Last updated: Nov 12th 2016
Shree R.B. Satyanarayana, Chairman Annadhara
6/9/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
“ జపము ” 5 వ భాగము
1) విశ్వ మందలీ మానవులేల్లరు సర్వతోముఖాభి వృద్ధిని కాంక్షించి – మానవ జీవితం శాంతి సంత్రుప్తులతో – ప్రగతి పరంగా సాగు సంయోజన మొనర్చుట మహాత్ కార్యము – దానిని వివరించుటయే ఈ వేదిక యొక్క ప్రాముఖ్యము – ఈ రీతి మానవత కావశ్యకమైన ధర్మము – దాని ఆచరనీయ నిర్దేశము – ఈ రెండూ మనకు ముఖ్య కార్యములు – > ఇట్టి పవిత్ర ఉద్దేశముత్తో అదే తన ధ్యేయంగా – వెలువడుతున్న ఈ సమాచారమునకు ( మెస్సేజ్ ) అపూర్వ ఆదరాభిమానాలతో గైకొని – మీ అమూల్య సలహాలతో – సముచిత ఉత్సాహాన్నీ ప్రదర్శించి – మాకు చేయూతనిస్తున్న సమాజ భందువులకు – మా కృతజ్ఞ్యత తెలుపుకోనుచున్నాము – ఇప్పటివారు కేవలం లంపట జీవితం వెళ్ళ బోసేవారు – తత్త్వ ప్రేమికులు కారు అనుట అబ్బద్దము – తత్త్వము ఎవరికీ వలదు ? తత్వమే మన జీవనాధారమై ఉండ దానిని కాధన గలమా ? మా ఈ ప్రయత్నములో మీ సంపూర్ణ సహకరము అందించవలసిన – అవసరము ఎంతైనా ఉంది.
> మానవ మహోన్నతికి మహనీయులు ఎందరెందరో అహరహం శ్రమించి – కీర్తిలో బాగాస్తులైనారు – అయినను మానవలోకము – అశాంతితోనే అలమటించుచున్నది – ఎల్లడెలా ఎదో ఒక కొరత అగుపడుచునే యున్నది – > ఏ ఆధారం పై సమస్త సృష్టి నిలబడిందో – ఈ మానవత నిలిచినదో – ఆ సూత్రాత్మక శక్తియే – “ ధర్మము ” అని పిలవ బడుచున్నది – > ధర్మమూ మానవతను ధరించి నందుననే – అది అన్నింటికీ మూలము – > అదియే “ ఆది ” – ఈ మూల ధర్మమును “ ఆదిధర్మ ” మనియు – ఆది ధర్మమే “ ఋత ” మనియి – వేదములందు చెప్పబడినది.
> అట్లే ఏ యొక వస్తువు ఈ సర్వమును యిముడ్చుకున్నదో – ఏ ఒక వస్తువు అనేకముగా రూపు దిద్దు కున్నదో – దానినే “ సత్ ” అని పెరుకోనబడినది – ఆ “ సత్ ” యొక్క జ్ఞ్యానమే – తత్త్వ జ్ఞ్యానము – తత్వజ్ఞాన మనగా – సత్య జ్ఞానము – > ఈ సత్యమును – “ శ్రుతి ” మననీయముగా చెప్పినదీ – > ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ! ఏకం రూపం బహుథాయ: కరోతినః ! తమాత్మస్థం యేzణు పశ్యంతి ధీరా ! స్తేషాం – సుఖం – శాశ్వత౦ నేzతరేషాం ! – > “ ఏకం సత్ విప్ర బహుధా వదంతి ” – > అని, ఉపనిషత్తులలోను – వేదములందునను – పేర్కొన బడినది – అన్నింటి లోను “ సత్ ” యున్నది – మనకు కావలసినది సత్వ జ్ఞానము – ఈ దిశగా సాగు చున్న మనకు ధర్మమే శరణియము – సర్వమున౦దు స్థితముగా ఉన్నడనిపించు మహా శక్తి ఇది – “ ధర్మో రక్షతి రక్షతిః ” యను నుడి జ్ఞాపకము వచ్చును – కాని, ధర్మమూ మనచే రక్షణ పొందగల అసహాయ స్థితిలో ఎన్నడు లేదు – ధర్మమే మనలను ధారాళముగా రక్షించును – గాని సహజత అది – అంతయే గాని ధర్మమునకు మనమేమి రక్షణ నీయగలము – ? – > ఇట్టి వివేచనతో సాగిపోవ నుద్దేశించిన మనకు సర్వులు మాన్యులే – జాతి, మత, పంథాల విభేదాల ప్రమేయమే లేదు – వారి సేవయే మన కర్తవ్యము – వారి సర్వతోముఖ ప్రగతియే మన ఆనందము – కావుననే శ్రీ అచ్యుతాశ్రమ సాదకులేల్లరు – ప్రాత: – సంధ్యలలో “ సర్వేజనా: సుఖినో భవంతు ” – “ సమస్త సన్మ౦గళాన్ని భవంతు ” – అని శాంతి మంత్రములతో ఆత్మతః కోరుచున్నారు – > ఇంతే కాదు ఈ విశాల విశ్యమునందు పలుచోట్ల – బహు విధ స్థాయిలలో వ్యక్తమై యున్న జీవరాశిని గుర్తించి – “ లోకా సమస్తా సుఖినో భవంతు ” అని స్వస్తి వచనముల నుచ్చరించుచున్నారు – ఈ రీతి భూలోకనుండి అనంతము వైపు ద్రుష్టి సారించి – సాగుచున్న మనకు సంకుచిత భావనలు రాకుండు గాక !
> మానవ జీవనము అనంత ముఖములా విస్తరిల్లినది – జీవ కోటికి నివాస స్థానమైన ఈ విశ్వము సువిశాల మైనది – విశ్వ సర్వస్వాన్ని భరించిన “ జీవ సూత్రం ” – అద్భుతమై – రమణీయమై – కర్మ నిరతమై యున్నది – పరమాద్భుతమైన ఈ బ్రహ్మాండంలో మనము కేవలం బాలకులము – ఈ బాల్యవ్యవస్తలో మనకు దైవ రక్షణ అగత్యము – దైవము ప్రేమ పూర్ణము – ఆ ధీరోధాత్త కక్షలో మనము క్షేమముగా పురోగ మింప వచ్చును – అందులకై మనము ప్రార్ధింతుము – > శ్రేష్టము – జేష్టము అయిన దైవము – మనలను సర్వదా ఆశీర్వ దించుగాకా ! ఆ దైవము మనకు కళ్యాణ ప్రధమూ – శాంతి కారకమూ ఆవు గాక.
2) మనుష్యత్వము :- సంగము నుండి ( వస్తూ సామీప్యత – సహవాసము ) కామము ( ఆశ ) పుట్టును – ఆ ఆశా నేరువేరుటకు ప్రయత్నించునప్పుడూ – మనస్సు ‘ అది సరియినదేనా – లేకా తప్పా – అనును – దానినే ( prick of the conscience ) ఆత్మ వాణి – ఆత్మ యొక్క హెచ్చరిక యందురు – అయినప్పటికినీ మనము దానికి విరుద్ధముగా ఆశ యొక్క ఒత్తిడికీ లోబడీ – దానినీ అనచ లేక ప్రవృత్తులై – అఘాతమునబడి బాధ పడుటో – ఆశ ఫలి౦చినచో ఇతరుల నొప్పీ పెట్టుటో యగును – అట్లే బహుజనులకు మేలునూ చేకూర్చూ యొక పని విషయమై – ఇది మంచిదీ చేయమనీ మనస్సు చెప్పినప్పటికీనీ – అందులకై శ్రమ ఎక్కువ – స్వలాభము తక్కువ యను ఆలోచన వచ్చి మనలో వృద్ధి చెందిన సోమరితనము – స్వార్ధలాలసత వలన కార్య ప్రవృత్తులు – కాకుండా ఉండునది సంభవమే కదా ? – > ఈ రెండూ విషయముల యెడ కొంత కాలము జరిగిన పిదప మనలో – మనము చేసిన దానినీ గురించి – మనము తొందర పడి ఈ పనీ చేసితిమీ – ఇది తప్పూ – అట్లు చేయ కుండిన బాగుండేడిది – యను పశ్చాత్తాపం కలుగునూ – అందుకోసమే తెలిసినవారూ – “ Look before you leap ” నీవూ కార్య ప్రవృత్తుడవు కాకముందూ బాగుగా ఆలోచించుమూ అందురూ – యుక్తా యుక్తములను గురించి మనలో నడుచు ఈ విచారమునే ( diskrinination ) మన అంతర్యపు “ మేధాశక్తి ” యనియు ( Intellect ) “ బుద్ధి ” యనియు అన్నారు.
> మానవులయందీ విచార శక్తీ పరిమితమైనది – ఇదీ తనకూ కావలసినా దానిని చేయుటకు సహకారి యగును – ( స్థూల విషయముల యెడ మాత్రము ) – అయినను శాశ్వత సుఖము – ఆనంధములను పడయు స్థితిని సాధించుకోను కార్యము దీనితో సాధ్యము కాదు – అందుకోసమే తెలిసిన వారు – > నమేథయా, నా బహుధా శ్రుణోతీ – > నాయామాత్మా బలేహీనేనా లభ్యః – ( బుద్ధి శక్తి వలనగానీ – తెలిసిన వారి మాటలు వినుటవలన గానీ – ఆ శాశ్వత సుఖము – ఆనందము – ఆత్మ యొక్క సహజత్వము లభ్యము కాదు – బలహీనులకు లభ్యము కాదు అన్నారు – ఇక్కడ బలహీనులనగా ఇంద్రియముల మూలముగా బయటి వస్తువుల నుండి – లభించు సుఖము యొక్క ఆకర్షణకు చిక్కీ, మనో చంచలు లైనా వారని అర్ధము > బుద్ధి శక్తిచే పరులను మెప్పించి – సంతోష పడజేసి – తన స్వార్ధమును సాధించవచ్చును – పరీక్షించీ – ప్రయోగ చేసి – వస్తువుల గుణములను తెలిసి – క్రొత్త క్రొత్త వస్తు విశేషములను కనిపెట్టీ గొప్ప కీర్తి సంపాదించవచ్చు – ఇతరులను భయా అశ్చర్యములకు గురి చేసి తామూ చెప్పినా రీతిగా వారు నడుచునట్లు చేసి కొనవచ్చునూ – అయినను దీనివలన వారి ప్రీతినీ సంపాదించుట సాధ్యము కాదు – శాశ్వత సుఖము – తృప్తి – ఆనందములను పొందుటకు సాధ్యము కాదు – ఈ మాటల యందలి సత్యమును – ఈ కాలపు అతి బుద్ధి శాలులైనా విజ్ఞానులు (scientists) ఒప్పుకోనేదరు – > మానవునకు తృప్తి – ఆనందములను ఇచ్చెడి మార్ఘము యే౦తగా ప్రయత్నించిననూ – తన బుద్ధి శక్తి నుండి సాధ్యమగుట లేదు – దానిని తెలిసిన మరి ఒకరి సహాయము ( మార్గ దర్శనము ) అగత్యమై ఉన్నది – ఆ మార్గ దర్శకులనే “ గురు ” వనియు ఆ మార్గామునే ( బ్రహ్మవిద్య ) యనియు అందురూ – స్థూల ప్రయత్నమూ చే నేర్చు కొనదగిన ఎల్ల విద్యలను “ అవిద్య ” యనియు జ్ఞ్యానుల మతము – ఆ విద్యను తీసుకొని ముందుకు సాగీ మనుషత్వవు వికాసమున్న జ్ఞానులు – శాశ్వత సుఖము – దేవ సామ్రాజ్యము నీలోనే ఉన్నది – ( the kingdom of god is in your self ) యని చెప్పినప్పటికిని – మనకు ఎట్లు తెలియవచ్చును – ? ఏసు క్రీస్తు “ Knock it, it will open – see, it is visible – pray, it will be given ” ( తట్టుము – తెరుచును – చూడు ) అగుపడును – అడుగు – ఇవ్వగలదు – అని చెప్పినది దానిని గురించి యే – అయితే దేని చేత – దేనిని – ఎట్లు – తట్టవలెను – ? ఏమి తెరవ బడును – ? ఏమి అగుపించును – ? యను దానిని ఊహించి తెలియుట సాధ్యము కాదు.
3) “ ప్రణవమును ” ధనస్సుగా ఉంచుకొని – ఆత్మను బాణముగా చేసుకొని – బ్రహ్మమును గురిగా నిలుపుకొని – బాణమును గురిపెట్టీ నేరుగా సాగునట్లు అప్రమత్తుడై – ( alert ) ప్రయత్నించి గురిని తాకుము – అచట పృథ్వి – అంతరిక్షములా మధ్య – ఓతఃప్రోతముగా ప్రాణము చేయు గతాగతిలో జతకు మనుసుండునూ – అదొక్కటే ఆత్మ యందు చేరినప్పుడు – శబ్దములతో విడుదల పొంది – అమృత తత్వమునకు సేతువగును – > “ రథనాభి ” వలే మన దేహ మందు సదా చరియించు చున్నదానినే గమనించు నప్పుడు – అనేక అనుభవములగును – అది హృదయా మందున్నది – దాని విజ్ఞానమును తెలుసుకోన్నచో – ఆనంధరూపమైన అమృతత్వము లభ్య మగును ” ఈ రీతిగా అనుభవజ్ఞులైన ఋషులు వర్ణి౦చినారు.
> మన హృదయమందు “ ఈశ్వర ” ( ప్రాణవాయు ) అను ఒక చైతన్య మున్నది – దానిని శరీరమునందు పైకి క్రిందికి ఆడించవలెను – ఈ వాయువు మథనము నుండి – పాలను మథించి నప్పుడూ – దాని సారము వెన్నయై తేలివచ్చు నట్లు “ ఆశన ” మనేడి యొక్క సూక్ష్మ వస్తువు తేలివచ్చి – పైకి ఎక్కు చూ మన దేహము యొక్క – ఒక స్థానము నందుండు – ప్రాణ మనేడి చేతనమునకాహారమగును దాని వల్ల శక్తి గైకొన్న ప్రాణ చేతనము పై స్థాయి చేరి – బ్రహ్మ రంద్ర మనెడి స్థానము నందున్న “ ఆత్మ ” యను చేతనమును చేరినప్పుడు అమృత మనేడి – ఒక రసము ఉత్పత్తియై క్రిందికి దిగుతూ దేహ మందు అన్నీ చోట్లకు వ్యాప్తమగును – > అందువలన మానవుడు ఇచ్చా మరణుడగు చున్నాడు – > అప్పుడే అతనికి జ్ఞాన ద్రుష్టి తెరబడును – తనలో గల మనసుకు ఆవరించినా మాలిన మంతయు నాశనమై – సుప్తముగా నున్న జ్ఞాన శక్తి వికాసమగును – > ఆనందం – త్రుప్తి యొక్క అనుభవము కలుగును – తన జన్మ సార్ధకత మగుటకు తానేమి చేయ వలే ననేది జ్ఞాన మబ్బి – ఆ పనిచేసి శాంతు డగును – > ముక్తుడగును – అట్టి వారే జ్ఞానులు – మనసు వికసించిన మనుషులు – వారు దేవును ప్రతి నిదులై సర్వ భూత హితమునకై పాటు పడెదరు – > మానవు లెల్లరు విద్య నాశ్రయించి – సాధించుచు ఈర్షా ద్వేషములు లేక ప్రేమతో జీవించుచు – అభ్యాసమున సాగి తాము తృప్తులై – ఆనందానుభవము పొంది – జ్ఞానులగు వారందరును – అతనికి ( భగవంతునకు ) సహకరించు వారగుచున్నారు – ప్రేమ యొకటే హృదయములను గెలువ గలిగిన శక్తి – అదొక్కటే జగత్తును పాలించగలదు – > శాంతియే ప్రేమ స్వరూపము యొక్క నైజము – ధర్మమే అతని రక్షాకవచము – జ్ఞానమే అతని ఖడ్గము – స్నేహమే అతని పవిత్ర తీర్ధము – అతడు అజాత శత్రువు – అతనికి ఓడిపోవని వారు ఎవరూలేరూ.
పై విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే – ఏమైనా పోరాపాట్లు ఉంటె తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/11/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
“ మనస్సు ” 4వ భాగము
మనస్సును స్వాధీనము చేసుకోవడం కష్టమే – కాని అసాధ్యము కాదు :-
1) మనస్సును స్వాధీనము చేసుకొనడం అనేది విశ్వ మానవాళి అంతటికి ఆసక్తి కలిగించే విషయం – అది ప్రతి సాధకునికి కావాల్సిందే – వ్యక్తిని గాని – సంఘాన్ని గాని – సముద్దరించాలంటే – ఆచరణాత్మకమైన – మనస్సు యొక్క నియంత్రణ అనేది ఒక ప్రాధమిక అవససరము – అందుచేతనే అది బలవంతంగా మన దృష్టిని దాని వైపు మరల్చుతుంది – > మనస్సును నియంత్రించాలనుకునే వాళ్ళు – అనేక రకాలుగా ఉంటారు – హేతువాదులు – దేవుణ్ణి నమ్మేవారు – నమ్మనివారు – వీరందరూ మనస్సు స్వాధీనానికి సంబందించిన – ద్వారాలు తెరిచే ఉంటాయి – అయితే వీరిలో భగవంతున్ని నిజంగా – ప్రేమించే వారికి కొంత పైచేయి ఉండి – అది వారి సమస్య యొక్క పరిష్కారాన్ని – సులభము చేయవచ్చు – పెద్ద మనస్సు గల సాధకుడు అన్నీ పద్దతులకూ – తన మనస్సును తెరిచి ఉంచుతాడు – > మనస్సు యొక్క స్వభావాన్ని గురించి – దాని స్వాధీనము చేసుకునే పద్దతులను గురించి – వేదాంతమూ – యోగ శాస్త్రమూ మనకు ఎంతో నేర్పగలవు – > మనస్సును తమ స్వాధీనములో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికి ఉంటుంది – ప్రతివారికి అది వారి వారి సొంత వ్యవహారమే అయిన – ప్రతి ఒక్కరి విషములోను మనస్సు కన్న మనల్ని ఎక్కువగా ప్రభావితము చేసేది మరికటి లేదు – మనమందరమూ మనస్సుల్ని నియంత్రించడానికి – ప్రయత్నిస్తూనే ఉంటాము – కాని దాన్ని గురించి మరికొంత తేలుసుకొని – మరింత మెరుగ్గా – సమర్దంగా మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి మనము ప్రయత్నించాలి – > మనస్సును నిగ్రహించడం – చాలా ఆసక్తికరమైన ఒక ఆట – అయితే అది మన లోపలే – మనతో మనమే ఆడే ఆట – గెలుపు, ఓటములను లెక్క చేయని మనస్తత్వము ( క్రీడా స్పూర్తి ) ఉంటె – అప్పుడప్పుడు తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచినా – ఈ ఆటని గొప్పగా ఆనందించవచ్చు – > ఈ ఆట ఆడడానికి – నైపుణ్యము – చురుకుతనము – హాస్యస్పూర్తి – మంచి హృదయము – వ్యూహత్మక శక్తి – సహనము – ఎంతోకొంత ధీరో ధాత్తత – అంటే ధీరులకు ఉండే విశాల హృదయము అవసరము – అప్పుడే నూరుసార్లు ఓటమి పాలైన గుండె జారిపోకుండా నిలద్రోక్కుకోగలము – > శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అత్యునత యోగ స్థితిని ఎలా పొందగలమో వివరించాడు – > అప్పుడూ అర్జనుడు హే కృష్ణా ! మనస్సు అత్యంత చంచలమైనది – నీవు భోదించే ఈ యోగము సంపూర్ణంగా నిచ్చలమైన మనసును కలిగి ఉన్నప్పుడే సాధ్యము కదా – కాబట్టి ఈ యోగ స్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్ధం కావడం లేదు – > ఓ కృష్ణా ! మనస్సు అశాంతితో – అల్లకల్లోలంగా ఉంటుంది – అది శక్తి వంతమైనది – మూర్ఖమైనది – గాలిని నిగ్రహించడం ఎంతకష్టమో మనసును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు తోస్తున్నది – అని అర్జనుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు – శ్రీ కృష్ణుడు దానికి సమధానంగా సర్వ మానవాళి ఎల్లకాలం గుర్తుంచుకొదగిన సందేశాన్ని ఇచ్చాడు – > ఓ అర్జునా ! నిస్సందేహంగా మనస్సు చాలా చంచలమైనది దానిని నియత్రించడం చాలా కష్టం – కాని అభ్యాస – వైరాగ్యాల ద్వారా దానిని స్వాధీనము చేసుకోవచ్చు – ఆ అభ్యాస – వైరాగ్యము అనే ఈ రెండుమాటలకు – సంబంధించిన రహాస్యాన్ని అంతటిని మనకు అందించాడు – > యుగయుగాలుగా భారత దేశంలోని – సనాతన ఋషులందరూ అభ్యాస వైరాగ్యల సాధనకన్న మనస్సును స్వాధీనము చేసుకోవడానికి – వేరే మార్గము లేనే లేదని ఘంటాపధంగా చెప్పారు – దీనినే అభ్యాస యోగము – సాధనా యోగము అని కూడా పిలుస్తారు – > నీ ఆధ్యాత్మిక చైతన్యము కొద్దిగా – మేలుకున్నంత మాత్రానా సోమరివై కూర్చోవద్దు – ముందుకు సాగిపో – గంధపు చెట్ల అడవిని దాటిన తరువాత ఇంకా విలువైనా వెండి – బంగారు గనులున్నాయి – వాటిని కూడా సాధించు – అయ్యా మాకాల్లకు సంకెల్లున్నాయి – ఇక ముందుకు వేల్లలేము అనుకోవద్దు – > నీ కాళ్ళకు సంకెళ్ళు ఉంటె ఏమయింది ? – > ముఖ్యమైనది మనస్సు – బంధము – విముక్తి – ఈ రెండు మనసుకు సంభందించినవే కదా ? – కాని నా మనస్సు నా ఆదీనములో లేదు అని అంటారు – > అది ఎలా అభ్యాస యోగమని ఒకటున్నది అని తెలుసా – ? సాధనా క్రమము తప్పకుండా చేస్తూ ఉంటె – క్రమ క్రమముగా – నీవు ఏ త్రోవ చూపితే – ఆ త్రోవలో మనస్సు నిన్ను అనుసరిస్తుంది – మనస్సు అనేది అప్పుడే తెచ్చిన తెల్లని వస్త్రములాంటిది – > నీవు దాన్ని ఎరుపురంగులో ముంచితే ఎర్రగా మారుతుంది – నీలం రంగులో ముంచితే ఆ రంగే వస్తుంది – నీవు ఆ వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే అది ఆ రంగుగానే మారుతుంది – మనసును స్వాధీనము చేసుకోవడం లోని రహస్యము ఇది కాదా ? – > 1) మనస్సును స్వాధీన పరవ్చుకోవాలన్న గట్టి సంకల్పాన్ని పెంపొందించుకోవాలి – > 2) మనస్సు యొక్క స్వభావాన్ని అర్ధము చేసుకోవాలి – > 3) దీనికి సంభందించిన పద్దతులను నేర్చుకొని – వాటిని తెలివి తేటలతో క్రమం తప్పకుండా హృదయ పూర్వకంగా అభ్యసి౦చాలి – > వెయ్యి మందిని వెయ్యిసార్లు – యుద్ధములో ఓడించిన వాడికన్నా – తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు – > అందుకే పట్టుదలతో – సడలని బుద్ధితో – మరింతగా ప్రయత్నించాలి – ఎందుకంటే మనస్సును పరిపూర్ణంగా సాధించుకోవడం – సాధ్యమేనని జగత్ గురువులే నమ్మ బలుకుతున్నారు కదా ? – కాబట్టి దీనికి వెతిరేకమైన ఆలోచనలన్నింటిని – విషతుల్యంగా భావించి వదిలి వేయాలి.
2) మనస్సును స్వాధీన పరచుకోవడం వల్ల ఒనగూరేదేమిటి – ? :- మనస్సును స్వాధీన పరచుకోవడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో మొదట మనకు స్పష్టంగా తెలియాలి – అది స్వాధీనములో లేకపోవడం వల్ల మనిషికి కలిగే అత్యంత అధమ స్థితి పిచ్చి పట్టడమే – > నాగరికతలు పైకి ఎంత సౌభాగ్యవంతమైనవిగా – స్థిరమైనవిగా కనిపించిన సామాజిక స్థాయిలో మనస్సు స్వాధీనము తప్పితే – అది ఆయా నాగారికతల వినాశనానికి దారితీస్తుంది – ఇంకా తక్కువ స్థాయిలో పత్యక్షంగా – పరోక్షంగా మనస్సు – స్వాధీనములో లేకపోవడం వల్ల కలిగే చిన్న – పెద్దా అనర్ధాలు – నష్టాలు అనేకం ఉన్నాయి – > మనిషి యొక్క వ్యక్తిత్వము సమగ్రంగా – వికసించకుండా స్వాధీనము తప్పిన మనస్సు సమర్ధంగా అడ్డుపడుతుంది – మనో నిగ్రహము లేని వ్యక్తి అసాధారణమైన పోకడలకు – విపరీతమైన అతర్మథనము వల్ల కలిగే మానసిక పతనానికి గురి అవుతాడు – అత్యంత సానుకూలమైన పరస్థితులలో కూడా అతడు తన శక్తి సామార్ధ్యాలను పూర్తిగా వినియోగించు కోలేకపోతాడు – > మనస్సు స్వాధీనములో లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలదు – ? బలమైన కోరికలు – ఉద్రేకాలు – ఒత్తిడులతో బాధపడే అటువంటి వ్యక్తి దీర్గ మానసిక వ్యాధులకు గురికావచ్చు – లేదా ఒక నేరస్తుడుగా మారవచ్చు – అటువంటివాడు ఒక ఇంటికికాని – సమస్థకు కాని – ఒక దేశానికి కాని యజమాని అయితే ఆ కుటుంబములో కాని ఆ వ్యవస్థలలో కాని – క్రమ శిక్షణ రాహిత్యము – అక్రమ ప్రవర్తన – దుష్ట బుద్ధులు ఎక్కువై – దుర్మార్గపు సంబంధాలు ఏర్పడి – కుటుంబ, వ్యవస్థలు వినాశనానికి దారితీయవచ్చు – > మన దేశములో ఒక సామెత ఉంది :- ఒక మనిషి దేవుని కృపను పొంది ఉండవచ్చు – తన గురువు కృపను – సాధు పురుషుల కృపను కూడా పొంది ఉండవచ్చు – కాని అతడు తన మనస్సు యొక్క కృపను పొందలేక పోతే – నాశన మవుతాడు – మనసు యొక్క కృపను పొందడమంటే – దాన్ని స్వాధీనము చేసుకోవడమే – > ప్రయోజనాల దృష్టితో చూస్తే మనస్సును స్వాధీన పరచుకోవడం ద్వారా అత్యున్నత స్థాయిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు – > అంతకన్నా తక్కువస్థాయిలో అది మనకు ఇచ్చే వరాలు ఇంకా అనేకం ఉన్నాయి – నియంత్రించబడిన మనస్సును సులభంగా ఏకాగ్రం చేయవచ్చు – ఏకాగ్రత ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు – జ్ఞానమే శక్తి – > మనస్సు స్వాధీనమైన వెనువెంటనే – కలిగే ఫలితము సమగ్ర వ్యక్తిత్వ వికాసము – ప్రతికూల పరస్తితులలో కూడా అతడు విజయం సాధిస్తాడు – > స్వాధీనమైన మానసిక పరస్థితి – ప్రశాంతతకు – ఆ ప్రశాంతత మనశా౦తికి దారి తీస్తాయి – మనశ్శాంతి సంతోషానికి దారి తీస్తుంది – సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోష పరచ గలుగుతాడు – > క్రమ క్రమంగా అతడు చేసే పనుల నాణ్యత పెరుగుతుంది – కాల క్రమేణా తరిగి పోనీ సంపదలను పొందుతాడు – > అయితే దీనికి అర్ధం అతని జీవితంలో ఎటువంటి చీకు చింతలు ఉండవని కాదు – కాని అతనికి వాటిని ఎదురుకోవడానికి కావలసిన ధైర్యము – శక్తి పుష్కలంగా ఉంటాయి – వాటి వల్ల జీవితములో అతడు మరింతగా రాణించగలుగుతాడు – అతడు ఉన్న గృహములో పద్ధతి – క్రమశిక్షణ – ఆనందం – సంస్కృతి – మంచి మానవ సంబంధాలు వెళ్లి విరుస్తాయి – అటువంటి వ్యక్తిని సమాజము మంచి జీవితాన్ని గడిపే – ఒక ఆదర్శ పురుషునిగా కొనియాడుతారు – > మనస్సు స్వాధీనమైన మనిషికి మానసిక రుగ్మతలు కలగవు – మానసిక ఒత్తిడులా వలన కలిగే శారీరక రుగ్మతలు కూడా అతనిని దరిజేరవు – ? మనస్సు స్వాధీనమైన వ్యక్తిలో దాగి ఉన్న – ఉన్నత – దైవ స్వభావము తనను తాను వ్యక్తీకరించుకుంటుంది – అతనిలో అంతవరకు దాగి ఉన్న శక్తులు విడుదల అవుతాయి – తమ కళ్ళ ముందే ఆ వ్యక్తి ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదిగిపోయాడని అందరు ఆశ్చర్యపోతారు – > సంస్కృత బాషలో ఒక సామెత ఉంది :- “ ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు ? మనస్సును ఎవరు జయిస్తారో వారే ” – ప్రగతి – అభివృద్ధి – ప్రశాంతత – ఏ రంగములోలైన వాటిని సాధించాలన్న – మనస్సును స్వాధీనం చేసుకోవడం అవసరము – మనస్సును ఏ వ్యక్తి స్వాదీనములో ఉంచుకోలేడో – తన అభివృద్ధిని తానే అడ్డుకోగలడు – > కాబట్టి మనస్సును స్వాధీనము చేసుకోవటం వల్ల ఇటు వంటి లాభాలున్నాయి – మనస్సు స్వాధీనానికి కావలసిన బలమైన సంకల్ప శక్తిని తయారు చేసుకోవడానికి సులభమైన మార్గము ఒకటు౦ది – అది సాధకులకు అనుభవమే – అది ఆ శక్తిని సాధించ లేక పోతే అధోగతి – పాలవుతామన్న విషయాన్ని మన మనసుకు నేర్పించడమే – > మనసును స్వాధీన పరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యము మీదే మన భవిషత్తు అంతా ఆధారాపడి ఉన్నదన్న – విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తేలియ చెప్పుకోవాలి – > కనీస భౌతిక అవసరాలు తీరిన తరువాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా తోచవచ్చు – కాని జీవితపు సర్వోత్తమమైన – లక్ష్యమైన జ్ఞానోదయాన్ని – దైవ సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే – మనస్సును స్వాదీన పరచుకోవడంకన్న – ముఖ్యమైనది మరొకటి లేదు – ఒక సారి మనము ఈ విషయాన్ని – నిజంగా అర్ధము చేసుకొని – దృడంగానమ్మ గలిగితే మన సంకల్ప శక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది.
3) సుఖ లాలా సత్వాన్ని నిరోధించేది ఎలా ? :- > సుఖాలు కావాలనే కోరికను వదిలించుకుంటే తప్పా – మన మనస్సును పూర్తిగా నియత్రించ లేమని ఇంతకు ముందు చెప్పుకున్నాం – తమ తమ మనసులతో తంటాలు పడుతున్న అనేక మంది ఇది విని అధిరిపడవచ్చు – కాని ఇది నిజాము – ఈ నిజము యొక్క లోతు పాతుల్ని మనము తెలుసు కోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది – > సుఖ లాల సత్వాన్ని వదిలించుకుంటే తప్పా- మనస్సును స్వాధీనము చేసుకోవాలన్న సంకల్ప శక్తి పెంపొందదని – కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పడం సులభమే – కాని స్వాభావికమైన ఈ మనో వికారము ( సుఖ తృష్ణ ) మన రక్త మాంసాలలో ఎంతగా జీర్ణించుకు పోయిందంటే – బ్రహ్మాండమైన కృషి – ప్రయత్నంతో మాత్రమె దాన్ని వదిలించుకోగలము – చాల సార్లు అది అసాధ్యమని అనిపించవచ్చు కూడా – అయితే ఈ విషయములో సుఖాలను కోరడానికి మన దుష్ట స్వభావమే కారణమని ఊహించకోకూడదు – అలా భావించడం వల్ల మన మానసిక పరస్తిత్ని మరింత గంధర గోళంగా తయారవుతుంది – కోరికలను కలిగి ఉండడం పాపము కాదు – కాని నీతి మాలిన కోరికలలో మునిగి పోవడం తప్పు – అవి మనల్ని మరిన్ని బందాలలో పడవేసి – మనలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటాయి – మనుష్యులలో అతి కొద్ది మంది మాత్రమె ఉన్నత స్థితి గతుల కోసము ప్రాపంచిక సుఖ – భోగ అన్వేషణలను విడిచిపెడుతారు – > మానవ జాతిలో అధిక భాగం సుఖము కోసము కాకపోతే మరి జీవించడం దేనికి ? అని సూటిగా ప్రశ్నిస్తారు – ఈ కోరికే జీవ శక్తి – ఈ శక్తి వల్లనే మనిషి జీవిస్తాడు – అయితే ఇదే సుఖ లాల సత్వము – మనసును స్వాధీనము చేసుకోవాలన్న మనసంకల్ప శక్తిని తినివేస్తుంది కూడా – మరి ఈ అంతర్గత సమస్యకు పరిష్కారము ఏమిటి ? – > ఈ కోరికలను క్రమంగా అదుపులోకి తెచ్చి – మన అంతరాత్మ లోతు పాతుల్ని అర్ధము చేసుకొని – ఆత్మ పరిపూర్ణత్వాన్ని సాధించే దిశగా మలుచుకోవాలి – > జ్ఞానులైన సనాతన అధ్యాత్మిక గురువుల – అనుభవము ద్వారా ఆ పరమ సత్యాన్ని తెలిసుకున్నవారికే – ఆత్మ సాక్షాత్కారము – దైవ సాక్షాత్కారము లభించగలదు – > శారీరక సుఖాలను తప్పని సరిగా అనుభవించవలసి వస్తే – వాటికన్న ఉన్నతమైన మానసిక – ఆత్మ ఆన౦దాన్ని అనుభవించడానికి వీలుగా మీ శారీరక మానసిక శక్తులను పోదుపుచేసుకోండి – ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి వీలుగా మీ మానసిక శక్తులను పోదుపుచేస్తూ – అంతరంగిక సుఖాలను అనుభవించండి – > మీ పురోగతి నాశనాన్ని కొనితేచ్చే విధంగా సుఖాలను కోరుకోవద్దు – > ఏ మాత్రపు ఆలోచనా పటిమగల వ్యక్తులకైన ఈ భోధనా సబబుగానే తోస్తుంది – > నైతిక నియమాలు మనిషి తన నాశనాన్ని తానే కొనితేచ్చుకోకుండా సహాయ పడుతాయి – వాటిని పాటించడం ద్వారా మనస్సు స్వాదీనమవుతుంది – కాబట్టి నైతిక నియమాలు మనిషికి అత్యంత లాభదాయకమైనది – > అడవి మృగము లాంటి ఈ సుఖ లాల సత్వాన్ని – మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేలా మచ్చిక చేసుకోవాలి – ఆ తరువాత మాత్రమె – అది – ఉన్నత శ్రేణి – ఉన్నత విద్య అభ్యసించడానికి – సిద్ధమవుతుంది – ఉన్నత విద్య అంటే – బ్రహ్మానందాన్ని పోదడం అని మీలో నిజంగా గట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి – > ఎప్పుడైతే సాధకుడు వేరే ఉద్దేశములేకుండా – భగవంతుడి కోసమే ఆయనను కోరుకుంటాడో – అప్పుడు సుఖాలపై అతని కోరిక క్రమంగా ఆవిరైపోతుంది – ఇది మనస్సును సంపూర్ణంగా స్వాదీనములోనికి తెచ్చుకోవడానికి సహకరిస్తుంది.
4) > ఇంద్రియసుఖాల మీద ఆకర్షణ ఎప్పుడు పోతుంది ? అంటే అఖండ సచ్చిదానంద సాగరమైన భగవంతునులో అన్ని సుఖాలు – సంతోషాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు – ఆ ఆకర్షణ చచ్చిపోతుంది – ఆయనలో ఆనందాన్ని పొందగలిగిన వారికి ఈ చవకబారు ఇంద్రియ సుఖాలలో ఎటువంటి ఆకర్షణ కనిపించదు – > ఎవరైతే తెల్లని – చక్కని పట్టిక బెల్లాన్ని రుచి చూస్తారో – వారికి మురికిగా ఉండే నల్ల బెల్లము రుచించదు – రాజ మహలులో నిద్రించిన వారికి – పూరి గుడిసెలలో నిద్ర సుఖాన్నివ్వదు – > భగవదానందములోని తియ్య దనాన్ని రుచి చూసిన వారికి – అసహ్య కరమైన ప్రాపంచిక సుఖాలలో ఎటువంటి సంతోషము కనపడదు – > చాలామంది సాధకులు తమ ఉద్దేశ్య౦ మంచిదే అయిన – తాము చేపట్టే పద్దతి సరైనది కాకపోవడం వల్ల – తప్పు దోవ పట్టి – తమ కోరికలను వదిలించు కోవడానికి కష్ట పడుతుంటారు – తమ ఆశయము పట్ల వారికున్న నిజాయితీ సరైనవే అయిన చిట్టా చివరకు ఓడి పోతారు – > కాబట్టి సుఖ లాల సత్వ మనే అంత రంగిక జీవిత సమస్యని పరిష్కరించడములో – అడ్డంకులను జాగ్రత్తగా దాటి పోవాలి – > కామము క్రోధము ఈ బలమైన వికారాల దృష్టిని ప్రాపంచిక విషయాల మీద ప్రేమ ఉంచినంత కాలము అవి మనకు శత్రువుల లాగా ప్రవర్తిస్తాయి – > అయితే వాటిని భగవంతుని వైపు మరల్చినప్పుడు అవే మనకు గొప్ప స్నేహితులుగా మారి – మనల్ని భగవ౦తుని వద్దకు చేరుస్తాయి – ప్రాపంచిక సుఖాల పట్ల ఉన్న కోరిక భగవంతునికై ఆరాటంగా మార్చుకోవాలి – తోటి మనుషుల పట్ల ఉండే కోపాన్ని – తనకు తానుగా మనకు కనిపించనందుకు భగవంతునిపై చూపాలి – కోరికలన్నింటిని ఇదే విధంగా దారిమల్లించి సరియైన త్రోవలో పెట్టాలి – ఈ మనో వికారాలను మట్టు పెట్టలేము కాని – వాటికి మంచితనాన్ని నేర్పించవచ్చు – > వాటిని ఉన్నత ఆదర్శాలతో జత చేస్తే మనము కూడా ఉన్నత స్థితులకు ఎదుగుతాము – > వాటిని పరమాత్మకు అను సందానిస్తే – వాటి చోదక శక్తితో మనము కూడా ఆ స్థితికి ఎదుగుతాం – మరొక వైపున అవి మంచిన నేర్చుకొని పరిశుద్ద మవుతాయి – అప్పుడు వాటిని మామూలు కోరికలుగా భావించలేము – > ఎవరైతే అనుభవ పూర్వకంగా తానూ ఆత్మనని – ఈ శరీరాన్ని – మనస్సును కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో – అప్పుడు కోరిక అంతరిస్తాయి – ఎందుకంటే ఈ కోరికలు మనోవికారాలు – తప్పుదారి పట్టినవి మాత్రమె – > మరొక మాటలో చెప్పాలంటే – మనము చూపిన మార్గాన్ని బట్టే కోరిక – మనకు మిత్రులు గాని – శత్రువులు గాని అవుతాయి – > కోరికలను సత్యము ( పరమాత్మ ) వైపు మరల్చితే అవి మనల్ని బంద విముక్తుల్ని చేసి – ఆనందాన్ని కలిగిస్తాయి – వాటిని అసత్యము వైపు లేదా మిథ్యవైపు మరల్చితే – అవి మనల్ని బందాలలో – బాదలలో పడేస్తాయి.
5) మానవుడు స్వభావ సిద్దంగా సచ్చితానంద స్వరూపుడు – ఆనంద మనేది అతనికి స్వాభావికమైనది – సర్వోత్కృష్ట – సత్యమైన – ఆ ఆనందము – మానవుడు నిజానికి వేరు వేరు కాదు – అందువల్లనే వేదాంతము – మానవుని సుఖలాల సత్వము ఆ ఆనందములో వేళ్ళూనుకోని ఉందని సూచిస్తుంది – > తైత్తరీయ ఉపనిషత్తు ఇలా బోదిస్తుంది – > సృష్టికి మూలమైన పరమాత్మయే నిజానికి ఈ ఆనందానికి మూలము – ఎవరైతే దాన్ని చవి చూస్తారో వారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు – అనంతాకాశములో ( హృదయములో ) ఈ ఆనందమే లేకపోతె ఎవరికైనా ఊపిరి తీయడం – వదలడం కూడా సాధ్య పడవు – ఇది ఒక్కటే నిజానికి జీవించేలా చేస్తుంది – >> ఆనదము నుండే సమస్త జీవరాసులు పుట్టాయి – పుట్టిన నాటినుంచి – ఈ ఆనందము వల్లనే జీవించి ఉంటాయి – దీనిని వదిలి పోయినపుడు ఆ ఆనందములోనే లీనమవుతాయి – > మనిషి యొక్క ఉనికియే ఈ ఆన౦దములో వేళ్ళూనుకోని – ఉండడం చేత అతడు అప్రయత్నంగానే దానితో ఏకమవ్వాలని కోరుకోవడం సహజము – కాని మనిషి అజ్ఞానములో ఉండి – తనను తానూ ఈ దేహంగాను – మనస్సు గాను భావిస్తున్నంత కాలము – ఈ ఆనందాన్ని తన ఆత్మలో చూడలేదు – > తన అజ్ఞానము వల్ల తన దేహము ద్వారా – మనస్సు ద్వారా దాన్ని పొందాలను కుంటాడు – కాని చోట – కాని దాన్ని వెతకడం వల్ల – సుఖలాల సత్వము వల్ల – దాని ఫలితంగా ఏర్పడే బందాలు – కష్టాలు కలుగుతాయి – > మనము ఇంతముండు చెప్పుకున్నట్లుగా ఆనందం శరీరము వల్ల కలిగే సుఖము కాదు – అది సుఖ దుఃఖాలకు అతీతమైన – దాన్ని మనము దేహస్థాయిలో గాని – మనస్సు స్థాయిలో గాని ఎప్పడికి వేరుగా చూడలేము – > మనిషి సహజ స్వభావము అతన్ని ఆనందం కోసం అర్రులు చాచేల చేస్తుంది – చాల కష్టాలు పడి – గొప్ప నిలకడ తన౦తో దాన్ని భౌతిక – మానసిక స్థాయిలలో ఎంతో వెదికిన తరువాత ఎట్టకేలకు అది తన ఆత్మలోనే ఉందని – > అనంత మైన పరమాత్మయే తన ఆత్మ అని తెలుసుకుంటాడు – > అప్పుడు మాత్రమె ఛాందోగ్య ఉపనిషత్తులలో చెప్పబడిన – “ అపరిమితమైన దానిలోనే ఆన౦దమున్నది – గాని పరిమితమైన దానిలో కాదు ” అన్న బోదనను అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాడు – > ఈ సత్యాన్ని అనుభూతి చెందాలంటే మనిషి ఎదో ఒక స్థితిలో ఆనందం – సుఖ దు:ఖాల కంటే వేరైనదని – దాన్ని పొందాలంటే – మనస్సును స్వాధీనము చేసుకొని – తన సుఖలాల సత్వాన్ని వదులుకొని ఉన్నతమైన మార్గానికి మరల్చుకోవాలి.
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్దమనస్సుతో తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/14/2016
🌺 ఓం శ్రీ అచ్చుతార్పణమస్తు 🌺
“ మెదడు ” 4వ భాగము
1) మెదడులో భాగాలు :- మెదడులో ముఖ్యంగా అయిదు బాగాలు ఉన్నాయి. 1, పెద్ధ మెదడు ( సెరెబ్రం ). 2, మీసెన్ సెపలాన్. ౩, పాన్స్. 4, చిన్నమెధడు. ( సెరేబెల్లం ). 5, మెడుల్లా అబ్లాంగేటా. -> ఈ అయిదు బాగాల్లో సెరెబ్రము పెద్ద మెదడు అంటారు .అందుకని సెరెబ్రం అన్నా – పెద్ద మెదడు అన్నా ఒక్కటే – శాస్త్రజ్ఞులు సెరెబ్రములోని భాగాలని – తిరిగి “ లోబ్స్ “గా ఇలా విభజించారు. – > 1) సెరేబ్రం ( పెద్ద మెదడు ) ముందు బాగము – ప్రాంటల్ లోబ్ – 2) సెరెబ్రం ( పెద్ధ మెధడు ) పార్శ్వ ( ప్రక్క) బాగం – పెర్హేటల్ లోబ్. ౩) సేరెబ్రం (పెద్ద మెదడు ) వెనుక బాగం – అక్సిషిటల్ లోబ్. 4) సెరెబ్రం ( పెద్ద మెదడు ) పార్శ్వబాగం ( ప్రక్క) లోని ముందు బాగం –టేoపొరల్ లోబ్. 5) సెరెబ్రములోని మరొక బాగము – ఇన్సులా.
2)మెదడు పైన ఉల్లిపోరలు :- >మెదడు పైన ఉల్లి పొరలాగా మూడు పొరలు ఉంటాయి. ఈ పొరలనే “ మేనింజేస్ “ అంటారు. > పైన ఉండే పోర – 1) డ్యూరా మేటర్ – ఇది బయటి బాగము లో ఉంటుంది. 2) రెండవ పొర – ఎరక్ నాయిడ్ – ఇది మెదడు పైన ఉండే మూడు పొరల్లో మధ్య పొర.
౩) మూడవ పొర – పయామాటర్ – ఇది లోపలి పొర – మెదడును అంటుకొని ఉంటుంది – ఈ మూడు పొరలు ఉపరి తలము పైన ఉంటాయి గాని లోపల కాదు – > ఇవి వట్టి పొరలు కాదు – వీటి వల్ల మెదడుకు ఎంతో రక్షణ ఉంటుంది ఒక్కొక్కసారి ఇవి జబ్బు పడితే ప్రాణాపాయం కలుగుతుంది.
4) మెదడులో ఉప విభాగాలు :- > శాస్త్రజ్ఞులు మెదడులో ముఖ్యంగా ఐదు భాగాలున్నాయని పేర్కొన్నా – మరికొన్నింటిని ఉప విభాగాలుగా నిర్దేశించారు – > ఒకటవ విభాగము – డై ఇన్ సేఫలాన్ : ఇందులో ఎఫిథలామస్ – థలమస్ – హైపో థలమస్ ఉంటాయి – > రెండోవ ఉప విభాగము – మైలిన్ సేఫలాన్ : ఇందులో కార్పోరా క్వాడ్రిజేమినా – టేగ్ మెంటం – క్రూరా సేరెబ్రై – మెడుల్లా ఓబ్లాంగేటా ఉంటాయి – > మూడవ ఉపవిభాగము – మేటిన్ సెఫలాం : ఇందులో సెరెబెల్లం – ఫాన్స్ ఉంటాయి – > నాలుగవ ఉప విభాగము – టెలెన్ సెఫలాం : ఇందులో లైనెన్ సెఫలాం – కార్పోరాస్ట్రయేటా – సెరెబ్రల్ కార్టెక్స్ ఉంటాయి.
5) మెదడు అంటే ఒకటి కాదు రెండు – పైకి అలాగే కనబడినా అంటుకొని ఉన్న కవలలాంటివి – ఒక వేరుశనగ గింజ గాని లేదా ఇంకేదైన పప్పు గింజ గాని తీసుకోండి – పప్పు గింజ పైకి చూడడానికి అదంతా ఒక్కటేలాగా అనిపిస్తుంది కాని ఆ గి౦జని గట్టిగా నొక్కండి – రెండు పప్పు బద్దలుగా అవుతుంది – రెండు పప్పు బద్దలు సైజులో గాని – రూపములో గాని ఒకే విధంగా ఉంటాయి – అలాగే మెదడుని కూడా నిలువుగా మధ్యలోకి చీల దీస్తే ఒకే రూపములో ఉండే రెండు భాగాలు కనబడుతాయి – > వీటినే కుడి, ఎడమ సెరెబ్రల్ హేమిస్పియర్స్ అంటారు – ఈ రెండింటిలోను సమానంగా ఒక్కటే విధమైన నాడీ కేంద్రాలు – నాడీ కణాలు ఉంటాయి – > తలని మధ్యగా నిలువుకోత కోయగా కుడివైపు సెరెబ్రల్ హేమిస్పియర్ ని చూపించే విధము ఇది – మెదడు కుడివైపు భాగములో ఏ భాగాలు ఉంటాయో – ఎడమ వైపు ఉండే మెదడు భాగములో కూడా అవే ఉంటాయి – > అద్దములో మొఖము చూసుకుంటే కూడా కళ్ళు – చెవులు – నోరు – ముక్కు అన్నీ ఒకటేలాగా ఉంటాయి కదా – ? అదే విధంగా రెండుగా చేసినా ఒకేరకంగా కనబడతాయి – > ఒకటి మాత్రం తెలుసుకోవాలి – కుడివైపు సెరెబ్రల్ (పెద్ద మెదడు) హేమిస్పియర్ లోని నాడీ కేంద్రాలు – ఎడమ వైపు మానవ శరీరములోని భాగాలను కంట్రోల్ చేయడం – ఆజ్ఞాపించడం చేస్తుంటే – ఎడమ వైపు పెద్ద మెదడు ( సెరేబ్రల్ హేమిస్పియర్ ) కుడి వైపు శరీరములోని భాగాలని కంట్రోల్ చేస్తుంది – ఆజ్ఞాపిస్తుంది – ఈ విషయాన్ని బాగా తెలుసుకోవడం ముఖ్యము – > ఎందుకంటే కుడివైపు రక్తనాళాల్లో – రక్తము గడ్డ కడితే పక్షవాతం ఎడమ వైపు వస్తుంది – > అలాగే ఎడమ వైపు జరిగితే కుడి వైపు పక్షవాతం వస్తుంది – అంతే గాని ఏ వైపు భాగము ఆ వైపు శరీరాన్ని కంట్రోల్ చేయడం ఉండదు.
6) మెదడులో కొన్ని ఖాళీ స్థలాలు కూడా ఉంటాయి – ఈ ఖాళీ స్థాలాలని “ వెంట్రికల్స్ ” అంటారు – > ఈ ఖాళీ స్థలాలు మొత్తము నాలుగు వీటినే 1) “ లేటరల్ వెంట్రికల్ ” 2) “థర్డ్ వెంట్రికల్ ” 3) “ సెలెబ్రల్ యాక్విడక్ట్ ” 4 వది “ పోర్త్ వెంట్రికల్ ” అంటారు – > లేటరల్ వెంట్రికల్స్ రెండు – ఇవి కుడి – ఎడమ సెరెబ్రల్ హేమిస్పియర్స్ చేరోకటి ఉంటాయి – > డై ఇన్ సేఫలాన్ లో ఉండే వెంట్రికల్ – ఇది మెదడులో మూడవ ఖాళీ స్థలము – ఇది మూడవ ఖాళీ స్థలము ఎలా అయ్యిందంటే లేటరల్ వెంట్రికల్స్ వాళ్ళ కుడి ఎడమ భాగాలలో – రెండు ఖాళి స్థలాలు ఏర్పడినందునే – > మెడుల్లా ఉండే వెంట్రికల్ నాలుగవ ఖాళి స్థలము – ఈ ఖాళీ స్థలాలన్నీ ఒక విధమైన కాలువలు అనవచ్చు – ఈ కాలువలు ఒక దాని కొకటి ఎక్కడో ఒక చోట కనక్షన్ అవ్వడము జరుగుతుంది – > లేటరల్ వెంట్రికల్స్ రెండూ మూడవ వెంట్రికల్ తో కలుస్తాయి – > ఈ మూడవ వెంట్రికల్ – మరొక చోట నాలుగవ వెంట్రికల్ తో కనక్షన్ పొందుతుంది – > ( థర్డ్ వెంట్రికల్ లో “ ఆత్మ ” ఉంటుంది – > ఫోర్త్ వెంట్రికల్లో “ ప్రాణ ” ఉంటుంది ) – > నాలుగవ వెంట్రికల్ చివరికి “ సబ్ఆర్కనాయిడ్ స్పేస్ ” తో కలయిక చెందుతుంది – > ఈ రకంగా ఉన్న ఖాళీ స్థలాలు వేరు వేరు చోట్ల ఉన్నపటికీ ఎక్కడో ఒక చోట వాటి మధ్య లింకు ఏర్పడుతుంది.
7) వెన్నులో – తలలో నీరు :- మెదడులో ఉన్న నాలుగు ఖాళీ స్థలాలు ఎమ్టీ స్థలాలు కాదు – > అవి నీరుతో నిండి ఉంటాయి – > ఆ నీరుని సెరెబ్రో స్పయినల్ ప్లూయిడ్ అంటారు – > ఈ నీరు కోరాయిడ్ ప్లేక్సేస్ నుండి తయారవుతుంది – > కోరాయిడ్ ప్లెక్సస్ అనేది మెదడులో ఒక చోట ఉన్న రక్తనాళాల సముదాయము – > ఈ రక్తనాళాల సముదాయము ఖాళీ స్థలాల్లో ఒక చోట ఉంది – > కోరాయిడ్ ప్లెక్సస్ ఉండే రక్తము నుండి నీరు వేరై వెంట్రికల్స్ లోకి చేరుతుంది – ఈ నీరు ఎంతో పరిశుభ్రమైనది – > మెదడులో ఉన్న ఖాళీ స్థలాల లోకి ఇలా చేరిన నీరు వెన్ను పూసలో ఉండే నాడీ మండలము చుట్టూ ఉండే ఖాళీ స్థలము లోకి చేరుతుంది – > వెన్ను పూస మీద ఉండే ఖాళీ స్థలాన్ని సబ్ ఆర్కనాయిడ్ స్పేస్ అంటారు – > మెదడు ఉపరి తలము మీద ఉండే పొరలే వెన్ను పూసలో ఉండే నాడీ మండలం మీదికి కూడా ప్రయాణిస్తాయి.
8) మెదడు నరాలు :- మెదడులో ఉండే కోటాను కోట్ల నాడీ కణాలు ( న్యూరాన్స్ ) కి సంభందించిన నరాల పోగులు వెన్ను పూసా ద్వారా ప్రయాణించి శరీరమంతా చేరుతాయి – > 12 జతల నరాలు వెన్ను పూసతో సంభందం లేకుండా తిన్నగా ముఖానికి – మెడకి కాస్త క్రిందికి ప్రయానిస్తాయి – ఈ నరాలని “ క్రేనియల్ నర్వ్స్ ” అంటారు – > క్రేనియల్ నర్వ్స్ ముఖ్యంగా ముఖానికి చేరి ముఖానికి సంభందించిన కండరాల కదలికని కలిగిస్తాయి – వాసన – రుచి – వినికిడి చక్కగా ఉండేటట్లు చేస్తాయి.
9) మెదడులో గ్రంధులు :- మెదడులో ప్రధానంగా రెండు గ్రంధులు ఉన్నాయి – ఇవి ముఖ్యమైన పనులని నిర్వర్తిస్తాయి – ఆ రెండు గ్రంధుల్లో ఒకటి పిట్యూటరీ గ్రంధి – రెండవది పినియల్ గ్లాండ్ – > స్పర్శ – వేడి – చల్లన – నొప్పి మొదలైనవి శరీరము లోని వివిధ భాగాల నుండి నరాల ద్వారా – మెదడుకు చేర వేయబడుతాయి – ఈ రకంగా జరిగే ప్రక్రియని – సెన్సర్ సిస్టమ్ అంటారు.
——- సశేషం ——-
పై విషయాల్ని మీ అందరికి తెలిసినవే ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
0944420240 – 14.06.2016
6/16/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
అంతరంగం పిలుస్తుంది రా ! ౩ వ బాగము
1) మన దేహములోని సూక్ష్మ శరీరమే – అంతరంగము- అది మనలని అడుగుతుంది ఎన్ని రకాల జన్మలను – వేటి , వేటి లో ఎత్తిస్తావు -? ఇంకా ఎన్ని కోట్ల సవంత్సరాలు నేను జన్మలు వేత్తాలి – నీకు విసుగు రావడములేదు కాని నాకు రోత పుడుతుంది – ఓ మానవ-? > విముక్తి పొందడానికి – మోక్షము పొందడానికి –మరోక సారి దైవ మానవ జన్మ ఇచ్చి ఇప్పుడైనా మోక్షము పొందు – అని అంటే నీవు నా ఆక్రందన పెడచెవిన పెట్టి నీ దారిలో నీవు ప్రయాణిస్తున్న – ఓ మానవుడా ! ఇకనైనా ఆలోచించు –? >నేను నీ అంతరంగాన్ని- చెపుతున్నా! – నేను ఈ జన్మలలో సూక్ష్మంగా – స్థూలంగా – పడుతున్న భాధలు వర్ణానాతీతము –ఏవరు వింటారు నాబాధలు –నీకు చెవులున్నా వినపడవు – కళ్ళున్న కనపడవు – అంత మొద్దు నిద్దుర పోతున్నావు – ఒక దైవముయొక్క బిడ్డనైన నాకు ఇన్ని కష్టాల పాలు చేయడము నీకు న్యాయమా ? ఎన్ని కోట్ల సంవత్సరాల తరువాత మేల్కొంటావో- ఇంకా ఎన్ని జన్మలు ఎత్తమంటావో-ఎన్ని గడపలు నన్ను తోక్కమంటావో – ఎన్ని గర్బాలు దరించమంటావో –ఎన్ని ఆటుపోట్లకు గురిచేస్తావో – ఎందరితో దు:ఖానికి గురి చేయిస్తావో – ఎందరితో తన్నిస్తావో – తన్నులు తిని , తిని ఈ మానవజన్మకావాలని కోరుకొని నేనువస్తే –ఈ మానవజన్మలోనైన మా పుట్టింటికి పంపిస్తావని – ఏరికోరి మనసు పడి నేను వస్తే – మళ్ళి ,మళ్ళి హీనమైన జన్మలు ఎత్తమని –నీవు తయారు చేసి పంపిస్తున్నావు ఓ మానవా నీకు ఇది న్యాయమా -? నాగోడు వినపడుటలేదా -? ఆ జన్మలు ఎత్తినప్పుడు వాటిలో జ్ఞానము లేదు – జ్ఞానము వున్న మనిషిలో జన్మ ఎత్తి విముక్తి పొంది –మా పుట్టింటికి వెళ్ళాలన్న కోరిక –కోరికగానే మిగిలిపోతుందా ? ఓ మానవా ! అంతా నీ చేతులలోనే వుంది నా తలరాత –ఏమి చేస్తావో అని బెంగ బెంగ గా వుంది – పోయిన మానవ జన్మలో చేసినవిధంగా చేసి –మళ్ళి నరక కూపములో జన్మలు ఎత్తు అని చేపుతావో – నన్ను కడతేర్చి నా తల్లి ఇంటికి పంపుతావో –ఏమో అంతా అగమ్యగోచరంగా వుంది – ఓ బుద్దికల్గిన మానవుడా !
2) మోక్ష మనగ విడుదల – బంధమునుండి విడుదల –దు:ఖభూయిష్టమగు సంసార బంధమునుండి విముక్తి నొందుటయే మోక్షము – పుట్టుక చావుల నుండి తప్పించు కొనుటయే మోక్షము – అవిచ్చిన్నఆత్మానందానుభూతిని బడటయే మోక్షము –స్వస్వ రూపమగు దైవమందు నిలుకడ కలిగి యుండుటయే మోక్షము –దేహబారమును –మనోబారమును – జీవబారమును వదిలించు కొనుటయే మోక్షము – బారరహితమగు ఆత్మయందు నిలుకడ కలిగి యుండుటయే మోక్షము ->అనాది కాలము నుండి జీవుడు సంసార బంధమునుందు – తగులుకొని అజ్ఞాన శృంఖలముచే బద్ధుడై – తన స్వస్వరూప మునుమరచి తాను దేహమని భ్రమించుచు నానాయాతనలను అనుభవించు జనన మరణ రూప సంసార చక్రమందు పరిభ్రమించుచున్నాడు – వాస్తవముగా అతడు బద్ధుడు కాడు – ముక్తుడు – మాంసమయుడు కాడు –మంత్రమయుడు – మృన్మయరూపుడు కాడు – చిన్మయమూర్తి – పోతపోసిన సచ్చిదానంద విగ్రహమే మానవుడు – ఈ సత్యమును ఉపనిషత్తులు పని కట్టుకొని పదే,పదే హెచ్చరిస్తున్నాయి – కాని వ్యవహార మగ్నుడగు జీవుడు శృతి భగవతి యొక్క ఆ మహత్వపూర్ణ వ్యాక్యములను సరిగా అర్ధము చేసుకొనక – తన అల్పబుద్ధికి తోచినదే సత్యమని – నమ్మి తద్రీతి ఆచరించు చున్నాడు – దృశ్యవైభవములే తన జీవిత లక్ష్యమని బావించి – పాంచ బౌతికమై న అల్ప కాయమే తానని యెంచి – తన చుట్టూనున్న బంధుమిత్రసుతాదులు ఆ చంద్రతారార్కముగ – విలసిల్లుదురని సత్యవస్తువును ఉపేక్సించి అసత్య వస్తువును ఆశ్రయించి సంసారమను ఊబిలో దిగబడి పోవుచున్నాడు – ఇక కడతేరు మార్గమేది ? ఇదియే ఇప్పుడు యోచించవలసిన ముఖ్య విషయము – జీవునకు దు:ఖమనునది స్వభావ సిద్ధము కాదు – ఆగంతుకము – పరమానందమయుడగు జీవుడు తన నిజస్వరూపమును విస్మరించినందువలననే ఈ బంధము , ఈ జంజాటము నెత్తిన వచ్చి పడినది – శాస్త్రపరిచయము లేని కారణముచేతనే , పెద్దల సాంగత్యము లోపించుటవలననే మనుజునకు ఈ సంసార తాపత్రయను తగుల్కొని బాధించుచున్నది – అసలు జీవునకు ఏ కాలమందును భంధము లేదని జీవుడు వాస్తవముగా నిత్య శుద్ధ బుద్ద ముక్త – ఆత్మ స్వరూపుడే యనియు సర్వులును ముందుగా గుర్తేర్గవలెను – తాను బద్దుడని – అల్పుదని – కాలగ్రస్తుడని నిరంతరం బావించు చుండుటవలన ఇట్టి సంకుచిత భావములకే హృదయమున తావొసంగుట వలన – జీవుడు అధోగతిని పొందుచున్నాడు – > ( క్రుశోతి దు:ఖీ బద్ధోహం ) అని వసిష్ట గీతలో వసిష్ట మహర్షి చెప్పిన చందమున “ నేను కృశించిన వాడను – అతి దు:ఖ వంతుడను – బద్దుడను – రెండు చేతులు – రెండు కాళ్ళు కలవాడను – ఇంత మాత్రమె నా స్వరూపము అని తలంచువాడు – తదను సారము వర్తించు వాడు భందింప బడుచున్నాడు.
3) నేను దు:ఖ వంతుడను కాను – నాకు వాస్తవముగా దేహము లేదు – ఆత్మకు భంధ మెచట ? అని తలంచు వాడు – ఆ ప్రకారముగా వర్తించు వాడు ముక్తిని బడయుచున్నాడు – సుఖ దు:ఖ ముల యొక్క – బంద మోక్షముల యొక్క కీలక మిచటనే యున్నది – అజ్ఞానమే దు:ఖ హేతువు ఆత్మ చింతన లేక పోవుటయే అశాంతికి కారణము – > జనులు ఈ సత్యమును గుర్తెరిగి సత్యా అన్వేషణను శీఘ్రముగా ప్రారంభించవలెను – దు:ఖ నివారణముకు వేరొక మార్గము లేదు – > చీకటిలో పామును చూచి కంగారు పడి ఒకడు నానా భాధలు పొందుచున్నాడు – దీపము తెచ్చి చూడగా అచట పాము లేదు తాడు మాత్రమె కలదు – చీకటిలో మనుజుడు పొందు దు:ఖ పరంపరలు ఇతరమగు ఏ ఉపాయము చేతనో తొలగ నేరవు – దీపం తెచ్చినప్పుడే అవి పోగలవు – అట్లే అందకార భందురమైన – ఘోర తమస్సు నందు పది కోట్ల కొలది జన్మలు నానాయాతనలు అనుభవించుచున్న జీవుడు ఆత్మ జ్ఞానమను జ్యోతిని వెలిగించినప్పుడే పరమ శాంతిని – దు:ఖ రాహిత్యమును పొందగలడు – అట్టి యత్నమును శీఘ్రముగా ఈ మానవ జీవిత మందే ఓనర్చి లక్ష్యమును సాధించి వేయవలెను – అవకాశాములన్నియు హస్త గతములై యున్న – ఇట్టి అమూల్య సందర్భమును – పోగొట్టు కొనుట దౌర్భాగ్యమే యగును – > “ సుప్తే రుత్థాయ సుప్త్యన్తం బ్రహ్మైకం ప్రవిచిన్త్యతామ్ ” ఉదయము నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకును బ్రహ్మమును గూర్చియే లెస్సగా చింతన ( సదా ) చేయుచుండ వలెనని శాస్త్రము ఈ ప్రకారము చెప్పినవి – > “ నాతిదూరే నృణాం మృత్యుతితి వేదా న్తడి౦డిమః ” – > ఓ జనులారా ! మృత్యువు దూరముగా ఉన్నాడని భ్రమించకుడు – అది చేరువ లోనే ఉన్నది – కావున త్వరపడుడు – విజ్ఞానమును సముపార్జించుడు – మరిచిన మీ దివ్య స్వరూపమును తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోనుడు – మహాత్ముల – నిజమైన గురువుల ఆశ్ర యింపుడు – సాధన చేసి కడ తేరుడు – బందనము నుండి విడుదల పొందుడు – మీ స్వస్వరూపమగు ఆత్మను పొందుటయే మోక్షమని ఎరుంగుము.
4) అజ్ఞానుల మనః ప్రవ్రుత్తి :- > శాస్త్రములు ఈ ప్రకారముగా ముక్త కంటముతో బలుకు చుండ – శంఖారావము బధిరుని కర్ణ గోలమున ప్రవేశించని చందమున అజ్ఞులగు జనులు వాని నంతగా పట్టించుకొనుట లేదు – దైవ మీ మాంస చేయక పొగ – దేహ మీ మాంసములోనే – కాలము నంతయు వినియోగించు చున్నారు – అనగా దేహ చింతన – దృశ్య పదార్ధ చింతన లోనే మునిగి పోవుచున్నారు – మాంస మాయమగు శరీరమును గూర్చిన రంది జనులను పట్టి పీడించు చున్నది అజ్ఞులు మట్టి ముద్దయగు దేహమే తమ జీవిత సర్వస్వ మను భావన కలిగి యున్నారు – > తొమ్మిది రంద్రముల తోలు తిత్తియే తానని – దానికి సంబందించిన వారందరూ తనవారని – అహంకార – మమకారములు కలిగి భ్రమలో చిక్కుకోనుచున్నారు – రక్త మాంసములతో గూడి జడమై యున్న ఈ పంచభూత సమూదాయ నిర్మిత వస్తువు యొక్క అందచందములను జూచి ఆనంద పడుచు – దాని సౌందర్యమును చూచి మురిసి పడుచు దాని ఘనతను గూర్చి – చర్చించు కొనుచున్నారు – దేహము యొక్క సౌందర్య నిర్ణయ మందు సామాన్యముగా ప్రముఖ పాత్ర వహించు చున్నారు.
5) ఆత్మ సత్ – చిత్ – సుఖ స్వరూప మైయున్నది – అది సమస్త దేహముల యొక్క ప్రభువై విలసిల్లు చున్నది – ఇది అనుభవ సిద్దము – ఇట్లుండ మూడ బుద్ధి యగు జీవుడు అనిత్యమగు దేహమే తానని భావించి దేహాత్మ బుద్ధి నాశ్రయించుచున్నాడు – > జనులు తమ యోక్కయు – ఇతరుల యొక్కయు శరీరములను బాహ్యమున ఎముకలు – మాంసము – రక్తము – క్రొవ్వు మున్నగు వానితోను – లోపల మలమూత్ర కపాదుల తోనూ నిండి యున్నట్లు తెలిసి కొనిగూడ తిరిగి – > ఈ దేహము పుత్ర మిత్ర సతీ సుతులు – సేవకులు – గుఱ్ఱములు – ఎద్దులు మున్నగునవి అన్నియు నాయొక్క సుఖములకు సాధనములని తలంచి – ఈ మాంస మీ మాంస యెందే – తమ అమూల్య మానవ జీవితమును భ్రష్ట మొనర్చుచున్నాడు – మరియు దేని ద్వారా జనులందరూ తమ తమ జీవితములను దరించు చున్నారో – తమ తమ వ్యవహారములను గావింప గలుగు చున్నారో ఏది వారి యొక్క సౌభాగ్యమునకు హేతువైయ్యునదో – ఏది వారి యొక్క అంతఃకరణ మందే స్థితి గలిగి యున్నదో అట్టి ప్రాణా దీశుడైన అమృత ఆత్మ యొక్క తత్వమును గూర్చి – వారు ఒకింత అయినను విచారణ చేయుట లేదు – ఏమి అశ్చర్యము – > జనులు తమ తమ జీవితమూ లందు కొంత మార్పును – సంస్కారమును కలుగ చేసుకోన వలెను – బుద్బుద ప్రాయమైన ఈ జీవిత మందు మీన మేషములు లేక్కించుచు – వ్యర్ధముగా కాలయాపన చేయుట గాని – విషయ భోగ లాలసులై పారమార్ధిక అవకాశములను జార విడుచుట గాని – దేహెంద్రియాది దృశ్య పదార్ధములపై మమత్వము అహం బుద్ధి కలిగి యుండుట గాని – తన హృదయా౦తర్గతమగు ఆత్మ దేవుణ్ణి విస్మరించుట గాని విజ్ఞులకు పాడి కాదు – కాలమును వృదా చేయక దైవ చింతన ఆత్మ చింతన గావించు కొనుచు జీవితములను సౌభాగ్య వంతునులుగా తీర్చి దిద్దుకొను వలెను.
1) > దాన ధర్మమూ చేయక లోభి డబ్బును కూడా బెట్టు చున్నాడు = > వానిని చూసి డబ్బు నవ్వు చున్నది
2) > ఇది నా భూమి అని మనుజుడు గొప్పగా చెప్పు కొనుచున్నాడు = > వానిని చూసి భూమి నవ్వు చున్నది
3) > దృశ్య విషయములపై వ్యామోహము కలిగి మనుజుడు దాని వెంట పరుగిడుచ్చున్నాడు = > వానిని చూసి ఇంద్రియములు నవ్వు చున్నవి
4) > మరణ రహితుడగు పరమాత్మను సేవించక దేహమే తానని మానవుడు మురిసి పోవుచున్నాడు = > వానిని చూసి మృత్యువు నవ్వు చున్నది.
> మానవుడు అజ్ఞాన వశమున తన అమూల్య జీవితమును తన వికృత చేష్టలచే నవ్వుల పాలు గావించు కొనుచున్నాడు.
పై విషయాలన్ని మీకు తెలిసినవే – ఏమైన పొరపాట్లు ఉంటె తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/19/2016
🌺 ఓం శ్రీ అచ్చుతార్పణమస్తు 🌺
“ ప్రాణ ” 4 వ భాగము
1) సకల చరాచర సృష్టికి మూలమైన ప్రాణము అన్నీ దేహములలోను – అంతట వ్యాపించి ఉన్నటువంటి ప్రాణున్ని, ఆత్మను తెలుసుకోవలసిన అవసరం ఈ మానవులకు అత్యవసరం – అందులో భాగంగానే ఈ దేహములో ఉన్న ప్రాణాన్ని అన్వేషిస్తూ యోగులు, ఋషులు, మునులు, తపస్సులు తమ ప్రాణాయామం ద్వారా – “ మాడు ” లోపల బ్రహ్మ రంద్రమున్న చోట – చైతన్యపు వెలుగు ఉంటుందని దర్శించారు – ఈ వెలుగువల్ల ప్రాణ శక్తి అను రంజితమై ఉంటుంది – అంతేకాకుండా ప్రాణ ప్రవాహము వేలకొద్ది నాడుల్లో గుండా ఇంద్రియాలకు దేహానికి చైతన్యం ఉండేటట్లు చేస్తాయి – ఈ ప్రాణ శక్తి తాలుకు ఒక ముఖ్య ప్రవాహము మేరుదండం ( వెనుబాము ) లోపల సాగుతూ ఉంటుంది – వీటిలో సుషుమ్నే ప్రాణ శక్తికి ఆధారము – ఏ విధంగానైనా ప్రాణ ప్రవాహాన్ని సుషుమ్నలో సంచరించేటట్లు చేయగలిగేటట్లయితే తిరిగి దివ్య జ్ఞానం వస్తు౦ది – ఇందువల్ల ప్రాణ ప్రవాహాన్ని సుషుమ్నలో సంచరింప చేయ గలిగే సాధనను యోగులందరు అన్నీ విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు – తల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణ ప్రవాహము ఇడ పింగళా నాడుల్లో ఉండదు – సుషుమ్నలోనే ఉంటుంది – గర్భము నుండి భూగర్భము మీద పడటం తోటే సుషుమ్న అడ్డుకుపోతుంది – ఆ ప్రాణ ప్రవాహము ఇడా పింగా నాడుల్లోకి వచ్చి పడుతుంది – గర్భములో ఉన్నప్పుడు యోగిలా ఉన్నవాడు భామిమీద పడి మట్టి కరిశాడు – ఈ మాట యోగ శాస్త్రములో కుడా ఉంది – సాధకులు ప్రాణాన్ని సుషుమ్నలోకి నడిపింప చేస్తుంటారు – ఫల స్వరూప ప్రాణము, మనస్సు సుషుమ్న లోపలి నుంచి బ్రహ్మ రందములోకి ప్రవేశిస్తుంది – సుషుమ్నాలోకి ప్రవేశించిన మీదట ప్రాణానికుండే చ౦చలత పోతుంది – స్థిరత్వం వస్తుంది – అంతేకాకుండా ఈ స్థితిలో సాధకుడి మనస్సు పరమాన౦ధముతో మునిగిపోతుంది – అంతేకాకుండా కదలికలేని స్థిర సమాధిలో ఉండి పోతుంది – సాధకుడికి మేరు దండ౦లో ఉన్న దైవ శక్తి తాలుకూ కాంతి అనుభవములోకి వస్తుంది
– ప్రాణా యామం ద్వారా తనలో ఉన్న మాయా ఆవరణ క్షయమై పోయిన మీదట అంతట – ఆత్మా సాక్షాత్కరిస్తుంది – ఆత్మా తాలూకు ప్రకాశ శక్తి విడుధలవుతు౦ది – ప్రాణాయామం ద్వారా ప్రాణము ఆశనోత్పత్తి జరిగి ప్రాణ స్వీకారము జరిగిన తరువాత ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది – అపూర్వ శక్తి వికసిస్తుంది – అప్పుడూ ప్రాణం ఆత్మతో ఒకటవుతుంది – అందువల్ల యోగభ్యాసం చేయడం అందరి కర్తవ్యం – యోగా మార్గాన్ని విడిచి పెట్టి కుటుంభాన్ని పాలించడం తగినది కాదని భీష్ముడు యుధిష్టిరుడుతో అన్నాడు – యోగి యాజ్ఞవల్కుడు ప్రాణాయామాన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు – ప్రాణా యామ చేసే సాధకులందరు ప్రాణాయామము ద్వారా పరమ గతి పో౦దుతారు – అంతే కాకుండా ప్రాణాయామము లేనిదే నరక కూపము నుండి బయటపడే ఉపాయము ఏది లేదు అన్నారు – సంసారములో మునిగిన వ్యక్తికి సంసారాన్ని దాటడానికి పనికి వచ్చే ఏకైక సాధనం ప్రాణాయామము – ప్రాణా యామము ద్వారానే – ప్రాణం విచ్చల విడిగా పోకుండా అడ్డగించడానికి వీలవుతుంది – ఇందువల్లే ప్రాణాయామ పరాయణుడై – ప్రాణము విచ్చలవిడిగా పోకుండా అడ్డగించడం – మనుషులందరికీ శ్రేష్టమైన కర్తవ్యం ఇదే – ప్రాణాయామము తప్ప ఆత్మలో లీనం చేసే సామర్ధ్యము కలిగినది మరొకటి లేదు – బ్రహ్మతో కూడె స్థితి కలిగించ గలిగినది ప్రాణా కర్మ ఒక్కటే – ఇదే నిష్కామ కర్మ – ఇది తప్ప తక్కినవన్నీ సకామమైనవే – ఏ కర్మతో ఏ విధమైన కామనవాసన కలిసి ఉండదో అదే నిష్కామ కర్మ – స్వతహాగా కోరిక లేనిదై సాగే ప్రాణ కర్మ ఒక్కటే సత్కర్మ – పూజ్య కర్మ – సాత్విక కర్మ – తక్కిన కర్మలన్నీ కోరికతో కూడినవి – స్వార్ధంతో చేసేవి – అవి రాజస కర్మలు – దీంతోపాటు హింసతో కూడి ఉండే కర్మలు తామస కర్మలు – కర్మ ఫలము మీద ఆశే బంధనానికికారణము – కర్మ ఎన్నడు బంధనానికి కారణం కారాదు శ్వాస ప్రశ్వాసల పని ఒక్కటే నిష్కామ కర్మ – ఏ విధమైన కోరిక ఉండటముకాని – ఉండక పోవడం కాని దాంతో ముడిపడి ఉండదు – మనము కోరిన కోరక పోయిన శ్వాస ప్రశ్వాసల కర్మ నడుస్తూనే ఉంటుంది.
2) వర్తమాన చంచల మనస్సు ఉన్నంత కాలము సకామ కర్మ తప్పకుండా ఉంటుంది – ఒక ప్రాణ కర్మ తప్ప తక్కిన కర్మలన్నే మనస్సు ద్వారా పుట్టేవి కావడము వల్ల వాటిని సకామాలంటారు – మనసనేది ఒక ఇంద్రియం – ఇందువల్ల ఇంద్రియాల వల్ల పుట్టిన కర్మ ఏది నిష్కామము కాజాలదు – గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన నిష్కామ కర్మ ఈ ప్రాణ కర్మే – కాని విచారకరమైన విషయము ఏమిటంటే – సాధారణ మనుషుల లక్ష్యము దాని మీదకు పోను పోదు – – దాని మీద ద్రుష్టి పెడదామని వాళ్ళు కోరనూ కోరరు – ఇంద్రియముల ద్వారా పుట్టే జ్ఞానము సాధారణ జ్ఞానము – ఇది మోక్షాన్ని కలిగించే జ్ఞానము కాదు – ఈ కారణంగానే వాళ్ళు తమను జ్ఞానుల మనుకొంటారు – నిజానికి ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానము పరమాత్మ జ్ఞానము కాదు – పరమాత్మను గురించి ప్రత్యక్ష జ్ఞానము లేకపోవడం వల్ల దేంట్లోనూ వివేక బుద్ధి లేదు – పరమాత్మ జ్ఞానము లేదు – ఇడా పింగలులకు అతీతంగా అంటే సుషుమ్నలో శ్వాసా ఉన్నవాన్నే అసలైన జ్ఞాని అని అంటారు – పాలను చిలికి నప్పుడు మొదట వెన్న బయటకు తీసి – నెయ్యి కాచినట్లే ప్రాణాయామము మథనం ద్వారా శ్వాస నిశ్వాసలోంచి వెన్నలాంటి బ్రహ్మ బీజాన్ని తీయవలసి ఉంటుంది – కాని ఆ జీవుడికి ఆ వెన్న దోర్రకుండా చేయాలని చూస్తుంది – ఇక్కడ సాధకుడు అప్రమత్తంగా ఉండాలి – ప్రాణా యామాన్ని – “ గాలిపని ” అని చెప్పి అవే హేళన చేయడము గాని – ఉపేక్షించడం గాని ఉచితము కాదు – ప్రాణా యామమే సర్వ సమ్మతము – శ్రేష్టము – అయినా సాధనా మార్గము – రాజ మార్గము – ప్రాచీన కాలములో ఋషులు మొదలగువారు ఈ మార్గములో పయనించి ఈ ప్రాణా యామమే చేసారు – అదే చేయాలని ఉపదేశించారు – చిలక మాదిరిగా మంత్రాలు వల్లిన్చినంత మాత్రానా అది జపము అయిపోదు – మంత్రమంటే ఏమిటి – ? దీని గురించి పార్వతీ దేవి ఆ మహా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు – > “ శివాది కృమి పర్యంతం ప్రాణినాం ప్రాణవర్ధనమ్ – నిశ్వాసః శ్వాస రూపేణా మంత్రోహ్య వర్తతే ప్రియే ” అంటే శివుడు మొధలుకొని క్రిమి కీటకాల వరకు అన్నీ ప్రాణుల దేహాల్లోను నిరంతరం సాగుతూ ఉండే నిశ్వాసే మంత్రం – నిశ్వాస అంటే శ్వాసలేని అవస్థ – అంటే స్థిరావస్తా – వస్తూ పోతూ నిరంతరం ఆడుతూ ఉన్న శ్వాస ప్రశ్వాసలకు – ప్రాణా కర్మ చేయడము వల్ల స్థిరావస్తా కలగడమే నిశ్వాసము – అంటే శ్వాస లేక పోవడమే – అదే మంత్రము – ఈ మంత్రము – ప్రాణ కర్మ చేస్తుంటే కర్మకు అతీతమైన అవస్తలో ఏర్పడుతుంది – దాన్ని నోటితో కాని – మనసులో కాని జపించ వలసిన అవసరము లేదు – మంత్రం అనేది ఉచ్చరించే శబ్దము ఏదీ కాదు – అది ఇంద్రియాలు చేసే ఒక రకమైన మోసం మాత్రమె – సాధకున్ని భాహ్య ధ్యానములో ఆసక్తుణ్ణి చేసి – ఆత్మ ధ్యానము లేకుండా చేస్తాయి.
3) ఈ ప్రాణాయామాన్ని గురించి శాస్త్రము ఇలా చెపుతుంది – “ ప్రాణాయామో మాహా ధర్మో వేదానామప్య గోచరః – సర్వ పుణ్యష్య సారోహి పాపరాశితులానలః ” అంటే ప్రాణాయామము వేదాలకు కూడా అగోచర౦గా ఉండేట౦తటి మహా ధర్మమూ – ఇది పుణ్యాలన్నింటికి సారము – పాపాలన్నింటికి వినాశాకము – దీని ద్వారా కోట్ల కొద్దీ దుష్కర్మలూ – పూర్వ జన్మల సర్వ పాపాలు నశించి పోతాయి – ప్రాణాయామము అభ్యాసము చేసిన వాళ్ళు దన్యులవుతారు – కాని విచారించ వలసిన విషయ మేమిటంటే చాలామందికి – ఈ ప్రాణాయామాన్ని గురించి కారణము లేని భయాలున్నాయి – ప్రాణాయామము చేసే ఉపకారాన్ని తెలుసుకోరు – ప్రాణాయామము ద్వారా మనస్సు తాలూకు శూన్య మార్గములో సంచరించ డానికి శక్తి కలుగుతుంది – అన్నీ రకాల రోగాలు సరిఅయిన పద్దతిలో చేస్తే నాశన మవుతాయి – పరమాత్మ ప్రాప్తి పొందే శక్తి కలుగు తుంది అంతే కాకుండా మనస్సుకు అనంత మైన శక్తి వికసించి దివ్య జ్ఞానము కలగడం వల్ల అపారమైన ఆనందం కలుగు తుంది – ప్రాణాయామం సాధనే రాజ మార్గము – దీనిని అందరూ ఆచరించు అవకాశం కలదు – గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు – > “ సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ – సర్వారంభా హి దోషేణ దూమేనాగ్ని రివావృతా: ” సహజం అంటే సులువైనది (easy) అని కాదు అర్ధము – సహజం అంటే పుట్టుకతో వచ్చినదని – దాన్ని పొందడానికి ఏ విధమైన కష్టము కాని – ప్రయత్నమూ కాని చేయ నక్కర లేదు – కర్మలన్నీ ప్రారంభములో పొగ కమ్మిన నిప్పు లాగ దోషముతో నిండి ఉంటాయి – అలాగే ఈ సహజ కర్మ రూపమైన ప్రాణకర్మ కూడా మొదట్లో దోష యుక్తంగా జరిగినప్పటికీ కూడా దాన్ని విడిచి పెట్టడం ఎన్నడు ఉచితము కాదు – ఈ ప్రాణాయామము చేయవలసినదే – సహజ కర్మ రూపమైన ధ్వని ఈ శరీరములోనే ఉంది – హృదయములో శబ్దము దానంతట అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది నోటితో అరవ వలసిన అవసరము ఏమి లేదు అని కబీర్ మహాత్ముడు చెప్పాడు.
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె దయచేసి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/24/2016
🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
“ మనసు “ 5వ బాగము
1) మనస్సును స్వాధీనము చేసుకోవాలన్న సంకల్పమే సరిపోదు – మనస్సు స్వబావాన్ని గురించి కూడ మనము ఎంతోకొంత తెలుసుకోవాలి – మనస్తత్వశాస్త్రములో దీని గురించి ఏమి చెప్పబడింధో ఇప్పుడు మనము చర్చిద్దాము – ఈ మనస్సును స్వాధీనము చేసుకోవడానికి తగిన రకరకాల పద్ధతులను అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు – దానిలో ప్రయోగాత్మకమైన అన్వేషణ , పునః పరిశీలనల ద్వారా మనస్సు మీద పూర్తి నియంత్రణను సంపాదించడానికి- దాని ద్వారా పరిపూర్ణతను , జ్ఞానోదయాన్ని పొందడానికి కావాల్సిన పద్ధతులను ఏర్పరచినారు –> ఈ స్థూల శరీరములో మనస్సు ఒక సూక్ష్మమైన బాగము – ఈ భౌతికమైన స్థూలశరీరము మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే – మనస్సు శరీరములోని ఒక సూక్ష్మమైన అంశము కనుక ఇవి రెండూ ఒక దానితో ఒకటి ప్రబావితం చెయ్యగలవు – ఈ కారణము వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యము మనస్సును – మనస్సుకు కలగిన అనారోగ్యము లేక ఒత్తిడి శరీరాన్ని ప్రబావితము చేస్తాయి – > ఈ మనస్సుకు వెనుక ఆత్మ ఉంది – అదే మనిషి యొక్క నిజతత్వము – శరీరము , మనస్సు పదార్ధాలు – ఆత్మ శుద్ధ శక్తి స్వరూపము – మనస్సు , ఆత్మ , ఒకటి కావు – ఈ రెండూ వేరువేరు – > నిజానికి మానవుడు ఆత్మయే కాని మనస్సుకాదు – ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్చగా ఉండేది – నిత్యమైనది – అనంతమైనది – అది శుద్ధ చైతన్యము – మానవునిలోని స్వేచ్చాయుత మైన అంశం ఆత్మే గాని మనస్సు కాదు –మనస్సు ఆత్మయొక్క పనిముట్టు మాత్రమే – మనస్సు ద్వారా ఆత్మ బాహ్య ప్రపంచాన్ని నిరోధించడము గాని దానికి ప్రతిస్పందిన్చడము గాని చేస్తుంది.
-> ఆత్మ , మనస్సు అనే పనిముట్టు ద్వారా బాహ్య ప్రపంచముతో సంబంధాన్ని ఏర్పరచు కొంటుంది – కాని మనస్సు నిరంతరము మారి పోయే చపల స్వబావాన్ని కలిగిఉంది –అటువంటి చపలమైన పనిముట్టును ( మనస్సును ) నిశ్చలంగా చేయగలిగినప్పుడు అది ఆత్మను స్పష్టంగా ప్రతిభింభించగలదు- >మనస్సు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా దానికున్న శక్తులు లెక్కకు మించినవి – కంటికి కనిపించని పరమాణువును బ్రద్ధలుకొట్టి , దానిలో నుంచి బ్రహ్నండమైన శక్తి విడుదలయ్యేలా చేసినా –ఆత్మ సాక్షాత్కారము చేసుకొని – జ్ఞానోదయాన్ని పొందినా –మనస్సు యొక్క శక్తి ద్వారానే మానవుడు అటువంటి అధ్బుతాలు చేయ్యగలిగాడు – అణుశక్తిని విజ్ఞాన శాస్త్రములోనూ –జ్ఞానోదయాన్ని –ఆధ్యాత్మికతలోను పరిపూర్ణత సాధించి –అన్నీ రంగాలలోను ఘనవిజయాలు సాదించ బడ్డాయి –నిజానికి మనస్సు లేని చోటు లేదు –ప్రతి ఒక్కరి మనస్సు ఆ విశ్వ మనస్సులో ఒక బాగమే – ప్రతి మనస్సు విశ్వములోని ప్రతి ఒక్కరి మనస్సుతో కలుపబడి ఉంది – >సూక్షమైన పదార్ధముతో నిర్మితమైన ఈ మనస్సు – పారదర్శకంగా ఉండడముతో పాటు ఆత్మకు అతి చేరువలోఉంటుంది –సర్వజ్ఞుడైన ఆత్మకు ఇది అంత:కరణం అంటే లోపల వుండి సహాయపడే పనిముట్టు –అది స్వయం ప్రకాశకము కాదు – దానిలో స్వబావ సిద్ధంగా ఎటువంటి చైతన్యము లేదు – ఆత్మ నుంచి తెచ్చిపెట్టుకున్న ప్రకాశముతో –ఆత్మయొక్క అంత:కరణమైనమనస్సు – అన్నీ వస్తువులను వెలుగుతో నింపుతుంది – మనము చూసే భౌతికమైన కాంతి కూడా దాని నుంచి వచ్చినదే – అయితే తాను స్వయం ప్రకాశకము కాకపోయినా తననుండే కాంతి –వెలువడుతున్నట్టుగా మనస్సు మనల్ని భ్రమింప జేస్తుంది – మనస్సు తానే అన్నింటిని తెలుసుగోగలిగిన దానిలాగా కనిపించినా , అది నిజంగా తెలుసుకోలేదు – అది తెలుసుకొనడానికి ఉపయోగపడే ఒక పనిముట్టు మాత్రమే – > ఆత్మ చైతన్యము నుంచి అరువు తెచ్చుకున్న ప్రకాశముతో అది వెలుగుతుంది – దానితోనే అది ఒక సమర్ధమైన , జ్ఞానసాధనగా-గ్రాహకంగా కూడా పని చేస్తుంది -> శరీరము దాని వివిధ అంగాల కన్నా మనస్సు వేరైనదని మన సొంత అనుభవము న్యూడ్ రారకాలుగా నిరూపించి చెప్పవచ్చు – మనకున్న పది ఇంద్రియాలలో దేనిని వాడకుండానే మనము ఆలోచించగలము –స్పృశించ గలము- సంకల్పించగలము- ఉహించగలము- జ్ఞాపకము చేసుకోగలము – ఆనందించ గలము – రోదించ గలము – ఈ అనుభవము ద్వారా ఈ పనులన్నీ చేయగలిగే ప్రత్యకమైన పనిముట్టు ఏదో మనలో ఉందని తెలుసుకోవచ్చు – మనస్సు ఒక ప్రత్యేకమైన అంతకరణమని నిరూపించవచ్చు – > ఉపనిషత్తులలో ఈ క్రిందివిధంగా చెప్పబడినది ->” జనము నేను పరధ్యానంగా ఉన్నాను – దాన్ని చూడలేదు “ నేను పరధ్యానంగా ఉన్నాను దాన్ని వినలేదు “ ఎవరైనా వినగలిగేది – చూడగలిగేది – మనస్సు ద్వారానే – కోరిక , పట్టుదల ,అనుమానము , నమ్మకము, అపనమ్మకము , నిలకడ ,చంచలత్వము , సిగ్గు , తెలివి తేటలు ,భయము –ఇవ్వన్ని మనస్సుయే –మనస్సు తనను తాను పరిశీలించుకునే శక్తి – ఆత్మ పరిశీలనా శక్తి – ఉంది.
2) మనస్సులో మూడు స్థాయులు – నాలుగు విధులు –అయిదు పరస్తితులు ఉంటాయి –వాటిని క్లుప్తంగా తెలుసుకుందాము – > ఎందుకు మనస్సు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు- ? > మనస్సు మూడు బలమైన శక్తుల సమ్మేల్లనము కావడమే దీనికి కారణము – ఆ మూడు శక్తులే – సత్వము – రజస్సు – తమస్సు – అనే మూడు గుణాలు – భౌతికంగాను –మానసికంగాను ఈ విశ్వ మంతా ఈ మూడు గుణాలనే మూల అంశాలుగా కలిగివుంది – పవిత్రతకు – జ్ఞానానికి – ఆనందానికి మూలమైనది సత్వగుణము – కదలికను – దాని ద్వారా చేతనత్వాన్ని –కోరికను – అశాంతిని కలిగించేది రజోగుణము – జడత్వానికి మూలమైన తమస్సు సోమరితనాన్ని – మందబుద్ధిని- అజ్ఞానాన్ని –కలిగిస్తుంది – తమస్సు మనస్సును హీనమైన స్థాయిలో సంచరించేలా చేస్తుంది –రజస్సు దాన్ని నలువైపులకు చిందరవంధరచేసి అశాంతిని రేకెత్తిస్తుంది – సత్వగుణము ఉన్నత స్థితులకకు దారి చూపుతుంది – నిస్సంగత్వము , వస్తువులమీద వ్యామోహము లేకపోవడము –క్షమ ,దయ సత్వగుణము వల్ల కల్గుతాయి –కోరిక , కోపము . ద్వేషము ,మొదలైనవి రజోగుణము వల్ల కలుగుతాయి – సోమరితనము – భ్రమ , నిద్ర ,తమస్సు వల్ల కలుగుతాయి – మనస్సులో సత్వగుణము పనిచేయడమువల్ల పుణ్యము లభిస్తుంది – రజస్సు ,తమస్సు పనిచేయడమువల్ల పాపము లభిస్తుంది.
౩) వ్యక్తీ గతమైన మనస్సు యొక్క నిర్మాణము ఈ మూడు గుణాలు ఏయే పాలల్లో మేళవించబడ్డాయన్న విషయము పై ఆధార పడుతుంది – ఇదే మానవుల వ్యక్తిత్వాలలోని తేడాలను, మనస్సు కుండే చపల స్వభావాన్ని వివరిస్తుంది – మనము తరచూ “ నేను నా మనస్సు మార్చుకున్నాను ” అంటూ ఉంటాము – మనస్సు కనక ఒకే శక్తి చేత (గుణము చేత) ఏర్పర్చబడితే ఈ విధంగా అనడం అసాధ్యం – అప్పుడు మానవులు దిగజారారు – పై స్థాయికి ఎదగరు – ఎవరు ఎలా పుట్టారో అదే విధంగా ఉంది పోతారు – మనకు చైతన్యము – చైతన్య రహితము అనే మాటలు తెలుసు – ఇవి మనస్సు పని చేసే వేర్వేరు స్థాయులను సూచిస్తాయి – చైతన్య వంతమైన స్థాయిలో సాధారణంగా చేసే అన్నీ పనులు అహంకారముతో కూడిన నేను, నాది అన్న భావము తోనే ఉంటాయి మనస్సు ఈ స్థితిలో వేర్వేరు వస్తువులను పోల్చి చూస్తుంది – > చైతన్య రహిత స్థాయిలో అహంకారము నేను, నాది అనే సృహ ఉండదు – > మనసుకు మరొక ఉన్నతమైన స్థాయిలో పనిచేయగలదు – మనస్సు చైతన్య స్థాయిని దాటినప్పుడు మహా చైతన్యాన్ని సూచిస్తుంది అనగా ఆత్మతో కలిసిపోతుంది – మనస్సు నాలుగువిధులను ( పనులను ) కలిగి ఉంటుంది – అవి మనస్సు – బుద్ధి – అహంకారము – చిత్తము ఇవన్ని ఆత్మకు అ౦త:కరణములు – ఇవన్ని వేరువేరు రూపా౦తరాలు – సాధారణ౦గా మనస్సు చీకటి క్రమ్మిన – చెదిరిన పరస్తితులలో ఉంటుంది – చీకటి క్రమ్మిన పరస్తిలో మనిషి నిస్సత్తువ గాను – సోమరిగాను ఉంటాడు – చెదిరిన పరస్తితులో అశాంతిగా ఉంటాడు – యోగ సాధనాలను అభ్యాసం చేయడం ద్వారా అదే మనస్సును కూడగట్టి ఆపై ఏకాగ్రమయ్యేలాగా చేయవచ్చు – మనస్సును స్వాధీనము చేసుకోడంలోని ఉద్దేశ్య మంతా దాన్ని ఏకాగ్రత చేయడమే – అటువంటి మనస్సును ఏ కార్య రంగములో ఉపయోగించిన అది అందులో గొప్పగా ప్రకాశిస్తుంది – అటువంటి మనసున్న వ్యాపారస్తుడు వ్యాపారములో అభివృద్ధి చెందుతాడు – అటువంటి కళాకారులు గాని గాయకులూ గాని శాత్రజ్ఞులు గాని అభి వృద్ధి చెందుతారు – సాధన ద్వారా మనస్సును ఈ స్థితి నుంచి మరింత ఏకాగ్రం చేస్తే అప్పుడు అది అత్యునత పరస్తితిని చేరుకుంటుంది దీని ద్వారా సమాధి స్థితిని దాటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము.
పై విశయాలన్నీ మీ అందరికి తెలిసినవే ఏ మైన పొరపాట్లు ఉంటె పెద్దమనసుతో తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/24/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
“ మెదడు “ 5 వ బాగము
ఆత్మ బంధువులకు నమస్కారము . మీ అందరికి మెదడు గూర్చి బాగా తెలుసు – కాని ఎందుగూర్చి మెదడు పై చెప్పినాను అంటే –ఈ సకల చరాచర జగత్తుకు మూలమైనటువంటి ఆ పరమాత్మ అంతట వున్నాను – మానవదేహములో కూడా వున్నాను అంటారు కదా ఎలాగా ?ఎక్కడ వున్నాడు ? – అనునది చూపించాలన్న దానితో 4 వ బాగాములో ఆ దైవ మానవ దేహములో – తలలో – తలలో వుండబడిన – మెదడులో – మెదడులోని థర్డ్ వెంట్రికల్ లో ఆత్మ వుందని – పోర్త్ వెంట్రికల్ లో ప్రాణ ఉంటుందని – ఆ దైవ నీలోనే వున్నది – అని చెప్పడము కోసము మెదడు పై 5 బాగాలతో వివరించడము జర్గింది – ఇంకా మెదడు కోసము చెప్పవలసినది చాల ఉన్నప్పటికీ – దానికోసము మీకు మార్కెట్లో దొరుకు బుక్స్ లలో వుంటుంది – పరిశీలించ గలరు – నీలోనే వున్న ఆ దైవను తెలుసుకొని కోలుచుకుంటావో – లోనవున్న దైవను వదిలి బయట ధైవకోసము వెతుకుతావో – వెతికి వెతికి అలసిపోయి గత జన్మలలాగా తయారు అవుతావో – లేదా ఈ జన్మలోనే కదతేరుతావో – విజ్ఞానమున్న ఓ మానవుడా ఆలోచించుకో – సత్యాన్ని వదిలి – అసత్యము వెంట వేలుతావో – సత్యాన్వేషణకు బయలు దేరుతావో – అసత్యమైనది నీకు కనపడేది నీవెంట రాధనుకుంటావో – వస్తదను కుంటావో – మల్లి మల్లి జన్మలు వేత్తుతావో – ఎత్తవో – నీవే నిర్ణయించుకో .- మెదడు అను శీర్షిక ఇంతటితో సమాప్తము.
6/26/2016
🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
“ప్రాణ” 1,వ భాగము
1. అనంత శక్తి వంతుడైన ఆ పరాత్పరుడు నుండి ప్రప్రధమముగా ఏర్పడిన జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి అయినా “ప్రాణుడు” సృష్టి నిర్మాణానికి మూల కారఖుడై యావత్తు సకల చరాచరా జగత్తు సృష్టించుకొని, సర్వ జీవుల అంతర్యామియై, వాటి ఉనికికి మూలాధారమైనా ఆ శక్తియే మన దేహములో ఉన్న ముఖ్య “ప్రాణ”. > తన అనుంగు శిష్యులైన, పంచ ప్రాణులతో, ఈ దేహ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తుంది – తను లేని యెడల యావత్తు సృష్టి, నిర్జీవ స్తితికి పోయేటటువంటి స్తితిలో ఉన్న ఈ ప్రాణ, ఎంత ముఖ్యమో – ఎంత విలువైనదో – ఎంత ఇంపార్టెంట్ అయినదో – ఆ ఒక్కటి తెలుసుకోకుండా – అన్ని తెలుసుకొని ఏం లాభము ? ఆ ఒక్కటి చిక్కితే అన్ని చిక్కుతాయి – అన్నింటి వళ్ళ ఆ ఒక్కటి చిక్కదు – ఆ ఒక్క దాన్ని గురించి – ప్రత్యక్ష జ్ఞ్యానము లేనివాడికి ఏమి తెలియనట్టు లెక్క. > ఇది చెట్టు, అది ఆవు, అది చీమ, ఇది ఏనుగు, ఇది పాము, ఇతను మొగవాడు, ఆమె ఆడది అంటూ వేరు వేరు రూపాలు చూస్తున్నారు – వేరు వేరు రూపాలలో, అంతర్యామిగా ఉన్న సూక్ష్మ రూపమే ఈ ప్రాణ. > అది అంతట ప్రకా శిస్తున్నది – ఎముకలు, మాంసము, చేతులు , కాళ్ళు , ముక్కు ,చెవి ,నాలిక ,చర్మము ,సూటు , బూటు ,మొదలగునవి అన్ని ఉన్నాయి – కాని ఆ ఒక్కటి ప్రాణము లేకపోవదమువల్ల , ఏది, ఏమి చేయలేరు – కాబట్టి ఆ ప్రాణుడి కోసము మనము ఏమి చేస్తున్నాము ? కనీసము ప్రాణుడికి ఆహారము పెడుతున్నామా ? లేనియడల ఆ ప్రాణ ఎలా జీవిస్తుంది ? ఆలోచించండి ? > మీరు అనుకుంటారు మేము రోజుకు మూడు తడవలు తింటున్నాము కదా ఇంకా ఏముంది పెట్టడానికి అనేది మీ ఆలోచన కదా ? మీరు పెడుతున్నది , మీకు కనపడే అహారము కదా ? అయితే మీకు మీ ప్రాణ కనపడుతున్నాదా , లేదు కదా , లేనియడల కనపడని ప్రాణకు కనపడు ఆహారము ఇస్తే ఎలా భుజిస్తుంది – కనపడు ఆహారము కనపడు దేహానికి కాని నీలోన అంతర్వానిగా , సూక్ష రూపములొవున్న ప్రాణుడుకి సూక్ష అన్నము పెట్టాలిగదా ? మీరు దేవాలములోగాని , మన ఇంటిలోచేయు పూజ విదానములోగాని నైవేద్యము పెడుతుంటాము కదా అప్పుడు మీరు చదివే మంత్రము ఏమో తెలుసా ? “ సూక్ష్మాన్నము సమర్పయామి ” అంటే సూక్ష్మా + అన్నము = సూ క్ష్మాన్నాము పెట్టాలనేదే కదా ? దాని అర్ధము > మన పూర్వీకులు అలా జీవనము కొనసాగించినారు – అన్ని రకాలగా ఆరోగ్యవంతులై వందల ఏండ్లు జీవించారు – పిల్లా , పాపలతో, ముని మనుమరాళ్ళతో ముచ్చట గోల్పేవారు – కాని ఈ నాటి పరస్థితులు ఎలా వన్నాయో మనందరికీ తెలుసు –మేల్కోండి దైవమునుండి వచ్చిన ఆ ప్రాణుడికి ఆహారము ఇచ్చిన , అదియే దైవ సేవ – దైవము వేరే లేదు – ఏ రోజు మనము అన్నము పెడుతామో ఆ రోజు ఆ ప్రాణ తన తండ్రి అయిన ఆ పరమేశ్వరునికి ఈ రోజు ఇతను అన్నము పెట్టాడు నాన్న అని తెలుపు కుంటున్నాది – అప్పుడు ఆ దైవము నా బిడ్డకు చాలా రోజుల తరువాత అన్నము పెట్టావు అంటా నా బిడ్డ చాలా సంతోష పడినాది అని ఆ దైవ – ఆన్న దాత సుఖీభవ అని ఆశ్వీరదిన్చుతుంది – ఈ వాఖ్యము ఇక్కడ పుట్టినాది ,కాని అది మనము ఎక్కడ వియోగిస్తున్నమో చూడండి -> అదే పెట్టని రోజు ఈ రోజు కూడా అన్నము పెట్టలేదు నాన్న అంటే ఏమంటాడో పరమేశ్వరుడు ఆలోచించండి – మనము గారాబంగా కూతురిని పెంచి పోషించి పెళ్లి చేసి అత్త్తారింటికి పంపిస్తే అత్తింటివారు బిడ్డకు అన్నము పెట్టడములేదని ఆ బిడ్డ మీకు పోను చేసి ఏడుస్తూ – అమ్మా ఈ రోజు కూడా నాకు అన్నము పెట్టలేదని చేప్పితే మీరు ఎలా ఉంటారో –ఎంత ఆవేదన చెందుతారో అలానే ఆ దైవ కూడా నా బిడ్డకు జర్గుతున్న అన్యానికి భాదపడి నా మొర వినేధీ ఎవరు ? అని అనుకోదా – అంతే కాకుండా రోజు తన తల్లి ,తండ్రికి ఇక్కడ ఉండలేను నన్నువచ్చితీసుక వెళ్ళమని నేను ఇక్కడ వుంటే ఆకలికి చచ్చి పోతున్నాను అని చెప్పి చెప్పి విసుగు ఎత్తిన ఆ బిడ్డ ఏదో ఒక రోజు తనకు తానే మూట , ముల్లె సర్దుకొని ఎలాగో అలాగా మన ఇల్లు చేరినట్లు , ఆ ప్రాణ కూడా మూట ,ముల్లె సర్దుకొని తన పుట్టిన ఇంటికి పోదంటారా ? ఆలా పోతే ఆ దేవుడు చల్లగాఉండా పిల్లల ,పెండ్లిలు అయ్యేవరకు వుంచ డాయే అని నన్ను నిందిస్తారు , దానికి కారణము ఎవరంటారు ?. > మీ బిడ్డకు అన్నము పెట్టి అన్ని రకాలుగా చూసుకుంటే ఆ బిడ్డ అత్తవారి ఇంటిని వదిలి వచ్చేదా చెప్పండి -?
2. ఒక ప్రక్కన నా బిడ్డకు అన్నం పెట్టక – రెండో ప్రక్కన నేను ఎక్కడో ఉన్నానని నా దర్శనం కోసం తిరగ రాని దగ్గర తిరుగుతూ చేయ రాని పనులన్నీ చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు – మీరు చదివే మంత్రాల సూక్ష్మ అర్ధాలను తెలుసుకోకుండా స్తూలమైన జ్ఞ్యానంతో నేను స్తూలంగా ఉన్నానని – సూక్ష్మంగా నీలోనే ఉన్న నన్ను చూడక బయటా చూస్తుంటావు ఇది నీకు తగునా ?కోట్ల కొలది జన్మలనుంది ఇలానే చేస్తున్నావు ,కర్మలు అనుభవిస్తూనే వున్నావు , > మీరు ప్రతి రోజు పూజా విధానములో మంత్రాల యొక్క – పూజ విధానం యొక్క ఇన్నర్ మీనింగ్స్ అర్ధం చేసుకొని నడచుకోండి – >ఇక నుండైన నా బిడ్డకు ఆహారాన్ని అందించి తృప్తి పరిచినచో – నన్ను తృప్తి పరిచినట్లే అప్పుడు నా సహకారము ఏళ్ల వేళల మీకు ఉంటుంది ఇది మీరు చేయు స్తూల విధానములో నేను దర్శనం ఇవ్వలేను – నేను స్తూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను – మీరు సూక్ష్మ స్తితిలో వెతికితే దొరక గలను – ఇది నేను అన్ని జీవుల్లో ఉన్నప్పటికీ మానవులకు ప్రతేకమైన జ్ఞ్యానము ఇచ్చాను తద్వారా అందుకోండి.
3. ప్రపంచములో జరుగుతున్నదంతా ఒక్క దానివల్లే జరుగుతుంది – ఆ ఒక్క ప్రాణాన్నే తెలుసుకోవలసి ఉంటుంది – ఇది సాధన చెయడం వలనే సాధ్య పడుతుంది – నేను లేకుండా నీ పెదవులు కదలగలవా ? చెవి వినగలదా? ఇంద్రియాలు తమ పనులు నిర్వహించ గలవా ? నీవు నడవగలవా, తినగలవా, నిద్రించగాలవా, > ఏలాంటి పనులు కుడా నేను లేకుండా నీవు చేసుకోగలవా అలాంటి దాని నైన నాకు అన్నం పెట్టడములో ఎందుకు ఈ అశ్రద్ధ ? నాకు అన్నం పెట్టినచో ఏ పనైనా సాధించగలను > మీరు మీ ఇంటిలోని పాలేరుకు అన్నం పెట్టినచో శక్తి వచ్చి ఏ పనైనా చేయ గలదు – అతను ఆకలిపై ఉన్నప్పుడు మీరు ఏ పని చెప్పిన చేస్తాడా ? అన్నం తిన్న తరువాత, బియ్యము బస్తానైనా మోయగలడు అలానే చంటి పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు – మీరు పాడే జోల పాట వింటుందా ? లేకా మారాం చేస్తుందా – మీరు అప్పుడు ఏం చేస్తారు – అలానే నా పరిస్థితి కుడా అర్ధం చేసుకోండి.
4. మీరు అన్నము పెట్టనిచో నేను క్రుంగి, కృషించి, నాతోపాటు మీ దేహాన్ని కుడా కృశింప జేస్తాను – నిండా నూరేళ్ళు బ్రతకాల్సిన మిమ్ముల ఆయుశ్షు ప్రమాణం తగ్గిస్తాను – నేను కృశించి నేను బలహీన పడినచో రాఘాది రోగములు వచ్చి దుర్బరమైన జీవితము గడుపు తారు – జనన – మరణ చక్రములో చిక్కుకొని పోతారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమని చెప్తారు – డాక్టర్ గారు, డాక్టర్ గారు అని నా ప్రాణం బాగులేదు అంటారు అవునా, కాదా ? నేను మా పుట్టింటి నుండి వచ్చేటప్పుడు సగం ప్రాణం తెచ్చుకున్నానా ? లేదా నీ ఇంటికి వచ్చినంకా సగమయ్యానా ? కారణం ఏమి ? ఆలోచించు మిత్రమా!
5. ఇక నైన నన్ను చూసుకుంటావో – గాలికోదిలేస్తావో అది నీ ఇష్టం.
———————— సశేషం ————————
పై విషయాలన్నీ మీకు తెలుసు ఏ మైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలు పుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
6/26/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
“ ప్రాణ “ 5 వ బాగము
1) ప్రతి జీవి యొక్క ఆయుర్దాయము శ్వాసలపై ఆధారపడి ఉంటుంది – ఏ జీవికి శ్వాసలు తక్కువగా ఉంటాయో ఆ జీవికి ఆయుష్షు ఎక్కువగాను , ఏ జీవికి శ్వాసలు ఎక్కువగా ఉంటాయో – ఆ జీవికి ఆయుష్షు తక్కువగాను ఉంటుంది – ప్రతి జీవికి జీవిత కాలములో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని – ఆ శ్వాసల సంఖ్యను ఆ సృష్టి కర్త ముందే నిర్ణయిస్తాడని మన పెద్దలు అంటూ ఉంటారు – ఆ ఇచ్చిన శ్వాసలను ( కోటా లేదా రేషన్ ) త్వరగా తీసేసు కున్నట్లయితే మనము త్వరగా పైకి వెళ్లి పోతాము – అదే శ్వాసలను పొదుపు చేసుకుంటూ , దీర్ఘముగా గతులు నడిపినచో తక్కువ శ్వాసలను రోజుకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చు – > మనిషికి నిమిషానికి 16 నుండి 18 శ్వాసలు ఉంటాయని ఆధునిక వైద్య శాస్త్రములో వ్రాసి ఉంటుంది – మనిషి నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే ఎంత ఆయుష్షు ఉంటుందో ఆలోచిద్దాము – నిమిషానికి 18 శ్వాసలు అయితే ఒక గంటకు 1080 శ్వాసలు అవుతున్నాయి – ఈ లెక్కన రోజుకి 25,920 శ్వాసలు అవుతున్నాయి – ఇన్ని శ్వాసలు రోజుకి తీసుకుంటే మనిషి ఆయుషు 80 స౦వత్సరాలు అని చెబుతారు – మనకు తెలిసి మనిషి పూర్తి ఆయుషు 100 సంవత్సరాలు – అలా అంతకాలము మనము జీవించాలంటే నిమిషానికి 15 శ్వాసలు కంటే తక్కువగా తీసుకోగలిగితే రోజుకి 21,600 శ్వాసలు అవుతున్నాయి – > నిమిషానికి 15 శ్వాసలతో మనిషి 100 సంవత్సరాలు పూర్తిగా జీవించవచ్చని శాస్త్రం చెబుతుంది – ప్రస్తుతము భారతీయుడి సగటు ఆయుర్దాయం 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైనది –అంటే ప్రస్తుతము మన శ్వాసలు 21 నుండి 22 వరకు నిమిషానికి నడుస్తున్నాయి- దీన్ని బట్టి నిమిషానికి 21 శ్వాసలు చొప్పున రోజు మొత్తములో 30 , 240 శ్వాసలు తీసుకుంటున్నాడు – అంటే రోజుకి 8,640 శ్వాసలు ఎక్కవ సార్లు తీసుకోవడము వలన ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి 55 ,60 సంవత్సరాలకు వచ్చేసింది – మరికొంతమంది నిమిషానికి 25, 28 శ్వాసలు తీసుకునే వారు కూడా ఉంటారు- అలాంటి వారు ఇంకా ముందే కాలం చేస్తారు – శ్వాసలను బట్టి జీవుల ఆయుషు ఏ విధంగా ఉంటుందో చూడండి -> 1) కుక్క – నిమిషానికి 28-30 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుష్షు 14 సంవత్సరాలు – 2) గుఱ్ఱం –నిమిషానికి 20-22 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 40 సంవత్సరాలు – 3) మనిషి – నిమిషానికి 15-16 శ్వాసలు తీసుకుంటే – అతని ఆయుషు 100 సంవత్సరాలు –4) పాము –నిమిషానికి 7-8 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 150 సంవత్సరాలు –5) తాబేలు – నిమిషానికి 4-5 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 200 సంవత్సరాలు – > మన బుషులు ప్రాణాయామము ద్వారా దీర్ఘ శ్వాసలు అలవాటు చేసుకొని దీర్ఘ కాలం జీవించడం తెలుసుకున్నారు – 200 ,300 సంవత్సరాలు తేలికగా జీవించ గలిగారు – వారు నిమిషానికి 5,6 శ్వాసలు తీసుకునేవారని చరిత్రలో చాల గ్రంథాలలో వుంటుంది – నిమిషానికి 4 శ్వాసలతో గడిపేవారు కూడా వుంటారు – శ్వాసలకు , గుండెకు అవినాభావ సంబంధము వుంది – ఒక శ్వాసకు 4 సార్లు గుండె కొట్టుకుంటుంది – అంటే 1:4 అని అర్ధం – శ్వాసలను తగ్గిస్తే గుండె కొట్టుకోవడము కూడా తగ్గుతుంది – మన లెక్క ప్రకారము నిమిషానికి 22 శ్వాసలు అంటే 88 సార్లు గుండె కొట్టు కొంటుంది అని అర్ధం – ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటే ఆయుషు తక్కువై పోతుంది – > మన ఆయుష్షు అనేది శ్వాసలను బట్టి ఆధార పడివుంది – కాబట్టి తక్కువ శ్వాసలను తీసుకుంటే మంచిది – తక్కువ శ్వాసలలో ఎక్కువ గాలిని పీల్చుకో గలిగితే మనకు ఆయుర్దాయము పెరగడమే కాకుండా , ఆరోగ్యము , ఆనందము ,నిర్మలత్వము మొదలగునవి కూడా లభిస్తాయి – జీవితము ఎంతో సుఖమయంగా సాగుతుంది – ఇలాంటి ఆనందమయ దీర్ఘ కాలపు జీవనానికి దీర్ఘ ప్రాణాయామము ఎంతో సహాయము చేయగలదు – బ్రహ్మంగారి కాలా జ్ఞానములో మనిషికి పూర్తి ఆయుష్షు ఇంకా రాను రాను దిగజారి ప్రస్తుతం ఉన్న 55 సంవత్సరాల నుండి 16 స౦వత్సరాల దిగజారుతుంది అని చెప్పబడింది – అలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘ ప్రాణాయామాన్ని తోడు చేసుకొని , ఆహార నియమాలను పాటిస్తే మనిషి ఈ వాతావరణ పరిస్థితులలో కుడా 100 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా జీవించ వచ్చు – అలాంటి చక్కని జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము.
2) శ్వాసలకి, మనస్సుకి ఉన్నసంబంధం :- శ్వాసలకి, మనస్సుకి చాల దగ్గర సంబంధం ఉంది – ఈ రెండింటిని సంబ౦ధం ఎలాంటిదంటే గాలికి, అగ్నికి ఉన్న సంబంధం లాంటిది – గాలి పెరిగితే అగ్ని పెరుగుతుంది – అదేవిధముగా శ్వాసలు పెరిగితే మనస్సు చంచలంగా ఉంటుంది – గాలి నిలకడగా ఉంటె అగ్ని నిలకడగా ఉంటుంది – అలానే శ్వాసలు స్థిరంగా ఉంటె మనస్సు స్థిరంగా ఉంటుంది – నిమిషానికి 15 శ్వాసల కంటే తక్కువ తీసుకోగలిగినప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది – నిమిషానికి 18 అంతకంటే ఎక్కువ అయినప్పుడు అలజడిగా – ఆలోచనలు ఎక్కువగా వస్తూ – ప్రశాంతత లోపిస్తుంది – శ్వాసలు తగ్గితే మనస్సు బాగుంటుంది – మనస్సు బాగుంటే శ్వాసలు తగ్గుతాయి – అలాగే శ్వాసలు పెరిగితే మనస్సు బాగోదు – మనస్సు బాగోపోతే శ్వాసలు మరల పెరుగుతాయి – మనస్సుకి – శ్వాసలకు ఉన్న అవినాభావా సంబంధం అటువంటిదన్న మాట – > ఈ సత్యాన్ని గ్రహించిన మన యోగులు మనస్సును అరికట్టాలంటే శ్వాసలను అరికడితే సరిపోతుందని చెప్పారు – గౌతమ బుద్దుడు కుడా ఈ విషయాన్ని తెలుసుకొని శ్వాస ద్వారా మనస్సును – ఆలోచనలను స్వాధీనము చేసుకోవచ్చనే ధ్యాన ప్రక్రియను అమలు చేశాడు – గాలి పీల్చేటప్పుడు – వదిలేటప్పుడు మనకు తెలుస్తున్నది అంటే ఆ సమయములో మనస్సుకు నిలకడ తక్కువగా ఉంటుంది – > ఉచ్వాస, నిశ్వాసాలు వల్ల మనకు తెలియనంతా నెమ్మదిగా – దీర్ఘంగా గతా గతులు జరిగేటప్పుడు మనస్సు అతర్ముఖం అవుతుంది – ఆ స్థితిలో మన మనస్సు ఎలా చెబితే అలా వింటుంది – మన మనస్సుకు ఇలాంటి స్థితి రావాలంటే – శ్వాస క్రియలో మార్పు రావాలి – ధ్యానము చేయడం ప్రారంభించిన 5, 10 నిమిషాలలో కొంతమంది భాహ్య ప్రపంచాన్ని వదిలి వేస్తారు – ఆ స్థితిలో వారి శ్వాసలు అంత నెమ్మదిగా తెలియకుండా జరుగుతాయి – ఆ సమయములో శ్వాసల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది – ఆహార నియమాలు బాగా పాటిస్తూ ధ్యానం చేసేవారికి ధ్యానములో 8 నుండి 10 శ్వాసలు మాత్రమె నడుస్తాయి – ఇంత తక్కువ సంఖ్యలో శ్వాసలు నడిస్తే ఆ ధ్యానం నుండి లేవబుద్ధి కాదు – > ఒక ఆవును ఎటూ పరుగులు తీయకుండా కట్టి వేయాలంటే గట్టి తాడు ఒకటి ఉంటె సరిపోతుంది – అలాగే పరిగెత్తే కోతిలాంటి మనస్సును కట్టి వేయాలంటే తక్కువ శ్వాసలతోనే అది సాధ్యం – ఏపూట మీలో బాగా తక్కువ శ్వాసలు నడుస్తూ ఉంటాయో ఆ పూట మీకు తెలియకుండా మనస్సు స్థిరంగా ఉంటుంది – ఎప్పుడూ శ్వాసలు పెరుగుతాయో అప్పుడే బద్ధకం, నీరసం, మత్తు మొదలగునవి మీకు తెలియకుండా వచ్చేస్తాయి.
3) ఈ రహస్యాన్ని గ్రహించిన మన పూర్వికులు మనస్సును చెప్పు చేతుల్లో ఉంచుకొని మానసిక – శారీరక సౌఖ్యాలను పొందడం కోరకు ఆహారాన్ని యుక్తమైనది తినేవారు – అనుకూలమైన ఆహారాన్ని తీసుకొని ఆనందాన్ని పొందగలిగే వారు – దీని ద్వారా శ్వాస క్రియ మనకు తెలియకుండా 24 గంటలు ప్రశా౦తంగా సాగుతుంది – > మనము ఇప్పడివరకు శ్వాస క్రియ తగ్గితే మనస్సు ఎలా అణిగి ఉంటుందో తెలుసుకున్నాము – అలాగే ఇప్పుడు మనస్సు అదుపు తప్పితే శ్వాస క్రియ ఎలా తప్పుతుందో తెలుసుకుందాం – > మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస క్రియ కూడా బాగా నెమ్మదిగా నడుస్తుంది – ఎప్పుడైతే మనస్సులో అలజడులు ప్రారంభం అవుతాయో అక్కడ నుండి శ్వాస క్రియ ఎక్కువ సార్లు తీసుకోవడం మొదలవుతుంది – కోపాలు వచ్చినప్పుడు, పోట్లాడుకున్నప్పుడు, భయం వేసినప్పుడు వెంటనే శ్వాసలో మార్పు వచ్చి ఎగ శ్వాస నడుస్తుంది – అంటే శ్వాస తీసుకొనేటప్పుడు గుండె, ఛాతీ పైకి బాగా లేస్తూ దిగుతూ ఉంటుంది – అప్పుడు శ్వాసలు సుమారుగా నిమిషానికి 25 నుండి 30 వరకు ఉంటాయి – ఛాతీ అలా ఎగరడాన్ని ఎవరిలో మనం చూసిన మనస్సు అలజడిలో ఉన్నాడని తేలిపోతుంది – మనస్సులో ఇలాంటి ఆందోళనలు చేల రేగిన వెంటనే రక్తం లోనికి “ ఎడ్రినలిన్ ” అనే హార్మోను విడుదల అవుతుంది – ఆ హార్మోను ప్రభావం వలన గుండె కండరాలు సంకోచి౦చుకుంటాయి – గుండె వెంటనే దడదడా కొట్టుకుంటూ ఉంటాయి – ఎప్పుడైతే గుండె ఎక్కువగా కొట్టుకుంటుందో దానికనుగుణంగా శ్వాస క్రియ పెరుగుతుంది – నిమిషానికి 100 సార్లు గుండె కొట్టుకుంటే 25 సార్లు శ్వాసలు ఆడతాయి – ఇంకా భయం, గొడవ ఎక్కువవగా ఉంటె 150 నుండి 200 సార్లైనా గుండె కొట్టుకు౦టుంది – అప్పుడు పై శ్వాసలు నడుస్తూ, నిమిషానికి 40, 50 సార్లు ఊపిరి తిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి – ఇలా శ్వాసలు పైపైన ఉన్నప్పుడు సరిపడినంత ప్రాణవాయువు రక్తానికి చేరదు – అందుకే కోపాలు, చిరాకులు వచ్చినప్పుడు మనకు తెలియకుండా నీరస పడిపోతాము – ఇలాంటి పోట్లాటలు, కోపాలు, చిరాకులు, భయాలు మొదలగునవి రోజాలో ఒక్కసారి వస్తే ఆ హార్మోను ప్రభావం రక్తంలో ఎన్నో గంటలు ఉండి – శ్వాస క్రియను, గుండె పని తీరును పూర్తిగా మార్పు చేస్తాయి – అందు చేతనే మన పెద్దలు తన కోపమే తన శత్రువు అంటారు – కోపమనేది శ్వాస క్రియకు ముఖ్యముగా ఎంతో హాని కల్గిస్తుంది – శ్వాసలు తగ్గితే మనిషికి కోపము తగ్గిపోతుంది – కోపములో ఉన్న మనిషి ఇలా అంటూ ఉంటాడు – నాకు కనుక కోపము వచ్చిందటే నేను మనిషిని గాదు – నేను ఏమి చేస్తానో నాకే తెలియదు – మనిషిని పశువును చేసేది కోపమే – మనమేమిటో కూడా మనకు తెలియ కుండా చేస్తుంది – ఎవరు మనల్ని ఎలాంటి మాటలన్న పట్టించుకోక పొతే మనము బాగుపడుతాము – > ఒక తడవ బుద్దుడిపై చాలామంది వెళ్లి చాలాసేపు తిడుతుంటారు – బుద్దుడు ఏమి జవాబు చెప్పడు – అప్పుడు వారంటారు ఇంత సేపటి నుండి తిడుతున్నా నీకు అవి ఎక్కడము లేదా ? నీవు అసలు మనిషివా కాదా ? అని గట్టిగా అరుస్తారు – అప్పుడు బుద్దుడు ఇలా చెపుతాడు – “ మన ఇంటికి అతిధి వచ్చినప్పుడు మనము ఆహ్వానిస్తే లోపలకు వస్తాడు లేదా ఆహ్వానించక పొతే తిరిగి వెనక్కి వెళ్లి పోతాడు గదా ! – అలాగే మీరన్న మాటలను నేను స్వీకరిస్తే అవి నన్ను చేరి బాదిస్తాయి – లేదా నాలో కోపాన్ని పెంచుతాయి – నేను మీరన్న మాటలను స్వీకరించడము లేదు – అప్పుడు అతిథి తిరిగి వెనక్కి వెళ్ళినట్లు గానే ఆ మాటలు మిమ్మల్ని చేరతాయి తప్ప నన్ను ఏమి చేయలేవు – నాకు వాటికి ఏమి సంబంధము లేదు ” అని బుద్దుడు వారికి సంధానం ఇస్తాడు – మనస్సును స్వాధీనము చేసుకోవాలంటే ముందు శ్వాసలను స్వాధీనము చేసుకోవడం అనేది సులువైన మార్గము – ఫలితానిచ్చే మార్గం – సరియైన మార్గము అని మరవ వద్దు.
పై విషయాలన్నీ నా కంటే మీకే బాగా తెలుసు – దయ చేసి ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని కోరుకుంటున్నాను
R.B.Satyanarayana
Chairman, Annadhara
7/3/2016
🌹 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
అంతరంగము పిలుస్తుంది రా! 4వ బాగము
1) పంచములోని అన్నీ ఐశ్వర్యములు అనుభవించడానికి లభించినను- కాని పరమాత్మ యొక్క జ్ఞానము కలుగని యెడల చివరికి ఈ జీవాత్మ్హ యొక్క సర్వసము హరింపబడును – ఎవరి దగ్గరైన ఆత్మ జ్ఞానము లేకుండా ఇతరత్రా అన్నీ ఉన్నప్పటికీ అవి అన్నియు నశ్వరములే – అతని శరీరము కూడా నశ్వరమే – (వ్యర్ధమే ) ముని వశిష్టుల వారు అంటారు – ఎవరికైనా స్వర్గము యొక్క ఐశ్వర్యము లభించినను ఆత్మజ్ఞానము లభించనట్లయితే ఆ మనుష్యుడు అభాగ్యుడు – భాహ్య ఐశ్వర్యము లభించినా – లభించక పోయినా – చండాలుని ఇంటి భిక్షను చిప్పలో తింటూ జీవించవలసినటువంటి కష్ట సమయం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఆత్మజ్ఞానము లభిస్తుందో ఆ దేశములోనే నివసించ వలెను – ఆ వాతావరణములోనే మన చిత్తాన్ని – పరమాత్మునిలోనే లగ్నము చేయవలెను – ఆత్మ జ్ఞానము కొరకు ఉత్సాహం చూపు మనుష్యుడే తనకు తాను మిత్రుడు – తనను తాను ఉద్ధరించుకొనే దారిలో నడవని వ్యక్తిని మనుష్య శరీరములో ఉన్నటువంటి రెండు కాళ్ళ పశువుగా భావించడం జరిగినది – అని తులసీదాస్ జీ గారు అన్నారు – > వశిష్ట ముని అంటారు జ్ఞానవంతులైన ఋషి, మహర్షుల జీవితాలలో ఎన్నో బాధలు , కష్టాలు వచ్చినా కాని వారి చిత్తము ఎల్లప్పుడూ తమ ఆత్మ అభ్యాసములోనే లగ్నమై ఉంటుంది – >శ్రీరాముల వారు భాల్య కాలమునుండి ప్రాణాయామము , ధ్యానము చేసేవారు – పదహారు సవంత్సరముల వయస్సులోనే తీర్ధయాత్ర చేస్తూ ప్రపంచములోని స్థితి గతులను లోతుగా అధ్యయనము చేస్తూ – పెద్ద పెద్ద భవనములు శిధిల మవుచున్నాయి, ఊరు స్మశానము అవుతున్నది మరియు స్మశానము ఊరవుతున్నది – ఇటువంటి నశించే ప్రపంచాన్ని చూసి శ్రీరామునకు వైరాగ్యము కలిగినది – ప్రపంచములోని వికృత జీవితమును, వికృత సుఖాన్ని చూసి అతనికి వైరాగ్యము ఏర్పడింది – వారు వశిష్ట ముని యొక్క జ్ఞానవచనములు వినేవారు – ఆ జ్ఞాన వచనముల వింటూ అందులోలీనమయ్యే వారు – బ్రహ్మామూర్తములో ప్రాణాయామము చేసేవారు -> ఎన్ని కష్టములు వచ్చినా ఆత్మ జ్ఞానమును పొందడము – గురువు యొక్క వాఖ్యములను సాక్షాత్కారము చేసుకోవడము ముఖ్యమని తలచేవారు – బు ద్ధి మంతులు ప్రతి నిమిషమును సద్వినియోగము చేయాలని భావిస్తారు – > జీవితము యొక్క విలువను తెలుసుకొన్న వారు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు – మూర్ఖ స్వభావము కలవారు ,తన మనస్సునకు బానిస అయినవాడు కోరడ దెబ్బలు తిని కొద్ధిదూరము నడస్తాడు – మళ్ళి తరువాత నడవడము ఆపేస్తాడు – బ్రహ్మజ్ఞాని గురువు లభించినప్పటికీ మూర్ఖ మనుష్యుడు సావధానుడు కాలేడు – బుద్ధిమంతుడైన మనిషి గురువు యొక్క యుక్తి పైనే నిలిచి ఉంటాడు –> ఏకలవ్యుడు తన గురువు యొక్క బొమ్మను తయారు చేసి , దానియందు ఏకాగ్రతను వుంచి అభ్యాసమును కోన సాగించినాడు – ఏదైనా తప్పు జరిగితే తన చెవిని తానే పట్టుకొనే వాడు – ఎడమ చేతితో చెవిని పట్టుకొని కుడి చేతిని గురువు యొక్క చేయిగా బావించి చెంప మీద కొట్టుకొనే వాడు – ఆవిధంగా చేస్తూ చేస్తూ గురువు యొక్క మూర్తి ముందు ధనుర్విధ్య నేర్చుకొని దానిలో ప్రావీణ్యతను పొందినాడు – గురు వచనమందు బద్ధులైన వారు ఎన్నో కష్టాలు , భాధలు వచ్చినప్పటికీ ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలి పెట్టరు – అన్నింటికంటే ఉన్నత పదవి అయిన ఆత్మ సాక్షాత్కారము చేసుకోనేదరు – ఇటువంటి ఆత్మ జ్ఞానులు అధ్బుతమైన వారగుదురు.
2) మోహము , మాయ , మోసము – కుట్ర – దగా చేసి ఎవరైతే తమ పిల్లల కోసం డబ్బు ప్రోగు చేస్తారో వారి యొక్క ఆ పిల్లలే వారి ముఖము మీద ఉమ్మేస్తారు – అని నానక్ జీ అంటారు – సాదకునికి భగవంతుడు తప్పించి మిగతా ఏవి రుచించడం లేదంటే అతడు మొదటి మెట్టును చేరుకోన్నాడని మనము అర్ద్తము చేసుకోవాలి – భాధలు ,కష్టాలు అనేవి అతనికి సాధనంగా తయారవుతాయి – తపస్సుగా తయారవుఅతాయి కష్టాలు ,బాధలు అనేవి జీవితానికి సంగీతములు అవి రానట్లయితే సంగీతమే ఉండదు -> తుమ్మెద పురుగును పట్టుకొని తన రంధ్రములో పెడుతుంది – తరువాత దాని ఒకసారి పోడుసుతుంది – అప్పుడు ఆ పురుగు కొట్టుకుంటుంది – దాని శరీరము నుండి చెమట లాంటి కొత్త ద్రవ పదార్ధము వెలువడుతుంది – మళ్ళి తుమ్మెద రెండవ సారి పొడిచి నప్పుడు ఆ పురుగు వేగంగా కొట్టుకుంటుంది – ఆ చెమట పదార్ధము గట్టిగా అవుతుంది – గూడు తయారు అవుతుంది – మూడవ సారి పొడిచినప్పుడు పురుగు తీవ్రంగా కొట్టుకుంటుంది – విపరీతమైన బాధకు గురి అవుతుంది – కాని పొడవడము కారణంగా చెమట నుండి తయారైన గూడులో నుండి రెక్కలు బయటకి వస్తాయి – అది ఇక ఎగిరిపోతుంది – > ఆవిధంగా పరమాత్ముడు తన సాధకునిని –తన దివ్య అనుభూతిలో ఎగురవేయాలని అనుకోన్నప్పుడు అతనికి నలువైపులా కష్టాలు ,బాధల్ని కల్గిస్తాడు – దాని ఉద్దేశము ఆలోచనా శక్తి , మనో బలము – అవగాహన శక్తి మరియు ఆత్మ శక్తి పె౦పొంది౦చాలని – > భక్తురాలైన” మీరా” కొరకు పరమాత్ముడు “ రాణా “ రూపములో బాధలని ఇచ్చాడు – శభరి కావచ్చు లేదా సంతు కభీర్ కావచ్చు – ఎక్ నాద్ జీ కావచ్చు లేదా సంత్ తుకారామ్ కావచ్చు , అటువంటి భక్తులకు ఒక రకమైన వలను తయారు చేస్తూనే వుంటారు – ఏవిధంగా అయితే మూడవ పొదుపునకు రెక్కలు విచ్చుకొని బయటికి వస్తాయో – ఆవిధంగానే ప్రకృతి వైపు నుంచి ఈ ఆట అంతా కూడా సాధకుని యొక్క ఉన్నతి కోసమే – సరియైన సాంగత్యము తోడు దొరకని వారు – సరియైన మార్గము చూడని వారు – ద్రుడత్వము లేనివారు చలించి పోతారు – దేనిని సాదింపజాలరు – > తపస్సు లో ఏమి పురోగతి సాధించలేదని బుద్ధుని మనస్సులో ఒక సారి ఆలోచన కల్గినది – ఇక్కడ ఎవరూ తెలియదు – తినడానికి ఏ మాత్రము సదుపాయము లేదు –నేను ఏమి అనక పోయినప్పటికీ నా మీద ఉమ్ము వేస్తున్నారు – ఇది కూడా ఒక జీవితమేనా1 పద వెనకకి వెలుదాము అని – ఆసమయాన అతడు సిద్ధార్ధుడు మాత్రమె – సత్సాంగాత్యము తోడు లేదు -మొదటి భూమికలో ద్రుడత్వము కావాలి –బాల్యము లో కలగిన వైరాగ్యమైతే సరే , కాని బుద్ధుని మనస్సులో ఇంటికి వేలదాము అనే ఆలోచన కల్గినది – ఆ ఆలోచనలోనే మునిగి ఉండెను – ఇంతలో ఎదురుగా వున్న చెట్టు మీదికి ఒక పురుగు ఎక్కుతూ కనిపించినది – గాలి దెబ్బ తగలడములో అది క్రింద పడిపోయింది – మళ్ళి మళ్ళి ఎక్కడము ప్రారంభించింది – కొద్దిగా పైకి వెళ్లిన తరువాత మళ్ళి గాలికి క్రింద పడింది – ఈ విధంగా అది ఏడు సార్లు ఎక్కి – ఏడూ సార్లు క్రింద పడినది – అయినప్పటికీ తన ప్రయత్నాన్ని వదిలి పెట్టలేదు – చివరికి అది ఎనిమిదవ సారి ఎక్కడం జర్గినది – > సిద్ధార్ధుడు దానిని ధ్యాన పూర్వకముగా గమనిస్తూ ఉండెను – అతడు ఈ విధమైన ఆలోచనలో పడెను “ ఇది ఏమి అబద్ధపు సంఘటన కాదు – ఇది ఒక సంకేతము – ఒక సాధారణమైన పురువు తన లక్ష్యాన్ని చేరుకోగా లేనిదీ నేను మనిషినై ఉండి వెనుకంజ వేయదమా ? ” “ కార్యము సాధయామి, వా దేహం పాతయామి ” కార్యాన్నీ సాధిస్తా లేదా , మరణిస్తా – తన కోటలో కూడా మరణించ వలసిందే – సాధనా చేస్తూ చేస్తూ కూడా మరణించిన ఇబ్బంది ఏమి లేదు – ఆ విధంగా ఆలోచించి గట్టిగా నిశ్చయించుకొని బయలు దేరినాడు – ఏడూ సంవత్సరముల లోనే అతనికి జ్ఞానోదయము కలిగినది – > బ్రహ్మ జ్ఞానము కలిగినది – అతని వాక్కు వేద వాక్కు అవుతుంది.
3) ప్రపంచములో ఏమి దోరికినప్పటికి చివరికి ఏముంది ? కళ్ళు మూతపడతముతోటే అంతా మాయం – గొప్పలో గొప్ప భర్త దొరికినప్పటికి ఏమిటి లాభం ? సుఖమే కదా నీ నుండి పొందేది – నీవు ముసలి దాని వైన తరువాత చూడను కూడా చూడడు – సు౦ధరమైన భార్య దొరికిన నీ నుండి సుఖాన్ని కోరుకుంటుంది – నీవు ముసలివాడివైన తరువాత ఉమ్మేస్తుంది – కొడుకు కలిగిన యెడల నీ నుండి డబ్బును కోరుకుంటాడు – నీ కొడుకు వారసుడవుతాడు – భార్య నీ శరీరం నుండి సుఖాన్ని కోరుకుంటుంది – భర్త నీ శరీరానికి యజమాని కావాలని కోరుకుంటాడు – కాని నీయొక్క కల్యాణాన్ని చేసేవారెవరు ? రాజకీయ నాయకుడు నీయొక్క ఓటుకు భాగస్వామిగా కావాలని కోరుకుంటాడు – ప్రజలు నీ నుండి సౌకర్యాలను కోరుకుంటారు – వీరందరు ఒకరికొకరు స్వార్ధంతోటే కూడి ఉన్నారు – భగవంతుడు భగవంతుని యొక్క ప్రాప్తిని పొందిన మహా పురుషులే నీ యొక్క మేలు కోరుతారు – నిజమైన మేలు వారే చేయగలరు – ఇతరులు చేయను కుడా చేయలేరు – అన్న పానీయాలు, ఉద్యోగం – ప్రమోషన్లు కొద్దిగా చేయవచ్చు – శరీరం యొక్క మేలు ఎవరైనా కొద్దో గొప్పో చేయగలరు కాని నీ యొక్క మేలయితే భగవంతుడు మరియు సద్గురువే చేయగలరు – ఇతరుల వల్ల సాధ్యం కాదు – నీ యొక్క మేలు ఒక వేల ఎవరైనా చేయడం జరిగింది అంటే అది గురువు వల్లనే సాధ్యమవుతుంది – అమ్మ ఒక వేల ఆత్మ సాక్షాత్కారము చేయించ గలిగినట్లైతే అమ్మ గురువే – > శరీరం యొక్క శుద్ధి అయితే మీకు ఎవరైనా చేయగలరు – కాని మీశుద్ధి మాటేమిటి ? – > ఒక కర్మ ఉంటుంది నీకోసం, రెండవది ఉంటుంది శరీరం కోసం – శరీరం కోసమైతే జీవితాంతము చేస్తాము – నీ కోసము ఎప్పుడు చేస్తావు ? మరి శరీరమైతే ఇక్కడే పూడ్చ బడుతుంది – ఇందులో ఎటువంటి సందేహం లేదు – నీకోసం ఏమి చేయక శరీరంకోసం చేసి చేసి ఏమి ఫలితాన్ని పొందావు ? కారు కోసం చాలా చేసావు – కాని ఇంజను కోసం ఏమి చేయనట్లైతే కారు ఎన్ని రోజులవరకు నడుస్తుంది – శరీరం కోసం అంతా చేశావు – కాని నీ కోసం ఏమి చేయక పోయినట్లయితే చివరకు అమంగళకరమైన జన్మలలో ఈడ్చుకుపోబడుతావు – ప్రేత జన్మలో, వృక్షం యొక్క శరీరంలో, ఎవరైనా అప్సరసల శరీరంలోకి వెళ్తావు – అక్కడ దేవతలు నిన్ను పీక్కు తింటారు – ఎక్కడికైనా వెళ్ళు, అందరూ ఒకరినొకరు పీక్కు తినడమే జరుగుతుంది – స్వతంత్రమైన ఆత్మ సాక్షాత్కారం ఎప్పటి వరకైతే జరగలేదో అప్పటివరకు మోసమే మోసం – > అందువలన నీ యొక్క అమూల్యమైన సమయాన్ని అమూల్యమైన ఆత్మ పరమాత్మను తెలిసికొనుటకు లగ్నం చేసి శాశ్వత సుఖాన్ని పొందు – టెన్షన్ లేనటువంటి, భయం లేనటువంటి, మృత్యువు లేనటువంటి శాశ్వతమైన, అమరమైన పదవిని పొందు.
4) ఈ ప్రపంచములో ఉన్న మనము పరమాత్ముని పూర్తిగా విస్మరించాం – పరమాత్ముణ్ణి మనలో సందర్శించే ప్రయత్నమే చేయడం మానుకున్నాం – సుఖాలను, శాంతిని ప్రాపంచికవస్తువులతో పొందడానికి ప్రయత్నిస్తున్నాం –పరమాత్మను మరచిపోయి, సుఖ శాంతుల కోసం ప్రయత్నిస్తున్న కొద్ది – రాత్రింబవళ్ళు మనకి దుఖం ఎక్కువ అవుతూ వస్తుంది – ఏమంటే ఏ వస్తువుల్లో మనము సుఖ శాంతుల కోసం వేదుకుతున్నామో అవి అశాశ్వతములు – వాటివల్ల లభించే సుఖము మాత్రము శాశ్వతం ఎట్లా అవుతుంది ? ఎప్పటికి నశించనిది, సత్యమైనది, సర్వదా నిలిచేది అయిన వస్తువు మనము పొంద లేనంత వరకు మనకి సుఖ శాంతులు ఎట్లా లభిస్తాయి – > “ పాపము చేయకుండా సంపదలు సమకూరవు – పోయేటప్పుడు సంపదలు వెంట రావు అన్నారు గురునానక్ ” జీవితము అనుభవించడములోనే సుఖము, సంతోషము ఉన్నాయని అనుకొంటూ ఉంటాము – స్థూల సుఖాలు పొందడానికి ప్రయత్నిస్తాము – సుఖము కోరితే దుఃఖము ఎదురొస్తుంది – ఈ ప్రపంచములో శాశ్వతమైన సుఖ శాంతులు ఎన్నటికి పొందలేము – సుఖాన్ని కలిగించేదిగా కనబడే ప్రతి వస్తువు మరోక్షణములో దుఃఖ దాయకమవుతుంది – ఆత్మ పరమాత్మనే చేరుకోనంత వరకు సుఖ శాంతులు – సాధ్యము కావని మహాత్ములు అనుభవ పూర్వకంగా మనకు చెబుతున్నారు – > సారమేరిగిన మహాత్ములంతా పరమేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నారు – ఆ సత్యాన్ని మనకు తెలియజేశారు – పరమాత్ముడు ఒక్కడే మనమంతా అయన బిడ్డలం – ఈ సృష్టి అంతటికి – ఈ ప్రపంచములో మనము చూసే జీవరాసులని – కోటానుకోట్ల జీవరాసులకు పరమేశ్వరుడు ఒక్కడే – ఈ ప్రపంచాని కంతటికీ అస్థిత్వాన్ని ఇచ్చే పరమాత్ముడు అనంతుడు – అతడే అఖిల భవనానికి అతినాతుడు – అతీతుడు, అనంతుడు, సర్వాంతర్యామి అయిన ఆపురుషుడే సృష్టి కర్త – ఆ పరమాత్ముడే నిత్య సత్యమూర్తి – సృష్టి ఆది నుంచి – ఏ శక్తి అయితే నిరంతరాయంగా అవినాశ్య౦గా ప్రకాశిస్తూ వస్తున్నదో – ఆ అతీత శక్తి నాలోనే ఉందని అనుభవం వల్ల తెలుసుకోవాలి – > అలాంటి అనంతమైనది నీలో ఉంచుకొని దర్శించక పోవడం న్యాయమా ఓ నేటి మానవుడా – పూర్వ కాలము చరిత్రంతా తరించిన అనుభవజ్ఞులు ఇలా చెబుతుంటే – నేనేమి పాపము చేశానో – నీవు తరించక పోవడానికి కారణమేమి ? – ఈ స్థూలమును ఎవరు తీసుక పోరుగదా – ఎందుకూ దీనిపై వ్యామోహము – సత్యము గుర్తేరుగవ – ఎన్నాళ్ళు ఈ జన్మలు ఎత్తిస్తావు – ఇకనైనా మేలుకో – నన్ను బంద విముక్తున్ని చేయి – నేను నీ అంతరంగాన్ని వెలిబుచ్చుతున్న ఆక్రందన – నాగోడు నీకు వినబడుతుందని అనుకుంటా – సనాతనులైన అందరూ పోవు మార్గామునే పోతావని లేదా – ఈ స్థూల జగత్తులోని మానవులు వెళుతున్న దారిలో నీవు వేలుతావో విజ్ఞానవంతుడవైన నీవు ఆలోచిస్తావని నన్ను చేరుకుంటావని ఆశిస్తాను.
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె మనస్పూర్తిగా తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
7/4/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
కర్మ – ప్రారబ్ధము 4 వ బాగము
1) ఈశ్వరునికి దూరమై మనము ఈ మాయలో చిక్కుకున్నాము – ఇక్కడ మన ఆత్మ మనస్సుతో చెలిమి కట్టింది – మనస్సు ఇంద్రియ భోగాలు, విషయ వాంచలు, ప్రాపంచికమైన అన్నీ సౌఖ్యాలు కోరుకుంటుంది – మనస్సు చేసే ప్రతి కర్మ పలితాన్ని ఆత్మ కూడా అనుభవించ వలసి వస్తుంది – ఎందుకనగా మనస్సు , ఆత్మ ఎంతో ముడిపడి వున్నాయి – ఇహలోకాన్ని ఋషులు , మునులు కర్మభూమి అని వర్ణించారు- > మహమ్మద్ ప్రవక్త రేపటి వచ్చేజన్మ కోసము నేడు పంట పండించే పోలమే ఈ లోకము – అని వాఖ్యానించారు . >గోస్వామి , తులసి దాసు ఈ ప్రపంచములో కర్మ సిద్ధాంతానిదే రాచరికము అన్నారు – ఏసుక్రీస్తు ఏది నాటితే అదే అనుభవించాలి అన్నారు – ముళ్ళ పొదలు పెంచి ద్రాక్ష పండ్లు కావాలనుకోవడము అవివేకము అన్నారు – ఏది జర్గినా ఎవరినీ ని౦దించవలసిన పని లేదు – మన కర్మలే వాటికి కారణము . > ఎంత చేశానో అంతే అనుభవించాను – మరొకరిని అనుకోని ఏమి ప్రయోజనము లేదు అన్నారు గురునానక్ – > కర్మని అనుసరించే పలమును . చెడ్డ కర్మలు చేసినవారు చెడు అనుభవించాలి – మంచి కర్మలు చేసినవారు మంచి అనుభవించాలి – మిరపనారు వేసిన వారు మిరప పంటే కోసుకుంటారు – మామిడి మొక్క నాటినవారు మామిడి పండ్లు తినడానికి నోచుకుంటారు – మంచివైన , చెడువైన చేసుకున్న కర్మల అనుభవించడానికి జన్మ ఎత్తవలసి వస్తుంది – మంచి కర్మలు చేసినవారు జమిందారుల ఇంట్లోనో ,పెద్ద పెద్ద వారి ఇంట్లోనో పుడుతారు – “ సి” క్లాసు ఖైదీ కావలసినవారు “ఏ” క్లాసు ఖైదీ లవుతారు – >గుడిసెలలో కాపురము చేసేవారు భవనాలలో నివసిస్తారు – ఇనుప సంకెళ్ళు పొయి బంగారపు సంకెళ్ళు అమరుతాయి – ఇంకా ఎక్కువ మంచి కర్మలు . చేసిన వారయితే స్వర్గానికి , వైకుంఠనికి వెడతారు – మంచి కర్మల పలితాన్ని అనుభవించన తర్వాత మళ్ళి జనన – మరణాల చక్రబంధంలో ప్రవేశిస్తారు – చేడ్డకర్మలు చేసినట్టయితే నరక కూపాలు , ఎనభై నాలుగు లక్షల జీవరాసులలోని జీవితానుభవాలు పొంధవలసివుంటుంది ->” పశు ,పక్షి ,నర,సుర,అసుర ,జలచర కీటకాదులన్నీతాము చేసుకున్న కర్మను అనుభవిస్తున్నవే ” > ప్రభువైన , ధనికులైన , బీధవారైన , స్త్రీలైన , పురుషులైన ప్రపంచములోని జీవు లందరమూ కర్మజాలములో చిక్కుకున్నాము – కర్మ మూలంగా ఏ జన్మనైన అనుభవించాల్సి వస్తుంది – ఏ దు:ఖాన్నయిన , ఎంతటి కస్టాన్నాయినా సహించాల్సి వస్తుంది – ఈశ్వరుని నుంచి వేరుపడ్డాక ఏ జన్మలోను సుఖాన్ని గాని , శాంతిని గాని పొందలేము –>నిత్యమూ మానవుల ఆహారము నిమిత్త్తము వేలాది జీవాల ప్రాణము తీయడము జర్గుతుంది – వాటి కుత్తుకల్ని కత్తులతో కోస్తున్నారు – అలాంటి మేక , కోడి, గొర్రె జన్మలెత్తి మనము సుఖపడగలమా?>మన కర్మల పలితంగా అలాంటి జన్మలు ప్రాప్తించి మన మేడలమీద కత్తులూ , చాకులూ దూయడం జరుగ వచ్చునేమో – ఆ విషయాన్ని మనము ఆలోచించనైనలేదు- ఇంజక్షను ఇవ్వడానికి డాక్టరు సూదిని వేడి చేయ్యడము చూసేసరికి వణుకు పుట్టుకువస్తుంది – ఇంజిక్షను మనకు మేలు చేసేధైన – భయము వస్తుంది > వీపున బరువు లెత్తి ఒంటెను నడిపిస్తారు – బళ్ళు లాగే గుర్రాల అవస్థ సరేసరి , ఎందరు మనుష్యులు బండిలో ఎక్కినా – చురుకుగా నడవమని కమ్చా దెబ్బలు తగులుతూనే వుంటాయి గుర్రాలకి- రోజంతా అరకదున్ని చివరికి అలసి , చతికిల బడే సరికి, ఎడ్లను ముళ్ళు కర్ర పెట్టి కుచ్చుతాడు రైతు – చెప్పా వచ్చేదేమంటే ఏ జన్మ అయినా దు:ఖాన్ని, కస్థాన్ని కలిగించేదే – నీచ జన్మల విషయము అలా వుంచి , మానవజన్మ లోని లోతుపాతులు విచారించుదాము – ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు , ఎన్నో ఇక్కట్లు అనుభవించాల్సి వస్తూవుంటుంది – అయినప్పటికీ పరమేశ్వరుని సృష్టిలో మానవజన్మ మకుటాయమాన మైనదని అంటారు – ఋషులు , మునులు , దీన్ని నర నారాయణ దేహమని వర్ణించారు – సృష్టిలో మానవజన్మ ఉత్తమ మైనదని చెపుతారు – > కనుకనే దేవతాగణము కూడా మానవజన్మకోసము ఉవ్విళ్ళు ఊరుతారు – అయినప్పటికీ మానవ జన్మ ఎత్తిన ఎవరు సుఖము కాని , శాంతిగాని పొందలేక పోతున్నారు – సంపన్నులు రోగగ్రస్తులై అనుభవిస్తుంటే మరికొందరు రోజులు గడవక అలమటిస్తారు – కొందఱు సంతానములేక అనవరతము అల్లాడుతుంటే , మరికొందరు మితిమీరిన సంతానముతో ఏగలేక పోతున్నారు – కొందఱు అప్పులు తీర్చలేక భాధపడుతువుంటే , మరికొందరు అప్పులు వసూలు చేసుకొనడానికి కోర్టుల వెంబడి తిర్గుతున్నారు – పగలు ,రాత్రి ఏదో ఒక వ్యధ వేదిస్తూంది – రోడుప్రక్క చలి , ఎండా అనేదిలేక కడుపు బాదుకుంటూ ఆకలితో అలమటించే పేదవారిని మనము చూస్తూనే ఉంటాము – భయంకరమైన దీర్గ వ్యాధులతో బాధపడే వారిని చూస్తాము – జైల్లో వుండే ఖైదీలను చూస్తాము -> దేశాల మధ్య ,జాతుల మధ్య నిత్యమూ యుద్ధాలు , పోరాటాలు సాగుతున్న వార్తలు వినభడుతుంటాయి – అమాయకులైన వారెందరో ప్రాణాలు కోలుపోతున్నారు – స్త్రీలు ఎందరో వితంతువులు అవుతున్నారు – పిల్లలు అనాధ లవుతున్నారు – కూడు కోసం, గుడ్డ కోసము , గూడుకోసము రాత్రింబవళ్ళు కీచులాట – ఏ క్షణాన ఎవరి చేతిలో మృత్యువు వస్తుందో నన్న భయముతో వేగే ఈ ప్రపంచములో సుఖము , ఎక్కడ లభిస్తాయి – ప్రపంచము దు:ఖమయము – ప్రపంచములో వుండే ప్రాణులందరు దు;ఖములో మునిగివున్నారు .
2) మానవజన్మ పొందినప్పటికీ సుఖశాంతులు అనుభవించలేకపోతే మరే జన్మలో సాధ్యమవుతుంది ? అందుకే ,ఈ ప్రపంచములో ఎవరికైనా ఎల్లప్పుడూ సుఖము , శాంతి లభింపజాలవని మహాత్ములు మనకి భోదిస్తున్నారు –ఏమంటే , ఈ ప్రపంచము సుఖ ,దుఖాలకి , పాప పుణ్యాలకి నిలయం – మనము చేసుకున్న పాప , పుణ్యాల కారణముగా ఈ లోకములో జన్మించి అనుభవిస్తాము – > ప్రపంచములో ఎంత వెతికి చూసినా ఎప్పుడు సుఖమే అనుభవిస్తూ , ఎన్నడు దు;ఖము అన్నది ఎరుగని మనిషి కనబడడు – అలాగే ఎప్పుడు దు:ఖమే అనుభవిస్తూ సుఖమన్నది ఎరుగని వారిని చూడము – పది రోజులు సుఖముగా వుంటే ఆవెంటనే దు;ఖము వెన్నాడుతుంది – పది రోజులు దు:ఖముతో వెళ్ళ బుచ్చితె కొంతలో కొంత సుఖము ఆతర్వాత కనబడుతుంది –ఇది మన అందరికి అనుభవములో వున్న విషయమే – ఇక్కడ మనము అనుభవించే దు;ఖము క్రితము జన్మలో చేసుకున్న పాపాల పలితమే – అలాగే ఏ మాత్రము సుఖ పడుతున్నా , అదికూడా గత జన్మల పుణ్యపలితమే , పాప పుణ్యాల సంయోగం వల్లనే ఈ మానవజన్మ మనకి లభ్యమవుతుంది .చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మన అనుభవాలూ ఆధారపడి ఉంటాయి – కేవలము పుణ్యమే చేసుకోనివుంటే స్వర్గసుఖాలు అనుభవిస్తాము – లేక పాపాలు చేసుకోనివుంటే నరకాలలోని భాధలు అనుభవిస్తాము – ఎక్కువ పుణ్యము తక్కువ పాపము చేసుకొన్నవారు –ఎక్కువ సుఖపడుతున్నట్లు వారి జీవితాల్లో దు:ఖము తక్కువగా వున్నట్లు కనబడుతుంది – అలాగే పాపము ఎంతో మూటకట్టుకొని , పుణ్యము గడించే కర్మలు చేసినవారు ఎప్పుడు దు;ఖాలలో మునిగి తేలుతున్నట్లు , ఎప్పుడోగాని సుఖమే ఎరగనట్లు కనపడుతారు – ఈ కారణాల వలనే ప్రపంచములో ధనికులు ,పేదవారు , ఆరోగ్యవంతులు , రోగిస్థువారు ,ఎక్కువ తక్కువ వారు కనిపిస్తుంటారు – ఏమంటే ప్రతిజీవి తనకర్మల పలితాన్ని అనుభవించడానికే ఇక్కడికి వస్తాడు – > ఈ ప్రపంచము ఇంతవరకూ ఎప్పుడూ స్వర్గ దామము కాలేదు , ఇటుపైన కాభోదు – >మన ఆత్మ ఆ పరమాత్మునిలో ఐఖ్యము కానంతవరకు ,స్థూల దు:ఖాలనుంచి , క్లేశాలనుంచి మనము తప్పించు కోలేము – పరమాత్ముని తో ఐ ఖ్యము అయిన ఆత్మ మాత్రమే అతీతమైన ఆనంద అనుభూతిని పొంద గలుగుతుంది – అని అనుభవ జ్ఞానులు చెప్పుతున్నారు.
———————– సశేషం ————————
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తేలపగలరని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
7/7/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
మానవజన్మ – ఉద్దేశము
1) పరమేశ్వరుడు 84 లక్షల జీవరాసులను సృష్టించాడు – వాటిలో 30 లక్షలు వృక్షరాసి – 27 లక్షలు క్రిమికీటకాదులు – 14 లక్షలు పక్షి సముదాయము – 9 లక్షల జలచరములు పోతే మిగితా – 4 లక్షల జీవరాసుల లోను జంతు జాలము – దేవీ దేవతలు – బూత ప్రేత పిశాచాదులు – మానవులు ఉన్నారు – > పూర్వ కర్మ ఫలము వల్ల మనమందరము విశాలమైన ఈ ప్రపంచములో బందీలమయ్యాము – మన ఆత్మలు పరమాత్ముని చేరుకోగలిగి నప్పుడే ఈ కర్మ బంధానికి విముక్తి లభిస్తుంది – జనన మరణాల చక్ర బంధము నుంచి బయట పడడానికి అవకాశము కలిగించే౦దుకే పరమేశ్వరుడు మనకు మానవ జన్మ ప్రసాదించినాడు – ఏమంటే మానవ జన్మ ద్వారానే పరమాత్మ సాయుజ్యము పొందగలిగే అవకాశముంది – అందుకే మనుష్య జన్మను సృష్టికి మకుటాయ మానమని మహాత్ములు చెబుతారు – ఈ మంచి అవకాశాన్ని మనము వినియోగించుకొన లేకపోతే ఈ చక్రము నుంచి బయటపడే వీలు దొరకదు – తిరిగి మరేదో జన్మ ఎత్తవలసి ఉంటుంది – > ఉత్తమమైన మానవ జన్మ నిచ్చెనకి పై మెట్టు వంటిది పైకి చేరుకొన్న తరువాత నిచ్చెన నుంచి ఒక్క అడుగు వేస్తే జన్మ సాపల్యము లభిస్తుంది – అక్కడ అడుగు జారితే పరమపద సోపానములోని పామునోటిలో పడ్డట్టు అథఃపాతాళానికి పడిపోతాము – > పూర్వ జన్మ జ్ఞానముగల మహాత్ములు మనము గతములో ఎన్నెన్ని జన్మలలో పురుగులుగా – పశువులుగా – చేపలుగా – వృక్షాలుగా జీవితాలు గడిపింది మనకు పూసగుచ్చినట్లు చెప్తారు – అంటే, అథఃమ జీవులుగా ఎన్నెన్నో జన్మల నెత్తి ఎన్నో యుగాలు గడిచిన తరువాత పరమేశ్వరుని కృపవలన చివరికి ఈ మానవ జన్మ నెత్తాము – > మరమాత్మను చేరుకోవడానికి ఇది రాజమార్గము వంటిది – మన ఋషులూ, మునులు ఈ మానవ శరీరాన్ని నర నారాయణ దేహమని వర్ణించారు – అంటే నారాయణుడు నివసించె దేహమన్నమాట ఇది – ఈ దేహములో ఉండే ఆత్మ ద్వారానే నారాయణ స౦దర్శనము చేసుకోగల మన్న మాట – ఈ విధమైన భావము కేవలం హిందూ ధర్మములోనేకాక – ప్రపంచలోని ఇతర మతాలలో కూడా ఉన్నది – క్రైస్తవులు మానవ దేహాన్ని, “ టే౦పిల్ ఆఫ్ ది లివింగ్ గాడ్ ” అని వర్ణించారు – పరమేశ్వరుడు మానవులను తన పోలికలోనే సృష్టించాడని ఇతర మతాలవారు నమ్ముతారు – అంటే ఈ దేహము దేవుడు ఉండే అంతా పవిత్రమైనదన్న మాట – మానవ జన్మ లభించడం దుర్లభ మన్నమాట – భక్త కబీర్ మానవ జన్మ విశిష్టతను గురించి ఎంతో వివరంగా అనేక మార్లు చెప్పారు – > చెట్టున మిగలమ్రగ్గిన పండు నేలరాలి పోతుంది – మళ్ళి దాన్ని కొమ్మకు అతికించడం సాధ్యము కాదు – అలాగే ఎన్ని యుగాలకో దొరికిన దుర్లభమైన ఈ మానవ జన్మ మళ్ళి మళ్ళి లభించదు – మానవ జన్మ అనే అపూర్వమైన వరము నీకు నేటికి లబించినది – > ఈ వరమునుంచి ప్రయోజనం పొందడానికి నువ్వు తీవ్ర యత్నము చేయవలసి ఉంది – ప్రాపంచికమైన మోహ బంధాలలో చిక్కుకు పోరాదు – ఈ ప్రపంచము ఒక కల వంటిది – ఈ దేహము, ఈ జీవితమూ అన్నీ వట్టి మాయ – > ఈ మాయలో పడితే ఏమి సాధించ గలవు ? – మనకి నియుక్త మైన పని చేయడానికి వీలుగా భగవంతుడు మనకు మానవ రూపము ప్రసాదించినారు – మన నిజధామానికి – పరమాత్మ సన్నిధానానికి చేరుకునే ప్రయత్నమూ చేయడమే మనము చేయవలసిన పని – > అదే భగవ౦తుని పట్ల మనము చూపించే భక్తి విశ్వాసాలకు నిదర్శనము – ఈ జన్మ నిచ్చి నందుకు పరమేశ్వరునికి మనము చూపగల కృతజ్ఞత.
2) ఈ ప్రపంచం అనిత్యం – భార్య బిడ్డలు, బంధు మిత్రులు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అనిత్యములే ఈ దేహం కూడా అనిత్యమే – ఈ దేహం గాని, మరేదిగాని మన వెంటరాదు – అందికనే ఈ గొప్ప అవకాశాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి మహాత్ములు మనకు మరీ మరీ చెబుతారు – ఈ అవకాశాన్ని వినియోగించుకోనడమంటే ఈ ప్రపంచము అంతా మాయ అని – ఇక్కడి ధనకనక వస్తూ వాహనాలన్నీ మిథ్య అని గ్రహించి – ఈ జన్మను ఆత్మ సాక్షాత్కారానికి వీలుగా తయారు చేసుకోవడమే – > అయితే మానవులుగా జన్మించిన వెంటనే కర్తవ్యాన్ని మరిచిపోతాము – గట్టు చేరిన తరువాత పడవను మరచిపోయినట్టు ఈ ఉత్తమమైన జన్మ పొందిన వెంటనే గతములో పడిన వ్యథలన్ని – గత జన్మల్లో అనుభవించిన బాధలన్ని మరిచి పోతాము – మరుసటి జన్మలో ఎలా ఉంటుందో ఎవడికి ఎరుక అనుకోని ఇప్పుడు బోగాలతో – విలాసాలతో నేటి మానవుడు కాలము గడుపుతున్నాడు – చెప్పుకో వలసిన విషయము ఏమిటంటే – మరుసటి జన్మలో ఎలా ఉంటుందో అని బయపడి ఇప్పుడు వేర్రులేత్తే పోకడలు పోవడము కంటే – > అసలు మరుసటి జన్మంటూ లేకుండా చేసుకోగల అవకాశము ఇది అని గ్రహించి భగవంతుని ఆరాధించి – ఆత్మ సాక్షాత్కారము చేసు కున్నట్టైతే ఎంతో మేలు జరుగుతుంది మళ్ళి జన్మంటూ రాదు – ఈ అవకాశాన్ని విజ్ఞానవంతుడైన మానవుడు వదులు కోవద్దు – మన ఆప్తులు, ఆత్మీయులు, అయిన వారు ఒకరి వెంట మరొకరు వెళ్లి పోతున్నప్పుడు కూడా మనకు ఈ ప్రపంచము అనిత్యమని ఈ భోగ బాగ్యాలు అశాశ్వతమిని గ్రహించ జాలము – > మరణ మనేది ఇతరులకి గాని మనకు లేదని భ్రమిస్తాము – మన మనసుకు మనము భానిసలమై ప్రవర్తిస్తాము – మనసు ప్రేరేపించే కోరికలకు దాసులమై నడుచుకు౦టాము – భగవంతుడు మనకు ఈ మానవ జన్మను ఎందుకు ప్రసాది౦చాడో – మనము ఈ ప్రపంచానికి వచ్చిన కర్తవ్యమెమిటో మరిచి పోయి జీవితం గడిపి వేస్తాము – > మన బరువులను మనము మోసుకోలేక పోతున్నాము – గాని ఇతరుల భారాన్ని మోహ బంధముతో మోయడానికి ప్రయత్నిస్తాం – > మనల్ని మనము మోసము చేసుకోవడమే కాక – ప్రపంచాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తాం – > ఇదంతా మాయా జాలము, ఆ జాలములో పడి కొట్టు కుంటున్న మానవులకు రానున్న అభాండము ఏమిటో తెలియదు – మృత్యవుతో నువ్వు వెంట తీసుక వెళ్ళేవి ఏమిటో ఆలోచించు – ఈ ప్రపంచములోకి వట్టి చేతులతో వచ్చావు – ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతులతోనే వెడతావు – ఈ దేహము ఒక కాగితము పడవ లాంటిది – రెండు వాన చినుకులు పడే సరికి చిరిగి పోతుంది – > జపము ప్రాణము తో చేయునది ( బ్రహ్మ విద్య ) ఆ విద్య అనే వరము పొందక పోతే ఎంతో పశ్చాతాప పడతావు – ఈ జీవితము క్షణములో పగిలిపోయే బుడగావంటిది – ఈ శరీరము క్షణములో కూలిపోయే ఇసుక గోడ వంటిది.
3) మహమ్మద్ ఘజని మన దేశముపై 17 సార్లు దండ యాత్ర చేసి – వెండి, బంగారము, రత్నాలు, వజ్రాల రాశులను సంపదనంత కొల్ల గొట్టి తన దేశము తరలించుకు పోయాడు – అతని సైనికులు వెళ్లిన చోట్ల రక్త పాతము చేసారు – మనుషుల ప్రాణాలు నిలువునా తీశారు – సమస్తము నాశనం చేశారు – మరణ సమయము ఆసన్న మయ్యే సరికి ఘజనీ తన పరివారము అందరిని పిలిచి – తాను దోచుకు తెచ్చు కున్న సమస్త సంపదను దర్బారుహాలులో రాశిగా పోయమన్నాడు – తాను కదలలేడు కనుక మంచము తోనే ఆ సంపద రాశి చుట్టూ మూడు మారులు ప్రదక్షణం చేయించుకున్నాడు – ఒక్క సారి గట్టగా నిట్టూర్చి కళ్ళ వెంబడి నీరు జలజల రాలుతుండగా ఇలా అన్నాడు – > ఎన్నెన్నో అత్యాచారాలు, అక్రమాలు చేసి సాధించిన ఈ సంపదలో వీస మెత్తు కూడా ఇప్పుడు నా వెంట రాదు – నేను చని పోయిన తరువాత – నా వట్టి చేతులను ప్రజలు చూసే విధంగా శవ పేటికను అమర్చండి అని ఆదేశించాడు – ఇక్కడ అతను పోకుండా ఆ సంపద వినియోగ పడలేదు – మనసు ప్రేరేపించిన కోరికలు తీర్చుకోవడానికి అనేక కర్మలు చేస్తాం – మానవ జన్మ లభించి నందుకు సధ్వినియోగము చేసుకోలేక సంపదే ముఖ్య మనుకొని పోతారు – > తన స్వగృహానికి బయలు దేరాలి – పరాయి ఇళ్ళల్లో మకాం చేయడం ఎందుకు ? – > నీ సొంతపని నీవు చేసుకో ఇతరుల కోసము పనుల్లో ఇరుక్కోనవద్దు – > ఆ పరమాత్ముని అంశమును సదా ధ్యానించుతుండు – అదొక్కటే నీ వెంట తీసుకు వెళ్ళదగ్గ – వెల్లగల సంపద – ఈ ప్రపంచము లోని సమస్త సంపద అసత్యము, అనిత్యము, విలువలేనిది – ప్రాపంచికమైన మళ్ళినాన్ని కడిగి వేసుకోవడమే – దానికోసం పాటు పడు – ఈ మాటలు చెవిన పెట్టు.
4) ఏ దేశాల చరిత్రలు చూస్తే మనకు బోధ పడుతుంది – రాజులు, రారాజులు, వీరులు, యోదులు, నియంతలు, ధన వంతులు, ఎంతటి అధికారం పొందినవారైన, ఎంత కర్కోటకులైన, ఎంతటి బలశాలులైన అందరు ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతారు – చరిత్రలో మరుగున పడి పోతారు – > ఈ ప్రపంచములో ఏది “ మనది ” అనుకోని ప్రాకులాడు తున్నమో – అది మన సొంతమే యేనాటికి కాదని తెలుసుకోవాలి – ఈ జీవుడు వెళ్లి పోయేటప్పుడు “ నా ” అన్న వాళ్ళెవ్వరు వెంట ఉండరు – యమ దూతలు ఎప్పుడూ ఎల్లా వచ్చేది – జీవుణ్ణి ఎక్కడికి తీసుకు వెళ్ళేది ఎవ్వరికి తెలియదు – మరణించినందుకు ఎడవడం తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు – ఈ బంధు, మిత్రులు, ఈ భవంతులు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ మరణ సమయములో మనల్ని విడిచి పోతాయి – > కర్మ పాశమే మనల్ని కలుపుతుంది – దుష్క కర్మలు అనుభవించడానికి – సత్కర్మ ఫలము పొందడానికి మనము ఈ ప్రపంచానికి వస్తాము – తల్లి దండ్రులు గానో, పుత్రులు గానో, బంధువులు గానో పుడతాము – కర్మ ఫలము అంతా అనుభవించడం పూర్తి కాగానే ప్రతి ఒక్కరూ ఎవరి త్రోవన వారు వెళ్లి పోతారు – > రైలు బయలు దేర బోయే ముందు కిటకిటలాడుతూ – రైలు వెళ్లి పోయిన తరువాత నిర్మానుష్యంగా ఉండే ప్లాట్ ఫారం వంటిదే మన కుటుంబ జీవితం – ఈ జీవితాన్ని ఒక నాటక రంగంతో పోల్చొచ్చు – తమ తమ పాత్రలను ప్రదర్శించి – నిష్క్రమిస్తారు – భార్యా పిల్లలు, పౌత్రులు, సంపద, చివరి క్షణములో ఎవరు ఏ విధమైన సహాయము చేయలేరు – ఇప్పుడు నిత్యము లయ బద్ధంగా సాగే ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆగి పోతాయి – అప్పుడు ఈ దేహము ప్రాణము లేని మట్టి బొమ్మ అవుతుంది – ఈ శరీరము ఒక తోలు తిత్తి వంటి దని మరిచి పోకూడదు – అది పూర్తిగా కాలి అయిపోతుంది – మన జీవితాలు అలాంటివే.
5) క్షణిక మైన ఈ ప్రపంచములో ఉండగానే పరమేశ్వరుని కోసం అన్వేషణ ఆరంభించాలి – ఇది గమనించక “ నాది ” నీది ” అని “ నేను ” నేను ” అని అహంకారముతో, గర్వంతో ఊగి పోతూ ఉంటాం – మనము దేనిని చూసి గర్వ పడాలి ? యవ్వనమా అంటే రోజులు గడిచి ముసలితనము వచ్చిన వారిని అను క్షణము చూస్తూనే ఉంటాము – రోగాలతో యాతన పడుతూ, మూలుగుతూ ముక్కుతూ ఉన్న వారిని చూస్తూనే ఉంటాం – మనము ధనవంతులమని గర్విస్తే ఓడలు బల్లయైనట్టుగా ఎంతో సంపన్నులు, బికారులుగా మారిన వారిని ఎంతమందిని మనము ఎరుగుదుము ? > మన అధికారము, కీర్తి చూసుకొని మనకెంత అహంకారమా ? – ఎంతేంతటి అది కారము కలవారైన హంతకుడి తుపాకి గుండుకి బలిఅయిన వారి నే౦దరిని ఎరగము ? – రారాజులు అయిన చక్రవర్తులు అయిన ఒక్క క్షణములో పదవి భ్రష్టులుయై – కారాగారాలలో మ్రగ్గిన ఎందరి గురించో కథలు విన్నాము – మరి ఏమి చూసుకొని మనకీగర్వము ? ఈ అహంకారము ? – > కబీర్ దాస్ అంటాడు కాలుతున్న కర్ర కమ్మరివానితో ఇలా అంటుంది – ఈ కొలిమిలో నన్ను ఇవాళ మంట మేడుతున్నావు – ఒకానొక రోజున నీ దేహాన్ని భస్మం చేసి వేస్తాను – ఆ విషయము మరచి పోకు – > కాల్లచే త్రొక్క బడే మట్టి కుమ్మరితో ఇలా అంటుంది – ఇప్పుడు నన్ను ఇలా త్రోక్కు తున్నావు గాని – ఒక రోజున కప్పి వేసి నీ దేహాన్ని అణచి వేయగలను – > మనసా ! ఎందుకు ఈ విడిసిపాటు నీ శరీరము బూడిద అవుతుంది మళ్ళీ – జనన మరణాల చక్రములో బంధింప బడతావు – అందుకే పరమేశ్వరుని కృపలేనిదే భక్తి కూడా ఉండదు – గుడ్డి వాడు అవతల వెక్తిని పట్టుకొని ఎలా పోగలడో అలాగే మన ద్రుష్టి ఎంతసేపు భగవంతుని పైనే ఉంటెనే మనలో భక్తి కలిగేది – పదవి, ఘనత పరమేశ్వరునివి – మానవుడు పూర్తిగా నిస్సహాయుడు – ఒక చిన్న విత్తులో౦చి భగవంతుడే బ్రహ్మాండమైన వృక్షాన్ని మొలిపించగలడు – మన కర్మల మూలంగానే పరమేశ్వరునినుంచి వేరు పడ్డాము తిరిగి మరల చేరుకోవాలి – అది మన చేతుల్లోనే ఉంది – భగవంతున్ని చేరుకోవడానికి భగవంతుడే మన కోసం నిర్దేశించిన మార్గమే ఆత్మ మార్గం – సత్యమైన ఆ మార్గాన్ని మనకు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూ ఉండడం కోసమని మహాత్ములు ఈ లోకంలోకి తిరిగి వస్తూ ఉంటారు – వారిని మనము అనుసరించి ఆ విద్యను తెలుసుకొని భగవంతున్ని చేరుకునే విధానము ఆచరిద్ధాము.`
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవె ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
8/9/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణ మస్తు 🌹
ప్రియమైన ఆత్మ బంధువుల పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు . కొన్ని అనివార్యకారణాల వల్ల వ్యాసములు వ్రాయలేక పోయాను , క్షమిస్తారని మనసారకోరుతున్నాను . మనము నడిపే మూడు గ్రూపులలోని వారు ఎంతో ఆదరణతో చదువుతూ , తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నందుకు తమ ఆప్యాయతను , చాటు తున్నందుకు నేను ఎంతో ధన్యున్ని , మరొకసారి పాటక దేవుల్లకు ధన్యవాధములు తెల్పుతున్నాను.
గతములో వ్రాయబడిన వ్యాసములు నేను వ్రాసినవికావు! ప్రభు శ్రీ యోగి అచ్యుతుల కృపా భాండాగారము నుండి వెలువడిన అమృతధార యొక్క విశేషములతో నాచే వ్రాయించారు. అందులో నాప్రయత్నము ఏమిలేదు. ఆదయామయుని కరుణ కటాక్ష వీక్షణముల అమృత ధార కురిసినచో మళ్ళీ వ్రాయడానికి ప్రయత్నము చేయ గలను, ప్రభువుల కృప, మీ ఆశ్వీర్వాద బలము నాకు రెండు కావాలని ఈ చిన్నవాడి కోరిక. ఆ ఆది దేవుడైన అచ్యుతులను ఆ ధార కురిపించమని మనమందరము వేడుకుందాము.
ఇట్లు.
భగవత్ స్వరూపులైన మీ సేవలో.
సత్యం
9/2/2016
🌹 ఓం శ్రీ అచ్యుతార్పణ మస్తు 🌹
అంతరంగము పిలుస్తంది రా !! 5 వ బాగము
మన లోనే పరమాత్మ!
1) ఈ సకల చరాచర యావత్తు సృష్టికి మూలమైనటు వంటి ఆ ప్రరాత్పరుడైన ఆది దేవుడైన బిడ్డనై నీ దేహమును సృష్టించుకొని నీ లోనే , నీ తలలోని , నీ మెదడులోని థర్డ్ వెంట్రికల్ (third ventricle) లో స్థిర నివాసము ఏర్పాటు చేసుకొని నీలోనే ఉన్న నన్ను చూడక దేవుని కోసమని ప్రపంచ౦లో ఎక్కడెక్కడో వెతుకుతు ముందు ముందుకు పోతుంటావు కాని వెను తిరిగి ఎప్పుడైనా నీలోన వెతికినావా?
-> పరమేశ్వరుడు ఈ మానవ శరీరమనే ఆలయములోనే నివసిస్తారు – నీవు “ నేను , నేను ” అని అంటావే నీలోన నేను అనునది “ ఆత్మనే ” ఈ ఆత్మ పోయినచో నీవు నిర్వీర్యుడవై పడిపోతావు – “ నేను “ అను ఈ ఆత్మ ఉంటేనే నీవు నడవగలవు , తినగలవు , చూడగలవు , వినగలవు , సకల సంపదలు సంపాదించగలవు , అనుభవించగలవు , భార్య పిల్లలతో సుఖంగా ఉండగలవు , అనేక పదవును అనుభవించగలవు , నేను అనేదే లేని యెడల నీవు శవంగా మారగలవు – ఇంత ఇంపార్టెంట్ అయినా నేనును మరచి నీవు స్థూల కంటికి కనపడేదే శాశ్వత మనుకొని – నీ వెంట రానివాటిని నమ్ముకొని – నీ వెంట వచ్చే నన్ను వదిలి – నీవు చేయు కర్మలను అనుభవించడానికి – మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తిస్తావు – కర్మల యొక్క ఫలితాలను అనుభవింప చేయిస్తావు ఆ దైవము యొక్క ఆంశమైన నన్ను ఇలాంటి ఇబ్బందులకు , జన్మలకు గురి చేయడం నీకు సబభు ఏనా ? ఓ మిత్రమా ఆలోచించు ? – > ఇంతటి పవిత్రమైన నేను నీ దేహములో ఉంటె – నీ దేహమును ఎంత అపరిశుభ్ర౦గా తయారు చేస్తున్నావో ఆలోచించుకో ? – > మీరు నిర్మించుకున్న దేవాలయాలు కాని , – మీ పూజా గదులని ఎంతో శుచి – శుభ్రతగా ఉంచుతారు కాని నేను నిర్మించుకున్న ఈ దేవాలయాన్ని ఎందుకు మధు , మాంస పానీయాలతో అపరిశుబ్రతగా ఉంచుతారు – నీలోన నేను శుభ్ర౦గా ఉంటేనే కదా నీవు అన్నీ రకాల సుఖములు అనుభవించేది – నీ సుఖాలు నీవు చూసుకున్నావే కాని – నాకు కావలసిన సుఖాన్ని ఏనాడైనా అందించ గలిగావా – నా పుట్టింటికి ఏనాడైనా సుఖంగా పంపించావా – కోట్ల కొలది స౦వత్సరాలు గడుస్తున్నాయి కాని నా పుట్టింటి మొఖము ఎనాడైన చూప లేక పోతివి – నేను ఎంత ఆవేదనకు గురి అవుతున్నానో ఆలోచించావా , అన్వేషించావా , నా బ్రతుకు ఇంతేనా పుట్టడము చావడమేనా ? విముక్తి మార్గము లేదా ? జ్ఞానవంతుడవైన ఓ బుద్ధి జీవుడా నా ఆవేదనకు పరిష్కారము చూపలేవా మిత్రమా. > ఒకసారి తిరిగి నీ జీవితాన్ని , జీవితమంటే ఏమిటి , దైవ మంటే ఏమిటి , దైవ సేవా అంటే ఏమిటి , దైవ అనుగ్రహము ఎలా పొందాలి అనే విశయాలను ఆలోచించుకో – అనుభవించిన అనుభవజ్ఞులను ఆచరించి తెలుసుకో – నాకు ముక్తిని ప్రసాదించమని సవినయముగా నిన్ను వేడుకుంటున్నాను – నాకు దు:ఖ పూరితమైన జీవనము ఇవ్వకు.
2) మన లోనే పరమాత్ముడున్నాడని ఆత్మ జ్ఞాన సిద్ధి తమ అనుభవము వల్ల మనకు తెలియ జేస్తారు వారి బోధనలు అనుసరించ గలిగితే మన ఆత్మలు కూడా జనన మరణ సుడి గుండము నుంచి తప్పించు కోగలుగుతాయి – పరమాత్ముడు మన హృదయ అంతరాలల్లోనే ఉంటాడు – ఇంతవరకు ఆ పరాత్పరుని ఎవరు దర్శించగలిగారో వారందరూ తమలోనే సందర్శించ గలిగారు – ఇటు పైన కూడా తమలోనే పరమాత్మను చూడగలరు – భగవంతుని కనుగోన గల పరిశోధనశాల ఏదేనావుందీ అంటే ఆది మానవ దేహమే – మహాత్ములందరూ ఈ సత్యాన్నే వక్కాణించారు – > ఈ సృష్టికంతకూ కారకుడైన ప్రభువు; ఈ జగత్తుకంతకూ ప్రాణ దాత, సర్వ ప్రాణాలను పెంచి పోషించే పరమాత్మ మానవ దేహంలోనే నివసిస్తారు – > “ ఈ దేహం ఆత్మకు ఆవాసంకల్పిoచే ఒక గుహవంటిదే కాక, వర్ణ వాతీతుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్ముని నిలయం కూడా”, – > పరమేశ్వరుడు మనలోనే ఉన్నాడనే పరమ సత్యాన్ని తెలుకోలేని అవివేకులు ఆయన కోసం వెలుపల వెతుకుతారు – ఆయన ఎక్కడ ఉన్నాడోనని గాజు కళ్ళతో బయట వెతుకుతారు – మానవులైనా మనమంతా మనసుకి దాసులము కనుక సత్యాన్ని గ్రహించలేము – అదే మన అజ్ఞానం – ఇంట్లో ఏదైనవస్తువు పోయినపుడు, బయట ఎంతవేతికితే మాత్రం అది దొరుకుతుంది? – > నువ్వు గింజలో నూనె, చేకుముకిరాయిలో నిప్పు ఉన్నట్టే పరమాత్మ మానవదేహంలో ఉన్నాడు జాగృతి పొందినవారికె పరమాత్మ సాధ్యుడు-> కంట్లో నల్లగుడ్డు ఎలా ఉన్నదో మానవ శరీరంలో పరమేశ్వరుడు అలానే ఉన్నారు – అజ్ఞానులు మాత్రమె అది తెలుసుకోలేక పరమేశ్వరుని కోసం బయట వెతకటానికి పరుగులు పెడతారు – ఎవరికోసం ప్రపంచ నలుమూలలు వెతుకుతారో ఆ పరమాత్మ మనలోనే వున్నాడని సత్యాన్ని తెలుసుకోనలేరు – ఏమంటే మాయ అనే తెర వెనుకనే ఆయన నివాసం – కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఎంత వెతికితే మాత్రం పరమాత్మ సందర్శనం ఎట్లా కలుగుతుంది? దేవాలయాల్లో, చర్చిలో, మసీదుల్లో, ఎంత గాలిస్తే మాత్రం ఆ భగవంతుని సాక్షాత్కారం అవుతుందా ? పరమాత్మ నీలోనే ఉండగా అలా గొంతు చించుకొని అరుస్తావెందుకని విజ్ఞులు అన్నారు – > బైబిల్ లో ఏసుక్రీస్తు కూడా “ దేవుని సామ్రాజ్జము మీ దేహములోనే ఉంది ” అంటారు పరమాత్మ ఇరవై నాలుగు గంటలు మన తోనే ఉంటారు – ఈ శరీరంలోనే ఉంటారు మనమే ఆ అతీత శక్తిని కొనుగోవాలి – > దేవుడెక్కడో ఉన్నాడని భ్రమ పడతారు – కాని ఆ పరమాత్మ సర్వాంతర్యామి అని గ్రహించుకోలేదు – జ్ఞాన నేత్రంతో కాని ఆ పరాత్పరుడని చూడలేమని తెలుసుకోలేక పోతున్నాడు – ఆయన మధుర బృందావనంలో ఉన్నాడని వెతుకుతాడు – కాసి రామేశ్వరాల్లో ఉన్నాడని గాలిస్తాడు – > భగవంతుడు తనలోనే ఉన్నప్పుడు ఎక్కడ ఎంత వెతికితే మాత్రం ఎలా కనిపిస్తాడు ? – దేవుణ్ణి భక్తితో ప్రేమతో ధ్యానించే వారికే ఆయన హృదయ దేవాలయములో దర్శనం ఇస్తాడు అంటారు దర్శించిన మహాత్ములు. -> భగవంతుడు ఆకాశంలో ఎక్కడో దూరంగా మేఘాల వెనక దాగి ఉన్నాడని మనము అనుకుంటూ ఉండడం కద్దు. – > మన దేహములో తప్ప పరమాత్మ కోసం అంతటా అన్వేషిస్తాం – పరమేశ్వరుని పట్ల ప్రేమ గలవారే ఆయన కోసం తమలో వెతుకుతారు. – > మహాత్ముల సాంగత్యము , ఆత్మ జ్ఞానుల సంపర్కము గల మానవులు పరమేశ్వరుని తమలోనే వెతుకుతారు – ఇతరుల సందేహాలతో – సంకోచాలతో సరైన మార్గానికి , సత్యాన్వేషణ పథానికి దూరంగానే ఉంది పోతారు – > ఆత్మ పరమాత్మ రెండూ వేరుకావు – పరమాత్మ అంశ కానిదేది లేదు – అయితే భౌతిక నేత్రంతో ఆ యదార్ధాన్ని చూడలేం కనుక మనకు తెలియడం లేదు – > పరమాత్మ చేవిటివాడా అన్నంతగా , కంఠం పోయేట౦త బిగ్గరగా అరుస్తారు – నిరాకారుడైన ఆ పరమాత్మునికి చెవుడు అనుకుంటున్నారా ? – ఆ పరమాత్మ తన లోనే ఉన్నాడని తెలియదా. ఎక్కడ వెతికినా పరమాత్మ బయట కనపడదు. మాటలకు చూపులకు అందని పరమాత్మ బయట కన పడదు మనలోనే దర్శించ గలం – నిజమైన దేవాలయం ఉందంటే అది మానవ శరీరమే – ఈ శరీరాన్ని పరమాత్ముడే సుందరంగా రూపొంది౦కున్నాడు దానిలోనే వాసం చేస్తాడు – ప్రతి మానవులలోను ఉండే వాడే పరి పూర్ణుడు య దార్ధము అయిన సత్ పురుషుసుడు (పూర్ణ మదహ: పూర్ణమిదం ) అను సూకీ ప్రకారముగా ఆ పరమేశ్వరుడు ఆవాసం చేశే పవిత్ర ఆలయంగా ఈ శరీరాన్ని బైబిల్ లో వర్ణించారు – > నారాయణుడు మివసించేదే ఈ నర దేహమని నరనారాయణ దేహమని ఋషులు , మునులు ఒక్కానించారు – ఈ దేహమే పరమాత్ముని నిజమైన నిలయము – గురువు ప్రసా౦ధిచిన జ్ఞానము ద్వారా ఆయ్యన్ను తెలుసు కొనగలమని మహాత్ములు చెబుతారు.
౩) భగవంతుని కోసము ఎక్కడ అన్వేషి౦చాలో అక్కడ కాకా మనము బయట వెతుకుతాం – సర్వాంతర్యామి అయిన ఈ సృష్టి అంతటికి ఈ సృష్టిలోని సమస్త మానవులలోను ఉన్నాడు – అయిన మనము దర్శించ లేక పోతున్నాము – కారణం మాయా అనే తెర మన కళ్ళను కప్పి వేస్తుంది కనుక మనలోని పరమాత్మను మనం దర్శించ లేము – > పరమాత్మను ధర్శి౦చ లేక పోవడానికి మన అహంకారమే అవరోధా మవుతున్నదని జ్ఞానులు చెబుతారు – > పుట్టుక నుంచి గిట్టే వరకు అహంకారము వెంటాడుతుంది – ఒక చోటికి వెళ్లినా – ఒకరికి దానం చేసినా – ఒకరినుంచి ఎదిస్వీకరించినా – ఏమి ఆర్ధించినా – ఎంత ఖర్చు చేసినా – అబద్ధం చెప్పినా – నిజం పలికినా – అన్నీ పనుల్లో అన్నీ వేళలా అహంకారము మనల్ని వెంటాడుతుంది – ఆ అహంకారాన్ని అనుచుకుంటే తప్ప పరమేశ్వర సందర్శనము సాధ్యము కాదు – > అహంకారమనేది ఒకానొక దీర్గ వ్యాధి – పరమాత్ముని దయ ఉంటె గురువు సహాయంతో ఆ రోగాన్ని పూర్తిగా నయం చేయ వచ్చు – అహాన్ని జయించిన పిదపనే సత్య లోకములో ఉండే ఆ పరమ పురుషుని చూడగలము – డంబాలు మాని , వినయము అలవరచు కుంటేనే పరమాత్మ సన్నిధి పొందగలము – > మన సొత్తు అని చెప్పుకోగలిగినది ఈ లోకములో మనకు ఏమి లేదు – సర్వసము ఆ పరమేశ్వరుని ఆస్తి – మరణించిన తరవాత ప్రాపంచిక వస్తువు లేవి మన వెంట రావు – రాజులు , చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని తమ సొంతము చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించి విఫలు లయ్యారు – > మమకారము – అహం అనే రెండూ లక్షణాలు మనల్ని జనన మరణాలనే చక్ర బంధములో బందించి ఉంచు తున్నాయి – ఈ విషయము గూర్చి బైబిల్ లో ఏసుక్రీస్తు ఇలా అన్నారు “ అంత శరీరము ఉన్న ఒంటె సూది కన్నములోంచి సునాయాసంగా దాట గలుగు తుందేమో కాని , ఒక ధనికుడు మాత్రం దేవుని రాజ్యములో ప్రవేశించలేడు ” నిజానికి సూది కన్నము లోంచి ఒంటె ఎలా దూరలేదో అలానే విషయ లాల సత్వంలో జీవితాన్ని గడిపే సంపన్నులు పరమేశ్వరున్ని చూడలేరు – మాయను విడిచి పెట్టాలి – డంబాలకి , పటాటోపాలకి దూరం కావాలి – >కామాన్ని త్వజిస్తే క్రోధము పోదు – క్రోధాన్ని తోజిస్తే లోభము వెంటాడుతుంది – లోభాన్ని కూడా త్వజిస్తే అహంకారము మన శత్రువు అవుతుంది – నా సంతానం , నా సంపద అని ఎల్లప్పుడూ అనుకునేది వాస్థవానికి మనది కాదు అంతా ఆ పరమాత్మునిదే- అంతు లేని కోరికలతో సత మత మవుతున్న వాటిని ఎన్నడు పొందలేము – మన మనసు ఎల్లప్పుడూ వాటి మీదేనే లగ్నం కావడం రాత్రిళ్ళు వాటిని గురించి కళలు కంటున్టాము ఇది సరియినది కాదు
పై విషయాలన్నీ మీకూ బాగా తెలుసు ఏమైనా పొరపాట్లు ఉంటె ఈ చిన్న వాడికి తెలుపుతారని ప్రార్ధిస్తాను.
R.B.Satyanarayana
Chairman, Annadhara
9/3/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
“ మనసు ” 6 వ బాగము
1) ఈ ప్రాపంచికమైన వస్తువులంటే ఎవరికీ ఇంత మోహము మన దేహములో? అంటే మన మనస్సుకే. ఈ మనసు ఏ మేమో కోరికలు జనింప చేస్తూ ,అంతా నాకే కావాలని , మనిషిలో తీవ్రమైన ప్రేరణలు లేపుతూ మానసికకంగా క్రుంగతీస్తూ అన్యాయంగా నైన సంపాదించాలన్న తలంపుతో చేయగూడని పనులన్నీ చేయిస్తూ పోయేరోజు ఇదంతా తీసుకపోతావు అనే భ్రమను కల్పిస్తూ అందరి కంటే ఎక్కువ ,స౦పాధించు తరతరాలకు కావాలి ,అక్కడికి వెళ్లి హయిగా ఉండవచ్చు – ఇల్లు కట్టు కాని అందులో కాపురము చేయకు కిరాయికి ఇస్తే డబ్బులు వస్తాయి , అని ఏవేవో కళలు కంటూ , మానవుణ్ణి అగాధములో పడవేస్తుంది . > ఆత్మకు పరమాత్మకు మధ్య ఏదైనా అవరోధము ఉన్నదంటే అది మనసు ఒక్కటే . > అందుకే గురునానక్ అంటారు “ మన్ జీతే – జగ్ జీత్ “ అంటే మనస్సును జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు . అని మనస్సును స్వాధీనము చేసుకోగలవాడు ఈ సృష్టి సమస్తాన్ని లొంగ దీసుకోవడమే గాక సృష్టి కర్తను కూడా పొందగలడు . > మనసు ఒకప్పుడు మనతో చెలిమిగా ఉంటుంది . మరొకప్పుడు శత్రువు అవుతుంది . కనుకనే ఈ ప్రపంచములో మనసును మించిన మహావైరి లేదు . మనసు ప్రేరణ వళ్ళనే మతాల మధ్య కలహాలు – సోధరులమధ్య స్పర్ధలు- ఒకరిని మించాలని మరొకరు ప్రయత్ని౦చడము -ఇతరులను ఎట్లా కించ పరచడము -వారికి ఎట్లా హనికలిగించడము – అని మనము తరచు ఆలోచిస్తుంటాము అంటే దానికి మనసు ప్రేరేపనే కారణం. అందుకనే మనసును గుప్పెటలో పట్టలేన౦తవరకు పరమాత్మని దర్శించనూ లేము : ఆయనను చెరనూ లేము . > మనసును స్వాధీనము చేసుకోవడమంటే ఏమిటి ? ఆత్మ ఆ పరమాత్ముని అంశము ఎట్లాగో మనసు కూడా అంత తక్కువది ఏమికాదు . “ నిన్ను నీవు తెలుసుకో “ ఇతరులు చెప్పునది గమనించభోకు – మనల్ని మనము తెలుసుకోవడమంటే – మనస్సునుంచి -మాయనుంచి బయట పడటమే – సత్వ, రజో , తమో గుణాలకు అతీతులము కావడమే -> ఆదిలో మన ఆత్మ నిర్మలమూ, పవిత్రమూ , పునీతమూ అయినది కాని అది మనసుతో చేరిన కారణముచేత దాని మాయాజాలములో పడి మనసుచేసే ఖర్మల పలితాన్ని ఆత్మ అనుభవించాల్సి వస్తుంది – మనసుతోగల సంబంధాన్ని విడిచి పెడితే తప్ప ఆత్మ తన మూల స్థానాన్ని చేరుకోజాలదు .> మనసు ఇంద్ర్హియాల వశములోనూ – ఆత్మ మనసు వశములోను ఉన్నాయి – చిక్కని నల్లగుడ్డ కప్పివుంచితే బల్బు ఎంత ప్రకాశవంతమైన దయిన వెలుగు బయటకు కనిపించదు . అంత ప్రకాశవంతమైన బల్బు ఉన్నప్పటికీ గది అంధకారములో మునిగివుంటుంది . నల్లగుడ్డ తెరలు తీయడము ఆరంబిస్తే ,మెల్లగా గదిలో వెలుగు వస్తుంది .ఆఖరితెర తిసివేసేసరికి గది పూర్తిగా ప్రకాశవంతం అవుతుంది . అదేవిధంగా మనస్సుతో చెలిమి అనే తెరలు తొలగడం మొదలయేసరికి ఆత్మ తన్ను తాను తెలుసుకో నారంభిస్తుంది . అందుకే పరమాత్మను తెలుసుకోవడానికి ముందు తన్ను తాను తెలుసుకోవాలి అని మహాత్ములు వక్కాణించారు. ఆత్మ సాక్షత్కారం తరువాతనే భగవత్ సాక్షాత్కారం సాధ్యం > మనసును బలవంతాన అదుపులో పెట్టడం అంటే బుసలుకొట్టే పామును బుట్టలో మూసివుంచడంవంటిదే . మూత గట్టిగ వున్నంతసేపు పరవాలేదు . కాని తప్పించుకొనడానికి ఏమాత్రం అవకాశం దొరికినా ఆ పాము తప్పించు కుంటుంది . తప్పించుకొని కాటేసీ తీరుతుంది . అది ఎప్పటికైనా ప్రమాదకరమైనదే . అంతకంటే పామును పట్టుకొని విషం పిండివేస్తే ,కోరలు పీకివేస్తే భయం తోలిగిపోతుంది . అప్పుడు ఆ పాముని మేడలో వేసుకొని తిరిగినా ఏమి ప్రమాదం ఉండదు . అదేవిధంగా , ప్రపంచాన్ని త్యజించడం ద్వారా , ఆడవుల లోనికి , కొండల మీదికి ,పరుగులు తీయడం ద్వారా మనసును వశము చేసుకోలేము . తిర్గి ప్రపంచము మధ్యకు వచ్చినట్టు అయితే , అణచి వుంచిన లోర్కెలు అన్ని బుసలు కొడుతూ రేగుతాయి . మనల్నిలొంగ దీసుకుంటాయి .సామాన్యజనుల కన్నా పతితులమై పోతాము .ఏ కొరికైన అణచి పెట్టె కొద్ది పెచ్చురేగి పోతుంది . -విధి ,నిషేదాల ద్వారా మనసును లొంగ తీసుకోనడమంటే కణకణ మండే నిప్పులను బూడిదలో కప్పుజూడటం వంటిది. పైకి నిప్పు ఆరిపోయినట్లే కనబడుతుంది కాని కాస్త గాలి వీచే టప్పటికి బూడిద ఎగిరిపోయి నిప్పు బయట పడుతుంది. అదేవిధంగా కోరికల తుపాను రేగినప్పుడు మనస్సు వశము తప్పి ఇష్టం వచ్చి నట్లు ప్రవర్తిస్తుంది.
2) బలవంతాన మనసును వశము చేసుకోవడాన్ని పోలీసుల వశము చేసిన నేరస్తునితో కూడా పోల్చ వచ్చు. పోలీసుల నిర్భంధములో ఉన్నంత కాలము నేరస్థుని వళ్ళ మనకి ఏమి ముప్పు కలగదు. కాని విడుదల అయిన తరువాత అతనిని ఎవరు పట్టు కోగలరు ? అంతకంటే నీతి నియమాలు భోద పరచడం ద్వారా నేరస్తుని సంస్కరించ గలిగితే, మంచి చెడ్డలు నచ్చ చెప్పడము ద్వారా నేరస్థుని మనస్సు మార్చ గలిగితే, చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ కర్మల నుంచి అతన్ని శాశ్వతంగా కాపాడిన వారమవుతాము – అందుకే బలవంతమైన నిధి, నిషేదాల ద్వారా మనసును ఎన్నటికి లొంగ దీసుకో జాలమని ఆత్మ జ్ఞానులు మనకు చెబుతారు – కొద్ది సేపు ప్రశాంతత పొంధగాలమేమోగాని అది శాశ్వతము మాత్రము కాదు – > మనస్సు వశము చేసుకోవాలంటే దాని తత్వాన్ని పూర్తిగా గ్రహించాలి. మనస్సు సుఖాలను కోరుతుంధనేది మనకి అనుభవమే – ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని, మనము ఎంతో అభిమానించ వచ్చు, ప్రేమించవచ్చు, కాని ఆ వ్యక్తి కంటే ఉత్తముడు, ఆ వస్తువు కన్న గొప్పది కనబడితే అధివరకటి దానిని విడిచి పెట్టి, కొత్త వాని వైపు మోగ్గుతాము – ఏ అభిమానమూ, ఏ మమకారమూ స్థిరంగా నిలిచి పోయేది కాదు – ఇంత క్రితము వరకు ఎవస్తువు కోసమైతే, ఏ వ్యక్తి కోసమైతే మన సర్వస్వాన్ని త్యాగము చేయడానికి సిద్ధ పడ్డాము వారు, లేక అవి లేక పోతే జీవితము దుర్భర మవుతుందని భావించాము వాటికి విలువ తగ్గి పోతుంది మన మనసు వాటిని చూడడానికైనా ఇష్ట పడదు – > మనసుకి ఎప్పుడూ కొత్త కొత్త వింత ఉండాలి. అంటే చూసిందే చూడడం, తిన్నదే తినడం అంటే మనసుకి విసుగు పుట్టు తుందన్న మాట – మన జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే, చిన్న తనములో తల్లి దండ్రులను ఎంతో ప్రేమించే వాళ్ళమని తెలుసుకుంటాము – అమ్మ ఒక నిమిషము ఎడమైతే కళ్ళ నీరు కుక్కు కునే వాళ్ళము – తరువాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటే ప్రమాభి మానాలు కురిపించే వాళ్ళం, చదువుకునే రోజుల్లో స్నేహితులన్న, నేస్తగాల్లన్న ఎంతో ప్రేమ ఉండేది – వివాహము అయ్యాక భార్య పిల్లల వైపు ఆ ప్రేమ మళ్ళింది – పెద్ద తనం వచ్చాక కులము, మతము, దేశమంటే అభిమానము వస్తుంది – ఆ విధంగా మన ప్రేమను అనేక వ్యక్తులకి, వివిధ వస్తువులకి బిన్న రూపాలలో అందిస్తూ ఉన్నా మన్న మాట – ఏ ఒక్కరి మీదనో ప్రేమ స్థిరంగా ఉండ లేదన్న మాట, ఉత్తమము లౌకిక ప్రేమకు అతీతము అయిన దేదో లభ్య మయ్యే వరకు ప్రాపంచిక మైన భోగాలను మనస్సు విడిచి పెట్ట జాలదు.
3) ఈ సుఖాలనూ, ఈ విలాసాలనూ, విడిచి పెట్టించగల ఆ అతీతమైన ప్రేమఎమిటి ? మధురమూ, ఆత్మో ద్దీపనము అయిన శబ్ద బ్రహ్మము, ప్రణవ నాదము యొక్క రుచి తెలిసి నట్టైతే మనసు పూర్తిగా సంతృప్తి చెందుతుందని – శాంతి పొందుతుందని – మహాత్ములు మనకు భోధ పరుస్తున్నారు – మనసును వశము చేసుకున్నవాడే నిజమైన ధీరుడు ఏ మంటే మనసును మించిన శత్రువు లేదు – ఆ శత్రువును అణిచి వేయడానికి మన శక్తి నంతయు కేంద్రీకరించాలి – కేంద్రీకరించినచో ఆ మనసే మిత్రుడై, ప్రయోజన కారియై ఆత్మ సాక్షాత్ కారము వరకు నిన్ను తీసుకు పోగలదు – నీ యొక్క సాధన ద్వారా మనస్సు పవిత్ర మవుతుంది – ఆ సాధన వల్లనే 84 లక్షల జీవరాసుల జనన మరణాల చక్ర బంధము అంతమవు తు౦దనియు విజ్ఞులు చెప్పారు – శబ్ద సాధన చేయడం వళ్ళ మనసు ఈ ప్రపంచములోని భోగ భాగ్యాల లంపటములో తిరిగే మన మనస్సు అప్పుడు నిశ్చల స్థితి సాధ్య మవుతుంది ఇంతకంటే వేరుమార్గము లేదు.
పై విషయాలన్నీ మీ అందరికి బాగా తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె ఈ చిన్న వాడిపై పెద్ద మనసుతో తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
9/4/2016
🌹 ఓం శ్రీ అచ్యుతార్పణ మస్తు 🌹
ఓం క్రతో స్మర కృతం – స్మర క్రతో స్మర కృతం
సత్యనామాన్ని సదా జపించండి
1) భగవంతుని దర్శన అభిలాషులారా ! ఒక్కసారి సూక్ష్మ మనసుతో మీలోకి మీరుపోయి ఇది చదవండి – స్థూల మనసుతో చదవకండి . మనమందరము భగవంతుని కృపకు పాత్రులము కావాలాని , భగవంతున్ని దర్శించాలని కోట్ల కొలది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాము – జన్మ రాహిత్యము కోసము పడరాని పాట్లు పడుతున్నాము కాని పలితము శూన్యమై – మల్లి మల్లి జన్మలు ఎత్తి ఎన్నో ఇబ్బందులకు గురిఅవుతున్నాము – అన్ని జన్మల కంటే మానవజన్మ ఉత్తమము అంటారు – ఎందులో ఉత్తమము అంటే అన్ని జన్మలు పశు, పక్షాదుల ద్వారా మనము భగవంతున్ని చేరుకోలేము – “ భగవంతుడు “ నా లాంటి వారిని సృస్థిస్తే నన్ను చేరుకుంటాడు అనుకోని మానవులను సృష్టించాడు – మానవునిగా జన్మ ఎత్తినాము కాని భగవంతున్ని చేరుకోలేక పోతున్నాము కారణము ? > మనము స్తూల సంపాదనే మనవెంట వస్తంది అనుకోని ఆభ్రమలోపడి వచ్చినదారి మరచిపోయినాము – ఇది నేటి మానవుని దుస్థితి – > సూక్ష్మ౦ గా మనలోనే వున్న ఆ “ భగవంతున్ని” ఎలా చేరుకోవాలో తెలుసుకోలేక స్థూల బుద్ధితో , స్థూల కార్యక్రమాలు చేస్తూ సంతృప్తి పొందు తున్నాము – దానివల్ల ఏమి ప్రయోజనము ? భగవంతున్ని దర్శించ గలుగుతున్నామా / మిత్రమా ? సూక్ష్మంగా వున్న భగవంతున్ని , నామ , రూప , రస , గందాలకు , సత్వ , రజో ,తమో గుణాలకు అంధక , “ మనోతీతుడైన ” వానిని మనము ఇప్పుడు ఆరాధించటము దానివళ్ళ దర్శనము జర్గుతుందంటారా ? మానజన్మ రాహిత్యము అవుతుందని అంటారా ? పునర్ జన్మ రాదంటారా ? నేను ఇలా వ్రాస్తున్నందుకు క్షమించాలి – > మన వేదములు , ఉపనిషత్తులు , పురాణాలు , భగవద్గీత , మొదలగునవి మనకు ఏమి ప్రభోదించాయి , మన పూర్వీకులు ఏమి ఆచరించి ముక్తులు అయినారు , అని ఆలోచించండి – స్తూల మనసుకు త్రుప్తి నిచ్చే విధానాలే అవలంబిద్ధామా , సూక్ష్మములో వున్న భగవంతున్ని సూక్ష్మ స్థితిలో కోలిచి భగవంతున్ని దర్శించు కుందామా ? అనేది విజ్ఞులైన మీరు ఆలోచించుకోండి ?
2) మహాత్ముల ప్రవచనాలలో భగవన్నామ సంకీర్తనమే నిండివుంటుంది – సత్య నామ మహిమ మనలోనే ఉన్నదని ఆత్మ జ్ఞానులు చెబుతారు – ఈ ప్రపంచంలో ఎన్నో మతాలూ – మరెన్నో ధర్మాలు ఉన్నాయి – ఒక్కో మతానికి – ఒక్కో ధర్మానికి – ఒక్కో విధి – ఒక్కో సంప్రదాయం – కాని అన్ని విధాలకు – అన్ని సంప్రదాయాలకు ఆలంబనగా ఉన్న సత్యం ఒక్కటే – ఆ సత్యాన్ని గ్రహించే కోరికనే మహాత్ములు మనలో ప్రేరేపిస్తారు – ఆ సత్యాన్ని చేరుకోగల మార్గాన్నే మహాత్ములు మనకు బోధపరుస్తారు – > అనేక దేశాలలో – అనేక కాలాల్లో ఉధ్బవించిన మహాత్ములందరూ ఈ సత్యాన్నే మానవ జాతికి వెల్లడించడానికి వచ్చారు – హిందూ ధర్మ వేత్తలు ఈ సత్యాన్ని “రామనామ” మనీ – “దివ్యనాద” మనీ అంటే – గురునానక్ దాన్ని “ శబ్దం” అనీ – “సత్యవాణి” అనీ “హరికీ ర్తన్” అనీ – వర్ణించారు – మహామ్మ దీయ జ్ఞానులు ఈ సత్యాన్ని “కల్మా ” అన్నారు – క్రై యిస్తవులు “వర్డ్” అని, “లోగోన్” అని చెప్పారు – ఋగ్ వేదములో “ యావత్ బ్రహ్మ శ్రేష్టం తావతీ వాక్” అని ఈ సత్యాన్ని “ వాక్ ” అని పేరు కొన్నారు – శతపథ బ్రాహ్మణ౦లో “ వాక్ ” ఏవ బ్రహ్మ అని రాసి ఉంది – ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా వాటి వెనుక గల సత్యాన్ని గ్రహించడమే అనగా అన్ని శబ్దములను ఉచ్చరించాలంటే దాని వెనక ఏమి ఉండాలో తెలుసుకోవడమే మన పరమావది – మహాత్ములు ఆ సత్యాన్నే కీర్తించారు – ఆ సత్యము అయిన “ వాక్ ” ద్వారానే ఆత్మ పరమాత్మను చేరుకో గలదని భోదిస్తారు – > ఆ సత్య నామ, శబ్దము అంటే మహాత్ములు ఏమి అర్ధము చెబుతారో తెలియక పోతే – ఆ నామము ఎక్కడ లభ్యము అవుతుందో, దానిని పొందే మార్గము ఏమిటో గ్రహించ లేకపోతే – ధర్మ శాస్త్రాలు ఎంత చదివినా ఏమి ప్రయోజనం ఉండదు – > మన ఆత్మ ఆ శబ్దాన్ని అసలు ఎందుకు సాధించాలో తెలుసుకోకుండా గురు బోధనలు ఎంత మననం చేసిన మనకు భోద పడదు – సరి కద ఏమి లభ్ది ఉండదు – > ఆత్మ జ్ఞానుల భోదనలలో ఈ సత్య నామ ప్రశంస తరచు వస్తు ఉంటుంది – సత్య నామము అయిన వాక్ ద్వారానే యదార్ధమైన మాన్యత లభిస్తుంది – అంటే సత్యము కాని ఈ నామము మరొకటి ఉన్నదనిపిస్తు౦ది కదా – > సత్యము అంటే ఆది మద్యాంత రహిత మైనది – అనంత మైనది – నాశనము లేనిదీ – > నామములు రెండు రకములు ఒకటి వర్ణాత్మకమని- రెండు ధునాత్మకమని ( ధ్వని ఆత్మకమని ) – మాటలో, వ్రాతలో , పటనములో ఉపయోకించేది వర్ణాత్మక నామము – > ప్రేమతో ఆ పరమాత్మకు మనము పెట్టు కునే అనేక పేర్లు వర్ణాత్మక మైనవి – అంటే దేవుడు , ఈశ్వరుడు , పరమేశ్వరుడు , హరి ఓం , వాహే గురు , రాదా స్వామి అల్లా , ఏసుక్రీస్తు , మొదలైనవి.
3) మహాత్ములు అంతా ఏ సత్యనామాన్ని మహిమాన్విత మైనదని కీర్తిస్తారో – ఏ సత్య నామాన్ని సిద్ధింప చేసుకుంటే ముక్తి లభిస్తుందో – మనసు వశములోకి వస్తుందో – ఆత్మ మనసుల ముడి విడుతుందో – ఆత్మ జ్ఞానం సిద్దిస్తుందో – పరమాత్మ సందర్శనము సాధ్య మవుతుందో – అదే దునాత్మక అమైన సత్యనామం – అదే సత్యమైన నామము – ఆత్మ జ్ఞానులు దునాత్మక మైన శబ్దాన్ని కీర్తించారు – సత్యనామాన్ని రాయడానికి – చదవడానికి ఉచ్చరించడానికి వీలు కాదు – ఉచ్చరింపగా రాని “వాణి” అని కూడా అన్నారు – బైబిల్లో ఏసుక్రీస్తు ఈ విషయములో “ కళ్ళున్న చూడలేరు – చెవులున్న వినలేరు” అన్నారు – > ఈ కళ్ళతో చూడ లేనిదీ – ఈ కాళ్ళతో చేరలేనిది – ఈ నోటితో పలుక జాలనిది – ఈ చెవులతో విన జాలనిది – చేతితో తాక జాలనిది అయిన వస్తు వును పొంది – ఆ వస్తువు ద్వారా జీవన్ ముక్తులమై పరమాత్మను చేరుకోవడానికి మార్గమే దునాత్మక మైన సత్యనామము – దునాత్మక సత్యనామమే మన ఆశయం – మన ధ్యేయము కావాలి – వర్ణాత్మక నామ వివాదాలలో చిక్కు కొనకుండా సత్య నామాన్ని సాధించాలి – > కాని శోచనీయమైన విషయ౦ ఏమంటే పరమాత్మను “ వాహే గురుగా ” మననం చేసుకునేవారు – తమని తాము సిక్కులమని పిలుచు కుంటున్నారు – పరమాత్మను “ అల్లా ” గా పిలుచుకునేవారు ముస్లిములమనుకు౦టున్నారు – అలాగే పర మేశ్వరుడ్ని “ రాము ” డని పిలిచేవారు తమని తాము హిందువులని పిలుచుకుంటున్నారు – మన అసహనము ఎంతవరకు పోతుందంటే ఇతర ధర్మాల వారితో కలిసి మాట్లాడటానికి అయిష్టంగా ఉన్నాము – > నామ విశ్వాసాలు , విభేదాలు మనలను ఎంతకు దిగ జారుస్తున్నాయో మనము గమనించ నైన గమనించ లేక పోతున్నాము – మన ధార్మిక ఆలోచనలన్నీ సత్య నామాంకితం చేయగలిగితే ఈ స్పర్ధలు – ఈ విద్వేషాలు అన్ని సమసి పోతాయి – మనకి నిజంగా కులము – జాతి అనేవి లేనే లేవు – సత్య నామ మాధుర్యాన్ని వినలేనంత వరకు విద్వేషాలు ఇలా ఉంటూనే ఉంటాయి – > వర్ణాత్మకమైన నామము మీదనే విశ్వాసము కలిగి ఉన్న౦త వరకు స్పర్ధలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి – మన సంకోచాలను – శంకలను తొలిగించి సత్యనామము వైపుకి మనల్ని నడిపించడానికే మహాత్ములు ఈ లోకములో అవత రిస్తుంటారు.
4) అనాది అయిన , ఆది అయిన , సత్య నామమ చరిత్రను గుర్తు చేసుకోవడం కాని – దాని మూలాన్ని చర్చించడం కాని మనకు సాధ్యము కాదు – సృష్టి , స్థితికి , లయకి కూడా అదేమూలము – ఆ దివ్య శక్తే మానవులకి అండ – ఏ క్షణములో పరమేశ్వరుడు శబ్ద శక్తిని ఈ విశ్వము నుంచి ఉపసంవారిహిస్తాడో ఆ క్షణములో మహా ప్రళయము సంభవిస్తుంది – > అందుకే శబ్ద మహిమ వల్లనే ఈ సృష్టి నడుస్తున్నదని మహాత్ములు మనకు చెబుతారు – > “ఈ ప్రపంచములో మనము చూసే సమస్తము సత్య నామ మహిమ వల్లనే సృస్టించ బడ్డాయి” బైబిల లోని యోహాను సువార్తలో ఇట్లా ఉంది – “ ఆదిలో శబ్దమే ఉంది – ఆ శబ్దము పరమేశ్వరుని చెంత ఉంది – ఆ శబ్దమే పరమాత్ముడు – సమస్థము శబ్దము ద్వారానే ఉత్పన్న మయ్యాయి – శబ్దము ఆధారంగా ఉద్బవించని వస్తువు ఏదీ లేదు – > ఋషులు , మునులు వేద శాస్త్రాలలో ఈ విశయాన్నే స్పస్టము చేశారు – పరమేశ్వరుడు “ వాణి ” ద్వారా ఈ సృష్టిని రచి౦చారని రాశారు ఖురానులో “కల్మా” ద్వారా పద్నాలుగు లోకాలు ఉత్పన్న మయ్యాయని రాసి ఉంది – > ప్రాచీన చైనీయ తత్ప శాత్ర ప్రకారము “ టావో ” ( శబ్దము ) ఈ ప్రపంచాన్ని సృష్టించింది – > భూమికి -ఆకాశానికి -ప్రాణము శబ్దము – శబ్ధప్రకాశము వల్లనే జీవము కలిగింది -సృష్టి ఉద్బవించింది -అన్ని ప్రాణులలోను ఈ దివ్యశబ్ధము మ్రోగుతు ఉంటుంది -ప్రపంచానే సృష్టించిన శబ్దానికి అవధులు ఎవరు ఏర్పరచగలరు ?-ముక్తి పొందడానికి సత్యనామము ముఖ్యము -అందుకే పరమాత్ముడు మన అందరి లోను , సత్యనామాన్ని లేక శబ్దశక్తిని ప్రక్షిప్తము చేశాడు – మన శరీరంలో ఉన్న ఆ శక్తిని గమనించి , గ్రహించి -సిద్ధింప చేసు కునే టంత వరకు ముక్తి సాధించలేము .
5)పరమేశ్వరుని సన్నిధిలో పదవీ గౌరవాలు లభించేది సత్యనామంవల్లనే – సత్యానామ భక్తి లేనిదే ఎవరూ ముక్తి పొందజాలరు – ఈ ప్రపంచములో సత్య నామ జ్ఞానము (ప్రాణ జ్ఞానము ) లేనివారే నిజమైన గుడ్డివారు -చేవిటివారును – అట్లాన్టివారు ఈ లోకములోకి ఎందుకు వచ్చారో మరి -ఇంకా శబ్దము తెలియనివారికి ముక్తి కలగడం మాట అటుంచి – జనన మరణాల బంధము నుంచి బయట కూడా పడలేరు ->సత్యనామాన్ని గ్రహించ లేనంత వరకు మనలోని అందకారాన్ని తొలగించ లేము – పరమాత్ముణ్ణి దర్శించలేము – జనన మరణాల చక్రబంధము నుంచి విముక్తి పొందలేము – >ఏసుక్రీస్తు కూడా బైబిల్లో “ నా శబ్దములో చేరి ఉన్నప్పుడే మీరు నాకు నిజమైన శిష్యులు- అప్పుడే మీరు సత్యాన్ని గ్రహించ గలుగుతారు – ఆ సత్యమే మీకు ముక్తి నీయగలదు “ ఇదే విషయాని మరోవిధంగా చెబుతు ఇలా అన్నారు “ పరమాత్ముడు అంటే మహా చైతన్య వంతమైన శక్తి (శబ్దము)-ఆ భగవానుని ఆరాధించ దలచేవారు సవ్యమైన చైతన్యము పొంది ఆరాధించాలి “->మనకి సత్యనామము లభించిన క్షణములోనే – ఈ దేహము పొందడానికి – దారి తీశిన కర్మ పరంపర నశిస్తుంది – ఎండు గడ్డి వాము మీద పడ్డ నిప్పునేరుసు మొత్తము వామునంతటిని ఏలా బూడిద చేస్తుందో అలాగా ఈ విధంగా మానవులు ఎన్ని పాప కర్మలు చేసినా సత్య నామస్మరణవల్ల అవన్నీ రద్దు అవుతాయి – అన్నారు కబీరుదాసు. > సమిధలు ఎన్నెన్ని గ్రహించి పేర్చిన – ఒక్క చిన్న అగ్ని కణము వాటిని బూడిద చేసి వేయగలుగుతుంది – అదేవిధంగా మానవులు చేసుకున్న పాప కర్మలన్నీ బ్రహ్మత్వ గురువు ప్రసాదించిన సత్య నామ మహిమ చేత హరిస్తాయి – పేరుకు పోయిన కర్మలను శబ్దమే నశి౦ప జేస్తుంది – ఆ శబ్దమే మనల్ని పరమాత్ముని చెంతకు చేర్చ గలుగుతుంది – ఏసుక్రీస్తు కూడా “ మీకు నేనిచ్చిన శబ్దమే మిమ్మల్ని పరిశుద్ధ మానవులుగా చేస్తుంది – ఆ శబ్ధమే మీ పాపాలన్నింటిని కడిగివేస్తుంది ” అన్నారు – కబీరుదాసు కూడా ఈ విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు – అందమైన శరీరము కలిగి సత్య నామ భక్తి లేని వానికన్న – మనసును సత్య నామము మీదనే కేంద్రీకరించి ఉన్న కుష్టువాడైనా భాగ్యవంతుడే అన్నారు – > మహాత్ములు ప్రవచించే సత్య నామము భహిర్ముఖము కాదు మన దేహములో – మన అంత రాత్మలో ఉంటుంది – శరీరము వెలపల వర్ణాత్మక నామము కోసము అన్వేషించే వారికి అది కనబడదు – ఇంట్లో ఒక వస్తువును ఎక్కడో పెట్టి బయట వెతికితే మాత్ర౦ దొరుకుతుందా ? దొరకదు కదా విజ్ఞులు ఆలోచించి ఆచరించగలరని తద్వారా జన్మ రాహిత్యము పొందగలరని మనసారా కోరుకుంటున్నాను.
పై విషయాలన్నీ నాకంటే మీ అందరికి బాగా తెలుసు – ఈ చిన్న వాడు చెప్పిన దానిలో ఏమైనా పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో చెప్ప గలరని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
9/11/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
“ ఆత్మ పరిశీలన “
1) త్రిగుణాత్మకమైన ఈ సృష్టిలోని మానవుడు సత్వ, తమో, రజో గుణాలతో ప్రావర్ధబించినారు – గుణాలకు అతీతమైన, మనోతీత మైన భగవంతున్ని దర్శించాలంటే ఈ గుణాలతో పాటు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి దోషాలను తొలగించుకుంటూ ఆధ్యాత్మిక జీవనం కోనసాగించాలి – బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక సాధనలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక పిపాసులు ఆత్మ సాక్షాత్కారముకై, దైవ దర్శనం కోసమై పరితపిస్తున్నా జిజ్ఞాసులు ముందుగా తమని తాము ఆత్మ పరిశీలన ద్వారా సంస్కరించుకొని ఉన్న దుర్గుణాలను చేదించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
> తనలో ఉన్న ఈ దుర్గుణాలను ఒకొక్కటి సంస్కరించుకుంటూ వెళ్ళినచో మనస్సు సూక్ష్మ స్థితిలో పరిశుద్ద మవుతుంది – ఈ గుణములు అన్నీ పోయినచో ఇక మిగిలేది ఆ సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపముయొక్క అంశమే” ఆత్మ “ మనకు దర్శనమిస్తుంది – దైవ దర్శనమునకు ప్రయాణిస్తుంది.
> సహజంగా మానవులలో ఉండు లక్షణములు (మూడు గుణములు, ఆరు అరిషడ్వర్గములతో పాటు)
1. అబద్దము 2. దొంగతనము ౩. కుట్ర 4. కుళ్ళు 5. ద్వేషము 6. ఈర్శా 7. అసూయ 8. అహంకారము 9. డంబము 10. దుష్ట బుద్ధి 11. క్రూర స్వభావము 12. నీచ ప్రవ్రుత్తి 13. తొందరపాటు నిర్ణయాలు 14. విచక్షణ చేయకపోవడము 15. దయార్ద హృదయము లేకపోవడం 16. నీతి, నిజాయితి లేకపోవడం 17. నేను – నా అన్నే స్వభావము కలిగి ఉండడం 18. సమాజ సేవ లేకపోవడం 19. అధికార వ్యామోహము 20. నిర్లక్ష్య వైఖరి 21. లక్ష్యముపై గురి లేకపోవుట 22. జీవిత పరమార్ధ గమనం లేకపోవడం 23. సరియగు దిశా, నిర్దేశం లేకపోవటం 24. వచ్చిన మార్గము మరవడం 25. స్వార్ధము పెచ్చురిల్లడం 26. స్థూల భోగముల యెడ అభిమానం కలిగి ఉండడం 27. సద్విమర్శ చేసుకోలేక పోవడం 28. పొగడ్తల యెడ ప్రేమ పెంచుకోవడం 29. కుతంత్రముతో ఎదుటి వారిని అణగ తొక్కడం 30. ఎదుటి వారిని చూసి ఓర్వలేక పోవడం 31. అంతా నాకే కావాలనుకోవడం 32. తరతరాల సంపాదనకోరకు ఆరాట పడడం ౩౩. నేను గొప్ప అనేది కలిగి ఉండడం 34. తక్కిన జీవుల యెడ ప్రేమ స్వభావము కలిగి ఉండకపోవడము 35. అంతరంగములో ఒక మాట – పైకి ఒక మాట చెప్పడం 36. సమాజ భాద్యతల నుండి తప్పుకోవడం 37. ఎదుటి వారి బాధకు స్పందించక పోవడము 38. నా కెందుకులే అని డోర్ వేసుకోవడం 39. ఎదుటి వాడు ఎప్పుడు నిద్ర పోతాడా – అంగీ లాగు ఊడ బెరుకుదామని 40. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం 41. అధికార దుర్వినియోగ పరచడం 42.స్త్రీల యెడల స్వచ్చ మైన భావనతో చూడకపోవడం 43. తల్లిదండ్రుల యెడల హేహ్య భావము కలిగి ఉండడం 44. ఆడపిల్లల పై మమకారము లేకపోవడం 45. ఎదుటివారు తినకున్న నా పొట్ట నిండాలనుకోవడం 46. సమాజ స్పృహ లేకపోవడం 47. సమాజము నాకేమిస్తుంది అనేభావన కలగడము 48. సమాజానికి నేనేమి చేయాలి అనే ఆలోచనలేకపోవడం 49. నేను, నా పిల్లలు అనేదే ముఖ్యము 50. అన్నదమ్ముల యెడ, కుటుంబం యెడ అనురాగ ఆప్యాయతులు కోరబడడం 51. పర స్త్రీ వ్యామోహము – మొదలగు లక్షణాలలో గింగిరులు కొడుతున్న నేటి దయనీయమైన మానవుడు వీటిలో నాలోన ఎన్ని ఉన్నాయని ఆత్మ పరిశీలన చేసుకొని, స౦స్కరించుకొని ముందుకు వేల్లితేనే – > ఆత్మ సాక్షాత్కారానికి, దైవ సాక్షాత్కారానికి అర్హ్వులు అవుతారని విజ్ఞులు తెలుపుతున్నారు – ఇది అమలు పరచుకోలేక ఎన్ని సంవత్సరములు జప తపాదులలో కొనసాగినప్పటికీ ఫలితము నామ మాత్రమె తప్ప సంపూర్ణ ఫలిత మివ్వదని ప్రాజ్ఞులు తెలుపుతున్నారు.
2) > ఉదాహరణకు :- ప్రైమరీ స్కూల్లో ఉత్తీర్ణత పొంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో చేరి అందులో విజయం సాధించి, హై స్కూల్ స్థాయి వరకు ఎదిగిన విద్యార్ధి పట్టుదలతో పరీక్షలలో ఉత్తీర్ణుడై ఇంటర్ క్లాసుకు చేరుకున్నట్టు, ఇంటర్ లో విక్టరీ సాధించి – డిగ్రీలో స్థానము సంపాదించి డిగ్రీని అవగాహన చేసుకొని విజయము పొంది – పోస్ట్ గ్రాడ్యు యేట్లో చేరి ఒక విద్యార్ధి ఎలాగా ఒకొక్క విజయము సాధిస్తూ అనుకున్న గమ్యం ఎలా చేరుకుంటాడో, లక్ష్యము చేరుకోవదములో ఎంత శ్రమ ఆ చిన్నవాడు ఒడ్డుతాడో – తద్వారా లక్ష్య సాధనలో, విజయం పరంపరలో కొనసాగుతున్నట్లుగా – ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఎక్కడ ఒక్క మెట్టు తప్పినా లక్ష్య సాధనలో ఎంత అంతరాయము కలుగుతుందో, దాని ఫలితము ఎటు అందుకోలేక మధ్యలో సమాజములో నిలిచిపోతాడో మీ అందరికి అనుభవ పూర్వకంగా అర్ధమైన విషయమే – > అదేవిధంగా సాధన సంపత్తిలో సత్ ఫలితాలను పొందాలనుకునే వారు కూడా తమలో ఉన్న పై దుర్గుణాలను చీల్చి చెండాడు కుంటూ పోనీ యెడల, దుర్గుణాల ప్రభావం వల్ల పైకి పోలేక ఏండ్ల తరబడి జపతపాదులు చేసి నప్పటికీ కూడా ఆ మాలిన్యముల వల్ల పురోగతి పొందలేక, సత్ ఫలితాలు దొరకక, మధనపడుతు అక్కడ విద్యార్ధి ఎలా నిలచి పోయినాడో, ఇక్కడ ఆధ్యాత్మిక పిపాసికి ఆత్మ సాక్షాత్ కారము కాలేక – దైవ దర్శనము పొందలేక సవంత్సరాల తరబడి అనేక జన్మలు గడుస్తున్నపటికి కూడా ఈ జనన మరణ చక్రములో తిరుగాడుతున్నాడు.
3) అక్కడ విద్యార్ధికి బేసికల్ గా సరిగా అక్షర అభ్యాసము నుండి అవగాహన కలిగించక పోవడముతో ఫౌండేషన్ సరిగా వేయక పోవడం వల్ల అతను ప్రతి క్లాసులో వెనుకంజ వేయు మార్కులతో ఫెయిల్ అవుతూ అత్తేసరు మార్కులతో పాస్ అవుతూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకోలేడో ఇక్కడ కూడా సాధకుడు బేసికల్ గా శాస్త్ర విజ్ఞానముతో ఫౌండేషన్ వేయకుండా తనలో ఉన్న లోటు పాట్లను సరిచేసుకోకుండా ముందుకు పోయే “ స్క్రీనింగ్ టెస్ట్ ” లో ఫెయిల్యూర్ అవుతూ – ఫెయిల్యూర్ కూ కారణములు విశ్లేషించుకొని అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళక పోయినచో, మొరటుగా ప్రయత్నము చేయడముతో అహంకారానికి దారి తీస్తూ – అవలక్షణాలు ఏర్పడి కాలాతీతమే కాని గమ్యం చేరుకోలేడు.
4) > ఒక విద్యార్ధికి పై తరగతులకు పోతున్నప్పుడు ఎన్ని రకాల టెస్టులు ఉంటాయో అదేవిధముగా ఒక సాధకుడు ఆత్మ సాక్షాత్కారము కోసము – దైవ దర్శనము కోసము – సృష్టి విజ్ఞానము కోసము బయలు దేరిన జిజ్ఞాసులు ఎన్నో దైవీ మాయా యొక్క ఆటుపోట్లను – పరీక్షలను తట్టుకొని నిలబడి అర్ధము చేసుకొని ముందుకు సాగినిచో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్న ఆ దైవీ మాయా యొక్క పరీక్షలను తట్టుకోలేక నిరాస, నిస్పృహలకు గురి అవుతారు – తట్టుకొని నెగ్గిన వారికి పైకి వెళ్ళే మార్గము సులువు అవుతుంది అని విజ్ఞుల అభిప్రాయము.
5) > మనము చిన్న తనములో స్కూలు వ్యవహారములలో గాని – కుటుంబ వ్యవహారములలో గాని – మనకు కొన్ని లక్షణాలు మంచివి గాని చెడ్డవి గాని కలిగి ఉంటాము – మనము పెద్ధవారము అవుతున్నప్పుడు కొన్నింటిని సరిజేసుకుంటాము – కొన్ని సరిచేసుకోవాలి – కొన్ని సరిచేసుకోలేక అలాగే కొనసాగుతుంటాయి – ఇది స్థూల జీవితములో తనవి తనకు తెలవక పోవచ్చు – కాని ఆధ్యాత్మిక సూక్ష్మ జీవనములో (బ్రేకు) పడుతుంది అంతరాయము కలుగుతుంది.
6) > ఉదాహరణకు : – మచ్చుకు కొన్ని గుణాలు పేర్కొన్నాము – చిన్నప్పుడు క్లాసులో తోటి పిల్లల బుక్కులు , పెన్నులు , పెన్సిళ్ళు , రబ్బర్లు మొదలగునవి కొట్టేస్తు ఉంటాము – ఇది దొంగతనము అంటారు – ఈ దొంగ తనము చేయు బుద్ధి పోనీ యెడల – రూపాంతరము చెందుకొని పెద్ద వారైనప్పటికీ కూడా ఇంకో రూపములో కొనసాగుతుంది – అదేవిధంగా దొంగిలించిన పెన్నుని , బుక్కుని తీసుకోలేరని చెప్పడం అలవాటు అవుతుంది దీనినే అబద్ధం అంటారు – ఈ అబద్ధము రూపాంతరము పొంది ఈ అసత్యము జీవితములో కొనసాగుతుంది – తీసుకున్న వస్తువులు అందరు చూసినప్పటికీ కూడా తీసుకోలేదాని బుకాయించడం పెద్దవాడైన తరువాత కూడా ఇది అమలు జరుగుతుంది – ఇలాంటి పైన చూపించిన లక్షణములు అనేకములు కొనసాగుతుంటాయి – ఆ అనేకములను సరిచేసుకోని యెడల ఆ జీవనము మొత్తము అ గమ్య గోచరమై – అస్థవ్యస్థమైన బుకాయి౦పులతో , స్థూల జీవనము గడవ వచ్చు కాని – సూక్ష్మ జీవనమైన ఆధ్యాత్మికంలో ఈ గుణములు అన్నీ మునుముందు ప్రతి బంధకములు కాగలవు – ప్రతి బంధకమే కాకుండా అతనిని ముందుకు పోనివ్వదు – అతను ఆత్మ పరిశీలన చేసుకోలేక ప్రతి బంధకాలను గురుతేరుగక ఎందరో ఎందుకో నాకు పురోగతి రావడం లేదని యేండ్ల తరబడి ఎదురు చూస్తుంటారు – సూక్ష్మ స్థితిలో ఉన్న దైవాన్ని చేరుకోవలనుకున్నా మానవుడు సూక్ష్మా అవస్థకు కావసిన సాధనా సంపత్తిని తయారు చేసుకోలేక, ఆత్మ పరిశీలన చేసుకొని పరివర్తణ పొందలేక పోవడముతో ఆ దుస్థితి ఏర్పడిందని గమనించాలి – > క్రింది స్థాయిలో ఇలాంటి వాటి యెడల క్షమ ఉందేమో కాని పై స్థాయిలో “ ఎక్స్ క్యూస్ ” ఉండ దనేది నిర్వివాదాంశము అని ప్రాజ్ఞులు తెలిపినారు.
7) > దీనికి విధర్శనంగా మహా భారత యుద్ధము జరిగిన తరువాత ద్వాపార యుగము ముగింపులో ధర్మరాజు తన తమ్ముళ్ళతో పాటు ద్రౌపతితో మహా ప్రస్థానమునకు బయలు దేరుతారు అనే విషయము విజ్ఞులైన మీకు తెలిసే ఉంటుంది – వినడానికి కథగా ఉన్న అందులోని అ౦తరార్ధాన్ని గ్రహించాలి – (A) > ప్రప్రధమముగా కైలాసము చేరుకొని ఆ శివుని యొక్క దర్శనము పొందిన తరువాత వారికి శివుడు ఒక పరీక్ష పెడుతాడు – మీరు స్వర్గానికి చేరుకోవాలంటే ఎంతో మూల్యాన్ని చెల్లించ వలసిన అవసరము ఉంటుంది – ఆ దారి చాలా కఠీనతరమైనది మీలో ఉన్న అస్త్ర , శస్త్ర , గుణ , గణాలతో పాటు అంతర్లీనంగా ఉన్న మనో భావాలను సైతము అగ్ని గుండములో ఆహుతి చేయక పోయినచో మును ముందు చాలా ప్రమాదాలు జరుగుతాయని మీకు ఆ దారి కనపడదు అని శివుడు చెబుతాడు – ఒక అగ్ని గుండము తన మాయా శక్తితో శివుడు ఏర్పాటు చేసినారు – అందులో అస్త్ర , శస్త్రాలతో పాటు తమలో ఉన్న ఆహా భావాలను వ్యక్త పరుస్తూ అగ్నికి ఆహుతి ఇయ్యాలని ఆరుగురికి చెబుతారు – అందరు కూడా అగ్నికి హావుతి చేసిన దారి ఇంకా కనపడలేదు – అప్పుడు శివుడు ఏదో ఒకటి మీ మనసులో దాచుకున్నారు – అందువల్ల ఆ స్వర్గా రోహణ దారి కనబడుట లేదని శివుడు అనగానే ఒకరికొకరు చూసుకొని నా దగ్గర ఏమి లేవు అంటారు – అప్పుడు ధర్మరాజు ద్రౌపతిని ఏమి నీ మనసులోని మాట అని అడుగుతాడు – అప్పుడు నా దగ్గర అస్త్ర , శస్త్రాలు ఏమి లేవని హోమ గుండము పుత్రి అయిన ద్రౌపతి అంటుంది కాని నా పై జరిగిన అఘాయిత్యాల వల్ల నా హృదయాంతరాలలో కోపము ఉన్నది అని తెలుపుతూ ఆ కోప్పాన్ని అగ్ని గుండములో వేస్తున్నానని అనగానే – స్వర్గారోహణ దారి స్పస్టముగా కనబడుతుంది. (అంటే కోపము వల్ల దారి కనపడలేదు).
(B) > అలా పర్వతా రోహణ చేసుకు౦టూ కొంతదూరము వెళ్ళాక దారి మళ్ళీ కనపడక పోతుంది – అప్పుడు ద్రౌపతి నేను ముందుకు వెళ్ళి చూస్తాను అని ఆ కొండల పైకి వెళుతూ – యుద్ధ సమయములో నేను ము౦దుండి మిమ్ముల నడిపించాను – ఇప్పుడు కూడా నేనే ముందుండి దారి చూపిస్తానని కొండల పైకి అందరికంటే ముందుకు వెళుతుంది – అప్పుడు కాలు జారి లోయలో పడిపోతుంది – అప్పుడు తక్కిన నలుగులు ధర్మరాజుతో అన్నా! ద్రౌపతి ఎందుకు పడిపోయింది అని అడుగగా అప్పుడు ధర్మరాజు ధర్మ సందేహాన్ని విడమరచి చెబుతూ ద్రౌపతికి “ నేను ” అను అహం బావము శివుడి ముందర ఉన్న అగ్ని గుండములో వేయలేదు – కాబట్టి ఆమె పడిపోయింది (అంటే “ నేను ” అనే అహం వీడలేదు).
(C) > ఆ తరువాత స్వర్గా రోహణకు దారి మళ్ళీ కనబడుతుంది – కొంతదూరము వెళ్ళాకా నకులుడికి మంచు పర్వతాలపై అందమైన పుష్పాలు కనబడుతాయి – అప్పుడు నకులుడు తక్కిన వారితో నేను ఆ పుష్పాలను తెస్తాను అని అంటాడు – అప్పుడు అతక్కిన వారు అక్కడ పుష్పాలు ఏమి లేవు అది నీ భ్రమ – అని వెళ్ళ వద్ద౦టారు – అన్నప్పటికీ కూడా నకులుడు వారు నడిచే దారికాకుండా ప్రక్క దారికి వెళతాడు – వెళుతూ కొండపైనుండి లోయలో పడిపోతాడు – అప్పుడు తక్కిన వారు ధర్మరాజును అడుగుతారు – నకులుడు ఎందుకు పడిపోయినాడు ? అప్పుడు ధర్మ రాజు అంటాడు ధర్మనిరతి ప్రకారముగా అతను సౌందర్యము మీద ఉన్న వ్యామోహమును అగ్ని గుండములో వేయలేదు – అ౦దు గూర్చి అతను పడిపోయినాడు. – (అంటే ఇక్కడ వ్యామోహము వదలలేదు).
(D) > కొంత దూరము వెళుతూ నకులుడు సహదేవా అన్న శబ్దము అతనికి వినబడుతున్నదన్న భ్రమ పడుతాడు అప్పుడు సహదేవుడు తక్కిన వారితో అన్నా! నకులుడు బ్రతికే ఉన్నాడు పిలుస్తున్నాడు నేను వెళ్లి తీసుకువస్తాను అంటాడు – అప్పుడు తక్కినవారు సహదేవా!! అది నీ భ్రమ నకులుడు పిలవడం లేదు నడువు అని అన్నప్పుడు సహదేవుడు అంటాడు నకులుడు నా తమ్ముడు – మేము ఒకే తల్లి బిడ్డలం – మీరు సవతి తల్లి బిడ్డలమని కాపాడలేక పోతున్నారు అని నిందారోపణ చేస్తాడు – అని వాళ్ళు వెళ్ళే దారిలో వెళ్ళకుండా సైడుకు తప్పుకొని వెళ్ళగానే లోయలో పడిపోతాడు – ఇది ఏమిటి అన్నా! అని ధర్మరాజుతో తక్కినవారు అంటారు – అప్పుడు ధర్మరాజు అంటాడు కన్నా బిడ్డల లాగా చూసినప్పటికీ కూడా అతని మనసులో ఏర్పాటు వాదా లక్షణాలు అగ్ని గుండములో వెయనందున అతడు పడి పోయాడు. (అంటే తనలోన ఉన్న కుల్లు బుద్ధిని వదులుకోలేక పోయాడు).
(E) > అలా ముందుకు సాగుతుండగా మళ్ళీ దారి కనబడకుండా పోయింది – కొండల చివరికి వచ్చి చూడగా ఎంతో దూరములో కొండలు కనబడినాయి వాటికి, వీటికి మధ్యన లోతైన లోయ ఉంటుంది – అప్పుడు ఎలా వేల్లాలో ధర్మరాజుకు అంతుచిక్కలేదు – అప్పుడు అర్జునుడు నా దగ్గర గాండీవము లేకపోయినా మనో అస్త్రము ద్వారా దారిని ఏర్పాటు చేస్తాను – ఆ మహాభారత యుద్ధములో నేనే ముందుండి నడిపించాను – ఇప్పుడు కూడా నేనే దారి ఏర్పాటు చేస్తాను అని మనోశస్త్రము ద్వారా ఆ కొండకు, ఈ కొండకు మధ్యన వారది ఏర్పాటు చేస్తాడు – అప్పుడు ధర్మరాజు భీముడు ముందు నడువగా – అర్జునుడు వెనుక నడుస్తుంటాడు అకస్మాత్తుగా వారది పై నుండి కాలు జారి పెద్ద లోయలో పడిపోతాడు – అప్పుడు భీముడు అంటాడు అగ్రజా! అర్జునుడు ఎందుకు పడిపోయినాడు అని అనగా – శివుడి ముందర ఉన్న హోమ గుండములో తన మనో అస్త్రాన్ని మరియు నేను అను అహంకారాన్ని వదిలి వేయలేదు దాని వల్ల అర్జునుడు పడిపోయినాడు. (అంటే ఒక వ్యక్తి నేనే అనే అహంభావము వల్ల ఈ పరిణామము జరిగింది).
(F) > ఇంకా అలా కొంతదూరము పోగానే పెద్దపెద్ద కొండలు స్వర్గారోహణ దారికి అడ్డంగా ఉంటాయి – అప్పుడు భీముడు కోపోద్రిక్తుడై తన బలభుజాలతో హుంకరిస్తూ నేను పవన పుత్రుడను – ఆంజనేయుని సోదరుడను అను గర్వముతో ఆ కొండలను తన భుజబలముతో పగులగోడుతాడు – అప్పుడు స్వర్గారోహణమునకు దారి కనబడుతుంది – వెళ్ళుతుండగా అంతలోనే భీముడు నడస్తున్న వారధి క్రుంగి కింద ఉన్నటువంటి లోయలో ఉన్న ఊబిలో తనతో పాటు వెంట వస్తున్నా నల్లని కుక్క పడిపోతుంది – అప్పుడు భీముడు అన్నా! రక్షించ మని ధర్మరాజును వేడుకుంటాడు – అప్పుడు ధర్మరాజు అంటాడు భీమా! నీవు పవన పుత్రుడివి, భుజ బలాద్యుడివి కానీ – ఈ కుక్క అశక్తురాలు నేను ఆ కుక్కని కాపాడడమే ధర్మ నిరతి, క్షమించు అని కుక్కని బయటికి లాగుతాడు – అప్పుడు తనలో ఉన్న భుజ బలము పనిచేయక – అన్నా నా పొరపాటు ఏమిటో వివరించు అని ప్రాధేయ పడుతాడు – అప్పుడు ధర్మరాజు అంటాడు నీలో ఉన్న కోపము – బలవంతునన్న అహము – ఈ రెండు నీవు శివుడి దగ్గర ఉన్న అగ్నిగుండములో సమర్పించలేకపోయావు – అది నిన్ను ఈ స్థితికి తీసుకవచ్చింది అని చెప్పగానే – భీముడు ఆ ఊబిలో మునిగిపోతాడు. (అంటే నేను పవన పుత్రుడ్ని, ఆంజనేయుని తమ్ముడను, భుజ బలాడ్యుడు అను క్రోదముతో కూడిన అహము వల్ల ఈ స్థితి ఏర్పడింది)
(G) > అప్పుడు ధర్మరాజు తనవెంట వచ్చు నల్లని కుక్కతో స్వర్గానికి బయలు దేరాడు మార్గ మధ్యములో యమ ధర్మరాజు ప్రత్యక్షమై స్వాగతిస్తూ ధర్మరాజా! అన్నీ గుణాలని త్వజించి అక్కడ శివుని ముందరి హోమ గుండములో కాల్చి వేసినావు – కాబట్టి ఇంత దూరము రాగలిగావు – నీవు ధర్మ నిరతుడివి అయినావు అని యమధర్మ రాజు అంటూ నీ ఓక్కడికే స్వర్గ ప్రవేశము తప్పా – ఈ కుక్కకు ప్రవేశము లేదు అంటాడు – > అప్పుడు ధర్మరాజు అష్ట కష్టాలు పడుతూ నాతొ వచ్చిన ఈ జీవి స్వర్గానికి అర్హ్వురాలు – జీవి – జీవియే కదా! అందులో తారతమ్యాలు వలదు – అది రాణి యెడల నేను రాను వెనుతిరిగి వెళ్తాను – అని ధర్మరాజు అనగానే నల్లని కుక్క రూపంలో ఉన్న యమధర్మ రాజు ప్రత్యక్షమై – ధర్మజా నిన్ను పరీక్షించాలనే ఇలా చేసాను – నీ వెంట వచ్చిన కుక్కను వదిలి స్వర్గారోహణము చేయడం అనే అధర్మానికి పాలుపడక పరీక్షలో నీవే నేగ్గావు – అని తన పురము అయినట్టి యమలోకము తీసుక వెళతారు – అప్పుడు ధర్మ రాజు ఎందుకు నన్ను యమలోకము తీసుకూ వచ్చావు అని అడగగా – అప్పుడు యమధర్మరాజు అంటాడు ధర్మజా! నీవు మహాభారత సంగ్రాహములో ద్రోణా చార్యుని పుత్రుడైన అశ్వత్ద్దామ మరణి౦చకముందే అశ్వత్ద్దామ హతా: “కుంజర” (ఏనుగు) అని అనడము వల్ల శబ్ద దోషము కలిగి నీకు యమపురి చూపించాల్సిన అవసరము వచ్చింది అని యమ ధర్మరాజు అన్నాడు – అంటే ధర్మరాజుకు కూడా అసత్య దోషము వల్ల యమధర్మ రాజు పుత్రుడు అయినప్పటికీ కూడా ధర్మరాజును యమలోకం తీసుకు రావాల్సి వచ్చింది. (అంటే అసత్యము ఆడితే ఎంతటి వారికైనా యమలోక ప్రాప్తి తప్పదనేని మనకు అర్ధమవుతుంది). > ఆ తరువాత యమధర్మరాజు స్వర్గానికి మార్గము చూపించినాడు – ధర్మరాజు స్వర్గలోకము చేరుకున్నారు – దీనిని బట్టి ఎంతటి మహాను భావులకైన పైన చూపిన లక్షణాలు ఉన్న యెడల ఆధ్యాత్మిక జీవనములో ముందుకు పోలేరు అనేది నిర్వివాదాంశము.
——————–సశేషం———————
పై విషయాలన్నీ మీకు నాకంటే బాగాతెలుసు – ఏమైనా తప్పులు ఉంటె పెద్ద మనస్సుతో ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara