Last updated: Nov 7th 2015
ఋష్యమూకాశ్రమం స్థాపన సందర్భంగా శ్రీ యోగి అచ్యుతులు చెప్పిన ఉపదేశ వాక్యాలు:
ఈ ఋష్యమూకాశ్రమం స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ మీరందరూ విశ్వాసంతో తత్వ బంధువులు కావాలి.
అన్నింటికన్నా ముందుగా మీకు జగత్తులో స్నేహమయ జీవితం గడపడం రావాలి.
మీలో మీరు సోధించి మీ ఆలోచనలను స్థిరం చేసుకోవాలి.
సత్యద్వేషులెవరయినా ఉంటే వాళ్ళకు సత్యం అవగతమయ్యేట్లా చెప్పేందుకు, వాళ్ళు అర్ధం చేసుకొనే దారిలో ఆలోచించేందుకు సాయం చేయాలి.
మీ అందరి శక్తి కార్యగతం కావాలి. అప్పుడే మీరు ఈ జీవితాన్ని పొందడం సార్ధకమవుతుంది.
అటువంటి జీవితాన్ని మీరు రూపొందించుకోవాలంటే మొదట మీరు తపస్సంపన్నులు కావాలి.
కార్య దక్షులు కావాలి.
ధైర్యవంతులు కావాలి.
సహిష్ణులు గా జీవించడం నేర్చుకోవాలి.
శాంతి నే ఎల్లప్పుడు పూజించాలి.
ద్వేషాన్ని, దర్పాన్ని ప్రక్కకు పెట్టి ప్రేమ ఆప్యాయతలనే అంతటా నింపాలి.
పరిమితంగా ఉండే మీ ప్రేమను విశాలంగా వ్యాపింప చేయాలి.
అన్ని రకాలయిన అవసరాలు, కోరికలు తీరి శ్రీమంతులు కావాలంటే మొదట మీరు తపస్వులు కావాలి.
అర్పణ బుద్ధితో తపస్సంపనుడిగా అయితే మీకు అభివృద్ధి తనంతట తనే వస్తుంది.
ఈ విద్య సాధనతో మానవ కళ్యాణం జరిగి సాధకులు శాంతిని పొందాలి.
ఉత్తమ జీవన ప్రమాణాలను పాటించి మంచి పౌరులుగా, నిండు ఆరోగ్య వంతులుగా జీవించాలి.
తనను తాను తెలుసుకొని జ్ఞానోత్తర కర్మలను ఆచరించాలి.
ఇచ్ఛామరణి గా మారాలి.
చాలా ఉపయోగ కరమైన జీవితం, పరిపుష్టితో నిండిన జీవితం, సర్వ సమృద్ధమైన జీవితం విశ్వం లో వ్యాప్తి కావాలి.
దానికి నాంది తపో జీవన స్ధాపనం.
అదే ఋష్యమూకాశ్రమం ( అచ్యుతాశ్రమం) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
శుభం స్వస్తి
ఉదయభాస్కర్