Last updated: Feb 17th 2017
Shree R.B. Satyanarayana, Chairman Annadhara
6/9/2016
🌺ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌺
సృష్ఠి లోని సమస్త జీవులు — వాటి జన్మ సార్ధకత
సృష్ఠి లోని ప్రతి జీవి దైవ నిర్ణయ ప్రకారం తమ జన్మ సార్ధకతను చేసుకొని పోతున్నాయి –ప్రకృతికే పచ్చదనమైన అందాన్నిస్తూ — జీవులకు కనువిందు చేసే రంగు రంగుల — రమ్యమైన కళాకాంతులతో –మనో ఉల్లాస పరుస్తూ — జన్మ సార్ధకత చేసుకుంటూ –పరోపకార బుద్ధితో ఈ సృష్ఠి లోని సమస్త జీవులకు అందించి — మీరు నియమించిన నియతి ప్రకారముగా
పూర్తి చేసుకొని పోతున్నాను ప్రభో ! — కర్మానుసారముగా నాకు వచ్చిన ఈ జన్మలను పూర్తి చేసుకున్న తరువాత మంచి జన్మ అయినట్టి — జ్ఞాన వంతమైనటువంటి మానవ జన్మ ఇవ్వగలరని మిమ్ములను ప్రాధేయ పడుతున్నాను దైవమా !! — సృష్ఠి లోని సమస్త జీవులు విజ్ఞానవంతమైన మానవ జన్మ యొక్క ప్లాట్ ఫామ్ కు రావాలని
ఉవ్వి ళ్లూరుతున్నాయి –ఆ జీవులన్ని ఎలాగ సమస్త జీవులకు నిస్వార్ధముతో సహకారము అందిస్తున్నాయో పరిశీలిద్ధాం ? –మానవ ప్లాట్ ఫామ్ లో వున్న మనము బుద్ధిగల జీవులము — ఎలా అన్ని జీవులకు తమ సహకారాన్ని అందిస్తున్నామో అవగాహన చేసుకుందాం .
1. వృక్షాలు :
A. విస్తారమైన వృక్షాలు:– వనాలు లేనిదే వర్షాలు రావు. — త్యాగులు యోగులు వున్ననాడే జ్ఞానవర్షం కురుస్తుంది — ఆడంబరం లేకుండా అభ్యుదయానికి సహకరించడం , హడావుడి లేకుండా సేవలు చేయడం అలవాటై పోయింది –అందుకే ఋషులకు , మునులకు అడవులంటే, చెట్లు అంటే ఇష్టం .
చెట్లు తమ కొమ్మలు అనే చేతులను వూపుతూ నీకు చల్లని గాలినిస్తాయి — హాయినిస్తాయి –చేతులున్నది ఇతరులకు సహకరించేందుకే అని , మనిషికి సందేశమిస్తాయి — చెట్టు కొమ్మలు కరెంటు తీగలకు అడ్డు వచ్చాయంటూ నరికివేస్తున్న వద్దని వారించవు — ఓ మానవా ! ఇది మీకు న్యాయమా ! అని ప్రశ్నించవు — మా చేతులు పోయినా పర్వాలేదు కాని మీ ఇళ్ళల్లో
దీపాలు వెలిగితే అదే పదివేలు అంటాయి. — అందుకే తరువులకు త్యాగమే నిలయము
చెట్టు త్యాగమయీ — అనురాగమయీ — మనము వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని జీవులకు కావలసిన ఆక్సీజన్ ను మానవునికి కావలసిన ఔషద గుణములు కలవాటిని ఎన్నింటినో అందిస్తాయి — అంతే కాకుండా ఆకులను, పూలను, కాయలను, పండ్లను ఇస్తూ తమ జన్మ సార్ధకత చేసుకుంటూ చివరన మన ఇంటిలో తలుపులు, దర్వాజలు, వంట చెరకు,
బల్లాలు , బేంచీలు , కుర్చీలు, ఇంటి పైకప్పులుగా మారి మనకు, మన ఇంటికి రక్షణనిస్తాయి — సాయంత్రమయితే గూటికి పక్షులు రాలేదని ఆవేదనపడుతూ చెట్లు చలించిపోతాయి — మన పిల్లవాడు సాయంత్రమై చీకటి పడుతున్నా ఇంటికి రాని యెడల మనము ఎలా కంగారు పడుతూ మానసికంగా చలించి పోతామో అదే విదంగా చెట్లు కూడా పక్షులు రానిచో
అల్లాడి పోతాయి — తన చేతులైన కొమ్మల ద్వారా ఊపుతూ పిలుస్తుంది — అలిసిన పక్షులు గూటికి చేరగానే చెట్టు శాంతిస్తుంది — వాటికి నిద్రాభంగము కలుగకుండా, కదలకుండా, మెదలకుండా, నిశ్చలంగా ఒక యోగిలా వుంటుంది.
తన వేళ్ళు భూమిలో కూరుకు పోయినా — సేవ చేయాలనే ఉత్సాహంతో ఊర్ధ్వంగా పెరుగుతుంది. — బాధల్లో మానవుడు కూరుకు పోయినా భగవంతుని వైపు ఊర్ధ్వంగా సాగే మనసును తయారు చేసుకొమ్మని మనకు సందేశమిస్తుంది. — తన పెరుగుదలలోని రహస్యము నీ ఎదుగుదలకు ఆదర్శమంటుంది.
ఆచార్యులైన ఋషులకు , మునులకు, తపోధనులకు వృక్షాలే ఆధారాలు — వృక్షాల నాశ్రయించి గురువులు ధ్యాన్న నిమగ్నులైనారు — చెట్లకు, ఋషులకు మల్లె స్వార్ధము తెలియదు — సమీపిస్తే చాలు చెట్టు — నీడనిస్తుంది — ఫలాల నిస్తుంది — తమతర బేధం లేకుండా ఇస్తుంది — ప్రతిఫలం ఆశించకుండా ఇస్తుంది — వాతావరణ కాలుష్యాన్ని నిర్మూ
లిస్తుంది — చెట్టు ఒక గొప్ప తపస్విని లాగా — నిలుచుండి తపస్సు చేసిన దృవుని లాగా — అలా నిలబడే ఉంటుంది — కూర్చోవటం తెలియదు — నిద్రించడం ఎరుగదు — ఎంత ఘోరమైన తపస్సో ? అందుకే ఋషులకు వృక్షములు అంటే ప్రేమ.
చెట్లు ద్వంద్వాలను అధిగమించి జీవిస్తాయి. — ఎండను వహిస్తాయి — వర్షాన్ని సహిస్తాయి — శీతోష్ణాలను సమంగా భావించి జీవించడం యోగి లక్షణం కదూ ! — అంతేకాదు తాము ఎండను భరిస్తూ — ఆశ్రితులకు చల్లదనాన్ని అందిస్తాయి — గొడుగు పట్టినట్లు రక్షిస్తాయి — చెట్లు నిస్వార్ధ త్యా గులు కూడా.
రాగ ద్వేషాలు ఎవరిలో అదృశ్యమైనవో అట్టివారు నివసించే గృహం తపోవనం అన్నారు — సర్వులను సమా నంగా భావించి ప్రేమించే వృక్షాలు రాగద్వేషాలను అధిగమించాయి — అథిది సేవలో ఆనందిస్తాయి. ” అథిది దేవో భవా ” అనే శృతి ప్రమాణాన్ని అక్షరాల అమలు చేస్తాయి — నీ గృహానికి అరుదెంచిన అథిది నీకు దైవమగు గాకా ! అనే వేదవాణికి
అద్ధం పడుతున్నాయి — కనుకనే చెట్లు నివసించే ప్రదేశాలను వనాలు అంటారు — వాస్తవానికి అవి తపోవనాలు.
ఈ జగడాల జగత్తులో ఆగడాలు ఆగవు — నిందాస్తుతుల్నీ, మానాభిమానములను సమానంగా స్వీకరించు వారే నాలాగా పచ్చగా జీవించగలరు అని చెట్లు సందేశమిస్తున్నాయి — అంతేకాదు ఆచరించి చూపిస్తాయి — కోకిల మధురరావాన్ని — కాకి గోలను సమంగా స్వీకరిస్తాయి చెట్లు — తమస్సులో పడి మేనువాల్చిన బుద్దునికి — చెట్టు కిందనే జ్ఞానోదయం
కలిగింది — పైరు గాలికి పైటను కదిలిస్తూ — కొండగాలికి కొంగును ఝాడీస్తూ — ఏటిగాలితో కలిసి ఎగిరే చెట్టు నాట్యము ఎంత సుందరమో! — గాలి శృతి నందుకొని చెట్టు పాడేపాట ఎంత సుమధురమో ? — ఎంతని చెప్పిన చెట్టు గురించి తక్కువే — ఇంత ఉంది గనుకనే తరువులకు — గురువులకు స్నేహము కుదిరింది — వృక్షాలకు, ఋషులకు సఖ్యమేర్పడింది —
తమలో ఎంత జ్ణానమున్న సామాన్యంగా కనిపించడం ఋషుల ప్రవృత్తి — అలాగే తమలో ఎన్నో రకాల గుణాలు కలిగి ఉన్నప్పటికీ నిరాడంభరంగా కనిపించడం చెట్ల ప్రవృత్తి — చెట్టు చిగురిస్తుంది — పళ్లనిస్తుంది — పుష్పిస్తుంది — ఆ తరువాత ఫలిస్తుంది.
B. తీగజాతి మొక్కలు :– తీగజాతిలో ముఖ్యముగా సుగందద్రవ్యాలు అయిన లవంగాల , మిరియాల, యాలకుల, తమలపాకుల లాంటి ఎన్నో రకాల తీగజాతులు తమలోని విలువైన ఔషదగుణములను మానవులకు అందిస్తూ తమ జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
C. దుంప జాతులు :– ఈ దుంప జాతి అయిన ఆలుగడ్డ, కందగడ్డ, చేమగడ్డ, మొగరంగడ్డ , క్యారెట్టు, జాజిరిగడ్డ లాంటి మొదలైన చెట్లు — రకరకములైన తమ స్వాభావిక రీత్యా ఆకృతిని ఏర్పరుచుకొని — గడ్డలుగా మారి ఎంతో విలువైన పోషక పదార్ధాలతో నింపి ఈ మానవ సమాజానికి అందిస్తూ — తమ జన్మ సార్ధకత నిలబెట్టుకుంటున్నాయి.
D. గింజ జాతి మొక్కలు :– గింజ జాతుల నిచ్చే చెట్లు తమ తమ రుతుక్రమములో పుట్టుతూ — పెరుగుతూ జీవులకు కావల్సిన ఇందనముగా శక్తిని ఇచ్చు విటమిన్సును — ఎంజైమ్సును — మినరల్సును — అయిల్ ను — కార్బో హైడ్రేట్సును మొదలగునవి మన దేహమునుకు — దేహములోని భాగములకు కావలిసిన — పోషక పదార్థములను కలిగివుండి మన
భోజనమునకు ఉపయోగపడుతున్నాయి. ఉదహారణకు — వరి గింజ — ఆహారమునకు, పప్పు గింజలు — కూ రలుగను, గోధు మలు — చపాతీలుగను, సజ్జ, జొన్న మొదలగు గింజలు మనకు నిత్య జీవితములో — నిత్యము వాడకములో ఉన్నాయి. ఈ గింజ జాతి మన దేహ యంత్రము నడవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి — అవి లేని రోజు మన జీవ యంత్రము
కొనసాగలేదు –అన్ని పోషక పదార్థాలనిచ్చి అవి తమ తమ మనుగడను — జీవిత సాఫల్యాన్ని పొందుతున్నాయి — అంతే కాకుండా పశుపక్షాదులకు — క్రిమి కీటకాలకు కూడా ఆహారంగా మారుతుంది — ప్రతి జీవికి క్షుద్భాద ఆగాలంటే గింజల యొక్క చెట్లే ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి –సాధ్యమైనంత వరకు జీవుల ప్రాణాలను నిలబెట్టడములో ప్రధాన
పాత్ర వహిస్తూ తన జీవిత సార్ధకతను పూర్తి చేసుకుంటున్నాయి .
E. కాయగూరల జాతి చెట్లు:– ఈ కాయ గూరలు తమ దేహము నిండా ఎన్నో రకాల విటమిన్సును — మినరల్సు లాంటి శక్తినిచ్చు పదార్థములను తమలో ఇముడ్చుకొని అన్ని రకాల జీవులకు ఆహార పదార్థం గాను వెలసిల్లుతున్నాయన్న సంగతి మీ అందరకు తెలిసిందే — ఒక కాయ రూపములో వుండి మన దేహమునకు కావలసిన పోషక పధార్థాలను అందిస్తూ తమ
జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
F . ఆకు కూరల జాతి :– అనేక రకములైన ఆకు కూరల జాతి తన పలుచటి అకులలో ఎన్నో రకములైన అమోఘమైన వస్తు గుణములు కలిగి — సృష్టి లోని ప్రతి జీవులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి — వెలకట్ట లేని పోషకాలను ధరించియున్న ఈ ఆకుల చెట్లు అన్ని రకాల జీవులకు ఎంతో మేలు చేస్తూ జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
G . పుష్ప జాతి మొక్కలు :– ఈ పుష్ప జాతి మొక్కలు ఒకే రకమైన నేలలలో, ఒకే రకమైన కుండీలలో — జన్మించినప్పటికి — అవి తమ జన్మ ధర్మ నియతి ప్రకారముగా పెద్దవై — వివిధ రంగులలో –అ నేకమైన సువాసనలు వెదజల్లుతు — మనసుకు మనోరంజకమై — కన్నులకు కనువిందై — చూపరుల దృష్టి మళ్లించనిదై — ఎన్నో రకాల ఆనందాలకు నిలయమై —
నిత్యము గుభాళిస్తూ — దైవార్చనలో ప్రధాన పాత్ర పోషిస్తూ — ఆడవారి జడల అలంకరణలలో, ముద్దులోలికే బుజ్జి పాపాయిల కొప్పులలో — రాజకీయ నాయకుల మెడలలో — ఉద్యోగ విరమణ సంధర్భములలో — పెళ్లి మంటపాలలో — వధూ వరుల మె డలలో — తొలినాటి సన్నివేశాలలో — పసికందుల జన్మ ఉత్సవాలలో — ముగింపు యాత్రలలో — అలంకార తోరణాలై —
అందరిని ఆకర్షిస్తూ ఆహ్లాదపరుస్తూ — తన మనోహరమైన సువాసనలను వెదజల్లుతూ — మైమరపిస్తూ — ముద్ద బంగారముగా వుంటూ తను వచ్చిన జన్మ — ధర్మ — నియతి — నియమాలను — నిర్వర్తిస్తూ తన జన్మ సార్ధకత చేసుకొని హే బ్రహ్మా! నన్ను ఈ జన్మ నుండి — మానవ ప్లాట్ ఫామ్ కు పంపించమని వేడుకుంటున్నాను.
H . కాయ మరియు పండ్ల జాతి చెట్లు:– ఈ కాయ మరియు పండ్ల జాతి చెట్లయిన కొబ్బర — జామ — బోప్పాయి — దాన్నిమ్మ — అరటి — కర్జూర — తాటి — ఈత — నిమ్మ — బత్తాయి — గుమ్మడి — దోస — బీర — చిక్కుడు — ఫైనాఫిల్ లాంటి ఎన్నో రకాలైన — ఎంతో విలువైన — ఎన్నో పోషక పదార్థాలు — వెల కట్టలేనివి అంది స్తూ తమ తమ — జన్మ సార్ధకత చేసుకుంటున్న
విషయము మీ అంద రికి తెలిసిన విషయమే.
2. జంతువులు :– అలాగే పై వాటి ప్రకారంగానే ప్రతి జీవి A. పాలు ఇచ్చు గేదె జాతులు B. శ్రమించు ఎద్దు — గుర్రము — ఏనుగు — గాడిద మొదలగునవి C. విశ్వాసము గల కుక్క మొదలైనవి D. అడవులను రక్షించు క్రూరమృగాలు — అడవులను రక్షించడమే కాకుండా తమ చర్మా లతో — అనేకమైన — అలంకారమైన వాటిని తయారు చేస్తారు జంతు వినియోగము
నిత్య జీవితములో ఎంత ఉపయోగమో — మీ అందరికి తెలిసినదే .
3. పక్షి జాతులు :– పక్షి జాతుల వినియోగము మీకు వేరే చెప్పనవసరం లేదు — అవి తమ జన్మను సార్ధకత చేసుకుంటూ సమాజానికి ఎంతో మేలు కలిగిస్తూ — భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు గరుఢ వాహనమైన సంగతి మీ అందరికి తెలిసిందే — సరస్వతి దేవికి హంస వాహనమై — భగవాన్ శివుని పుత్రుడైన కుమార స్వామికి నెమలి వాహనమైన విషయం జగమెరిగిన
సత్యమే — తమ తమ గొంతు ద్వనులతో కిలకిలరావాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ — మైమరపిస్తూ ఇలాంటి ప్రముఖుల అందరికి వినియోగ పడుతున్న ఈ పక్షి జాతి అవి తమ తమ జన్మలు సార్ధకము చేసుకొని మానవ — ప్లాట్ ఫామ్ కు ఎదురుచూస్తున్నాయి.
4. నీరు దాని స్వభావము :– నీరు భూ భాగములో నాల్గింట మూడు వంతులు ఆక్రమించి — అదే విధముగా మన దేహములో కూడ వుండి జీవన యంత్రాన్ని — నడిపియ్యడమే కాకుండా తను ఆవిరిగా మారి మేఘంగా ఏర్పడి — వర్షించి నేల తల్లిని తడుపుతూ — పంటలు పండిస్తూ — ఈ జీవ కోటికి ఆధారభూతమై — వర్షించిన నీరు తిరిగి తన యధా స్థానమునకు
చేరుకోవాలన్న తపనతో ఒక్కొక్క — చినుకుబొట్టు ఒక కాలువగా — వాగుగా — నదిగా ఏర్పడి పారుతూ –బిరబిరా తన గమ్యమైన సముద్ర గర్భము చేరుతుంది — అంటే తన విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తిస్తూ — జీవకోటి మనుగడకు ఎంతో ఆధారభూతమౌతుంధి — దానిని చూసి మనము కూడ నేర్చుకొని వచ్చిన యధాస్థానము చేరుకోవాలి.
5. సృష్టిలోని అన్ని జీవులు తమ విధ్యుక్తధర్మాలను పాటిస్తున్నాయని పై విషయాలను చదివితే — వింటే — సూక్ష్మ మనసుతో — ఆలోచిస్తే మనకు అందులోని ఆంతర్యము గోచరిస్తుంది — ఓ మానవా! నీవు ఈ జగడాల ఝంజాట సంసార బంధంలో చిక్కుకొని — వచ్చిన మార్గము మరచి — చేరు కోవలసిన గమ్యం చేరుకోక — జన్మ జన్మాంతరాలుగా — ఈ కర్మ బంధములో
పడి కొట్టుమిట్టాడుతు అఘోరిస్తున్న ఓ ధీనమానవా! ఇప్పుడైనా — ఈ మానవజన్మలో కండ్లు తెరిసి — విజ్ఞానవంతుడవై — ఎక్కడినుండి వచ్చావో — అక్కడికి చేరుకొను ప్రయత్నం చేసుకో — ఈ మానవ ప్లాట్ ఫామ్ కొరకు — సృష్టిలోని ప్రతి జీవి పరితపిస్తుంది — కాని మానవ ప్లాట్ ఫామ్ లో ఉన్న నీవు ఆద మరిచి నిద్ర పోవటం బావ్యమా? — ఇది నీ వెంట రాదని తెలిసినా —
ముందు తరాల వారు చెప్పినా — ఎందుకీ ఆరాటము — ఈ ఆజ్ఞాములో పడడం — విజ్ణానవంతుడవైన ఓ పుణ్యజీవుడా — ఇకనైనా కండ్లు తెరువు — ఈ గాడాంధకారమైన ఆజ్ఞానము నుండి బయట పడాలని — మిమ్ములను ప్రాధేయ పడుతున్నాను. అని ఆత్మ ఘోశి స్తుంది
పై విషయాలన్ని మీకు నాకంటే బాగా తెలుసు — ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
9/25/2016
🌺ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
నీకు కావలిసింది – ఈ స్తూల భోగము లే నా
1. మన మనసు ఎల్లవేళ్ళలా ప్రాపంచిక సుఖాల కోసము ప్రాకులాడుతూ ఉంటుంది — మరొక ప్రక్క పరమేశ్వర సాయుజ్యము కోసము మానవుని మనసు ఆక్రోషిస్తుంది — ఈ రెండు విధాలైన కోరికలు ఒక్క చోట ఎలా ఉండగలుగుతాయి? — భౌతికమైన ప్రేమ, భగవత్ ప్రేమ కలిసి వుండజాలవు — ఒకే మనసు రెండు విషయాలపై లగ్నము కాలేదు — ఉదహారణకు :
మనకు అతి సన్నిహితులైన వారు ఎవరైనా మనని విడిచి వెళ్లినప్పుడు మన మనసు వారి కోసము బెంగపడుతుంది — రాత్రిళ్ళు నిద్రపట్టక వారిని సతతము తలుచుకుంటూ బాధపడుతుంటాము — ఆ బాధ ఎడబాటు వల్ల కలిగే విచారము — బంధువులకోసము బాధ పడినట్లుగా మనము భగవంతుని కోసము ఎప్పుడైనా బాధ పడ్డామా ? — దేవుని కోసము రాత్రిళ్ళు
నిద్రపట్టక ఎవరైనా, ఎప్పుడైనా బాధ పడ్డారా ? — ఏ రోజైనా అతని దర్శనం కోసం దుఃఖించారా ? — తల్లిదండ్రులు ఉద్యోగమునకు పోతూ పని మనిషికి పిల్లవాడిని అప్ప చెబుతూ వెళతారు — ఆ పిల్లవాడికి ఆ ఆయా పప్పుబెల్లాలు పెడుతూ, కథలు చెబుతూ ఆడిస్తుంది — అయినా ఒక్కొక్కప్పుడు పిల్లవాడు ఇవేమీ అక్కర లేదని మారాం చేస్తాడు — తల్లే కావాలని గగ్గోలు
పెడుతూ, ఏడుస్తాడు — అటువంటి స్తితిలో ఎక్కడ వున్నా తల్లి రాక తప్పదు — ప్రేమతో పిల్లవాడిని హృదయానికి హత్తుకుంటేగాని తల్లి మనసు ఊరటచెందదు — అదే విధంగా సృష్ఠి లో వుండే స్థూలభోగాలను, అందచందాలను అనుభవిస్తున్నంత కాలము సృష్ఠి కర్తను గూర్చిన చింత మనకు వుండదు — సృష్ఠి లో వుండే స్థూలభోగాలను, అందచందాల గూర్చిన తలంపు
వెనక్కి నెట్టి — అవి సృష్ఠించిన సృష్ఠి కర్తను ప్రేమించడం ఆరంభిస్తే, ఆ పరమేశ్వరుని కరుణ మనకు లభించి తీరుతుంది — భగవంతుణ్ణి భక్తితో స్మరించే వారికి — ఆయన సత్య (ప్రాణ)నామాన్ని సదా, నిత్యము జపించే వారికి పరమేశ్వరుని ప్రేమ లభిస్తుంది — అయితే భగవన్నామము అంత సులువుగా లభించే సంపద కాదు — ఆహాన్ని అణిచివేసి — కోరికలను
త్రుంచివేసి — మనస్పూర్తిగా ఆయన సత్యనామ ప్రేమలో అంకితం అయినవారికే సత్యనామ సంపద లభిస్తుంది — కాని సత్య(ప్రాణ)నామాన్ని జపిస్తున్నామని అపోహ కలిగే వారికి ఆ సంపద లభించదు — కోరికలను పూర్తిగా జయించి మనలోని ప్రతి అణువును భగవత్ ప్రేమతో నింపుకోవాలి — ఏమంటే కోరికలు నిండిన మనస్సులో భగవత్ ప్రేమకు చోటు వుండదు —
మన మనసు “కోరికల పుట్ట ” — ఒక కోరిక తీరితే మరొకటి లేస్తుంది — కోరిక తీరకపోతే చింత, అసంతృప్తి — నిరాశ కలుగుతాయి — మన మనసు కోరికలతోనూ, నిరాశలతోనూ నిండి వుంటే భగవంతునికి తావు ఎక్కడా ?
2. అయితే మన కోరికలను భగవంతునికి నివేదించు కున్నప్పుడు — ఆ సర్వేశ్వరుడు వాటిని తప్పకుండా తీరుస్తాడు — ఎన్ని కోరికలైన ఆయన తీరుస్తూనే వుంటాడు — తీసుకోవడానికి మనకి అలసట పుట్టవచ్చునేమో కానీ — ఆయన ఎన్నడూ అలిసిపోడు — యుగయుగాలుగా మాయలో పడి పుట్టుతూ — గిట్టుతూ, ప్రాపంచిక భోగాల కోసం తాపత్రయ పడుతూనే వున్నాం —
ఏదైనా ఒక కోరిక బలంగా వున్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మరో జన్మ ఎత్తి వస్తుంటాం — చివరికి ఈ కోరికలతో విసిగిపోయి పరమేశ్వరుణ్ణి శరణు వేడినప్పుడు ఆయన కరుణతో మనల్ని ఆదరిస్తాడు — మన గొంతెమ్మ కోరికలు తీర్చడానికి పరమేశ్వరుడు అంగీకరించిన — వాటినన్నింటిని అనుభవించటానికి 2000 సంవత్సరాలు జీవించి ఉండాల్సి వస్తుందేమో — కానీ
మృత్యువు ఎప్పుడూ పొంచివుంటుంది — జీవితములో ఇది అనుభవిద్దాం — అది సాదిద్దాం అని మనం అనేక పథకాలు వేసుకున్నప్పటికి ఏవి సాగుతాయో — ఏవి సాగవో, ఎవరూ చెప్పలేరు — అనుభవించినంత అనుభవించడం — కర్మలు పెంచుకోవడం — మిగతా అనుభవాలు పూర్తి చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి రావడం జరుగుతుంది.
3. జీవితములో మనము పెంచుకునే ఆశలు చూస్తే ఎప్పుడూ ఇక్కడే కట్టగట్టుకొని వుండిపొయ్యే వాళ్ళమనిపిస్తుంది — పుట్టినవాడు గిట్టక తప్పదు — కానీ మన కోరికలు, మన ఆశలు ఎంత బలమైనవి అంటే జీవితము ఎన్నాళ్లు అనే ఆలోచనే మనకు ఎన్నడూ కలుగదు — అందుకే తిరిగి పుట్టుట — జీవితములో చింతలు — చికాకులు వర్ణనాతీతము — భగవత్ సేవలో
అంకితంకావాలనే మహాత్ములు మనకు బోధిస్తారు — ఎందువల్ల నంటే భగవత్ భక్తి ద్వారానే ఈ సాంసారిక క్లేశాలు — కష్టాలు దాటగలము — భవసాగరాన్ని తరించ గలము — మన కోసమని పరమేశ్వరుడు ఏమి ఇస్తాడో వాటినే సంతృప్తితో స్వీకరించాలి.
4. హే భగవాన్ ! “నీ అభీష్టము వల్ల నన్నొక మహారాజుగా చేసినా లేక తిరుపము ఎత్తుకునే బిచ్చగానిగా చేసినా నాకేమి తేడా కనిపించదు — అదంతా నీ విలాసమే ” — నన్ను “మహాచక్రవర్తిని చేసినా — ముష్ఠి వాడిని చేసినా నాకేమీ అభ్యంతరము లేదు — నేనెప్పుడు నీ సేవకుడినే” — ఒక విశాల సామ్రాజ్యానికి నన్ను చక్రవర్తిని చేస్తే — పరమాత్ముని ధ్యాన్నాన్నికే ఆ
పదవిని వినియోగిస్తాను — లేక నన్ను బిచ్చగాడిని చెయ్యడం నీకు లీల అయితే, నీ ద్వారము దగ్గర తప్ప మరెక్కడ ముష్ఠి ఎత్తను — పరమాత్ముని చెంత తప్ప మన ఆత్మకు మరొక నివాసము లేదు — ఏ రోజు అయినా, ఎన్ని జన్మల తరువాతనైనా, ఆ మూలము చేరుకోనంత కాలము “పునరఫి జననం – పునరఫి మరణం” పుట్టుతూ – చస్తూ, అనేక అష్టకష్టాలకు లోనవుతున్న
సంగతి జగత్ విధితమే — మన మనసులో పుట్టే ఆశలను — కోరికలను పరమేశ్వరుడు తీర్చాలని ఆశపడతాము — కోరికలు మన మనసులో నే పుడతాయనే విషయము మనకు తెలుసు — అయినా దురాశతో కోరికలు పెంచుకోకూడదని మన మనసుకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించము — ఈశ్వరాభీష్టము ప్రకారము నడుచుకోమని మన మనసుకి ఎన్నడూ చెప్పము —
పైగా మనసులోని కోర్కెలను తీర్చమని పరమేశ్వరుణ్ణి స్థూలంగా పదే పదే ప్రార్ధిస్తుంటాము — కాని సూక్ష్మ స్థితిలో ఉన్న పరమేశ్వరుణ్ణి — స్థూల విధానాలతో ప్రార్ధిస్తే — ఎలా అందుతుందో ఆలోచించండి.
5. నీ లోన వున్న సధ్గురువుకు నిన్ను నీవు అంకితము చేసుకోవడములో అపూర్వమైన సంతృప్తి వుంటుంది — నీ లోని గురువే (ప్రాణ) నీకు పరమ మిత్రుడు — మార్గదర్శి — నీలోని గురువు ఏది చేసినా అదే నీకు పరమ ప్రయోజన దాయకము — అది నీకు మేలు చేకూరుస్తుంది — నీ గురు వాక్కును నీ హృదయములో పదిల పరుచుకో — గురు వాక్కు ప్రకారము
నడుచుకుంటూ — గురు చూపిన మార్గము సాగిపోతే అనంతమైన దైవిక సంపద మనకు లభ్యమౌతుంది — సద్గురువుకు మనని మనము అంకితం చేసుకున్నందువల్ల శాంతి, ఆనందము లభిస్తాయి — పరమేశ్వరుడు మనల్ని కరుణిస్తాడు — పరమాత్ముని దయ, కరుణ చూరగొన్న వారికి రాజ్యాలు ఎందుకు ? — రత్నాల రాశులు ఎందుకు ? — ధన దాడ్యాలు ఎందుకు ? —
ఈ స్థూల భోగాలు ఎందుకు ? — కనుక పరమేశ్వరుణ్ణి, సత్య(ప్రాణ)నామాన్ని జపిస్తూ ఆయన అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం లోనే మానవుల శ్రేయస్సు ఆధారపడి వుంటుంది — ఓ మానవా ! ఇకనైనా కళ్ళు తెరిచి దైవము యొక్క అభీష్టానికి నడుచుకో —- నీ మనసులో పుట్టే ప్రేరణలతో, ఆలోచనలతో కొనసాగి జన్మజన్మాంతరాలు పొందకు –ఈ మానవ ఫ్లోట్ ఫామ్
లోనే విజ్ణానవంతుడివై విముక్తిని పొందు — నీ వెంట రాని దానికై ఆరాటపడి పోతావో ? — నిజమైన గమ్యం చేరు కుంటావో ? — ఆలోచించుకో ?.
పై విషయాలన్నీ మీకు నాకంటే బాగా తెలుసు — ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
10/01/2016
🌺ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
మనలో ఉన్న ప్రాణుడే –పరిపూర్ణ గురువు
1) ఈ సకల చరాచర సృష్టి లోని జీవరాశులకు మూలమైన ప్రాణ — జ్యేష్ఠుడై — శ్రేష్ఠుడై — ప్రజాపతియై అందరి హృదయాలలో — భాసిల్లుతూ — కళ్యాణకారకమై — ఆ ప్రాణ > జీవుల సంరక్షణకే కాకుండా –జీవుల మనుగడతోపాటు వారి యొక్క — కర్మ బంధనాలనుండి — విముక్తి చేయుటలో — ప్రధానపాత్ర పోషిస్తూ — తను ఎక్కడి నుండి వచ్చిందో — ఆ
మూలస్థానమునకు — బుద్ది జీవులైన ఈ మానవులను చేర్చే ప్రయత్నము చేస్తుంది — ఈ జ్ణానవంతులైన మానవుల తలలోని బ్రెయిన్ రీజియన్ లో ఉండు — 4 th వెంట్రికల్ (బ్రహ్మవిద్యలొ దీనిని గురుస్థానము అంటారు) లో స్థానము ఏర్పాటు చేసుకొని — సమస్త దేహ సామ్రాజ్యాన్ని — తన అనుంగు శిష్యులైన — పంచ ప్రాణాలతో నిర్వహిస్తూ — ఒక తల్లిగా — ఒక తండ్రిగా
— ఒక గురువుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న — సర్వంతర్యామి అయిన ఆ ప్రాణుడే — సమస్త లోకాలకు సూక్ష్మ గురువు.
2) గురువులు అనగా రెండు రకములు :– 1. మనకు కనపడు స్థూలగురువులు, 2. మనకు కనపడని సూక్ష్మగురువులు — స్థూల దేహముతో వుండి — మార్గదర్శకము చేయు స్థూలగురువులు రెండు రకములు — 1. బోధగురువులు, 2. బాధగురువులు — మొదటి తరగతికి చెందిన — బోధగురువు — స్థూలదేహముతోనే — బ్రహ్మవిద్యలో కొనసాగుతూ –తపోధనులై — బ్రహ్మజ్ణాన
ప్రాప్తిపొంది — ఆ పరబ్రహ్మను దర్శించి –శబ్ధమే పరమసత్యమని నమ్మి –శబ్ధ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకొని — శబ్ధ సాధనే జీవనంగా — కాలము గడుపుతూ — లోకకళ్యాణం కోసం — కర్తవ్యో న్ముఖులై — అజ్ణానానందకారములో ఉన్న మానవులను కడతేర్చుటకు — శబ్ధమూలంగా — ఆత్మసాక్షాత్కారం –దైవ సాక్షాత్కారం — కలుగగలదని చెప్పిన వారే నిజమైన సద్గురువులు
— ఆ కోవకు చెందినవారే — శ్రీ రామచంద్రుల గురువు వశిష్టులు — శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు సాందీపులు — అలాంటి వారే — శబ్ధ స్వరూపమైన — సద్గురువు కోసము వెతకవలసి ఉన్నదని — ప్రభోధించే వారే — “బోధగురువులు” — ఆపరంపర మార్గములో పయనించు వారు — బ్రహ్మోపాసన చేస్తూ — తపోధనులై దైవాపేక్ష గలవారికి — ఆ బ్రహ్మవిద్యను
అందిస్తున్న వారు — హంపిలోని శ్రీ అచ్యుతాశ్రమ గురువులు — స్థూలవిధ్యా విధా నాలతో — స్థూలశాస్త్ర గ్రంథ పఠనాలతో–స్థూల అంధానుకరణలతో — ఆ సూక్ష్మస్థితిలో ఉన్న ప్రాణ — మనసు — ఆత్మ — దైవాన్ని — ఈ జన్మలో దర్శించలేమని — వేదములలో — ఉపనిషత్తులలో — భగవద్గీతలో — పురాణ ఇతిహాసాలలో — ఉటకించిన బ్రహ్మవిద్యతో — చేరుకోవచ్చన్న
సంకల్పముతో — బ్రహ్మవిద్యలో కొనసాగుతూ — శబ్ధమే పరమసత్యమని నమ్మి — శబ్ధ రహస్యాన్ని పూర్తిగా తెలిపే గురువే సద్గురువు — శబ్ధ సందేశాన్ని సంపూర్ణంగా ప్రకటించ గలవారే నిజమైన బోధ గురువులు — శబ్ధ సాధనకై సజీవులైన సద్గురువుల శరణు వేడుకోవాలి.
3) భగవద్గీతలో చెప్పబడిన యోగము — యోగము — యోగము అని 18 అధ్యాయాలలో — సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రభోధించినట్లుగా — 9 వ అధ్యాయములో — బ్రహ్మవిద్యా రహస్యములను — దైవాపేక్ష గలవారికి కూలంకుషంగా వివరించినట్లుగా మనకు అర్ధమౌతుంది — ఒక అధ్యాత్మిక దాహార్తికి, ఉపదేశించు అనుభవ గురువుకు మధ్యన — 15 నిమిషాల వ్యవధిలో
హస్తమస్తక సంయోగము ద్వారా బ్రహ్మోపదేశము ఇస్తూ — నీ జన్మ కర్మ బంధాలనుండి రాహిత్యము పొందాలన్నా ? — జననమరణ చక్రబంధము నుండి విముక్తి పొందాలన్నా ? — ఆ సచ్చితానంద స్వరూపుణ్ణి దర్శించాలన్నా ? — మోక్షస్థితి పొందాలన్నా ? –నీకిచ్చిన బ్రహ్మవిద్య సాధన ద్వారా చేరుకోగలవని — నిత్య సాధనలలో కొనసాగుతూ — సూక్ష్మస్థితికి
చేరుకోగలవని — నీ స్థూలమనసు యొక్క బంధనాల చ ట్రములో ఇరుక్కోవద్దని — వేలాదిమందికి మానవ జన్మ కర్తవ్యాని — గమ్యాన్ని ప్రభోదిస్తూ వెళ్లిపోవు వారే — అనుభవ పూర్వక తపోధనులైన — శ్రీ అచ్యుతాశ్రమ గురువులు.
4) భగవద్గీతలో చెప్పిన యోగము అనగా నేమి ? — ఈ విషయము మనము స్థూలంగా యోగము — యోగము అని పలుకుతామే గాని — యోగము యొక్క సూక్ష్మార్ధాన్ని సరిగా అవగతము చేసుకోలేక పోతున్నాము — యోగము అనగా కలయిక — వియోగము అనగా — విడిపోయి ఉండుట — అనునది మీకు తెలిసిన విషయమే — కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు యోగము
గూర్చి 18 అధ్యాయములలో నొక్కి ఒక్కాణించారు — అంటే ఈ మానవులలో ఏదో — వియోగములో ఉన్నదన్నట్టేగా ? — ఏమి వియోగముల ఉన్నదో — ఆలోచించాల్సిన అవసరము మనకు లేదా ? — మనము ఆలోచించినచో మనలో వుండబడిన — ప్రాణ – ఒక దగ్గర — మనసు ఒక దగ్గర — ఆత్మ — పరమాత్మ, వేరు వేరుగా ఉన్నట్టు మనకు జ్యోతకమౌతున్నది — ఈ
విడిపోయి ఉన్న ఆ దైవీ శక్తులను — ఏకము చేయడమే యోగము అని అర్ధమౌతుంది కదా ! — అందుకే భగవంతుడు — ఈ మానవులకు — యోగము అను సందేశము ద్వారా — నన్ను చేరుకోమని అందించినట్లే గా — అదే విషయము భగవద్గీతలో అన్నీ అధ్యాయములకు యోగమే ప్రధానమని — యోగము — యోగము — అని అన్నారు .
5) ఇక స్థూల గురువులలోని రెండవ రకము వారైన బాధగురువులు — > ఏవేవో సాధకునికి అర్ధము కాని మంత్రాలు వల్లిస్తూ — నిజతత్వానికి విరుద్ధంగా — స్థూల సాహిత్యముతో — స్థూల ఉపన్యాసాలతో — స్థూల చేష్టలతో — సాధకుల మనో అభిప్రాయాలను — సొమ్ము చేసుకుంటూ — పాదపూజకు ఇంత అని — ఇంటికి వస్తే అంత అని — యజ్ఞహోమాదులకు ఇంత రేటని
— యంత్ర తంత్రాలకు ఇంత అవుతుందని — కుటుంబ కలహాలు, మ్యారేజీలకు, చదువులకు, ధనదాఢ్యాలకు, సంతానోత్పత్తికి, ఉద్యోగ అవకాశాలకు, గ్రహ దోషాదులకు , గృహప్రవేశాలకు, కర్మల నివారణకు, విదేశీప్రయాణాలకు, మొదలగు వాటికి — > ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి — భక్తులను తమ ఆధీనములో పెట్టుకొని — ఏండ్ల తరబడి వారిని — పీల్చి
పిప్పిచేస్తూ — సూక్ష్మస్థితికి పోవు మార్గమును చూపించక — అంధానుకరణ చేయండని — విముక్తి మార్గము తెలుపకపోను — జన్మజన్మాంతరాలుగా — తరతరాలుగా — ఈ మానవుల యొక్క — అజ్ణానాన్ని ఆసరా చేసుకొని నిరంతరము — పల్లకిలలో ఊరేగుతూ — తులాభారాలతో — తమ పాదసేవలో — తమసేవలో — వినియోగించుకుంటూ — దూరము కాకుండా ఏవో కొన్ని
స్థూల మంత్రోపదేశాలు ఇస్తూ — వాటిని నోటితో జపించండి అని –భజన చేయండి — కీర్తనలు పాడండి అని — ఏవో కొన్ని మెరికల్ సును సృష్ఠిస్తూ –భక్తులను మనోభయ బ్రాంతులకు గురిచేస్తూ — జీవితాంతం స్థూల ఆచరణలకే నిమగ్నమయ్యేటట్లు చేస్తూ — వారిని నిజ్ణానవంతులను చేయు సూక్ష్మ ప్రకృతి యొక్క — విధానములను తెలుపకపోను —
మాయామోహములో పడివున్న — ఈ మానవులను –> ఇంకా అజ్ణానానందకారములో పడవేసి — జన్మజన్మలకు కారణభూతులౌతున్నారు — మాటలతో — ప్రసంగాలతో — వేదవిజ్ణానము వదిలి — స్థూలవిజ్ణాన సాహిత్యముతో — మానవులను అల్లాడిస్తూ — తమ పబ్భము గడుపుకుంటూ — మేమే భగవంతులము — సచ్చితానంద స్వరూపులము మేమే అనే –భావన
కలిపిస్తారు .
6) స్థూల ఆచరణ విదానాలతో — > భజన — కీర్తన — జపమాల — మొదలగు స్థూల ప్రసంగాలు వినాలన్నా ! — రెండు చేతులతో భజన చేయాలన్నా! — నోటితో కీర్తనలు పాడాలన్నా! — చూడడానికి కనురెప్పలు కొట్టుకోవాలన్నా ! — తమ దగ్గరికి కాళ్లతో నడిచి రావాలన్నా ! — జపమాల తిప్పాలన్నా ! — తమరు చెప్పింది ఆచరించాలన్నా ! — వీటన్నింటి వెనుక ఏ శక్తి
వుండాలి ? — ఈ అవయవాలన్నీ చనిపోయిన మనిషికి కూడా ఉంటాయి — బ్రతికి ఉన్న మనిషికి కూడా వుంటాయి — కాని శవములోని అవయవాలు పనిచేయక పోవటానికి కారణం ఏమిటి ? — బ్రతికి ఉన్న మనిషిలో పనిచేయడానికి కారణం ఏమిటి ?– ఇందులో ఉన్నది ఏదో ఒకటి అందులో లేదని అనిపిస్తుంది కదా ! — అది ఏమిటి ? — అంటే ప్రాణశక్తియే కదా ! — >
ఇంత ఇంపార్టెంట్ అయిన సూక్ష్మస్థితి లో ఉన్న ఆ శక్తులను — ప్రాణ — ఆత్మ — దైవ లను దర్శించే విధానము — ఆచరణ యోగ్యమైనది — వివరించక పోనూ — మానవ జీవితకాలాన్ని హరించి వేసే — బాధగురువులు — ఈ నాడు సమాజములో అడుగడుగున — అనేక నామాలతో — విస్తరించియున్నారు. ఈనాడు అలాంటి ఆశ్రమాలలో జరుగుతున్న — అన్యాయాలు —
అనేక రకములైన అకృత్యాలు — కోకొల్లలు అని విజ్ణులైన మీకు తెలిసిన విషయమే — > ఓ విజ్ణానవంతుడవైన — దైవస్వరూపుడవైన — దైవీ శక్తులు నీ లోనే కలిగి ఉన్న — ఓ మానవుడా ! — ఈ జన్మ కాలము లోనే — కర్మలు పూర్తి చేసుకొని — జనన మరణ చట్రము నుండి — విముక్తి పొంది — ఆత్యంతిక సత్యమైన ఆ దైవస్వరూపాన్ని — మాటల్లో కాకుండా — మనోభ్రమలో
కాకుండా — సాక్షాత్తు ఆ పరమాత్ముని దర్శించాల్సిన — ఈ మానవ జన్మను ఎందుకో ? — ఈ బాధగురువుల మాటలు విని వ్యర్ధము చేసుకుంటావు ?.
7) ఈ భవ సాగరాన్ని మనం దాటేలా చేయగలిగేది సద్గురువు ఒక్కరే — అధ్యాత్మిక మార్గాన్ని గురించి మనకు సుభోధము చేసేందుకు సద్గురువులు అవసరము — దీనికోసమే పరిపూర్ణమైన సద్గురువులు — ఈ భూమి మీదికి ఆయా కాలాలో ఉధ్భవిస్తుంటారు – -ఉధ్భవించి తమతమ కర్తవ్యాన్ని నెరవేర్చి వీరు వెళ్లిపోతారు — మనల్ని ఈ సంసారమనే భవసాగరము నుంచి
ఉద్దరించగల — అధ్యాత్మిక శక్తి వంతులు — ఎవరో తెలుసుకొని వారి అండ చేరాలి .
8) సూక్ష్మగురువు:– > మనలోని ప్రాణయే చివరంటూ వుండి ఆత్మసాక్షాత్కారము — దైవ సాక్షాత్కారము చేయించు వరకు — మనతో ఉండునది — మనలోని సూక్ష్మగురువే — పూర్ణగురువు — మహాత్ములు ఈ పూర్ణగురువును అనేక విదాల కీర్తించారు — పూర్ణగురువే శబ్ధస్వరూపము — శబ్ధస్వరూపమే — పరమేశ్వరుడు — దివ్యలోకాల నుండి వినబడే శబ్ధమే — పూర్ణగురువు —
అలాంటి గురువు లభ్యమైన మానవులు తమ శరీరములోని — తీయని సంగీతాన్ని త్వరలోనే వినగలుగుతారు — ఆ శబ్ధము మొదట ఘంటానాధము లాగా లేక శంఖారావము లాగా వినపడుతుంది — ఆ శబ్ధము అలౌకికమైన అనంతమైనది — దీనిని దివ్యవాణి అని కూడా అంటారు — ఆ శబ్దముతో — వీనులవిందు చేసుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి — ఆ దివ్య
శబ్దాన్ని వినడమంటే సాధకుడు క్రమక్రమంగా ఆ నాధములో — ఆ దివ్య సంగీతములో ఐక్యము కావడమే — మానవులు తమ ప్రాచీన ధామము నుంచి వేరుపడి — తమ నిజ గృహము నుంచి దారి తప్పి — ఈ భౌతిక ప్రపంచమనే అంధకారములో — కొట్టుమిట్టాడే మానవులను తిరిగి తమ నిజ ధామానికి — ఈశ్వర సాన్నిధ్యానికి చేర్చటానికి పూనుకున్న వారే పూర్ణగురువులు —
పూర్ణగురువును తెలుసుకొన గలవారే — పరమేశ్వరుణ్ణి తెలుసు కోనగలరు — పూర్ణగురువును చేరుకొన గలవారే — పరమేశ్వరుణ్ణి చేరుకొన గలరు — శబ్ద రహస్యాన్ని గుర్తెరిగి — ఆ శబ్దములో లీనమై పోయి మనలోని పూర్ణగురువును (ప్రాణను) ప్రతిష్ఠ జరుపుకొని ముందుకు సాగాలి — నిజానికి పూర్ణగురువు యొక్క అసలు రూపము శబ్ధము — శబ్ధమనేది మానవజాతికి ఆధ్యాత్మిక
సంపద — శబ్ధమే అమృతతత్వము — శబ్ధసాగరాన్ని మధించి అమృతం చిలికి — మనకు అందియ్యగల ప్రావీణ్యము ఒక్క పూర్ణగురువుకే ఉంది — ఆ అమృత సేవనం కోసమే — అకుంఠిత మైన భక్తి విశ్వాసాలతో సాధకుడు గురువును పూజిస్తాడు.
9) స్థూల బోధగురువులు ఆ దైవాన్ని చేరుకునే మార్గమును చూపిస్తారు — (ఉదాహరణకు రోడ్లను, పట్టణాలను, స్టేషన్లను చూపించే యారో మార్కు బోర్డు లాగా) — కాని మనలో ఉన్న సూక్ష్మగురువు తుదికంటూ వచ్చి — ఆ దైవ దర్శనాన్ని కల్పిస్తారు — మీ లోని సూక్ష్మగురువు మీ సిరిసంపదలను ఎప్పుడూ ఆశించడు — అయన దగ్గర అపారమైన సంపద ఉంది — ఆ గురువే నీ
మనస్సును పరమేశ్వరుని పైన లగ్నము చేయించ గలుగుతాడు — > ఇల్లు, సంసారము విడిచిపెట్టి అడవులలోనికో — గుహలలోనికో– పోయి ముక్కు మూసుకొని — కూర్చొమ్మని సద్గురువులు ఎన్నటికి చెప్పరు — ఎందుకంటె అలాంటి చోటుకుపోయి తపస్సు చేసినంత మాత్రాన — మనలో ఉండే కోరికలు, కామము — అక్కడ కూడా మనతోనే ఉంటాయి — అందుగూర్చి
అలా చెప్పరు — ఈ లోకములో మనస్థైర్యముతో మసలు కోవాలని మహాత్ములు మనకు ఉద్భోధిస్తారు — ఈ ప్రపంచపు మాయా జాలంలో చిక్కుకొన రాదని హెచ్చరిస్తున్నారు — తామరాకు మీద నీటిబొట్టులా ఉంటూ — శబ్ధ సహాయముతో ఈ ప్రపంచాన్ని దాటాలని తెలియ జేస్తున్నారు — ఈ ప్రపంచ సంసార చోద్యాన్ని — అంచుల మీద నిల్చొని తిలకించాలి తప్ప —
అందులోకి దిగామో — భౌతిక లంపటములో పడి — గట్టు కెక్కడం ఇక సాధ్యము కాదు అని సూక్ష్మగురువు హెచ్చరిస్తుంటాడు –కర్మాను సారము — కర్తవ్యాన్ని నెరవేరుస్తూ — మనసును మాత్రము ఆ పరమేశ్వరుని మీదనే కేంద్రీకరించాలి — స్వంత ఇంట్లో స్వధనముతో పొట్టపోసుకుంటూ — శబ్ధ రహస్యము స్పష్ఠ మైతే — మానసిక కవాటము తెరుచుకొని — ఆత్మ —
పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరగల అవకాశము లభిస్తుంది — అనగా ! — ఆత్మను పరమాత్మలో ఐక్యము చేయడమన్న మాట — శబ్ధమే సకల పాపాలను హరించి — సమస్త దోషాలను ప్రక్షాళనం చేసి — భగవంతుని వైపు నడిపించగల ఏకైక మహిమాన్విత శక్తియే — మనలోని పూర్ణగురువు — అందుకే బ్రహ్మవిద్యలో దీనిని గురుస్థానముగా భావించి ఎంతొ ప్రధాన్యతనిస్తారు.
పై విషయాలన్ని మీకు నాకంటే బాగా తెలుసు — ఏమైనా తప్పులు ఉంటె పెద్ద మనసుతో, ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
10/06/2016
🌺🌺ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺🌺
బ్రహ్మవిద్య —బోధగురువుల –బాధ్యత
1) గురువర్యులారా !!– > గత కొన్ని వేల సంవత్సరాల క్రితం — తప్పిపోయిన బ్రహ్మవిద్య ను — ఈ కళియుగములో — హంపి లోని శ్రీ అచ్యుతాశ్రమము అను పేరుతో — ప్రభు శ్రీ యోగి అచ్యుతుల వారు — తప్పిపోయిన సనాతన విద్యను తీసుకవచ్చి — ఈ మానవాళి — జనోద్ధరణకు సంకల్పించి — బహుముఖ ప్రజ్ఞాశాలురైన తమ శిష్యులకు — ఆ బ్రహ్మవిద్య ను అందించి
— తగు శిక్షణ ఇచ్చి — ఈ విద్యను ఉపదేశించుటకు — ప్రత్యక్ష గురువు అవసరము అన్నారు — అన్ని విధానాలు గురువులకు ఇచ్చు శిక్షణా కాలములో తెలియజేసినారు — లోకకళ్యాణం కోసం — సర్వ మానవుల జన్మల సాఫల్యం కోసం — ఈ ఆదివిద్య — బ్రహ్మవిద్య — అమృతవిద్య — జీవవిద్య –అను పేర్లతో ప్రసిద్దమైన — ఈ యోగవిద్య ను అపేక్ష గల వారందరికి
అందించి — ఈ మానవులు తరించేటట్లుగా — చేయమని తమ శిష్యులకు ఆదేశించి సమాధి తీసుకున్నారు .
2) బ్రహ్మవిద్యను అందించే గురువు సామాన్యుని వలె అజ్ఞానిగా ఉండక — మానవుల అజ్ఞానాన్నిపోగొట్టి సర్వ చైతన్యాన్ని పొందుటకు — కావలిసిన జ్ఞానాన్నిపెంపొందించి — మన స్వరూప జ్ఞానానికి కారణభూతుడు — ఆగుట వలన సృష్ఠిలో మానవాళికి — పెద్దవాడైనవాడు గురువు — జ్ఞానులైన గురువుగార్లు — తమ శిష్యులకు విశ్వాత్ముని సాక్షాత్కారానికి — కారణమైన ఆ
సాధనను చూపించ గలుగుతున్నారు — అనగా ! పరమాత్ముడు అందరికంటే గొప్పవాడని చెప్పుతారు — అయితే సాక్షాత్కారానికి సంబంధించిన ఈ విద్య — వ్యక్తి నుండి వ్యక్తికి రావలిసినదే గాని — గ్రంథపఠనము నుండిగాని — తదితర సాధనముల నుండిగాని తెలియరాదు — ఆది నుండియు పరంపరగా అట్లే వ్యాప్తి చెందినదని — ప్రభు శ్రీ అచ్యుతుల వారు తెలిపినారు
— అయితే ప్రథమ వ్యక్తికి ఎట్లు అబ్భినది అను సందేహము రాగలదు ? — “దైవము” వలననే అని ప్రత్యుత్తరము చెప్పుదురు –కావున ఆది గురువు దేవుడు — ఇది ఆదివిద్య — ఈ విద్యను పరిచయము చేయువారు — ఆది గురువైన దేవుని ప్రతినిధియే — అందుకే “గురుదేవోభవః” అన్నారు .
3) ఈ బ్రహ్మవిద్యోపదేశము ఇచ్చినంత మాత్రాన — అతని బాధ్యత ముగియలేదు — > సాధకునకు అవసరమైన నియమముల విధించి — సాధకుని పురోగతికి నిత్యము తోడ్పడుతు — అతని బాగోగులపై శ్రద్దవహించి — అతను ఆత్మ సాక్షాత్కారము — దైవసాక్షాత్కారము — పొందునటుల చేయాలి — తన సాధనా నిష్ఠను సాధకుని మనస్సులో — ప్రతిష్ఠింప చేసి
ముందంజ వేయించవలెను — ఎందుకు అనగా ? — మానవులు ఇతరులను అనుసరించు స్వభావము కలవారు — గురువులను శ్రేష్ఠులని బావించి వారి ఆచార వ్యవహారములను నమ్మి — వారిని అనుసరించుటకే ప్రయత్నించెదరు – శిష్యులు — “యద్వదా చరతి శ్రే ష్ఠ:”(భ . గీ . 3ఆ -21 శ్లో .) అని గీతాచార్యులు బోధించినదియు ఇందువలననే — దానితోపాటు సాధకునకు
— యుక్తమైన ఆహారవిహారములు అవసరము అని నేర్పాలి — అంతేగాక వినయ విధేయతలతో కూడిన మనోప్రవృత్తి — విద్యార్ధి దశలోనే అలవడవలెను — అట్టి సాత్విక గుణము వలననే –బ్రహ్మత్వప్రాప్తి (జ్ఞానమ ) లభ్యమగును — ఇలాంటి అనేకమైన సద్గుణములను నేర్పుతూ — తమ యొక్క పర్యవేక్షణలో గురుస్థానము నందున్నవారు సాధకులను ఆ రీతిగా త్రికరణ
శుద్దిగా సాత్వికతను పెంచినపుడే — శిష్యుల కృషి ఉత్కృష్టముగా పరిణమించి — ముందంజ వేసి అత్యంత ఉత్సాహముతో జపతపాదులు నిర్వహించి — బంధ విముక్తులై జన్మసార్ధకత పొందగలరు — వారి బంధనముల తొలగించ గలిగిన సమర్ధుడు గురువే ! — శ్రుతి ప్రకారము “హరుడే గురు రూపమునందు అవతరించి కాపాడును” అని నిర్వచించినారు.
4 ) బ్రహ్మ సాక్షాత్కారానికి అవశ్యకమైనది –> ఈ బ్రహ్మవిద్య — ఈ ప్రాణాయామమే — ఈ యోగవిద్య — నాభిలో స్తితమైన వాయువు — అన్ని నాళ్లాలలో ప్రసరించు వాయువును లాగి — ఊర్ధ్వముఖముగా బ్రహ్మరంద్రము వరకు — ప్రయాణము సాగుచున్నది — అనగా గురువు గారు చూపించిన రీతి — నాభి యందు గల వాయువును ప్రయత్నపూర్వకముగా బ్రహ్మరంద్రము
వరకు పోనివ్వవలెను — అదే ప్రయత్నముతో వాయువును క్రిందికి నెట్టవలయును — అనేక మార్లు ఈ విధంగా చేసి — ప్రాణాన్ని బ్రహ్మరంద్ర ములో విరమింపచేయు అనుభవము కలిగినప్పుడు — సమాధిస్థితి ప్రాప్తించును — ఇది సూక్ష్మముగా వివరించ బడినది — తక్కిన విశయాలన్నీ గురుస్థానమున ఉన్నవారు వివరించ వలెను — ఈ సాధన ఇచ్చుటవలన
గురువులకు మహాపుణ్యము కలుగగలదు — దైవకృపకు — ప్రభువుల కృపకు — పాత్రులగుట సులభమగును .
5) కాబట్టి — > ఈ మానవులకు దైవము — తరువాతి — దైవమైన ఈ బ్రహ్మవిద్య ప్రత్యక్ష బోధ గురువులైన వారు — ఎంతో మానవీయులు — ఈ మానవులను కడతేర్చే బాధ్యత — జన్మ సార్ధకత చేయించే కర్తవ్యము — మీపై ఉందనేది — ఈ బ్రహ్మవిద్యా గురువులైన మీరు ఆలోచించుకోవాలి –కర్తవ్యపాలన నిర్వహించాలి — ఉదహారణకు :– రైలు సిగ్నల్ సును ఇచ్చే వ్యక్తి
పొరపాటు చేస్తే — ఎదురెదురుగా రైళ్లు ఢీకొనడము ఎంత సహజమో ! — గురువు యొక్క పాత్ర సరిగా నిర్వహించక పోయినచో సాధకుని యొక్క జీవితము గమ్యము చేరక — జన్మజన్మలకు కారణభూతమౌతుంది — ఈ మానవాళిని జన్మ రాహిత్యము చేయించే బాధ్యత — మీ భుజస్కందాలపై ఉందనేది మరువకూడదు.
6) ఓ దైవస్వరూపులైన గురువులారా ! –> గురు సాంప్రదాయములో — ఋషి సాంప్రదాయములో — లోక కళ్యాణార్ధము సత్యమైన ధర్మాలను ప్రభోధిస్తూ — సత్యాన్వేషణ కోసము — చైతన్య స్పూర్తి నింపుతూ — సమాజములో ఉన్న — అంధానుకరులకు విపులీకరించి “గురు” అను పదమునకు వన్నె తెచ్చి — “గు” అంటే అజ్ణానమనే చీకటి — “రు” అంటే అజ్ణానమనే
చీకటిని పారద్రోలి — వెలుగు రేఖలు చిమ్ము స్థాయికి తీసుకు పోవాల్సిన — గురుతరమైన బాధ్యత కలిగిన మీరు — వారికి ఆధ్యాత్మికత మరియు స్థూల మానసిక రుగ్మతల నుండి — బయట పడవేసి వారి జీవన సాఫల్యానికి మార్గము — సుగమం చేయాల్సిన — మీ గురు పరంపరకు నమోవాక్కులు — పూర్వాశ్రమ గురు ధర్మాలలో శ్రీ రామచంద్రుల వారి గురువు వశిష్ఠుల వారు —
ప్రపంచానికి ఆదర్శమూర్తియై ఆచంద్రార్కము వరకు భగవంతునిగా నిలిపిన శ్రీకృష్ణుని యొక్క గురువు సాందీపులు — దేవతల గురువు బృహస్పతి — మీ పరంపరయే గదా !! — లోక కళ్యానార్ధమై నేటికీ వెలుగొందుతున్న సప్త ఋషులు — ఋషులు — మునులు — తపస్వులు — యోగులు –ఎందరో మహానుభావుల యొక్క కృషి ఫలితమే కదా ! — నేటి విశ్వ కళ్యాణస్థితి .
7) వారి ఔన్నత్యాన్ని పునికి పుచ్చుకున్న మీరు — > ఆ ధర్మ మార్గములో పయనిస్తూ — ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా — ఆశ్రమ గురువులుగా వెలుగొందడం — మీ జన్మ సార్ధక మైనట్లే కదా ! — > అంతటి ఉన్నత స్థితిలో ఉన్న మీరు — ఉన్నత భావాలు కలిగి — ఉన్నత నూతన ప్రక్రియలతో ఆచరించడం మీ బాధ్యత కాదా ? — కాని నేటి మీ స్థితిని అంచనా వేసుకొని — మీరే
స్కానింగ్ చేసుకొని — మీకు మీరే గురువై లోకానికి ఆదర్శవంతులు కావాలి — గురు పరంపరకు మచ్చ రానివ్వకుండా మెలగాల్సిన బాధ్యత మీ పై ఉంది కదా ? — ఈ రోజు ప్రపంచ ప్రజానికాన్ని — విజ్ఞానవంతులను చేయు ఆయుధము మీ చేతిలో ఉంచుకొని — మీరు స్తబ్ధతగా మామూలు ప్రజానీ కము లాగా ఉండడం ధర్మమేనా ? — కాదు కదా !.
8) “గురు బ్రహ్మ” అను సూక్తికి విలువ తగ్గనీయకుండ — సాధకుల అందరినీ తత్వపరంగా — జప పరంగా — వెన్నంటి నిలిచి ముందుకు నడిపిస్తూ — పాలల్లో నీళ్లలాగా కలిసి పోతూ — మాతృ హృదయాన్ని పంచుతూ — గురువుగా జ్ఞానాన్ని అందిస్తూ — లోకకల్యాణానికి — సుశిక్షితులను తయారు చేసే సైనికుడిగా — శిక్షణ ఇచ్చే ఆచార్యునిగా పెంపొందాలి — అలాంటి
శిక్షణ నిచ్చే ద్రోణాచార్యులు మీ గురు పరంపరయే కదా ! — అంతటి అనంతమైన బాధ్యత నాపై ఉందన్న గమనము మరువకూడదు — మీరే భవ్య సమాజపు నిర్మాతలు — మీ చేతిలోనే విశ్వకళ్యాణము ఆధారపడి ఉంది — ఈ ప్రపంచ మానవాళిని — ధర్మ బద్దమైన — సత్య బద్దమైన — స్థితికి చేర్చాల్సిన ఆచార్యులు మీరే అనే సత్యాన్ని దృష్టి లో పెట్టుకోండి .
9) ఈనాడు భారత దేశములో అనేక రకములైన అధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికి — > సనాతనమైన — నిజమైన ఆత్మ దర్శనానికి — దైవ దర్శనానికి తీసుకపోయే — తత్వాన్ని అందించే — ఈ బ్రహ్మవిద్య విషయములో మీరు — సాధకులందరి కంటే ముందర — అన్నింటిలో శిక్షణ పొంది — భారత దేశ జనాలతో పాటు — విశ్వ మానవ కళ్యాణానికి తోడ్పడండి — మీరు
వాయుమథన స్థితిని — జపస్థితిని — తపస్థితిని –దాటుకొని ఆత్మసాక్షాత్కారమొనర్చుకొని — దైవదర్శనానికి ప్రయాణిస్తూ — అటు స్థూలంగా — తత్వ విషయములు విపులీకరించడంలో గురువులుగా — మీకు మీరే తయారు కావడం ఎంతో అవసరం — ఉపదేశాలివ్వడమే కాదు –వారిని చూసే బాధ్యత మీరే తీసుకోవాలి — అలా కాకుండా మేము ఇచ్చుకుంటూ పోవడమే —
అనుకుంటే వారిని చూసే బాధ్యత ఎవరిది ? — ఉపదేశం ఇవ్వడం — వారిని గాలికి వదిలి వేయడం వల్ల తత్వము అర్ధము గాక — జపము సరిగా చేయరాక — చాలామంది చేయక పోవడమో — లేదా — వదిలివేయడమో జరుగుతుంది — ఉపదేశానికి ఉన్న గౌరవము — గురువుపై విశ్వాసము తగ్గుతుంది — తగ్గడమే కాకుండా అస్తవ్యస్తంగా — ట్రాఫిక్ జామ్ అయినట్లు
అవుతుంది — ట్రాఫిక్ ను క్లీయర్ చేయవలసిన బాధ్యత మీపైనే ఉంది — కర్తవ్య పాలనలో అశ్రద్ద చేసినచో — మీతో పాటు — ఈ ప్రజలందరు నష్టపోతారని గమనించండి .
పై విషయాలన్ని మీకు నాకంటే బాగా తెలుసు — ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో, ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
10/9/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌺
వ్యక్తిత్వ వికాసము — “5 వ భాగము
1) మానవునిలో అపారమైన శక్తులు ఉన్నప్పటికి — > అనంతమైన తెలివి తేటలు కలిగి ఉన్నప్పటికి –నేటి మానవులలో కొందరే తప్ప తక్కిన వారందరు — ముందడుగు వేయలేక పోతున్నారు — కారణం ? — వాళ్ళ మనసుకు అనేకమైన అపోహలు కల్పించి — ఫీడ్ బ్యాక్ చేసి కూర్చోబెట్టడమే — నెగెటివ్ థింకింగే తప్ప పాజిటివ్ థింకింగ్ కు అలవాటు చేయకపోవడమే — >
సానుకూల దృక్పధం విజయయానికి తొలిమెట్టు — విజయము సాధించడానికి వాతావరణం ఉన్న – అనుకున్నది అందుకోవడానికి — అంతులేని అవకాశాలు కలిగి ఉన్న — విజయానికి ఆమడ దూరంలో ఉంటున్న వారెందరో వున్నారు — నేను చీకట్లో కూర్చొని చీకటిని తిట్టుకోవడం కన్నా — చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాను — విజయము నన్ను తప్పక
వరిస్తుంది — తాము దురదృష్టవంతులమని — జాతకము బాగా లేదని — తమ వెనుక ఆర్ధికంగా వుండే గ్రాండ్ ఫాధర్ లేరని — చింతిస్తూ కాలం గడపడం మనం చూస్తున్నాము — > తమ విజయానికి తామే గండి కొట్టుకుంటున్నామని తెలియక — వారిని – వీరిని నిందించడం — లేదా –కర్మ అని సరిపెట్టుకోవడం జరుగుతుంది.
2) నిజానికి విజయము ఎవరికి చుట్టము కాదు — > కానీ అది సాధించడానికి నిరంతరం కృషి చేసేవారిని తప్పక వరిస్తుంది — విజయము సాధించాలనుకునేవారు పదిరకాల ఉచ్చుల్లో ఇరుక్కుంటారని — ఆ ఉచ్చుల నుండి తప్పించుకోగలిగితే విజయము — వారి వడిలో వచ్చి పడుతుంది — > ఆ ఉచ్చు నుండి బయట పడటానికి మార్గాలు చాలా ఉన్న — కొంతమంది
దురదృష్టవంతులు — వాటి కొరకు ప్రయత్నించక — స్వయం నింద — పరనిందలకు పాటుపడుతు అపజయము పాలవుతున్నారు — ఆ ఉచ్చులు పది రకాలుగా ఉంటాయి — వీటినే Mind traps అంటారు — > 1) నేను దురదృష్టవంతుడిని — 2) నేను ఏపని మొదలు పెట్టిన పూర్తి చేయలేను — 3) మా ఇంట్లో ఫలానా రంగం ఎవరికి అచ్చి రాలేదు — 4) నా జాతకం
అలా ఉంటే నేనేం చేయగలను — 5) నేను కావాలనుకున్నదేదీ జీవితంలో పొందలేదు –6) నాకు సరిగ్గా మాట్లాడడం చేతకాదు — 7) నాలో చాలా లోపాలు ఉన్నాయి — 8) ఈ ప్రపంచంలో నన్నెవరు అర్ధం చేసుకోవడం లేదు — 9) నేనే కానీ మరో కులములో పుట్టి ఉంటే అద్భుతాలు చేసే వాడిని — 10)నేను ఎంత కష్ట పడినా చివరికి కష్టమే మిగులుతుంది .
3) ఇవన్నీ కూడా ఎవరికి వారు సృష్ఠించు కున్నవే — > వాటిని పదేపదే అనుకోవడం వలన అవి మనసులో రిజిస్టరై కూర్చుంటాయి — రిజిస్టర్ కావడమే కాదు — మనకు తెలియకుండానే అవి క్రియారూపము దాల్చడానికి — మనమే దోహద పడతాము — ఉదహారణకు : ఎక్కడికైనా బయలుదేరే ముందు — ఇంట్లో ఎవరైనా తుమ్మితే వెనక్కి వచ్చి — ఒక గ్లాసు నీళ్ళు తాగి మళ్ళీ
వెళ్ళమని మన పెద్దలు చెప్పారు — అలా ఆగకుండా వెళ్ళినా పనులు కావనే భయము కూడా పెట్టారు — అది ఇప్పటికీ పాటించేవారున్నారంటే ఆశ్చర్య పోనక్కరలేదు –కానీ ఆ ఆచారము ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు ? తుమ్ముకి — ప్రయాణానికి సంభంధమేమిటనే విషయాన్ని — తార్కికంగా ఆలోచించడానికి ఎవరూ సాహసించరు — ఏదో పెద్దలు చెప్పారు — చేస్తే
పోయిందేమిటి ? — అనుకొని చేసెయ్యడం పరిపాటయ్యింది — ఒక వేళ ఆగకుండా వెళ్ళినా వారి మనసులో అదే పీకుతూ ఉంటుంది — చెడు జరుగుతుందనే భావన వారి మనసులో — రిజిస్టర్ కావడం వలన తాము చేసే పనిపైన తగినంత దీక్ష తగ్గుతుంది — ఫలితంగా ఆ పని జరుగదు — ఇదంతా తుమ్ము వలననే జరిగిందని నమ్ముతారు — అలా పరీక్షలు ఫెయిల్
అయినవారు — ఇంటర్వ్యూలో సెలక్టు కానీ వారెందరో మనకు తెలుసు — తమలోని లోపాన్ని తాము ఇరుక్కున్న Mind traps ఉచ్చు గురించి — ఆలోచించక – తుమ్మిన వారిని శాపనార్ధాలు పెట్టే అమాయకులు ఈ నాటికి ఎంతోమంది ఉన్నారు — > నిజానికి మన పెద్దలు ఎవరైన తుమ్మినప్పుడు ప్రయాణము చేయవద్దనడానికి కారణం వేరే ఉంది — > పూర్వపు రోజుల్లో
ఇప్పుడున్నన్ని రవాణా సౌకర్యాలు — కమ్మ్యూనికేషన్లు లేవు — ఎవరైనా ఏ కాశీకో, రామేశ్వరానికో వెళుతున్నసమయములో — ఇంట్లో తుమ్మితే ఇంట్లోన వారి ఆరోగ్యము బాగాలేదు కాబట్టి ఒక్క క్షణము వెనక్కి వచ్చి వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళు త్రాగించి — వారిని కూడా త్రాగి వెళ్లమనే వారట — లేని పక్షాన దారి పొడుగునా వారి ఆరోగ్యము గురించి చింతిస్తూ వెళతారని పెద్దల
ఉద్దేశము — అంతేకాదు వారు తిరిగి వచ్చేసరికి ఆ మనిషి మరణిస్తే కనీసము — ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి వచ్చామని తృప్తీ కూడా వుంటుంది — ఎందుకంటే వారి ఆరోగ్య సమాచారము — అందుకోవడానికి ఇప్పుడున్న కమ్మ్యూనికేషన్ వ్యవస్త ఆనాడు లేదు — కాబట్టి — > మీరు ఆ పదింటిలో ఏ ఉచ్చులో ఇరుక్కున్నవో — ఒక్కసారి గుర్తించండి — వాటిని తిరిగి పాజిటీవ్ గా
చేసుకొని ఆ ఉచ్చు నుండి బయట పడండి.
4) A.” నేను దురదృష్టవంతుడిని” — అని అనుకునే బదులు — ” నేను చాలా విషయాలలో అదృష్టవంతుడిని — నేను అనుభవిస్తున్న సౌకర్యాలు — ఈ ప్రపంచములో చాలా మందికి లేవు — నాకు తినడానికి తిండి –కట్టడానికి బట్ట — ఉండటానికి ఇల్లు — అభిమానించే కుటుంబ సభ్యులు ఉన్నారు — నేను చీకట్లో కూర్చొని చీకటిని తిట్టుకోవడము కన్న — చిన్న దీపం
వెలిగించే ప్రయత్నం చేస్తాను — అదృష్టము తప్పక వరిస్తుంది — గతంలో దురదృష్టవంతుడననుకున్న వారందరు విజయాలు సాధించారు”
B) “నేను ఏ పని మొదలు పెట్టిన పూర్తి చేయలేను” అనే బదులు “నేను కృషి చేస్తే — ఎంతటి ఆసాధ్యమైన పనినైనా — సుసాధ్యము చేయగలను — దానికి కావలిసిన కృషి – దీక్ష – పట్టుదల – పరిశ్రమ – ప్రతిభ — నాలో ఉన్నాయి — నేను మొదలు పెట్టిన ఏ పనినైనా ఇక ముందు విజయవంతంగా పూర్తిచేయగలను — అని అనుకోవాలి ”
C) “మా ఇంట్లో ఫలానా రంగం ఎవరికి ఆచ్చి రాలేదు” — ఈ స్టేటుమెంటు మనము చాలా ఇళ్ళల్లో వింటూ ఉంటాము — మా ఇంట్లో ఎవరూ వ్యాపారములో రాణించలేదు — సినిమాలో చేరి గబ్బు పట్టిపోయాము — వ్యవసాయంలో ధారుణంగా నష్ట పోయారు — అనే ఈ మాటలు విని తరువాత తరము వారు కూడా వాటిని నమ్మటం — తద్వారా తమకు తెలియకుండానే — ఆ
వాదన నిజం చేయడం జరుగుతుంది — దాని బదులుగా మా వాళ్ళు ఈ రంగములో ఎందుకు నష్ట పోయారో ?– దీనికి కారణం ఏమిటి ? — వాళ్ళకున్న వ్యసనాలా ? — ప్రయత్న లోపమా ? — ప్రక్కవారి నమ్మక ద్రోహమా ? — అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి — తగిన జాగ్రత్తలు తీసుకుంటే — ఎవరైనా ఏరంగము లోనైనా రాణించ గలరనేది కఠిన సత్యము — దానికి
ఉదహారణగా ఒక్కటే — మన పెద్దలు నిర్ధేశించిన కుల వృత్తులను విడిచి — ఇతర రంగాలలో అద్భుతాలు సాధించి — తమ పూర్వీకులు చేయలేని పనులు చేసిన వారెందరినో — ఇవాళ్ళ మనము చూస్తున్నాము.
D) “నా జాతకం అలా ఉంటే నేనేం చేయగలను” అని తీరిగ్గా కూర్చొని కుమిలి పోయే బదులు — అసలు ఈ జాతకం నిజమేనా ? –ఒక వేళ్ళ జాతకం అనేది నిజంగానే ఉంటే — నేను పుట్టిన కచ్చితమైన వేళ్ళ ఎవరూ చూశారు ? — అది కరెక్టు అని ఎవరూ చెప్పగలరు ? — తల్లి నుండి శిషువు పూర్తిగా బయటికి వచ్చిన సమయం కరెక్టా ? — లేదా శరీర భాగము పూర్తిగా
బయటకు రాబోతున్న సమయం కరెక్టా ? — లేదా కెవ్వుమని అరచిన సమయం కరెక్టా ? — ఇవన్నీ కాక నర్సు బయటికి వచ్చి చెప్పిన సమయం కరెక్టా ?ఎందుకంటే ఒక్కో దేశములో ఒక్కొక్క పద్దతిని నమ్ముతారు –అసలు ఈ జాతకం అంతా ఒక బూటకం అనే దేశాలు ఉన్నాయి — కాబట్టి దేని మాట ఎలా ఉన్న “నా జాతకం నేను తిరగరాయ దలచు కున్నాను — నేను ఈ
క్షణము నుండి కష్టపడి విజయం సాధిస్తాను — మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కుంగి పోక — జాతకానికి లొంగిపోక కృషి చేస్తాను” అనుకోవడం ప్రారంభించండి — నెగెటివ్ థింకింగ్ కి గుడ్ బై చెప్పండి :– మీలోని నెగిటివ్ ఆటొ సజెషన్ లకు నేడే గుడ్ బై చెప్పండి — వాటిలో ఇవి ముఖ్యమైనవి
5) 1) చదివిందేదీ గుర్తుండడం లేదు — 2) ఇది వరకటి లాగా పని చేయ లేక పోతున్నాను — 3) ఏ పనిమీద ఏకాగ్రత కుదరడం లేదు — 4) నేను బయలు దేరే ముందు ఎవడో గాడిద తుమ్మాడు — 5) పొద్దున్నే ఆవిడ ముఖం చూశాను — నా కర్మ — 6) పిల్లి ఎదురొచ్చింది — కాబట్టి పనులు జరుగవు — 7) నేను ఎంత ప్రయత్నించిన — బరువు తగ్గడం లేదు –8) సిగిరేటు
మానడం నావల్ల కావడం లేదు — 9) ఎంత మానాలన్నా తాగుడు మాన లేక పోతున్నాను –10) ఈ జన్మలో నేను ఇంగ్లీషులో మాట్లాడలేను — 11) నేను పొడుగ్గా వుంటే అనుకున్న వన్ని చేసే వాడిని — 12) నా దగ్గర డబ్బుంటే అద్భుతాలు చేసేవాడిని — 13) నా వెనుక ఎవరు లేరు కాబట్టి నేనేమీ సాధించ లేను — 14) నేను ఎవరికి అవసరము లేదు — నా జీవితం వేస్టు — 15)
నేనంటే ఎవరికి ఇష్టం లేదు — 16) నన్నుఈ ప్రపంచములో ఎవరూ అర్ధం చేసుకోలేదు –17) ఈ దిక్కు మాలిన ఉద్యోగం చేయలేక పోతున్నాను — 18) వంట చేయాలంటే విసుగేస్తుంది — 19) నేను పది మందిలో మాట్లాడలేను — నోరు పెగలదు — 20) నేను అనుకున్నది ఏది జరుగదు — 21)నేను పట్టుకున్న దల్ల మటాష్ — 22) నాకు పని గండం వుంది –కాబట్టి ఏ పని
చేయలేను — 23) ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మకూడదు — 24) బ్రహ్మవిద్య చాలా కష్టమైనది — అందుకే అందుకోలేక పోతున్నాను 25) మీ లాంటి వారికి సాధ్యమే కాని — మాలాంటి వారికి సాధ్యపడదు — ఇలా వ్రాసుకుంటూ పోతే వేలాది నెగెటివ్ సజెషన్ లు వున్నాయి — ఇప్పుడు మీరు చేయ వలసిందల్ల –మీరు పదేపదే పెంచి పోషిస్తున్న నెగెటివ్ సజేషన్ ని పాజిటీవ్ గా
వ్రాసుకొని పారాయణ చేయాల్సిందే దీనినే సైకాలాజీ లో ఫర్మేషన్ అంటారు — మార్పు అనేది సాద్యమే — సంభవమే అనే సత్యాన్ని ప్రతివారు గుర్తించాలి — అనుకోవడం మంచిదే కానీ దానిని — ఆచరించడం ఉత్తమము — ప్లాను వేయడము కన్నా — క్రమ పద్దతిలో ప్లానింగ్ చేసి ఆచరించడం వల్ల విజయం సాధించ వచ్చు — మనం జీవితంలో చాలా అనుకుంటూ
వుంటాము — అనుకున్న వన్ని సాధించ గలుగాలి — నిరంతర సాధనే గెలుపుకు బాట — “కృషి తో నాస్తి దుర్భిక్షం ” — అనుకున్నది సాధించు వరకు పట్టుదలతో కృషి చేయాలి.
6) 1) ఈ పని కష్టమే కానీ సాధ్యమే అంటారు విజేతలు — ఈ పని సాధ్యము కావచ్చు కానీ చాలా కష్టము అంటారు పరాజితులు.
2) విజేతలు అనుకున్న పనిని అమలు చేసే ప్రణాళిక తయారు చేసి ఆచరిస్తారు — పరాజితులు ప్రణాళికలు మాత్రమే వేస్తారు.
3) ” నేను అనుకున్నది సాధించి తీరుతాను” అని విజేత భావిస్తాడు — నాకు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తాడు పరాజితుడు.
4) ఒక తప్పు జరిగినప్పుడు నా వల్ల జరిగినది అనుకుంటాడు విజేత — ఎవరో కావాలని ఈ కుట్ర చేశారు అంటాడు పరాజితుడు .
5) నేను చేయ వలిసింది చాలా ఉంది అని రోజురోజుకి అభివృద్ది సాధిస్తాడు విజేత — ఎంత చేసిన ఈ పని జరగడం లేదు అని కుమిలి పోతాడు పరాజితుడు.
6) నేను కానీ ఫలానా కులములో ఉంటే అద్భుతాలు చేసే వాడిని అని పరాజితులు అంటే — నా భవిష్యత్ కు కులము అడ్డు రాదు అంటారు విజేతలు .
7) నేను పని మొదలు పెడితే అందరూ సహాయం అంధిస్తారు అని విజేత భావిస్తే — నా వెనుక ఎవరూ లేరు అందుకని పని మొదలు పెట్టడం వేస్టు అని భావిస్తాడు పరాజితుడు.
8) తాత్కాలిక సమస్యలను చూసి పరాజితుడు పారిపోతే — శాశ్వత లాభాలను దృష్ఠి లో వుంచుకొని ముందుకు సాగుతాడు విజేత.
9) సమస్యల పరిష్కారానికి శత విదాల ప్రయత్నిస్తారు విజేతలు — దేవుడికో – కాలానికో వదిలి పెడతారు పరాజితులు .
10) పని మొదలు పెట్టకుండానే అందులో వచ్చే సమస్యలు చర్చిస్తారు పరాజితులు — ఆ సమస్యలను ఎలా పరిష్కరించు కోవాలో ప్రణాళికలు చేస్తారు విజేతలు.
11) తమ వైఫల్యాలకు బాధ్యత వహిస్తారు విజేతలు — తమ వైఫల్యాలకు కారణాలు చూపుతారు పరాజితులు.
12) నిదానంగా ఆలోచించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి పని ప్రారంభిస్తారు విజేతలు — అనుకున్నదే తడవుగా ఆ రంగంలో అనుభవం లేకపోయిన దూకేస్తారు పరాజితులు.
13) నా జాతకం బాగాలేదు, సుడిలేదు అంటూ మీనమేశాలు లెక్క పెడతారు పరాజితులు — నేను కష్టపడి నా జాతకం తిరిగి రాస్తాను అనే విశ్వాసం తో ముందుకు సాగుతారు విజేతలు .
14) నేను పేదవాణ్ణి, నాకు నాయకుల అండదండలు లేవు అని నీరస పడతారు పరాజితులు — నాకు ఎవరు లేక పోయిన నేను ప్రతిక్షణం ప్రేరణ కలిగించు కోగలను అనుకుంటారు విజేతలు.
15) నన్ను నేను నమ్మిన నాడు అందరూ నన్ను నమ్ముతారు అని విజేత భావిస్తే — నన్ను ఎవ్వరూ నమ్మడం లేదని బాధపడతాడు పరాజితుడు.
కాబట్టి తక్షణము మేల్కొని వాటిని పరిష్కరించే మార్గము వెతకండి — మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా — అవాంతరాలు వచ్చినా — అవి ఈతగాడికి ఎదురయ్యే గడ్డి పరకల్లా పట్టించుకోకండి విజయం మీదే ! — అనుమానం వద్దు.
పై విషయాలన్నీ మీకు నాకంటే బాగా తెలుసు — ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో , ఈ చిన్న వాడికి తెలుపు తారని మనవి .
R.B.Satyanarayana
Chairman, Annadhara
10/16/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణ మస్తు 🌺
ప్రాణ 6 వ భాగము – ” ప్రాణ మయం జగత్ ”
1) ప్రతి మనషి ఏదో ఒక ప్రకారంగా భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉంటాడు – ఒకరు తీర్ధయాత్రలు చేస్తారు – ఒకరు దేవతలకు పూజ చేస్తారు – ఒకరు జీవుల సేవా జేస్తారు – ఒకరు గుడికి ఎదురుగా నిలబడి దండము పెడతారు – ఇంకా చెప్పాలంటే ఏది చెయ్యనని చెప్పేవాడు కూడా ఏదో ఒక చిన్న చిక్కులలో పడ్డాడంటే – ఓ భగవంతుడా – రక్షించు – అంటూ ఆయనకు మోర
పెట్టుకుంటాడు – ఈ ప్రకారంగా ప్రతి యోక్క వ్యక్తి ఎంతో ఒక విధంగా ఈశ్వరుడి శరణు వేడుకుంటూనే ఉంటాడు -భోజనము చేయకుండా ఎవరైనా ఎలా జీవించలేరో – కనీసము రోజుకు ఒక సారి అయినా అన్నము తినవలసిన అవసరము ఎలా పడుతుందో – సరిగా అలాగే భగవంతుడి ఉనికిలోనే అన్నింటి ఉనికి ఉన్నదీ – ఇందుచేత అతడు ఆయన్ని ఒక సారి స్మరించు
కోవాల్సి ఉంటుంది – భగవంతున్నీ ప్రాప్తి౦ప చేసుకో గలిగే ఉపాయాన్ని సాధారణ మనుష్యులు ‘ ధర్మము ” గ పరిగణిస్తారు – సహజంగా ప్రతి ఒకరి మనసులోనూ కొన్నీ ప్రశ్నలు తలెత్తు తుంటాయి – ” ధర్మము ” అంటే ఏమిటి ? – భగవంతుడ౦టే ఏవరు ? అయన ఎక్కడ ఉంటాడు ? కానరాని దేవుణ్ణి ఎలా పొంద గలుగుతాము ? దేవుణ్ణి శరణు పొందుటెట్లు ? అనే ప్రశ్నలు
ఉద్భవిస్తాయి – ‘” ధారయతీతిధర్మః ‘” అనగా ఏది జీవులను ఉద్ధరించునో – ఈ జగత్తును ఏది ఉద్ధరించు చున్నదో – అది ” ధర్మము ” అదే దైవిక శక్తి దానిని శరణు పొందుడు – అది మిమ్ములను రక్షించును – దేవుడన్నను , ధర్మమన్నను ఒక్కటే – అందువల్లనే బుద్ధుడు ” ధర్మము శరణము గచ్ఛామి ” అని బోధించి నారు – దేవుడు కానరాకున్నాను ఆయన సృష్టి
యందున్న సంఘము ( ప్రాణి సముదాయము ) కానవచ్చును -” సంఘము శరణము గచ్ఛామి ” దానినే శరణు పొందుడు -అనగా దానినే సేవించండి -అదియే దైవ పూజ దేవుడు సర్వాతీతుడు అని భోధింపబడినది – ” బుద్ధం శరణం గచ్ఛామి ” -ఇచ్చట తననే శరణు పొందుడని చెప్పుకొనలేదు – బుద్ధుడనగా జ్ఞాని – తాను ఇరువది నాల్గవ బుద్దుడ నని -తనకంటే ముందు
ఇరువది ముగ్గురు బుద్ధులు మార్గదర్శకులై వచ్చి పోయినారని అతడు చెప్పెను –
2) సాధారణ మనుష్యులకు యదార్ధ ” ధర్మాన్ని” గురించి పూర్తిగా తెలువదు – ఈ రోజుల్లో వేరు వేరు ధర్మ ( మత ) సంప్రదాయాల ద్వారా రకరకాల ధర్మ కథలువిని ఇది ఎలాంటి ధర్మమో సరిగా తెలుసు కోవడము చాలా కఠినం అవుతుంది – అన్నీధర్మ సంప్రదాయాలు తమ తమ దళాలకు బలము చేకూరాలనే ఆత్రపడుతున్నాయి – కాని ధర్మ మెప్పుడు కూడా వేరు
వేరుగా ఉండజాలదని – వేరు వేరుగా ఉంటుందనే బావనే అధర్మమని – దానికి వ్యతిరేఖతే అంటే – అభిన్నత్వమే – ధర్మమని ఒక్కసారి కూడా మనము అనుకోము – > అన్నీ జీవులను ధరించేది – పోషించేది – అదే ధర్మమూ – అన్నీ జీవుల్ని ధరిస్తున్నదీ – పోషిస్తున్నది – ఏవరు ? > అన్నం అన్ని జీవుల్ని ధరించి పోషిస్తున్నది కదా అంటే అది సరికాదు –
ఎందుకు అంటే అన్నీ జీవుల అన్నము ఒకే విధంగా లేదు – కొన్ని జీవులు గడ్డి మేస్తాయి – కొన్ని జీవులు మాంసము తింటాయి – ఇలా రక రకాలు ఇందుచేత భిన్నత్వము ఉండటము వల్ల – అన్నము ధర్మమూ కాజాలదు – > పోనీ ఓకే వేల నీరే అన్నీ జీవుల్ని ధరస్తున్నది , పోషిస్తున్నది – అందామనుకుంటే అది సరికాదు – ఎందుకంటే చచ్చినవాడి శవములో కూడా
నీరు ఉంటుంది – అంటే శవములోకి కాస్తా నీరు ప్రవేశ పెట్టినప్పుడు వాడు బ్రతికే టట్టు అయితే –నీరు ప్రాణిని ధరించడములో సమర్ధ మవుతుంది – అలా జరగనప్పుడు నీరు ధర్మము కాజాలదు – > పోనీ గాలి అన్నీ జీవుల్ని ధరిస్తున్నదని అందామా అంటే – ఇధీ సరి కాదు – ఎంచేతంటే మృత దేహములో కూడా గాలి ఉంటుంది – లోపల గాలి లేకపోతే బయటి గాలి
ఒత్తిడి వల్ల అణిగి పోతుంది – అంటే కాస్త గాలి బయటి నుంచి పీనుగు లోపలికి ప్రవేశించి నప్పుడు మళ్ళి బ్రతికేటట్టు అయితే ఆ గాలే ధర్మ మనుపించుకుంటుంది – అలా జరగ నప్పుడు గాలికూడా ధర్మమూ కాజాలదు – > ఇందు వల్లనే సమస్త ప్రాణులలోనికి –చేతనా చేతనాలలోనికి ప్రవేశించి – సర్వ జీవుల్ని – సర్వ భూతాల్ని ధరించి పోషించే మహా వస్తువే “ ధర్మము
“ అనిపించు కొంటుంది – అదే అన్నీ ఘటాలలోను – అంటే అన్నీ దేహలలోను – “ ప్రాణ “ రూపములో వెలుగొందుతూ ఉంది – > ఇందువల్ల అదే అందరు ఉపాసించ వలసిన ఏకైక దేవత – > “ ప్రాణేన ధార్యతే లోకః – సర్వం ప్రాణమయం జగత్ “ ( అధర్వణ వేదం ) ప్రాణమే అన్నింటిని ధరించి యున్నది – అన్నింటిని నిలబెడు తిన్నది ప్రాణమే –అంతటా ప్రాణము
నిండియున్నది – ఇందు చేత ప్రాణమే ధర్మము ( మతం ) .
3 ) అది హిందువు కాదూ- ముసల్మానూ కాదు – క్రైస్తవమూ కాదు – బౌద్ధమూ కాదు అది స్త్రీ కాదు పురుషుడూ కాదు అది దేహం అంతకంటే కాదు – అది ఎప్పుడూ దేంట్లో ఉంటె ఆ సమయంలో అది అదే అవుతుంది – కాని అది దేంట్లో ఉంటె అది అయిపోదు – హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, బౌద్దాదులన్ని ధర్మం కావు – వేరువేరు సంప్రదాయాలు – కాని ప్రాణ రూపి ధర్మం
తర్కానికి అన్నీ సంప్రదాయాలకు అతీతమైనది – అది అన్నీ సంప్రదాయాలలోనూ ఉంది – కాని దాంట్లో ఏ సంప్రదాయము లేదు – అన్నీ దేహాల్లోనూ ప్రాణం ఉంటుంది కాని – ఏ జీవికి ఆ ప్రాణం మీద లక్ష్యం ఉండనట్లు –జీవికి ఆ ప్రాణం మీద లక్ష్యం లేకపోవడం వల్ల ఆ జీవి ప్రాణంలో ఉండడం లేదు – అదే ప్రకారంగా అది అన్నీ సంప్రదాయాల్ని విడిచిపెట్టిన
తరువాత కూడా అన్నీ సంప్రదాయాలు దాంట్లో అంతర్బూతంగా లేవు – సంప్రదాయాలు అనేకం కావడం వల్ల అవి ధర్మం కాజాలవు – పైగా ఒక్కొక్క సంప్రదాయానికి అనేక ఉప సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి – నేను ఫలానా మహాత్ముడి అనుయాయిని లేదా నేను శాక్తుణ్ణి, శైవుణ్ణి, వైష్ణవున్ని అంటూ చెబుతూ ఉండడం కద్దు – ఇవి కూడా చాలా ఉండడం వల్ల ధర్మం
కాజాలవు – పరస్పర మంతాంతరాలు కారణంగా సంప్రదాయాల్లో కాని – దళాల్లో కాని వర్గాలు కనిపిస్తూ ఉంటాయి – ఇవి తమ తమ ధశాల బలంకోసం తమ తమ మతాల ప్రచారం చేస్తూ ఉంటాయి – ఈ అన్నీ ధళాల ఉనికినీ స్థిరపరచడం కోసం “ సంధ్యావందనం చెయ్యి ” “ పూజ చెయ్యి ” జపము చెయ్యి ” – అంటూ రకరకాల ఉపదేశాలు చేస్తూ ఉంటారు – కాని వీటి
నన్నింటిని చేయించేది ఏమిటో ఎవరూ ఆలోచించరు – > ధర్మం ( మతం ) అనేది ఆచారం కాని అనుస్టానంకాని ఏది కాదు – యజ్ఞం కాదు – నీతిబోధ కాదు – నియమాల సంకెల కాదు – అనుశాసనం కాదు – భక్తి ప్రేమ – ధయ – దానం ఎవి కాదు – కర్తవ్యం కాదు – జ్ఞానం కాదు – అజ్ఞానంకూడా కాదు – ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం ఎయోక్క బాహ్య అనుస్టానము
ధర్మం కాదూ – జగత్తులో అన్నీ ధర్మం నుంచి పుట్టినవే – ధర్మంలో ఉన్నవే- వీటన్నిటి లోపల ధర్మం విరాజమానమై ఉంది – కాని వీటి ఉనికి ధర్మంలో లేదు – ధర్మం ఆ స్తిత్వంలోనే వీటి ఆ స్తిత్వం ఉంది – ఇవి వేరు వేరు దేశాల్లో- లేదా వేరువేరు జీవుల్లో వేరు వేరుగా ఉండవచ్చు – కాని ధర్మమూ అన్నీ దేశాలలోను – అన్నీ జీవులలోను ఒక్కటే ఉంది – అది ఎక్కడా వేరు
వేరుగా కనిపించదు – ఎందుకంటే అన్నిటిలోనూ ప్రాణ రూపమైన ధర్మం ఉంది – మనుష్యులు మొదలుకొని – క్రిమి కీటకాలు – పక్షులు – వృక్షాలు – రాళ్ళు – రప్పలు మొదలైనవి వాటన్నిటి లోనూ ఉంది ఒకటే ధర్మం – ఎందు వల్ల నంటే అన్నింటిని ప్రాణ రూపమైన ధర్మమూ ఒక్కటే ధరించి ఉన్నది కనక –పోషిస్తూ ఉన్నది కనక –ప్రాణు లన్నింటిలోనూ ఒకే ధర్మమూ
ఉంది – మనిషి అల్పత్వము వల్ల ధర్మాన్ని వేరు వేరుగా ఉన్నట్లు బావించడము జరుగుతుంది – > బయట ఉండే వాటిని మనము వేటి వేటిని ధర్మమని అంటున్నామో – నిజానికి అవి మానవ సమాజ క్రమశిక్షణ కోసము తప్పనిసరి అయినవి – మనిషి సమాజ ఆజ్ఞను మన్నించి నడచుకుంటూ ఉంటాడు – అది మనిషి సృష్టించినది –ఆ ఆజ్ఞలు కూడా వేరు వేరు దేశాలలో
వేరు వేరు తీరుగా వున్నాయి – కాని జీవ జంతువులకు సమాజ మన్నది ఏదీలేదు – ఇందువల్ల వీటికి సమాజ ఆజ్ఞా కూడా లేదు – అయితే ఈ కారణము వల్ల వాటికి ధర్మమూ లేదా అని అనవచ్చు – అలా లేకుండా ఉండదు – జంతువు కూడా ఏ ప్రేరణవల్ల తన సంతానాన్ని ప్రేమిస్తునది ? ఆ ప్రేరణ పుట్టే కేంద్రమే ధర్మమ – ఇందువల్లనే అన్నీ జీవులలోను ఒక్కటే ఉన్న
ధర్మమే ధర్మము –అందువల్ల ధర్మము మీద మనకు ఇంత ప్రేమ – ఎందుకంటే ధర్మమే అన్నింటికీ జీవనము – ధర్మమే అన్నింటికీ ప్రాణము – ధర్మమూ లేనిదే ఎవరూ ఒక్క క్షణము కూడా జీవించి ఉండలేరు – పుట్టినది ప్రతిది గిట్టక మానదని మనకు కనిపిస్తూనే ఉంటుంది – ఈనాడు వున్న సంప్రదాయాల సమూహాల పుట్టుక ఎవరో ఒక మహా పురుషుడి వల్ల జరిగందే
–ఇందువల్ల ఏనాడో ఒక నాటికి ఇవి పోక తప్పదు – ఇవి అస్థిరమైనవి కావడము చేత ఇవ్వన్ని కూడా ధర్మమూ కాజాలవు – అసలైన యధార్ధ ధర్మానికి పుట్టుకలేదు – వినాశనము లేదు – ధర్మములో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ప్రాణులందరు ధర్మాన్ని గురించి తెలుసు కోవాలని కోరుకోవడము లేదు –ఇది చాలా విచారించ దగ్గ విషయము –
పై విషయాలన్నీ నాకంటే మీకు బాగా తెలుసు ఏమైనా పోరపాట్లుంటే ఈ చిన్న వాడికి తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
10/31/2016
🌺 ఓం అచ్యుతార్పణ మస్తు 🌺
“ ప్రాణ “ 7 వ బాగము
6 వ బాగము తరువాయి – >> చాలామంది పత్రం , పుష్పము , పలము, తోయం లాంటివి సమర్పించి దేవతల పూజ చేస్తుంటారు – ఈ విషయాన్ని గురించి “ గీతలో శ్రీ కృష్ణ భగవానుడు “ ఇలా చెప్పాడు : > పత్రం పుష్పము పలం తోయము – యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః > అంటే ఎవరైనా భక్తితో నాకు పత్రం , పుష్పం , పలం
, జలం ఇచ్చి నట్లయితే నేను, సంయతాత్ముడయిన ఆ వ్యక్తి ప్రేమ పూర్వకంగా అర్పించిన వాటిని స్వీకరిస్తాను – ఇక్కడ భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే తనకి ఏ వైన అర్పించడానికి ఆ వ్యక్తి తప్పని సరిగా సంయతాత్ముడు , భక్తుడు అయివుందాలన్న మాట – ( ప్రయతాత్మనః : సంయతాత్మునః : భక్త్యుపహృతం : – భక్త్యా ఉపహార రూపేణ సమర్పితం – తత్
అశ్నామి – గృహ్నామి )> ఏ వ్యక్తి అయినా సంయతాత్ముడు , భక్తుడు కాగలిగి నట్లైతే ఆ వ్యక్తి ఏవి సమర్పిస్తే వాటిని ఆయన స్వీకరిస్తాడన్న – సంయతాత్ముడూ భక్తుడూ కానివాడు ఏవైనా అర్పిస్తే వాటిని ఆయన స్వీకరించడని దీనివల్ల స్పష్ట మవుతుంది – >> ఎందుకంటే అర్పించడానికి యోగ్యత అతనికి లేదన్న మాట – వర్త మాన చంచల ప్రాణాన్ని విశేషంగా సంయతము
చేసి – అంటే స్థిరము చేసి ఎల్లప్పుడూ ఆ స్థితిలో ఉండే సంయతాత్ముడే భక్తుడని ఇక్కడ చెప్పడము జరిగింది – ఎందుకంటే ఆ స్థితి రూపావస్థలో ఆత్మను తెలుసుకొని స్థిర ప్రాణరూపుడైన ఆత్మనారాయణుడిమీద దృడమైన ప్రేమ ఏర్పరచు కొన్నవాడే ఈ భక్తుడు – > ఈ అవస్థలో భక్తి , భక్తుడు , భక్తికి పాత్రమైనది అన్నీ ఒక్కటై పోతాయి – అలాంటి భక్తుడు ఏది ఇస్తే
అది ఆయన తప్పకుండా తీసుకుంటాడు – > కేవలము నోటితో కాసిన్ని మంత్రాలు పలకదమువల్లో , “ భగవంతుడా దీన్ని తీసుకో “ అంటూ గోణగడము వళ్ళో యదార్ధంగా సమర్పించడ మన్నది అయిపోదు – > పూజకు అర్ధము సంవర్ధనము ( పెంచడం ) – అంటే ప్రాణాన్ని సంపూర్ణంగా వ్రుద్ధిచేసి ( ప్రాణ ప్రతిష్ట జరిపి ) సంవర్ధన రూపమైన స్థితిని వ్రద్ధిచేయడాన్నే పూజ
అంటారు – అంటే ప్రాణానికి ఉండే శ్వాస ప్రశ్వాస రూపమైన గతికి స్థిరత్వాన్ని( ప్రాణ ప్రతిష్ట ) పెంచాడాన్నే పూజ అంటారు – ఈ విధంగా ఈ పూజ ప్రాణకర్మ లేనిదే సంభవము కాదు –>> ఈనాడు వర్తమాన కాలములో పూజ పేరుమీద జర్గుతున్న దంతా వాస్తవిక పూజ కాదు – భక్తి పేరుమీద కనపడేదంతా కూడా వాస్తవిక భక్తి కాదు – > దాన్ని భూతభక్తి లేదా భౌతిక భక్తి అని
అంటారు – > ప్రాణ కర్మ లేనిదే అజ్ఞానము దూరము కావడము సంభవము కాదు – అజ్ఞాన పాశాన్ని కోసే సే దాక భౌతిక సంస్కారానికి అతీతంగా పోలేడు – నిజమైన భక్తి బావాన్ని పొందడము కూడా సంభవము కాదు – కాబట్టి భక్తి , ముక్తి , పూర్తిగా ప్రాణకర్మ లేదా ప్రాణాయామము సాపేక్షాలు – వాస్తవిక ఆత్మకు కర్మ అనేదిలేదు – దానికర్మ చంచల ప్రాణము ద్వారా
సంచాలిత మవుతు ఉంటుంది – ఇందువల్ల చంచల ప్రాణమే ఆత్మ తాలూకు కర్మ – చంచల ప్రాణమే జగత్తులో వేలుతు రంతకూ మూలము – చంచల ప్రాణము ద్వారా మాత్రమే ఆయన్ని పూజించ వలసి ఉంటుంది -> బాహ్యమైన ఏ వస్తువు ద్వారానూ ఆత్మను పూజించడము సంభవముకాదు – > కాబట్టి ప్రాణ కర్మను – అంటే శ్వాస ప్రశ్వాసల కర్మను – శ్రద్ధా , భక్తి ,
విశ్వాసాలతో , పలాపేక్షా లేకుండా చేస్తున్న వాళ్ళే నిజమైన పూజ చేస్తున్న వాళ్ళు – అంటే కోరికలు లేని వాళ్ళయి పరమ త్రుప్తి పొందుతారు .
2) >>” శ్రేయాన్ స్వధర్మో విగుణః – పరధర్మాత్ స్వనుష్టితాత్ – స్వధర్మే నిధనం శ్రేయః – పరధర్మో భయావహః “ – ( భగవ -3 . 35 ) > “ శరీరము కేవలం కర్మ – కుర్వన్నా ప్నోతి కిల్బిషం . ( భగ . 8 .21 ) అంటే చక్కగా అనుష్టించినధైప్పటికి పరధర్మం దోషంతో కూడినది – స్వధర్మం అంటే అత్మధర్మం , శ్రేష్టమైనది – ఈ ఆత్మ ధర్మరూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ
ఉన్నప్పుడు – అంటే ప్రాణాయామము చేస్తున్నప్పుడు – చావు వచ్చినట్లియితే అది శ్రేయస్కరము – కాని పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మమూ భయావహమైనది – అంటే ఆశంక కలిగించేది – >> నేను హిందువునని నా దగ్గర ఇతరుల ధర్మము పరధర్మమని అనుకోవడము సరియైనది కాదు -> అంటే నేను ముసల్మానునని ,నాదగ్గర ఇతరుల ధర్మము పరధర్మమని
అనుకోవడము కూడా సరియైనది కాదు – >.స్వధర్మమంటే ఆత్మ ధర్మమూ : పరధర్మమంటే – ఇంద్రియ ధర్మం – ఈ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మాన్ని గనక చక్కగా పాటించినప్పటికీ కూడా అది శ్రేష్టమైనది కాదు – కానీ ఆత్మ ధర్మ రూపమైన స్వధర్మం దోషాలతో నిండిన ధైనప్పటికి కూడా దాన్ని పాటిస్తున్నప్పుడు మృత్యువు కలిగి నప్పటికీ కూడా అది శ్రేష్టమైనదే –
పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పుడూ ఆశంకా జనకం లేదా భయావాహం – >దోషయుక్తము అని చెప్పడంలో ఉద్దేశ మేమంటే ప్రాణ కర్మ రూపమైన ఆత్మకర్మ – లేదా ఆత్మ ధర్మం , మొదట్లోనే సర్వాంగ సుందర మై పోదు – అనేక పర్యాయములు అభ్యాసము చేస్తూ ఉంటె క్రమ క్రమంగా అది చక్క బడుతుంది –ఈ కర్మనే స్వభావజకర్మ అంటారు – ఈ స్వభావజకర్మ
చేస్తున్నప్పుడు ఏలాంటి పాపము రాదు – ఎందుకంటే పుట్టుకతోనే ప్రారంబమైనకర్మ( శ్వాస ప్రశ్వాస కర్మ) ఆ స్వభావజ కర్మే – అంటే ఆత్మకర్మే స్వధర్మం – ఆ స్వధర్మము ద్వారా ( ప్రాణ కర్మ ద్వారా ) పాపము పొందడము ఎన్నడు జరగదు – ఇంద్రియాల ధర్మమే పరధర్మం -> మనసు , బుద్ధి ,చిత్తం అనే ఇంద్రియాల సాంగత్యము ఉన్నంతవరకు –అంటే
ఇంద్రియాలలో ఆసక్తులై ఉన్నంత వరకూ – స్వధర్మాన్ని తెలుసుకోవడము సంభవము కాదు – కేవలము పరధర్మ్మాన్ని అనుసరించి పోవలసి వస్తుంది . > సశేషం <
పై విషయాలన్నీనాకంటే మీ అందరికి బాగా తెలిసినవే ఏమైనా పొరపాట్లు వుంటే క్షమించి ఈ చిన్నవాడికి తెలుపుతారని మనవి .
R.B.Satyanarayana
Chairman, Annadhara
11/04/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
“ ప్రాణ “ 8 వ బాగము
“ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ – అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః “ అంటే సర్వ ధర్మాల్ని – అంటే ఇంద్రియాలు చేయు గంధరగోల ధర్మాల్ని – విడిచి పెట్టి కేవలం నా (ఆత్మ) శరణు కోరి వచ్చేటట్లయితేనే నేను నీ పాపాలన్నింటిని పోగోడతాను – అంటే విభిన్న స్థానాలలో , విభిన్న రీతులలో మాయ మొహములో పడ వేసి చేయు కర్మల ఆసక్తిని విడిచి పెట్టి కేవలము ప్రాణ , ఆత్మకర్మలకు లగ్నమై ఉండి ఊర్ధ్వములో వున్న ఇంద్రియాతీత స్థానములో అంటే పరమాత్మ స్థానములో – మనసును నిలుపు – అప్పుడే ఇంద్రియ ధర్మములో ఆసక్తి రూపంగ ఉన్న పాపసముదాయము నుంచి బయట పడగలుగుతావు . >> “ స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ “ >ఈ ప్రాణకర్మ రూపమైన నిజ ధర్మాన్ని ఏ కొద్దిగా ఆచరించి నప్పటికీ కూడా మహా భయము – నుండి అంటే మృత్యుభయము –నుంచి కూడా విముక్తి కలుగుతుంది – ఎందుకంటే జీవులకు చావు భయమే అన్నింటికన్నా పెద్ద భయము – చావు అంటే ఏమిటో జీవుడికి తెలియదు – చావురాని వాడెవడున్నాడో కూడా తెలియదు – చావు దగ్గరపడుతున్నవాడు కూడా చెప్పలేడు – కాని ప్రతి ఒక్కడికి చావు మూడుతుందన్న సంగతి మాత్రము నిజము – చావు అనేది ఒక అవస్థ – అది ప్రాణము తాలూకు స్తిరావస్థ – ప్రకృతి సహజమైన కారణమువల్ల చంచల ప్రాణము స్థిరమై పోయిన మీదట దాన్ని చావు అని అంటాము – సాధకులు బ్రహ్మ విద్య సాధనద్వారా – ప్రాణకర్మ ద్వారా – చంచల ప్రాణాన్ని స్థిరము చేసిన మీదట అతడు బ్రహ్మజ్ఞాని అవుతాడు – > ఈ రెండు అవస్థలు ప్రాణము తాలూకు స్తిరావస్థలే – కాని సాధారణ మృత్యు రూపమైన అవస్థ చేతనాహీనమై కర్మ సంస్కారముతో నిండినది అవుతుంది – బ్రహ్మజ్ఞాన అవస్థ చేతనతో ని౦డినది – కర్మ సంస్కార హీనమూ అవుతు౦ది – ఒకవేళ జీవుడు సాధన ద్వారా , అంటే ప్రాణకర్మ ద్వారా , ఈ జన్మలోనే ప్రాణం తాలూకు స్థిరావస్థను (ప్రాణ ప్రతిష్టను పొంది ప్రాణ ,మనో మిలనము ద్వారా ఆత్మదర్శించి ఆత్మ వంతుడై పరమాత్మను పొందినచో ) పొందగలిగి నట్లైతే – అతనికి మృత్యు భయము తొలిగి పోతుంది – ఎందుకంటే అప్పుడు అతడు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవలిసి వస్తుందో – అంటే ఏ అవస్థ పొంధవలసి వస్తుందో తెలుసుకోవడములో సమర్దుడవుతాడు – చావుకు ముందే ఆ స్థిరమైన చోటును , లేదా అవస్థను,గురించి సాక్షాత్ జ్ఞానము కలిగినట్లైతే అప్పుడు అతన్ని మృత్యువు ఆక్రమించు కాజాలదు – అప్పుడు అతనికి చావు పుట్టుకల చక్రములో ” పునరపి జననము – పునరపి మరణము “ నుంచి విముక్తి లభిస్తుంది .
2) >> “ నేను ” – అంటే “ స్వయం ‘ అనే దాన్ని తెలుసుకున్నవాడే “ జ్ఞాని “ – పేరు , రూపము , దేహము అనేవి “ నేను “ కావు ఎందుకంటే ఇవి అనిత్యమైనవి – నశించిపోయేవి – నామ రూప దేహాల మధ్య “ నిత్యమూ – అవినాశనమూ “ అయిన పదార్ధ మొకటి ఉన్నట్లు తెలుస్తుంది – అదే “నేను” నిజంగా పిలువధగినది – నామ రూప దేహాలు పుట్టే చోటు ఈ నిజమైన “ నేను “ – చావు పుట్టుకా లేని అవినాశి అది – ఆ “ నేను “ నుంచే నామ రూప దేహాలు పుడుతుంటాయి – జీవి ఇంద్రియాలకు దాసుడు ఇందుచేత దేహమంతా ఈ “ నేను “ను పట్టుకొని వ్యస్తంగా ఉంటుంది – కాని అది నిజమైన “ నేను ” తో సంధానము పొందలేదు – ఇంద్రియాలు ప్రతికూల గుణాలే ప్రక్రుత శత్రువులు – అవి శరీరములోవుండి జీవుడి విషయములో ఎప్పుడు శత్రువుల్లాగే పనిచేస్తూ వుంటాయి – బాహ్య శత్రువులు కొద్ది కాలమే శత్రుత్వము వహేస్తారు – కాని ఇంద్రియాలు ఎప్పుడూ శత్రుత్వము చూపిస్తూనే వుంటాయి – ఈ దేహమే ” నేను“ గా పరిగణించి దాంట్లో తగులుకొని ఉన్నందువల్ల జీవుడు కర్మ సంస్కారములో బద్ధుడై ఉంటాడు – మాటి మాటికి చావు పుట్టుకల చక్రములోపడి గిర గిరా తిరుగుతూ ఉంటాడు – ప్రాణకర్మ ద్వారా ప్రాణాన్ని , మనస్సును స్థిరము చేయగలిగి నప్పుడు అంటే స్పంధరహిత అవస్థ ప్రాప్తించిన మీదట స్థిర స్వరూపమైన “ నేను“ను “ అవినాశి అయిన నేను “ ను తెలుసుకోగలుగుతాడు .
3 ) >>మనస్సు రెండు రకములు గా ఉంటుంది – స్థిర మనస్సు – చంచల మనస్సు – శ్వాస ప్రశ్వాసల గమనము బహిర్ముఖము కావడమువల్ల మనస్సు గమనం కూడా బహిర్ముఖంగానే ఉంటుంది – భహిర్ముఖమైన మనస్సు బయటి విషయాలకోసము వెతుకులాడుతుంది – శ్వాస ప్రశ్వాసలు చంచలమైనవి – ఇందువల్ల మనస్సు కూడా చంచలంగా ఉంటుంది ->>శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖుడైనప్పుడే మనస్సు గతి అంతర్ముఖ మవుతుంది – శ్వాస ప్రశ్వాసలు స్థిరము కావడమువల్లె ప్రాణమూ – మనస్సూ స్థిరము అవుతాయి – చంచల మనస్సు ద్వారా సూక్ష్మాతి సూక్ష్మ ప్రాణ రూపుడైన ఈశ్వరుణ్ణి అన్వేషించడము సాధ్యముకాదు – స్థిర మనస్సు ద్వారానే ఇది సాధ్యము – ఇందువల్ల అన్నింటికంటే ముందు శ్వాస ప్రశ్వాసలను స్థిరము చేయవలసి ఉంటుంది – అప్పుడే ప్రాణమూ , మనస్సూ స్థిరమై ఆత్మతత్వము తెలుస్తుంది – అంతర్ముఖి ప్రాణకర్మ ద్వారా ప్రాణమూ మనస్సూ స్థిరమవుతాయి –ప్రాణము స్థిరము కావడము వల్లే మనస్సు స్థిరమవుతుంది – చంచల ప్రాణము లోంచే మనస్సు పుడుతుంది – స్థిర మనసే చంచల మనస్సుకు ఉత్పత్తి స్థానము – చంచల మనస్సు ద్వారా గమ్య స్థానము మీద లక్ష్యము స్థిరము కాజాలదు ->> ప్రాణాన్ని పొందడానికి ప్రాణమే అవసరమవుతుంది – సాధన చేయడానికి కూడా శరీరములో ప్రాణము ఉండడము అవసరము అందుకే ప్రాణుడికి గతా గతిలో అశనము ( ఆహారము ) అందియ్యాలే – అది లేనిదే – అంటే ప్రాణములేనిదే –ప్రాణము ప్రాప్తి౦చడము జరగదు – ప్రాణము లేనిదే ప్రాణాన్ని తెలుసు కోవడము , గుర్తు పట్టడము సంభవముకాదు – ఈ ప్రాణ రూపి అయిన ఈశ్వరుడు ప్రాణకర్మ రూపమైన సాధనా సాపేక్షమైనవి – అనుభూతి యోగ్యమైనవి – కాని అనుమాన యోగ్యమైనవికావు .>> ప్రాణ కర్మను గురించి – అంటే ప్రాణాయామ స్వరూపాన్ని గురించి – తెలుసుకోవడము అవసరము – ప్రాణ ప్రతిష్ట జరిగి –ఆత్మ సాక్షాత్కారము పొందిన అనుభవజ్ఞులైన సద్గురువుల దగ్గర దానికి సంభందించిన శిక్షణ పొందాలి – కాని ఈనాడు సమాజములో అనుభవములేని, ప్రాణ ఏమో ,ఆత్మ ఏమో తెలియని అనేకమంది మేము గురువులమని – ఉపదేశాలు ఇవ్వగలమని మిడి మిడి జ్ఞానముతో తిరుగుతున్నారు – వారియడల అప్రమత్తతతో వ్యవరించాలి – వారియొక్క సామర్ధ్యత గుర్తెరిగి తెలుసుకొని శిక్షణ పొందాలికాని – ప్రాణ ప్రతిష్ట జరగనివారు ఉపదేశాలు ఇస్తే సాధకుడిలో పురోగతి పొందక వికల్పము చెంది జపాలు వదిలి వేస్తారు . అలాంటి వారే సమాజములో కొక్కోల్లలు.
పై విషయాలన్నీ నాకంటే మీకు బాగా తెలుసు ,ఏమైనా పొరపాట్లు వుంటే తెలుపుతారని మనవి
R.B.Satyanarayana
Chairman, Annadhara
11/11/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
” ప్రాణ ” 9 వ బాగము
>> ప్రాణాయామములో పూరక , రేచక , కుంభ కాలనే మూడు కర్మలున్నాయి – ( ఈ నాడు సమాజములో కొందరు చెప్పుచున్న పూరక ,రేచక , కుంభ కాలు యొక్క అర్ధము కాదు) ఊపిరి తీసుకోవడము పూరకం : ఊపిరి విడవడం రేచకం : పూరకానికి చివర – రేచకానికి మొదట- రేచకానికి చివర పూరకానికి మొదట ఉభయబాగాలలోను ఉండేదాన్ని కుంభకము అంటారు –
కావాలని ఊపిరి బిగపట్టి చేసే కుంభకము నికృష్ట మైనది : >> సాధకులు చేయకూడనిది – > ప్రాణ , అపాన వాయువుల్ని నడిపించే టప్పుడు రెండింటిలోను తానంతటధిగా ఏర్పడే స్థితే కుంభకము – కుంభకము పేరుతో శ్వాస ప్రశ్వాసల్ని అపివుంచటము కష్టదాయకమైనది , అనర్ధకమైనది – ముక్కు నొక్కి పెట్టి ప్రాణాన్ని బంధించడమువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి – ప్రకృతి సిద్ధంగా మానవునికి రోజు 21, 600 సార్లు ఉచ్వాస నిశ్వాసాలు జరగ వలసినదానిని నిరోధించడము , ప్రకృతికి వ్యతిరిక్తంగా సాగినచో మానవ మనుగడ కష్టమవుతుంది – ఏ గమ్యము గూర్చి , ఏ లక్ష్యము గూర్చి సాధన చేయు చున్నాడో అధినేరవేరడము కష్టము – బ్రహ్మ విద్యలో చూపించిన ప్రాణాయామము ద్వారా సులువైన సుఖాసనములో కూర్చొని సులువైన ప్రాణాయామముతో ఆ ధరికిచేరాలి – అనుకున్న గమ్యము చేరి కావలసిన పలితముపొందాలి . ఈనాడు సమాజములో తమకు తోచినదే బ్రహ్మవిద్య అని చెప్పి ప్రజలను నానా అగచాట్లకు , మానసిక కల్లోలాల్లకు గురిచేస్తున్నారు అందు గూర్చి సరియైన సద్గురువును ఎంచుకోవాలి – సరియైన మార్గములో పయనించండి.
2) >> అపానే జుహ్వతి ప్రాణం
– ప్రాణే పానం తథాపరే – ప్రాణాపాన గతీ రుద్ధ్వా – ప్రాణాయామ పరాయణః . > అంటే కొందరు ప్రాణవాయువును అపాన వాయువులోను , అపాన వాయువును ప్రాణ వాయువులోను యజ్ఞము (ప్రాణ యజ్ఞము) చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తున్నపుడు కేవల మనే కుంభకముద్వారా ప్రాణము తాలూకు ఊర్ధ్వ , ఆదోగతులు ఒకానొక దశలో వాటంతట అవీ ఆగిపోయి ప్రాణాయామ పరాయణులవుతారు . > దీనివల్ల ఇంద్రియాల వృత్తులను అదుపుచేసి – మనస్సు యొక్క చంచలత్వను రూపు మాపుటకును శరీమును యొక్క ఆరోగ్యమును కాపాడుట కొరకును ప్రాణాయామము ఆవశ్యకమైనది ఇది పూరక,కుంభక, రేచక ములను మూడు విభాగములతో గూడి యున్నది – ఇది (ప్రణవము) ఆచరిన్హున్నప్పుడు ధైవభావన కలిగి ఉందురు-
ఈ ప్రాణాయామము వలన మనస్సు బహిర్ముఖత్వమును వీడి నిశ్చలముగా నుండును – ఏలయనిన ప్రాణమునకు , మనస్సునకు చాలా సన్నిహిత సంభందం కలదు – మనో నిరోధముచే ,ప్రాణ నిరోధము , ప్రాణ నిరోధముచే మనోనిరోధము సంభవించుచుండును – కాబట్టి మనస్సు యొక్క చపలత్వము పోతుంది – దీనిని అనుభవముకల గురువు దగ్గర నేర్చుకోవలెను –
>> భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ యజ్ఞాలలో- “ యజ్ఞానామ్ జపయజ్ఞోష్మి” జపయజ్ఞమునకే ప్రాధాన్యత కల్పించారు – “ వేదానాం సామ వేదోష్మి” అన్నారు – “ సామ “ అంటే ప్రాణ – ప్రాణుడి తోకూడిన జప యజ్ఞమే చేయమని చెప్పారు – యజ్ఞమనగా ఏమియో అసాధ్యమగు కర్మకాండ యని భయపడువారంధరికిని అభయ మొసంగి వాస్తవ యజ్ఞ తత్వమును భాహాటముగా చాటెను – వానిని ఆచరించు వారందరు యజ్ఞ వేత్తలే ( యజ్ఞవిదః ) అని భగవానుడు పలికెను – అనగా యజ్ఞము యొక్క తత్వము తెలిసిన వారని భావము – >> ఈ యజ్ఞము వలన పలితమేమి ? వానిచే అనేక జన్మల పాపములు నశించును – “యజ్ఞ క్షపిత కల్మషః “ అనేక జన్మలనుండియు మనస్సునకు పట్టివున్న కుళ్ళు ,పాచి తొలిగి పోవును –
> పాపమును తోలింగించు కొనుటకు ఈ యజ్ఞరూప పుణ్యాచరణమే శరణ్యము – “ నాపాపమేట్లు పోవును “ అని చాల మంది ప్రశ్నించు చుందురు – అందులకు భగవానుడే ఈ ఉపాయము యిచట సెలవిచ్చినారు – > > యజ్ఞములు అనబడు ఈ పుణ్య కార్యముల యొక్క అనుష్టానమే పాప హరణమున ఏకైక ఉపాయమని ఇచట స్పష్టముగా తెలుపబడినది –
> పాపము నశించనిచో చిత్తము శుద్ధము కాదు – చిత్తము శుద్ధి కానిచో – ఆత్మజ్ఞానము ఉదయించదు – ఆత్మజ్ఞానము ఉధయించనిచో – మోక్ష రూప పరమ శాంతి లభించదు – కాబట్టి మొట్ట మొదట పాపమంతరించ వలెను – అందులకై ఈ యజ్ఞమును ( బ్రహ్మవిద్య ప్రాణయజ్ఞమును) (ఇప్పుడు చేయువరకే సరిపోతున్న దన్నఆహాములో ఉండకుండా సరియైన పద్ధతిలో చేయాలి)
ముముక్షువులు తప్పక ఆచరించవలెను – జన్మ జన్మల కర్మల బంధ విముక్తికి వేరు మార్గము లేదు . >> ప్రాణ యజ్ఞము చేయువారు యజ్ఞములో వచ్చు “ యజ్ఞశిష్టామృత భుజః “ ప్రాణ యజ్ఞముచేయ్యగా వచ్చు “ అమృత “రూపమైన ( అశనము) అన్నమును భుజించువారు “ యాన్తి బ్రహ్మ సనాతమ్ అంటే “ సనాతనమ్ ” శాశ్వత మైన – పరబ్రహ్మమును పొందుదురు
–>> అట్టి యజ్ఞము చేయనివారికి ఇహలోకములో సుఖము లేదు – ఇక పరలోకమే పోని వారికి పరలోక సుఖమేక్కడిది ? ఆ పరలోకమునకు ఏకైక మార్గము ఒక్కటే . జనన మరణ రహితమగు శాశ్వత పర బ్రహ్మమును పొందే విధంగా ప్రయత్నించాలి – ప్రపంచములో ఎంతయొ శ్రమ పడినచో ఒకింత ధనమో , క్షేత్రమో , కీర్తో లభించు చున్నది – కాని అవి క్షణికములైనవి
– ఈ శరీరముతో పాటు నశించునవి – కాని అంతకంటే తక్కువ శ్రమతో ఈ యజ్ఞము చేసినచో సనాతనమైన , శాశ్వతమైన ఆ పరబ్రహ్మను , అమరస్వరూపమైన గమ్య స్థానమైన చేరుకోవచ్చని భగవానుడే ఇచట తెలుపు చున్నారు – అట్లు యజ్ఞము చేయక భుజించువాడు – పాపమును భుజించినట్లే – అట్టివానికి ఇహము లేదు పరము లేదు – అతనికి ఘోరపతనము – భయంకర ధుష్పలితము కలుగును-
> ఉత్త్మమైనః మానవజన్మను పొంది దైవవిచారణ చేయక నశ్వరములగు దృశ్య వస్తువులనే పట్టి వ్రేలాడు వారెట్టి అవివేకి ? – కనుకనే భగవానుడు ఇచట సత్కర్మ విముఖుల కీ ప్రకారముగా తీవ్రమగు హెచ్చరిక చేయు చున్నాడు – “ ఓ జీవులారా ! ఉత్తమమైన జన్మను బడసియు , సత్కార్యాముల నాచరింపక , పరమార్ద సాధన చేయకనున్నచో మీకు ఇహలోక సుఖము దక్కదు – పరలోక సుఖము అంతకంటెను దక్కదు “ కాబట్టి భగవద్వాక్యములందు విశ్వాసముంచి ,ప్రతివారును ఈ యజ్ఞములను తప్పక ఆచరించగలరు.
పైన చెప్పిన విషయాలన్నీ పెద్దలైన మీ అందరకు తెలుసు .ఈ చిన్నవాడు చెప్పినదాంట్లో ఏమైనా పొరపాట్లు వుంటే తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
11/12/2016
🌺 ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు 🌺
“బ్రహ్మవిద్య – దాని ఔన్నత్యం”
1)>> విధ్యలలోకేల్ల శ్రేష్టమైనది , అతిరహస్య మైనదియగు బ్రహ్మవిద్యను భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధముగా తెలిపినారు – దేనిని తెలుసు కొనినచో ఆశుభరూపమగు ఈ సంసార బంధమునుండి నీవు విదివడుదువో – అట్టి అతి రహస్యమైన , అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అర్జనుని ముందర పెట్టుకొని సమస్త మానవాళికి ప్రభోదించినారు “ గుహ్యతమం “ అనిచేప్పుట వలన ఈ భోధ రహస్యముయొక్క పరాకాష్టను సూచించు చున్నది – ఈ బ్రహ్మవిద్య పొందే అధికారము సమర్ధ వంతుడైన మనుజునికే కలదు – శుద్ధ చిత్తుని యందే బ్రహ్మ జ్ఞానము ప్రవేశించును – అసూయ , ఈర్ష్య , ద్వేషాలతో , రగిలే మలిన చిత్తునియందు ప్రవేశించదు – దంభ ,ధర్పాది దుర్గుణములు తొలగించుకొని నిర్మలముగా నున్నప్పుడే బ్రహ్మజ్ఞానము ప్రాప్తించును – >> అసూయ అనునది దుర్గుణములకు రాజు లాంటి వాడు – అది ఒక వేరుపురుగు వంటిది – వేరుపురుగు చేట్టునంతయు గుల్లచేయునట్లు అసూయ జీవునియందు ప్రవేశించినచో – అతడంత వరకు చేసిన సాధన అంతయు ఒక్క త్రుటిలో భ్రష్టము కాగలదు – కనుకనే పరమార్ధ రంగమున ఎంతయో సాధనచేసినవారుకూడా ఒక్కొక్కప్పుడు ఈ అసూయా రాక్షసికి బలియై తమ సాధన సర్వస్వాన్ని గోల్పోయి పతనమొందు చున్నారు – > అట్టి అసూయను పోగొట్టుకొని అర్హతను పొందినవారికి సద్గురువులు అతి రహస్యములైన అంశము లన్నింటిని బహిర్గతములు చేయుదురు – > జనన మరణ రూప ఆశుభమునుండి విడివడుటయే యగును – పుట్టుక , చావు ,దు:ఖము ,రోగము , ముసలితనము మొదలగు ఆశుభములతో గూడుకోనిన ఈ భయంకర సంసారమునుండి అది జనులను విముక్తులుగా జేయును – కావున దు:ఖమును పోగొట్టుకొన దలంచువాడు ఈ బ్రహ్మ విజ్ఞానమును తప్పక సంపాధించవలెను – జనులు ఈ సంసారమును జూచి ఏమో గొప్పగ తలంచుకోనుచున్నారు – కాని శ్రీ కృష్ణ పరమాత్మ దానిన0తయు “ అశుభముగ ” వర్ణించెను – ఏలయనిన అది అంతయు అసత్యమై , దృశ్యరూపమై , ఆత్మేతరమై , క్షణికమై , ఆశ్వరమైయున్నది – అశుభమును నాశ్రయించినవాడు ఆశుభమునే పొందును – శుభమును ఆశ్రయించినవాడు శుభమునే పొందును – ఈ ప్రపంచమున ఆత్మయోకటియే , దైవ మొకటియే శుభము – కావున దానినే ఆశ్రయించవలెను – అందువల్ల అశుభమునుండి అతడు విముక్తిని బడయగలడు –ఈ ప్రకారముగా జ్ఞాన విజ్ఞానముల నాశ్రయించు వారికి కలుగు ప్రత్యక్ష పలితము సంసారదు:ఖ రాహిత్యము , నిరతిశయ ఆత్మానందము ప్రాప్తి అయివున్నది – కాబట్టి విజ్ఞులేల్లరు అనుభవ పూర్వక బ్రహ్మ తత్వము నేరంగి బ్రహ్మవిద్యలో కొనసాగండి.
2) >>ఈ బ్రహ్మవిద్యను ప్రత్యక్షముగా తెలుసుకొనవచ్చును – అనుభూత మొనర్చుకోవచ్చును – ఇది ప్రత్యక్ష పలమునే కలుగ జేయునుగాని పరోక్ష పలమునుగాదు – ఏలయనిన , ఏక్షణమున సాధకు డీ బ్రహ్మవిద్యను అనుభూత మొనర్చు కొనుచున్నాడో – ఆ క్షణముననే అతడు సాక్షాత్ బ్రహ్మమే యగుచుండుట కనబడుచున్నది – కావున ఇది పలితమును కలుగ జేయునో , లేదో , యనుసందేహమునకు ఆస్కారములేదు – >“ సుసుఖం “ ఈ బ్రహ్మ విద్యను ఆచరించుట చాల తెలికయని చెప్పబడినది – మనస్సు నందలి దుస్సంస్కారములను , వాసనాజాలమును ప్రయత్న పూర్వకముగా తొలిగించుకొనినచో , ఇక స్వస్వరూప సాక్షాత్కారము నందు ఎలాంటి పరిశ్రమయులేదు – కనుకనే శాస్త్రములందీ ఆత్మానుభూతి పుష్పములను నలుపుతకంటేను – శ్వాసను పీల్చుట కంటెను గూడ సులభమని వచింప బడినది – బ్రహ్మానుభవము అతిసులబమైనది – ఈ ప్రకారముగా భగవానుడు గీతయందు సాధకులకు ధైర్యమును గోల్పుచున్నాడు – ఈ విద్య ధర్మములకు మూలమున్ను , సనాతనమున్ను ,అవ్యయమును , అయివున్నదనియు చెప్పబడెను – > దానియందు శ్రద్ధలేనివారు దైవమును భోందజాలరనియు – సంసార కూపముననే తిరుగాడుచుందురనియు వచించుచున్నారు – ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందని వారై – మృ త్యురూపమైన సంసార మార్గామునందే తిరుగు చున్నారు -> లౌకిక రంగమునందు గాని , పరమార్ధ రంగమునగాని – ప్రతి కార్యమునందును శ్రద్ధ చాల అవసరము – ఒకనికి ఒక వస్తువునందుకాని , ఒక కార్యమందుగాని ఎంతెంత శ్రద్ధ యుండునో అంతంత చక్కగా ఆ వస్తువు పలించుచుండును – ఆ కార్యము నెరవేరు చుండును – కనుకనే బ్రహ్మ జ్ఞానమునందు ఎవనికి శ్రద్ధ ఉండునో అతడు శ్రద్ధాపూర్వకంగా దానిని సాధనా చేసి నన్ను చేరగలరనియు – అట్లు శ్రద్ధ లేనివారు తన్నుపొంధజాలనివారై మృ త్యురూపమగు సంసారముననే పది తిరుగుదురని సెలవిచ్చెను – కావున విజ్ఞులగువారు చక్కగా యోచించుకొని , దు:ఖప్రధమగు సంసారమార్గమున పడక – ఆనంద ప్రధమగు ధైవసాక్షాత్కారమునకు బడయుటకు – శ్రద్దయను ఈ సుగుణమును చేపట్టి బ్రహ్మ విద్యను చక్కగా అనుష్టించి తరించవలెను – లోకమున సామాన్య కార్యములగు వంట , సేద్యము మున్నగునవి – చక్కగా జరుగుతకే ఎంతయో శ్రద్ధ అవసరమై యుండ ఇక బ్రహ్మ విధ్యాసాధనమున వేరుగా చెప్పవలెనా ? >> సామాన్యముగ కొందఱు జనులు భోగావిలాసములకు లోనై – ఈ సంసారమును స్వర్గ తుల్యముగా బావించుచుందురు – అమృత ప్రాయముగా దానిని వర్ణించుదురు – కాని సర్వజ్ఞుడగు పరమాత్మ దానిని మృత్యు రూపముగా వర్ణించెను ( మృత్యు సంసార వర్త్మని ) అదియే దాని నిజరూపము – మాయా ప్రబావముచే ఈ సంసారము పైకి “ డాబు “ గా కనిపించినను లోన మృత్యు రూపమే కలిగియున్నది – ఈ రహస్యమును భగవానుడు విపులీకరించేను – బాగుగా అలంకరింపబడిన శవమే ప్రకారముగా పైకి అందముగా గనుపించినను లోన క్రుళ్ళు , దుర్గంధము గలిగి యుండునో – ఈ సంసార స్థితియు అంతియే – కాబట్టి విజ్ఞులు దానిచే మోసపోక అమృతరూపుడగు పరమాత్మనాశ్రయించి ధన్యులు కావలయును–
>> పైన తెలిపిన విషయాలు మీ అందరకు తెలిసినవే ఏమైనా తప్పులువుంటే తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
11/19/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
*********************************
“ప్రాణ” 10 వ బాగము
*********************************
>> మోక్షసాధనముకు జ్ఞానము , జ్ఞానమునకు తపస్సు , తపస్సునకు యోగమార్గము ముఖ్యమే యైనను , మోక్షసాధనాకాంక్షులకు గూడా కర్మత్యాజ్యమున కవకాశములేదు – జీవి ధర్మ – కర్మల నంటియే సాగవలెను – అందు వలననే శ్రీ భగవద్గీత లో “ కర్మ” మరియు “ యోగము ” ఈ రెండింటి అగత్యము నొక్కి చెప్పుచూ “ కర్మయోగమే “ ఆవశ్యకముల చాటి చెప్పినది – యోగము వలనగాని – కర్మ రహిత యోగము వలనగాని , మోక్ష సాధన అసాధ్యము అందుననూ కర్మభ్రష్టున కెప్పుడూ మోక్షము సిద్ధించదు . >> మోక్ష సాధనకు అనేక మార్గము లున్నవనుట కేవలము తెలివి తక్కువ తనము – > “ అందునిమిత్తము వున్న మార్గము ఒక్కటే “ ఏకైక మార్గము యనుట అనుభవ మహాత్ములందరి అభిప్రాయము – అందరిలోవున్న ప్రాణుడు ఒక్కడే యైనప్పుడు దాని సద్గతికి అగత్యమైన సాధనయూ ఒక్కటే ఉండవలెననుట ప్రతియొక విచారవంతునకు తెలియవలసిన అంశం . >>మనము జీవనము నందు ఏమి చేయ నెంచినను , మన దేహమున ప్రాణమున్నంతవరకే అది సాధ్యపడునుకదా ? కావుననే పూర్వీకులు “ ఆ ప్రాణుని వైపు లక్ష్యముంచి మీలో ప్రాణ ప్రతిష్ట చేసుకోనుడు , ప్రాణ లింగపూజ చేసి , మిమ్ము మీరు తెలుసుకోనుడు “ – ఆ ప్రాణుడు మీ హృదయమున నెలకొని “ ఈశ్ “ యనెడు శబ్దముతో ఆడి , ఆడించుచున్న ఆ ఈశ్వర చైతన్యముతో కూడియున్నాడు – సర్వవ్యాప్తి యైన ఆ ఈశ్వర సేవ నాచరింపుడు ఆ వాయు జీవోత్తమునే మొదటి ప్రత్యక్ష బ్రహ్మయని యెరంగి సేవింపుడు ” అని వక్కానించినారు – >> ఆ మర్మము ఎరుంగకనే మనము బాహ్యము నందు ఏమోమో చేయు చున్నాము – “ ఆరోగ్యవంతముగా పూర్ణ జీవనమును అనగా 120 యేండ్ల కాలము ధర్మ – కర్మ బద్ధతతో బ్రతుకుడు , అయినను మిమ్ము మీరేరింగి , పరమ పదవిని బడయుట సాధ్యము “ అని ఉపనిషత్తులు ఉద్ఘోషించినవి .>> ఇది జరుగవలేననిన మీ ప్రాణునకు ఆయామము కావలెను – ఈ క్రమము నెరుంగుడు – ఈ ఆయామ క్రమము సర్వమతముల మూలమైన “ ఓం “ నందున్నది – అది నోటితో ఉచ్చరించుట కాదు – దానిని >“ ప్రణవ “శంఖము ద్వారా ప్రాణుని గతాగతి సలుపగా వినబడు ” ఓంకారమే ప్రణవము “ శంఖ మనగా స్థూలమైన వాద్య పరికరము కాదు – ఇది దేహమంధలి యొక స్థానము – ఇది తెలిసిననే విషకంటమును – శ్రీకంటముగా నోనర్చుకొని – మృత్యుంజయులు అవుటకు – త్రివేణి యందు మునిగి – సరస్వతిని ఆశ్రయించి – నిజమైన గాయత్రీ రహస్య అర్ధము తెలుసుకొనినచో బ్రహ్మత్వము నేరుంగుటకు సాధ్యపడును . > దాని వేర్వేరు స్తితులంధలి శబ్ధములనే , హ్రాం , హ్రీం , శం , భం , యిత్యాది మంత్రములుగా వర్ణించియున్నారు – దీని నేరుంగుటకు “ ప్రాణా యామమే “ సాధనము .
2) >>ప్రాణాయామ మనుపేరున ముక్కు – నోరు మున్నగు యింద్రియముల ద్వారా నేమోమో కుచేష్ట లోనర్చు కృత్త్రిమ పద్ధతులు అనేకము ప్రచారమునందున్నవి – అట్టిది ప్రాణాయామము కాదు – ప్రాణహింస ! గ్రంధ వాసనలతో ఆరీతి చేయసాగి – తల చెడుపు కున్నవారు – అనేక రోగముల పాలైనవారు ఉన్నారు – నిజమైన ప్రాణాయామం వలన ఎలాంటి కీడు రానేరాదు – అంతే కాదూ సర్వరోగములూ తమంతటనే అవి నివారణమై – ఇచ్ఛా మరణత్వమునూ బడయవచ్చును ! – చిరంజీవియూ కావచ్చును ! – >ప్రాణ మన దేహము లోపల ఉండుట వలన అందు కావశ్యకమైన ఆయామ పద్ధతియూ దేహము లోపలనే వినా బయట కాదు – ఆ ఆయామ మునకు బయటి గాలి అవసరము లేదు గర్భస్థ శిశువునందు ప్రాణుడు నాభి నుండి బ్రహ్మరంధ్రము వరకు గతాగతి యందు౦డును – ఇదే సహజమైన ఆయామ స్థితి – జననమైన తరువాత ఈ సహజస్థితి బయటగాలి – నీరు , ఆహారం ఇత్యాది మాలిన్యములచే తప్పిపోయి నందున ఈ ఆయామమును మనము పున్నః ప్రయత్న పూర్వకముగా చేయవలసి ఉన్నది – ఇదే యోగ సాధన ఇప్పటి వారికిది అర్ధము గాక తమలో వెదుకుట మాని , బయట వెతుకుచున్నాడు – అట్టివారి ప్రయత్నమునకు అర్ధము లేదు – నిరర్ధకము – ఫలితము లేదు – కాలగమనము గడిచిపోతుంది – అందు గూర్చి నిజమైన బ్రహ్మ విద్యలో చెప్పబడిన తీరుగా ప్రాణా యామము జరిపి – ప్రాణ ప్రతిష్ట జరుపుకొని – ప్రాణ మనోమిలనము ద్వారా – ఆత్మను సాక్షాత్కరించుకొని – దైవ దర్శనం పొందాలి – > మహా పురుషులు చెప్పిన మహా వాక్యములను అర్ధం చేసుకోవాలి – “ తట్టు – తెరచును:- చూడు – అగుపడును – అడుగు – ఇచ్చును ” “ఎత్తైన చోట ” – నిలిచి కూత వేయును :- మున్నగునవి ఈ ప్రాణ యామపు స్థితినే నిర్దేశించున్నవి – ఈ సాధనను “ బ్రహ్మవిద్య ” యనియు పేర్కొన్నారు – > ఈ బ్రహ్మ విద్యను చదివినా గాని – మినిన గాని ఎరు౦గుట అసాధ్యము – యోగమునందు జీవాత్మల ఐక్యమునందు దిగి వచ్చు అమృతమును పాన మొనర్చిన యోగికి తెలియని విషయమూ లేదు – సాధ్యము కాని కార్యమూ లేదు – ఇది అనుభవజ్ఞుల మాట – .
3) >> మరియు ఓంకారము భగవంతుని యొక్క సర్వ శ్రేష్ట నామము – ఇది సర్వ వేదములకు మూలము – సమస్త మంత్రములకు ప్రాణ భూతమైనది – ఈ పవిత్ర నామోచ్చారణ చేయవలెను – మరియు ఈ ప్రణవో చ్చారణము ప్రధమమున ఉచ్వాస నిశ్వాసములను నరికట్టును – మనస్సును లక్ష్యమున భందించివైచును – కనుక దీనినే పాప సమూహము ప్రజ్వలితాగ్నికణముచే తూల రాశివలె భస్మీభూత మొనర్చబడును – ఇట్టి విద్యని ఏ సమయమున చేయవచ్చునో – ఎలా చేయ వలనో – అని ఎలా చేయ వచ్చునో అనే సందేహము లేకుండా ఈ ప్రాణను సదా స్థితిలో ఉంచాలని- కలిస న్తరణపనిషత్తు నందు బ్రహ్మ – నారద స౦వాధ రూపముగా తెలుప బడిన దానిని గమనింపుడు – ఈ ఓంకార ఉచ్చరణ ఎట్టి విదియను లేదు – బ్రహ్మ భావమును పొందదలచినవాడు – శుచియై గాని – అశుచియై గాని – సర్వదా భగవన్నామమును పటించు చున్నవాడై సమీపత్వమును – సాయుజ్యత్వమును పొందును –>> “రత్య న్తరే మూత్ర పురీష యోర్వా – చ౦డాల వేశ్మ న్వథవా శ్మశానే ! – కృత ప్రయత్నో ప్యకృత ప్రయత్నః – సదా స్మరేత్కే శవనామదేయం” !! అనగా దీని భావము రతి మధ్య కాలమున గాని – మలమూత్ర విసర్జన – సమయముల యందుగాని – – చండాల గృహమున గాని లేక – స్మశానమున గాని మరియు స్నానాదికముచే శుచియై గాని – ఏదియును లేక అశుచియై గాని – ఇధి అది అని అనకుండా ఎల్లపుడునూ భగవన్నామమును సదా స్మరించవచ్చును అని తెలపబడినది – >> “ శుచిర్వాప్యశుచి ర్వాపి యో జపే త్ప్రణవం సదా ! – స న లిప్యతి పాపేన పద్మపత్ర మివాంభాసా” !! అంటే శుచియై గాని – అశుచియై గాని ఎవ్వడు సర్వదా ప్రణవమును జపించునో – అతడు నీతితో తామరాకు మాదిరి పాపముతో నంటడు – ఈ రీతిగా శ్రుత్యాదులు బలికినవి – కాబట్టి భగవన్నామోచ్చారణము – ఆచరించుటకు దేశ కాలాదుల జూడ పనిలేదు – ఎట్టి దశలో నొనరింపబడినను అది పాపము హరించి పవిత్రున్ని జేయును – సందేహము లేదు – కనుక ముముక్షువులు భగవన్నామమును భక్తీ శ్రద్దలతో నుచ్చరించి – పరిశుద్దాత్ములై – భగవంతుని అనుగ్రహమునకు పాత్రులై తరింతురు గాకా – ఓం
>>పై విషయాలన్నీ మీ అందరకు తెలిసినవే – ఏమైనా పొరపాట్లు వుంటే తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
11/27/2016
🌹ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు🌹
************************************************
“బ్రహ్మ విద్య – దాని ఔన్నత్యము” 2 వ బాగము
************************************************
1) “అవజానన్తి మాం మూడా – మానుషీం తనుమాశ్రితమ్ – పరం భావమజానన్తో – మమ భూతమహేశ్వమ్ “నాయొక్క పరమతత్వమును ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడును , లోక సంరక్షణార్ధము , మనుష్య దేహమును ఆశ్రయించినవాడను నగు నన్ను అవమానించు చున్నారు , అలక్ష్యము చేయుచున్నారు.
>> పరమాత్మ సమ స్తభూతకొట్లకు నియామకుడు,ప్రభువు,ఈశ్వరుడు – ధర్మోద్ధరనముకోరకు, లోక సంరక్షణ కొరకు అపుడపుడు లోకమున అవతరించుచుండును – అట్లు మనుష్య దేహమును గ్రహించి లోకమున అవతరించిన సాక్షాత్ భగవానుని మూడులు తెలిసికోనజాలక, ఎవరో సామాన్యుడని తలంచి అతనిని అవమాని౦చుచున్నారు – నిర్లక్ష్యముచేయుచున్నారు – అతని పరతత్వమును వారు గ్రహించుట లేదు అట్టివారిని “మూడులు” అని శ్రీ కృష్ణ పరమాత్మ సంబోధించెను – ఏలయనగా,ఒకింతైనను వివేకముకలవారు అట్లు పరమాత్మను ద్వేశింపరు – కొందరు జనులు అహంభావపూరితులై, తమ ధనజ సంపదాదులను, అధికారమును జూచుకొని గర్వులై కన్ను మిన్ను తెలియక మహాత్ములను, సాధుపుంగవులను దూశించుచుందురు – హేలనచేయుచుందురు – శిశుపాల, దుర్యోధనాడులీ తెగలోనివారు – కనుకనే వారు దుష్ఫలితముల ననుభవించిరి.
>> ఆధ్యాత్మిక సాధనాలు చేయువారికి తమ జీవితములో నిందాస్తుతులకు గురియగు సందర్భములు కొన్ని తటస్తింపవచ్చును – అట్టి సందర్భములలోను ఎంతయో సహనము గల్గి తమయందేవేని దోషము లున్నచో తొలగించుకొని, ఏ దోషములు లేనపుడు గంభీరచిత్తులై ఆ యాని౦దలకు జంకక నుండువలెను – లోకులలో కొందరి స్వభావ మిప్రకారముగానే పరనిందాత్మకముగను౦డునని తలంచి మనః స్థిమితము గల్గియుండవలెను – సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్మయే అవివేకుల నిర్హేతుక నిందలకు గురి అయినపుడు ఇక సామాన్యుల విషయము వేరుగా చెప్పవలెనా? అని ఇట్లు తలంచి ధైర్యము తెచ్చు కొని సహనశీలురై యుండవలెను – మాయయోక్క స్వభావమిట్లే యుండునని గ్రహించి నిశ్చల చిత్తులై యుండవలెను – ఎవరిని ద్వేశి౦పరాదు – ఎవరైనా అవివేకులు భగవంతుని గూర్చి నిందాపూర్వకముగా పలికినచో ఆ వ్యాకములను ముముక్షువులు లక్ష్య పెట్టక అట్టి నాస్తికుల వచనములను విశ్వసింపక భగద్భక్తిని అబివృద్ధి పరచుకోనుచు, తద్వారా వారికి చక్కని బుద్ధి గరపవలెను.
2) “మోఘాశా మోఘకర్మానో – మోఘజ్ఞానా విచేతనః – రాక్షసీమాసురీం చైవ – ప్రకృతిం మోహినీం శ్రితాః ” అంటే అట్టివారి వ్యర్ధములైన ఆశలుగలవారును, వ్యర్ధములైన కర్మలుగల వారును, వ్యర్ధమైన జ్ఞానము గలవారును, బుద్ధి హీనులను అగుచు రాక్షస సంభంద మైనదియు, అసుర సంబంధమైనదియునగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు –
>> జనుల ప్రకృతి స్వభావము సామాన్యముగా రెండువిధములుగా నడుచుచుండును –
(1) దైవీ ప్రకృతి
(2) ఆసురీ ప్రకృతి – అని అందు ఆసురీ ప్రకృతిగల వారిని గూర్చి క్రిందటి శ్లోక మునందు, ఈ శ్లోకమందును తెలియజేసిరి – దైవీ ప్రకృతి గలవారిని గూర్చి రాభోవు శ్లోకమున చెప్పుదురు – – ఆసురీ ప్రకృతి గలవారు వ్యర్ధములైన ఆశలు, కర్మలు గలిగియు౦దురు – వారికుండు ఒకింత జ్ఞానమున్ను నశ్వరములగు దృశ్య వస్తువులను గూర్చి నదియె ఉండునని ఆదియు పరమార్థ ద్రష్టియందు నిష్మలమైనదియే యగును – వారి చిత్తమందు సత్య వస్తువు (ఆత్మ) ను గూర్చిన పరిజ్ఞానముకాని, వివేకముగాని ఒకి౦త యైనను ఉండదు – కనుకనే వారు విచేతనులు ( brainless people) గ చిత్తము చెడిన వారుగా ,బుద్ధిహీనులుగా వర్ణింప బడిరి – మరియు అట్టివారు రాక్షస సంబంధ మైనదియు – మొహపెట్టునదియు , అనగా అజ్ఞానమున పడ ద్రోయునదియగు స్వబావమునే ఆశ్రయి౦చు చుందురు – ఇచ్చట ”రాక్షసీం“ మరియు “ఆసురీం“ అను రెండు పదములకు ఒకే చోట ప్రయోగించుటవలన వారి క్రూర స్వబావము – రాజస, తామస స్వభావము – లెస్సగ వ్యక్త మొనర్ప బడినట్లైనది. అట్టివారు పరమార్ధ దృష్టి యందు ఎందుకు పనికి రానివారే యగుదురు – కనుకనే వారి బ్రతుకు మోఘపు బ్రతుకని ( వ్యర్ధజీవితమని ) భగవానుడిచట స్పష్టముగా చెప్పెను – అందులకే “ మోఘ “ మను పదమీ శ్లోకమున వరుసగా మూడు పర్యాయములు ప్రయోగింప బడినది – మిథ్యా రూపములైన దృశ్య వస్తువులనే పట్టి వ్రేలాడుచు సత్యమగు పరమాత్మను విస్మరించువారి జీవితము నిజముగా వ్యర్ధమేయగును –
>> కావున జనులు రాక్షస ప్రకృతిని , అసురస్వబావమును , కామాది దుర్గుణములను, రాజస తామస ప్రవృత్తులను పారద్రోలి దైవీసంపత్తిని ఆశ్రయించి సత్యవస్తు వగు పరమాత్మను నమ్మి తమతమ జీవితములను సార్ధకము చేసికొనవలయును – ఈ శ్లోకమందు అజ్ఞానులు వ్యర్ధమగు జ్ఞానము గలిగియు౦దురని చెప్పబడెను, గావున విజ్ఞులగు వారు తద్వీరుద్ధమగు ఆచరణనే స్వీకరించుచు అనగా దైవమును గూర్చిన ఆశ, దైవమును గూర్చిన కర్మ, దైవమును గూర్చిన జ్ఞానమునే కలిగియుండి విగతచిత్తులు కాక “ శేష చిత్తులై ” దైవ చిత్తులై మెలగ వలయును.
3) “మహాత్మానస్తు మా౦ ప్రార్ద దైవీం ప్రకృతిమాశ్రితాః – భజన్త్య నన్య మనపో జ్ఞాత్వా భూతాదిమన్యయమ్ ”ఓ అర్జునా ! మహాత్ములైతే దైవీ ప్రకృతిని ( దేవ సంభందమైన స్వభావమును ) ఆశ్రయించినవారలై, నన్ను సమస్త ప్రాణులకును ఆదికారణునిగను – నాశరహితుని గాను
>> క్రిందటి రెండు శ్లోక ములందును ఆసురీ ప్రకృతిని ఆశ్రయించువారి స్వభావ మేట్లుండునో తెలుపబడినది – ఈ శ్లోకమందు,రాబోవు శ్లోకమందు దైవీ ప్రకృతి నవలంబించు వారిలక్షణములు వివరింపబడినవి – దైవీప్రకృతిని, సత్వగుణమును ఆశ్రయించిన మహాత్ములు పరమాత్మను అనన్య చిత్తముతో సేవి౦చుచున్నారు – ఎందులకు సేవుంచు చున్నారు ? వారు పరమాత్మ యందు రెండు విశిష్ట గుణములను చూచిరి – అవియేవి యనిన (1) అధికారణత్వము (2) అవ్యయత్వము – భగవానుడు సమస్థ చరాచర ప్రపంచమునకు ఆదికారణుడని , నాశరహితుదని వారేరిగిరి – ఇట్టి మహాత్తర గుణములు మరి యేయితర పదార్ధమందుగాని , వ్యక్తియందుగాని లేవు – పరమాత్మ సనాతనుడు, అనాదిస్వరూపుడు – తక్కిన పదార్ధములన్నియు ఆధ్యంతములు గలిగియున్నవి – కావున అవి అల్పములు – పరమాత్మ అవ్యయుడు నాశనము లేనివాడు – తక్కిన వన్నియు నాశవ౦తములు – క్షయిష్ణువులు – పుట్టుక , చావు కలవి – ఈ ప్రకారముగా మహనీయులు దృగ్ధ్రుశ్య పదార్ధశోధనము కలవారై దేనిస్వభావమేట్లుండునో బాగుగా విచారించి , దృశ్యమును నశ్వరముగను , పరమాత్మను శాశ్వతునిగను ఎరిగి చరాచర జగత్తు నందు అతనితే పరమోత్క్రుష్ణుడని నిశ్చయించి అనన్య చిత్తముతో నాతనినే నేవించు చున్నారు –
>> “అనన్యమనసః ” — మనస్సు మరియొక దాని యందు సంలగ్నముకాక ఇతర వ్యాపకములేక ఒకేదేయమునందు నిలుకడ కలిగి యున్నచో దానిని అనన్య మనస్సందురు – అట్టి అనన్య మనస్సుతో పరమాత్మను ధ్యానించవలెననిన, ఇతర వస్తువుల యొక్క నశ్వరత్వాది దోషములు, పరమాత్మ యందిలి శాశ్వతత్వాది సుగుణములు బాగుగా గ్రహించి యుండ వలెను – కనుకనే ఇచట “ జ్ఞాత్వా ” అని చెప్పా బడినది – ధ్వేయ వస్తువు యొక్క పరిజ్ఞానము గలిగి ఉన్నప్పుడే దానిపై విశ్వాసమేర్పదగలదు – అప్పుడు మాత్రమే దానిపై అనన్య మనస్సు సంభవించ గలదు – అట్లే దృశ్య వస్తువుల యొక్క దోషములను విచారించియు – వానియెడల విరక్తి గలిగివుండినచో ఇక మనస్సు బయటకు పరుగెత్తక అంతర్ముఖమై ఒకే పరమాత్మయందు నిలుకడ గలిగియుండును – చిత్తమునందు అనన్యత్వము చక్కగ ఏర్పడగలదు .>> “ మహాత్మానః “ – మహాత్ముడనగా నేట్టివాడో ఈ శ్లోకమున చక్కగా విశదీకరింప బడినది “మహాత్మా“ అనునది ఒక భిరుదు అది ప్రయత్నముచే ప్రతి వారికిని లభ్యము కాగలదు – 1) ఎవరు దైవిప్రకృతిని ఆశ్రయించి వుందురో -2) భగవానుని నాశరహితని గాను, ఆదికారణునిగను ఎఱీగి వుందురో – ౩) అనన్య మనస్కులై అతనిని ధ్యానించుదురో అట్టి వారు మహాత్ములు కాగలుగుదురు- కాబట్టి మహాత్మత్వమునకు , జాతి మత కుల గోత్రాదులతో పనిలేదు – ఎవరైనాసరే పైన దేల్పిన సల్లక్షణములు గలిగియుండినచో వారు మహాత్ములే యగుదురు – అసుర ప్రకృతిని ఆశ్రయించువారు – కామ క్రోధాదులు కలవారు భగవంతుని ఏకాగ్ర చిత్తముతో భజి౦పనివారు మహాత్ములు ఎన్నటికి కానేరరు – వారు అల్పాత్ములు – దురాత్ములే అగుదురు- >> లోకములో భగవంతుని గూర్చి ధ్యానించువారు చాలామంది యుండవచ్చును గాని అనన్య మనస్సుతో ధ్యానించువారు చాలా అరుదు – మనస్సులో కొంతబాగము దృశ్యము పైనను , కొంత బాగము మనస్సుతో మార్కెట్ వ్యవవారాలలో , కొంత బాగము దైవము పైనను వారికి వ్యాపించు చుండును – అట్టి వారు భగవత్ తత్వమును ఇంకను బాగుగా తెలుసుకొని , అతని మహిమను లెస్సగ గుర్తెఱీగి క్రమముగా దృశ్య చింతను తొలిగించి అనన్య చిత్తముతో దైవమును సేవి౦చుటను అభ్యసించ వలెను – మనస్సు నందు నూటికి నూరుపాళ్ళు దైవత్వము(100 %) ఉండు లాగున చూడవలెను – అట్టి మనస్సు ఇక మనస్సుగానుండక చిద్రూపముగా , దైవ స్వరూపముగా ,సత్వముగా మారిపోవును అట్టి స్థితి సాధకులకు కలుగవలెను.
4) “సతతము కీర్తయన్తో మాం –యతన్త శ్చ ద్రడవ్రతాః – నమస్యన్త శ్చ మాం – భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ” దైవీ ప్రకృతి గలవారు ఎల్లప్పుడు నన్ను గూర్చి కీర్తించుచు , దృడవ్రత ( చలింపని ) నిష్టులై ప్రయత్నించుతూ భక్తితో నమస్కరించుచు , సదా నాయందు చిత్తముంచిన వారలై నన్ను సేవించు చున్నారు – >>మహాత్ములగువారు పరమాత్మను అనన్య మనస్సుతో సేవింతురని పై శ్లోకమునందు చెప్పబడినది – ఎట్లు సేవింతురో ఆ పద్ధతి ఇచట తెలుప బడినది – సర్వాకాలా సర్వావస్థల యందును వారు భగవంతున్ని స్మరించు చుందురు – సదా కీర్తించు చుందురు – “సతతం“ అని చెప్పినందువలన ఏదియో యొక సమయమున స్మరించుట , కీర్తించుట కాదనియు – నిరంతరము స్మరించుదురనియు తెలియు చున్నది – నిరాకార భక్తి కలవారైనచో హృదయమున ఆ పరమాత్మను గూర్చిన ( ప్రాణ ) స్మరణ మనన నిధి ధ్యాసనములను గావించు చుందురు . >> వారు భగవత్ ప్రాప్తికై సదా యత్నశీలురై యుందురు – ఇంద్రియ నిగ్రహధులను అభ్యసించు చుందురు – సోమరులై యుండరు – సదాప్రయత్న శీలురై యుందురు – ప్రయత్నశీలురకు మాత్రమే ధైవపధము లభ్యమగును కాని – తదితరులకు గాదని ఈ “ యతన్తశ్చ “ అను పదమువలన సుస్పష్టము అగుచున్నది – తీవ్రమైన ప్రయత్నము లేనిచో ప్రాపంచిక వస్తువే సిద్ధింపక యుండ ఇక దైవ వస్తువును గూర్చి వేరుగా చెప్పవలెనా ? వారు చేయునది సామాన్య ప్రయత్నము కాదు – “ దృడ వ్రతముల “ ల చలింపని దీక్షతో అవలంబించి గొప్ప పట్టుదలతో పరమార్ధసాధనములను గావించుదురు . దృడ వ్రతములు ఉండ వలెను కాని – దుర్బల వ్రతములుగ ఉండరాదు – అనగా వానిని మధ్య మధ్య భంగ మొనర్చరాదు – వ్రతముల యందు , నియమములందు , పరమార్ధ నిస్టయందు ఇట్టి ద్రుడత్వము లేనందువల్ల అనేకులు ఈ మార్గమున ప్రవేశి౦చియు – బలవత్తరమగు మాయచే పరాజితులై వెనుకకు మరలి పోవుచున్నారు – మాయ భయంకరమైన శత్రువు . అది సామాన్య ఆయుధములకు లొంగదు – కావున దృడ వ్రతములను దివ్వాస్త్రములచే దానిని ఓడించవలెను. – >> “ నిత్యాయుక్తా “ అని చెప్పుటచే వారు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని యందు చిత్తమును నెలకొల్పుదురని స్పష్టమగు చున్నది – అయితే “భక్త్యా” అను పదమును గూడ చేర్చినందువల్ల వారు చేయు వందనముగాని ధ్యానముగాని నిర్మల భక్తితో గూడి యుండునదియే యగునని తెలియు చున్నది -భగవంతున్ని ధ్యానించువారు పెక్కురుండ వచ్చునుగాని – భక్తితో ధ్యానించు వారు చాల అరుదు – ఈ ప్రకారముగా నిరంతర దైవ స్మరణము , ధృడ వ్రతత్వం, భక్తితో గూడిన నిరంతర ధ్యానము భగవత్ సాక్షాత్కారమునకు మార్గములని వెల్లడి యగుచున్నది – కావున సాధకలు ఇట్టి ఆచరణను సూక్ష్మంగా పాటించి బ్రహ్మ సాయుజ్యము భో౦ధగలరు.
పైన చెప్పిన విషయములన్ని మీ అందరకు తెలిసినవే – ఏమైనా పొరపాట్లు ఉంటె తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
12/18/2016
🌹 “ ఓం శ్రీ అచ్యుతార్పణ మస్తు “🌹
**********************************
“మనస్సు” 7 వ బాగము
**********************************
ప్రతి మానవునికి మనస్సును స్వాధీనము చేసుకోవాలన్న బలమైన సంకల్పము ఉండాలి – అధివున్నట్లైతే మనసత్వ శాస్రజ్ఞానము ఉపయోగ పడుతుంది – అందుకు మనం దానికోసము నిర్దేశించి బడిన సాధనలను క్రమబద్ధంగా అభ్యాసము చేయాలి – మనము చేసే కొన్ని పనులవల్ల , మనకున్న కొన్ని ఇష్టాయిష్టాలవల్ల , ఆలోచనా విధానాల వల్ల మనస్సును స్వాధీనము చేసుకోవడాన్ని దాదాపు అసాధ్యము చేసుకుంటాము – అవేమిటో తెలుసుకోవడము మనకు ఎంతగానో ఉపయోగ పడుతుంది – ఎందుకంటే అప్పుడు మనము వాటిని మానివేయవచ్చు –
>> మనకు బలమైన ఇష్టాయిష్టాలు , a) రాగద్వేషాలు ఉంటె మనస్సును స్వాధీనము చేసుకోలేము – b) నీతిలేని జీవితాన్ని గడిపితే మనస్సును స్వాధీనం చేసుకోలేము – c) నిష్కారణంగా ప్రక్కవాడికి హానిచేసే అలవాటు ఉంటె మనస్సును స్వాధీనము చేసుకోలేము – d) మత్తు పదార్ధాలు సేవించే అలవాట్లు ఉన్నా , నిలకడలేని గజిబిజి జీవితాలను గడుపుతున్నా , అంటే ఉదాహరణకు తినడం , త్రాగడము , మాట్లాడటము , పనిచేయట ము, నిద్రపోవడము – వీటిల్లో దేన్ని అతి ఎక్కువగా చేసినా లేక అతి తక్కువగా చేసినా మనస్సులను స్వాధీన పరచుకోలేము – e) అలవాటుకొద్ది అనవసరపు వాదోపవాదాలు చేయడము , అనవసరంగా ప్రక్కవారి వ్యవహారాలలో తలదూర్చడము , వారి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడము, ప్రక్కవారిలో తప్పులను ఎలా ఎత్తి చూపాలి అని ఆతురతగా ప్రయత్నించడం – ఇటువంటి అలవాట్లు ఉంటె మనస్సును స్వాధీనము చేసుకోలేము – f) శరీరాన్ని విపరీతంగా శ్రమ పెడుతున్నా ,అర్ధములేని ఆధార్శాల కోసముఅర్రులు చాస్తున్నా , కఠినమైన మౌనవ్రతాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నా , అహంకారముతో అమితంగా గర్విస్తున్నా , మనస్సును అంత సులభంగా స్వాధీనము చేసుకోలేము – g) మన శక్తి యుక్తులకు మించిన పదవులను సాధించడానికి ప్రాకులాడుతున్న , ఇతరుల ఐశ్వర్యాన్ని చూచి ఈర్ష్య పడుతున్నా , ఎల్లప్పుడూ మనము అనుకున్నదే సరైనదని భావిస్తూన్నా, మనము మనస్సులను సులభంగా చేసుకోలేము . h) ఏదో తప్పుచేశామన్న భావన మనస్సులో ఉంటె మనస్సును స్వాధీనము చేసుకోలేము – కాబట్టి అటువంటి భావాలను మనలోనుంచి పూర్తిగా తోలిగించుకోవాలి – ఇటువంటి భావాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గము ఉంది – చేసిన తప్పులకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడడంతో పాటు అటువంటి తప్పులను మళ్ళీ చేయకుండా ఉండటానికి కావాల్సిన సంకల్ప శక్తిని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్ధించడమే దీనికి సరియైన మార్గము –
>> i) మనస్సును స్వాధీనము చేసుకోవడములో విజయం సాధించాలంటే , గట్టి సంకల్పశక్తితో పాటు ఆత్మ విశ్వాసము కూడా ఉండాలి – భగవద్గీతలో శ్రీ కృష్ణభగవానుడు మనిషి తన బలహీనతలను తానే అణిచి వేసుకొని తనను తానే ఉద్ధరించుకోవాలని భోదించాడు – మనస్సును స్వాధీనము చేసుకోవాలనుకునే వారు ఈ భోదనను తప్పనిసరిగా అనుసరించి ,అభ్యసించాలీ –
>> j) మనస్సును మనస్సుతోనే స్వాధీనము చేసుకోవాలి – మనస్సును స్వాధీనము చేసుకోవదములో ఎదురయ్యే చిక్కులు , అడ్డంకులు మన మనస్సు సృష్టించినవే , తెచ్చిపెట్టుకున్నా (కృత్తిమ) పద్ధతులతో కొద్ది సేపైనా మనస్సును స్వాధీనములో ఉంచడము అసాధ్యము – ప్రయత్నపూర్వకంగా , ఓపికగా , తెలివితేటలతో , క్రమ శిక్షణతో కస్టపడి పనిచేయడము ద్వారా ప్రయోగ పూర్వకంగా పరీక్షింప బడిన పద్ధతులను అనుసరించి , అభ్యశించడము ద్వార మాత్రమే అది సాధ్యమవుతుంది –
2)>> సాధించభోయే పని మీద సరియైన అవగాహానా అవసరము – >> మనస్సును స్వాధీన౦ చేసుకోవడానికి ఏ విధమైన చిట్కాలు , అడ్డ దోవలు లేవు – ఈ విషయాన్ని స్పంస్టంగా అర్ధము చేసుకోవాలి – పూర్తిగా ఒప్పుకోవాలి – మనస్సు చాలా సున్నితమైన పనిముట్టు , అతితేలివితో , కుయుక్తులతో , తొందర పాటుతో దాన్ని సాధించడానికి ప్రయత్నించవద్దని హెచ్చ్చరిక – మనస్సును చాలా జాగ్రత్తగా సంభాలించాలి – ఈ పనిని పూర్తిగా మనకు మనమే చేసుకోవాలి – డబ్బు పుచ్చుకొని వేరే ఎవ్వరు మనకు ఈ పనిచేసి పెట్టలేరు – ఇది మన సొంత పని – తప్పనిసరిగా దీన్ని మానకూ మనమే చేసుకోవాలి – వీటికి తోడు ఈ పనిని చేయడానికి మనకు గొప్ప ఓరిమి కావాలి – >>మనస్సును క్రమంగా ఒక పద్ధతిలో స్వాదీనములోకి తెచ్చుకోవాలి – నెమ్మదిగా , పట్టుదలతో , ఏడతెగని పరిశ్రమతో మన సంకల్ప బలపరచుకోవాలి – ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు – >> ఈ రోజు ప్రయత్నించి రేపు వదిలేసే “ పాషన్ “ ,నాగరిక విలాసము కాదు – ఇదొక జీవిత కార్యము( జీవితకాలమంతా పట్టే కార్యము ) అంతే కాక దీనిద్వారా మనము సాధించభోయే గమ్యము కోసము ఎంత కష్టపడ్డా అది సమంజసమే – ఎందుకంటే అది ధైవసాక్షాత్కారమే గనుక – అటువంటి గమ్యాన్ని మనం తప్పక చేరగలమని తెలుసుకున్న తరవాత దానికోసము ఎంత వెచ్చించిన అది తక్కువే అవుతుంది .
3) >> అంతరంగములో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి ->>మనస్సును స్వాధీనము చేసుకోవడానికి కావలిసిన సాధనలను చెయ్యాలంటే దానికి తగిన ఒక అంతరంగిక వాతావరణాన్ని సృష్టించడం అవసరము – అందుకు మానవ జీవితములో ఎదురయ్యే కొన్ని తప్పనిసరి విషయాలను విధిగా అంగీకరించడం అలవర్చుకోవాలి – అవి తప్పని సరి అని తెలిసికూడా , చాలాసార్లు మనం వాటిని అంగీకరించము , పలితంగా అనవసరమైన మానసిక ఆందోళనలు కలుగుతాయి .కాని మనస్సును స్వాధీనము చేసుకోధలచుకున్న వారు ఈ అనవసరపు ఆందోళనలతో మనస్సును నింపి వేయడము మానుకోవాలి . ఎందుకంటే అవసరమైన , తప్పనిసరి ఆందోళనలు ఎల్లా వేళల ఉందనే వున్నాయి . “ అంగుత్తర నికాయ “ లో బుద్దుడు భోధించిన ఈ భోధనలను అనుష్టించడం మనకు చాలా మేలు చేస్తుంది : “ >> భిక్షువులారా ! పురుషులు , స్త్రీలు , గృహస్తులు , సన్న్యాసులు – అందరు ఈ అయిదు విషయాలపై తప్పని సరిగా ధ్యానము చేయాలి:
1. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం కలుగుతుంది – దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది – దాన్ని నేను తప్పించుకోలేను.
౩. ఎదో ఒకరోజున మృత్యువు నన్ను కబళిస్తుంది – దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులన్నీ ఏదో ఒకరోజున మార్పుకు, నాశనానికి, ఎడబాటుకు లోనయ్యేవే – దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల ( స్వకర్మల ) వల్లనే నేను ఇలా తయారయ్యాను. నాపనులు ఎటువంటివైన మంచివైనా , చెడువైన – వాటికి నేను వారసుణ్ణి కావలసిందే.
భిక్షువులారా !వ్రుద్దాప్యాన్ని ధ్యానించడం ద్వారా యవ్వనం వలెనే కలిగే అహంకారాన్ని -, అనారోగ్యాన్ని ధ్యానించడం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్ని,- మృత్యువును ధ్యానించడం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, – ప్రతి వస్తువులో కలిగే మార్పుని, నాశనాన్ని ధ్యానించడం ద్వారా,- అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు.- మనం చేసే పనుల ఫలితాన్నే మనము అనుభావిస్తామన్న సత్యాన్ని ధ్యానించడం ద్వారా ఆలోచనలలో , మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గ స్వభావం అణగారుతుంది ,- కనీసం తగ్గుతుంది. ఎవడైతే ఈ ఐదు విషయాలను ధ్యానిస్తాడో , అతడు తన అహంకారాన్ని , కోరికలను అణచివేయగాలుగుతాడు – లేదా కనీసము తగ్గించుకోగలుగుతాడు – తద్వారా నిర్వాణ మార్గములో ముందుకు సాగుతాడు.
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే – ఏమైనా పొరపాట్లు వుంటే తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
1/19/2017
🌹 శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
********************************
నీ దు:ఖానికి కారణము ఎవరు?
********************************
1) ఈ లోకములో ప్రతి మానవుడు – అతడు తెలివిగలవాడైన – తెలివి తక్కువవాడైన , ఉన్న వాడైన – లేనివాడిన , చదువుకున్న వాడైన – అక్షర జ్ఞానము లేనివాడైన , చిన్న వాడైన –పెద్దవాడైన , స్త్ర్రే యైన – పురుషుడైన ఎవరైనా సరే హాయిగా , ఆనందంగా ఉండాలని , సుఖంగా జీవించాలని : ఏ కష్టాలు , బాధలు ,భయాలు ,దు:ఖాలు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ బ్రతుకాలని కోరుకుంటాడు – అలా కోరుకోవడమే కాదు అలా ఆనందంగా జీవించటానికి బుద్ధితో జాగ్రత్తగా ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు – అనేకమైన కర్మలు చేస్తుంటాడు , వ్యాపారము చేస్తాడు , ఉద్యోగము చేస్తాడు , ఎదో వృత్తిని చేపడుతాడు, లేదా రాజకీయాలలో దిగి ఉన్నత పదవులు సంపాదిస్తాడు – అందు కొరకు నిజాయితిగా కష్టపడి పనిచేస్తాడు , లేదా అక్రమ మార్గాలలో సంపాదిస్తాడు –అనేక వస్తువులను సంపాదిస్తాడు ,ధనాన్ని సంపాదిస్తాడు ,ఇళ్ళు కడతాడు ,తోటలు పెంచుతాడు , స్విస్ బ్యాంకులలో ధనాన్ని నింపుతాడు – ఎలాగో ఒకలాగా ఆనందాన్ని పొందాలని ప్రయత్ని స్తుంటాడు – అనేక సందర్బాలలో ఆనందము వచ్చినట్టే వస్తుంది – ఆ తర్వాత వస్తువు పోవటమువల్లనో , పదవులు పోవటము వల్లనో , శత్రువుల వల్లనో , లేదా తనలోని కోరికల స్వబావము మారటము వల్లనో ఈ వచ్చిన ఆనందము వచ్చినట్టే వచ్చి ఆవిరై పోతుంది – మళ్ళీ మనసులో అసంత్రుప్తి – దానిని పోగొట్టు కోవటానికి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభము – మళ్ళీ వాటివల్ల ఆనందము వస్తుంది – కాని అదీ తాత్కాలికమే – మళ్ళీ అసంతృప్తి కొందరికి ఎన్ని సంపదలున్నా ఎంత ధనమున్నా చాలదు – ఇంకా ఇంకా కావాలి – అసంతృప్తి – ఇక కొందరికి తమకు లేదని గాక , ఎదుటివాడికి ఉన్నదే అని భాద , అసూయ- కొందరికి ఉన్నవి చేజారిపోతాఎమోననే భయము – ఏక్షణము ఎమౌతుందోననే భయము – ఈ శోకం , భయము ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి
– “ శోకస్తాన సహస్రాణి – భయస్తాన శతానిచ “ వేలకొద్ది శోకాలు , వందలకొద్దీ భయాలు , ఈ శోకాలు భయాలు మధ్య ఇంకా ఆనందము ఎక్కడ ? ఒకవేలవున్నా ఎంత కాలము ఉంటుంది ? ఒక వేళ అన్నీ బాగున్నా క్రమక్రమంగా ఈ దేహములో మార్పులు చోటు చేసుకుంటున్నాయి – ఇంద్రియాలు క్రమంగా పనిచేయటము లెదు – వృద్ధాప్యము మీద పడుతున్నాది – రోగాలు రాగాలు తీస్తూ వచ్చి కూర్చుంటున్నాయి – చివరికి ఏదో ఒక రోజు ఈ దేహము రాలిపోవాల్సిందే – మళ్ళీ మరోజన్మ – ఆ జన్మలో మళ్ళీ ఆనంధము కోసము పరుగులు – ఇంతకు ముందు ఎన్నో జన్మలలో పరుగులు తీశాము – ఈ జన్మలోను తీస్తున్నాము – అయినా సరే మనము కోరుకున్న శాశ్వత ఆనందము లభ్యము కావటము లేదు – మనకు కావలసింది దు:ఖము లేని ఆనందము – శాశ్వతంగా ఉండే ఆనందము – మార్పులు లేని ఆనందము – కానీ మనకు వస్తున్నది తాత్కాలిక ఆనందము –దు:ఖముతో – భయముతో కూడిఉన్న ఆనందము – ఏ మాత్ర్హము పరస్థితులు మారినా జారిపోయే ఆనందము – ఇదికాదు మనము కోరుకుంటున్నది – మరి మనము కోరుకునే ఆనందము మనకు ఎందుకు రావటములేదు ? పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఎన్ని కర్మలుచేసినా ,ఎన్ని సంపదలు కూడబెట్టినా , ఎందరు వ్యక్తులను తనవారిగా చేసుకున్నా – ఎందుకు ఈ శాశ్వతానంధము ధక్కదములేదు ? ఈ ప్రపంచములో ఎంతదూరము పరుగెత్తినా పరుగులే తప్పా శాశ్వత ఆనందము లభించుటము లేదేమిటి ? పైగా అనంధము కోసమని కర్మలు చేస్తున్న కొద్దీ కర్మ ఫలాలు వాసనలు కూడుకొని అవి మనము మరింత బ౦దిస్తున్నాయి – జననమరణ చక్రములో పడేస్తున్నాయి – జన్మ – కర్మ వలయములో –సుడిగుండములో త్రిప్పుతున్నాయి. ఎందువల్ల ? ఈ లోకములోని వస్తువులు గాని , విషయాలు గాని , భోగాలు గాని అనిత్యమైనవి – అనిత్యమైన విషయాలు అనిత్యమైన ఆనందాన్నిస్తాయి గాని శాశ్వతానందాన్నివ్వలేవు – మరి ఏమిటి దీనికి పరిష్కారము ? శాశ్వతమైన ఆనందము నీకు కావాలంటే అశాశ్వతమైన , అనిత్యమైన వస్తువుల వెంట , విషయాల వెంట పడరాదు – శాశ్వతమైన వస్తువేదో తెలుసుకొని అట్టి వస్తువును పొందటానికి ప్రయత్నము చేయాలి –శాశ్వత వస్తువు పరమాత్మ , కనుక ఆ పరమాత్మను తెలుసుకొని ఆయనను ఆశ్రయించాలి – ఆయనకు దగ్గర కావాలి – ఆయనతో ఐక్యము కావాలి , అప్పుడే ఆనందము శాశ్వతానందము – లబించి దానితో దు:ఖాలన్ని మటు మాయము- అయితే పరిమిత మైన వస్తువులు పరిమితమైన ఆనందాన్నిస్తాయే గాని శాశ్వతానందాన్ని ఇవ్వలేవని ముందుగా గ్రహించాలి – తర్వాత తాను అనుభవిస్తున్న దు:ఖాలనుండి విడుదల పొందాలంటే తాను సమస్త కర్మ బంధనాల నుండి విడుదల పొంది శాశ్వత పరమాత్మను తెలుసుకొని ఆయనతో ఐక్యమై పోవడం , మోక్షాన్ని పొంధటము ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని గుర్తించాలి అట్టి మోక్ష సాధనకు తీవ్రమైన ప్రయత్నము చేయాలి
>> మోక్షమంటే మరేమీ కాదు నీ సహజ స్థితియే మోక్షము –నీవు పరమాత్మ స్వరూపుడివే – నీవు మోక్ష స్వరూపుడివే –నీవు శాశ్వత ఆనంద స్వరూపుడివే – అయితే ఆ సంగతి నీవు మరిచావు – నీవెవరో నీవు మరచావు నిన్ను నీవు తెలుసుకోకపోవటమే నీ బాధలకు కారణము – కనుక ఇప్పటికైనా నీ కళ్ళు తెరచుకొని నీవెవరో తెలుసుకో – నీ సమస్యలన్నీ తీరిపోతాయి ->> అయితే ఎలా తెలుసు కోవాలి ? ఎవరుచేబుతారు ? బ్రహ్మ విద్యకు సంబంధి౦చిన అనుభవ పూర్వకమైన అచ్యుతాశ్రమ గురువువులు మీ కోసము ఎదురు చూస్తున్నారు వెళ్ళండి – విద్య తీసుకొని ఆచరించి ఆనందాన్ని పొందండి – మీలోని అసంత్ర్హుప్తిని తోలిగించుకొని శాశ్వత ఆనందమును పొందండి – ఆత్మజ్ఞానము లేకుండా ఎన్ని కర్మలు చేసినా మోక్షము లేదు – ఆత్మజ్ఞానాన్ని సందేశాల ద్వారా – ఆదేశాలద్వారా తెలుసుకునే వీలులేదు – కేవలము ఉపదేశము ద్వారానే తెలుసు కోవాలి సాదానాకా౦క్షులైన మీరు ఆ బ్రహ్మ విద్యను పొందండి.
పై విషయాలన్నీ మీ అందరికి తెలిసినవే ఏమైనా పొరపాట్లు వుంటే మన్నించి తెలుపుతారని మనవి.
R.B.Satyanarayana
Chairman, Annadhara
1/31/2017
🌹 శ్రీ అచ్యుతార్పణమస్తు 🌹
*********************************
మనస్సు 8 వ బాగము
“ నీ మస్సును నీ వైపుకు మరల్చుకో ”
************************************
1) “ మనయేవ మనుష్యా ణామ్ – కారణము బంధ మోక్షయో “ అను సూక్తి ప్రకారముగా బంధానికి , మోక్షానికి కారణము మనసే అని తెలుస్తున్న దానిని బట్టి మనసుకు ఎంత ప్రాధాన్యత వుందో దానిని ఎలా మలచుకోవాలో బాగా ఆలోచించాలి – ఇక్కడే మానవుడు అనాలోచితముగా ప్రవర్తించ బట్టే అనేక జన్మలకు కారణ భూతుడవుతున్నాడు, అనేక రకాల దు:ఖాలు అనుభవిస్తున్నాడు >> మనస్సును స్వాధీనము చేసుకోవాడానికి రెండు రకాల అంతరంగిక అబ్యాసాలను మనము ఏర్పరచుకోవాలి – ఒక రకము శాశ్వత ప్రాతిపదికన ,ప్రాధమికంగా ఉపయోగించడానికి – ఇక రెండవ రకము అకస్మాత్తుగా ఆపడానికి వీలైన శక్తిమంతమైన బ్రేకులలాగా ( నిరోధకాలుగా) ఉపయోగించడానికి – >>మొదటి రకము మనస్సుకు సాధారణ పరస్తితులలో ఒక ఆరోగ్యకరమైన మార్గదర్శకాలుగా పనిచేస్తాయి – > రెండవ రకము అత్యవసర పరస్థితులలో మనల్ని కాపాడుతాయి – >> మొదటి రకము అబ్యాసాలను సాధన చెయ్యకపోతే ,రెండవరకాన్ని ఎంత మాత్రము వినియోగించుకోలేము – దీనికి కారణము సుస్పష్టము – అదేమిటంటే రెండవ రకము అబ్యాసాలను వినియోగించుకోవడానికి కావాల్సిన శక్తి మొదటి రకాన్ని జాగ్రత్తగా అభ్యసి౦చడము ద్వారా మాత్రమే సమకూరుతుంది .>> మొదటి రకము అబ్యాసాలు:
a) నిర్మాణాత్మక మైన ఆలోచనా పద్ధతిలో జీవితాన్ని అమర్చు కోవాలి – ఒక దైనందిన కార్యక్రమము అవసరము – మనము చేసే ప్రతి పని అర్ధవంతంగా ఉండేలా కొన్ని ప్రాధమిక ఆధర్శాలను ఏర్పరచుకోవాలి – మన నడవడిక కొన్ని నైతిక విలువలకు కట్టుబడి ఉండి , ఆ విలువలు చూపే మార్గములో ముందుకు సాగాలి – నైతిక విలువలు , ఆదర్శాలు లేనివారికి , జీవితములో ఒక క్రమపద్ధతి లేనివారికి , మనస్సును స్వాధీనము చేసుకోవడము అసాధ్యంగా తోస్తుంది –మనస్సును స్వాధీనము చేసుకోవాలంటే జీవితంలో ఒక లయబద్ధమైన నడవడికను అలవరచుకోవాలి.
b) మనస్సు యొక్క చపలత్వాన్ని గురించి అందరూ నానుడిగా చెప్పుకుంటారు – దాన్ని అదుపు చేయాలి మనస్సు యొక్క చంచలత్వాన్ని ఒక పిచ్చిపట్టిన కోతితో పోల్చారు – ఒక కోతి ఉంది స్వబావరీత్యా అన్నీ కోతులలాగానే చాలా చపలత్వము కలిగి ఉంది –అది చాలనట్టు , ఎవరో దానికి బాగా సారాయి త్రాగించారు – దానితో అది మరింత గోల చెయ్యసాగింది – అప్పుడు దాన్ని ఒక తెలు కుట్టింది ,తెలు కుట్టితే మనిషి రోజంతా నొప్పితో గంతులు వేస్తాడు గదా ! ఇంక ఆ కోతి పరస్థితి ఎప్పటికన్నా ఘోరంగా ఉంది – ఇక దాని బాధలకు పరిపూర్ణత కలిగించాదానికా అన్నట్టు దానికి ఒక దెయ్యము పట్టింది – ఇక ఆ కోతి గోలనీ , ఆపలేని దాని అశాంతిని ఏ బాషలో వర్ణించ గలము ? మనిషి మనస్సును అటువంటి కోతితో పోల్చవచ్చును – స్వబావ సిద్ధంగా అది చాలా చపల స్వబావము కలిగి ఉంటుంది – ఆ పైన కోరిక (కామము) అనే మధువును బాగా త్రాగింది –కోరిక ఆవహించిన తరువాత దాన్ని ప్రక్కవారు బాగుపడితే చూడలేని అసూయ అనే తెలు కుట్టింది – చివరిగా అహంకారము అనే దయ్యము పట్టింది – దానితో అందరికన్నా నేనే ముఖ్యుణ్ణి అనే ఆలోచనలతో మనస్సు నిండిపోయింది – అటువంటి మనస్సును స్వాధీనం చేసుకోవడము ఎంత కష్టము ?దాని నిలకడలేని తనాన్ని అదుపు చెయ్యాలంటే దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలి –ఆ కారణాలు ఏమిటి ? మనస్సులోని మాలిన్యాలే దానికి కారణము –మనస్సును స్వాధీనము చేసుకోవడము దాని పవిత్రతపై ఆధారపడుతుంది – ప్రస్తుతం మనము మనస్సును నియత్రించలేక పోవడానికి కారణము దాని అపవిత్రతే ! ఒక ప్రక్క మనస్సును మరింత అపవిత్రము చేసే జీవనాన్ని కొనసాగిస్తూ , మరోప్రక్క దానినే స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానివల్ల ఎటువంటి సత్పలితము కలుగదు – అయితే మనస్సులోవుండే ఈ అపవిత్రతలు , మలినాలు ఏమిటి ? అవే – అసూయ – ద్వేషం – కోపము – భయము – ఈర్ష్య – కామోద్రేకము – దురాశ – మోసము – మోహము మొదలైన తపనలు – క్షణికావేశాలు – ఉద్రేకాలు – ఇవన్ని రజస్సు , తమస్సుల నుంచి పుడుతాయి – ఈ అపవిత్రతలు మనస్సులో రాగద్వేషాలను పుట్టించి దాని ప్రశాంతతను భంగపరుస్థాయి –మరి ఈ అపవిత్రతలను తోలింగించేదేలా ?
2) మనస్సు యొక్క స్వరూపాన్ని మార్చుకోవడము :>>మనస్సుకు పుష్టికరమైన ఆహారాన్ని అందించడము ద్వారా దానిలోని మలినాలను క్రమంగా తొలిగించవచ్చు – తద్వారా మనస్సు స్వరూపాన్ని మార్చి మిగిలిన రెండు గుణాలకన్న సత్వగుణాన్ని పెంపో ౦దేటట్లు చేయవచ్చు – చిట్టచివరకు సత్వగుణాన్ని కూడా అధిగమించ వలసిందే – అయితే దానికంటే ముందు అది తమస్సు , రజస్సుల కన్నా బలమైనధవ్వాలి ->> ఉపనిషత్తుల బోధనల ప్రకారము మనస్సు ఆహారమువలన ఏర్పడుతుందిని ఇంతకు ముందు చెప్పుకున్నాము – ఈ భోధనను ఆ ఉపనిషత్తు ఇంకా ఇలా వివరిస్తుంది ( ఛాందోగ్య ఉపనిషత్తు 6.5.4) : >> మనము స్వీకరించే ఆహారము మూడు విధాలుగా రూపాంతరము చెందుతుంది – దానిలో ఎక్కువ బాగము ( స్థూల బాగము) మలంగ విసర్జించబడుతుంది – కొద్ది పరిణామము (మధ్యబాగము) మన శరీరములోని మాసంగా రూపాంతరము చెందుతుంది – అతికొద్ది పరిణామము ( సూక్ష్మబాగము) మనస్సుగా ఏర్పడుతుంది ->> పెరుగును చిలికినప్పుడు దానిలో కొద్ది పరిణాములో(సూక్ష్మ బాగంగా) ఉన్న వెన్న ఏ విధంగా పైకి తేలుతుందో ,తిన్న ఆహారములో సూక్ష్మబాగము పైకి మనస్సుగా రూపాంతరము చెందుతుంది- మనస్సు ఆహారము యొక్క రూపాంతరము కాబట్టి సహజంగానే ఎప్పుడైతే ఆహారము పరిశుద్ధమౌతుందో అప్పుడు మనస్సు పవిత్రమౌతుంది – మనస్సు పవిత్రమైతే మేధాశక్తి ( జ్ఞాపకశక్తి) సుస్థిర మౌతుంది –ఎప్పుడైతే ఒకడు సుస్థిరమైన జ్ఞాపకశక్తిని పొందుతాడో అప్పుడు అతణ్ణి ప్రపంచానికి కట్టి పడవేసే బంధాలన్నీ తొలిగిపోతాయి – >> భగవద్గీత ప్రకారము రాజసిక , తామసిక ఆహారాలు రాగద్వేష బ్రాంతులను కలిగిస్తాయి – సాత్విక ఆహారము మనిషిలో రాగద్వేష బ్రాంతులను తగ్గిస్తుంది – మానసిక పరస్థితిని ప్రబావితము చేసేది నోటి ద్వారా తీసుకునే ఆహారము ఒక్కటే కాదు – అయితే సారాయి , మత్తుమందులు మొదలైన వాటిని నోటి ద్వారా తీసుకుంటాము – అవి మనస్సును చాలా ప్రభావితము చేస్తాయి – ఒక గ్లాసు పంచదార నీటిని త్రాగితే ఎలా ఉంటుంధో , ఒక గ్లాసు సారాయిని త్రాగితే ఎలా ఉంటుందో మనము సులభంగా గ్రహించవచ్చు కదా – >మనస్సుపై మత్తుమందులః ప్రబావము జగమెరిగిన సత్యము – ఇవేకాక , మనము కళ్ళతో చూసేవి , చెవులతో , చేతితో తాకేవి మన మనస్సులపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి – ఒక సినిమానో లేదా ఒక ఉపన్యాసమో మనస్సులో రకరకాల ఆలోచనలను , అలలను రేపుతాయి –వాటి ప్రభావము వల్ల మనస్సును ఆపై నియత్రించడము కష్తము కావచ్చు , లేదా సులభము కావచ్చు – >> మనస్సును స్వాధీనం చేసుకోగోరేవారు ,రాజసిక ,తామసిక ఆహారాలకన్న సాత్విక ఆహారము వైపు మొగ్గు చూపడము శ్రేయస్కరము – నోటి ద్వారా గ్రహించే ఆహారానికి సంబధించినంత వరకు భగవద్గీత ,మరియు కాయ కల్పము సరియైన మార్గదర్శి .
3)
a) జవసత్వాలను , శక్తిని , బలాన్ని , ఆరోగ్యాన్ని , సంతోషాన్ని , జీర్ణశక్తిని పెంపొందించే రుచికరమైన రసభరితమైన , తగినంత నూనె కలిసిన ఆహారాన్ని సాత్వికులు ఇష్టపడుతారు
b) చేదుగా , పుల్లగా, ఉప్పుగా, అమితమైన వేడిగా , కారంగా , ఘాటుగా ఉన్న ఆహారాన్ని , ఎండిపోయిన , బాగా కాలిన ఆహారాన్ని రాజసికులు ఇష్టపడుతారు , ఇటువంటి ఆహారము శరీరములో నొప్పిని ,బాధను , రోగాన్ని కలిగిస్తుంది.
c) చప్పటి , రుచిలేని , కంపుగొడుతున్న ముందురోజు వండిన ,తిని వదిలివేసిన ,అపవిత్రమైన ఆహారాన్ని తామసికులు ఇష్టపడుతారు –>> సాత్విక , రాజసిక , తామసిక లక్షణాలు కలిగిన మనుష్యులు ఇష్టపడే ఈ వేర్వేరు రకాల ఆహారాలు వరుసగా అటువంటి మనస్తత్వాలనే పెంపొదించడానికి కూడా సహాయపడగలవు ->> సత్వగుణము , రజోగుణము , తమోగుణము అనే మూడు గుణాలు వేర్వేరు మోతాదులలో కలవడము వల్ల మానవ స్వభావము రూపొందుతుంది – ఏ గుణము ఎక్కువగా ఉంటే , ఆ మనిషి యొక్క స్వబావములో అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి – రజస్సుగాని , తమస్సుగాని స్వభావసిద్ధంగా ఎక్కువగా ఉన్న వ్యక్తి , ఎంత ప్రయత్నించినా , సత్వగుణము ఎక్కువగా వున్న వ్యక్తిలా ప్రవర్తించలేడు – >>మనస్సులో రజస్సు , తమస్సు ఎక్కువగా ఉన్నంత కాలము మనము ఎంత ప్రయత్నించిన దాన్ని స్వాధీనము చేసుకోలేము .>> రజస్సుకు మనస్సును చెదరగొట్టే శక్తి (విక్షేపశక్తి) ఉంది – చురుకుదనాన్ని కలిగించి , పనిచేయించే స్వబావము దానికివుంది – అనాదిగా , దీనినుండే నిరంతరము పనిచెయ్యాలనే చురుకుదనము పుట్టింది – దీనినుండే మనస్సు యొక్క రూపాంతరాలయిన భాద , బంధము కూడా నిరంతరము తయారువుతూ ఉంటాయి – కామం , క్రోధము , లోభం ,పొగరు , పగ , అహంకారము ,ఈర్ష , అసూయ మొదలైనవన్నీ రజస్సుకు ఉండే ధుర్గుణాలు –మనిషి యొక్క ప్రాపంచిక లక్షణాలు వీటినుంచి పుడుతాయి – అందువల్ల రజస్సు బంధహేతువు – >> తమస్సుకు మనస్సుకు చీకటి క్రమ్మించే శక్తి ఉంది – దీనివల్ల విషయాలు అవి ఉన్నవి ఉన్నట్లు కాకుండా వేరుగా కనిపిస్తాయి – ఈ శక్తి వల్లనే మనిషి మళ్ళి మళ్ళి జన్మ లేత్తుతాడు – విక్షేపశక్తి రజస్సును కూడా ఇదే ప్రేరేపిస్తుంది – >> సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి , విచక్షణ ,లేకపోవడము : తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం : అపనమ్మకము : అనుమానం :ఇవన్ని తమస్సు యొక్కఅవలక్షణాలు , చీకటి క్రమ్మించే శక్తి అయిన తమస్సుతో ఏ కొంచము సంబంధము ఉన్నా పైన చెప్పబడిన అవలక్షణాలు ఆ మనిషిని వదిలిపోవు – వీటికి తోడు విక్షేపశక్తి (రజస్సు) అంతులేని కష్టాలను కలిగిస్తుంది – >> రజస్సుకు చెదరగొట్టే శక్తి – తమస్సుకు చీకటిక్రమ్మే శక్తి ఎక్కువగా ఉన్నందుకు పర్యవసానంగా అవి మనస్సును నియంత్రి౦చడాన్నిచాలా కష్టసాధ్యమైన పనిగా మారుస్తాయి.
4) మరొక గుణము కూడా ఉంది అదే పరిశుద్ధమైన సత్వగుణము – శుభ్రమైన నీటిలా ఉంటుంది –కాని రజస్సు తమస్సులతో కలిసినప్పుడు అది పునర్జన్మకు దారి తీస్తుంది –ఏ విధంగా సూర్యుడు సమస్త వస్తు ప్రపంచాన్ని వెలుగులతో ని౦పుతాడో అదే విధంగా ఆత్మయొక్క నిజతత్వ౦ సత్వగుణములో ప్రతిబింబిస్తుంది – సత్వ లక్షణాలు ఈ విధంగా వుంటాయి – గర్వము భోత్తిగా లేకపోవడము –నియమాల్ని పాటించడము – శ్రద్ధ , భక్తి , భగవంతుడి కోసము వ్యాకులత ( ముముక్షత్వము) దైవీ బావాలు , మాయా ప్రపంచముపై విముఖుత , ఉత్సాహము ,తన నిజతత్వాన్ని గుర్తేరుగడం , పరమ శాంతము ,సంతృప్తి , బ్రహ్మానందము , ఆత్మయందు నిలకడగా ఉండే భక్తి అనేవి శుద్ధసత్వగుణము యొక్క లక్షణాలు – వీటి ద్వారా సాధకుడు నిరంతరాయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు – >>దీనిని బట్టి చూస్తే మనస్సు స్వాధీనానికి శక్తిమంతమైన ప్రతి బంధకాలు , బలమైన సహాయకాలు – ఈ రెండు కూడా మనలోనే స్వాభావికంగా ఉన్నాయని తెలుస్తుంది – ఈ విషయాన్ని అర్ధము చేసుకోవడము చాలా అవసరము – ఎందుకంటే ఆ దుష్టశక్తులను ఓడించడానికి సహాయకరమైన శక్తులకు పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేందుకు తగిన వుహ్యాన్ని రచించడమే అసలైన సమస్య – దీన్ని మూర్ఖ౦గా పోట్లాడడము ద్వారా సాధించలేము –ఎంతో నైపుణ్యముతో మన అంతరంగ శక్తులను పని చేయించడము ద్వారా మాత్రమే మనం ఈ సమస్యను పరిష్కరించగలము.
5) సత్వగుణము బలపడినప్పుడు పెంపొందే ఉన్నతమైన ఆధ్యాత్మికత రజస్సు , తమస్సులను నాశనము చేస్తుంది – వాటితోపాటు , వాటి ద్వారా ఉత్పన్నమయ్యే దోషాలను , లేదా దుస్క్రుత్యాలను త్వరలోనే అంతమొందిస్తుంది –పరిణితి చెందిన సత్వగుణమద్వారా సాధకుడు ఆద్యాత్మికతను పొందుతాడు – మనస్సును స్వాధీనము చేసుకోవడమన్నా , ఆద్యాత్మికతను సాది౦చడమన్నాఒకటేనని దాని సారాంశము – >> ఈ సంసారం ఒక మహారణ్యం- దీనిలో సత్వగుణము, రజోగుణము , తమోగుణము అనే ముగ్గురు దొంగలు పొంచివున్నారు –వాళ్ళే మానవుడి వివేకాన్ని , జ్ఞానాన్ని దొంగిలిస్తారు – వారిలో తమోగుణం వినాశనాన్ని కలిగిస్తుంది – రజోగుణం సంసారములో బంధించి వేస్తుంది –కాని సత్వగుణము మాత్రము రజస్సు , తమస్సు ఏర్పరిచే బందాలను౦డి రక్షిస్తుంది – సత్వగుణము యొక్క అండదండలవల్ల మానవుడు , కామక్రోదాలనుంచి తమోగుణం పుట్టే దుష పలితాలనుంచి తప్పించుకుంటాడు – >>పైగా సత్వగుణము ప్రాపంచిక బంధాలను వదిలిస్తుంది కాని సత్వగుణము కూడా దొంగే అది పరమాత్ముని పరందామానికి దారి చూపించినా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించలేదు – అది దారి చూపించిన దొంగ ,” చూడు !ఆ దూరంగా కనిపిస్తున్నదే ! అదే నీ ఇల్లు ! ” అని చెప్పి ఆగిపోయినట్లుగా సత్వగుణము కూడా బ్రహ్మజ్ఞానానికి ఆమడ దూరములో ఆగిపోతుంది – >.గీతలో చెప్పినట్టుగా “ ఎవరైతే నన్ను (భగవంతుణ్ణి) సడలని భక్తితో సేవిస్తారో , వారు ఈ మూడు గుణాలను అధిగమించి బ్రహ్మములో లేదా పరమాత్మలో ఐక్యము చెందడానికి అర్హువులు అవుతారు“ అని భోధించారు – అయితే నిష్కళంకమైన హృదయము ఉన్నవారు మాత్రమే భగవంతున్ని సడలని సదా భక్తితో సేవించగలరు–సత్వగుణము సహాయముతో నీ ఆత్మపై ఉన్న ముసుగును తోలిగించుకో!” మిత్రమా.
R.B.Satyanarayana
Chairman, Annadhara