ఆలోచించండి ?

3) మీలో విశ్వాంత రాళాల శక్తి దాడి ఉంది – మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా కాగలరు – మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో అది సాదించగలరు – మీరు సాదించగలనని గాడంగా విశ్వసించడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకోగలరు – ఎన్ని అవరోధాలు ఎదురయిన – ఎన్ని అపజయాలు అడ్దగించినా – ఎన్నిసార్లు బోర్లాపడినా – సరే… ఒకేఒక శక్తి వల్ల విజయం సాధించవచ్చు – మన ఆలోచనలకు ప్రతిరూపమే మన ప్రస్తుత స్థితి అని గౌతమ బుద్దుడు ప్రకటించాడు – ఆనాడే కాదు ఏనాడైనా సరే – మనిషి మస్తిష్కము ఏదైతే విశ్వసించిందో – అదే నిజంగా రుజువవుతూ వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు – ప్రపంచ ప్రఖ్యాత విజేతలందరు తాము కళలు గని సాధించగలమని నమ్మిన దానినే పాదాక్రాంతము చేసుకున్నారు – > విశ్వసించడం లోనే విజయము దాగి ఉందనేది అసలు రహస్యము – మీరు ఏది విశ్వసిస్తారో అదే సాక్షాత్కరిస్తుంది – మీ మనసు అపజయాన్ని శంకిస్తే పరాజయమే ఫలితమవుతుంది – అదే మీరు విజయాన్ని విశ్వసిస్తే సక్ససే దక్కుతుంది – విశ్వసించడం అనేది టెలిఫోన్ డయల్ చేయడంలాంటిది – మీరు రాంగ్ నంబర్ అంటే భయం – అపజయాలను ఉహిస్తూ – డయల్ చేస్తే సమాధానంగా అవే పలుకుతాయి – అదే మీరు సరియిన నంబరు అంటే విజయము – ఆరోగ్యము – ప్రేమ – సంపద – కీర్తివంటి వాటికోసం డయల్ చేస్తే రింగ్ అక్కడికే వెళుతుంది – అవే సమాధానంగా పలుకుతాయి – ఇది మీకు కేవలం అదృష్టము వల్ల దక్కడంలేదు – మీరు ఎంతో శ్రమించి, మీరు వాటికి అర్హులని విశ్వసించడం వల్ల మాత్రమె అవి మీ సొంతమవుతున్నాయి – అందుకే ఎవరైతే లక్ష్యాన్ని ప్రగాడంగా విశ్వసిస్తారో వారు విజయము సొంతం చేసుకుంటారు.

4) మొక్కవోని ఆత్మ విశ్వాసం – అసమాన సాహసం – ప్రకంపనలు పుట్టించే ఉత్సాహం – పదునైన కార్యాచరణ – ఇంకా ఆశావహ దృక్పథం – భవిష్యత్తు పై అచంచల విశ్వాసం – ఇవి ఏ రంగములోనైన విజయానికి మూల స్థంబాలు – మీరు చేసే అకుంటిత పరిశ్రమ – ఆ పని ప్రయత్నాల ద్వారా మీరు కోరుకున్న విజయాలను పాదా క్రాంతము చేసుకోవచ్చు – > కోరుకున్న ఉద్యోగము – ప్రారంభించాలనుకుంటున్న వ్యాపారం – సాధించాలనుకుంటున్న ఆత్మ సాక్షాత్కారం – కావాలానుకుంటున్న జీవిత భాగస్వామి – ఏదైనా సరే శక్తి వంచన లేని కృషి ద్వారా సొంతం చేసుకోవచ్చు – > అంతే తప్ప కేవలం శుష్క సంభాషణలు – పగటికలలు – అగమ్యగోచర ప్రయాణము వల్ల ప్రయోజనం శూన్యం – ప్రతి మాటకు – కార్యాచరణకు చేసే శ్రమకు ప్రయోజనం ఉండాలి – ఒక స్పస్టమైన దిశలో ఇది కొనసాగాలి – > ఒక పనిని చేయలేక పోయినందుకు – ఒక లక్ష్యాన్ని చేరలేకపోయినందుకు – ఎన్ని సాకులైన చెప్పవచ్చు – ఎన్ని కారణాలైన అన్వేసించవచ్చు – అదే ఆ పనిని చేయాలంటే మాత్రం దానికి ఒకటే దారి – అదే కృషి – ఇలా కృషి చేయడం ఒక అలవాటుగా మారితే ఏ లక్ష్యాలనైనా – అనుకున్న సమయములో చేరవచ్చు ప్రయత్నించి చూడండి.

5) సక్సస్ ఎక్కడి నుంచి వస్తుంది ? ఎం చేస్తే సక్సస్ మన పాదాక్రాంత మావుతుంది ? ఇదొక మిస్టరీ ప్రశ్న – దీనికి జవాబు తెలిస్తే అందరు విజేతలుగా ఆవిర్భవించవచ్చు – అందుకే ఈ జవాబు అంత సులువుగా దొరకదు – ఇందుకు అన్వేషణ సాగాలి – నిరంతర తపన ప్రజ్వలించాలి – కృషితో స్వేధదార చిందాలి – నిజానికి సక్సెస్ ను చేరడం ఎంత కష్టమో – అందుకోవడం అంత సులభము – ఎందుకంటే సక్సెస్ కు సామాజిక జాడ్యాలు లేవు – కుల మతాల కల్మషం లేదు – సక్సెస్ కు అదృష్ట – దుర దృష్టాల పట్టింపు లేదు – మేదావో –మంద మతో నన్న అంతరము లేదు – సక్సెస్స్ అందరికి అందే అపురూప కానుక – కాని అందనట్టుండే అందమైన చందమామ. – సక్సస్ ఎక్కడి నుండి వస్తుంది ? మనము ఎంత గానో పరితపించే సక్సెస్ కూ జనన స్థానము బాహ్యంగా ఉండేది ఏది కాదు – సక్సెస్ కేంద్ర స్థానము మన మెదడే – మనము ఎంత గాడంగా సక్సెస్ కావాలని కోరుకుంటామో – దానికి అంతగా దగ్గరకు వేలతాము – అందుకే కలలు కనండి – వాటిని కార్య రూపములోకి తీసుక వచ్చేందుకు – అవిశ్రాంతంగా కృషి చేయండి – సక్సెస్ సాదించాలన్న తపన మనలో అంకురించిన తరువాత ఏ౦ సాదించాలన్న – దాని పై మీలో స్వప్నాలు విరబూయాలి – అవి ఎంత పెద్దవైన కావచ్చు – నిజానికి పెద్ద విజయాలు సాదించాలన్న కళలు కనడానికి సాహాసము కావాలి – అలాంటి గట్స్ చూసిన వారి వైపే సక్సెస్ ద్రుష్టి సారిస్తుంది – వారికి ఎన్నో అగ్ని పరీక్షలు పెడుతుంది – కాని సాహాసము – స్థిర చిత్తము – మొక్కవోని విశ్వాసం తో అడుగులు ముందుకు వేయాలి – అవరోదాలను అదిగా మించాలి – > ఇది మాటల సమయము కాదు – చేతల సమయము – ఇది కబుర్ల తరుణము కాదు యుద్ద భూమిలో కత్తితో కరచాలనం చేయాల్సిన సందర్భము – ఎవరు మడమ తిప్పక పోరాడుతారో వారికే విజయము సంప్రాప్తిస్తుంది – ఎవరు శష బిశాలు పోతారో వారు అవకాశం కోల్పోతారు – అందుకే చొరవ చూపాలి – తెగువ ప్రదర్శించాలి – లక్ష్యము చేరే వరకు శ్రమనే శ్వాసించాలి.

——-సశేషం——-

పై విషయాలన్ని మీ అందరికి తెలిసినవే – ఏమైనా తప్పులు ఉంటె తెలుపుతారని కోరుతున్నాను

R.B.Satyanarayana
Chairman, Annadhara

6/1/2016

🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺

“ జపము ” 4 వ భాగము

1) ఒకటవ స్టేజి :- సాధకులు ఎక్కవలసిన సోపానములు ( మెట్లు ) > సాధకులు తమ తమ జపములో ఎక్కవలసిన సోపానములు 8 ( మెట్లు ) వరకు ఉంటాయి – > ఒకొక్క మెట్టులో జపములో తన జపస్తితిని బట్టి ఒకొక్క రకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి – అవి గమనించుకుంటూ – ముందుకు సాగాలి – > ఒకటవ మెట్టులో బిగినింగ్ జపములో, గతా గతులు సరియిన పద్దతులలో చేసినప్పుడు – అదిక ఊష్ణం తయారై బాడీ లో ఉన్న మాలిన్యాలను – చమట ద్వార బయటికి పంపించును – మనము తినే ఆహారములో వచ్చు దోషాలను – రక్తములో ఉండు కొలెస్ట్రాల్ లాంటి చెడు పదార్ధములను దీర్గ గతిలో పైగతి వాటిని తీసుక వచ్చి జీర్ణా శయములో పడవేయును – అట్టి దానిని గతాగతిలో భస్మీపటలం చేస్తుంది – దీర్గ గతిలో – క్రింది గతి ఆ పొట్టలోకి వచ్చిన కల్మ శాలను వాయువు (carbondioxide) ద్వార బయటికి పంపును – ఈ గతి సరిగాచేయనిచో దేహములోనే చెడు పదార్ధములు – రోగ లక్షణములు అలాగే ఉంది దేహా ఆరోగ్యములో మార్పులు ఉండక – మనస్సు పరిశుద్దము కాక – సాధకులకు వికల్పము వచ్చును – ఈ గతి లోనే లాలాజలం అధికముగా ఉత్పత్తి అవుతూ – జీర్ణ కోశము క్రియ బాగా జరిగి, ఆకలి బాగా పెరుగును – ఆరోగ్యం మెరుగు పడుతూ నిద్ర బాగా వస్తూ – ఒక రకమైన గతము కంటే వాయు మథనములో ఊష్ణం బాగా పెరిగి రక్తములో ఉన్న రోగ లక్షణములు – భస్మి పటల మవుతూ – ప్రాణుడికి కావలసిన ఆశనమును ఉత్పత్తి చేయు – కార్య రంగమునకు మార్గము సులభ తరము చేయును – మనస్సుకు కూడా ఒక రకమైన ఆనందం కలుగును.

2) రెండవ స్టేజి :- సాధకుడు రేగ్యులర్ గా అత్యంత ప్రేమతో ఉదయము – సాయంత్రము కూర్చోను జపములో – జపాను క్రమమును అనుసరించి వాయు మథనము ( గతా గతి ) – > జనో లోకము నుండి ప్రుద్వి లోకము వరకు – గతా గతిని కొనసాగిచినచో శరీరము ఏడూ వందల నుండి – ఎనిమిది వందల సెంటిగ్రేడ్ ఊష్ణం ( electric ) ఉత్పత్తి అయినప్పుడు – బైపోకల్ గా ఉండబడిన ద్రుష్టి మొనోపోకల్ గా మారి – బాహ్య వ్యవహారములో ఉన్న మనస్సు దృష్టితో ఎకమైనప్పుడు – ప్రాణుడి నుండి వెలువడు – ప్రాణ ఝుంకారములో వెలువడు – ప్రణవ నాదముతో చేయు గతా గతి – నాధస్వరము వలే అండ్ “ ఓంకార ” శబ్దము వలే గతా గతిలో వినపడును – > ఆ సంధర్బములో మనస్సు ప్రణవ నాధమునకు పులకించి – బాహ్య స్థితి నుండి అంతర్ముఖ స్థితికి పోను – తను ఎటు నుండి వచ్చినదో అటు తనతో పాటు ప్రాణుడిని కల్పుకొని – > ప్రాణ మనో మిలనము జరుగును – ఈ స్టేజిలో “ ఆశనోత్పత్తి ” జరుగును – ప్రాణ దానిని స్వీకరించును – ఇది రెండవ స్టేజిలో జరుగు ప్రక్రియ – ఇది ప్రతి రోజు – ప్రతి జపములలో జరగ వలెను – ఇక్కడ ఎలాంటి ఆశ్రద్ద చేసినచో – అనగా గతా గతుల విషయములో కాని ప్రాణ మనో మిలనములో కానీ – ప్రణవ నాధముతో మనస్సు పులకించే టట్టు చేయనిచో – గతాగతి అంటే – రంపము కోత లాంటి సౌండ్ కాకుండా – మృదు, మధురంగా వేణునాధ౦గా – గతి అలా చేయాలి – ప్రాణ ఆశన స్వీకారము చేయువరకు అలానే మూడు సూక్ష్మాలపై ద్రుష్టి నిలిపి కూర్చోవాలి – ఇలా చేసినచో సాధకుడు ఎన్ని గంటలైన జపములో కూర్చోగలడు – ఈ ఆశనోత్పత్తి – ప్రాణ స్వీకారము – అత్యంత విలువైన స్టేజి ఇది.

3) మూడవ స్టేజి :- > మూడవ స్టేజిలో తీవ్రమైన గతాగతులు చేస్తూ – గతాగతుల సౌండ్ – మెరుగు పెట్టుకుంటూ కొనసాగినచో ఉత్పత్తి అవుతున్న ఆశనమును ప్రాణ స్వీకరించుతూ రోజు రోజుకు బలిస్టుడవుతూ – చైతన్యము పొంది – తృప్తి చెంది శక్తి పొంది ప్రాణ + మనసు మిలనము జరిగి తను వచ్చిన – మార్గముకై పోవుటకు ప్రయత్నమూ చేయును – అప్పుడు ప్రాణ ఆశన స్వీకారము చెయుటము చూచి – మనసు శాంతి పొందును – ఇక్కడ “ సోమరసము ” వచ్చును ఇది ప్రతి జపములో మనసు + ప్రాణ కలిస్తే తృప్తి పొందుతూ – జప స్థితి నుండి తపస్సు స్థితికి మారడానికి ప్రయత్నిస్తుంది – ఆ యొక్క స్టేజిలో సాధకుడికి ఒక రకమైన ఆనంద స్థితి – దానితో పాటు జ్ఞానం వికసిస్తూ – వైరాగ్య స్థితి ప్రారంభించును – ఈ స్టేజిలో సాధకులు బహు ఆనందంతో జపము చేయాలి.

4) నాలగవ స్టేజి :- సాధనలో నాలగవ స్టేజి నందు రోజు రోజుకు ఆశన స్వీకారంతో – ప్రాణ ఉత్సాహ భరితుడై – మనసు ఆనంద ఉల్లాసంతో – జపములో “ మధు రసము ” దోరుకును – ఆ రసము ప్రాణ స్వీకారముతో మత్తు వస్తుంది – ఆనందం వస్తుంది – బుద్ధి వికసిస్తుంది – వాక్ శుద్ధి వస్తుంది – జడత్వం పోయి – ప్రాణ శక్తి + మనోచేతనము పుష్టిని పొందును – దైవ సామ్రాజ్యమునకు దగ్గరవుతాడు – జపములో భయము వస్తుంది – చిత్ర విచిత్రాలు కనబడుతాయి – దేవతలు – వాయిద్యాలు – పక్షుల కిలకిల రాగాలు రవరవలు – ఋషులతోపాటు అనేక దృశ్యాలు – టన్నల్ చీకటి పోయి ఉషోదయం వస్తుంది ఇక్కడ తప స్థితి మొదలవుతుంది – దేహేంద్రియాలు సంపూర్ణముగా మేలుకొని – స్థూలపు మురికిని పోగొట్టుకోవాలి ఇక్కడ ఆహారనియమాలు కచ్చితంగా అమలుచేయాలి – జపము యోక్క రేగ్యులారిటిని బ్రేకు చేయకూడదు.

5) ఐదవ స్టేజి :- ఈ స్టేజిలో పైవాటితోపాటు – తపస్సులో తీవ్రత పెరిగినచో అనేక విషయములు గోచరమవుతూ – అనేక రకాల సౌండ్స్ – లోన ఎంతో సంపద దొరుకుతుంది – ఈ స్థితిలో “ సర్వ విద్య స్పైష మహిమా భువి ” అని తెలియ వస్తుంది – ఈ స్టేజిలోనే అమృత పానం అవుతుంది – జపములో ఎలాంటి అంతరాయము – మనో వికల్పం లేకుండా – తపస్సు జరిగినచో – ఆత్మ దర్శనమునకు ఉప్పక్రమిస్తుంది – సాధకులు ఇక్కడ అప్ప్రమత్తంగా ఉంటూ మీ దెహములొని దేవుణ్ణి చూచే ప్రయత్నమూ చేయాలి – ఎలాంటి వికల్పము లకు గురి కాకుండా చూసుకోవాలి.

6) ఆరవ స్టేజి :- ఇక్క్కడ ప్రాణ + మనస్సు + ఆత్మ ఒకటిగా మారిపోతాయి – ఆత్మకు శాంతి దొరుకుతుంది – అప్పుడు దైవ సామ్రాజ్యమునకు మొదటి మెట్టు – సాధకులు పట్టుదలతో – జ్ఞానోత్తర కర్మలు చేస్తూ – జ్ఞాన వంతుడై – సమాజ సేవకు ఉపక్రమించాలి – సర్వ అంతర్యామి అయిన దైవాన్ని వీక్షించాలి – ఈ స్థాయి యందు సాధకుడు ఏకాంత ప్రియుడు కాగలడు – మనుషుల సహవాసము విసుగు కల్గిస్తుంది – శబ్దము బాధిస్తుంది – భోజనము వద్దు అని అనిపిస్తుంది – నడుచుట కష్ట దాయక మవుతుంది – వ్యవహారము చాలనిపిస్తుంది – చివరకు నిద్ర కూడా కాల హరణం అనిపిస్తుంది – మొత్తం మీద మౌన ప్రవుత్తితో సుఖము కనబడి – అన్ని విధముల స్థూల దేహ కర్మల నుండి దేహ శక్తి నష్ట మగుట గమనించ వచ్చును – ఇలా దేహము సూక్ష్మ మగుచుండగా మనస్సుకు తనదే అయిన ముందు చూపు రావటం మొదలవుతుంది – ఆ స్థితిలో మనస్సుకు అనేక ఘటనలు – వెనుకటివి లేదా ముందు జరుగ బోవునవి తెలియ గలవు – ఇచ్చట మెలుకవ అవసరము – ఈ స్తాయిలో పొరపాటు చేయకూడదు – సాధకునకు వచ్చు గండమేమిటంటే – దుర అహంకారము మరియు దుస్వార్ధము – ఎదో కనుగొంటినను గొప్పతనము – ఇతరులు నాకంటే అల్పులు మొదలైన భావనలు వచ్చి వ్యక్తి మోసపోతాడు – అల్పంతో అనంతతను పొందు చపలత – అతురత – చివరకు ప్రయోగములు – అధ్బుతములను చేయుటకు దుస్ ప్రేరణ – వీటన్నింటి వలన సాధన నాశనమై వ్యక్తి అగాతమునకు చిక్కి – బహు బాదయుతమైన చావును పొందవచ్చును.

7) ఎడవ స్టేజి :- ఈ స్టేజిలో బ్రహ్మత్వము పొందుతారు – భక్తీ – జ్ఞానము వికసించి బ్రహ్మ విదులుగా మారి జ్ఞానోత్తర కర్మకు ఉపక్రమిస్తాడు – ఆత్మ చేతనము అంతరికతకు ముఖ్య కారణ మైనందున – దానిని తెలుసుకున్నప్పుడు వ్యక్తికి అంతయు వ్యక్తమవుతుంది – అది తెలిసినప్పుడు ఆనందము తరువాత శాంతియు లభ్యమై – సత్య దర్శనమవుతుంది – ఇక్కడ భక్తి జ్ఞానము ప్రధానము.

8) ఎనిమిదొవ స్టేజి :- సాధకులు ఎన్నో మైళ్ళు – ఎన్నో స్టేజిలు శ్రమతో తపస్సులో దాటుకుంటూ వచ్చి ఆత్మ దర్శనానంతరం – దైవ సామ్రాజ్యములో అడుగు పెట్టి భక్తి, జ్ఞానముతో పాటు బ్రహ్మత్వము పొంది – సర్వము అర్ధం చేసుకొని జ్ఞానోత్తర కర్మలు చేస్తూ క్రియ వానులుగా మారుతారు – ఈ స్థితికి సాధకులు చేరుకోవాలి.

——-సశేషం——-

పై విషయాలు మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె తెలుపుతారని సవినయముగా మనవి చేస్తున్నాను.

R.B.Satyanarayana
Chairman, Annadhara

6/3/2016

🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

“ ప్రాణ ” ౩వ భాగము

ప్రాణ 2 వ భాగము తరువాయి – > మానవులకు దీర్ఘ శ్వాసలు ( గతా గతులు ) ఎంత ఇంపార్టెంట్ టో దీర్ఘ శ్వాసల ఆవశ్యకత ఎంతో తెలుసుకుందాం – > మన ఆదీనములో ఉండే నీటిని సరిగా తీసుకుంటున్నామా !లేదా ! అన్న ఆలోచన గాని – మన స్వాధీనములో ఉండే ఆహారానన్న శరీరానికి కావలసింది తీసుకుంటునామా ? అన్న ఆలోచన గానీ లేని మనుషులకు మన ఆదీనములో లేని గాలిని దీర్ఘంగా పీల్చుకుంటున్నమా ? లేదా ? అన్న ఆలోచన ఊహల్లో కూడా రాదు – > దీర్ఘ శ్వాసలు అంటే ఏమిటి ? ఎందుకు మంచిది అన్న విషయము ఎంతో మందికి అసలు తెలియనే తెలియదు – > మామూలు శ్వాసకి – దీర్ఘ శ్వాసలకి గల భేధమేమిటో తెలుసుకొని – దీర్ఘ శ్వాసలు ఆలోచిద్దాము.

1)మామూలు శ్వాస అంటే :- > మనందరమూ ప్రతి రోజు మాములుగా పీల్చుకునే శ్వాస – ఇందులో ఏమి జరుగుతుందో తెలుసుకుందాము – మనము నిమిషానికి 18నుండి అంతకంటే ఎక్కువ శ్వాసలు తీసుకుంటాము – మాములుగా ఉన్నప్పుడు ప్రతి శ్వాసకి ౩౦౦ నుండి 400 మి||లీ|| గాలిని పీల్చుకుంటూ ఉంటాము – మన ఊపిరి తిత్తులు ప్రతి శ్వాసకి 500 నుండి 600 మి||లీ|| గాలిని పీల్చుకునే ఏర్పాటును కలిగి ఉన్నాయి – మనం ప్రతి శ్వాసకి ౩౦౦ నుండి 400మి||లీ||గాలిని మాత్రమె పీల్చినపుడు ఆ కొద్ది గాలి ఊపిరి తిత్తుల చివరి వరకు వెళ్ళలేదు – దానితో ఊపిరి తిత్తులు పై భాగమే ( ఛాతీ భాగము ) నిండుతుంది – ఇలా కొద్దిగాలి పీల్చినప్పుడు ఛాతీ భాగం వరకూ ఈగాలి ఎక్కి ఆ భాగాన్ని పైకి లేపుతుంది – గాలి పీల్చినప్పుడు ఎవరికైతే ఛాతీ భాగం పైకి లేచి క్రిందకు దిగుతూ ఉంటుందో వీరు గాలిని ఊపిరి తిత్తుల చివర భాగం వరకు చేరదు – అందువల్ల గాలి పీల్చినప్పుడు గాని – వదిలినప్పుడు గాని ఊపిరి తిత్తుల చివరి భాగం అయిన డొక్క భాగంలో కదలికలు వీరికి రావు – ఇలా కదలికలు డొక్క భాగంలో రాకుండా ఛాతీ భాగంలో వచ్చేవారిని సాధారణ శ్వాస లేదా మామూలు శ్వాస చేస్తున్నారని చెప్పవచ్చు – మామూలు శ్వాస చేసే వారికి నిమిషానికి శ్వాసలు ఎక్కువగా ఉండడం వలన గాలిని పీల్చేటప్పుడు గాని – వదిలేటప్పుడు గాని ఛాతీ కదలికలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి – ఈ విధముగా మామూలు శ్వాసలు తీసుకునే వారికి 60 సం||ల నుండి 80 సం||ల లోపు వరకే ఆయుష్షు ఉంటుంది – శక్తి తక్కువ – అలసట ఎక్కువగా ఉంటుంది.

2) దీర్ఘశ్వాస అంటే :- > నిమిషానికి శ్వాసలు 15కంటే తక్కువ ఉంటె వారిలో దీర్ఘశ్వాసలు జరుగుతాయి – వీరు మాములుగా ఉన్నప్పుడు ప్రతి శ్వాసకి 500 నుండి 600 మిల్లీ లీటర్ల గాలి వరకు పీల్చుకోగలుగుతారు – సర్వ సాధారణంగా ఉన్నప్పుడు ఊప్పిరితితులు ప్రతి శ్వాసకి ఎంత గాలిని పీల్చుకోవడానికి నిర్మితమైనవో అంత గాలిని వీరు పూర్తిగా పీల్చుకుంటున్నారు – > 500 నుండి 600 వందల మిల్లి లీటర్ల గాలిని పీల్చినప్పుడు గాలి ఒత్తిడి ఎక్కువ గాబట్టి – ఆ పీల్చిన గాలి మెల్లగా ఊపిరితిత్తుల చివరి భాగాన్ని చేరుతుంది – > దానితో ఊపిరి తిత్తుల చివరి భాగం నిండుతుంది – ఊపిరి తిత్తుల చివరి భాగం వరకూ మనం పీల్చిన గాలి ఎక్కింది – అనడానికి గుర్తు ఏమిటంటే – గాలిని పీల్చేటప్పుడు డొక్క భాగం పైకి లేస్తుంది – మరలా క్రిందకు దిగుతుంది – గాలిని పెల్చేటప్పుడు గాని వదిలేటప్పుడు గాని ఎవరికైతే డొక్క భాగంలో కదలికలు వస్తాయో వారు దీర్ఘ శ్వాసలు తీసుకుంటునట్లు తేలిపోతుంది – > పాలు త్రాగే పిల్లవాడు ఈ రకమైన శ్వాస క్రియను చేస్తూ ఉంటాడు – డొక్క భాగంలో కదలికలు వచ్చే వారికి గాలిని పీల్చేటప్పుడు ఛాతీ భాగంలో కదలికలు రావు – దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి నిమిషానికి శ్వాసల సంఖ్య 10 నుండి 15 ఉంటుంది – కాబట్టి ప్రతి శ్వాసకి పీల్చుకునే సమయం ఎక్కువగా ఉంటుంది – > అందు చేత ఎక్కువ సమయములో ఎక్కువ గాలిని మెల్లగా పీల్చుకుంటారు – గాలి ఇలా మెల్లగా ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల పీల్చుకున్న గాలి పీల్చుకున్నట్లు ఛాతీలో నిలువ ఉండక ( ఊపిరి తిత్తులు పైభాగంలో ) ఊపిరి తిత్తుల చివర భాగాన్ని ప్రతి సారి చేరుతూ ఉంటుంది – ఈ కారణం చేత దీర్ఘ శ్వాస చేసిన వారికి ఛాతీలో గాలి నిలవ ఉండక – ఛాతీ శ్వాస క్రియలో పైకి క్రిందకీ కదలదు – ఇదే సరియిన శ్వాస క్రియ అంటే – > ఇలా దీర్ఘ శ్వాస క్రియ మనలో జరిగేటప్పుడు గాలి పీల్చుకుంటున్నామా – వదులుతున్నామా అనే ప్రక్రియ మన ఊహకు అందనంత నెమ్మదిగా జరుగుతుంది – గాలి కదలికలు అసలు తెలియవు – శ్వాస క్రియ అనేది మనకు తెలియకుండా – అప్రయత్నంగా జరిగే ప్రాణ క్రియ – మనలో ఇలా దీర్ఘ శ్వాసలు జరిగితే మన ఆయుషు 100 నుండి 200 సంవత్సరముల వరకు ఉంటుంది – నిరంతరము తరగని శక్తి మనలో దాగి ఉంటుంది – అలసట, ఆయాసము అనేవి రోజుకు 20 గంటలు పనిచేసినప్పటికీ రావు – > ఇక్కడ మనకు ఇంకో సందేహము కలుగుతుంది – దీర్ఘ శ్వాసలు తీసుకునే వారు నిమిషానికి 10 – 15 సార్లు తీసుకుంటే – మామూలు శ్వాసలు తీసుకునే వారు 20 – 25 సార్లు తీసుకుంటున్నారు – కాబట్టి తక్కువ సార్లుతో ఎక్కువ గాలి లోపలకు వెళ్లిన – ఎక్కువ సార్లుతో తక్కువ గాలి లోపలకు వెళ్లిన ఒక్కటే గదా ! – గాలిని లోపలకు పంపడం ముఖ్యం గాబట్టి 2 సందర్భాలలోనూ అంతే గాలి చేరుతుంది – ఎలా పీల్చుకుంటే ఏమిటిలే అని అనిపిస్తుంది – ఎంత గాలి కావాలో అంత గాలిని శరీరమే పీల్చుకుంటుంది – > ఈ గొడవంతా మన కెందుకు అని కొందరకు అనిపిస్తుంది – పైన వచ్చిన సందేహము వినేసరికీ – చాలా మందికి రెండింటికి బేధం ఏముంటుంది అని అనిపిస్తుంది – బేధం ఉందో లేదో – ఉంటె ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

3) మనం ప్రతి శ్వాస ఊపిరితితులలోని శ్వాసనాళాలా గుండా ప్రయాణించి – ఊపిరితిత్తుల భాగాలలో ఉండే రక్తాన్ని శుద్ది చేసే “ అల్వియోల్స్ ” ( గాలి తిత్తులు ) ని చేరుతుంది – ఆ ఆల్వియోల్స్ లోనికి చేరిన ప్రాణ వాయువు రక్తాన్ని శుద్ధి చేస్తుంది – “ అల్వియోల్స్ ” అనేవి ఎక్కువ శాతం ఊపిరితిత్తుల చివరిభాగాలలో ఉంటాయి – మనం పీల్చిన గాలి శ్వాసనాళాలలోనే ఉంటె లాభం ఉండదు – మనకు ఆకలైనపుడు ఆహారం ఎక్కడో ఉంటె లాభం ఏముంది ? అది పొట్టలోనికి వెళితే లాభం ఉంటుంది – అలాగే మనము పీల్చుకున్న గాలి రక్తాన్ని శుద్ధిచేసేదగ్గరకు ఎంత వెళుతున్నది అన్నది ప్రధానము గాని గాలి గొట్టాలలో ఉన్నదీ ప్రధానము కాదు – గాలి గొట్టాలలో ఉన్న గాలి వల్ల నిరూప యోగము – మనము ప్రతి సారీ పీల్చుకునే గాలిలో నుండి కొంత శాతము గాలి ఎప్పుడూ గాలి గొట్టాలలో నిలువ ఉండిపోతుంది – ఇలా ప్రతి సారీ జరుగుతుంది – మనము మేడమీద నీల టాంకును కట్టి – పైపుల ద్వారా క్రిందకు నీళ్లను తేచ్చుకుంటాము – మనకు నీళ్ళు క్రిందకు రావాలంటే ముందు పైపులు నిండాలి – మనము క్రింద నుండి ఎంత నీరు వాడుకున్నప్పటికి నీళ్ళ పైపులలో కొంత నీరు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటుంది – > అలాగే మన గాలి గొట్టాలలో కూడా ఎప్పుడూ అలా నిలవ ఉండే గాలి ఎంత అంటే 140 మిల్లి లీటర్లు – మనము పీల్చిన ప్రతి శ్వాసలో నుండి ఈ 140 మిల్లి లీటర్ల గాలి పోగా మిగితా గాలి మాత్రమె రక్తాన్ని శుద్ధి చేసే వద్దకు చేరుతుంది – మామూలు శ్వాస తీసుకునే వారికి – దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి రక్తాన్ని శుద్ధి చేసే దగ్గరకు వెళ్ళే రక్త పరిమాణములో ఎంత బేధము ఉంటుందో తెలుసుకుందాం.

4) మామూలూ శ్వాస తీసుకునే వారికి :- > వీరు నిమిషానికి 20 శ్వాసలు తీసుకుంటూ – ప్రతి శ్వాసకి 300 వందల మిల్లి లీటర్ల చొప్పున – గాలిని పీల్చుకుంటే మొత్తము నిమిషములో ఊపిరితిత్తులలోనికి ఎక్కిన గాలి – 6000 వేల మిల్లి లీటర్ల అంటే 6 లీటర్ల గాలి – గాలి గొట్టాలలో నిరుపయోగంగా ఉండిపోయే గాలి 140 మిల్లి లీటర్లు – ప్రతి శ్వాసలో నుండు 140 మిల్లి లీటర్లను తీసి వేయాలి – అంటే 300-140 = 160 మిల్లి లీటర్ల గాలి ప్రతి శ్వాసకు రక్తాన్ని శుద్ధి చేసే “ ఆల్వియోల్స్ కు ” చేరుతుంది – > నిమిషానికి 20 శ్వాసలు లెక్క వేస్తే 20×160 = 3,200 మిల్లి లీటర్ల గాలి ప్రతి నిమిషానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి వీరికి ఉపయోగ పడుతుంది – అంటే 3 లీటర్ల, 200 మిల్లి లీటర్ల గాలి ( మూడుంపావు లీటర్లు ).

5) దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి :- > వీరు నిమిషానికి 10 శ్వాసలు తీసుకుంటూ – ప్రతి శ్వాసకి 600 మిల్లి లీటర్ల చొప్పున గాలిని పీల్చుకుంటే మొత్తము నిమిషములో ఊపిరితిత్తుల లోనికి ఎక్కిన గాలి 6,000 మిల్లి లీటర్లు – అంటే 6 లీటర్ల గాలి – > గాలి గొట్టాలలో నిరిపయోగంగా ఉండే 140 మిల్లి లీటర్ల గాలిని ఒక శ్వాసలో పీల్చిన గాలిలో నుండి తీసి వేయగా 600-140 = 460 మిల్లి లీటర్ల గాలి ప్రతి శ్వాసకు రక్తాన్ని శుద్ధి చేసే “ అల్వియోల్స్ కు ” చేరుతుంది – నిమిషానికి 10 శ్వాసల చొప్పన అంటే – 10×460 = 4,600 మిల్లి లీటర్లు అంటే 4 లీటర్ల, 600 మిల్లి లీటర్ల గాలి ప్రతి నిమిషానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది – > మామూలు శ్వాసలు తీసుకున్న వారు – దీర్ఘ శ్వాసలు తీసుకున్నవారు ఇద్దరు కూడా నిమిషానికి ఊపిరితిత్తుల లోనికినింపిన గాలి మీరనుకున్నట్లు ఒక్కటే ! – అది ఆరు లీటర్లు. కాని రక్తాన్ని శుద్ధి చేయ డానికి వెళ్ళే సరికి చాలా బేధము ఉంది – అది 1,400 మిల్లి లీటర్లు – సుమారు 1.1/2 లీటర్ల గాలి ఒక నిమిషానికి తేడా వస్తున్నది – > అంటే గంటకు 84 లీటర్ల గాలిని మామూలు శ్వాసలు తీసుకునే వారికంటే దీర్ఘ శ్వాసలు తీసుకునే వారికి ఎక్కువగా రక్తాన్ని శుద్ది చేయడానికి చేరుతున్నది – > అలాగే 24 గంటలలో అయితే 2,016 ( రెండు వేల పదహారు లీటర్ల ) గాలిని మామూలు శ్వాసల వారికంటే దీర్ఘ శ్వాసల వారు అదనంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి పీల్చుకోగలుగుతున్నారు – అమ్మో ! ఎంత ఎక్కువో అనిపించవచ్చు.

6) ఏ మాత్రము పని చేయకుండా – అలుపు రాకుండా రోజంతా అలా కూర్చొని ఉండే వ్యక్తీ నిమిషానికి 6 లీటర్ల చొప్పున ఒక రోజులో తన రెండు ఊపిరి తిత్తుల ద్వారా పీల్చుకునే మొత్తము గాలి 8,640 లీటర్లు ఉంటుంది – > శారీరక శ్రమ చేస్తే ఇంకా ఎక్కువ గాలిని పీల్చు కోగలుగుతాడు – > మామూలు శ్వాసలు తీసుకున్న – దీర్ఘ శ్వాసలు తీసుకున్న ఒక రోజులో ప్రవేసించేది 8,640 లీటర్లు – ఇందులో రక్తాన్ని శుద్ధి చేయడానికి మామూలు శ్వాసల వారికి ఉపయోగ పడేది ఒక రోజుకి 4,608 లీటర్లు – అదే దీర్ఘ శ్వాసల వారికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగ పడేది – అయితే ఒక రోజుకి 6,624 లీటర్లు – > మామూలు శ్వాసల వారికి – దీర్ఘ శ్వాసల వారికి శరీరములో – ప్రాణ వాయువు వినియోగంలో ఒక రోజులో వచ్చే బేదం – 2,016లీటర్లు – పైన చెప్పిన బెదానికి ఇదంతా వివరణ – > గాలిని అందరం పీల్చుకోవడానికి పీల్చుకుంటున్నాము కాని – అందరికి పీల్చినది అంత రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగ పడడం లేదు – > దీర్ఘ శ్వాసలు తీసుకున్న వారికే పీల్చుకున్న గాలి వలన ఎక్కువ ప్రయోజనం కలుగుచున్నది – నిమిషానికి 6 లీటర్ల గాలి పీల్చుకోవడం అనేది మన అందరి శరీరాలకు తప్పని సరి – > శరీరానికి అంత అవసరమయ్యి నిమిషానికి అంత గాలిని కనీసం పీల్చుకుంటున్నది – > ఊపిరి తిత్తులలో వచ్చే కదలికలను బట్టి కొందరు ఆ గాలిని 10 సార్లుగా పీలిస్తే మరికొందరు 20 సార్లుగా పీలుస్తున్నారు – > ఇంకొందరు 25 సార్లు కూడా తీసుకుంటున్నారు – ఇలా గాలిని ఎవరు ఎన్ని సార్లుగా తీసుకోవడం అనేది శారీరక శ్రమను బట్టి – ఆహారాన్ని బట్టి – ఆలోచనలను బట్టి – ఆరోగ్యాన్ని బట్టి – ఆధార పడి ఉంటుంది – తీసుకునే శ్వాసల సంఖ్యను బట్టి ప్రాణ వాయువు వినియో గింప బడడం ఆదార పడి ఉంది – > అలాగే ఆ శ్వాసలను బట్టే శక్తి – ఆ శ్వాసలను బట్టే – ఆయుష్షు – ఆ శ్వాసలను బట్టే ఆలోచనలు – ఆ శ్వాసలను బట్టే ఆరోగ్యము మొదలగునవి అన్నీ ఆధార పడి ఉన్నాయి – మొత్తం శరీరము అంత ముఖ్యంగా ఆదారపడి నడుస్తున్నది ప్రాణ వాయువు మీదే – అలాంటి విలువైన ప్రాణము విరివిగా అందాలంటే దీర్ఘ శ్వాసల ద్వారా ఆశనోత్పత్తి జరిపి ప్రాణుడికి ఆహారము అందించడమే పరిష్కారము – > ఎక్కువ శ్వాసలతో ప్రాణ వాయువు మనలోకి చేరేది బహు తక్కువ – దానితో ప్రాణ వాయువు లోపాలు వచ్చి కణాలకు కావలసినంత ప్రాణ శక్తి అందక – అన్నీ విషయాలలో – అన్నీ అవయవాలాలో రకరకాల నష్టాలు జరుగుతుంటాయి – > ప్రతి చిన్న పని చేయడానికి కూడా ఎంతో అలసట చెందుతున్నారంటే – దానికి ఎక్కువ ప్రాణ శక్తి లోపమే – > వెనుకటి రోజులలో అయితే శారీరక శ్రమ చేయని పండితులు – జ్ఞానులు – రాజులు మొదలగు వారు – శరీర సాధన కొరకు ఆసనాలు ప్రాణాయామాలు తప్పని సరిగా చేసి ఆ లోటును సరిదిద్దేవారు – కాబట్టి విజ్ఞ్యులైన మీరు శ్రద్ధగా ఆలోచించండీ.

పై విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

6/5/2016

🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺

“ కర్మ ” ప్రారబ్ధము 3 వ భాగము

1)“ మనం శాశ్వతంగా జీవించేవారివలె ప్రవర్తిస్తూ ఉండే వాళ్ళం – యుక్త వయసులో ప్రతి వాడూ అలాగే అనుకున్నాడు – కాని అది వాస్తవమా ? మనం మరణి౦చ బోతున్నామని ఎవరైనా అనుకున్నారా ? ” – > నీవు నీ విధిని నిర్ణయించ దలుచుకుంటే – పునర్జన్మ ఎందుకు ఎలా సంభవిస్తుందో అవగాహన చేసుకోవాలి – అది చాలా సులభం కూడా – > మరణించటానికి ఎవారూ ఇష్టపడరు – చర్మం ముడతలు పడకుండా, జుట్టు నేరవకుండా, కీళ్ళ వాపు రాకుండా సంపూర్ణారోగ్యంతో శాశ్వతంగా జీవించి ఉండాలనే మనలో చాలా మంది కోరుకుంటారు – అది సహజం ఎందుకంటే సుఖ పడటం అనేది జీవితపు ప్రప్రధమ సూత్రం – సుఖ జీవనం గడుపుతూ శాశ్వతంగా బ్రతికి ఉండగలిగితే యెంత బాగుంటుంది ! – > చావు తప్పించుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం యెంత సహజమంటే – చావు ఉంటుందని కూడా ఊహించలేడు – “ ప్రతి జీవికి మరణం తప్పదు – కాని ఇది నా విషయంలో వర్తించదని ఇన్నాళ్లు అనుకునేవాల్లము – ఇప్పుడిక చేసే దేముంది ? ” – > మరణాన్ని గురించి కాని – మరణానంతరం ఎం జరుగుతుంది అని కాని మనలో చాలామంది ఆలోచించారు – మరణం సర్వమునకూ సమాప్తి అని కొందరంటారు – కొంత మంది స్వర్గనరకాలు ఉన్నాయంటారు – మరికొంత మంది ఈ జన్మ మనం అనుభవించిన – అనుభవింపబోతున్న – పూర్వ అపరాజన్మలలో ఒకటి అంటారు – ప్రపంచ జనసంఖ్యలో మూడింట రెండువంతులకంటే ఎక్కువమంది – 150 కోట్లమంది – పునర్జన్మ తప్పించుకోలేనిదని నమ్ముతారు – పునర్జన్మ అనేది కేవలం నమ్మకం వల్ల సంభవించేది కాదు – అది తాత్కాలిక భావమూ కాదు – భయంకరమైన ముగింపును తప్పించుకోవటానికి కల్పించిన కల్పనా కానే కాదు – మరి అదేమిటంటే మన పూర్వ అపర జన్మలను గురించి స్పష్టంచేసే ఒక నిర్దిష్టమైన శాస్త్రం.

2) జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందడానికి మార్ఘము ఉంది అని – ప్రాచీన భారత దేశపు ఋషులు తెలిపినారు – ఈ అనంతమైన జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందటమే మానవ జీవిత పరమార్ధమని తెలియ చేస్తున్నారు – మళ్ళీ రావద్దని కూడా వారు హెచ్చరిస్తున్నారు – ఈ మార్ఘంలో మొదటిమెట్టు “ నేను ఈ దేహము కాను ” అనే జ్ఞ్యానము “ అహం బ్రహ్మస్మి ” “ నేను పరిశుద్ధమైన ఆత్మను ” అని వేదాలు ప్రకటిస్తున్నాయి – జీవాత్మలుగా మన అందరికీ భగవంతుడితో సంభందము ఉంది – జీవాత్మను – పరమాత్మ అనే అగ్ని నుంచి వెలువడే నిప్పు రవ్వతో పోల్చ వచ్చు – నిప్పు రవ్వ – నిప్పు ఒకే గుణాలు ఉన్నట్లు – ప్రత్యేకాత్మకు – పరమాత్మకు ఆధ్యాత్మిక గుణాలు ఒక్కటే – ఇద్దరికీ నిత్యత్వం – జ్ఞ్యానానంధం అనే ఆధ్యాత్మిక గుణాలు సమానం – జీవులందరూ మొదట ఆధ్యాత్మిక ప్రపంచములో భావాతీత ప్రేమగల – భగవత్ సేవకులుగా నివసిస్తూ ఉంటారు – జీవుడు ఎప్పుడైతే ఆ సంభందాన్ని వదులుకుంటాడో – అప్పుడు భౌతిక శక్తి ప్రభావానికి లోనవుతాడు – తరువాత కర్మను బట్టి విభిన్న శరీరాలు ధరిస్తూ జనన మరణ చక్రములో చిక్కుకుంటాడు – పునర్జన్మ నుంచి విముక్తుడు కావటానికి – ప్రతివాడు కర్మ నియమాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి – కర్మ సిద్ధాంతము భగవన్నిర్మితము – ఎట్టి లొసుగులు లేనిదీ – వీటికి సవరణలు చేయటం ఉండదు – దీనిలో ఎవరికీ ఎట్టి మినాయింపులు ఉండవు – బందు ప్రీతీ, ఆశ్రిత జన పక్షపాతము – లంచాలు – రెకమండేషన్లు ఏమి ఉండవు దీనిముందు అందరూ సమానులే – > సాక్షాత్తు శ్రీ రామ చంద్రుని తండ్రియే అయినప్పటికీ దశరధుడు పుత్ర వియోగంతో మరణించాడు – > సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీ కృష్ణుని తల్లిదండ్రులైన – దేవకి వసు దేవులకు – కారా గార వాసం తప్ప లేదు – పుత్ర వియోగ దు:ఖము తప్ప లేదు – ఇటువంటి స్థిరమైన శాసనం కర్మ సిద్ధాంతం – ఈ కర్మ సిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధార పడి ఉంటుంది.

3) కర్మ అంటే ఏమిటి ? ఎన్ని రకాలు ? మనము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనము చేసే పనులు అన్నీ కర్మలే – ఇలా ప్రతిమానవుడూ పుట్టిన దగ్గర నుండి చచ్చే అంత వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు – > ఇలా కర్మలు చేస్తే ఆ కర్మలకు ఫలితము వస్తుంది – మనం చేసే ప్రతి కర్మ కూడా ఎప్పుడో ఒకప్పుడూ ఫలితా నిచ్చే తీరుతుంది – అవి ఫలితాల నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు – అవి 1) ఆగామి కర్మలు – 2) సంచిత కర్మలు – 3) ప్రారబ్ధ కర్మలు –
1) ఆగామి కర్మలు :- ఇప్పుడు మనము చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే – అయితే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితానిచ్చి శాంతిస్తాయి – > కొన్ని అప్పటికప్పుడూ ఫలితానివ్వకుండా తరువాత ఎప్పుడో ఫలితానివ్వడం కోసం కూడా బెట్టి ఉంటాయి – ఉదాహరణకు :- మనం భోజనం చేస్తాం – అది కర్మ – వెంటనే మనకు ఆకలి తీరుతుంది – అది కర్మ ఫలము – నీరు త్రాగుతాము – అది కర్మ – దప్పిక తీరుతుంది – అది కర్మ ఫలము – ఎవరినైనా కోపంతో తిడుతాము – అది కర్మ – అవతలివాడు బలము గల వాడైతే – చెంప పగల గోడుతాడు – అది కర్మ ఫలము – ఇలా కొన్ని కర్మలు అప్పడికప్పుడే ఫలితానిచ్చి శాంతిస్తాయి – > కొన్ని కర్మలు ఫలితానివ్వవు – ఉదాహరణకు :- ఎదురుగా లేని వాణ్ని తిడుతాం – వాడి మీద నిందలు వేస్తాం – కాని వాడు ఎదురుగా లేడు గనుక – అప్పటికప్పుడూ ఫలితము రాదు – > దాన ధర్మాలు చేస్తాం – పుణ్య కార్యాలు చేస్తాం – అవన్నీ వెంటనే ఫలితానిచ్చేవి కావు – మన పిల్లలు పరీక్షలు వ్రాస్తారు – ఫలితము 2 నెలల తరువాత ఎప్పుడో వస్తుంది – ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడూ ఫలితానివ్వలేక – తరువాత ఎప్పుడో ఫలితానివ్వటానికి కూడా బెట్టబడి ( సంచితం చేయబడి ) ఉంటాయి – ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.
2) సంచిత కర్మలు :- ఇంతకు ముందు జన్మలో చేసి తరువాతెప్పుడో ఫలితము ఇవ్వటానికి కూడ బెట్టబడిన – కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడూ ఫలితానిచ్చి – శాంతించినవి పోను – మిగిలిన కూడ బెట్టబడిన కర్మలను – అదే విధంగా అంతకుముందు – అనేక జన్మలలో కర్మల నుండి ఖర్చు అయినయి పోగా – ఒక జన్మ నుండి మరొక జన్మకు – మోసుకుంటూ వచ్చిన కర్మలను – సంచిత కర్మలంటారు – > జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన – ఈ సంచిత కర్మలు – మాత్రం జీవున్ని విడిచి పెట్ట కుండా – అతడితో ప్రయాణమై వస్తుంటాయి – మనం అద్దె ఇళ్ళలో ఉండి ఒక ఇంటి నుండి – మరొక ఇంటికి మారే టప్పుడూ ఆ ఇంటిలో మనము సంపాదించిన – డబ్బు – వస్తువులను – అలాగే అంతకుముందూ ఇళ్ళలో ఉన్నప్పుడూ సంపాదించిన డబ్బు – వస్తువులలో ఖర్చై పోయినవి పోగా – మిగిలిన డబ్బు – వస్తువులను కలిపి ఎలా మూట గట్టుకొని వేల్తామో – అలాగే జీవుడు భగవంతుడిచ్చిన – అద్దె కొంపలాంటి ఈ శరీరాన్ని విడిచి – వెళ్ళే టప్పుడూ ఆయా శరీరాలలో ఉన్నప్పుడూ సంపాదించిన కర్మ ఫలాలను – మూట గట్టుకొని తగిన మరొక అద్దె కొంపలాంటి – శరీరాన్ని వేత్తుక్కుంటూ వెళతాడు – ఇలా తీసుకవేల్లె మూటలే సంచిత కర్మలు.
3) ప్రారబ్ధ కర్మలు :- అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయాణిస్తాయని చెప్పుకున్నాం – ఏ రోజు అయినా శరీరము విడిచిపెట్టే సమయములు – అప్పుడూ అతడి ఎక్కౌంటులో ఉన్న సంచిత కర్మల నుండి – ఏ కర్మ లైతే పక్వానికి వస్తాయో – పండుతాయో – ఫలితానివ్వటానికి – సిద్ధంగా ఉంటాయో వాటిని – ప్రారబ్ధ కర్మలు అంటారు – > ఆప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెత్తుకుంటూ వెళ్లి – తగిన శరీరంతో జీవుడూ మళ్ళీ ఈ లోకములో ప్రవేశిస్తాడు – అలా వచ్చిన జీవుడికి ఆ ప్రారబ్ధ కర్మ ఫలాలన్నీ అనుభవించటం – పూర్తయ్యే దాక ఈ శరీరము ఉంటుంది – ఆ కర్మ ఫలాలు అనుభవించటం పూర్తికాగానే – ఆ క్షణములోనే ఆ శరీరము వదిలి పోతుంది – ఒక్క క్షణం ఉండమన్న ఉండదు – అప్పడి దాక దేవుడా ! నన్ను ఎప్పుడూ తీసుకేల్తావయ్యా – అని ఎంత ఏడ్చినా – మ్రోక్కినా – ప్రార్ధించినా ప్రయోజనము లేదు – ప్రారబ్ధ కర్మలు – పూర్తి అయిన తరువాత ఒక్క క్షణము ఉండమన్న కుదరదు – > మళ్ళీ ఈ జీవితము ముగిసే నాటికి – ప్రారబ్ద కర్మలన్నీ ఖర్చైపోగా – జన్మ జన్మలనుండి వస్తున్న సంచిత కర్మలతో – ఈ జన్మలో కూడ బెట్టిన సంచిత కర్మలు కలుస్తాయి – ఈ మొత్తములో నుండి మళ్ళీ ఏ కర్మ లైతే పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మలను – అనుభవించటానికి – తగిన శరీరాన్ని తీసుకొని – మళ్ళీ జన్మ వస్తుంది ఇలా – “ పునరపి జననం – పునరపి మరణం – పునరపి జననీ – జటరే శయనం ”.

4) మనసును – ఇంద్రియాలను సంతృప్తి పరచటానికి – మాత్రమె ఉద్దేశించిన – విషయ సుఖాలు భౌతిక బంధాలకు కారణమవుతాయి – అటువంటి కామ్యకర్మలలో ఉన్నంతవరకు జీవుడూ ఎప్పుడూ ఒక జీవరాశినుంచి మరొక జీవరాశిలో జన్మిస్తూనే ఉంటాడు – ప్రజలు వెర్రిగా విషయ సుఖాల వెంట పడుతున్నారు – ఇంద్రియ సంతృప్తే జీవిత లక్ష్యమని – భావించే వాడు వెర్రిగా భౌతిక జీవితాన్ని అనుభవిస్తూ అన్నీ పాప కృత్యాలకు పాల్పడుతున్నాడు – గత జన్మలో చేసిన దుష్కర్మల వల్లనే – తన కష్టాలకు కారణమైన ఈ దేహాన్ని – అది అశాశ్వత మైనప్పటికి – పో౦దినట్లు అతడికి తెలియదు – నిజానికి ఆ జీవుడు భౌతిక శరీరాన్ని పొంద వలసినవాడు కాడు – కాని, విషయ సుఖాలను అనుభవించటానికి అతడికి ఈ శరీరము ఇవ్వబడింది – అయితే వివేకవంతుడు శాశ్వతంగా ఒక దాని వెంట ఒకటిగా భౌతిక దేహాలను – ధరిస్తూ విషయ సుఖాలలో చిక్కుకోవటం మంచిది కాదు – ఆధ్యాత్మిక జీవితపు విలువలను గురించిన జిజ్ఞాస లేనంత వరకు జీవుడు అజ్ఞానము వల్ల పరాజితుడై కష్టాల పాలవుతున్నాడు – కర్మ – పాప కర్మయినా – పుణ్య కర్మయినా – దాని ఫలము తప్పదు – ఏ విధమైన కర్మ చేసేవాడి మనస్సైన – కర్మాత్మక మనబడుతుంది – విషయ సుఖ కర్మ కలుషిత మనబడుతుంది – మనస్సు కలుషితమై – చైతన్యం పరిశుద్దంగా లేకా కామ్య కర్మలలోనే నిమగ్నుడైనవాడు భౌతిక శరీరాన్ని ధరించక తప్పదు – జీవుణ్ణి తమో గుణము ఆవరించినప్పుడు – ప్రత్యేగాత్మను గురించి గాని – పరమాత్మ గురించి గాని తెలుసుకోలేడు – అతడి మనస్సు కామ్య కర్మలకు లోబడి ఉ౦టుంది – కనుక భగవత్ భక్తీ లేనంత వరకు భౌతిక దేహాన్ని మళ్ళీ మళ్ళీ – దరించ వలసిందే కాని – విముక్తి పొందలేడు – > కాని జనన మరణ చక్రము నుంచి – విముక్తి పొందడానికి – సిద్దాంతా జ్ఞానము కన్నా ఎక్కువ అవసరమవుతున్నది – జీవుడు భౌతిక శరీరము కాదు – జీవాత్మ అనే జ్ఞానము విముక్తికి చాలదు – జీవాత్మ స్థాయిలో ప్రవర్తించ వలసి ఉంటుంది – ఇది “ భక్తితో కూడిన సేవా ” అని అంటారు.

5) మానవ జీవితమూ అపురూప మైనది – జీవుడు కోటాను కోట్ల నీచ జన్మలు ఎత్తిన తరువాతనే మానవ శరీరాన్ని ధరిస్తున్నాడు – మానవ జన్మలోనే జీవుడు కర్మ నియమాలను అర్ధం చేసుకొనే వివేకము కలిగి – పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడు – జీవుడు భౌతిక అస్తిత్వం వల్ల కలిగే బాధల నుంచి – విముక్తి పొందడానికి మానవ జన్మ ఒక్కటే నిర్గమన మార్గము – మానవ జన్మను దురివినియోగము చేసుకొని – ఆత్మ జ్ఞానాన్ని పొ౦దనివాడు – మూర్ఖుడుతో సమానము.

———————–సశేషం———————-

పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా తప్పులు ఉంటె పెద్ద మనస్సుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

6/7/2016

🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹

అంతరంగం పిలుస్తుంది, రా! 2వ భాగము

1)మానవ జన్మయొక్క దుర్లభత – భగవత్ప్రాప్తిలో ఈనాడు ఎదురౌతున్న కొన్ని విఘ్నాలు – వాటిని తప్పించుకునే ఉపాయాలు – > దుర్లభమైన మనుష్య జీవనం – మన కర్తవ్యం – > మానవ జీవితం చాలా దుర్లభమైంది – గొప్ప పుణ్య సంచయం వల్ల – భగవత్క్రుపవల్ల ఇది మనకు లభిస్తుంది – దీనికి సంబంధించిన ప్రతి క్షణాన్ని భగవత్స్మరణలో – భగవత్సేవలో గడపాలి – కాని బహు విచార కరమైన విషయ మేమంటే ఇప్పటికే మనకాలమంతా వృధాగా గడిచిపోయింది – ఇప్పుడు అలాగే గడిచి పోతూనే ఉంది – కాబట్టి ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని – భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి రాకుండా మన కర్తవ్యాన్ని – నిర్వర్తించు కుంటూనే – మనష్య జన్మని సఫలం చేసుకోవాలి – > కాబట్టి ప్రతి క్షణం క్షీణించి పోయే – ఈ అమూల్య జీవిత సమయాన్ని ఎంత వరకు సదుపయోగమూ చేసుకోన్నామన్నది – మనం ఆలోచించాలి – జీవుడు జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొంది – పరమాత్మను చేరుకొనే విధంగా ఉపయోగ పడేది మానవ శరీరము మాత్రమె – ఇలా మనము నిర్లక్ష్యముతో ఈ దుర్లభమైన మానవ జీవితాన్ని – పశువుల్లగా ఆహార – నిద్ర – మైథునాదులలో నిమగ్న౦ చేసే పక్షములో – మన జీవనం పశు జీవనంగానే తలంచ బడుతుంది. – > ఆహార నిద్రా భయ మైథునాని – సమాని చైతాని నృణాం పశూనామ్. – > “ ఆహారము, నిద్ర, భయము, మైథునం – ఇవి మానవుల్లో – పశువుల్లో ఒకే రకంగా ఉంటాయి – > మానవుల్లో అయితే జ్ఞానము అధికంగా ఉంటుంది – ఇదే మానవులలో గల విశేషము – అలాంటప్పుడు జ్ఞానము లేని మనుషులు పశువులతోనే సమాన మవుతారు ” – > కాబట్టి మనమందరమూ మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి – చేసుకొని పక్షములో చివరకు మనమే ఘోర పశ్చాత్తాపాన్ని పొందాల్సి వస్తుంది – ఈ విషయులో “ శ్రుతి ” మనల్ని హెచ్చరిస్తూ ఇలా పెర్కొ౦టుంది – > “ ఇహ చేద వేదీదథ సత్యమస్తి న – చేది హావేదీన్మహతీ వినస్టి: – భూతేషు భూతేషు విచిత్య దీరాః – ప్రేత్యాస్మాల్లోకా దమృతా భావన్తి ” ( కేనోప నిషత్తు ) – > ఈ మనుష్య శరీరములోని – పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగితే అది – సత్యమూ – ఉత్తమము అవుతుంది – అదే ఈ జన్మలో వాటిని తెలుసుకోని – పక్షములో అది గొప్ప నష్టమే అవుతుంది – > దీర పురుషులు సర్వ భూతాలలో ( జీవులలో )పరమాత్మనే చింతన చేసి – పరమాత్మను తెలుసుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టి శాశ్వతత్వాన్ని ( అమృ తత్వాన్ని ) పొందుతారు – అనగా ఈ దేహము నుండి ప్రాణాలు బయలు వేడలగానే వారు అమృతస్వరూపుడైన – పరమాత్మను చేరుకొంటారు.

2) > తన సౌరభమును తానె వెదుకుచు – అలసి సొలసి పోవు అడవి మృగము – తనలోని సుఖమును తానె తెలియక – జగతి నంటి తిరుగు జీవుడెపుడు – > భావము:- కస్తూరి మృగము తన నాభియేందే కలదన్న జ్ఞానము లేక – కస్తూరి మృగము అరణ్య మంతా అన్వేషించినట్లు – భగవంతుడు హృదయ మందే కలదన్న – విజ్ఞానము నశించి మానవులు బాహ్యములో – భగవంతుని కొరకు అన్వేషిస్తున్నారు – బయట భగవంతుడు లేనప్పటికీ – బయట దర్శించు కోవచ్చని – దొరుకుతాడని – తిరగరాని చోటల్లా తిరుగుతూ – తన విలువైన కాలమును హరించి వేసు కుంటున్నాడు – అయిన ఆ జాడలు కనపడక – తృప్తి పడక అనేక జన్మలు – అనేక శరీరాలలో ఎత్తుతున్నాడు – > ప్రతి మానవుడు శా౦తిని ( దైవాన్ని ) అన్వేషిస్తూ జీవిస్తున్నాడు – అశాంతిని అంత మొ౦దించాలని ప్రయత్నిస్తున్నాడు – అశాంతిని దు:ఖాన్ని క్షణ కాలము కూడా భరించలేకుండా ఉన్నాడు – దు:ఖమే తన స్వరూపమైతే – హాయిగా ఆనందంగా అనుభవించగలిగివుండేవాడు – దు:ఖము తన స్వభావము కాదు – గనుక దాని సాన్నిధ్యాన్ని క్షణ కాలము కూడ భరించ లేకుండా ఉన్నాడు – దు:ఖము తన స్వభావము కానప్పుడు మరి తన స్వభామమేమిటి ? – > దీనికి వెతిరేక మైనదై ఉండాలి – ఏదైతే తన స్వభావంగా ఉంటుందో అదే తన స్వరూపంగా ఉంటుంది – కనుక శాంతియే మానవుని స్వరూపము – మానవుడు శాంతి స్వరూపుడు తాను శాంతి స్వరూపు డైనప్పుడు మరి శాంతి కొరకు అన్వేషించడమేమిటి ? – ? అ శాంతిని పొందడానికి అనేక కారణములు ఉండవచ్చు – శాంతిని పొందడానికి కారణములవసరం లేదు – తన స్వరూపమే శాంతి గనుక తాను అన్వేషించే శాంతి తనకన్నవేరుకాదని గ్రహించకపోవడమే సర్వ అనర్ధాలకు మూలము – > దీనినే విస్మృత కంటచామీకర న్యాయమంటారు – మెడలోని నగ – మెడలోనే ఉండగా అది పోయిందని భ్రమించి దాని కొరకు సాగించే అన్వేషణ – అన్వేషణ సాగుతుందేగాని ఆనందం అంతు పట్టదు – తాను వెతుకుతున్నది తన నేనని గ్రహించనంత వరకు అజ్ఞ్యానము నశించదు – కస్తూరి మృగమునకు తన నాభి యందున్న కస్తూరిని గూర్చిన జ్ఞ్యానములేక పోవుటచేత పరిమళము – భాహ్యంగా ఉన్నదని భ్రమించి – అరణ్యమంతా తిరుతుగుతున్నది – అలాగే మానవుడు ఆశించే శాంతి తన అంతర్యమేనని గ్రహించలేక భాహ్యములో శాంతికై ( దైవ దర్శనమునకు ) అర్రులు చాస్తున్నాడు కాని లోన వదిలిపెట్టీ – బయట వెతికితే దొరుకుతుందా ?

3) “ లాలాపానా మివాంగుష్టే – బాలానాం క్షీర విభ్రమః ” – > తన బ్రోటన వేలునుంది పాలు వస్తున్నాయనే బ్రాంతిలో ఉండుట చేత పిల్లవాడిని వద్దని వారించినా బ్రొటన వేలు సప్పరిస్తూనే ఉంటాడు – బ్రొటన వేలునుంది క్షీరము స్రవించుటలేదని – అది కేవలం తన నోటియందే ఊరుచున్న లాలాజలమని ఎంతగా భోదించినా బాలుని పరమిత మనో బుద్ధులకు తృప్తి కలగదు – తాను పెరిగే కొలది అర్ధం చేసుకుంటాడు – > అలాగే మానవునికి కలిగే ఆనందము వస్తు ప్రపంచము నుండి రావడం లేదు – అది కేవలం అంతర్యమునుండే కదులుచున్నదని చెప్పినా – పిల్లవాని వలే అజ్ఞ్యానస్తితిలో నున్న అంతకరణ సత్యాన్ని గ్రహించ లేడు – > వయసు పెరుతున్న కొలది కుర్రవాడు నిజాన్ని ఎలా గ్రహించ గలడో – అనుభవము పెరిగినప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలము – > ఈ జగత్తంతయు ఆత్మ యొక్క చాయా మాత్రమె – ప్రతి బింభమును పట్టుకోన్నంతా మాత్రానా బింభాన్ని అస్తగతం చేసుకోలేము – బింభాన్ని పట్టుకున్నామా ! – ప్రతిబింభము తంతట తానే ఆగిపోతుంది – కదల లేక నిలిచిపోతుంది – మనము వస్తువును వదిలి నీడను అనుసరిస్తున్నాము – నిత్య – శుద్ధ – బుద్ద – ముక్తమైన ఆత్మ స్వరూపమును – అంతర్యములో కలిగియుండి – పరిణామ శీలమైన జగత్తులో ఆనందానికి అర్రులు చాస్తున్నాము – ఈ మిథ్యా జీవనానికి స్వస్తి చెప్పాలి – సత్యానికి సంభందించిన జ్ఞ్యానము – లేకపోవడమే ఈ అనర్దములకు కారణము – > విచారణను పెంపొందించుకోవాలి – సత్యాసత్య వస్తూ వివేకం చేయాలి – అసత్యాన్ని అంత:కరణములో తోలిగించుకోవాలి – సత్యాన్ని గూర్చి మననం చేసి ( జప, తపస్సు చేసి ) స్వస్వరూపమును పొందాలి – > శారీరక మనో బుద్ధుల పై యున్న బ్రాంతిని తొలగించుకోవాలి – విచారణచే దేహ బ్రాంతిని – స్థూల బ్రాంతిని విడిచి సదా – ఆత్మలో రమించడం అలవర్చుకోవాలి – “ తరతి శోకమాత్మవిత్ ” ఆత్మ విధుడు శోకాన్ని దాటుతాడు – కన్నీటిని అధిగమిస్తాడు – ఆనందంగా జీవిస్తాడు – సచ్చి దానంద స్వరూపమై విరాజిల్లుతాడు – జీవన్ముకుడై ప్రకాశిస్తాడు – > మనము ప్రస్తుతం ఉన్నది మన నిజస్తానము కాదు మన స్థానం వేరే చోటనున్నది – అంటే మన స్థానం ఎక్కడో పైన ఉన్న స్వర్గములో ఉన్నాడని కాదు – అది మనలోపలె ఉన్నది – > జీసస్ క్రీస్తు చెప్పిన విధంగా “ స్వర్గ రాజ్యము నీలోపలె ఉన్నది ” శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా “ ఈశ్వర స్సర్వ – భూతానాం ” – సర్వ జీవుల హృదయులలో నివసించుచు భగవంతుడు – వారిని యంత్రము పై నున్న వారివలె తన మాయచే గిరగిర తిప్పుతున్నాడు – > కాబట్టి సమస్త జీవరాశులలో పరమాత్మ స్వరూపాన్ని చింతన చేస్తూనే తమ జీవితాన్ని సఫలం చేసుకోవడ౦ బుద్దిమంతులైన మనుష్యుల కర్తవ్య౦ – మానవ జన్మ బహు దుర్లభమైనది – అది పరమేశ్వర కృప వల్లనే మనకు లభించింది – అలాంటి సదవకాశాన్ని పొంది మహత్త్వ పూర్ణమైన జీవిత సమయంలో ఒక్క క్షణాన్ని కూడా మనం వ్యర్ధంగా పోగొట్టుకోకూడదు – మనం ఏ పని మీద వచ్చామో ( పుట్టామో ) దానిని అన్నింటికంటే ముందుగా నిర్వర్తించాలి – > మన ప్రమేయం లేకుండా మన జీవిత సమయంలో ఇతరులు చేయగల పనిని వారితోనే చేయించాలి – ఆ పనిలో మన అమూల్య సమయాన్ని వెచ్చించ కూడదు – అలాగే మన మరణానంతరం – మన వారసులు ( ఉత్తరాధికారులు ) చేయగలిగిన పనిని అది ఎంతటి ఆవశ్యకమైనదైనప్పటికీ ఆ పనిలో కూడా మన సమయాన్ని వెచ్చించ కూడదు – అయితే మనం లేకపోయినా మన జీవిత కాలంలో ఇంకా మరణానంతర౦ – కూడా ఇతరుల ద్వారా నెరవేర్చలేని పనిని – ఇహ పర లోకాలలో కళ్యాణ దాయకమైన పనిని – తప్పకుండా చేయాలి – > మనకు మానవ శరీరాన్ని ఇచ్చిన పనిని – ఇంకా ఈ పనిలో ఏ మాత్రము లోపం జరిగిన మనం పునర్జన్మ ఎత్తాల్సిన పనిని తప్పక చేసి తీరాలి – > అలాగే మన ద్వారా తప్ప ఇతరుల ద్వారా నెరవేర్చలేని పనిని సర్వ కాలాలలో – సర్వ ప్రధమ మైనదిగా – అత్యంత మహి మాన్విత మైనదిగా నెంచి – తగు తత్పరతతో అన్నిటికంటే ముందుగా చేయాలి – ఇంతకి ఆ పని ఏమిటి ? అంటే అదే పరమాత్మ ప్రాప్తి – ఆ పరమాత్మ ప్రాప్తికి ఉపాయము ఏమిటి ? పరమేశ్వరుని యందు భక్తీ – ఉత్తమ గుణాలను అలవర్చుకోవడం – ఉత్తమ విధానాలను ఆచరించడం – సంసారము ఎడల వైరాగ్యము – జప తపాదుల యందు ఆసక్తి పెంచుకోవడం – పరమాత్మ తత్వానికి సంభందించిన – యథార్ధ జ్ఞానం – మనస్సు – ఇంద్రియాల సంయమం – దు:ఖితులకు – అనాధులకు నిష్కామ సేవా ఇత్యాదులు – కాబట్టి ఇలాంటి పనులలోనే మన సమయాన్ని అధికంగా వినియోగించాలి – > ఎక్కువ సమయము ఈ మనసు వ్యర్ధంగానే చింతన చేస్తుంటుంది – అదే మనకు ప్రమాదకరమైన విషయము – కాబట్టి మనస్సును స్థూల భోగముల యందు వ్యర్ధ చింతన నుండి తొలిగించి భగవత్ చింతనలో లగ్నం చేయాలి – అలాగే జపతపాదుల సమయములో – ఆవరించే – నిద్ర – సోమరితనం వంటి దుర్గుణాలను వివేకముతో – ఆలోచనతో – పట్టుదలతో తోలిగించుకోవాలి – అలా చేయని పక్షములో ముందు ముందు ఘోరంగా పశ్చత్తాప పడాల్సి వస్తుంది – > అనగా ఇహ లోకము నందు పరమేశ్వర ప్రాప్తికై – ఎంత మాత్రము ప్రయత్నించక – పరలోకమున కేగిన జీవుడు అచట దు:ఖమును పొంది – తలలను బాదుకుంటూ రోదించును – అంతే కాక, కాలమును – కర్మను – ఈశ్వరుని యందు మిథ్యదోషములను ఆరోపించును.

4) పరమేశ్వరునికి మనమీద మిక్కిలి అధికమైన – అకారణమైన దయ ఉంది – అందువల్ల ఆయన కృప వల్లనే ఈ మానవ శరీరము లభించింది – > ఎనుబది నాలుగు లక్షల “ గని ”లో నాలుగు విధములైన జీవులు – ( స్వేదజ – అండజ – ఉద్బిజ – జరాయుజములను ) ఉన్నవి – అవినాశియగు జీవుడు వీనిలోనే తిరుగుతూ జన్మిస్తూ – మరణిస్తున్నాడు – ఏలయన – ఈ జీవుడు కాల – కర్మ – స్వభావ – గుణములతో ఆవృతుడై మాయకు లోబడి – నిరంతరమూ వివిధ యోనులలో తిరుగాడు చుండును – జీవుడు ఈ విధంగా దు:ఖితుదగుటను గాంచిన కరుణా మూర్తి యగు ఈశ్వరుడు నిర్హేతుకమైన దయను గురిపించి – తనను చేరవచ్చుటకై మానవ దేహమును ప్రసాదించును – కావున ఇట్టి దుర్లభమైన అవకాశమును జీవుడు సద్విని యోగ పరచుకొని పరమాత్మను చేరుకోనవలెను.
5) ఈ విషయాన్ని మనము బాగా ఆలోచించాలి – ఈ భూమండలం మీద అసంఖ్యాక మైన జీవరాసులున్నాయి – వాటిలో మానవులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు – అంటే అత్యంత పరిమితంగానే ఉన్నారు – అలాంటి దుర్లభమైన మనుష్య శరీరాన్ని పొంది మానవులు – సోమరితనముతో – నిర్లక్ష్యముతో – పాప కార్యాలలో – సుఖ భోగాల్లో జీవనాన్ని గడుపుతున్నారంటే – అది వారి మూర్ఖత్వము కాక మరేమగుతుంది ? – > మానవ జీవితమూ మిక్కిలి ఉపయోగ కరమైనది – దుర్లభమైనది – సర్వోత్తమ మైనది – అయినప్పటికీ ఇది క్షణిక మైనదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి – ఇప్పుడున్నది మరుక్షణములో ఉండదు – దీనిని నమ్మటానికి వీలు లేదు – మృత్యువు ఎప్పుడూ వచ్చి – దీనిని కబలించి వేస్తుందో తెలియదు – మానవ శరీరము కేవలం బోగ భాగ్యాలు అనుభవించటానికే మాత్రము కాదు – ఆహారము – నిద్ర మైతునాది ధర్మాలు – పశు శరీరములో కూడా ఉన్నాయి – మరి అలాంటప్పుడూ మనిషి శరీరాన్ని పొంది పశుధర్మాలతో తమ సమయాన్ని గడిపే వాళ్ళు – మనుష రూపములో ఉన్న పశువు తత్వము కాకా ఇంకేమవుతుంది – విజ్ఞ్యులైన మీరు వివేచనతో ఇప్పుడైనా ఆలోచించండి – ఆచరించండి – మనకు ఉన్నది “ ఏకైక మార్గము ఒక్కటే ” అది తెలుసుకుంటారని మనవి చేస్తున్నాను.

————————–సశేషం———————

పై విశయాలన్నీ మీ అందరికీ తెలిసినవే – ఏమైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.

R.B.Satyanarayana
Chairman, Annadhara

Japa Sadhana – Blog

%d bloggers like this: